krishnashtami
-
కృష్ణాష్టమి వేడుకల్లో రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శ్రీ జుగల్ కిషోర్ మందిరంలో వైభవోపేతంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్న సమయంలో పన్నా రాజ కుటుంబీకురాలు జితేశ్వరీ దేవి ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించినందుకు పన్నా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. Maharani Jiteshwari Devi of Panna Royal house of Madhya Pradesh arrested Due to widowhood of Queen, she was prevented from performing the Aarti of Shri Krishna in Jugal Kishore Temple in Panna#G20India2023 #G20जनता_विरोधी #G20_Anti_Social#सनातनी_ऐक_शैतानी #BharatMandapam #G20 pic.twitter.com/tR5hHx4kYz — Vikram Kumar (@VikramKumar6262) September 9, 2023 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్నా జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రఖ్యాత శ్రీ జుగల్ కిశోర్ మందిరంలో కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణ పరమాత్ముడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీ. అయితే ఈ ఉత్సవాల్లో రాజ కుటుంబీకులు ప్రతిమను చీపురుతో శుభ్రపరిచే 'చాన్వార్' సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తారని, అది కూడా పురుషులు మాత్రమే ఆచరిస్తారని తెలిపారు. कल रात जब उनकी विधवा पत्नी जेतेश्वरी देवी अपने बेटे को लेकर जुगल किशोर मंदिर पूजा करने के लिए आई और गर्भ गृह में घुसने लगी तो विधवा बता कर उन्हें और बेटे को रोक दिया गया। कुछ देर बाद जीतेश्वरी गर्भगृह के अंदर घुस गई और आरती करने लगी तो विधवा द्वारा आरती करना अशुभ बता कर कथित थाली… pic.twitter.com/svOZjgcW5y — काश/if Kakvi (@KashifKakvi) September 8, 2023 కానీ జితేశ్వరీ దేవి నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి హారతినిచ్చారన్నారు. దీంతో అర్చకులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకోగా వారిపై కూడా దుర్భాషలాడారని తెలిపారు. పోలీసులు వచ్చి వారించినా ఆమె తగ్గలేదు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లామని ఆమెపై కేసు నమోదు చేశామని కూడా తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. पन्ना राजपरिवार की महारानी #jiteshwaridevi को श्री जुगलकिशोर जू मंदिर से बाहर फेंका गया pic.twitter.com/J7wKpELBYF — Piyush Kumar Shukla (@Piyushkumarshu8) September 8, 2023 అరెస్టు సమయంలో జితేశ్వరీ దేవి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రక్షణ శాఖ సంక్షేమ నిధిలో సుమారు రూ.65,000 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేశారన్నారు. వైధవ్యం కారణంగానే గర్భగుడిలోకి ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని సంఘటన సమయంలో ఆమె బాగా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. बवाल के बाद महारानी जीतेश्वरी देवी अदालत जाते वक्त बोली- पुजारियों ने गलत किया! हमारे साथ बुरा बर्ताव किया, उन पर कोई FIR नहीं हुई#Queen #JiteshwariDevi #Court #Panna pic.twitter.com/BP40yRECQH — Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) September 8, 2023 ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి -
తిరుమలలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
మా నమ్మకం మరింత పెరిగింది
‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ యునిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మా సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చిత్రం విజయంపై నమ్మకం మరింత పెరిగింది. కృష్ణాష్టమి రోజు సినిమా రిలీజ్ అవుతోంది. కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, మా సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘జాతి రత్నాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నచ్చింది. నా ΄ాత్రలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. నాగార్జునగారికి మా ట్రైలర్ బాగా నచ్చింది. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి 15వ కంటెస్టెంట్‌గా వెళ్లాను’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లో చూసింది 30 శాతం అనుకుంటే.. సినిమాలో 70 శాతం భావోద్వేగాలు, వినోదం ఉంటాయి’’ అన్నారు పి. మహేశ్‌బాబు. -
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను. #KrishnaJanmashtami — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021 ఇవీ చదవండి: బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్ వస్తారు! పంచాయతీ పటిష్టం! -
కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్
Radhe Shyam Janmashtami Special: ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్, పూజాల లుక్ ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. As we celebrate Janmashtami, let Vikramaditya and Prerna teach you a new meaning of love! 💕 Here's wishing you all a very Happy Janmashtami! #RadheShyam Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/3FZTeyUF5F — Radhe Shyam (@RadheShyamFilm) August 30, 2021 చదవండి : 96 మూవీ కాంబో రిపీట్, విజయ్ సేతుపతికి మరో హిట్! బిగ్‌బాస్ 5: ఆ స్టార్ సింగర్ ఎంట్రీ ఫిక్స్! -
కృష్ణాష్టమి: నేడూ, రేపూ కూడా జరుపుకోవచ్చు
ఆయన రూపం నల్లనిది. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది. దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి నమ్మకంగా నిలిచాడు శ్రీ కృష్ణ భగవానుడు. అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. సచ్చిదానంద రూపం. ఆనంద స్వరూపం. కృష్ణుడి పేరు తలుచుకుంటేనే జవసత్వాలు ఉట్టి పడతాయి. ఆయన చరితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఆయన తత్త్వాన్ని తెలుసుకుందాం. ఆనందతత్వం... ప్రేమతత్వం... స్నేహతత్వం... ప్రకృతితత్వం... నాయకత్వం... ఇవే ఆయన లక్షణాలు. కృష్ణ తత్వం చదివిన వారికి నిజమైన ప్రేమ తత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా స్త్రీలతో పరుషంగా మాట్లాడినట్లు చూడం. ఆయన రాధాదేవి ప్రేమామృతంలో ఓలలాడాడు. గోపికల మదిలో వారి ఇష్టసఖునిగా కొలువుదీరాడు. రుక్మిణి దేవి భక్తి ఆరాధననూ ఆనందించాడు. సత్యభామ గడసరి తనం, శక్తివంతమైన మహిళగా ఆమెపట్ల కూడా అదే సున్నిత్వాన్ని కనబరిచాడు. లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే స్త్రీలు ఎప్పుడు అచలంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వాన్ని ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహా దేవుడు అయినా ఏ ప్రత్యేకత లేకుండా అందరితోటీ అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది. శిఖి పింఛ మౌళి నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు. వేణు సందేశం అలాగే మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, యుద్ధరంగాన కర్తవ్య విమూఢుడై వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...ఆయన మోము మీద చిరునవ్వు చెదరలేదు. అందుకే ఆయన పరమాత్ముడయ్యాడు. ఆ చిరునవ్వుల సమ్మోహన రూపాన్ని మనసులో నిలుపుకుంటే మనమూ ఆనందంగా ఉండగలం. స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే... వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు. అందువల్లే కృష్ణాష్టమి విషయంలో కొద్దిపాటి సందేహం తలెత్తుతుంటుంది. స్మార్తులను, వైష్ణవులను దృష్టిలో పెట్టుకుంటే నేడూ, రేపూ కూడా ఆ పర్వదినాన్ని జరుపుకోవచ్చు. – డి.వి.ఆర్. ఆత్మ ధర్మం మార్పు చెందని గుణానికే ‘ధర్మం’ అని పేరు. అలా ప్రతి ఒక్కదానికీ మార్పుచెందని ధర్మమంటూ ఒకటుంటుంది. అలాగే ఆత్మకుండాల్సిన ధర్మాన్ని శ్రీచైతన్య మహాప్రభు ఇలా వివరించారు: ప్రతి జీవుని ధర్మం సేవించడమే. ఒక తల్లి తన బిడ్డను సేవిస్తుంది. పిల్లాడు తల్లిదండ్రులను సేవిస్తాడు. తండ్రి కుటుంబాన్ని సేవిస్తాడు, లేదా ఒక కార్యాలయంలోని యజమానిని సేవిస్తాడు. ఒక మంత్రి తన శాఖను సేవిస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రధానమంత్రి ఒక దేశాన్ని సేవిస్తూ వుంటారు. అయితే, పై సేవలేవీ శాశ్వతమైనవి కావు. కాని, భగవంతుని సేవ మాత్రం శాశ్వతమైనది. ఎందుకంటే, భగవానుడు ఒక్కడే శాశ్వతుడు గనుక. ఆ భగవానుడిని సేవించడమే నిజమైన ధర్మం. శ్రీ కృష్ణుడిని సేవించడం ఎలా? భగవంతుడైన శ్రీ కృష్ణుడిని సేవించడమే ఆత్మను సంతృప్తిగావించు ధర్మం. అట్టి సేవ లౌకిక స్వలాభాపేక్ష రహితమై వుండాలి. సకల సర్వావస్థల్లోనూ శ్రీ కృష్ణుని సేవించగలగాలి. అటువంటి నిరంతరాయమైన, నిరపేక్షమైన సేవయే ఆత్మను, హృదయాన్ని పరిపూర్ణంగా సంతృప్తిపరచగలదు. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు ప్రబోధించినట్లు... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మహా మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా ప్రతిరోజూ 16 మాలలు జపించగలిగితే శారీరక, హృదయ దౌర్బల్యాలనుంచి విముక్తులమై భగవంతుని సేవలో ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని పొందగలం. శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభు అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్మెంట్, హైదరాబాద్ -
చిన్నారి కిట్టయ్యల సందడి
-
వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
అనంతపురం కల్చరల్: కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు గోకులంగా మారాయి. చిన్నారుల ఆటపాటలతో హోరెత్తాయి. మంగళవారం రాత్రి స్థానిక గీతామందిరంలో సంస్థ అధ్యక్షుడు బీఎస్ఎన్ఎల్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో వందలాది మంది చిన్నారులు కృష్ణవేషధారణలో సందడి చేశారు. ఉట్టి ఉత్సవం సంబరంగా జరిగింది. దశావతారాల ప్రదర్శన, భక్తి సంగీత కచేరి ఆహూతులను అలరించాయి. ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్‌బాబు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిన్నారులకు బహుమతులు అందించారు. -
గోకులకృష్ణా.. గోపాలకృష్ణా..
కృష్ణాష్టమి సందర్భంగా చిన్నికృష్ణులు సోమవారం నగరంలో సందడి చేశారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణతో అలరించారు. ఉట్టికొట్టే కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థినుల నృత్యం మైమరిపించింది. బుడి బుడి అడుగులతో బాల గోపాలురు అలరించారు. –సిటీబ్యూరో -
కృష్ణాష్టమి వేడుకల్లో పాటపాడిన సీఎం..
-
తెలుగువారికి వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సంతోషంగా ఈ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ట్విట్టర్లో తెలుగు ప్రజలకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 'మనం మన విధులను నిస్వార్థంగా, నిబద్ధతగా చేయాలని గీత భగవానుడు(కృష్ణుడు) సూచించారు. హ్యాపీ కృష్ణాష్టమి' అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. The Lord of Gita beckons us to perform our duties with selflessness and commitment. Happy Krishnashtami. — YS Jagan Mohan Reddy (@ysjagan) 25 August 2016 -
మా అమ్మ పేరు గీత కాదు నిర్మల
ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్న అల్లు శిరీష్ అభిమానులకు చేరువయ్యేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శిరీష్, ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన శిరీష్, ప్రపంచానికి భగవద్గీతను అందించిన కృష్ణ భగవానుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ పేరు వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు. మా నాన్న భగవద్గీత ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు, అందుకే మా బ్యానర్‌కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు. కానీ చాలా మంది మా అమ్మ పేరు గీత అనుకుంటారు.. కానీ ఆమె పేరు నిర్మల అని ట్వీట్ చేశాడు. Happy Krishnashtami everyone, happy birthday Lord Krishna. Thank you for sharing the world your wisdom thru the Bhagavad Gita. — Allu Sirish (@AlluSirish) 25 August 2016 My Dad was so inspired by the holy book that he named our co Geetha Arts. Many ppl think its my mum's name, her name is Nirmala. — Allu Sirish (@AlluSirish) 25 August 2016 -
మొరాదాబాద్‌లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
-
కేరళలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
-
తెలుగులో సూపర్ స్టార్ అతడే: రజనీకాంత్
భాషతో సంబంధం లేకుండా 'సూపర్ స్టార్' అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రజనీకాంత్. రజనీ స్టైల్, నటనతోపాటు వ్యక్తిత్వం అభిమానుల మనసుల్లో ఆయన్ను సూపర్ స్టార్‌గా నిలిపాయి. అయితే తలైవా కొన్నేళ్ల ముందే తెలుగులో రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ ఎవరనేది అంచనా వేసేశారట. ఈ ఆసక్తికర విషయాన్ని నటుడు సునీల్ ఈ మధ్యనే బయటపెట్టాడు. రజనీ 'కథానాయకుడు' సినిమా షూటింగ్ లో ఉండగా అక్కడే ఉన్న సునీల్.. పవన్ కల్యాణ్ 'జల్సా' సినిమా పోస్టర్ ను చూస్తూ కూర్చున్నాడట. అదే సమయంలో జల్సా పోస్టర్ ను గమనించిన రజనీ 'తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ పవన్ కల్యాణే' అన్నారట. పవన్ కల్యాణ్ తెలుగులో సూపర్ స్టార్ అవుతాడంటూ రజనీ చెప్పిన మాటలను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సునీల్ గుర్తుచేసుకున్నాడు. ఒక్క పోస్టర్ తోనే పవన్ క్రేజ్ ను పట్టేశారు సూపర్ స్టార్. నిజంగానే పవన్ ఇప్పుడో ప్రభంజనం. అదేమాట అంటున్నాడు 'కృష్ణాష్టమి' హీరో సునీల్. కృష్ణాష్టమి కథ విషయంలో డివైడ్ టాక్ వినిపించినా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్మురేపుతున్నాడు సునీల్. -
జనానికి రీచ్ అయింది! : నిర్మాత ‘దిల్’ రాజు
‘‘మా ‘కృష్ణాష్టమి’ మాస్ ఎంటర్టైనర్గా విజయం అందుకుంది. సునీల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మాస్ ఎలిమెంట్స్ జనానికి రీచ్ అయ్యాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సునీల్, నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడేలతో వాసువర్మ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వ హించారు. హీరో సునీల్ మాట్లాడుతూ- ‘‘ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తు న్నారు. ‘దిల్’ రాజుగారు లేకుంటే ఈ చిత్రం ఉండేది కాదు. ఈ విజయంతో మరిన్ని ప్రయోగాలు చేయవచ్చనే ధీమా వచ్చింది’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం కోసం పడ్డ కష్టం వృథా కాలేదు. వసూళ్లు స్టడీగా ఉన్నాయి’’ అని వాసువర్మ పేర్కొన్నారు. నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే, సంగీత దర్శకుడు దినేష్ కూడా మాట్లాడారు. -
డివైడ్ టాకొచ్చినా 'కృష్ణాష్టమి' జోరు!
చెన్నై: హీరో సునీల్ తాజా సినిమా 'కృష్ణాష్టమి' తొలి వీకెండ్లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలికాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న సునీల్ ఎన్నో ఆశలతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమాపై విమర్శకులు పెదవి విరిచారు. కొంతవరకు డివైడ్ టాక్ వినిపించింది. రివ్యూల్లోనూ పెద్దగా ప్లస్ మార్కులు పడలేదు. అయినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో 'కృష్ణాష్టమి' సత్తా చాటుతూ.. ఈ రూ. 6 కోట్ల వరకు వసూలు చేసింది. 'మాస్ ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటున్నది. దీంతో వసూళ్లు బాగున్నాయి. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో రూ. 6 కోట్లు రాబట్టింది. ఇదే ఊపు మరికొన్ని రోజులు కొనసాగితే.. తొలివారం కలెక్షన్ల విషయంలో ఈ సినిమా విజయవంతమైనట్టే' అని ట్రేడ్ అనాలిసిస్ట్ త్రినాథ్ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. దర్శకుడు వాసువర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గల్రానీ, దింపల్ చోపడ్ కథానాయికలుగా నటించారు. దిల్ రాజు నిర్మాత. -
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు!
- నిక్కీ గల్రానీ ‘‘చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు. నేను కూడా అదే కోవలోకి వస్తాను. ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నారు. నేను మాత్రం చదువు మధ్యలోనే మానేసి ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి, సినిమా రంగానికి వచ్చా’’ అన్నారు యువ హీరోయిన్ నిక్కీ గల్రానీ. ‘బుజ్జిగాడు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాల్లో నటించిన నాయిక సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’లో, ఆది పినిశెట్టికి జతగా ‘మలుపు’ చిత్రంలో హీరోయిన్గా నటించారామె. ఈ రెండు చిత్రాలూ ఈ శుక్రవారం విడుదల కానున్నాయి. తెలుగులో తన తొలిచిత్రమైన ‘కృష్ణాష్టమి’ విశేషాలు నిక్కీ గల్రానీ మాటల్లోనే... * చదువుతున్నప్పుడు మధ్యలో మానేసి మోడలింగ్‌లోకి వచ్చా. కేవలం 10 నెలల్లో 45 యాడ్స్ చేశా. ‘1983’ అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా రంగానికి వచ్చా. మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రెండున్నరేళ్లలో 15 సినిమాలు చేశా. * మలయాళంలో చేస్తున్నప్పుడు నిర్మాత ‘దిల్’ రాజుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. కానీ, మలయాళ చిత్రం పూర్తయ్యేవరకు కుదరదని చెప్పా. తరువాత ‘దిల్’రాజుగారు ఫోన్ చేసి, ‘నెల తరువాతే షూటింగ్’ అని చెప్పడంతో ఓకే అనేశా. అలా తెలుగులో ‘కృష్ణాష్టమి’ నా మొదటి చిత్రమైంది. * ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర చేశా. ‘పల్లవిజం’ అనే బుక్ రాస్తుంటా. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందనుకునే తత్త్వం. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటుంది. * కెరీర్‌పరంగా నాకు ఏదైనా అనుమానం వస్తే మా అక్క సంజనను అడిగి, సమాధానం తెలుసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగ అన్నమాట! * వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వ్యక్తి హీరో సునీల్. ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. విదేశాల్లో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో వణుకొచ్చే చలిలో కూడా ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి జాగింగ్‌కు వెళ్లొచ్చేవారు. నేను చాలా సహనంగా ఉంటాను. ఇక, మా డెరైక్టర్ వాసువర్మగారైతే చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. * ఏ సినిమా చేసినా నా పాత్రకూ, నా నటనకూ ప్రాధాన్యం ఉండాలి. నా సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలి. అటువంటి పాత్రలైతేనే ఎంచుకుంటా. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిలను చీరలో కూడా అందంగా చూపొచ్చు. ఈ చిత్రంలో స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఎక్కడా అసభ్యత ఉండదు. * తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో కూడా అవకాశాలొస్తున్నాయి. ఇంకా ఏ చిత్రం ఒప్పుకోలేదు. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ తర్వాత ఖరారు చేస్తా. -
కృష్ణాష్టమితో ‘మలుపు’ ఖాయం..
తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం ఆనందంగా ఉందని సినీనటి నిక్కీ గర్లాని అన్నారు. సునీల్‌తో కలిసి ఆమె నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో సందడి చేశారు. ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. తాను నటించిన మరో చిత్రం ‘మలుపు’ కూడా రిలీజ్‌కు సిద్ధమైందని, రెండూ హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగళూరుకు చెందిన అమ్మాయినే అయినా ఈ చిత్రాల కోసం తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. - బంజారాహిల్స్ -
హల్చల్ చేస్తున్న సెల్పీ బ్రహ్మి
హైదరాబాద్: 'కృష్ణాష్టమి' సినిమాలో 'సెల్పీ బర్ఫీ'గా నవ్వించడానికి సిద్ధమవుతున్న కామెడీ స్టార్ బ్రహ్మానందం ఇపుడు ఇంటర్నెట్ లోనూ హల్చల్ చేస్తున్నాడు. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌తో బ్రహ్మి కమెడీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. సిక్స్ ప్యాక్ తో అదరగొట్టి చాలా తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సునీల్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘కృష్ణాష్టమి’ మూవీతో వస్తున్నాడు. కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సునీల్ అందాలరాముడుతో హీరోగా మారాడు. ఆయన తాజా చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఒక ఎన్నారై కథతో, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో సీనియర్ కామెడీ నటుడు బ్రహ్మానందం సెల్పీ బర్ఫీగా మరో కొత్త అవతారంలో అలరించనున్నాడు. 'చేసే ప్రతీ ఎదవ పనీ' ఫేస్బుక్లో పెడితే ఇలాగే ఉంటుందన్న హీరో సునీల్ , బ్రహ్మానందం సంభాషణతో కూడిన ఈ తాజా ట్రైలర్ ఇపుడు హల్ చల్ చేస్తోంది. సెల్ఫీ బర్ఫీ పేరుతో తనకో ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసుకుని, ప్రతీవాళ్లతో సెల్ఫీ దిగి, దాన్ని ఫేస్ బుక్ లో పెట్టి కామెడీని పండించే పాత్రలో బ్రహ్మీ ప్రేక్షకులకు మరోసారి గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సునీల్ సరసన నిక్కీ గార్లాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి జోష్ ఫేం వాసు వర్మ డైరెక్టర్. బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు . ఫ్యామిలీ కథా చిత్రానికి యాక్షన్ అంశాలను కూడా మిక్స్ చేసిన ఈ సినిమా పై సునీల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ మర్యాద రామన్న హీరో ఎంతవరకు ఆకట్టుకుంటాడో తేలాలంటే ఫిబ్రవరి 19 వరకు వెయట్ చేయల్సిందే. -
ఈ కథ తయారు చేసినది అల్లు అర్జున్ కోసమే
కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సునీల్, ‘అందాల రాముడు’లో హీరోగా చేసి స్టార్ అయిపోయారు. చాలా తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సునీల్ గత రెండేళ్లుగా ఏ సినిమా చేయలేదు. ఈ నెల 19న వస్తున్న ‘కృష్ణాష్టమి’ సినిమాతో ఆ లోటు తీరిపోతుందంటున్నారాయన. సునీల్‌తో జరిపిన భేటీ... హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. మాటిచ్చినందుకు వెయిట్ చేశాను. కానీ, అవి జరగలేదు. ఈ రెండేళ్లల్లో ఎక్కువగా జిమ్ చేశాను. కథలు విన్నాను. నా పిల్లలతో అంతకు ముందెప్పుడూ ఎంజాయ్ చేయనంతగా చేశాను. ప్రస్తుతం వంశీ ఆకెళ్ల, వీరూ పోట్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాను. రెండేళ్ల గ్యాప్‌ని కవర్ చేస్తున్నా. ‘కృష్ణాష్టమి’ ఎలా ప్రారంభమైంది? ఓ రోజు ‘దిల్’ రాజుగారు పిలిచి, ‘కథ ఉంది. యాక్చువల్‌గా పెద్ద హీరోకి అనుకున్నాం. ఆ కథ నీకు సూట్ అవుతుందని విన్న వాళ్లందరూ అన్నారు. కథ నచ్చితే చెయ్’ అన్నారు. ఆయనే కథ చెప్పారు. వాసూ వర్మ డెరైక్షన్‌లో సినిమా ఉంటుందనగానే ఆనందపడ్డాను. ‘ఆర్య’ అప్పట్నుంచీ వాసు నాకు పరిచయం. ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘సత్తి.. మంచి పనోడు’ అనే ట్యాగ్ లైన్ తను ఇచ్చిందే. ఇప్పటివరకూ నేను చేసిన అన్ని చిత్రాల్లోకీ భారీ మూవీ ఇదే. ‘దిల్’ రాజు బేనర్లో కమెడియన్‌గా చేశారు.. ఇప్పుడు హీరో కాబట్టి, స్పెషల్‌గా ట్రీట్ చేశారా? నేను పంజాగుట్టలో రూమ్‌లో ఉన్నప్పుడు ‘దిల్’ రాజుగారు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. అప్పట్లో చాలా లావుగా ఉండేవారు. అలాంటి ఆయన చాలా పట్టుదలగా రన్నింగ్, ఎక్సర్సైజులు చేసి, ఇప్పుడున్నట్లుగా తయారయ్యారు. మామూలుగా బిహైండ్ది కెమెరా ఉన్నవాళ్లు అంత కష్టపడి తగ్గాల్సిన అవసరం లేదు. కెమెరా ముందు కనిపించే మనం ఎలా ఉండాలి? పైగా కమెడియన్‌గా అంటే ఏ పదిహేను, ఇరవై నిముషాలో కనిపిస్తాం.. హీరోగా దాదాపు రెండు గంటలకు పైగా కనిపించాలి. అందుకే ‘దిల్’ రాజుగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని సన్నబడ్డాను. ఆ సంగతి పక్కనపెడితే ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. నేను కమెడియన్‌గా చేసినప్పుడు కూడా నన్ను హీరోలానే ట్రీట్ చేసేవారు. అల్లు అర్జున్ కోసం అనుకున్న కథతోనే ‘కృష్ణాష్టమి’ తీశారట.. ఆ కథ మీకెలా సూట్ అవుతుంది? అల్లు అర్జున్ కోసం కథ తయారు చేసినది నిజమే. ఆ తర్వాత నాకు తగ్గట్టుగా మార్చారు. హీరో అంటే పెద్ద బాధ్యత కదా.. టెన్షన్ లేదా? ఆ బాధ్యత తట్టుకునే ఓపిక లేదు. నాకు బ్యాగ్రౌండ్ లేదు. అందుకని ‘ఏం జరుగుతుందో.. ఏంటో’ అని విపరీతంగా ఆలోచించేవాణ్ణి. ఆ ఒత్తిడి వల్లే డల్ అయిపోయాను. ఆ ప్రభావం నటన మీద పడుతోంది. దాంతో, ‘దేవుడా.. భారం నీదే. నువ్వే కాపాడాలి’ అని మొరపెట్టుకున్నా. ఆ తర్వాత ఆలోచించడం మానేశా. హీరోగా మొదలుపెట్టాక సిక్స్ ప్యాక్ చేయాల్సి రావడం కష్టం అనిపించలేదా? ఒక సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశా. అది బాగుందని మిగతా దర్శకులు కూడా ఎంకరేజ్ చేయడంతో అప్పుడప్పుడు సిక్స్ ప్యాక్‌కి మారి, మళ్లీ కొంచెం బరువు పెరగాల్సి వస్తోంది. నాకు తిండి అంటే ప్రాణం. కానీ, సిక్స్ ప్యాక్ కోసం త్యాగం చేశా. నేనెంత తిండి ప్రియుణ్ణో మావాళ్లకు తెలుసు. అందుకే నా త్యాగం చూసి, బాధపడతారు. మీలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని ఎప్పుడు మీకు నమ్మకం కలిగింది? హీరో అంటే కామెడీ, ఫైట్స్, డ్యాన్స్, సెంటిమెంట్, రొమాన్స్ అన్నీ చేయాలి. నాకు రొమాన్స్ కష్టం. ‘మర్యాద రామన్న’ చేస్తున్నప్పుడు సలోనికి ముద్దు పెట్టే సీన్‌కి ఎన్ని టేక్స్ తీసుకున్నానో. ఆ సీన్ చేసి చూపించిన అసిస్టెంట్ డెరైక్టర్ ప్రతిసారీ ముద్దు పెట్టేవాడు. ‘ఇన్నిసార్లు నేను ముద్దు పెట్టే బదులు మీరు ఒక్కసారి సరిగ్గా పెట్టేస్తే షాట్ ఓకే అయిపోద్ది కదా’ అనేవాడు. నా రొమాంటిక్ సీన్స్‌ని క్షుణ్ణంగా గమనిస్తే, మొహమాట పడిన విషయం ఈజీగా పట్టేయొచ్చు. మిగతావన్నీ చేసేయగలను. బాలీవుడ్లో గోవిందాలా అన్నమాట. నాలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడనే నమ్మకం మొదటి సినిమా అప్పుడు, ఆ తర్వాత ఇంకా బలపడింది. మీ తోటి కమెడియన్లు మీ గురించి కామెంట్ చేయడం విన్నారా? దాదాపు అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. నా దగ్గర ఎవరూ రియాక్ట్ కాలేదు. కానీ, హీరోగా చేస్తూ, లైఫ్ పోగొట్టుకుంటున్నాడని కొందరు అనడం విన్నాను. నేనిక్కడకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇక పోగొట్టుకుంటానని టెన్షన్ ఎందుకు? -
‘కృష్ణాష్టమి’ మూవీ స్టిల్స్
-
అమెరికా టు ఇండియా!
‘‘ఫిబ్రవరి 5న మేము నవ్వించేందుకు రెడీగా ఉన్నాం. అదే రోజున ‘స్పీడున్నోడు’, ఫిబ్రవరి 12న ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ రిలీజ్ చేస్తామని నిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. వారికి బెనిఫిట్ అవ్వాలని మా చిత్రం 19కి వాయిదా వేశాం. కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వాసువర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా, నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ‘‘అమెరికా నుంచి ఇండియా వచ్చిన కుర్రాడికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతనెలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ కథ’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్. -
చెన్నైలో కృష్ణాష్ఠమి వేడుకలు
-
ఉట్టికొట్టిన మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేట రూరల్: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం పాఠశాలలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.