హైదరాబాద్: 'కృష్ణాష్టమి' సినిమాలో 'సెల్పీ బర్ఫీ'గా నవ్వించడానికి సిద్ధమవుతున్న కామెడీ స్టార్ బ్రహ్మానందం ఇపుడు ఇంటర్నెట్ లోనూ హల్చల్ చేస్తున్నాడు. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌తో బ్రహ్మి కమెడీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.
సిక్స్ ప్యాక్ తో అదరగొట్టి చాలా తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సునీల్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘కృష్ణాష్టమి’ మూవీతో వస్తున్నాడు. కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సునీల్ అందాలరాముడుతో హీరోగా మారాడు. ఆయన తాజా చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఒక ఎన్నారై కథతో, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో సీనియర్ కామెడీ నటుడు బ్రహ్మానందం సెల్పీ బర్ఫీగా మరో కొత్త అవతారంలో అలరించనున్నాడు. 'చేసే ప్రతీ ఎదవ పనీ' ఫేస్‌బుక్‌లో పెడితే ఇలాగే ఉంటుందన్న హీరో సునీల్ , బ్రహ్మానందం సంభాషణతో కూడిన ఈ తాజా ట్రైలర్ ఇపుడు హల్ చల్ చేస్తోంది. సెల్ఫీ బర్ఫీ పేరుతో తనకో ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసుకుని, ప్రతీవాళ్లతో సెల్ఫీ దిగి, దాన్ని ఫేస్ బుక్ లో పెట్టి కామెడీని పండించే పాత్రలో బ్రహ్మీ ప్రేక్షకులకు మరోసారి గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
సునీల్ సరసన నిక్కీ గార్లాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి జోష్ ఫేం వాసు వర్మ డైరెక్టర్. బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు . ఫ్యామిలీ కథా చిత్రానికి యాక్షన్ అంశాలను కూడా మిక్స్ చేసిన ఈ సినిమా పై సునీల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ మర్యాద రామన్న హీరో ఎంతవరకు ఆకట్టుకుంటాడో తేలాలంటే ఫిబ్రవరి 19 వరకు వెయట్ చేయల్సిందే.
హల్చల్ చేస్తున్న సెల్పీ బ్రహ్మి
Published Mon, Feb 15 2016 2:44 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
Advertisement
Advertisement