comedy
-
Stand-Up Comedy Show: నిలబడి.. నవ్వుల జడి..
‘ఈ రోజు వర్క్ ఫుల్ స్ట్రెస్ అనిపించింది బ్రో.. ఏదైనా మంచి స్టాండప్ కామెడీ షో ఉంటే చూడు పోదాం’ ఫ్రెండ్స్ ముచ్చట్లలో ఇలాంటివి సర్వసాధారణంగా మారాయి. ఇటీవల సిటీలో అత్యధికులకు స్టాండ్–అప్ కామెడీ చేరువైన పరిస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి వేదికపై నుంచి జోకులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే స్టాండ్–అప్ కామెడీ. దాదాపుగా ఓ 15ఏళ్ల క్రితం నగరవాసులు ఎవరూ ఈ పదం విని ఉండరు.. గతేడాది అలా దూసుకువచ్చి సూపర్‌హిట్ కొట్టిన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా స్టాండప్ కామెడీ అంటే ఏంటో నగరవాసులకు మరింత పరిచయం చేసింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా అనేక మంది స్టాండ్ అప్ కామెడీ అంటే ఇష్టపడుతున్నారు. సాంకేతిక విప్లవంతో సోషల్ మీడియా పుణ్యమాని హాస్యం అందించే విభిన్న ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా హాస్యం పండించేవారు లక్షలాది మందికి చేరువ కావడానికి అవకాశాలు పెరిగాయి. యూట్యూబ్ ద్వారా రస్సెల్ పీటర్స్ వంటి హాస్య సమర్పకులు గణనీయమైన ఫాలోయింగ్‌ను సాధించారు. దాంతో చాలా మంది ఆ బాటను అనుసరించారు. ఇది స్టాండ్–అప్ కామెడీ కెరీర్‌గా వృద్ధి చెందేందుకు దారితీసింది. కామెడీకి స్వర్ణయుగం.. ఓ రకంగా 2010 సంవత్సరం నుంచి రెండేళ్ల కాలాన్ని కామెడీకి స్వర్ణయుగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది నేటి మేటి హాస్య సమర్పకులు అనేక మంది తమ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన సమయం. జాకీర్ ఖాన్, సపన్ వర్మ, కరుణేష్ తల్వార్ తదితరులు మన నగరంతో సహా పలుచోట్ల ఇచ్చిన ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. అమిత్ టాండన్, నీతి పల్టా అభిõÙక్ ఉప్మన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, ఆకాష్గుప్తా, సమయ్ రైనా, హర్ష గుజారాల్ వంటివారు ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. పాపులారిటీ కారణంగా కొందరు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అదేవిధంగా కొందరు వివాదాస్పద హాస్యంతో వివాదాలకు చిరునామాగా మారడం, అలాంటి కమెడియన్ల షోలకు నగరంలో అనుమతి నిరాకరిస్తుండటం కూడా మనకు తెలిసిందే. సెలబ్రిటీలు సైతం.. ఓ వైపు స్టాండప్ కామెడీ అనేక మంది సాధారణ వ్యక్తుల్ని సెలబ్రిటీలుగా మారుస్తుంటే.. కొందరు సెలబ్రిటీలు తామే స్టాండప్ కామెడీకి జై కొడుతున్నారు. ‘నా దగ్గర చెప్పడానికి కొన్ని కథలు ఉన్నాయి, అవి తమాషాగా ఉండి స్టాండ్–అప్ కామెడీకి నప్పుతాయి. అందుకే 59 సంవత్సరాల వయస్సు గల స్టాండ్–అప్ కామిక్ని అనుకుంటున్నాను’ అని చెప్పారు సినీనటుడు అశిష్ విద్యారి్థ. ఇటీవలే స్టాండప్ కామెడీలోకి ప్రవేశించిన ఈయన నగరంలో తన కామెడీ ప్రదర్శన కూడా ఇచ్చారు. చిన్న చిన్న సమూహాల కోసం కేఫ్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, ఆఖరికి కార్పొరేట్ కంపెనీల్లో సైతం తరచూ వీరి షోస్ నిర్వహించడం పరిపాటిగా మారింది. ప్రత్యేకంగా గచి్చ»ౌలిలోని కామెడీ థియేటర్ తరహాలో పలు క్లబ్స్ కూడా ఏర్పాటయ్యాయి. ప్లేస్.. పబ్లిక్ని బట్టి.. క్లబ్స్‌లో ఒకలా, లాంజ్ బార్లయితే మరోలా, కేఫ్స్‌లో ఇంకోలా.. ఇలా ప్రదర్శించే చోటును బట్టి హాజరయ్యే ప్రేక్షకులను బట్టి స్టాండప్ కామెడీ స్క్రిప్ట్ మెటీరియల్ మారుతుంటుంది. అలాగే ఈ కమెడియన్స్‌లో కూడా రాజకీయాలకు కొందరు రిలేషన్షిప్స్, శృంగారభరిత హాస్యానికి కొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పెషలైజ్డ్ అవుతున్నారు. నగరంలో పేరొందిన స్టాండప్ కమెడియన్స్ దాదాపుగా 25 మంది దాకా ఉంటారు. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా షోకి రూ.10 వేలు నుంచి మొదలవుతూ.. భారీగానే ఉంటోంది. రోజువారీ పని ఒత్తిడిలో పడి నవ్వలేకపోవడం అనే రోగానికి గురైన వారికి చికిత్స చేసి నవ్వడం అనే భోగాన్నిస్తూ నవ్వించే యోగులుగా మారారు స్టాండప్ కమెడియన్స్. ‘పని సంబంధిత ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ ఆధునిక యుగంలో హాస్యం ఒక గొప్ప మార్గం’ అని చెన్నైకి చెందిన ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయిన ఎవామ్ డైరెక్టర్ సునీల్ విష్ణు.కె అంటున్నారు. జీవితం అత్యంత సంక్లిష్టమైంది దాన్ని వీలైనంత సరదాగా ఆహ్లాదకరంగా మనం మార్చాలి, హాస్యం లేకుండా జీవితం భరించలేనంత బోరింగ్‌గా అనిపిస్తుందని నమ్ముతున్నా అని ప్రస్తుతం దక్షిణాదిలోని అగ్రగామి కామెడీ షోస్ నిర్వాహక సంస్థ ఎవామ్ డైరెక్టర్ చెబుతున్నారు.కొలీగ్స్‌ని నవ్వించడమే.. కెరీర్‌గా మారిందిఅమెజాన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్స్‌తో జోక్స్ వేసి సరదాగా నవ్వించడమే అలాగే ఓ సారి కంపెనీ పెట్టిన కాంటెస్ట్‌లో పాల్గొని కామెడీ షో చేస్తే అది హిట్ అవడం.. ఫైనల్‌గా నేను స్టాండప్ కమెడియన్‌గా మారడం.. జరిగింది. ప్రస్తుతం నగరంలోని పలు వెన్యూస్లో తరచూ కామెడీ షోస్ సమరి్పస్తున్నాను. విభిన్న రకాల అంశాలను మేళవించి నవ్వించడం నా శైలి. ఇతర మెట్రో నగరాల్లో బాగా వేళ్లూనుకున్న ఈ ప్రొఫెషన్ నగరంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. నా షోస్ ఎక్కువగా నగరంలోని అరోమలి కేఫ్, పక్కా లోకల్, కామెడీ థియేటర్.. తదితర చోట్ల ఉంటాయి. – సందేశ్ జానీ, స్టాండప్ కమెడియన్ -
యుద్ధ గాయాలకు ఉపశమనం
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్‌కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్‌గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో . యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్‌లో, సాయుధ దళాల కోసం, ఔట్‌డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్‌లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన. గాయాలను గుర్తు చేయకుండా భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్. పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు. సైన్యానికి సాయంగా.. ఉక్రెయిన్‌లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటీటీకి సర్వైవల్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు, శృతిరామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్ కామెడీ చిత్రం గర్. ఈ సినిమాను జయ్ కె డైరెక్షన్లో తెరకెక్కించారు. జూన్ 14న థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓ జూలో సింహాం ఉన్న డెన్లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎలా బయటపడ్డారనే కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజేశ్ మాధవన్, మంజుపిళ్లై, శోభితిలకన్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. -
మంత్రిగారి బామ్మర్ది తాలూకా..
-
అహనా తిండంటా !
-
పెళ్లం అలిగిందని పోలెక్కిన రాజేష్
-
డేటింగ్ ముఠా.. పబ్బు ఓనర్ల కొత్త దందా
-
టాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓ మంచి ఘోస్ట్'. హారర్, కామెడీ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా జూన్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. -
లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
-
బ్లాక్ అండ్ వైట్ టూ కలర్ సినిమా.. దాని ప్రత్యేకతే వేరు!
మనసు కాస్త మందగించగానే.. ఏదైనా కామెడీ బిట్ పెట్టుకుని.. ఆస్వాదిస్తుంటాం. ఎల్లవేళలా అస్వాదాన్ని కలిగించే వినోదంలో సినిమా ప్రముఖపాత్ర పోషిస్తూ వస్తోంది. నిజానికి నటించడం ఓ ఎత్తు.. నవ్వించడం మరో ఎత్తు. ఎవరైనా నటించగలరేమో కానీ.. ఎవరు పడితే వాళ్లు నవ్వించలేరు. నవ్వనేది నాటికీ నేటికీ సినిమాల్లో ఒక భోగమే. పప్పులో ఉప్పులేకపోతే కూర ఎంత చప్పగా ఉంటుందో.. సినిమాలో కామెడీ లేకపోయినా అంతే చప్పగా సాగుతుంది. ఎన్ని యాక్షన్ సీక్వెన్సులున్నా.. గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ సీన్లున్నా.. వినసొంపైన పాటలున్నా.. కథలో కామెడీ లేకపోతే ఏదో లోటుగానే అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా వినోదం లేకపోతే పెదవి విరుపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ వుడ్ తీసుకున్నా కామెడీ ట్రాక్ లేకుండా సినిమాలు నడవవు. తెలుగు చిత్ర సీమ నవ్వుల వనంలో వికసించిన హాస్య పద్మాలెన్నో.. ఎన్నెన్నో. బ్లాక్ అండ్ వైట్ కాలంలో రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం వీళ్లంతా నవ్వుకి నాట్యం నేర్పిన వారే. ఆ తరువాత కాలంలో.. బ్రహ్మానందం, బాబు మోహన్, కోటా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అలీ, సుత్తివేలు, ఆహుతి ప్రసాద్, కొండవలస, గుండు హనుమంత రావు, సునీల్, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా చాలామంది నవ్వుల రారాజులున్నారు. మరి నవ్వుల రాణులు లేరా అంటే.. నవ్వుల సామ్రాజ్యానికి మహారాణిగా నిలిచింది సూర్యకాంతం. ఆ తరువాత.. శ్రీలక్ష్మి, రమాప్రభ, తెలంగాణ శకుంతల, కోవై∙సరళ ఇలా చాలామందే ఆ వారసత్వాన్ని కొనసాగించారు. చాలా సార్లు బాధలో ఉన్నప్పుడు కూడా మనల్ని గిలిగింతలు పెట్టించేవి ఈ సినీ నవ్వులే. ఇక నటుడు జంధ్యాల సృష్టించిన చిత్ర విచిత్రమైన పాత్రలు నవ్వుకి జీవం పోశాయంటే అతిశయోక్తి కాదేమో. ఆ తరువాత ఈవీవీ.. ఆయన పెట్టించిన ‘కితకితలు’ ప్రేక్షకుల మోవి మీద నవ్వులు పూయించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారంటే.. ఆయన అస్త్రం కూడా ఈ నవ్వే. యాక్షన్, సెంటిమెంట్, లవ్, థ్రిల్లర్, హారర్, డ్రామా ఇలా ఏ జానర్ చూసుకున్నా.. అందులో కామెడీ ఉంటేనే కిక్కు. అందుకే ఎంతటి బాహుబలి సినిమా అయినా.. కామెడీ ప్రధానం కాబట్టే కట్టప్పతోనూ జోకులు వేయించాడు రాజమౌళి. అలాగే అనుష్క బావ కుమార వర్మగా సుబ్బరాజుతో హాస్యం పండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్ర సీమలో నవ్వుకు ఉన్న ప్రాధాన్యం వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. -
కోవిడ్ టైంలో కంటెంట్ క్రియేషన్, ఫేమ్‌తో పాటు డబ్బు కూడా
బాధ పడితే బాధ మాత్రమే మిగులుతుంది. అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి నవ్వితే ఏమవుతుంది? ‘అలా ఎలా కుదురుతుంది? బాధ బాధే, నవ్వు నవ్వే’ అని గట్టిగా అనుకున్న బాధాసర్పదష్టులు కూడా వీరి హాస్యం ముందు మౌనంగా ఉండలేకపోయారు. హాయిగా నవ్వేసి ఆ కొద్ది సమయమైనా బాధ నుంచి విముక్తి పొందారు. యువతరం ఎక్కడ ఉంటుందో నవ్వు అక్కడ ఉంటుంది. ఆ నవ్వునే పెట్టుబడిగా పెట్టి యువతరంలో ఎంతోమంది కామెడీ కంటెంట్ క్రియేటర్లుగా కీర్తి, డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా కొత్త వాళ్లు నవ్వుల రంగస్థలంపై మెరుస్తున్నారు. తమదైన హాస్యాన్ని పరిచయం చేస్తున్నారు... సోషల్ మీడియాలోని రకరకాల విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. మిథిక ద్వివేది, రాజ్ గ్రోవర్, సలోని గౌర్, విష్ణు కుషాల్లాంటి యంగ్ కామెడీ కంటెంట్ క్రియేటర్లు దూసుకుపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది లాక్డౌన్ టైమ్‌లో ఫేమస్ అయిన వారు. అప్పటి రోజుల్లో నుంచే కడుపుబ్బా నవ్వించే షార్ట్–ఫామ్ వీడియో స్పూఫ్‌లను రూపొందించారు. బ్రాండ్ ప్రమోషన్లలో కామెడీ ఇన్ఫ్లూయెన్సర్లను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నారు. ‘కామెడీ ఇన్ఫ్లూయెన్సర్లు సత్తా ఉన్న రచయితలు. ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో వారికి బాగా తెలుసు. ప్రమోషన్స్‌కు ఎంటర్టైన్మెంట్ను సృజనాత్మకంగా జోడిస్తున్నారు’ అంటున్నాడు సోషల్ సమోస సీయివో హితేష్ రజ్వానీ. ఒకప్పటి టీవీ సీరియల్ ‘కస్తూరీ జిందగీ’లోని పాపులర్ పాత్రను చిన్నప్పుడు అనుకరిస్తూ అందరినీ నవ్వించేది కరిష్మా గంగ్వాల్. తాను ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీని కెరీర్‌గా తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత రేడియో వేదికగా తన టాలెంట్‌ను శ్రోతలకు పరిచయం చేసింది. అప్పటి వరకు తన గొంతునే పరిచయం చేసిన కరిష్మ ప్రేక్షకులకు ముఖ పరిచయం చేయాలనుకుంది. కోవిడ్ టైమ్‌లో కంటెంట్ క్రియేషన్‌కు శ్రీకారం చుట్టింది. అత్తా–కోడళ్ల సంభాషణతో తొలిసారిగా ఒక ఫన్నీ వీడియో చేసింది. ‘ప్రేక్షకులు ఏమనుకుంటారో ఏమో’ అని సందేహించింది. అయితే తన సోదరి సలహాతో సోషల్‌మీడియాలో పెట్టింది. ఆ ఫన్నీ వీడియో 1.3 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకొని కరిష్మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కరిష్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. జమ్మూలో పుట్టి పెరిగింది కరిష్మ. డాక్టర్లు, ఇంజనీర్ల కుటుంబం వారిది. తాను కూడా డాక్టరో, ఇంజనీరో కావాల్సిందే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే తల్లిదండ్రులను ఒప్పించి కామెడీనే తన కెరీర్ చేసుకుంది.తన మిమిక్రీ స్కిల్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది చాందిని భాబ్డ. ‘ఆలియాభట్‌ను అనుకరించాలంటే చాందిని మాత్రమే’ అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడు తన ఉపాధ్యాయులు, చుట్టాలు పక్కాలను కెమెరా ముందు అనుకరిస్తూ అందరినీ తెగ నవ్వించేది చాందిని. ఇరవైనాలుగు సంవత్సరాల చాందిని 2016లో కామెడీ కంటెంట్ క్రియేషన్ ప్రారంభించింది. న్యాయశాస్త్రం చదివిన చాందిని అమెజాన్ మినీ టీవీ కామెడీ షో ‘కానిస్టేబుల్ గిర్పాడే’లో నటించింది.తీరిక సమయంలో సలోని గౌర్ ఫన్నీ వీడియోలు బాగా చూసేది. ‘నీలో నవ్వించే టాలెంట్ ఉంది’ అని ఫ్రెండ్స్ తరచుగా అనడంతో ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ రంగంలోకి దిగింది. తక్కువ టైమ్‌లోనే కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్ సాధించింది. సలోనికి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సలోని అబ్జర్వేషనల్ కామెడీని తన బలంగా చేసుకుంది. ఇరవై సంవత్సరాల వయసులో సోనీ లివ్‌లో ‘అన్‌కామన్ సెన్స్ విత్ సలోని’ పేరుతో సొంత షో స్టార్ట్ చేసింది. ‘ఒక్కరోజు నవ్వకపోయినా ఆ రోజు వృథా అయినట్లే’ అంటాడు చార్లీ చాప్లిన్.అయితే నవ్వడం ఎంత వీజియో, నవ్వించడం అంత కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజాల కెత్తుకుంటున్నారు కామెడీ కంటెంట్ క్రియేటర్లు. ఒకవైపు సీనియర్ల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సృజనాత్మక ఆలోచనలతో తమదైన కామెడీ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు.‘ప్రేక్షకుల అర క్షణం నవ్వు చాలు వెయ్యి ఏనుగుల బలం తెచ్చుకోవడానికి’ అంటుంది లక్నోకు చెందిన 19 సంవత్సరాల మిథిక ద్వివేది. ఈ కామెడీ కంటెంట్ క్రియేటర్‌కు వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. నవ్వడం అదృష్టం... నవ్వించడం అంతకంటే అదృష్టం ‘లా’లో మాస్టర్స్ డిగ్రీ చేసినప్పటికీ నా ఆలోచనలన్నీ కంటెంట్ క్రియేషన్ చుట్టే తిరుగుతుంటాయి. ఎవరో చెప్పింది వినడం కంటే మనసు చెప్పింది వినడమే మంచిదని నా నమ్మకం. ఐడియాల కోసం కొన్నిసార్లు ‘ఇలా అయితే ఎలా ఉంటుంది’ అంటూ కసరత్తులు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం స్పాంటేనియస్‌గా వస్తుంటాయి. నా బెస్ట్ కంటెంట్‌లో ఎక్కువ శాతం స్పాంటేనియస్‌గా వచ్చిందే. నవ్వడం అదృష్టం. నవ్వించగలగడం అంతకంటే అదృష్టం. – చాందిని, కామెడీ కంటెంట్ క్రియేటర్ కంటెంట్ కోసం... కామెడీ అయినా సరే కంటెంట్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. సహజంగా ఉండాలి. ప్రేక్షకులు దానితో రిలేట్ కావాలి. కంటెంట్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు. వెళ్లిన ఫంక్షన్ కావచ్చు....మనకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. దాన్ని మన స్టైల్లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నామనేదే ముఖ్యం. – సలోని గౌర్, కామెడీ కంటెంట్ క్రియేటర్ కొత్తదనం కావాలి కామెడీ పుస్తకాలు చదివీ, సీరియల్స్ చూసి కామెడీని సృష్టించలేం. జనాల్లోకి వెళ్లి పరిసరాలను గమనించాల్సిందే. ఆసక్తికరమైన సంభాషణలు, పదాలు విన్నప్పుడు పెన్ను పేపర్ తీసుకొని స్క్రిప్ట్ రాస్తుంటాను. ఆ తరువాత షూట్స్, ఎడిట్స్, అప్లోడ్స్కు వెళతాను. ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడాను. – కరిష్మ గంగ్వాల్, కామెడీ కంటెంట్ క్రియేటర్ -
అప్పుకోసం రాజేశ్ హడావుడి
-
ఇద్దరు కలిసిపాయిండ్రు
-
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
పెద్ద కష్టమే..!
-
రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఇందులో ఒకటి యూట్యూబ్. ప్రస్తుతం యూట్యూబ్ రాజ్యమేలుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా సంపాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారిలో 'భువన్ బామ్' (Bhuvan Bam) ఒకరు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భువన్ బామ్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు. మ్యుజిషియన్‌గా కెరీర్ ప్రారభించిన భువన్ ఆ తరువాత యూట్యూబ్ ప్రారభించారు. దీని కోసం సింగింగ్ కెరీర్ వదులుకున్నట్లు సమాచారం. ఇతడు చేసిన మొదటి కామెడీ వీడియో బాగా పాపులర్ అయింది. దీంతో 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) అనే సొంత సిరీస్ ప్రారభించాడు. స్పూప్ వీడియోలు.. బీబీ కి వైన్స్ సిరీస్‌లో భాగంగా వివిధ రకాల పాత్రలతో స్పూప్ వీడియోలు క్రియేట్ చేసి ఎక్కువ వ్యూవ్స్ పొందగలిగాడు. దెబ్బకు ఈ సిరీస్ పెద్ద హిట్ కొట్టింది. తన సొంత కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా పోషించి ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి తన యూట్యూబ్ ఛానెల్‌కి 2.6 కోట్ల కంటే ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్లు సమాచారం. వీడియోలు చాలా కామెడీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యూవ్స్ రావడంతో, ఇండియాలో టాప్ యూట్యూబర్లలో ఒకడుగా నిలిచాడు. కేవలం యూట్యూబ్ ఛానల్ వీడియోలు మాత్రమే కాకుండా.. అనేక వెబ్ సిరీస్‌లు కూడా ప్రారభించి సక్సెస్ సాధించాడు. దీంతో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రారంభంలో కేవలం రూ. 5000 పొందిన భువన్ క్రమంగా లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతోమంది యూట్యూబర్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు. మొత్తానికి కష్టపడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించి ఈ రోజు గొప్ప సక్సెస్ సాధించిన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు. కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే సక్సెస్ మంత్రం అని ఇతని ద్వారా తెలుస్తుంది. -
నేను తప్ప ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు..
-
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్‌లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్‌కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్‌లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్‌లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్‌ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్‌ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్‌తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్‌తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
ప్లీజ్.. అలాంటివేవైనా ఉంటే చెప్పండి: వరలక్ష్మి శరత్‌కుమార్
ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించే సత్తా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వారసురాలైన ఆమె శరత్‌కుమార్ బ్రాండ్‌ను పెద్దగా ఉపయోగించుకోకుండానే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో శింబుకు జంటగా పోడాపోడి చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈమె నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్నారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై, పుష్కర్, గాయత్రిల దర్శకత్వంలో విక్రమ్ వేదా హిట్ చిత్రాలలో కథానాయికగా నటించారు. ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన సండైక్కోళి–2 చిత్రంతో ప్రతినాయకిగా అవతారమెత్తారు. అదే విధంగా విజయ్ కథానాయకుడుగా నటించిన సర్కార్ చిత్రంలో మరోసారి విలనిజాన్ని ప్రదర్శించారు. చదవండి: (Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్) ఆపై నాయకి, ప్రతినాయకి అన్న భేదం లేకుండా వైవిధ్యం అనిపించిన పాత్రలకు ఓకే చెప్పేసుకుని నటిస్తూ ఆల్‌రౌండర్‌గా మారిపోయారు. అదే విధంగా ఒక్క తమిళ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అన్నట్టు వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి డాన్సర్ కూడా. బెల్లీ డాన్స్ సూపర్‌గా చేస్తారు. ప్రస్తుతం పాంబన్, గ్రంథాలు పిరందాళ్ పరాశక్తి, కలర్స్, యశోద, శబరితో పాటు తెలుగులో బాలకృష్ణ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు హాస్యభరిత కథా చిత్రంలో నటించాలన్నది చిరకాల కోరిక అన్నారు. అయితే తనకు అలాంటి పాత్రలో నటించే అవకాశాలు రావడం లేదని, అన్ని ప్రతినాయకి పాత్రలే వస్తున్నాయన్నారు. కాబట్టి ఎవరైనా కామెడీ కథా చిత్రాల్లో నటించే అవకాశం చెప్పండి ప్లీజ్ అని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అంటున్నారు. చదవండి: (దర్శకుడు భారతీరాజా ఇంటికి సీఎం స్టాలిన్) -
కామెడీయే కామెడీ
-
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
గరం గరం వార్తలు 26 December 2021
-
శీతలమైన క్లౌన్స్లింగ్
నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్ అగర్వాల్. ‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్. ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్...ఆంత్రోపాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్ అహ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్‌కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్ విదూషకులు (క్లౌన్స్) చేసే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తూ పెరిగిన శీతల్‌కు మెడికల్ క్లౌన్ అనగానే విచిత్రంగా అనిపించింది. వెంటనే ‘‘అవునా! మెడికల్క్లౌన్ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్ క్లౌన్ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్ అడమ్స్’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్ క్లౌన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్ తను కూడా మెడికల్ క్లౌన్ కావాలనుకుంది. క్లౌన్స్‌లర్స్.. మెడికల్ క్లౌన్స్ కావాలనుకుని తన ఫేస్బుక్లో కొంతమంది మెడికల్ క్లౌన్స్ కావాలని పోస్టు చేసింది. శీతల్ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్ క్లౌన్స్గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్‌కు చాలా తృప్తినిచ్చాయి. అంతేగాక వీళ్ల టీమ్ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు వీరి టీమ్‌ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్ క్లౌన్స్‌లర్స్ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్‌లో స్వచ్ఛందంగా మెడికల్ క్లౌన్స్లర్గా చేరి సేవలందిస్తున్నారు. ఉద్యోగం వదిలేసి.. శీతల్ క్లౌన్స్‌లర్స్ టీమ్‌కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్ క్లౌన్స్కే కేటాయించింది. కోవిడ్ సమయంలోనూ..క్లౌన్స్ సేవలందించింది. మొదటి లాక్డౌన్ సమయంలో మైక్రో షెల్టర్స్‌ను సందర్శించడం, కొన్ని షెల్టర్లలో ఫేస్బుక్ ద్వారా లైవ్ ఈవెంట్స్‌ను అందిచారు. ఆన్లైన్ సెషన్స్‌కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్లైన్ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్ క్లౌన్ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
పతన హాస్యం
‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు. ‘నాకు గనక సెన్సాఫ్ హ్యూమర్ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్ ఈజ్ నాట్ పూర్ ఇఫ్ హి కెన్ స్టిల్ హీ లాఫ్’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు. మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’. గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్ రుచిగా ఉంటుందో చూపించగలిగారు. అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి, మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్డ్ ఖాతాల్లో వేసుకోగలిగారు. కాని నవ్వించడం ఏమాత్రం జోక్ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి. మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. ఇది దుర్మార్గ హాస్యం! -
సత్తి కామెడీకి ప్రొడ్యూసర్ ఓపెన్ ఆఫర్
-
Stand Up Comedians: ఇదిగో నవ్వుల ఆక్సిజన్!
గాలిలో కానరాని గడుసు దెయ్యాలు... అడుగు తీసి అడుగు వేయాలంటే టెన్షన్! హాలో బాగున్నారా? అని ఆత్మీయంగా పలకరించడానికి దగ్గరికి వెళదామంటే ఏ వైపు నుంచి ఏ చెడు నీడ పడుతుందో అని టెన్షన్! ఇప్పుడు టెన్షన్ స్టేషన్లో బతుకు బండి భయంగా ఆగింది. ఆ బండి కాస్త ముందుకు కదలాలంటే మనకు తప్పనిసరిగా కావాలి... నవ్వుల ఆక్సిజన్!! స్టాండ్ అప్ కమెడియన్లుగా రాణిస్తున్న కొందరు మహిళలు తమ దగ్గర ఉన్న నవ్వుల మంత్రదండంతో టెన్షన్‌ను‘హాంఫట్’ అని మాయం చేసి ‘హ్హాహ్హా’ అని నవ్విస్తూ మనసు తేలిక పరుస్తున్నారు. ‘అనురాధ మెనన్ ఎవరండీ?’ అని అడిగితే చెప్పేవాళ్లు లేకపోవచ్చుగానీ ‘మిస్ లోలా కుట్టీ ఎవరు?’ అంటే జవాబు చెప్పడం చాలామందికి వీజీ. సాధారణంగా వీజేలు పోష్ పోష్ ఇంగ్లిష్ మాట్లాడేస్తుంటారు. లోలా కుట్టి మాత్రం మలయాళీ యాక్సెంట్‌తో ఇంగ్లిష్ గడగడా మాట్లాడుతూ ప్రేక్షకులను గలగలమని నవ్విస్తుంటుంది. నూనె రుద్దిన జుట్టు, జడలో పూలు, గాజులు, సోడా బుడ్డి కళ్లద్దాలతో ఆమె ఆహార్యమే నువ్వు తెప్పిస్తుంది. ‘చానల్ వి.లోలా’లో లోలా కుట్టి నవ్వుల తోటమాలి. ‘కామెడీ అనేది చాలా సీరియస్ విషయం’ అని బల్ల బాదీ మరీ చెబుతున్న జియా సేథి స్టాండప్– స్టార్ కమెడీయన్‌గా ‘రాణి’స్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కామెడీ స్టేజీ షోలు చేసిన జియా సేథి ఇప్పుడు జూమ్ వేదికగా నవ్వులు పండిస్తుంది. అంతేకాదు స్టాండప్–కామెడీ కోర్సు ప్రారంభించి ఎంతోమందిని కమెడియన్లుగా తీర్చిదిద్దుతుంది. చాలామందికి ‘నవ్వించడం’ అనేది హాబీ నుంచి ఉపాధి స్థాయికి వెళ్లడం విశేషం. ఇంతకీ స్టాండప్–కామెడీ కోర్స్‌లో ఏముంటాయి? జోక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నవ్వు తెప్పిస్తాయి? సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు హాస్యం ఎలా సృష్టించాలి? పంచ్‌లైన్‌లను ఎలా రాసుకోవాలి? కామెడీ నాలెజ్డ్ అంటే ఏమిటి? చిన్న చిన్న జోక్స్‌ను ఆకట్టుకునే స్కిట్లా ఎలా మలుచుకోవచ్చు... మొదలైనవి కామెడి కోర్సులో పాఠాలుగా ఉంటాయి. రంగస్థల నటిగా పేరున్న కోమల్ భాటియా ‘ఆల్–ఉమెన్ స్టాండప్ కామెడీ నైట్స్’ పేరుతో ఢిల్లీ లో చేసిన షోకు అనూహ్యమైన ఆదరణ లభించడంతో దేశంలోని వేరే నగరాల్లో కూడా ఇలాంటి షోలు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రీతీ దేశాయ్ కేవలం ‘నవ్వు కోసమే నవ్వు’ అన్నట్లు కాకుండా కాస్తో కూస్తో సామాజిక స్పృహను ఆ నవ్వులకు జోడిస్తుంది. ‘కొందరు పురుష కమెడియన్లు ప్రేక్షకులను నవ్వించడానికి గర్ల్ఫ్రెండ్పైన, భార్యలపైనా వెకిలి హాస్యం సృష్టిస్తుంటారు. ఇది ఆరోగ్యకరమైన హాస్యధోరణి కాదు’ అంటున్న ప్రీతి నొచ్చుకునే హాస్యానికి కాకుండా అందరూ మెచ్చుకునే హాస్యానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఇక నీతి పల్టా దగ్గరికి వద్దాం. ‘మనకు ఉండాల్సింది అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసం’ అంటున్న ఢిల్లీకి చెందిన నీతి పల్టా అరంగేట్రంలాంటి తొలి షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ షో లో ఆమె ఏవో జోక్స్ చెబుతూనే ఉంది, నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ప్రేక్షక మహానుభావుల ఫేసుల్లో ఎలాంటి నవ్వూ మొలకెత్తలేదు. ఏదో ట్రాజెడీ సినిమాకు వచ్చినట్లుగా పెట్టారు ఫేస్. ‘ఇదేదో మనకు అచ్చిరాని వ్యవహారం’ అని దిగులుపడలేదు నీతి. ఇంటికి వెళ్లిన తరువాత తన కామెడీ షోను తానే సమీక్షించుకుంది. ‘నవ్వించడం అంటే మనం నవ్వడం కాదు... ప్రేక్షకులను నవ్వించడం’ అనే విషయాన్ని చాలా గట్టిగా నేర్చుకుంది. ఆ తరువాత చాలా ప్రాక్టీస్ చేసి గానీ స్టేజ్ ఎక్కలేదు. షో సూపర్ డూపర్ హిట్ అయింది. ‘ప్రేక్షకులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. నేను బాగానే పెర్ఫార్మ్ చేశాను’ అని ఆ రోజు ఆమె అనుకొని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేది. తన లోపాల నుంచి గుణ‘పాఠాలు’ నేర్చుకోవడం వల్లే నీతి పల్టా స్టార్–స్టాండప్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంటోంది. ‘నవ్వు’ అనే ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కొరత తీర్చడానికి లోలా కుట్టీ నుంచి నీతి పల్టా వరకు ఎంతోమంది ఫిమేల్ స్టాండప్ కమెడియన్స్ రంగంలో ఉన్నారు. వారికి వందనాలు తెలియజేద్దాం. -
మోహన్‌బాబు నవ్వించడంలోనూ దిట్ట
‘మా వంటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు... మా బట్టలుతికేవాడు భారతీయుడు’... అని ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్‌బాబు చెప్పిన బ్రిటిష్ అధికారి డైలాగుకు ప్రేక్షకులు పదేపదే నవ్వుకున్నారు. ఎన్.టి.ఆర్ తర్వాత డైలాగును బాగా పలుకుతారన్న పేరు మోహన్‌బాబుకు ఉంది. కాని ఆ డైలాగును ఉద్వేగానికి, రౌద్రానికి, సెంటిమెంటుకు ఎంత బాగా ఉపయోగించగలరో కామెడీకి కూడా అంతే బాగా ఉపయోగించగలరు అని ఆయన అనేక సినిమాల ద్వారా ప్రేక్షకులకు నిరూపించారు. ‘దేవత’ సినిమాలో ‘కామెడీ విలన్’గా ఆయన పెద్ద పేరు సాధించారు. అందులో నిర్మలమ్మ జులాయి మనవడిగా నవ్వులు పూయించారు. ఊళ్లో అల్లరి పనులు చేసి ఊరి పెద్ద రావుగోపాలరావు చేతిలో తిట్లు తింటూ ఉంటారు. ఆయన ‘ఔ’ మేనరిజమ్ హిందీలో విలన్ శక్తికపూర్ అదే సినిమా రీమేక్ కోసం వాడి నేటికీ ఆ మేనరిజమ్‌తోనే గుర్తింపు పొందుతున్నాడు. ‘వారసుడొచ్చాడు’, ‘కొదమసింహం’, ‘శ్రీనివాస కల్యాణం’.. ఇలా చాలా సినిమాల్లో ఆయన కామెడీ విలన్‌గా ప్రేక్షకులను అలరించారు. కొదమసింహంలో రోజుల తరబడి స్నానం చేయని కౌబాయ్‌గా, తిండిపోతుగా ఆయన కేరెక్టర్ అందరినీ తెగ నవ్వించింది. హీరో అయ్యాక ఈ కామెడీ అంశను ఆయన వదల్లేదు. ‘అల్లుడు గారు’ మోహన్‌బాబు కామిక్ టైమింగ్‌కు మంచి ఉదాహరణ. ‘నాది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం’ అంటూ రకరకాల మోసాలు చేస్తూ నవ్విస్తారాయన. చంద్రమోహన్‌ను ‘ఉలవల బస్తా’ అంటూ శోభనను పిచ్చిపిచ్చి తిట్లు తిడుతూ ఆయన ఇంటిల్లిపాదికీ నచ్చేశారు. ఇంత మంచివాడికి ఉరిశిక్ష ఏమిటని ప్రేక్షకులు చివరలో భోరున ఏడ్చారు కూడా. దర్శకుడు రాఘవేంద్రరావు మోహన్‌బాబు కామెడీని బాగా ఉపయోగించుకున్నారు. ‘అల్లరి మొగుడు’లో ఇద్దరు భార్యల భర్తగా ఆయన చేత కామెడీ పండించారు. ‘అన్నమయ్య’ సినిమాలో ఆయన పాత్రను ఆహ్లాదానికి ఉపయోగించారు. ‘భంగభంగారి భంగ’ అని మేనరిజమ్ పెట్టారు. పరుచూరి బ్రదర్స్ ‘అసెంబ్లీ రౌడీ’లో ‘అరిస్తే చరుస్తా’ లాంటి డైలాగులు రాసి కామెడీ పండించారు. ఆ సినిమాలో విలన్ బాషా దగ్గరకు వెళ్లి మోహన్‌బాబు ఎగతాళి చేయడం కూడా బాగా నవ్వించింది. దాసరి సినిమాలలో ‘దీపారాధన’, ‘అద్దాలమేడ’ సినిమాలలో మోహన్‌బాబు చాలా క్లాసిక్ కామెడీ చేస్తారు. ఆయనతో కలిసి కామెడీ చేసిన చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఇవివి సత్యనారాయణ మోహన్‌బాబుతో ‘అదిరింది అల్లుడు’, ‘వీడెవడండీ బాబూ’ సినిమాలు చేసి తన స్టయిల్లో నవ్విస్తే దర్శకుడు వంశీ ‘డిటెక్టివ్ నారద’గా మోహన్‌బాబును చూపించి నవ్వించారు. అందులో మల్లికార్జున రావుతో ‘అల్లావుద్దీన్’ అంటే అతను ‘ఎస్‌బాస్’ అనే మేనరిజం బాగుంటుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘తప్పు చేసి పప్పుకూడు’ కూడా కామెడీయే. అల్లరి నరేశ్‌తో ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశారు. మంచి కామెడీ చేసినవాడే మంచి నటుడు అంటారు పెద్దలు. ఆ విధంగా చూస్తే తాను గొప్ప నటుణ్ణి అని మోహన్‌బాబు అనిపించుకున్నారు. ఆయన మరిన్ని ఆహ్లాద పాత్రలు చేయాలని కోరుకుందాం. చదవండి: చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం' టీజర్ విడుదల నాన్న.. మీరు లేకుండా నేను లేను: మంచు లక్ష్మీ -
‘కరోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!
(వెబ్ స్పెషల్): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కూడా మనవాళ్లు వదల్లేదు. కామెడీతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అనేక పేరడి కథలు, పాటలు, జోకులు, షార్ట్ ఫిలిమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కొందరు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు కరోనా పేరుతో కామెడీ సిక్సర్లను బౌండరీలు దాటించారు. మొత్తం మీద కరోనా సమయంలోనూ కామెడీ కల్లోలం స్పష్టించింది. కొన్ని సందర్భాల్లో నెటిజన్లు కరోనాపై వచ్చిన హాస్యాన్ని సరదాగా ఆస్వాదించగా.. మరి కొన్ని సందర్భాల్లో వెకిలి చేష్టలు, వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు. హద్దులు దాటిన హాస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచం అంతా వణికిపోతుంటే.. దీనిపై కూడా కామెడీ చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. కరోనా వేళ.. కామన్ సెన్స్ లేకుండా చేస్తోన్న కామెడీ సెన్స్ పై వ్యతిరేకత వ్యక్తమయ్యింది. (కంగన ఎందుకలా మాట్లాడుతుందో తెలుస్తా?) కరోనాకు స్వాగతం పలికిన చార్మీ.. కరోనా వైరస్ దేశ రాజధానితో పాటు, తెలంగాణలో ప్రవేశించిన సమయంలో కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ సోషల్ మీడియాలో ప్రముఖ నటి చార్మీ వ్యాఖ్యలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. కోవిడ్ గురించి ఫన్నీగా టిక్ టాక్ వీడియో చేసింది. ‘‘ఢిల్లీకి, తెలంగాణకి కరోనా వైరస్ చేరిందిట. హ.. హ.. హా.. వార్తల్లో చదివాను. మరి ఆల్ ది బెస్ట్ మీకు... హా.. హహ్హ..’’ అంటూ ఆమె చేసిన వెకిలి చేష్టలపై నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న చార్మి వెంటనే వీడియోను డిలీట్ చేయడంతోపాటు నెటిజన్లకు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. కరోనాను వదలని వర్మ.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కరోనా మహమ్మారిని కూడా వదల్లేదు. కరోనాపై ఎన్నో వివాదాస్పద ట్వీట్లు చేసిన ఆయన `కనిపించని పురుగు` పేరుతో ఓ గీతాన్ని కూడా స్వయంగా పాడారు. సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల చేయాల్సిన ఈ పాటను గంట ఆలస్యంగా విడుదల చేసిన వర్మ. టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది.. అది తగ్గిన తర్వాత పాటను విడుదల చేస్తున్నానంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. "మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని డాక్టర్ చెప్పారు. ఇది ఆయన తప్పు, నాది కాదు" అని ట్వీట్ చేశాడు. భయంకరంగా ఉన్న స్థితిని తేలిక చేయడానికి మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాననీ, ఈ జోక్ తన మీదే వేసుకున్నాననీ ఆయన అన్నారు. "ఎవరినైనా నేను బాధించకపోతే, వారికి సిన్సియర్‌గా క్షమాపణలు చెప్తున్నా" అని మరో జోక్ వేయడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. పగలబడి నవ్విన నాగబాబు.. ఒక కామెడీ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోలో కరోనాపై వచ్చిన జోక్‌కి ప్రముఖ నటుడు నాగబాబు పగలపడి నవ్వడం పట్ల నెటిజన్లు మండిపడ్డారు. ‘‘కరీనా కాదు కరోనా, కరోనా అంటే చైనాది, కరీనా అంటే బాలీవుడ్ ది’’ అంటూ వేసిన జోక్ కి నాగబాబు పడి పడి నవ్వడం పట్ల వివాదస్పదం అయ్యింది. కరోనాతో ప్రపంచమే అల్లకల్లోలమవుతుంటే ఇలాంటి జోకులా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై నాగబాబు చేసిన ట్వీట్ పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ‘‘కరోనాని కావాలనే కొన్ని మతాల వాళ్లు, వాళ్ల దేవుడే ఈ కరోనాని, భూమ్మీదకి పంపించారు. ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమీ’’ అంటూ నాగబాబు వేసిన సెటైర్లపై పట్ల విమర్శలు వచ్చాయి. సీరియస్ ఇష్యూపై జోకులు ఏమిటంటూ నెటిజన్లు నిలదీశారు. శ్రీరెడ్డి సంచలనం.. కరోనాపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కరోనా మహమ్మారి పోవాలంటే శృంగారం అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు) మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు కరోనా వైరస్ వ్యాపించడానికి అమ్మాయిలే కారణమంటూ పాక్‌కు చెందిన ఓ మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లే వైరస్ సోకిందని, వారి వల్లే ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని పాకిస్తాన్ మత పెద్ద మౌలానా తారీఖ్ జమీల్ వ్యాఖ్యనించారు. అది కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సమక్షంలోనే ఈ వింత వ్యాఖ్యలు చేయడం మరింత దుమారానికి దారి తీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అత్యంత ప్రమాదకర వైరస్‌పై బాధ్యతారహితంగా వ్యహరించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించినట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. సో.. కరోనాతో కామెడీలొద్దు! -
తెలుగు కమెడియన్లూ... మీ నవ్వులు కావాలి
తెలుగువారు హాస్యప్రియులు. కాని ప్రస్తుతం భయం భయంగా నవ్వుతున్నారు. జాగ్రత్తగా నవ్వుతున్నారు. తుమ్ము, దగ్గు రాకుండా చూసుకొని మరీ నవ్వుతున్నారు. కరోనా అలా చేసి పెట్టింది. రోజూ తన వార్తలతో తెలియకుండానే వొత్తిడి తెచ్చి పెడుతోంది. ఆ వొత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత కళాకారులది. ధైర్యం చెప్పాల్సిన సందర్భం కళాకారులది. దేశీయంగా, ప్రాంతీయంగా చాలా రంగాలలోని కళాకారులు తమ ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు కమెడియన్లు ఏదైనా కొత్త ఆలోచన చేయాల్సిన సమయం ఇది.భారతదేశంలోని అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్ వంటి సూపర్స్టార్లు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశారు కరోనా ప్రచారం కోసం. ‘ఇంట్లోనే ఉండండి’ అని మెసేజ్ ఇచ్చిన షార్ట్‌ఫిల్మ్ అది. ఆ తర్వాత సంగీతకారులందరూ ‘సంగీత్‌సేతు’ అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేశారు. అందరూ ఇళ్లల్లోనే ఉండి తాము పాడదగ్గ పాటలను ట్రాక్‌లు ప్లే చేస్తూ పాడారు. బాలూ, ఏసుదాస్ దగ్గరి నుంచి కుమార్‌షాను, ఆశా భోంస్లే వరకూ అందరూ ఇందులో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ దీనికి యాంకర్‌గా పని చేశారు. కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో మన బాహుబలిలోని ‘దండాలయ్యా దండాలయ్య’ హిందీ వెర్షన్ పాడారు. బాలూ ‘రోజా’లోని ‘నా చెలి రోజావే’ పాడారు. సురేష్ వాడ్కర్ ‘సద్మా’లోని ఇళయరాజా కంపొజిషన్ ‘ఏ జిందగీ గలే లగాలే’ పాడారు. ఏసుదాస్ అదే ‘సద్మా’లోని ‘సుర్మయి అఖియోంమే’ పాడారు. కవితా కృష్ణమూర్తి ‘ప్యార్ హువా చుప్‌కేసే’ ఆలపించారు. ఇదంతా వారు చేసింది ఇళ్ల పట్టున ఉండి రకరకాల ఆలోచనలు చుట్టుముట్టిన ప్రజలను ఊరడింప చేయడానికే.ఇదే సందర్భంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులు కూడా కలిసి ఒక షార్ట్‌ఫిల్మ్ చేశారు. ‘స్టేహోమ్’ అనే ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ఎస్.పి.బాలుతో సహా సుజిత, జయలలిత, యమున, జాకీ వీరంతా కలిసి నటించారు. ‘పుట్టడానికి తొమ్మిని నెలలు ఓపిక పట్టావ్.. బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా’ అని ఇంట్లో ఉండమని ఈ షార్ట్‌ఫిల్మ్ మెసేజ్ ఇస్తుంది. ఇక ర్యాప్‌సాంగ్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నవారు, మిమిక్రీలు చేసి సందేశాలు ఇస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కామెడీ స్టార్లు కూడా తమ వంతుగా జనం కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని హాస్యప్రియులు ఆశిస్తున్నారు. ఒకరినొకరు కలవకుండా ఇళ్లల్లోనే ఉంటూ ఏదైనా షూట్ చేసి పోస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. నిజానికి అన్ని భాషలలోనే కంటే తెలుగులో హాస్యనటులు ఎక్కువని అందరూ ఆనందపడుతుంటారు. బ్రహ్మానందం, అలీ, రమా ప్రభ, వెన్నెల కిశోర్, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, హేమ, పృథ్వి, సప్తగిరి, రాజేష్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ధన్‌రాజ్, సత్య, షకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, మహేశ్ విట్టా... ఇలా ఎందరో ఇప్పుడు అందరికి మల్లే లాక్డౌన్లో ఇళ్లకు పరిమితమయ్యారు. వీరు లాక్ అయినా వీరి ద్వారా కొన్ని నవ్వులు ఔట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, అల్లరి నరేష్, సునీల్ వంటి కామెడీ హీరోస్ కూడా ఏదైనా ఆలోచన చేయవచ్చు. విషాదం కమ్ముకున్న వేళ హాస్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు నవ్వులు ఎన్ని వీలైతే అన్ని పకపకలాడాలని కోరుకుందాం. -
లోక్‌సభలో నవ్వులు పూయించిన అఠవాలే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే బుధవారం లోక్‌సభలో తన మాటలతో ప్రధాని మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ముఖాల్లో నవ్వులు పూయించారు. ‘రాహుల్ గారు, ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం మీకు వచ్చినందుకు అభినందనలు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నేను మీ కూటమిలోనే ఉన్నాను. తాజా ఎన్నికలకు ముందు కూడా మళ్లీ యూపీఏలో చేరాల్సిందిగా కాంగ్రెస్ నేతలు నన్ను కోరారు. అయితే గాలి ఎటువైపు వీస్తోందో నేను గమనించి, ఎన్డీయేతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని అఠవాలే అన్నారు. ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న రాహుల్, సోనియాలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అఠవాలే మాట్లాడుతుండగా మోదీ కూడా పలుసార్లు నవ్వారు. మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండి మంచిపనులు చేస్తారన్నారు. -
వినాయకుడి విగ్రహం
తెలుగులో చిన్న బడ్జెట్ సినిమాల్లో ఒక ప్రభంజనం సృష్టించిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా తర్వాత క్రైమ్ కామెడీ అన్నది తెలుగులో పాపులర్ జానర్‌గా మారిపోయింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ప్రసిద్ధ విష్ణు దేవాలయం. తిరువనంతపురం (కేరళ).సంపద లెక్కింపు జరుగుతున్న రోజులు.. అక్కడ పనిచేస్తున్న పూజారి, సెక్యూరిటీ ఆఫీసర్ కలిసి ఒక వెల కట్టలేని వినాయకుడి విగ్రహాన్ని తస్కరించారు. సూర్యోదయం అవ్వడానికి ఇంకా కొద్ది సమయం ఉంది. పూజారి చేతుల్లో ఉన్న విగ్రహం, అక్కడున్న ఏ కంటికీ కనిపించకుండా గుడికి దూరంగా కారులో కూర్చొని అంతకు గంటముందు నుంచే అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది.ఆ వ్యక్తి ఒక తెల్లటి గుడ్డలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. హైవే మీద ఆ కారు అలా దూసుకెళ్లిపోతోంది. ఎదురుగా పెద్ద గుంత. కారు ఎగిరి గాల్లో పల్టీలు కొడుతోంది. ఆ విగ్రహం ఎక్కడో రోడ్డు పక్కన పడిపోయింది. అందులోని వ్యక్తి అదే రోడ్డుకి అటుపక్కన పడిపోయాడు. ఆ విగ్రహం రోడ్డు పక్కనే చాలాసేపు ఉంది. ఒక చిన్నపిల్లాడు వచ్చి తీసుకునే వరకూ అదక్కడే ఉంది. ఆ పిల్లాడి చేతుల్లోకి వెళ్లినప్పుడు ఆ విగ్రహం విలువ సున్నా. అది ఆ పిల్లాడి దగ్గర్నుంచి వాళ్ల నాన్న దగ్గరికి, ఆ నాన్న దగ్గర్నుంచి వీధి చివరి జ్యూవెలరీ వర్క్స్ అతని దగ్గరికి, అక్కణ్నుంచి పెద్ద షాపుకు, అక్కణ్నుంచి నగల వ్యాపారికి... చేతులు మారుతూ మారుతూ విలువ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయింది. కోటీ పది లక్షల రూపాయలు. చాలా చేతులు మారిన ఆ విగ్రహం ఈ ధర దగ్గర వచ్చి ఆగినప్పుడు ఒక బ్యాగ్‌లో అనుకోకుండా పడింది. ఆ బ్యాగ్ స్వాతిది. తన బ్యాగ్‌లో కోట్లు విలువ గల ఒక విగ్రహం ఉన్న విషయం స్వాతికి తెలియదు. సూర్య, భాను, రవి.. ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఏ పని చేసినా కలిసి చేస్తారు. వాళ్లకంటూ ఉన్న ఒక్కటే పని దొంగతనం. జేబులు కొట్టడం, చిన్న చిన్న మోసాలు చేయడం, అప్పటికలా బతికేయడం వాళ్ల పని. వాళ్లకు ఈ దొంగతనాల మధ్యనే, వీళ్లు దొంగలుగా కాకుండా పరిచయమయింది స్వాతి. కొద్దిరోజుల్లోనే స్వాతి ఈ గ్యాంగ్‌లో ఒకరుగా చేరిపోయింది. కాకపోతే, ఈ గ్యాంగ్ చేసే పనులేవీ ఆమెకు తెలియదు. సూర్య వాళ్లింటి పక్కనే ఉండే ఒక అనాథ పిల్లాడికి చదువు చెప్పేంత దగ్గరైపోయింది స్వాతి ఈ గ్యాంగ్‌కి. సూర్య అంటే ఆమెకు ప్రేమ కూడా. అలాగే సూర్యకూ. ఇద్దరిదీ మంచి జోడీ. స్వాతితో ప్రతిపూటా ఫోన్లో బిజీగా గడిపేస్తోన్న సూర్యను చూస్తూ, ‘‘వీడు ఈ మధ్య పని మానేసి ఈ పన్లో పడ్డాడు.’’ అన్నాడు రవి. అవునంటూ భాను కూడా సూర్యకు చిన్న వార్నింగ్ ఇచ్చింది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్య ఇంటి పక్కనుండే పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే గట్టిగా అరుస్తూ చెప్పాడు – ‘‘అన్నా! టీవీ పెట్టన్నా’’. అందరూ టీవీ ముందు వాలిపోయి న్యూస్ చూస్తున్నారు. కేరళలోని విష్ణు దేవాలయంలో వినాయకుడి విగ్రహం చోరీకి గురైందన్న వార్త అన్ని చానళ్లలో ప్రధానంగా వినిపిస్తోంది. పిల్లాడు ఈ న్యూస్ ఎందుకు చూపిస్తున్నాడో సూర్యకు అర్థం కాలేదు. వాడి వైపు చూస్తూ, ‘‘ఏంట్రా!’’ అనడిగాడు. ఆ పిల్లాడు మెల్లిగా, జాగ్రత్తగా తన జేబులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసి చూపించాడు. ‘‘ఎక్కడిదిరా నీకు?’’ అడిగింది భాను. పిల్లాడు తాను ఆ విగ్రహాన్ని స్వాతి బ్యాగులో కాజేసినట్టు చెప్పాడు. సూర్య ఆ విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తీక్షణంగా పరీక్షించి, ‘‘అమ్మేద్దాం!’’ అన్నాడు. ‘‘దేవుడితో వ్యాపారమా? రిస్కేమోరా..’’ అన్నాడు రవి. ‘‘రిస్కేంటిరా! యాజిటీజ్ ఒరిజినల్ లాగానే ఉంది. అమ్మితే ఎంతో కొంత వస్తుంది.’’ అన్నాడు సూర్య. దాన్ని కొనగలిగే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. సాలర్జంగ్ శంకర్‌ను పట్టుకున్నారు.శంకర్ఇలాంటి వెలకట్టలేని వస్తువులను కాజేసో, కాజేసిన వాళ్ల దగ్గర్నుంచి తక్కువకు కొనో దందా నడిపిస్తుంటాడు. అదే అతని వ్యాపకం. సూర్య గ్యాంగ్ శంకర్ ఇంట్లో ఉన్నారు. ‘‘విగ్రహం?’’ అడిగాడు శంకర్.సూర్య తన జేబులోంచి విగ్రహాన్ని తీసి శంకర్ చేతుల్లో పెట్టాడు. ఆ సమయానికి అక్కడున్న ఎవ్వరికీ ఆ విగ్రహం ఎంత విలువ చేయగలదన్న దానిమీద అవగాహనే లేదు. ఆ విగ్రహాన్ని పరీక్షగా చూసిన శంకర్, ‘‘ఒక్క నిమిషం..’’ అంటూ దాన్ని తన వాళ్లకు చూపించడానికి లోపలికి తీసుకెళ్లాడు. తమ దగ్గరున్న కెమికల్స్‌తో విగ్రహాన్ని పక్కాగా టెస్ట్ చేయించాడు. ‘‘నా అరవై ఏళ్లసర్వీస్లో ఇంత విలువైన విగ్రహాన్ని చూడటం ఇదే మొదటిసారి.’’ అన్నాడు శంకర్ గ్యాంగ్‌లోని ఓ పెద్దాయన. ‘‘ఎంతకి అమ్మొచ్చు?’’ అడిగాడు శంకర్. ‘‘పది కోట్లకు పైనే సార్!’’ అన్నాడు ఆ పెద్దాయన. శంకర్‌కు ఎక్కడిలేని ఉత్సాహం వచ్చింది. ఒక ఐదు కోట్లు రెడీ చేస్కోమని తన వాళ్లకు చెప్పి, సూర్య గ్యాంగ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ‘‘ఎంత కావాలో చెప్పండి?’’ అడిగాడు శంకర్. ‘‘మీరే చెప్పండి..’’ అన్నాడు సూర్య. మూడు అన్నాడు శంకర్. ఏడు అన్నాడు సూర్య. చివరకు ఐదుకు ఫిక్స్ చేసుకున్నారు. ఐదు కోట్ల రూపాయల బ్యాగ్‌ను వాళ్లకు ఇచ్చేయమంటూ సైగ చేశాడు శంకర్. సూర్య, రవి, భాను ఎగై్జటింగ్‌గా డబ్బులు అందుకోవడానికి ఎదురుచూస్తున్నారు. రవి అప్పుడే టైమ్ చూస్కొని, ‘‘ఆగండి. ఏం లేదు కొంచెంపెద్ద అమౌంట్ కదా.. ఐదు నిమిషాలు పోతే రాహుకాలం అయిపోతుంది. అప్పుడు తీస్కుంటే బాగుంటుందని..’’ అన్నాడు. ‘‘ఏంట్రా నీ ఎదవ చాదస్తం..’’ విసుక్కున్నాడు సూర్య. ‘‘ఏ.. ఐదు లక్షల కోసం ఐదు నిమిషాలు ఆగలేవా? చచ్చిపోతావా?’’ విసుగ్గానే చెప్పాడు రవి. శంకర్ వీళ్లిద్దరి మాటల్ని వింటూ షాకింగ్‌గా చూస్తూండిపోయాడు. ‘‘ఐదంటే.. ఐదు లక్షలేగా?’’ అన్నాడు అనుమానంగా. ‘‘ఏ! ఐదు వేలనుకున్నావా?’’ వెటకారంగా అన్నాడు రవి. ‘‘ఆరు లక్షలని వినిపిస్తేనూ..’’ శంకర్ ఆనందాన్ని దాచిపెడుతూ సమాధానమిచ్చాడు. ‘‘రాహుకాలం దాటేసింది. మీరిచ్చేయండి..’’ అన్నాడు రవి. శంకర్ బ్యాగులోంచి ఐదు లక్షలు తీసి వాళ్ల చేతుల్లో పెట్టాడు. వాళ్లు అంతసేపూ బేరమాడింది కోట్ల రూపాయలకని, వాళ్లు ఒరిజినల్లా ఉందని తెచ్చిచ్చిన వినాయకుడి విగ్రహం నిజంగానే ఒరిజినల్ అని అప్పటికి సూర్య గ్యాంగ్‌కి తెలియదు. -
‘జబర్దస్త్’ బృందం సభ్యుల సందడి
సిరికొండ(నిజామాబాద్ రూరల్): మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో జబర్దస్త్ బృందం సభ్యులు వినోద్(వినోదిని), జీవన్‌లు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించని కామెడీ షోతో ఆహూతులను అలరింపజేసింది. విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. వారి కామెడీకి, నృత్యాలకు విద్యార్థులు ఈలలు, చప్పట్లతో కేకలు పెట్టారు. వారితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఎగబడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బాశెట్టి లింబాద్రి, ఎంపీడీవో చందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట రాజన్న, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, రావుట్ల ఎంపీటీసీ సభ్యుడు ఎర్రన్న, సర్పంచ్‌లు సంజీవ్, రాజేశ్వర్, జాగృతి మండల కన్వీ నర్ కుందేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
లాఫ్టర్ పంచ్
ఆడపిల్లలు నవ్వితే ‘ఏంటా నవ్వు’ అని హద్దులు పెడుతుంది లోకం. కాని ఈ ఆడపిల్లల విషయంలో ‘ఇంకో జోకు చెప్పవా’ అని బతిమిలాడుతోంది లోకం. స్టాండప్ కామెడీలో మగవాళ్లే కనిపిస్తుంటారు ఎక్కువగా. కాని మేమూ తక్కువ కాదు అని ముందుకు వచ్చారు ఈ ఐదుగురు. సుముఖి సురేష్, కనీజ్ సుర్కా, మల్లికా దువా, అదితీ మిట్టల్, పుణ్యా అరోరాలు... పొట్ట చెక్కలు చేయడానికి మగవాళ్లే అయి ఉండక్కర్లేదు అని నిరూపిస్తున్నారు. వీళ్లను చూస్తే నవ్వు నాలుగు విధాల రైటు అనిపిస్తుంది. సుముఖి సురేష్ ‘పుష్పవల్లి’ అనే తమిళ క్యారెక్టర్‌తో ఫేమస్ అయిన కమెడియన్ సుముఖి సురేష్. తన సృష్టించిన క్యారెక్టర్ పుష్పవల్లి లాగే సుముఖి కూడా తమిళియన్. కాని పెరిగింది నాగ్‌పూర్‌లో. చైన్నైలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే థియేటర్ పట్ల ఆసక్తి పెంచుకుంది. కాలేజ్ ఫెస్టివల్స్‌లో నాటకాల్లో నటించేది. డిగ్రీ అయిపోయాక బెంగళూరులోని ఓ ఫుడ్ ల్యాబరేటరీలో ఉద్యోగం రావడంతో బెంగుళూరు వెళ్లింది. 2013లో అక్కడే ‘ది ఇంప్రూవ్’ అనే తన తొలి కామెడీ షోను ప్రదర్శించింది. దానికి వచ్చిన రెస్పాన్స్‌తో ఆమె కెరీర్‌నే మార్చేసుకుంది. ఓ రెండేళ్లు ఇటు ఉద్యోగం, అటు కామెడీ షోలు నిర్వహిస్తూనే 2015లో ఉద్యాగానికి రాజీనామా చేసి కామెడీనే ప్రొఫెషన్‌గా ఎంచుకుంది. తన జీవితం స్ఫూర్తిగా పుష్పవల్లి అనే క్యారెక్టరును క్రియేట్ చేసి అదే పేరుతో యూట్యూబ్ షోను మొదలుపెట్టింది. ‘ఉద్యోగం మానేసి స్టాండప్ కామెడీని వృత్తిగా స్వీకరిస్తుంటే మీ పేరెంట్స్ ఏమన్నారు?’ అని ప్రశ్నిస్తే.. ‘మా అమ్మకు మంచి హాస్య చతురత ఉంది. అదే నాకూ వచ్చినట్టుంది. అందుకే నేను స్టాండప్ కమేడియన్‌గా అవతారమెత్తున్నానని తెలియగానే చిరునవ్వుతో నన్ను బ్లెస్ చేసింది. బహుశా నాలో తనను చూసుకోవాలనుకుందేమో’ అంటుంది సుముఖి నవ్వుతూ. ప్రస్తుతం ముంబైలో ఉంటూ ‘బెటర్ లైఫ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సుముఖి. ‘మీరు మహిళ అయినందువల్ల మీ హాస్య చతురతకు ఏమైనా పరిమితులు ఉంటాయా?’ అన్న ప్రశ్నకు ‘ఆకాశమే హద్దు. నేను జోక్ వేయని అంశమేదీ లేదు. అయితే మగవాళ్ల కన్నా మేం కచ్చితంగా డిఫరెంటే. హాస్యం పట్ల వాళ్ల అప్రోచ్ వేరు. మా అప్రోచ్ వేరు. మాది సున్నతిమైన హాస్యం. మగవాళ్లు హాస్యం పేరిట మానవసంబంధాలను, మనుషులను ఓ ఫ్రేమ్‌లో పెడ్తారు. కాని మహిళలు అలా కాదు. ఒక విషయాన్ని అన్ని కోణాల్లో చూసి, ఆలోచించి ఎవరినీ నొప్పించకుండా ప్రెజెంట్ చేస్తారు. ఎందుకంటే బేసిక్‌గా స్త్రీలు సున్నిత మనస్కులు కాబట్టి’ అంటుంది సుముఖి. పుణ్య అరోరా పుణ్య అరోరా ఒక టీచర్, ఫొటోగ్రాఫర్, స్టాండప్ కమేడియన్. ఒక్కమాటలో ఆమె ఒక ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ పంజాబీ అమ్మాయి ఎంబీఏ కంటే ముందు తన హాబీ అయిన ఫొటోగ్రఫీలో పీజీ డిప్లమా చేసింది. ఆ తర్వాత అదే ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేసింది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీతోపాటు కామెడీని ఎంజాయ్ చేసేది చిన్నప్పటి నుంచి. అమ్మతో కలిసి కామెడీషోస్కు వెళ్లడం, ఆన్లైన్లో చూడటం చేసేది. ‘సరదా కోసం కామెడీని చూసేదాన్ని కాని ఏరోజూ అనుకోలేదు తర్వాత అదే నాకు సీరియస్ కెరీర్ అవుతుందని’ అంటుందిప్పుడు పుణ్య. ‘నా వరకు నాకు హాస్యానికి సంబంధించి స్పెసిఫిక్‌గా ఈ అంశం అంటూ ఏదీ ఉండదు. ఏదీ ఫన్నీగా అనిపిస్తే దాన్నే సబ్జెక్ట్‌గా తీసుకుంటా. అవి నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియెన్సెస్ కూడా కావచ్చు’ అంటుంది. ఫీమేల్ స్టాండప్ కమేడియన్స్ పట్ల ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అడిగితే... ‘స్టాండప్ కమేడియన్స్గా ఆడవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా ప్రేక్షకుల్లో ఒకరకమైన కుతూహలం ఉంటుంది. కానీ... ఆడ అయినా మగ అయినా ఒక కమేడియన్‌గా నువ్వు ఆడియెన్స్‌ను ఎంత నవ్విస్తున్నావనే అంశం మీదే వాళ్ల ఆదరణ ఆధారపడి ఉంటుంది. నవ్వించడమే కమేడియన్ క్వాలిటీ. దీనికి జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదని నా ఉద్దేశం’ అని చెబుతుంది పుణ్య అరోరా. అదితి మిట్టల్ ఇండియన్ స్టాండప్ కామెడీ సీన్ మీద అదితి మిట్టల్ కూడా ఫస్ట్ ఫీమేల్ కమెడియనే. అంతేకాదు ‘ఫూల్స్ గోల్డ్ అవార్డ్’, ‘రిప్పింగ్ ది డికేడ్’లలో నటించిన టాప్ స్టాండప్ కమేడియన్స్‌లో ఆమె ఒకరు. పుణెలో పుట్టిపెరిగిన అదితి యూకేలోని రాక్స్టన్ కాలేజ్‌లో డ్రమెటిక్ లిటరేచర్ చదివింది. అక్కడే కొంతకాలం పాటు పని చేసిన ఆమె తిరిగి ఇండియా వచ్చేసింది. 2009లో ఆల్ ఇండియన్ స్టాండప్ షోలో పాలుపంచుకుంది. ఆమె షోలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. దేనిమీదైనా హాస్యం పండించగలదు. హాస్యంతో స్త్రీ సమస్యల మీద సమాజాన్ని చైతన్యం చేస్తోంది. మనుషులు, వాళ్ల ఆకారాలు, కులాలు, మతాల వంటి జోలికి పోకుండా మనుషుల నైజం, సమాజం తీరుతెన్నుల మీద వ్యంగ్యాన్ని గుప్పిస్తుంది, హాస్యాన్ని పండిస్తుంది. ‘మార్వాడీల పిసినారితనం మీద, మాయావతి లావు మీద జోకులు వేయడం హాస్యం కాదు. మనుషుల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి వాళ్లను దగ్గర చేయడమే హాస్యం ఉద్దేశం’ అంటుంది అదితి మిట్టల్. మల్లికా దువా ‘మేకప్ దీదీ’గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలా ఫేమస్ మల్లికా దువా. సరోజినీ నగర్ ఎడిషన్ అనే యూ ట్యూబ్ వీడియో కూడా ఆమెకు ఎనలేని అభిమానులను సంపాదించి పెట్టింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన మల్లికా ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కూతురు. తల్లి పద్మావతి డాక్టర్. మల్లికా విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. పెన్సిల్వేనియా రాష్ట్రం, ల్యాన్కాస్టర్లోని ఫ్రాంక్లిన్ అండ్ మార్షల్ కాలేజ్‌లో చదివింది. చిన్నప్పట్నుంచీ హాస్యాన్ని ఇష్టపడే మల్లిక అడ్వర్టయిజింగ్ రంగంలోకి వచ్చింది. కాని ఎంతో కాలం నిలవలేక మళ్లీ నవ్వుల మీదే మనసు పారేసుకొని ఫన్నీ డబ్స్మాషెస్, స్నాప్‌చాట్ వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇది పేరుతో పాటు ఆదాయాన్ని తీసుకురావడంతో దీన్నే కెరీర్‌గా ఖాయం చేసుకుంది మల్లికా దువా. కనీజ్ సుర్కా సీఎన్ఎన్ – ఐబిఎన్ చానెల్లో ‘ది వీక్ దట్ వజన్ట్’ షో చూస్తున్న వాళ్లెవరకైనా తెలుస్తుంది కనీజ్ సుర్కా ఎవరో. సైరస్ బ్రొవోచా, కునాల్ విజయ్కర్లతో కలిసి సమకాలీన రాజకీయాల మీద వ్యంగ్యపూరితమైన షోలు చేస్తుంటుంది. ‘ఇంప్రొవైజేషన్’లో దిట్ట. సౌత్ ఆఫ్రికాలో పుట్టిపెరిగిన ఆమె స్కూల్, కాలేజ్ చదవులన్నీ అక్కడే పూర్తి చేసింది. వీళ్ల కుటుంబం సౌత్ ఆఫ్రికాలో ఉంటే మిగిలిన బంధువులంతా ముంబైలో ఉండేవాళ్లు. దాంతో ప్రతి యేడాది ముంబైకి వచ్చే కనీజ్ యూనివర్సిటీ చదువు తర్వాత 2005లో ముంబైకి పూర్తిగా వచ్చేసింది. ఓ యేడాది గడిపి తర్వాత మళ్లీ వెళ్లి ‘లా’లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేయాలనుకుంది. కాని తిరిగి వెళ్లనేలేదు. కామెడీకి కనెక్ట్ అయిపోయి ఇక్కడే స్థిరపడింది. మొదట థియేటర్లో పని చేసింది. రెండేళ్లు గడిచాక ఇంప్రొవైజేషన్ కళను ఇంకా బాగా నేర్చుకోవాలనిపించింది ఆమెకు. దాంతో ఇంప్రూవ్ కామెడీ చదవడం కోసం న్యూయార్క్ వెళ్లింది. ముంబై వచ్చాక ఇంప్రూవ్ కామెడీ షోలు చేయడం మొదలుపెట్టింది. 2007లో పెళ్లయింది. అప్పటికీ కామెడీని కెరీర్‌గా తీసుకోవాలనే సీరియస్‌నెస్ లేదు ఆమెకు. ఏదో చేయాలనే తపన మాత్రం ఉండేదట. కొన్ని కారణాల వల్ల 2011లో భర్తతో విడిపోయింది కనీజ్. చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆఫ్రికా వచ్చేయమని తల్లిదండ్రులు, స్నేహితులు కోరినా వెళ్లలేదు. ఇక్కడే ఏదో ఒకటి సాధించాలి అని నిర్ణయించుకొని అప్పటి నుంచి స్టాండప్ కామెడీ మీద దృష్టి పెట్టింది కనీజ్. అలా స్టాండప్ కమేడియన్‌గా మారిపోయింది. ‘స్టాండప్ కామెడీ అంటే మగవాళ్ల రాజ్యం అంటారు చాలామంది. కాని ఓ మహిళగా ఈ రంగంలో నేను ఎలాంటి వివక్షనూ ఎదుర్కోలేదు. ఫీమేల్ కమేడియన్‌గా నేను కోల్పోయిన అవకాశాలూ లేవు. కమేడియన్ కమ్యూనిటీ అంతా చాలా ఓపెన్‌గా, ఫ్రెండ్లీగానే ఉంటుంది’ అని చెప్తుంది కనీజ్ సుర్కా. -
రొమాంటిక్‌గా ఉంటుందనీ...
ఈమధ్యకాలంలో తెలుగులో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినిమాలోని సన్నివేశాలివి. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా సినిమా చూద్దామని థియేటర్‌కి వచ్చింది. టికెట్స్ దొరకలేదు. ఆ అబ్బాయిదీ అదే పరిస్థితి. కానీ బ్లాక్‌లో రెండు టికెట్లు ఉన్నాయి. రెండూ కలిపి కొంటే తక్కువకే వస్తాయి. ఆ అబ్బాయి, వెళ్లిపోతున్న ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్లి, ‘‘హలో!’’ అని పలకరించాడు. ‘‘నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు!’’ అంది ఆ అమ్మాయి, అబ్బాయి వైపు చూడకుండా. ‘‘నాకూ గర్ల్‌ఫ్రెండ్ ఉందీ!’’ అన్నాడు. ‘‘పేరూ?’’ అనడిగింది. ‘‘ఎన్.వెంకటేశ్వరరావు..’’ ‘‘చీ..’’ అని చిన్నగా నవ్వింది. ‘‘వందకే ఆ రెండు టికెట్లూ తీసుకుందామా? యాభై రూపాయలిస్తాను..’’ \ ‘‘ప్రాబ్లమ్ అది కాదు. సినిమా మొత్తం పక్కపక్కనే!’’ చెప్తూ, చెప్పలేక నవ్వింది. ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు. కాసేపటికి ఒప్పుకుంది. ‘‘డబ్బులక్కర్లేదు కానీ.. ఇంటర్వెల్లో నాక్కూడా పాప్‌కార్న్ అండ్ కోక్’’ ఆ అబ్బాయితో మాట్లాడుతూనే పర్స్‌లోంచి డబ్బులు తీసి, బ్లాక్‌లో టికెట్స్ తీసుకుంది. థ్యాంక్స్ అన్నట్టు చూశాడు. మూడు గంటలు గడిచాయి. హాల్లోనుంచి బయటకొచ్చారు. ‘‘సో మీరుండేదీ సీతమ్మధారే కదా?’’ అన్నాడు. అవునంది. ‘‘నేనుండేదీ అక్కడే! మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా!’’ అంటూ సిగ్గుపడుతూ అన్నాడు. ఆ అమ్మాయి, ‘‘పర్లేదు. నే వెళ్తా’’ అంది. మళ్లీ ఏమనుకుందో, వెనక్కి తిరిగి, ‘‘సరే పదా! వెళ్దాం..’’ అంది సిగ్గుపడుతూ. ఆ అబ్బాయి మాత్రం ముందుకు కదలకుండా అక్కడే నిలబడ్డాడు. తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. చెప్పాలనుకుంటున్న విషయం ఎలా చెప్పాలో తెలీట్లేదు. ‘‘మీకో విషయం చెప్పాలి! నాకు బైక్ లేదు. బస్ ఎక్కొచ్చా’’ అన్నాడు. గట్టిగా నవ్వి.. ‘‘మరి లిఫ్ట్ ఎలా ఇస్తానన్నారు?’’ అడిగింది. ‘‘ఏదో!! రొమాంటిక్‌గా ఉంటుందనీ..’’ బదులిచ్చాడు. ఆ అమ్మాయిని చూస్తూ సరిగ్గా నిలబడి మాట్లాడలేకపోతున్నాడు ఆ అబ్బాయి. మొత్తం ఊగిపోతున్నాడు. నవ్వుతూ, సిగ్గుపడుతూ. ‘‘నా స్కూటీ మీద వెళ్దాం.. పదండీ.!’’ అంది. మూడడుగులు వేశాక అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. ‘‘మీ దగ్గర స్కూటీ ఉంటే మరీ.. నా బైక్ ఎందుకు ఎక్కుతా అన్నారు?’’ అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. ఆ అబ్బాయి నవ్వాడు. ఆ అమ్మాయి స్కూటీపై అబ్బాయి, అమ్మాయి వెళుతున్నారు. ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా కూర్చున్నారు. అబ్బాయి ఇక నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అడిగాడు – ‘‘మీరుండేది ఎల్ఐసీ అపార్ట్‌మెంట్సే, నేనుండేదీ ఎల్ఐసీ అపార్ట్‌మెంట్సే. కానీ మీ పేరింకా నాకు తెలీలేదండీ..’’. ‘‘ప్రభావతి..’’ ‘‘నైస్ నేమ్’’ ‘‘ఏం బావుందీ! నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీషా ప్రభావతి’’ చిరుకోపంతో చెప్పింది. తనకు అసలు ఆ పేరే నచ్చదని చెప్పింది ఆ అమ్మాయి. ‘‘అయినా పేరుదేముంది? వదిలేసేయండి..’’ ‘‘నీకో విషయం చెప్పనా? నాకసలు ఏ బాయ్‌ఫ్రెండూ లేడు. ఈ ఊర్లో అయితే ఫ్రెండ్స్ కూడా లేరు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైమ్ వైజాగ్కొచ్చా. అమ్మమ్మ వాళ్లింటికి.’’ ‘‘మాది హైద్రాబాద్. అత్తయ్య వాళ్లింటికొచ్చా. ఈ సెలవులిక్కడే!’’ ‘‘నీక్కూడా గర్ల్‌ఫ్రెండ్ లేదు కదా!?’’ అడిగింది. ‘‘నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?’’ ‘‘ఏం చెప్పినా ఫర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పి చెప్పండి..’’ ‘‘మొన్న మండే వరకూ గర్ల్‌ఫ్రెండ్ లేదండీ.. నిన్న ట్యూజ్‌డే వరక్కూడా గర్ల్‌ఫ్రెండ్ లేదండీ.. ఈరోజు వెడ్నస్డే పొద్దునవరకూ కూడా గర్ల్‌ఫ్రెండ్ .. లే.. దం..డీ..’’ అనేంతలో అపార్ట్మెంట్ వచ్చేసిందని బండి ఆపేస్తూ, ‘‘ఇంక చాలు..’’ అంది ఆ అమ్మాయి. వేసవి సెలవులు అయిపోతున్నాయి. వెంకటేశ్వర్లు, ప్రభావతి... పేర్లు తెలుసుకోవడం దగ్గర్నుంచి, ఇష్టాల్ని పంచుకునేవరకూ, ఆ ఇష్టాలను కలిసి ఆస్వాదించేవరకూ వచ్చేశారు. ఇంక సెలవులు అయిపోతాయనుకునే టైమ్‌లో వెంకటేశ్వర్లు ప్రభావతికి అసలు విషయం చెప్పాలనుకున్నాడు. డిన్నర్‌కి పిలిచాడు. ‘‘ఇంతకీ ఏదో అడగాలన్నావ్?’’ అడిగింది ప్రభావతి. వెంకటేశ్వర్లు చెప్పకుండా జంకుతున్నాడు. ‘‘కమాన్! అడిగెయ్! నేనేమైనా కొడతానా?’’ అంది. వెంకటేశ్వర్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని, ‘‘డూ యూ లవ్ మీ ప్రభా?’’ అనడిగాడు. ‘‘కొడతాను.’’ ‘‘నిజం ప్రభా! నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావ్?’’ ‘‘ఏదొక పేరు పెడితే కానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావ్! అది నిజం. యూ ఆర్ స్పెషల్.. అదీ నిజం. దానికిప్పుడు పేరు పెట్టాలా?’’ ‘‘అంటే నేను జస్ట్ ఫ్రెండ్‌నా?’’ ‘‘పోనీ బెస్ట్‌ఫ్రెండ్ అనుకో!’’ ‘‘ఇప్పుడు మనమేం చేద్దామంటావ్?’’ ‘‘చూద్దాం. టచ్‌లో ఉందాం. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా!’’ వెంకటేశ్వర్లు చాలాసేపు ఏం మాట్లాడలేదు. కొంచెం కోపాన్ని కొనితెచ్చుకొని, ‘‘అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మాకు కొత్తలే! పార్టీలు, పబ్బులూ, షికార్లూ..’’ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉండగానే, ప్రభావతి కోపంగా అక్కణ్నుంచి లేచెళ్లిపోయింది. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. ఆ వెంటనే ఊరు వదిలేసీ వెళ్లిపోయింది.. వెంకటేశ్వర్లుకు కనిపించకుండా. తన ఫోన్ నంబర్ కూడా తెలియనీయలేదు. -
ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!
తెలుగులో సూపర్‌హిట్ కామెడీ సినిమాల లిస్ట్‌లో ఎప్పటికీ స్థానం సంపాదించుకునే సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ ఆద్యంతం నవ్వించే ఈ సినిమాలో, ఉన్న కొన్ని సెంటిమెంట్ సీన్లను కూడా ఎప్పటికీ మరచిపోలేం. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.. నందు ఇల్లంతా సందడిగా ఉంది. ఆమె జీవితం ఒక్కసారే ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇదంతా కాస్తంత భయంగా కూడా ఉందామెకు. ఎవరితోనో ఏదో చెప్పాలని మాత్రం అనుకుంటోంది. కానీ ఎవరు వింటారు? ఎవరికి చెప్పుకుంటుంది? నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. పెళ్లవ్వగానే భర్తతో అమెరికా వెళ్లిపోతుంది. ఇన్ని కొత్త కొత్త సవాళ్లన్నీ ఒక్కసారే మీదపడటంతో ఆలోచనల్లో పడిపోయింది. నందు ఆలోచనలను బ్రేక్ చేస్తూ.. ‘‘ఏంటి నందూ!! ఏంటి అమెరికా కబుర్లూ..?’’ అడిగింది నందు అత్త సుజాత, నిశ్చితార్థం జరిగిన వారానికి ఇంటికి వచ్చిందామె. నందు అత్తపై కోపంగా ఉంది, నిశ్చితార్థానికి రాలేదని. ‘‘నేన్నీతో మాట్లాడను పో!’’ అంది నందు, కోపంగా. అదేరోజు రాత్రి. నందు తన గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది. సుజాత అప్పుడే నందు గదికి వచ్చింది. ‘‘ఏంటి నందూ! ఏం చదువుతున్నావ్?’’ అడిగింది సుజాత. నందు ముఖం తిప్పుకొని మళ్లీ పుస్తకం చదవడంలో పడిపోయింది. ‘‘నాకంటే ఈ పుస్తకం ఎక్కువా నీకు?’’ సుజాత. ‘‘నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారెక్కువా నీకు?’’ ‘‘అది కాదు నందూ..’’ ‘‘నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది..’’ పీకమీద చెయ్యి పెట్టుకొని చెప్పింది నందు. ‘‘ఆరోజు నేనెంత డిజప్పాయింట్ అయ్యానో తెల్సా! ఇప్పుడొచ్చి మళ్లీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు.. చిన్నప్పట్నుంచీ అత్తా అత్తా అని నీ వెనకే తిరిగేదాన్నిగా.. అందుకే నేనంటే లెక్కే లేదు నీకు..’’ నందు మాట్లాడుతూ పోతోంది. సుజాత ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని చూస్తోంది. కళ్లలో నీళ్లు. నందు, సుజాతకు దగ్గరగా వచ్చి, ‘‘అత్తా! నేను నిన్ను హర్ట్ చేశానా?’’ అడిగింది. ‘‘ఊహూ.. నేనే మిమ్మల్నందర్నీ బాధ పెట్టాను. నీకు తెలీదు నందూ.. పెళ్లయితే చాలా మారతాయి. నీకు తెలీదు. పుట్టింటికి వెళ్లాలంటే ఎన్నో పర్మిషన్లు, కారణాలు, సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది.. నా వాళ్లను చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని!’’ సుజాత మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అత్తయ్యా! మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా?’’ అనడిగింది నందు. ‘‘అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు. అలా అని మంచివాడూ కాదు. మొగుడు. అంతే!’’ అత్తమాటలు నందుకి అర్థమైకానట్లు ఉన్నాయి. ఆలోచనల్లో పడింది. ‘‘నా పెళ్లైన ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారైనా నన్ను భోంచేశావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా?’’ ‘‘ఇదంతా మాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు నువ్వు..’’ ‘‘నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు. మర్చిపోయేంత చిన్నవీ కావు..’’ సుజాత మాట్లాడుతూ ఉంటే నందు వింటూ, ఆలోచిస్తూ నిలబడింది. చాలా మాట్లాడింది సుజాత. నందుకి ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. పెళ్లంటే తనకున్న భయాన్ని పెంచలేదు, తగ్గించలేదు ఆ మాటలు. పెళ్లంటే అర్థమయ్యేలా చేశాయి అంతే. ‘‘ఈ పెళ్లిళ్లు ఎందుకు అవ్వాలి? మనం ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?’’ గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది సుజాత. నందు ఆవిడను గట్టిగా హత్తుకొని తనూ ఏడ్చేసింది. నందు, సుజాత పెరట్లో పూలు కోస్తున్నారు. నందు అప్పటికే సుజాతను ఒక ప్రశ్న అడగాలని, అందుకు ఒక మంచి సమయం దొరకాలని చూస్తూంది. ఇదే సరైన సమయం అనుకొని అడిగేసింది.. ‘‘అత్తయ్యా! నువ్వెవ్వరినైనా లవ్ చేశావా?’’ అని. ‘‘పొద్దున్నే నేనే దొరికానా నీకు?’’ సుజాత వెటకారంగా అడిగింది. ‘‘నేను సీరియస్‌గా అడుగుతున్నాను..’’ అంది నందు. సుజాత సిగ్గుపడుతూ, తల పక్కకు తిప్పింది. ‘‘ఆ! చేశావ్లే!!’’ నందు సుజాతను ఆటపట్టించడం మొదలుపెట్టింది. సుజాత నవ్వింది. ‘‘ఎవరు?’’ నందు. ‘‘పేరు తెలియదు. రోజూ నేను కాలేజ్‌కి వెళుతూంటే, సందు చివర ఉండేవాడు.’’ ‘‘ఏం చేసేవాడు?’’ ‘‘చూసి నవ్వేవాడు!’’ ఇద్దరూ నవ్వుకున్నారు. ‘‘అంతేనా?’’ అడిగింది నందు. ‘‘ఏంటి అంతేనా అంటావ్? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెల్సా?’’ నవ్వుతూ సమాధానమిచ్చింది సుజాత. ‘‘తర్వాతా?’’ ‘‘నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. తర్వాతెప్పుడూ సందు చివర అతను కనబడలేదు.. పాపం మంచోడు!’’ ‘‘పిరికోడు.. అందుకే నీ గురించి డాడీకి చెప్పడానికి భయపడి పారిపోయాడు..’’ ‘‘ఆ విషయం ఇంట్లో తెలిస్తే, చాలా గొడవై ఉండేది తెల్సా?’’ ‘‘అసలు చెప్తే కదా! గొడవయ్యేదో లేదో తెలిసేది!!’’ ‘‘నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా?’’ కాదన్నట్టు తలూపి, ‘‘నేనెవర్నైనా ఇష్టపడితే, ధైర్యంగా ఆ విషయం డాడీతో చెప్పేదాన్నీ అంటున్నా..’’ అంది నందు. ‘‘ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!’’ అంది సుజాత గట్టిగా నవ్వుతూ. ఒకర్ని ఇష్టపడే అలాంటి రోజు ఒకటి ముందు రోజుల్లో నిజంగానే వస్తుందని తెలియని నందు, సుజాతతో పాటే నవ్వింది. -
...ఫ్రమ్ బాలీవుడ్!
‘వెరీ గుడ్’ – ఇలాంటి కాంప్లిమెంట్స్ కమ్ తమ టాలెంట్ కేవలం టాలీవుడ్డుకు మాత్రమే పరిమితమైతే ఎలా? బాలీవుడ్డులో కూడా ‘వెరీ గుడ్డు’ అన్పించుకోవాలనే స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ బోల్డంత మంది మనకు కన్పిస్తారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఓ బాలీవుడ్ డైరెక్టర్ టాలీవుడ్డుకు వస్తున్నారు. ఆయనే కునాల్ కోహ్లి. ఆమిర్‌ఖాన్ ‘ఫనా’, సైఫ్ అలీఖాన్ ‘హమ్ తుమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిందీయనే. ఇప్పుడు తెలుగులో సందీప్ కిషన్, తమన్నా జంటగా ఓ రొమాంటిక్ కామెడీను తెరకెక్కించాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్, తమన్నాలు స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ జూన్ మొదటివారంలో మొదలవుతుందని సమాచారం. -
కమెడియన్లుగా మారిన మాజీ క్రికెటర్లు
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్లను తమ బంతులతో బెంబేలెత్తించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్‌లు కమెడియన్లుగా మారారు. 'జియో ఖేలియో పాకిస్తాన్' అనే టెలివిజన్ గేమ్ షో కోసం ఈ మాజీ బౌలర్లు ఇద్దరూ కమెడియన్లుగా మారి ఓ యాడ్‌లో నటించారు. ఈ టీవీ షోలో షోయబ్ హోస్ట్‌గా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బౌలర్లు కలిసి నటించిన వీడియోను షోయబ్ అక్తర్ ట్వీటర్లో పోస్ట్ చేశాడు. అక్రమ్ భాయ్ అద్భుతంగా నటించాడంటూ కితాబు కూడా ఇచ్చాడు. యాడ్‌ను తిలకించిన ట్వీటరాటీలు మాజీ క్రికెటర్లను తెగ పొగిడేస్తున్నారు. బౌలింగ్‌లోనే కాదూ కామెడీలో కూడా ఇద్దరూ ఇద్దరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కేయండి. Our new prom shoot with Bhai saab .. Love the act of Waz Bhai just simply brilliant ... pic.twitter.com/zcuMRthz7S — Shoaib Akhtar (@shoaib100mph) 23 May 2017 -
కామెడీ కార్నర్
బస్సులో ప్రయాణికుడు చాలా సేపట్నుంచి తుమ్ముని ఆపుకోడానికి నానా తంటాలు పడుతున్నాడు. తుమ్మడానికి ఏదో టెక్నిక్ ఉపయోగించి ఆపసాగాడు. పక్కనున్నతను సహనం కోల్పోయి అన్నాడు ‘‘ఎందుకండీ తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు... తుమ్మేస్తే పోతుంది కదా?’’ మొదటతను ‘‘మా ఆవిడ చెప్పింది... ‘మీకు ఎప్పుడు తుమ్ము వచ్చినా నేను నిన్ను గుర్తుచేసుకుంటున్నాను... నువ్వు నా వద్దకు రావాలి అని అర్థం’ అని చెప్పిందండి’’ అన్నాడు ముక్కును నలుపుకుంటూ... ‘‘అయితే ఏంటి... వెళ్ళచ్చుగా...’’ ‘‘ఆవిడ చనిపోయిందండీ...’’ ‘ఈరోజు మన ఇంటికి ఒక ఫ్రెండ్‌ను డిన్నర్‌కు పిలిచాను’ అన్నాడు అప్పారావు తన భార్యతో. ఆమె అగ్గి మీద గుగ్గిలం అయింది. ‘మన ఇల్లు ఏమైనా హోటల్ అనుకున్నావా? నేను చెత్తగా వండుతాననే విషయం నీకు తెలుసుకదా?’ అప్పారావు: తెలుసు భార్య: తెలిసి కూడా మన ఇంటికి ఎందుకు డిన్నర్‌కు పిలుస్తున్నావు? అప్పారావు: కుర్రాడు పెళ్లి చేసుకోవాలని సరదా పడుతుంటేనూ... -
కమెడియన్‌తో లేడీ సూపర్‌స్టార్?
కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హాస్యనటుడు సూరికి జంటగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి సుమారు మూడు కోట్ల వరకూ పారితోషికం పుచ్చుకుంటున్నారట నయనతార. అదేవిధంగా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ మాలీవుడ్ భామతో పెద్దపెద్ద స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపుతున్నా, కాల్షీట్స్ లేవంటూ నో అంటున్న పరిస్థితి. మాయ చిత్రం తరువాత అమ్మడికి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వరుసగా తలుపు తడుతున్నాయి. నిజానికి మాయ చిత్రం తరువాత నయనతార నటించిన ఒక్క లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రమూ తెరపైకి రాలేదు. అయితే కొలైయుధీర్ కాలం, డోర, అరమ్ తరహా చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో డోర చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార కూడా ఇలాంటి కథా చిత్రాల్లో నటించడానికే ఇష్టడడుతున్నట్లు సమాచారం. తాజాగా నవ దర్శకుడొకరు నయనతారకు ఒక కథ వినిపించారట. పూర్తి వినోదభరితంగా సాగే ఆ కథ ఆమెకు విపరీతంగా నచ్చేసిందని సమాచారం. అందులో హీరోగా ప్రస్తుతం హాస్యనటుడిగా బిజీగా ఉన్న సూరి హీరో అని తెలిసినా అందులో నటించడానికి నయనతార సై అన్నట్లు వార్త సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. హాస్య నటుడు సూర్యకు జంటగా నయనతార నటించడానికి సమ్మతించినట్లు జరుగుతున్న ప్రచారం కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది నిలకడ మీదే తెలియాల్సి ఉంది. గతంలో నటి శ్రియ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్‌లో నటించడానికి అంగీకరించి తన మార్కెట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో నయనతార ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రం గురించి అధికారక ప్రకటన వెలువడేవరకూ వేచి చూడాల్సిందే. -
ప్రేమ.. వినోదం
సాంబశివ ఇంద్రగంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ కె.వి. సుందర్ శర్మ ఓ యూత్‌ఫుల్ ప్రేమకథా చిత్రం నిర్మించనున్నారు. కిరణ్మయి మూవీ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్‌తో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రముఖ హీరో, హీరోయిన్ నటించనున్న ఈ చిత్రంలో కథకు అనుగుణంగా ఇతర పాత్రలకు నూతన నటీనటులను ఎంపిక చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయినందు, సంగీతం: నందన్ రాజ్. -
కామెడీ థ్రిల్లర్‌గా సైవ కోమాళి
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సైవ కోమాళి అని ఆ చిత్ర దర్శకుడు సెరేశ్ శాంతారామ్ తెలిపారు. దర్శకుడు ధరణీ, జగన్, బాలుశివన్, శాంతకుమార్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. ఎస్ఎంఎస్.మూవీస్ పతాకంపై ఏసీ.సురేశ్, మహేంద్రన్, సారుుమహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సైవ కోమాళి చిత్రంలో నడువుల కొంచెం పక్కల్తై కానోమ్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్, రెహానా, నాన్‌కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో పవర్‌స్టార్ జీఎం.కుమార్, టీబీ.రాజేంద్రన్, రంజిత్, సూపర్‌గుడ్ లక్ష్మణన్, క్రేన్‌మనోహర్, కృష్ణమూర్తి, టీకే.కళ, గాయత్రి, వనిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కామెడీ థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్న చిత్రం సైవ కోమాళి అని తెలిపారు. ప్రతి మనిషిలో సైకో ఉంటాడు. అమాయకుడు ఉంటారన్నారు. సమాజ తీరును బట్టి ఆ మనిషి ప్రవర్తన ఉంటుందని చెప్పే చిత్రంగా సైవ కోమాళి ఉంటుందన్నారు. అదే విధంగా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దురాగతాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. 108 అంబులెన్స ప్రాధాన్యతను సైవ కోమాళి చిత్రంలో చెప్పనున్నట్లు చెప్పారు. దీనికి కే.బాల ఛాయాగ్రహణ, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇందులోని పాటలను గానాబాలా రాసి పాడటం విశేషం అని దర్శకుడు పేర్కొన్నారు. -
ఢాంపావళి
సినిమాకి ఓ స్టార్టింగ్.. ఓ ఎండింగ్.. ఉంటుంది. మధ్యలో ఉన్న కామాలన్నీ కామెడీలే. హీరో హీరోయిన్లు గొడవపడ్డా.. ప్రేమించుకున్నా.. హీరో విలన్లు తనుకున్నా... కొద్దిగా రిలీఫ్ ఇచ్చే కామాలే కామెడీలు. ఫుల్‌స్టాప్‌కి క్లోజింగ్ ఉంటుందేమో కానీ కామాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇదిగో ఈ రెండు కామాల్లాగా... వాళ్లకు హ్యాపీ దీపావళి.. ‘సాక్షి’ పాఠకులకు హ్యాపీ ఢాం..పావళి. టపాకాయలు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? శ్రీనివాసరెడ్డి : నా వీపు. అదేంటి? శ్రీనివాసరెడ్డి : అవునండీ... మా ఇంట్లో ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య... ఆఖరువాణ్ణి నేను. ఇంట్లో ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా కనపడేది నా వీపే. వంచి టపాటపా ఢాంఢామ్మని కొట్టేసి వాళ్ల పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయేవాళ్లు. అఫ్కోర్స్... నా అల్లరి కూడా ఆ లెవిల్‌లోనే ఉండేదనుకోండి. చెప్పులు వేసుకుంటుంటే చాలు ఎక్కడికి మాయమైపోతానో అని మా అమ్మ హడలిపోతుండేది. అంత బలాదూరు. నేనెంత పాపులర్ అంటే ఊళ్లో అడ్రస్ వెతుక్కుంటూ ఎవరైనా వస్తే అందరూ నన్నే చూపించేవాళ్లు. ప్రతి వీధి నాకు తెలుసు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చినవాళ్లని మీరెళ్లాల్సిన ఇంటివాళ్లకు ఆడపిల్ల వుందా అని అడిగేవాణ్ణి. ఉంది అనంటే పేరడిగేవాణ్ణి. పేరు చెప్పగానే ఆ ఫలానా గోపీ కలర్ మేడ అని టక్కున చూపించేసేవాణ్ణి. ఆడపిల్లలందరూ అంత కంఠోపాఠం. మరి మీ సంగతి ప్రవీణ్ ప్రవీణ్ : టపాకాయలనగానే నాకు సిసింద్రీ గుర్తుకొస్తుంది. దానిని అంటిస్తే సర్రుమంటూ అంటుకుని సర్‌సర్‌మని ఎటెటో పోతుంది. ఒకసారి అంటిస్తే సర్‌మంటూ దారినపోతున్నవాళ్ల పంచెల్లోకి దూరింది. వాళ్లు కంగారుగా జంప్ కొట్టి నన్ను పట్టుకోవడానికి రన్నింగ్ మొదలెట్టారు. మనం దొరుకుతామా? పరార్. దీపావళి అల్లరి ఏదైనా గుర్తుందా? శ్రీనివాసరెడ్డి : లేకేమీ... ఉంది సుయోధనా. అవి ‘రాక్షసుడు’ సినిమా రిలీజైన రోజులు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక తెచ్చిన టపాకాయల్లో అందరికీ అన్నీ పోగా నా మొహాన కొన్ని నేల టపాకాయలు కొట్టారు. అయితే నేను ముందే తెలివిగా ఒక చిచ్చుబుడ్డి దాచిపెట్టుకొని దీపావళి ముగిసి అన్నీ అందరూ తగలెట్టేశారని నిర్థారించుకున్నాక నా దగ్గరున్న చిచ్చుబుడ్డీని చూపిస్తూ ఏడిపించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అని స్టయిల్‌గా హమ్ చేస్తూ ఆ చిచ్చుబుడ్డీ అంటిస్తే... ఇంకేముంది.. ఢామ్ అని పేలింది. ఈ చేయి చూడండి (కుడి చేయి చూపిస్తూ) ఈ వేళ్లకు ఉన్న మచ్చ అప్పుడు పడినదే. ప్రవీణ్: నాకు టపాకాయల కంటే కృష్ణవంశీ సినిమాల్లోలాగా దీపాలను ఇల్లంతా వెలిగించి పెట్టడం ఇష్టంగా ఉండేది. ఒకసారి ఆ దీపాలను వెలిగిస్తూ వాటితోనే ఇంగ్లిష్ ఎస్ లెటర్ వచ్చేలా చేశాను. మా ఫ్రెండ్స్ చూసి ‘స్వప్న’ గురించా ‘సూర్యకుమారి’ గురించా అని అడగడం మొదలుపెట్టారు. కాని నేను పెట్టింది మాత్రం హీరోయిన్ శాంతిప్రియ గురించి. ఆమె నటించిన తొలి సినిమా ‘మహర్షి’ నాకు అట్రాక్షన్. ఆ పోస్టర్లో స్టాప్ బోర్డ్ పట్టుకుని రిషికొండ బీచ్‌లో నిలబడిన శాంతిప్రియ స్టిల్ నా సినిమా రాకకు నాంది. ఆ విషయం తెలుసుకోకుండా మా ఫ్రెండ్స్ అందరూ గోలగోల చేసేసరికి బయటపడటానికి చచ్చే చావొచ్చింది. ఆడపిల్లలని టపాకాయలతో పోల్చవచ్చా శ్రీనివాసరెడ్డి : ఎందుకు పోల్చకూడదండీ? ఇప్పుడు మన రకుల్ ప్రీత్ ఉంది కదండీ. ఏఒన్ తారాజువ్వ. జుమ్ అని దూసుకుపోతోంది. సమంత కలర్ పూల చిచ్చుబుడ్డీ. వచ్చినప్పటి నుంచి స్థిరంగా బ్రైట్‌గా వెలుగుతూనే ఉంది. ప్రవీణ్ : ‘అ... ఆ’ సినిమా షూటింగ్లో అనుపమ పరమేశ్వరన్‌ను గమనించానండీ. బాబోయ్... ఆ అమ్మాయి కాలు నేల మీద అస్సలు నిలవదు. భూచక్రమే అనుకోండీ. సరే. ఇక మీ ఇంటి వెలుగు గురించి చెప్పండి. శ్రీనివాసరెడ్డి : చెప్పేదేముందండీ... మా ఇంట్లో అన్నీ బజాజ్ లైట్లే. అవే మా ఇంటి వెలుగు. అది కాదండీ మీ శ్రీమతి గురించి. శ్రీనివాసరెడ్డి : ఓ ఆ వెలుగా... తను మా సొంత అక్క కూతురే. పేరు స్వాతి. చిన్నప్పుడు ఎత్తుకునేవాణ్ణి. తను గొప్పగా బతకాలని అమెరికా సంబంధం చేసుకోవాలని అనుకుంటే తను నేనే గొప్పవాణ్ణని నన్ను ఎంచుకుంది. టపాకాయ్లలో వెన్నముద్దలు అని ఒక టైప్ ఉంటాయి గుర్తుందా. అలాంటి కోటి వెన్నముద్దల కాంతి తను. మరి మీ సంగతి? ప్రవీణ్ : తను మా కజిన్ ఫ్రెండ్. నాకు ముందు నుంచి తెలుగుదనం ఉన్న అమ్మాయిని చేసుకోవాలని ఉండేది. అలాంటి అమ్మాయే తను. పెద్దలను వెళ్లి మాట్లాడమంటే మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు. నాకో కూతురు. శ్రీనివాసరెడ్డి: నాక్కూడా ఒక కూతురు. చూశావా... మంచివాళ్లకు అంతా మంచే జరుగుతుంది. ఆడపిల్లలే పుడతారు. ఏంటి... మీరిద్దరు మంచివారా? ప్రవీణ్ : సినిమాల్లో హీరో ఫ్రెండ్స్‌గా ఉంటూ హీరో కోసం ఏ మంచికైనా రెడీ కదండీ.. అదన్నమాట. ఈసరదా పక్కన పెడితే ఆడపిల్ల కంటే అద్భుతం ఏముంటుంది. షూటింగ్ నుంచి ఇంటికెళ్లి పాపను చూసుకుంటే ఆ ఆనందమే వేరు. శ్రీనివాసరెడ్డి : బాగా చెప్పావు. నా కూతురును చూసినా నాకు అదే సంతోషం. తను అచ్చు నా పోలిక. ఆన్లైన్ షాపింగ్‌లో రకరకాల వస్తువులు చూస్తూ ఫలానావి కొనండి అని మమ్మల్ని దబాయించేస్తుంటుంది. శ్రీమతి అలిగితే ఎలా సముదాయిస్తారు? శ్రీనివాసరెడ్డి : మా ఆవిడ ఎప్పుడూ అలగదండీ. ఫ్రెండ్స్‌తో ఉన్నా పార్టీలో ఉన్నా మధ్యమధ్య ఫోన్ చేసి విసిగించదు. ఆ విధంగా నేను లక్కీ అని అందరూ అంటుంటారు. ప్రవీణ్: నా భార్య కూడా ఎప్పుడూ అలగలేదండీ. శ్రీనివాసరెడ్డి: అంటే ఇతను పొద్దున్నే లేచి వంటంతా చేసి వచ్చేస్తాడండీ... ఇంకెందుకు అలుగుతుంది (నవ్వులు) ఇల్లు ఇల్లాలు పిల్లలు సరే... మరి ఓ... శ్రీనివాసరెడ్డి: ఓ.. అంటే ఇంగ్లిష్‌లో ఎమ్ ఎన్ తర్వాత వచ్చే ఓ నా... కాదండీ.. ఫ్యాన్సూ... లేడీస్ ఫాలోయింగూ... ప్రవీణ్: (లేచి నిలబడుతూ): బాబోయ్... నేను వెళతాను. ఇదేదో ఇరికించేలా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి: కూచో. ఎందుకు భయపడతావు. చూడండి... మాకు ఓ... లు పి క్యు ఆర్ ఎస్ టిలు తెలియవు. ఎప్పుడైనా కొందరు ఆడవాళ్లు ఫోన్ చేసి ఫలానా రోల్ బాగుందండీ అనగానే థ్యాంక్స్ చెప్పి పెట్టేస్తాం. అంతకు మించి వెళ్లం. ప్రవీణ్: వెళ్తే బతుకుతావా ఏంటి? ఒకవేళ మీరు రకుల్‌ప్రీత్‌కు ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? శ్రీనివాసరెడ్డి: రకుల్ ప్రీత్నా? ప్రపోజా? చేస్తే ఓకే అంటుందా? ప్రవీణ్: అంటే ప్రపోజ్ చేసేద్దామనే? శ్రీనివాసరెడ్డి: అహ... మనకు రకుల్ ఓకే అంటుందా అని డౌటు. ప్రవీణ్: మనకేం తక్కువ. ఓకే అనొచ్చు. ఆ తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో పరిస్థితి ఏంటి. రోటి పచ్చడే. పచ్చడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది చెప్పండి... మీ తిండి సంగతి ఏంటి? శ్రీనివాసరెడ్డి: నేను ప్యూర్ నాన్వెజిటేరియన్నండీ. రొయ్యలు పీక మొయ్యా తింటాను. ప్రవీణ్: నాకు ఉప్పుచేప ఇష్టం. లైఫ్ చప్పగా ఉండకూడదంటే ఉప్పుచేపే తినాలి. సెట్లో మీరు అందర్నీ నవ్విస్తుంటారు కదా. మిమ్మల్ని నవ్వించేది ఎవరు? ప్రవీణ్: కృష్ణ భగవాన్ గారండీ. ఆయన వేసే పంచ్‌లు అదిరిపోతాయి. మొన్నొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావ్రా అని అడిగారు. షూటింగ్లో గురూజీ అన్నాను. చూడ్డానికి వెళ్లావా చేయడానికి వెళ్లావా అన్నారు. చేయడానికే గురూజీ అన్నాను. ఏమైనా నువ్వు చాలా బిజీ అయిపోయావురా... ఏ సినిమాలో కనిపించవుగాని అని పంచ్ వేశారు. నా పరిస్థితి ఊహించుకోండి. మీరు నవ్విస్తే అస్సలు నవ్వనివాళ్లు? శ్రీనివాసరెడ్డి: హిందీ ఆర్టిస్ట్లండీ... జోక్ చేస్తే అస్సలు నవ్వరు. క్యా బోలా అంటారు. ప్రవీణ్: ఒక్కోసారి అందరితో పాటు పెద్దగా నవ్వేసి ఆ తర్వాత తీరిగ్గా అడుగుతారండీ.. క్యాబోలా అని. {స్కీన్ మీద మీకిష్టమైన కమెడియన్? ఇద్దరూ: ఇంకెవరు బ్రహ్మానందమే. మీకిష్టమైన కామెడీ సినిమాలు? ఇద్దరూ: జంధ్యాల గారివి, ఇవివి గారివి, రాజేంద్రప్రసాద్ గారివీ అన్ని సినిమాలు. హీరోయిన్లలో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న హీరోయిన్? శ్రీనివాసరెడ్డి: సమంత. ప్రవీణ్: శ్రీనివాసరెడ్డి ప్రెజెన్స్ సమంతకు చాలా ఇష్టం. పెంచుకుంటాను వచ్చెయ్ అని బతిమిలాడుతుంటుంది (నవ్వు). శ్రీనివాసరెడ్డి గొప్పతనం ఏమిటంటే తను ఎవరినీ హర్ట్ చేయకుండా నవ్విస్తాడు. హీరోల్లో ఎవరు బాగా జోక్స్ వేస్తారు? శ్రీనివాసరెడ్డి: మహేశ్‌బాబు... ఆయన కట్ చేసే జోకులు... మంచి మూడ్‌లో ఉండాలేగాని అందరినీ కూచోబెట్టుకుని ఒకటే జోకులు వేసి నవ్వుతాడాయన. ఆ మహేశ్‌బాబుని చాలా తక్కువ మందే చూసి ఉంటారు. హీరోల్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ప్రవీణ్: రవితేజ, సునీల్ శ్రీనివాసరెడ్డి: తారక్‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాణ్ణి. ఆయన పెళ్లయ్యాక తరచూ కలవడం తగ్గింది. మీ ఇద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఇద్దరూ: చాలా చేశామండీ. మొన్నటి ప్రేమమ్‌లో కూడా ఉన్నాం. ప్రవీణ్: రాబోయే ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కలిసి చేశాం. అందులో శ్రీనివాస రెడ్డి హీరో. ‘అవును’ ఫేమ్ పూర్ణ హీరోయిన్. నేను తత్కాల్ అనే క్యారెక్టర్ చేశాను. ఒక కరీంనగర్ అబ్బాయికి కాకినాడ అమ్మాయికి మధ్య సాగే అందమైన ప్రేమ కథ అది. భాగ్యరాజా స్టయిల్లో ఉంటుంది. మీ ఇద్దరి యాక్టింగ్‌లో కామన్ ఎలిమెంట్ ఏమిటి? శ్రీనివాసరెడ్డి: డైలాగ్ ఎంత వేగంగా చెప్పినా అక్షరం అక్షరం రిజిస్టర్ అవుతుంది. పెద్ద డైలాగ్ కూడా ఇబ్బంది లేకుండా చెప్తాం. ఆరోగ్యానికీ యోగా ఏమైనా... శ్రీనివాసరెడ్డి: ఓ ఎందుకు చేయనండీ. పేకాట ఆడతానండీ. 52 కార్డ్స్‌ని గుర్తు పెట్టుకుని అరేంజ్ చేసుకోని... అబ్బో చాలా ధ్యానంతో ముడిపడిన సంగతండి అది. ప్రవీణ్: నేను నడుస్తానండీ. మా మధురా నగర్లో వాకింగ్ చేస్తాను. మాకు బోర్ కొడితే సినిమా హాలుకి వెళతాం. మరి మీకు? శ్రీనివాసరెడ్డి: ఇక్కడే హైదరాబాద్‌లో ఉన్న మా చిన్నక్క ఇంటికి వెళతానండీ. ఫ్యామిలీని తీసుకుని ఊళ్లకెళ్లడం అలాంటివి చేయను. మా వాళ్ల ఇళ్లే నాకు పెద్ద రిలాక్సేషన్. ప్రవీణ్: మా అంతర్వేదికి పదహారు కిలోమీటర్ల దూరంలో కేసినపల్లి అనే ఊరు ఉందండీ. అక్కడికెళ్లిపోతాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికెళితే 24 గంటలూ కామెడీయే. ఫైనల్‌గా దీపావళికి మీరిచ్చే మెసేజ్ ఏమిటి? శ్రీనివాసరెడ్డి: ఎంత కష్టమొచ్చినా ఏడవకుండా కాకరపువ్వొత్తుల్లా నవ్వుతూ ఉండమనే. ప్రవీణ్: చీకటి తర్వాత వెలుగు వస్తుందండీ. ఇంత పెద్ద అమావాస్యను మనం దీపాల వెలుగుతో ఓడిద్దామని అనుకుంటాం. ఆ ఆశ ఆత్మవిశ్వాసం ముఖ్యమండీ. అవి ఉంటే లైఫ్ హ్యాపీనే. ధ్యాంక్యూ.. హ్యాపీ దీపావళి. ఇద్దరూ: సాక్షి పాఠకులందరికీ హ్యాపీ దీపావళి. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది? శ్రీనివాసరెడ్డి: అది నిజంగా విచిత్రం అండి. ఈ కథ జేడీ చక్రవర్తిగారి దగ్గరకు వెళ్లింది. ఆయన్ను నేను పర్సనల్‌గా ఎప్పుడూ కలిసింది లేదు. నా సినిమాలు చూసి ఉంటారు కాబట్టి, ఈ కథ నాకైతే బాగుంటుందనుకున్నారట. అలా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నవ్వుల దివాలీ
-
ఆంగ్ల త్రైమాసిక పత్రికకు రచనలు ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆంగ్ల భాషోపాధ్యాయ సంస్థ(ఎల్టా) ఆధ్వర్యంలో అక్టోబర్‌లో ఆంగ్లభాషా త్రైమాసిక పత్రికను విడుదల చేయనున్నట్లు ఎల్టా జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వ్యాసాలు, కథలు, కవితలు, హాస్యం, బాల సాహిత్యం, కార్టూన్లతోపాటు తమకు నచ్చిన అంశాలపై ఆంగ్లలో రచనలను ఆహ్వానిస్తున్నట్లు పే ర్కొన్నారు. రచనలను eltambnr@gmail.com మెయిల్‌కు పంపించాలని, వివరాలకు సెల్ నెం : 9885031043ను సంప్రదించాలని కోరారు. -
ప్రేమంటే... పందెమా?
హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - హౌ టు లూజ్ ఏ గై ఇన్ టెన్ డేస్ ‘ప్రేమలో పడటానికి ఓ టైమ్ ఉన్నట్లే - అందులో నుంచి బయటపడటానికి ఓ టైమ్ ఉంటుంది. అది మళ్లీ మళ్లీ దొరకదు’ అంటాడు హీరో రామ్‌చరణ్... నేను రాసిన ‘ఆరెంజ్’ సినిమాలో. ఇవ్వాళా రేపూ ప్రేమలో పడటం ఎంత సులభంగా, వేగంగా జరిగిపోతుందో - విడిపోవటం కూడా అంత ఫాస్ట్‌గా జరిగిపోతుంది. విదేశాల్లో మరీనూ. ఓ అబ్బాయిని 10 రోజుల్లోనే ప్రేమలో పడేసి, అతనితో విడిపోతానని అమ్మాయి చాలెంజ్ చేస్తుంది. కాని నిజమైన ప్రేమలో నుంచి అంత త్వరగా బయటికి రాగలమా? హాలీవుడ్లో కథలు వండరు, రాస్తారు - వెదుకుతారు. అన్నింటినీ మించి నిజ జీవిత చరిత్రల నుంచి, వాస్తవ సంఘటనల నుంచి, కథల నుంచి, నవలల నుంచి సినిమాకి అవసరమైన సబ్జెక్ట్‌లు అన్వేషిస్తుంటారు.అలా ఓ కార్టూన్ బుక్‌లో నుంచి పుట్టిన కథే ‘హౌ టు లూజ్ ఏ గై ఇన్ టెన్ డేస్’. మైఖేల్ అలెగ్జాండర్, జెన్నీలాంగ్ రాసిన ఓ కార్టూన్ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆండీ ఆండర్సన్ ఓ మహిళా పత్రికలో కాలమిస్ట్‌గా పనిచేస్తుంటుంది. ఆడవాళ్లకి ఉపయోగపడే అంద చందాల చిట్కాలు, వంటల వివరాలు రాసి రాసి విసుగు వస్తుంది. మతం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు... ఇలాంటి విషయాల మీద ఆర్టికల్స్ రాయాలని ఆండీ ఉబలాటం, ఉత్సాహం. అనుకోకుండా ఆండీ స్నేహితురాలు మిబిల్లా తన బోయ్‌ఫ్రెండ్‌తో విడిపోతుంది. బ్రేకప్ అనేది నిజానికి మనసుకి బాధ కలిగించే విషయం. అలాంటిది ఇంత రొటీన్ అయిపోయిందేంటా అనే బాధతో, ఆలోచనతో ఆండీ, ‘హౌ టు లూజ్ ఏ గై ఇన్ టెన్ డేస్’. ‘పది రోజుల్లో ప్రేమికుణ్ని వదిలించుకోవడం ఎలా?’ అనే ఆర్టికల్ రాయాలని అనుకుంటుంది. ఒక అబ్బాయిని ప్రేమలో పడేసి, వాడిచేత పొరబాట్లు చేయించి, కేవలం పది అంటే పది రోజుల్లో - ఆ ప్రేమకి, అతనికి గుడ్‌బై చెప్పాలి. ఆ అనుభవాలతో తను చేసే పత్రికకి ఇదే టైటిల్‌తో మంచి ఆర్టికల్ రాయాలి.ఓ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేసే బెంజిమిన్ బారీకి తనని చూస్తే ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుందని ధీమా. పది రోజుల్లో ఓ అమ్మాయిని పడేస్తానని చాలెంజ్ చేస్తాడు. అది కాని జరిగితే - వజ్రాల ప్రకటనలు అతనికే అప్పగిస్తుంది యాడ్ ఏజెన్సీ. అదీ పందెం. ఆండీ, బెంజిమిన్ - తమ అసలు ఉద్దేశాలు బయటపడనివ్వకుండా, ప్రేమలో పడతారు (నటిస్తారు). ఆ తర్వాత వారి ప్రేమ నాటకం ఎలా సాగింది, వాళ్లు పనిచేసే కంపెనీలపై ఈ ప్రేమ పర్యవసానం ఎలాంటి ప్రభావం చూపించిది అనేది దర్శకుడు డొనాల్డ్ పెట్రే చిత్రీకరించాడు. కేట్ హడ్సన్, మాథ్యూ, మెక్ కొనాగ్ జంటగా నటించారు.ఇందులోని హీరోయిన్ వాడిన టెక్నిక్స్‌ని అమ్మాయిలు ఇప్పటికీ ఫాలో అవుతుండటం విశేషం. 50 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 175 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. - తోట ప్రసాద్ -
నాట్ ఏ జోక్
కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్ అన్నారు. కామెడీ ఆడకపోతే ఏడ్చిన సినిమాలెన్నో! సినిమాకి రన్ ఉన్నట్లే... కమెడియన్‌కు కూడా రన్ ఉంటుంది. క్లాప్‌లు పడుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అసలు మొదటి క్లాప్ పడటానికే ఎన్ని గడపలు తొక్కాలో! తొక్కాలో, తొక్కించుకోవాలో! ధన్‌రాజ్, షకలక శంకర్ నవ్వించడానికి, కవ్వించడానికి రియల్ లైఫ్ టేకులు ఎన్నో తిన్నారు. అన్ని బొప్పులు కట్టాక.. ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇదిగో ఇలా మీ ముందు కూర్చున్నారు. ధన్‌రాజ్: హాయ్ శంకర్.. ‘రాజుగారి గది’ సినిమాలో ఇద్దరం కలిసి బోల్డన్ని సీన్లు చేశాం. మన కాంబినేషన్లో ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందంటావ్? శంకర్:: ఇప్పుడు చేస్తున్నవే కంటిన్యూ చేస్తే బెటర్ అన్నయ్యా. అప్పట్లో కోట శ్రీనివాసరావుగారు, బాబు మోహన్‌గారు అన్ని సినిమాల్లోనూ తెగ నవ్వించారు. వాళ్లలా మనం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా. ధన్‌రాజ్: కొత్తగా ఏదైనా ట్రై చే స్తేనే కదా మన గొప్పదనం. సీరియస్ పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది? శంకర్:చాలా బాగుంటుంది. ఒక పని చేద్దాం. ప్రభాస్, రామ్‌చరణ్ సినిమాల్లో విలన్లుగా చేద్దాం. అప్పుడు వాళ్ల ఫ్యాన్స్ మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. అది మనకు కొత్తగా ఉంటుంది (నవ్వు). ధన్‌రాజ్: నిన్ను నువ్వు అద్దంలో చూసుకుని ‘వారెవా ఏమి ఫేసు...అచ్చం హీరోలా ఉంది బాసు..’ అనుకుని ఉంటావు కదా. మరి నీకు హీరోగా చేయాలని ఎప్పుడూ అనిపించలేదా? శంకర్: లేదు. నువ్వే హీరోగా మొన్నో సినిమా చేశావ్. ఇప్పుడు ‘బంతిపూల జానకి’ చేస్తున్నావ్. నేను కూడా ఎంటరైతే పేక్షకులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతారన్నయ్యా (నవ్వుతూ). ధన్‌రాజ్:ఏదో నా ఈ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేవి చేస్తున్నా తప్పితే హీరోగా సెటిల్ అవుదామన్న ఉద్దేశం నాక్కూడా లేదు. మహా అయితే ఒక మూడు నాలుగు సినిమాల్లో హీరోగా చేస్తానేమో. కమెడియన్‌గా అయితే మూడొందలు సినిమాలు చేసేయొచ్చు. ఓకేనండి.. ఇప్పుడు మేం (సాక్షి) కొన్ని ప్రశ్నలడుగుతాం..? ధన్, శంకర్: ఏవండీ.. మేమిద్దరం పదో తరగతి పాస్. కొంచెం మా స్థాయికి తగ్గట్టుగా అడుగుతారా (నవ్వులు). ♦ హీరోలు సిక్స్ ప్యాక్ చేయాలి.. మీకా ప్రాబ్లమ్ లేదు కదా... ధన్‌రాజ్: అవునండి. మాలాంటివాళ్లు వర్కవుట్లు గట్రా అంటూ ఇరగబడిపోకూడదు. జిమ్ సెంటర్‌కి వెళ్లి బాగుందా లేదా అని చూసి రావడం బెటర్. ఒకవేళ జిమ్ చేసినా నాకు కండలు రావు. నా జీన్స్ అలాంటివి. శంకర్: సిక్స్ ప్యాక్ లేకపోయినా కొంచెం ఫిజిక్ బాగుండాలండీ. నన్ను చూసి ఏంట్రా.. ఆ పొట్టేసుకుని! కొంచెం బాగుండాల్రా అని ఇద్దరు, ముగ్గురు హీరోలన్నారు. ‘అదేంటండి.. కమెడియన్నే కదా’ అంటే, ‘అయితే ఇలానే ఉండాలని లేదురా... కామెడీ అంటే బాడీతో కాదు.. ఎక్స్ప్రెషన్స్ నుంచి కామెడీ పుట్టాల’న్నారు. అప్పట్నుంచీ కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. ♦ హీరోలకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పైగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. మీకు ఏమీ అనిపించదా? ధన్‌రాజ్: మాకూ ఫేస్బుక్లో ఫాలోయర్స్ ఉన్నారు. ‘ఆ క్యారెక్టర్ బాగా చేశావ్. లవ్ యు’ అని అమ్మాయిలు మెసేజ్‌లు ఇస్తుంటారు. అభిమానంతో వాళ్లలా అంటారు. అది గ్రహించకుండా మేం కూడా ‘లవ్ యు’ అంటే తేడాలొచ్చేస్తాయ్ (నవ్వు). ♦ ధనరాజ్లో మీకు నచ్చిన అంశాలు? శంకర్: మంచివాడు. ఫ్రెండ్స్‌కు ఏదైనా కష్టమొస్తే ఎంత అర్ధరాత్రి అయినా స్పందిస్తాడు. ఒకవేళ తను చేయాల్సిన పాత్ర వేరొకరికి వస్తే ‘సరే.. తను చేస్తాడా.. ఓకే’ అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అందుకే మా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. ♦ కామెడీకి ఓ రూపం ఉందనుకుందాం.. అప్పుడు అది ఆడ అయ్యుంటుందా? మగ అయ్యుంటుందా? ధన్‌రాజ్: నేనైతే అబ్బాయి అనే అంటాను. అబ్బాయి అయితే ఎలాంటి కామెడీ అయినా చేయొచ్చు. అమ్మాయి అయితే హద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది. ♦ పువ్వుల్లో కామెడీగా ఉండే పువ్వు ఏది? ధన్‌రాజ్:మొగలిపువ్వు అండి. ఎందుకోనండి మొగలిపువ్వు అని వినగానే నాకు నవ్వొచ్చేస్తుంది. అందుకని కామెడీ ఫ్లవర్ అంటే నాకు మొగలిపువ్వే. శంకర్: నాకు పువ్వులతో పెద్దగా పరిచయం లేదండి. ధన్‌రాజ్: ఏం తమ్ముడూ.. ఈ మధ్య పెళ్లయ్యింది కదా.. మల్లెపువ్వులు కూడా తీసుకెళ్లవా..? శంకర్: అన్నయ్యా.. సంపేయమాక. ♦ ఫ్రూట్స్‌లో కామెడీగా ఉండేది? ధన్‌రాజ్: సీమచింతకాయలు. అవి అలా వంకర టింకరగాఎందుకుంటాయ్ అనిపిస్తుంది. ఇవి జంతికల్లా ఎలా పుట్టాయ్ అని నవ్వుకుంటాను. శంకర్: అయ్య బాబోయ్.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియదండి. నాకు అన్ని పండ్లూ రుచిగా అనిపిస్తాయి కానీ, నవ్వు తెప్పించేది ఏదీ లేదండి. ధన్‌రాజ్: మనతో నటించేవాళ్లతో కెమిస్ట్రీ సెట్ అయితే దర్శకులు ఇంకా కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య చాలామంది దర్శకులు మాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. శంకర్: త్రివిక్రమ్‌గారితో ‘అ..ఆ’ చేశాను. ఆయన ‘శంకర్... నీకో ఫ్లో ఉంటుంది కదా చేసి చూపించు’ అన్నారు. అంత పెద్ద డెరైక్టర్ కూడా అలా అడిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ♦ శంకర్... మీరు రామ్గోపాల్వర్మగారిని బాగా ఇమిటేట్ చేస్తారు కదా! ఆయన ఎప్పుడైనా మెచ్చుకున్నారా? శంకర్: ‘సత్య-2’ ఆడియో ఫంక్షన్లో ఆయన్ను ఇమిటేట్ చేశాను. సరదాగా నవ్వారు. ♦ అవకాశాలు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడి ఉంటారు? ధన్‌రాజ్: అవునండి. ఇప్పుడు సినిమాల్లో రావడం చాలా ఈజీ. యూట్యూబ్‌లో మనం చిన్న వీడియో పెడితే చాలు బాగుంటే తీసేసుకుంటున్నారు. నేను ‘జగడం’ చేసే టైమ్‌లో ఫొటో పట్టుకుని తిరిగేవాణ్ని. దాని వెనకాల ‘కె.ధనరాజ్’ అని నా పేరు, హైట్, ఫోన్ నెంబర్ రాసుకునేవాడిని. అది కూడా సొంత ఫోన్ నంబర్ కాదు. పీపీ నంబర్. ఇన్కమింగ్ కాల్కి రూపాయి తీసుకునేవాళ్లు. ఇప్పటివాళ్లకి అంత బాధ లేదు. శంకర్ అయితే ‘జబర్దస్త్’తో బాగా ఫేమస్ అయ్యాడు. ♦ మీ ఇద్దరికీ మధ్య జరిగిన గమ్మత్తయిన సంఘటన ఏదైనా.. ధన్‌రాజ్: కెరీర్ కొత్తల్లో శంకర్‌కి నేను 1500 రూపాయలకు సెల్‌ఫోన్ అమ్మా. ఇప్పటికీ రూ.500 బాకీ. మరి.. నా 500 ఎప్పుడు ఇస్తావ్? (శంకర్ తో నవ్వుతూ). శంకర్: చెక్ ఇస్తాన్లే అన్నయ్యా (నవ్వుతూ). ♦ ఇంతకీ మీ కష్టాలు తీరిపోయాయనుకుంటున్నారా? ధన్‌రాజ్: లేదండి. ఏ స్థాయికి వె ళ్లినా దానికి తగ్గ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఇంకా కృష్ణానగర్‌లో మాకన్నా టాలెంటెడ్ కమెడియన్స్ బోల్డంత మంది ఉన్నారు. మా అదృష్టం బాగుండి టీవీలో క్లిక్ అయ్యాం. ♦ స్టూడియో గేటు లోపలికి ఎంటర్ కానివ్వనప్పుడు మనసులో రగిలిపోయారా? శంకర్: రగిలిపోయిన రోజులు చాలా. ఆ మంట ఉండాలి. లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు. ధన్‌రాజ్: కాన్ఫిడెన్స్ పెరగకపోయినా ఫర్వాలేదు కానీ, తగ్గితే మాత్రం ఇంత దూరం రాలేం. స్టూడియో గేటుల దగ్గర ఆపేసినప్పుడు ఏదో రోజు మాకు సలామ్ కొడతారని అనుకునేవాళ్లం. కానీ, ఈరోజు మేం ఆ సలాముల కోసం ఎదురు చూడటంలేదు. మా కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉండటం కోసం అప్పట్లో అలా అనుకునేవాళ్లం. ♦ హీరోల్లా మీకు జోడీ ఉండదు కదా.. బాధగా ఉండదా? శంకర్:ఉంటే బాగానే ఉంటుంది. లేడీ కమెడియన్లు తక్కువ ఉన్నారు. తమిళమ్మాయి విద్యుల్లేఖా రామన్ చాలా బాగా నవ్విస్తుంది. ఇంకా చాలామంది రావాలి. ధన్‌రాజ్: అంటే లేడీ కమెడియన్ జోడీగా ఉండాలనుకుంటున్నాడన్న మాట. చూశారా.. శంకర్ మనసులో ఎంత ఆలోచన ఉందో (నవ్వుతూ). శంకర్:జోడీ అని కాదండి. లేడీ కమెడియన్లు ఉంటే బాగుంటుంది కదా అని. ♦ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలని లేదా? శంకర్: ఇప్పుడో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాం. ధన్‌రాజ్: అవునండీ.. ఆవిడెవరో కాదు.. హాట్ గాళ్ సన్నీ లియోన్. మేమిద్దరం ‘బుర్రకథ’ అనే సినిమాలో చేస్తున్నాం. ఆ సినిమాలోనే సన్నీ లియోన్‌తో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. భలే గమ్మత్తుగా ఉంటాయ్. ♦ ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారా? సెక్యూర్డ్ ప్లేస్‌కి చేరుకున్నారా? ధన్‌రాజ్: ఇంటికి సెక్యూర్టీ పెట్టుకునేంత రేంజ్‌కి ఎదగలేదు కానీ భార్యా కొడుకుని బాగా చూసుకునేంత సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నాను. మొన్నీ మధ్యే ఇల్లు కూడా కొనుకున్నాను. హ్యాపీ అండి. ♦ రియల్‌లైఫ్‌లో ఎవరు బాగా నవ్విస్తారు? శంకర్: నా కన్నా ధనరాజ్ ఎంతమందినైనా నవ్విస్తాడు. ఎదురుగా వందమంది ఉన్నా కంగారు పడడు. ధన్‌రాజ్: నేను మాట్లాడుతూనే ఉంటా. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను సరదాగా ఉండటానికే ఇష్టపడతాను. శంకర్ నాతో కాకుండా ఎవరితోనూ అంతగా కనెక్ట్ కాలేడు. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. కామెడీ చేసే విషయంలో నాకన్నా తనే బెస్ట్. ♦ మీ ఇద్దరిలో ఉన్న సిమిలారిటీస్! ధన్‌రాజ్: ఇద్దరం బుల్లితెర మీద ఫేమస్ అయ్యాం. చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ‘రాజుగారి గది’తో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఒకే ఒక్క తేడా. శంకర్ లావుగా ఉంటాడు...నేను సన్నగా ఉంటా అంతే. ♦ శంకర్ గురించి ఎవరికీ తెలియని విషయం? ధన్‌రాజ్: శంకర్‌లో మంచి చిత్రకారుడు ఉన్నాడు. ఇలా చూసి అలా గీసేస్తాడు. వంట బాగా చేస్తాడు. శంకర్: నాకు వంట బాగానే వచ్చండి. బయటివాళ్లకు అప్పుడప్పుడూ రుచి చూపిస్తుంటాను. వినాయక్‌గారికి, కృష్ణవంశీ గారికీ ఇష్టం. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అప్పుడు పవన్ కల్యాణ్‌గారికి చేపల పులుసు వండి తీసుకెళ్లాను. మూడు రోజుల పాటు తిన్నారు. శంకర్: నాకీ మధ్యే పెళ్లయ్యింది. ఏదో అలా అలా ఎదుగుతున్నాను. కెరీర్, పర్సనల్ లైఫ్ హ్యాపీ. ♦ హీరోలకైతే పెళ్లి సంబంధాలు క్యూలు కడతాయి. మరి కమెడియన్ల పరిస్థితి ఏంటి? ప్రేమ... గట్రా! ధన్‌రాజ్: నాది ప్రేమ వివాహం. వన్ డే లవ్‌స్టోరీ. చూడగానే నచ్చింది. చెప్పేశాను. ఒప్పేసుకుంది. పెళ్లి చేసేసుకున్నాను. శంకర్: నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమలు మనకు సూట్ కావు కూడా. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ♦ మ్యారీడ్ లైఫ్‌లో కామెడీ ఎలా ఉంటుందనుకుంటున్నారు? ధన్‌రాజ్: పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంటుంది. ఇంటికి త్వరగా వెళ్లిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ కూడా అదే అంటున్నాడు. ‘అన్నా నేను ఇంటికి వెళిపోతాను. నా భార్యతో కబుర్లు చెప్పుకుంటా. కాలక్షేపం అవుతుంది’ అని అంటున్నాడు. నేను తొమ్మిదేళ్ల క్రితం ఇదే అన్నా. జీవితాంతం ఎవరూ ఇలా అనరు. చిన్ని చిన్ని గొడవలు, అలకలు ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. సినిమా కోసం నటించి, ఇంటి దగ్గర కూడా నటిస్తే మాత్రం జీవితం కూడా సినిమా అయిపోతుంది. ♦ ఏడ్చినా నవ్వినా కన్నీళ్లొస్తాయి... మీకలాంటి సందర్భాలు ఉన్నాయా? ధన్‌రాజ్: ‘పిల్ల జమిందారు’ సినిమాలో మా నాన్నగారు చనిపోయే సీన్ ఒకటుంది. మా అమ్మ చనిపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు జేబులో అర్ధరూపాయో, రూపాయో ఉంది. ఆవిడ దహన సంస్కారాలు ఎలా చేయాలి? నాకు ఏడపు రాలేదు. భయం వేసింది. డబ్బు సమకూరాక ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మణికొండలో పూడ్చి పెట్టడానికి స్థలం ఇవ్వలేదు. కాలిస్తేనే ఇస్తాం.. ఇక్కడ ప్లేస్ లేదన్నారు. ‘భవిష్యత్తులో నేను డబ్బులు సంపాదించుకుంటాను. సమాధి కడతాను’ అన్నప్పటికీ ఇవ్వలేదు. అంతకు మించిన పెద్ద బాధాకరమైన సంఘటన నా జీవితంలో ఉండదు. అది గుర్తు చేసుకుని ‘పిల్ల జమిందారు’ సీన్ చేశాను. దాంతో సీన్ పండింది. శంకర్: సెట్లో మేం కామెడీ సీన్ ఇరగదీసినప్పుడు హాయిగా నవ్వుకుంటాం. బాగా చేశామనే ఆనందం తట్టుకోలేక కూడా కన్నీళ్లొచ్చేస్తాయ్. ♦ నవ్వు రాని కామెడీ ఉంటుంది.. అలా ఎవరైనా కామెడీ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ధన్‌రాజ్: మేం కూడా అలాంటివి కొన్ని చేస్తుంటాం. జేబ్ శాటిస్ఫేక్షన్ కోసం చేసినప్పుడు ఇలాంటివాటి గురించి ఆలోచించకూడదు. ♦ ఫైనల్లీ కామెడీ లేని సినిమా గురించి చెబుతారా? ధన్‌రాజ్: కామెడీ లేని సినిమా అంటే ఆ సినిమా టైటిలే ‘కామెడీ లేని సినిమా’. కామెడీ లేని సినిమా వేస్ట్ అనను. అది లేకుండా కూడా సినిమా ఆడితే అప్పుడా కంటెంట్ చాలా గొప్పగా ఉన్నట్లు. ‘మనీ మనీ’లో ఎక్స్ట్రార్డినరీ కామెడీ ఉంటుంది. ‘శివ’లో ఉండదు. ఆ రెండూ బాగా ఆడాయి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు కామెడీ లేకపోయినా ఫర్వాలేదు. కామెడీ లేని సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కొంచెం ఉప్పు తగ్గిన సాంబారు ఎలా ఉంటుందో ఆ సినిమా అలా ఉంటుంది. శంకర్:: కామెడీ ఉన్న సినిమా బాగుంటుంది. కథ డిమాండ్ చేయకపోయినా కావాలని కామెడీ పెడితే కామెడీ రాదు. అందుకే, కథకు తగ్గ కామెడీ అయితే బెస్ట్. చివరిగా ఒక్క మాట. మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం. మమ్మల్నిద్దర్నీ కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్ అండి. - డి.జి. భవాని -
వాస్తవ సంఘటన ఆధారంగా...
హైదరాబాద్‌లో 1957లో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వసుదైక 1957’. బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేష్, అదుర్స్ రఘు, షాని, బేబి యోధ ముఖ్య పాత్రధారులు. బాల దర్శకత్వంలో అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఐదేళ్ల పాప జీవితంలో 1957లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీనివాసులు తెలిపారు. -
ప్రహసనంగా ప్రణాళికలు
♦ లక్ష్యాలు బారెడు... ఇచ్చేది మూరెడు ♦ ప్రభుత్వ పథకాలకు ముఖం చాటేస్తున్న ♦ బ్యాంకర్లు శాఖల మధ్య సమన్వయలోపం ♦ కొరవడిన పర్యవేక్షణ ♦ వార్షిక రుణ ప్రణాళికలు కాగితాలకే పరిమితం సాక్షి, విశాఖపట్నం: జిల్లా యంత్రాంగం ప్రకటించే వార్షిక రుణ ప్రణాళికలు ప్రహసనంగా మారుతున్నాయి. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు గాలికొదిలేస్తున్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ ప్రకటనలో జాప్యం.. లబ్ధిదారుల ఎంపికలో శాఖలు చూపించే అలసత్వం.. సబ్సిడీ మొత్తం విడుదలలో ప్రభుత్వం చేసే అలక్ష్యం...అన్నింటి కంటే ముఖ్యంగా బ్యాంకుల నిరాసక్తత లక్ష్యాలను నీరుగారుస్తున్నాయి. కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా బ్యాంకర్లైపై చర్యలు తీసుకునే సాహసం జిల్లా యంత్రాంగం ఏనాడు చేయలేకపోతోంది. దీంతో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. పొంతనలేని కేటాయింపులు: 2014-15లో ఏకంగారూ.7260 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను నిర్దేశిస్తే.. రూ.4895 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1653 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.886 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.5377 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.2197కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1883 కోట్లకు రూ.2699 కోట్ల మేర ఇవ్వగలిగారు. హుద్‌హుద్ దెబ్బతో ఆ ఏడాది దాదాపు అన్ని రంగాలు కుదేలవడంతో లక్ష్యాలను చేరుకోలేక పోయాయని సరిపెట్టుకోవచ్చు. కాని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.8198 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటిస్తే రూ.7880 కోట్ల మేర ఇవ్వగలిగారు. 95 శాతం మేర రుణాలు ఇవ్వగలిగినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలకు మాత్రం లక్ష్యాలకు ఆమడ దూరంలోనే రుణాలివ్వగలిగారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత వ్యవసాయ, అనుబంధ రంగాలు.. వివిధ శాఖలకు ఇవ్వలేదు ఒక్క పంట రుణాలు మినహా.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేనికి లక్ష్యం మేరకు రుణాలివ్వలేదు. వీటితో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, బ్యాంకర్లు నిర్లక్ష్యాన్నే ప్రదర్శించాయి. ఆయా శాఖలకు నిర్దేశించిన యూనిట్లకు కాస్త ఆలశ్యమైనా చాలా వరకు సబ్సిడీ మొత్తాలు విడుదల చేసినప్పటికీ బ్యాంకర్లు నిరాసక్తతనే ప్రదర్శించాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సుమారు రూ.2,150కోట్లు లక్ష్యం కాగా.. రూ.1852 కోట్లు ఇవ్వగలిగారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.75 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా కేవలం రూ.2.87కోట్లు, డెయిరీ యూనిట్లకు రూ.137 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17.30 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక మిగిలిన వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఇదే రీతిలో అరకొరగానే రుణాలు ఇచ్చారు. సంక్షేమ శాఖలదీ అదే తీరు సంక్షేమ శాఖల విషయానికొస్తే ఎస్సీ సంక్షేమ శాఖ కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ పోను రూ.17.92 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.4.11కోట్లు ఇవ్వగలిగారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో కూడా లక్ష్యంలో 50 శాతానికి మించి రుణాలివ్వలేకపోయారు. కానీ ప్రాధాన్యేతర రంగాలకు రూ.2448 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా.. ఏకంగా రూ.3483 కోట్లు ఇచ్చారు. ఎంఎస్ఎంఈలకు రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా. ఏకంగా రూ.1612కోట్లు ఇవ్వగలిగారు. ఇక 2016-17లో ఎప్పటిలాగే 26 శాతం హెచ్చుతో ఏకంగా రూ.10,340 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రెండ్రోజుల క్రితం జిల్లా కలెక్టర్ యువరాజ్ విడుదల చేశారు. ఈసారి లక్ష్యాల మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై క్రిమినల్ కేసులు పెడతానని ఘాటుగానే హెచ్చరించారు. ఈహెచ్చరికలు ఏమేరకు సత్పలితాలనిస్తాయో వేచిచూడాల్సిందే. -
ఇంట్లో దెయ్యం
‘‘మా చిత్రాన్ని చూసినవారు ఓ మంచి సినిమా చూశామని చెప్పుకునేలా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. సరదాగా నవ్వుతూనే ఉంటారు’’ అని దర్శకుడు ఎంవీ సాగర్ అన్నారు. రుద్ర, వెన్నెల జంటగా ఆయన దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వీరీ వీరి గుమ్మడి పండు’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో కథ తయారు చేసుకుని కిరణ్‌కుమార్‌గారికి చెప్పా. ఫ్యామిలీ, హారర్, కామెడీ తరహా చిత్రమిది. నేను, నిర్మాత, హీరో, హీరోయిన్ అంతా కొత్తవాళ్లమే. 63మంది కొత్తవారితో ఈ చిత్రం తెరకెక్కించాం. ఉమ్మడి కుటుంబమున్న ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం ప్రథమార్ధంలో తెలుస్తుంది. ఆ దెయ్యం ఎవరిలో ఉందనేది ద్వితీయార్ధం . ఫేస్బుక్ ద్వారా పరిచయమైన డాక్టర్‌ను హీరోయిన్గా తీసుకున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని తెలిపారు. -
హల్చల్ చేస్తున్న సెల్పీ బ్రహ్మి
హైదరాబాద్: 'కృష్ణాష్టమి' సినిమాలో 'సెల్పీ బర్ఫీ'గా నవ్వించడానికి సిద్ధమవుతున్న కామెడీ స్టార్ బ్రహ్మానందం ఇపుడు ఇంటర్నెట్ లోనూ హల్చల్ చేస్తున్నాడు. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌తో బ్రహ్మి కమెడీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. సిక్స్ ప్యాక్ తో అదరగొట్టి చాలా తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సునీల్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘కృష్ణాష్టమి’ మూవీతో వస్తున్నాడు. కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సునీల్ అందాలరాముడుతో హీరోగా మారాడు. ఆయన తాజా చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఒక ఎన్నారై కథతో, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో సీనియర్ కామెడీ నటుడు బ్రహ్మానందం సెల్పీ బర్ఫీగా మరో కొత్త అవతారంలో అలరించనున్నాడు. 'చేసే ప్రతీ ఎదవ పనీ' ఫేస్బుక్లో పెడితే ఇలాగే ఉంటుందన్న హీరో సునీల్ , బ్రహ్మానందం సంభాషణతో కూడిన ఈ తాజా ట్రైలర్ ఇపుడు హల్ చల్ చేస్తోంది. సెల్ఫీ బర్ఫీ పేరుతో తనకో ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసుకుని, ప్రతీవాళ్లతో సెల్ఫీ దిగి, దాన్ని ఫేస్ బుక్ లో పెట్టి కామెడీని పండించే పాత్రలో బ్రహ్మీ ప్రేక్షకులకు మరోసారి గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సునీల్ సరసన నిక్కీ గార్లాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి జోష్ ఫేం వాసు వర్మ డైరెక్టర్. బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు . ఫ్యామిలీ కథా చిత్రానికి యాక్షన్ అంశాలను కూడా మిక్స్ చేసిన ఈ సినిమా పై సునీల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ మర్యాద రామన్న హీరో ఎంతవరకు ఆకట్టుకుంటాడో తేలాలంటే ఫిబ్రవరి 19 వరకు వెయట్ చేయల్సిందే. -
ప్రేమ, కామెడీ జత కలిసే?
చిత్రం : 'జత కలిసే' తారాగణం : అశ్విన్‌బాబు, తేజస్వి సంగీతం : ఎం.సి.విక్కీ, సాయి కార్తీక్ కెమేరా : జగదీశ్ ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్ నిర్మాతలు : నరేశ్ రావూరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాకేశ్ శశి ప్రయాణంలో పదనిసలు తరహా రోడ్ జర్నీ కథలు తెరపై సుపరిచితమే. ఆ బ్యాక్‌డ్రాప్ తీసుకొని, ప్రేమ, పెళ్ళి, జీవితాశయం లాంటి అంశాలను కలగలిపి కథ అల్లుకుంటే? ఈ ఆలోచనతో చేసిన యత్నం- ‘జత కలిసే’. అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతుంటాడు ఋషి (అశ్విన్ బాబు). అతను తన స్నేహితుడి పెళ్ళి కోసం వైజాగ్ వస్తాడు. తీరా అక్కడ పెళ్ళికొడుకుతో తాగుడు పందెం కట్టి, ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణమవు తారు - హీరో, అతని ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో అమెరికా తిరుగు ఫ్లైట్ ఎక్కడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ట్యాక్సీలో బయలుదేరతాడు హీరో. వైజాగ్‌లోనే సూర్య (సూర్య) దంపతుల కూతురు తేజస్వి అలియాస్ పింకీ (తేజస్వి). ఐ.ఏ.ఎస్. ఇంటర్వ్యూ కోసం ఈ హీరోయిన్ కూడా హీరోతో ఒకే ట్యాక్సీలో హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వస్తుంది. తన స్నేహితురాలి పెళ్ళి చెడిపోయింది తాగుబోతులైన హీరో బృందం వల్లేనని గుర్తించిన హీరోయిన్ వాళ్ళకు బుద్ధిచెప్పాలని రంగంలోకి దిగుతుంది. కలసి ప్రయాణిస్తున్న హీరో గారికి తెలియకుండానే, ఎఫ్.ఎం. రేడియో, ఫేస్బుక్, యూ ట్యూబ్ లాంటి వాటిని ఆశ్రయించి, హీరో బ్యాచ్ గురించి గబ్బు రేపుతుంది. ఈ లోగా ఒకటీ అరా పాటలు... హీరో హీరోయిన్ల లవ్ సిగ్నల్స్... హీరోయిన్ మంచితనం చూపే ఘట్టాలు వస్తాయి. ఇంతలో ఆ అమ్మాయే తమపై దుమారం రేపుతోందని హీరో కనిపెడతాడు. అక్కడికి ఇంటర్వెల్. సెకండాఫ్ మొదలయ్యాక తాను మంచివాడినేనన్న సంగతి హీరోయిన్‌కు అర్థమయ్యేలా చేస్తాడు హీరో. ఒక దశలో హీరోయిన్ అక్క తన భర్తతో పొసగక, బెంగుళూరులో ఆత్మహత్య చేసుకోబోతుంటే, ‘స్వీట్ మెమొరీస్’ సీడీ చూడమంటూ ఫోన్లోనే చెప్పి, ఫ్యామిలీ కౌన్సెలర్ అవతారమూ ఎత్తుతాడు. ఆ తరువాత ఏమైంది? హీరో, హీరోయిన్ల మధ్య మనస్పర్థలు ఏమయ్యాయి అన్నది మిగతా సినిమా. నట-దర్శకుడు ఓంకార్ సోదరుడు అశ్విన్‌బాబు హీరోగా హుషారుగా చేసిన మరో ప్రయత్నమిది. తేజస్వి ఎప్పటిలానే చలాకీతనంతో కనిపిస్తారు. ఇక, లేడీ ట్యాక్సీ డ్రైవర్ బంగారంగా స్నిగ్ధ, వారానికి ఆరు రోజులే డ్యూటీలో ఉండే దొంగ కల్యాణ్‌బాబు పాత్రలో షకలక శంకర్ లాంటివాళ్ళు వినోదమందిస్తారు. ధన్‌రాజ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి లాంటి ఇతర కమెడియన్లు కూడా ‘ఆఖరి నిమిషంలో పాలుపంచుకొని’, తెరపై నవ్విస్తారు. ‘గబ్బర్‌సింగ్’ మొదలు తాజా ‘శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్, బెంగాల్ టైగర్’ దాకా పలు చిత్రాల్ని అనుకరిస్తూ, సైటైరికల్ స్పూఫ్ ఒకటి చేశారు. మందు సీసా మీద ఓపెన్ అయి, ఒక పాటతో సహా చాలాసేపు మద్యం వాసన కొట్టే ఈ సినిమా ముగింపు కూడా ఆసక్తికరంగా మద్యం తాగననే హీరో ఒట్టుతోనే! కథ చిన్నది కాబట్టి, కథనం కోసం సందర్భాలు, సన్నివేశాలు అనేకం అల్లుకుంటూ వెళ్ళిన ఈ ఫిల్మ్‌లో లాజిక్‌లు వెతకకూడదు. ఇటు పూర్తి కామెడీ సినిమా చేయాలా, అటు రోడ్ జర్నీలో రొమాంటిక్ ఫిల్మ్ తీయాలా అనే విచికిత్స దర్శక, నిర్మాతలను వెంటాడి నట్లు అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఫార్ములా అన్వేషణలో పాత్రల ప్రవర్తన తీరు ఇ.సి.జి. గ్రాఫే. కథలానే సినిమా ఎక్కడో వైజాగ్‌లో మొదలై ఇక్కడ హైదరాబాద్ దాకా వస్తుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కొన్నేళ్ళ క్రితం పెట్టిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో బహుమతి అందుకొన్న రాకేశ్ శశికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. అతనికి ఆ పాత వాసనలు ఇంకా పోలేదని గుర్తుచేస్తుంది. ఏమైనా స్పూఫ్ కామెడీ, సవాలక్ష ప్రేమకథల రెడీ మిక్స్ ‘జత కలిసే’నా? -
ఇలాంటి కామెడీ రాలేదు!
నవీన్, ప్రియాంక, సరయు హీరోహీరోయిన్లుగా బషీ రమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రాం చంటి నిర్మిస్తున్న చిత్రం ‘ఎవరు దొంగ’. హైదరాబాద్ పరిసరా ల్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈతరహా కామెడీ కథాంశంతో తెలుగులో సినిమా రాలేదని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఓరుగంటి కపిల్. -
షేక్స్పియరూ... నువ్వు కాస్త తప్పేమో గురూ!!
కామెడీ షేక్స్పియర్ అనే మహా రచయిత ‘పేరులో ఏమున్నది!’ అన్నాట్ట. సరే... అంతటి పెద్దమనిషి, ఆయన చెప్పాక అదే నమ్మడం మనకూ కరెక్ట్ అనుకున్నా. కానీ ఎందుకో మా బుజ్జిగాడి మాటల్తో అటు షేక్స్పియర్ చెప్పింది నిజమా లేక మా బుజ్జిగాడి మాటలే వాస్తవమా అని తేల్చుకోలేని అయోమయంలో పడ్డా. అసలు విషయం ఏమిటంటే... ఒకరోజు వాడు టెన్నిస్బాల్తోనే క్రికెట్ ఆడుతుంటే కంటి దగ్గర కాస్త గాయమైంది. దాంతో బెంబేలెత్తిపోయి నేను హడావుడిగా వాణ్ణి కంటివైద్య నిపుణుడి దగ్గరకు తీసుకెళ్లా. ఆయన చూసి ‘కంటికేమీ పర్లేదు’ అని భరోసా ఇచ్చేదాక నా మనసు మనసులో లేదు. కానీ బయటకు వచ్చాక నా బుర్ర బుర్రలో లేదు. కారణం... మా బుజ్జిగాడు నన్నో ప్రశ్న వేశాడు. ‘‘నాన్నా... కంటి డాక్టర్‌ను ఇంగ్లిష్‌లో ఏమంటారు?’’ అని. ‘‘ఆఫ్తాల్మాలజిస్ట్ అంటార్రా’’ అన్నాన్నేను. ‘‘బాగాలేదు’’ అన్నాడు. ‘‘ఏంట్రా బాగాలేనిది?’’ ‘‘నువ్వు చెప్పిన మాట నోరు తిరగడం లేదు. సింపుల్‌గా విజనిస్ట్ అనొచ్చు కదా’’ అన్నాడు వాడు. ఇంకా వాడిచ్చిన షాక్‌లో ఉండగానే మరో దెబ్బ కొట్టాడు వాడు. అదెలా జరిగిందంటే... ఆరోజు మావాడికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే పిల్లల డాక్టర్గారి దగ్గరికి తీసుకెళ్లాన్నేను. వాడింకేదైనా ప్రశ్న వేస్తాడేమోనని అప్పటికీ కాస్త భయంభయంగానే ఉన్నాను. చివరికి నా భయమే నిజమైంది. ‘‘నాన్నా... పిల్లల డాక్టర్‌ను ఇంగ్లిష్‌లో ఏమంటారు?’’ అడిగాడు మా వాడు. ‘‘పీడియాట్రీషియన్ లేదా పీడియాట్రిస్ట్ అంటార్రా’’ అన్నాన్నేను. ‘‘బాగాలేదు’’ ‘‘ఏంటీ బాగా లేనిదీ?’’ ‘‘పీడియాట్రీషియన్, పీడియాట్రిస్ట్ అనే మాటలు... ఆయనేదో పిల్లల్ని పీడించుకు తినేవాడు అనేలా ఉన్నాయి. పిల్లల్ని చూసే డాక్టర్లు చాలా దయగల వారుగా ఉంటారు. పైగా డాక్టరుగారు నాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. వాళ్లను పీడియాట్రిస్టూ, పీడియాట్రీషియన్ అనడం బాగాలేదు’’ ‘‘అందుకే ఈమధ్య వాళ్లను చిల్డ్రెన్స్ స్పెషలిస్ట్ అని కూడా అంటున్నార్లేరా’’ అంటూ సముదాయించబోయా. ‘‘అదీ బాలేదు. చిల్డ్రెన్ అన్న స్పెల్లింగు చిల్డ్రెన్కు అంత తేలిగ్గా రాదు. కాబట్టి కిడ్స్ స్పెషలిస్ట్ అంటే తేలిగ్గానూ, అందంగానూ ఉంటుంది. అదే బాగుంటుంది’’ అన్నాడు వాడు. ఇక వాణ్ణి ఆటలాడకుండా చూడటమో లేకుంటే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లకుండా చూడటమో... ఈ రెండింట్లో ఏదో ఒకటే జరగాలని బలంగా నిర్ణయించుకున్నా. కానీ విధి రాత వేరేలా ఉంది. వాడు ఆటలూ మానలేదు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకా తప్పలేదు. క్రికెట్ ఆడుతూ మళ్లీ కింద పడ్డాడు. మోకాలి దగ్గర కాస్త పెద్దగానే చీరుకుపోయింది. అప్పటికి కుట్లు వేశారు. నిక్కర్లేసుకునే కుర్రాడు కదా... మచ్చ కనిపించకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్దామని వాణ్ణి రమ్మన్నా. వాడు రానంటే రానని ఒక్కటే గొడవ. బలవంతంగానైనా తీసుకెళ్దామంటే ససేమిరా అన్నాడు. ఇక గొడవ భరించలేక ‘‘ఎందుకు రానంటున్నావురా?’’ అని అడిగా. ‘‘నీకు తెలియదా? ప్లాస్టిక్ చాలా డేంజరస్. దానివల్లే భూమిలోని రిసోర్సెస్ అన్నీ దెబ్బతింటున్నాయట. నేను ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రాను. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోను. కావాలంటే ఎకోఫ్రెండ్లీ సర్జరీ ఏదైనా ఉంటే ఓకే. ‘గన్నీబ్యాగ్ సర్జరీనో లేదా ‘జూట్ సర్జరీనో’ కాదంటే ‘ఫైబర్ సర్జరీనో’ చేయించు. అంతేగానీ ప్లాస్టిక్ సర్జరీకి అస్సలు ఒప్పుకోను’’ అంటూ కరాఖండీగా చెప్పేశాడు. ఇంతకీ వీడి మెదడు మామూలుగానే ఉందా లేక వీడిలో అబ్నార్మాలిటీ ఏదైనా ఉందా అని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దామనుకున్నాను గానీ... సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్‌కు ముందు ‘పి’ ఎందుకుంటుందని అడుగుతాడేమోనని భయపడి, ఎందుకైనా మంచిదని ముందుచూపుతో వెనక్కుతగ్గా. ఇదే మాట మా బ్రహ్మంగాడితో చెబితే... ‘‘వాడి ఆలోచన బాగానే ఉందిరా. కానీ వాణ్ణి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చినందుకు అసలు నిన్ను తీసుకెళ్లాల్రా అక్కడికీ’’ అంటూ కాస్త కేకలేశాకగానీ నా మనసు శాంతించలేదు. - యాసీన్ -
'కిస్ కిస్కో ప్యార్ కరూ' రివ్యూ
టైటిల్: కిస్ కిస్కో ప్యార్ కరూ జానర్: కామెడీ డ్రామా తారాగణం: కపిల్ శర్మ, అర్బాజ్ ఖాన్, శరత్ సక్సెనా, ఇల్లి అవ్రం దర్శకత్వం: అబ్బాస్ మాస్తాన్ సంగీతం: జావిద్ మోహిన్, అంజాద్ నదీమ్ నిర్మాత: గణేష్ జైన్, రతన్ జైన్ బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న కపిల్ శర్మ తొలి ప్రయత్నంగా వెండితెర మీద అడుగుపెడుతూ చేసిన సినిమా 'కిస్ కిస్కో ప్యార్ కరూ'. స్మాల్ స్క్రీన్ మీద తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన కామెడీ టైమింగ్‌నే నమ్ముకొని సిల్వర్ స్క్రీన్ మీద కూడా అడుగుపెట్టాడు కపిల్ శర్మ. సీరియస్ సినిమాల దర్శకులుగా పేరున్న అబ్బాస్-మస్తాన్ జోడీ తొలిసారిగా కామెడీ జానర్లో తెరకెక్కించిన 'కిస్ కిస్కో ప్యార్ కరూ' ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం. కథ : వాస్తవానికి ఏ మాత్రం దగ్గరగా లేని కథతో తెరకెక్కిన సినిమా ఇది. శివరామ్ కిషన్ (కపిల్ శర్మ) అనుకోని పరిస్థితుల్లో మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ ముగ్గురు భార్యలనూ ఒకళ్లకు తెలియకుండా ఒకళ్లను మెయిన్‌టెయిన్ చేయడం కోసం శివరామ్ కిషన్ నానా అవస్థలు పడుతుంటాడు. ఇందుకు అతని ఫ్రెండ్ లాయర్ అయిన కరణ్ (వరుణ్ శర్మ) సాయం చేస్తుంటాడు. ఈ సమస్యలు చాలవన్నట్టు అదే సమయంలో దీపిక (ఇల్లీ అవ్రం)తో ప్రేమలో పడతాడు. ముగ్గురు భార్యలుతో పాటు గర్ల్ ఫ్రెండ్‌కు సమయం ఇవ్వలేక కపిల్ శర్మ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అదే సమయంలో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బావమరిది, మామలను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు సాంకేతిక నిపుణులు : ఈ సినిమాతో స్మాల్ స్క్రీన్ మీదే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడ తన కామెడీ టైమింగ్‌కు తిరుగులేదని నిరూపించుకున్నాడు కపిల్ శర్మ. తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి పర్ఫెక్ట్ జానర్‌ని ఎంచుకున్న కపిల్ శర్మ.. నటుడిగా మెప్పించాడు. కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించాడు. వరుణ్ శర్మ కూడా కామెడీ టైమింగ్‌తో అలరించాడు. అర్బాజ్ ఖాన్, శరత్ సక్సెస్ తన పాత్ర మేరకు బాగానే నటించినా, కీలక పాత్రలో నటించిన ఇల్లి అవ్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ షో తప్ప నటనపరంగా ఏమాత్రం విషయం లేదనిపించింది. తొలిసారిగా కామెడీ జానర్‌ను డీల్ చేసిన దర్శకలు అబ్బాస్-మస్తాన్ మంచి విజయం సాధించారు. సినిమా ఫస్ట్ టు ఎండ్ ఎక్కడా స్పీడు తగ్గకుండా నవ్వులు పూయించారు. అయితే కొన్ని సీన్స్ విషయంలో లెంగ్త్ ఎక్కువ అయినట్టు అనిపించటం మాత్రం ఇబ్బంది పెడుతుంది. సినిమా ఆద్యంతం ఎక్కడా లాజిక్కు తావులేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ముగ్గురు భార్యలూ ఒకే బిల్డింగులో ఉన్నా.. ఒకరికి ఒకరు తెలియకపోవటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. కామెడీ సినిమాలకు ప్రాణం లాంటి మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అయ్యారు. భం భం బోలో పాట ఒక్కటి తప్ప మరే సాంగ్ గుర్తుండే ఛాన్స్ లేదు. విశ్లేషణ : టీవీ స్టార్ కపిల్ శర్మ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం చేసిన తొలి ప్రయత్నంలో మంచి విజయం సాధించాడనే చెప్పాలి. ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ తన కామెడీ టైమింగ్‌తో సినిమాను వన్ మేన్ షోగా నడిపించాడు. ఇప్పటివరకు కామెడీ సబ్జెక్ట్‌ను డీల్ చేసిన అనుభవం లేకపోయినా అబ్బాస్ మస్తాన్ లు కిస్ కిస్కో ప్యార్ కరూ మూవీని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ పరంగా నిరాశపరిచినా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం సినిమాకు ప్లస్ అయ్యింది. ప్లస్ పాయింట్స్ కపిల్ శర్మ కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ లాజిక్ లేని స్టోరీ మ్యూజిక్ ఓవరాల్‌గా కిస్ కిస్కో ప్యార్ కరూ పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా మంచి మార్కులే సాధించింది. -
శంకరాభరణంలో క్రైమ్!
ఆ యువకుడు అత్యంత సంపన్నుడి కొడుకు. యూఎస్‌లో ఉంటాడు. ప్రపంచంలో సుఖపడే జాతి, కష్టపడే జాతి.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది ఆ యువకుడి అభిప్రాయం. తనేమో సుఖపడే టైప్ అనుకుంటాడు. కానీ, ఓ పని మీద ఇండియా వచ్చిన అతను కష్టాలపాలవుతాడు. ఈ సుఖపురుషుడు ఆ కష్టాలను ఎలా అధిగమించాడు... అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘శంకరాభరణం’. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ వారంతో పూర్తవుతుంది. ‘‘హారర్‌కి కామెడీ మిక్స్ చేసి మేం తీసిన ‘గీతాంజలి’ మంచి విజయం సాధించింది. క్రైమ్, కామెడీని మిక్స్ చేసి ఈ ‘శంకరాభరణం’ తీస్తున్నాం’’ అని కోన వెంకట్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘భారీ నిర్మాణ వ్యయంతో నలభై మంది తారాగణంతో నిర్మిస్తున్నాం. బీహార్‌లోని ప్రమాదకరమైన లొకేషన్స్‌లో, పుణేకి సమీపంలో ఎవరూ చేయని లొకేషన్స్‌లో, యూఎస్‌లో కొంత శాతం చిత్రీకరించాం. వచ్చే నెల పాటలను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. నందిత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అంజలి స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సాయి శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావు. -
అస్రానీ....
కమెడియన్ అస్రానీది లౌడ్ కామెడీ. పెద్ద పెద్దగా అరవడం ద్వారా కామెడీ పండించే నటులలో అస్రానీ ఒకడు. కాని అతడిలో చాలా మంచి నటుడున్నాడన్న సంగతి హృషికేశ్ ముఖర్జీ కనిపెట్టి ‘గుడ్డీ’, ‘బావర్చీ’, ‘చుప్ కే చుప్ కే’, ‘అభిమాన్’ వంటి సినిమాల్లో చాలా మంచి వేషాలిచ్చాడు. అస్రానీకి ‘షోలే’ ఎంత మేలు చేసిందో అంతే కీడు చేసింది. ఆ సినిమాలో అతడు పోషించిన జైలర్ పాత్రను వదలని ప్రేక్షకుడు అదే మాడ్యులేషన్లో అతడి నుంచి కామెడీ ఆశించారు. ఇప్పటికీ ఆ మూసలోనే దర్శకులు చేయిస్తూ ఉన్నారు. అస్రానీ సింధీ కుటుంబానికి చెందినవాడు. విభజన తర్వాత కుటుంబం పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చేసింది. కార్పెట్లు అమ్మడం, లెక్కలు చూడటం ఇష్టం లేక సినిమాల మీద పడ్డాడు. అమితాబ్, అస్రానీ ఒకే బిల్డింగ్‌లో చెరో రూమ్‌లో ఉండి వేషాలకు ప్రయత్నించేవారు. అస్రానీ హిందీ సినిమాల్లో కామెడీ చేసినా గుజరాతీ సినిమాల్లో హీరోగా రాణించాడు. సినిమాల్లో సంపాదించింది మళ్లీ సినిమాలు తీసి పోగొట్టుకున్నాడు. అయినా సుదీర్ఘకాలంగా కామెడీలో రాణిస్తున్న నటుడిగా గౌరవం పొందుతున్నాడు. మహేశ్‌బాబు తొలి సినిమా ‘రాకుమారుడు’లో అస్రానీ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
కమల్,మౌళి కలయికలో కామెడీ చిత్రం?
విశ్వనాయకుడు కమలహాసన్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు మౌళి కాంబినేషన్లో కామెడీ కథా చిత్రం తెర కెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూంగావనం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కమలహాసన్ తదుపరి చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కమర్షియల్, కుటుంబ కథా చిత్రాలను చేస్తున్న కమల హాసన్ దృష్టి మరోసారి హాస్యంపై మళ్లిందని సమాచారం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందాన కమల్ కోసం ఐదారుగురు దర్శకులు హాస్యభరిత కథలను వండి ఆయన కను సైగల కోసం ఎదురు చూస్తున్నారట. అయితో కమలహాసన్ మాత్రం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, మౌళిలలో ఒకరి దర్శకత్వంలో నటించాలని భావిస్తునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల కమల్, దర్శకుడు మౌళి కలిసి కథా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇంతకు ముందు వీరి కలయికలో పంబల్ కే సంబంధం, నలదమయంతి వంటి వైవిధ్య భరిత చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్, మౌళి మరో వినోదభరిత చిత్రానికి సృష్టి కర్తలు కావచ్చుననే టాక్ కోడంబాక్కంలో వినిపిస్తోంది. -
అరటిపండు లంబా లంబా!
కామెడీ సీన్ - చంటబ్బాయ్ ‘ఆంధ్రవీణ’ పత్రిక కార్యాలయం... ఎడిటర్ బిజీగా ఉన్నాడు. పానకంలో పుడకలా వాగ్దేవి ఎంటరయింది. వాగ్దేవి: నమస్కారమండీ ఎడిటర్‌గారూ! ఎడిటర్: నమస్కారం...ఎవరమ్మా..? వాగ్దేవి: ఈ వారం మన ‘ఆంధ్ర వీణ’ ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ ‘చెత్త బతుకులు’ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవీణ మా ఇంటికి రాగానే నేను ముందు చద వాలి అంటే నేను ముందు చదవాలి అంటూ మా వారూ నేను పోట్లాడుకుంటాం. డయానా రెటీనా ప్రకటన మీ పత్రికకే హైలైట్. ఎడిటర్: నీ పేరేంటమ్మా? వాగ్దేవి: వాగ్దేవి అండీ? రెండేళ్ల క్రితం నా రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి. గుర్తు లేదూ..? ఎడిటర్: ఆ...ఆ...గుర్తులేకేం? కేవలం ఆ రెండు ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10 వేలకు పడిపోయింది. నువ్వే నా తల్లీ! ఏం కావాలి..? శ్రీలక్ష్మి బ్యాగ్‌లోంచి కవర్ తీసి చేతికి అందించబోయింది. వెంటనే ఎడిటర్ భయపడి చేతులు వెనక్కి తీసుకుంటూ ఎడిటర్: ఏమిటది? వాగ్దేవి: నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకు కొన్ని కవితలు వినిపిస్తాను వినండి. ‘‘ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక.’’ ఎడిటర్ ఈ కవితలు వింటూ అసహనంతో... ఎడిటర్: ‘‘ఇవి విన్నాక కూడా ఎందుకు బతుకున్నాను? నాకు చావు రాలేదు గనక.’’ వెంటనే శ్రీలక్ష్మి ఆయన చేతిల్లో పెన్ను లాక్కొని రాస్తూ... శ్రీలక్ష్మి: చాలా బాగుందండీ, ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను ఇవి మీ పత్రికలో వేయించండి ఎడిటర్ పెన్నూ, కవర్ లాక్కొని... ఎడిటర్: వీటిని ఇక్కడే ఉంచుతాను. మేమిక పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక నీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాకో, అండమాన్‌కో పారిపోతాం. వీటిని ఇక్కడే ఉంచుతామమ్మా! వాగ్దేవి: చాలా థ్యాంక్స్. ఇకపోతే... అంటూ బ్యాగ్‌లోంచి ఓ కవర్ బయటకి తీసింది. ఎడిటర్: ఎవరు పోతేనమ్మా! నేనా? శ్రీలక్ష్మి కవర్‌ను టేబుల్ మీద పెట్టింది. శ్రీలక్ష్మి: ఇవి కాస్త తినండి! ఎడిటర్: ఎందుకమ్మా? పోవడానికా? వాగ్దేవి: నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండీ. వంటా వార్పూ శీర్షికన మీరు దీన్ని ప్రచురించాలి. ‘అరటి పండు లంబా లంబా’ అని దీనికి పేరు పెట్టాను. వెంటనే ఎడిటర్ గుసగుసగా ఎడిటర్: (నెమ్మదిగా )ఎడిటర్ బొంద బొంద అనకపోయావేం అనుకుని పైకి ‘‘అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్లీ తినడం ఎందుకు రిస్క్. జీవితం మీద ఆశ ఉన్నవాడిని ఇది ఇక్కడే ఉంచమ్మా’’ వాగ్దేవి: వస్తానండీ. వచ్చేసారి ఇంకొన్ని కవితలు, స్వీట్లు తెస్తాను ఎడిటర్: ఈ సారి వచ్చే ముందు చెబితే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను. వాగ్దేవి: అబ్బా సెలవు పెట్టి వినాల్సిన అవసరం లేదండీ? ఆఫీసులోనే వినచ్చు. (ఈ ఎపిసోడ్ ‘చంటబ్బాయ్’ సినిమాలోనిది. జంధ్యాల మార్కు కామెడీకి నిలువుటద్దం. ఎడిటర్‌గా పొట్టిప్రసాద్, వాగ్దేవిగా శ్రీలక్ష్మి నటన ఆద్యంత చమత్కారభరితంగా ఉంటుంది.) నిర్వహణ: శశాంక్ బూరుగు -
హాస్యభరితంగా ఇన్బా ట్వింకిల్ లిల్లీ
ఆరోగ్యానికి నవ్వును మించిన ఔషధం లేదంటారు.ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి నవ్వులు రువ్వించడం చాలా అవసరం. ఈ విషయంలో కొన్ని సినిమాలు వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పకతప్పదు. ఈ కోవలో వస్తున్న మరో చిత్రం ఇన్బా ట్వింకిల్ లిల్లీ. ఇంతకు ముందు కదం కదం వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన అప్పు మూవీస్ సంస్థ అందిస్తున్న తాజా చిత్రం ఇది. అదేవిధంగా శరత్‌కుమార్ నటించిన వైదీశ్వరన్ చిత్రాన్ని తెర కెక్కించన విద్యాధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ బామ్మలకు కథలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. కథలు కాలాన్ని అధిగమించడానికి బామ్మలే కారణం అన్నారు. అలాంటి ముగ్గురు బామ్మలు పండించే వినోదభరిత కథా చిత్రమే ఇన్బా ట్వింకిల్ లిల్లీ అన్నారు. ఇందులో ఇన్బగ నటి శరణ్య,ట్వింకిల్‌గా కోవైసరళ, లిల్లీగా కల్పన నటిస్తున్నారని తెలిపారు.వీరి మనవరాలిగా సలీమ్ చిత్రం ఫేమ్ అశ్విత నటిస్తున్నట్లు చెప్నారు. నేటి సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ మాత్రం అవగాహన లేని ముగ్గురు బామ్మలు ఒక సమస్యలో చిక్కుకున్న తమ మనవరాలిని అదే సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా రక్షించుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందే చిత్ర ఇతివృత్తం అన్నారు. అయితే చిత్రం ఆద్యంతం హాస్యపు జల్లులు కురిపిస్తుందన్నారు. ఇందులో మాఫియా లీడర్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ నటిస్తున్నారని, ఇతర ముఖ్యపాత్రల్ని కత్తి అనుక్రిష్ణ, మనోబాల పోషిస్తున్నారని తెలిపారు. ధరణ్ సంగాతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆరవ తేదీన మొదలెట్టి కంటిన్యూగా నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
తాటికాయల బండితో ఆడుకునేవాడిని
తొలి చిత్రం ‘అల్లరి’తోనే తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు నరేష్. ఆ చిత్రాన్నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అతడు తెరపై కనిపిస్తే ఎవరికైనా కడుపు చెక్కలవ్వాల్సిందే. తన సహజమైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. హాస్యానికి మారు పేరుగా నిలిచిన ‘అల్లరి నరేష్’ అంటే చిన్నారులకు భలే ఇష్టం. ఇప్పుడు సినిమా హీరో అయినా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఎంతో ఎంజాయ్ చేసేవాడినని చెప్పారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... - సాక్షి,సిటీబ్యూరో వేసవి సెలవుల్లో.. ‘పాలకొల్లు దగ్గర ఊటాడ మా అమ్మమ్మ వాళ్ల ఊరు. ఏటా వేసవి సెలవుల్లో చెన్నై నుంచి అక్కడికి వెళ్లేవాళ్లం. నాన్న ఎక్కువగా సినిమా షూటింగ్స్‌లో ఉండేవారు. నేను, మా అమ్మ, అన్నయ్య ఊటాడలో సెలవులు గడిపేవాళ్లం. బంధువులంతా అక్కడికి వచ్చేవారు. చాలా సంతోషంగా ఉండేది. అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం, ఆటలాడుకోవడం, ఊరంతా తిరిగి రావడం భలే సరదాగా ఉండేది. పచ్చి మామిడి కాయలంటే నాకు చాలా ఇష్టం. తోటలోకి వెళ్లి మామిడి కాయలు కోసి తెచ్చుకునేవాళ్లం. తాటి ముంజలు తిని తరువాత తాటికాయలను చక్రాల బండిలాగా చేసుకుని ఆడుకునేవాళ్లం. వాటితో మూడు చక్రాల బండి, నాలుగు చక్రాల బండి తయారు చేసి ఊరంతా తిరిగేవాడిని. ఊటాడలో గడపడం ఒక అనుభవం అయితే.. మరి కొద్ది రోజులు నాన్నతో కూడా గడిపేవాళ్లం. ఆయన ఇంటి దగ్గర ఉండి మాకు కేటాయించే టైమ్ చాలా తక్కువ. అందుకోసం ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవాళ్లం. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ.. అలా ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవాళ్లం. నాన్న మూడో సినిమా ‘ఫోర్ ట్వంటీ’ షూటింగ్ సమయంలో రాజమండ్రిలో గడిపాం. జూన్ 30 నా పుట్టిన రోజు. కానీ షూటింగ్స్ వల్ల నాన్న ఎప్పుడూ నాతో గడిపేవారు కాదు. బాధగా ఉండేది. ఐదారుగురు స్నేహితుల మధ్య ఇంట్లోనే కేక్ కట్ చేసి వేడుక చేసుకునేవాడిని. నాకు బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం... నా 14వ పుట్టిన రోజు. ఆ రోజుల్లో నాన్న ‘చిలక్కొట్టుడు’, ‘అదిరింది అల్లుడు’ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమా షూటింగ్ కోసం యూరప్‌లో ఉన్నారు. పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందు అన్నయ్యను, నన్ను యూరప్‌కు రప్పించారు. ‘మోబ్లాగ్స్’లో షూటింగ్ యూనిట్ మధ్య గ్రాండ్‌గా నా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. నా చుట్టూ ఎంతోమంది.. చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఇప్పటికీ నాకు అది మరిచిపోలేని జ్ఞాపకం. వేసవి సెలవుల్లో పెళ్లిళ్లకు వెళ్లడం.. చుట్టాలందరితో కలిసి భోజనం చేయడం.. సరదాగా మాట్లాడుకోవడం, అందరితో కలిసి సెల్ఫీలు తీసుకోవడం నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అవకాశం ఉంటే తప్పనిసరిగా బంధువుల ఇంటికి వెళ్తాను’ అని చెప్పుకొచ్చారు. -
చిట్ చాట్ / ప్రవీణ్, హాస్యనటుడు
నవ్వంటే... మహత్తర శక్తి! గోదావరి యాసతో ప్రవీణ్ చేసే ‘కామెడీ’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘నవ్వితే పోయేదేమీ లేదు...మనసులో బాధ తప్ప’ అంటున్న ఈ ‘కొత్త బంగారు లోకం’ (ఇది ప్రవీణ్ తొలిచిత్రం) కురాడ్రు చెప్పే కబుర్లు... దొంగలకు దొంగలు సన్నిహితులవుతారు. తాగుబోతులకు తాగుబోతులు సన్నిహితులవుతారు. అలాగే నవ్వంటే ఇష్టపడే వాళ్లకు, నవ్వించే వాళ్లకు అలాంటి వాళ్లే పరిచయం అవుతారు. మా అంతర్వేదిలో నాకు అలాంటి మిత్ర బృందమే ఉంది. నవ్వడం, నవ్వించడం, నవ్వులను పంచుకోవడం మా పని. నేను హాస్య పాత్రలు పోషించడానికి మూలాలు అక్కడ ఉన్నాయన్నమాట! దర్శకుడిగానే కాదు.. రచయితగా కూడా జంధ్యాల అంటే తెగ ఇష్టం నాకు. ఈవీవీ సినిమాలు కూడా చాలా ఇష్టపడతాను. కామెడీ సినిమా అంటే సినిమా చూస్తున్న ఆ సమయానికి, ఆ రోజు వరకు మాత్రమే నవ్విస్తే సరిపోదు. సంవత్సరాలైనా సరే ఆ సినిమాలోని దృశ్యాలు మన పెదాలపై నవ్వులై మెరవాలి. ఆ స్థాయిలో సినిమాలు తీయగల శక్తి జంధ్యాల, ఈవీవీలకు ఉంది. నాకు బాగా నచ్చిన సినిమా ఈవీవి ‘ఆ ఒక్కటి అడక్కు’. ఈ సినిమాను ఆ ఒక్కసారి చూస్తే మాత్రమే సరిపోదు. చూస్తున్నకొద్దీ... మన నవ్వులు రెట్టింపు అవుతూనే ఉంటాయి. కమెడియన్లు అందరూ ఇష్టమే. ఆనాటి తరంలో రమణారెడ్డి మొదలు ఈనాటి బ్రహ్మానందం, సునీల్ వరకు అందరి హాస్యాన్ని ఇష్టపడతాను. నవ్వే కదా అని నవ్వును తేలిగ్గా తీసుకోవద్దు. దానికి మహత్తరమైన శక్తి ఉంది. ఆ శక్తితో ఒత్తిడి నుంచి బయట పడొచ్చు, కొత్త శక్తితో ఉత్తేజితం కావచ్చు. -
100 రోజుల ప్రయాణం
లఘుచిత్రాలు అంటే.. ప్రేమ, కామెడీ వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఎంఆర్ ప్రొడక్షన్స్ విలువలతో కూడిన చిత్రాలను తీస్తూ వచ్చింది. వందో చిత్రంగా ‘ప్రయాణం’ లఘుచిత్రాన్ని 45 నిమిషాల నిడివితో తీసింది. వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ వందో చిత్రం.. ఏడు లక్షల మంది వీక్షకులను మూటగట్టుకుంది. మంచి సంభాషణలు, మంచి సంగీతం.. మేళవించిన ‘ప్రయాణం’ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. ఈ పొట్టిచిత్రంతో పాతకాలపు విలువలను మరోసారి గుర్తుచేశారు యువ దర్శకులు సుభాష్, ధీరజ్రాజ్. నాయికా నాయకులకు సీతారాముల పేర్లను పెట్టారు. పల్లెటూరుకు వెళ్తే నిజమైన ప్రేమ విలువ తెలుస్తుందని సీతను అక్కడకు పంపిస్తుంది ఆమె తల్లి. తాను రామ్‌ని ప్రేమిస్తున్న విషయం పల్లెకు వెళ్లాక తెలుసుకుంటుంది సీత. పెళ్లిపీటల మీదకు చేరిన ఈ ప్రేమను అందంగా చూపించారు. అలనాటి పెళ్లి ముచ్చట్లతో సరదాగా సాగిపోతుందీ చిత్రం. కాలక్షేపానికి ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం, మళ్లీ ప్రేమ, మళ్లీ బ్రేకప్.. జీవితమంటే ఇది కాదని ఈ చిత్రం ద్వారా చెప్పారీ దర్శకులు. - వైజయంతి -
సెలైంట్ సెన్సేషన్
రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సెన్సేషన్. ఈసారి మాత్రం ఆయన సెలైంట్‌గా సెన్సేషన్ సృష్టించబోతున్నారు. ‘సెలైంట్’ పేరుతో ఆయన ఓ మూవీ సినిమా చేయబోతున్నారు. క్రైమ్, కామెడీ జానర్లో సాగే చిత్రం ఇదనీ, భాష లేని సినిమా కాబట్టి, అన్ని భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నాననీ వర్మ తెలిపారు. -
అమెరికాలో ‘చిత్రాంగద’
‘గీతాంజలి’గా అలరించిన అంజలి, ఈసారి ‘చిత్రాంగద’గా రానున్నారు. ఈ థ్రిల్లర్, కామెడీ మూవీని అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిపారు. యూరప్, కేరళల్లో చిత్రీకరించే పాటలతో సినిమా పూర్తవుతుందనీ, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
కనిపించని కామెడీ
మిస్సింగ్ మాధవ్ శింగరాజు లైఫ్‌లో సీరియస్ విషయాలు కొన్ని భలే కామెడీగా టర్న్ తీసుకుంటాయి. ఎవరి లైఫ్‌లో? ‘ఎవరి’ ఏంటి? ఒక్కొక్కరికీ ఒక్కో లైఫ్ ఉండే కాలంలో ఉన్నామా మనం! అందరికీ ఒక్కరే నరేంద్ర మోదీ. అందరికీ ఒక్కరే బరాక్ ఒబామా. ఇక వేర్వేరుగా ఎలా ఉంటాయి జీవితాలు? ఇవాళ మీ ఇంట్లో వంకాయ, మా ఇంట్లో బెండకాయ. అంతమాత్రాన మన జీవితాలు ఎవరివి వారివై పోతాయా? టీవీలో అక్కడ మీకు కనిపిస్తున్నదీ, ఇక్కడ మాకు కనిపిస్తున్నదీ అదే మోదీలు, అదే ఒబామాలే అయినప్పుడు ఎవరి జీవితం వారికి సపరేట్గా ఏ రైతు బజార్ నుండి వస్తుంది చెప్పండి? అందుకే లైఫ్ అంటే ఇప్పుడు మనమూ మన కరెంట్ బిల్లులే కాదు. ఇరుగుపొరుగిళ్ల కరెంట్ అఫైర్స్ కూడా. 12, తుగ్లక్ రోడ్డు నివాసంలో రాహుల్‌గాంధీ, క్రెమ్లిన్ భవనంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొంతకాలంగా కనిపించడం లేదు! ప్రస్తుతం ఇదే మన జీవితాల్లోని పెద్ద కామెడీ. ఎవరైనా ‘కనిపించకపోవడం’ సీరియస్ విషయం కదా. కామెడీ ఎలా అవుతుంది? అయింది! ఫిబ్రవరి 23న పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచీ మన దగ్గర రాహుల్ గాంధీ కనిపించడం లేదు. రష్యాలో పుతిన్ కూడా పది రోజులుగా కనిపించడం లేదు. ఇద్దరూ ఏమైనట్టు? రాహుల్‌కి పార్లమెంటులో పెద్దగా పనేమీ లేదనుకుందాం. మరి పుతిన్‌కి ఏమైంది? కజఖ్‌స్తాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్లినట్టు? దక్షిణ అస్సెటియా నుంచి తన సంతకాల కోసం మాస్కో వస్తున్న ఒప్పందాల బృందానికి... ‘‘కంగారేం లేదు, మెల్లిగానే రండి’’ అనే సమాచారాన్ని ఆఖరి నిముషంలో పంపించి ఆయన ఎటు వెళ్లినట్టు? అతి కీలకమైన రష్యా ఇంటెలిజెన్స్ సమావేశానికి కూడా అందుబాటులో లేకుండా ఆయన ఏమైపోయినట్టు? ఎక్కడ ఉన్నట్టు? ఏవేవో వినిపిస్తున్నాయి. పుతిన్‌కి ఫ్లూ... అందుకే బయటికి రావడం లేదు! పుతిన్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. అక్కడ ప్రియురాలు ఎలీనా కబేవా ప్రసవిస్తే తన బిడ్డను చూడ్డానికి వెళ్లారు! పుతిన్‌కి గుండెపోటు! పుతిన్‌పై తిరుగుబాటు! పుతిన్ క్రెమ్లిన్‌లో బందీగా ఉన్నాడు! పుతిన్ చనిపోయారు! ఇవన్నీ ఇక్కడితో ఆగలేదు. పుతిన్‌ని ఏలియన్స్ తీసుకెళ్లినట్లు ఓ పత్రికలో కార్టూన్. సమాధిలో లెనిన్ పక్కనే పుతిన్ మృతదేహం కూడా ఉన్నట్లు ఇంకో కార్టూన్. పుతిన్‌ని ఎవరో పాతిపెట్టి వెళుతున్నట్లు యూట్యూబ్‌లో వీడియో! దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తనకై తానే పుతిన్ చనిపోయాడని ఇంకో సెటైర్. రాహుల్ మీద ఇంత జరగలేదు. ‘‘ఈ మనిషి ఎక్కడి కి పోయినట్టూ...’’ అని మాత్రం అనుకున్నారంతే. అయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు రాహుల్ ఇంటికి వెళ్లి, ఆయన గురించి అక్కడి వాళ్లను ఆరా తీయడం కామెడీ అయింది. రాహుల్జీ ఇంట్లో ఉన్నారా? చూడ్డానికి ఆయన ఎలా ఉంటారు? ఎంతెత్తు ఉంటారు? ఒడ్డూపొడవు ఎలా ఉంటుంది? ఒంటి రంగేమిటి? మనిషిలో కొట్టొచ్చినట్లు కనిపించేవేమైనా ఉన్నాయా? ఆయన కళ్ల రంగేమిటి? కళ్లద్దాలు పెట్టుకుంటారా? నడిచే తీరు ఎలా ఉంటుంది? మనిషి ఆనవాళ్లేమిటి? ఏ భాష మాట్లాడతారు? ఎలాంటి బట్టలు వేసుకుంటారు? ఏ టైప్ షూజ్ వాడతారు? మీసం ఉంటుందా? గెడ్డం ఉంటుందా? ఆయన సన్నిహితులెవరు? వాళ్ల ఫోన్ నెంబర్లు, అడ్రెస్లు ఏమిటి?... ఇన్ని ప్రశ్నలు వేశారు. ఇదంతా ప్రముఖుల సెక్యూరిటీ సర్వేలో భాగంగా జరిగిన వివరాల సేకరణ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పినప్పటికీ, కనిపించని మనిషిని వెతికి పట్టుకునేందుకు అడిగిన ప్రశ్నల్లానే ఉన్నాయి అవన్నీ. ఈ కామెడీ ఇలాగే కంటిన్యూ అవాలని పడీపడీ కోరుకునేవారు కొన్నాళ్లపాటు టీవీని స్విచాఫ్ చెయ్యడం తెలివైన పని. రాహుల్ అయినా, పుతిన్ అయినా ఇవాళో, రేపో రాకమానరు, టీవీలో కనిపించకా మానరు కాబట్టి. (పుతిన్ ఆల్రెడీ వచ్చేశారు! నిన్న సోమవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యక్షమయ్యారు). టీవీ స్విచాఫ్ చెయ్యడం వల్ల ఇంకో ప్రయోజనం... తిరిగి ఎవరి లైఫ్‌లు వాళ్లకొచ్చేస్తాయి. మోదీ, ఒబామా కూడా కనిపించరు కాబట్టి. -
ఉంగళక్కు తెరియుమా?
(మీకు తెలుసా?) హాస్యమే ఆనందం రజనీ ‘గుడ్‌మార్నింగ్’ చెప్పేవరకు చెన్నైలోకి సూర్యుడు ప్రవేశించడు. రజనీకాంత్ మాత్రమే ‘మిస్డ్ కాల్’కు ఆన్సర్ ఇవ్వగలరు. తన ఫోన్‌తో తన నంబర్‌కే ‘మిస్డ్ కాల్’ ఇవ్వగల సమర్థుడు రజనీ. ఏదైనా అద్భుతాన్ని చూస్తే ‘ఓ మై గాడ్’ అంటాం. మరి గాడ్ ‘రోబో’ సినిమా చూస్తే? ‘ఓ మై రజనీకాంత్’ అంటాడట! ఐన్‌స్టీన్: ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ కరుణానిధి: రిలేటివ్ ఈజ్ ఎవ్రీథింగ్ (బంధుప్రీతి) రజనీకాంత్: ఐయామ్ ఎవ్రీథింగ్ {పభుత్వానికి రజనీకాంత్ ఎలాంటి ట్యాక్సూ కట్టరు. ఇక్కడ నివసిస్తున్నందుకు ప్రభుత్వమే అతడికి ట్యాక్స్ కడుతుంది. కుక్కతో కూడా రజనీ మ్యా...వ్ అనిపించగలరు {sెడ్మిల్ అలసిపోయే వరకు రజనీ పరుగెత్తుతూనే ఉంటారు. -
హాస్యం ట్రాక్ మారింది
సినీ నటుడు గిరిబాబు పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం) : పాత సినిమాలలో హాస్యం కథలో భాగంగా ఉండేదని.. ప్రసుత్తం చిత్రాల్లో కామెడీ ఓ ట్రాక్‌లా మారిందని సినీ నటుడు గిరిబాబు అన్నారు. శనివారం పెదతాడేపల్లిలో వర్మ వెర్సస్ శర్మ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన లోటస్ స్కూల్లో విలేకరులతో ముచ్చటించారు. ఇప్పుడు హాస్యం ఎలా ఉంది. హాస్యం బాగానే ఉంది. మంచి కమేడియన్స్ చిత్రసీమలో ఉన్నారు. ఎవరి ట్రాక్ వారిది. ఇమిటేషన్ లేదు కాని హాస్యం కథలో అంతర్భాగంగా ఉండటం లేదు. మరో ట్రాక్‌గా హాస్యం ఉంటోంది. ప్రస్తుత సినిమాలపై మీ అభిప్రాయం ఇటీవల వస్తున్న చాలా చిత్రాల్లో పాటలేంటో తెలియడం లేదు. గందరగోళంగా ఉండే మ్యూజిక్‌ను చూసి గాబరా పుడుతోంది. ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియూలో వస్తున్న పాటల పోటీల్లో ఆపాత మధురాలను పిల్లలు శ్రావ్యంగా ఆలపించడం కాస్త ఊరటనిస్తోంది. మీ డ్రీమ్ రోల్స్ 42 ఏళ్లగా జానపదాలు, పౌరాణికాలు, హీరో, కామెడీ, విలన్, సహాయ నటుడు వంటి భిన్న పాత్రలు పోషించాను. రాముడు, భీముడు, దుర్యోధనుడు, కృష్ణుడు పాత్రలు చేయాలనే కోరిక ఉన్నా, బాడీ లాంగ్వేజ్ సరిపోక ఆ కోరిక తీరలేదు. పాత తరం హాస్యనటుల గురించి రేలంగి, రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి వంటి మేటి హాస్యనటుల హాస్యం అజరామరం. రాయలసీమ యాసను కూడా రమణారెడ్డి పౌరాణికాలలో మాట్లాడి రక్తికట్టించారు. గతంలో తెలంగాణ యాసతో హాస్యం పండేది. రాష్ట్రాలు విడిపోయాక అక్కడ తెలుగు యాసతో హాస్యాన్ని పండిస్తారేమో చూడాలి. గోదావరి జిల్లాలలో మాట్లాడే భాష చిత్ర సీమలో ఉంటుంది. నటునిగా సంతృప్తి చెందారా నటునిగా సంతృప్తి చెందడంతో పాటు దేవతలారా దీవించండి, మెరుపుదాడి వంటి మంచి చిత్రాలు నిర్మించా. మెరుపుదాడితో హిట్ కొట్టా. యాంటీ సెంటిమెంటుతో సంధ్యారా గం సినిమా తీశా కథ బాగున్నా విజయం సాధించలేదు. తాడేపల్లిగూడెం ఎలా ఉంది జిల్లాలో పాలకొల్లు, భీమవరం, నరసాపురం. తణుకు, పాలకొల్లు వంటి ప్రాంతాలకు గతంలో వచ్చాను. ప్రముఖ హాస్య నటుడు రేలంగి వారి గూడెం రావడం ఆనందంగా ఉంది. ఆయన థియేటర్ చూశాను. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు రాజశేఖర్‌తో గడ్డం గ్యాంగ్ చేశాను. బాలకృష్ణ లయన్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సిని మాలు, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో నటిస్తున్నా. -
పెద్దబాలశిక్ష!
జీవితం ఎక్కాల పుస్తకం కాదు... ది అదర్‌సైడ్ ఆఫ్ ఎ కామెడీ కింగ్! మూడు దశాబ్దాల పైగా వెండితెరను ఏలుతూ, సహస్ర చిత్ర దర్శనం పూర్తి చేసుకున్న హాస్య నట శ్రేష్ఠుడు... బ్రహ్మానందం. ఇది అందరూ చూసే ఒక యాంగిల్. మరి, ఏ రోజైనా సరే... సాయంత్రం 6 గంటల కల్లా ముఖానికి రంగు తుడిచేసుకొని, ఇంటికి చేరి తనదైన లోకంలో ఉండే ఆయనను ఎప్పుడైనా గమనించారా? వీలుంటే ఒక్కసారి కలిసి చూడండి. అంత తొందరగా ఎవరికీ దొరకని ఈ ఆలోచనాపరుణ్ణి కాసేపు కదిపి చూడండి. కెమేరాకు చిక్కని కోణాలెన్నో సప్తవర్ణ శోభితంగా పలకరిస్తాయి. తాత్త్వికుల్లో బుద్ధుడు... ఆయుర్వేదంలో ధన్వంతరి... ఖగోళవిజ్ఞానంలో వరాహమిహిరుడు... పద్య సాహిత్యంలో పోతన... ఆధ్యాత్మిక ప్రవచకుల్లో చాగంటి... ఇలా ఎవరి గురించైనా, దేని గురించైనా... అనర్గళంగా వివరించగలరు. సాహిత్య అధ్యాపకత్వంతో మొదలై జీవిత తాత్వికతను బోధించే దశకు మారిన ఈ లోతైన మనిషి 60వ ఏట అడుగుపెడుతున్న వేళ... ఆయన లోలోపలి మనిషితో సుదీర్ఘంగా సాగిన మాటకచ్చేరీ... నేను నమ్మే ఏకైక లైఫ్ ఫిలాసఫీ... జీవితాన్ని మించిన ఫిలాసఫీ ఏముంటుంది! జీవితం ఎప్పుడు నిచ్చెనలెక్కిస్తుందో, ఎప్పుడు పాములతో కాటేయిస్తుందో తెలీదు. అయినా నిత్యం నూతనంగా బతకాలనుకునే తాపత్రయం. నీటిలో మునిగిపోతున్నామని తెలిసినా... నీటిపై తేలియాడే ఎండుటాకును పట్టుకుని అది రక్షిస్తుందేమోనని ఆశపడడం - జీవితం! నిత్యభ్రమణంలో ఉన్న భూమ్మీద నివసిస్తూ... కాంక్రీట్‌తో ఇల్లు కట్టుకుని, వాస్తు గురించి ఆలోచించడం - జీవితం! దేవుడూ, జీవుడూ వేరు కారనే అద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతూనే, అంతమంది దేవుళ్లనూ పూజించడం, అజ్ఞానాంధకారంలో నడవడం - జీవితం! మిణుగురు పురుగులా బతుకుతూ నా అంతటి కాంతి మరెక్కడా లేదనుకునే మూఢత్వం - జీవితం! నేను కుయ్యకపోతే తెల్లవారదేమోనన్న భ్రమలో బతకడం - జీవితం! నలుగురితో మంచిగా ఉండాలని - అందరితో మంచి అనిపించుకోవాలని - తన జీవితాన్ని పడుపు వృత్తిలోకి దించడం - జీవితం! జరిగినదాని గురించి పశ్చాత్తాపపడుతూ, జరుగుతున్న దాని గురించి ఆవేదన చెందుతూ, జరగబోయే దాని గురించి ఆందోళన పడడం - జీవితం! అన్నీ నేనే చేసుకుంటూ, నా జీవితాన్ని నేనే శిల్పంలా తీర్చిదిద్దుకుంటున్నాననుకుంటూ, నీకు జీవితాన్ని ప్రసాదించిన అతీతమైన శక్తిని మరచిపోవడం - జీవితం! ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎన్నో చెప్పాల్సి వస్తుందని తెలియకపోవడం - జీవితం! ఇలా లెక్కలేసుకుని బతకడం ... జీవితం కాదు! ఒక్క మాటలో చెప్పాలంటే - జీవితం ఎక్కాల పుస్తకం కాదు... పెద్దబాలశిక్ష ఎవరో మహాకవి అన్నట్టు - కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం. అందుకే - జీవితాన్ని మించిన ఫిలాసఫీ ఏముంది?. గతాన్ని మార్చే శక్తి లభిస్తే... నేను చేసే రెండు పనులు దేశాన్ని మళ్లీ బళ్లో వేసి, అక్షరాభ్యాసం జరిపించాలి. చీకటి నుంచి వెలుతురు చూపించే మార్గం, అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్లే మార్గం, మరణం నుంచి అమరత్వానికి నడిపించే మార్గం - వీటి గురించి దేశానికి బాగా బోధించాలి. దైవకణం నుంచి ఉద్భవించిన ఈ జీవికి ఈశ్వర స్వరూపమనేది ఒక్కటే అని తెలియాలి. ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకునే మార్గాన్వేషణ చేయాలి. ఎప్పటికైనా నేను తెలుసుకోవాలనుకునే మూడు విషయాలు... అందమైన భార్యనూ, సామ్రాజ్యాన్నీ, అధికారాన్నీ, బంధుగణాన్నీ వదిలేసి వెళుతున్నప్పుడు గౌతమ బుద్ధుడి మదిలో ఆ క్షణం రేగిన భావసంచలనపు గాఢత తెలుసుకోవాలని ఉంది. కురుక్షేత్ర సమరంలో కర్ణుడు హోరాహోరీగా పోరాడి, సమస్త శస్త్రాస్త్రాలూ కోల్పోయాడు. భూమిలో కుంగిపోయిన రథచక్రాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు బాణం సంధించాడు. కర్ణుడు మరణానికి దగ్గరైన సందర్భమది. సరిగ్గా అప్పుడే ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను అన్నట్లుగా సూర్యుడు పడమటి కొండల మధ్య వాలిపోతున్నాడు. కన్నబిడ్డ కర్ణుడు చావు ముంగిట్లో ఉంటే, అతని జన్మకారకుడైన సూర్యుడు చాలా నిర్దయగా, అలా వదిలేసి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి, అప్పుడాయన మానసిక స్థితి ఏమిటో తెలుసుకోవాలని ఉంది. యావత్ మానవాళి సుఖం కోసం తన రక్తాన్ని చిందించి, మానవకోటిని సన్మార్గం వైపు నడిపించాలని శిలువ నెక్కిన మహనీయుడు - ఏసుక్రీస్తు. ఆయన దేహాన్ని హింసించగలిగారు కానీ, ఆయన ఆత్మను మాత్రం ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దాహానికి ఆయనకు నీళ్ళిస్తే, ‘ఐ థర్స్ట్ ఫర్ సోల్స్’ అన్న దైవకుమారుడాయన. అలా శిలువ నెక్కిన సమయంలో ఆయన ఆత్మస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఉంది. నా అభిమాన చిత్రకారులు నలుగురు... 1. బాపు: అతి చిన్న గీతలో అనల్పమైన భావాన్ని నింపి, అద్భుతమైన కళాఖండాలు సృష్టించిన కమనీయ చిత్రశిల్పి. 2. వడ్డాది పాపయ్య: ఈయన కుంచెలోకి ఎప్పుడెప్పుడు ప్రవేశిద్దామా అని రంగులన్నీ ఆరాటపడిపోయి, ఒకదానితో ఒకటి కలహించుకునేవట! 3. రవివర్మ: భగవంతుడెలా ఉంటాడో అన్న మన ఊహలకు రూపమిచ్చిన కుంచె ఆయనది. ఆయన తన సృజనతో చిత్రకళకు బ్రహ్మోత్సవం జరిపించాడు. 4. లియొనార్డో డావిన్సీ: ఏం చెప్పాలి? ఎన్నని చెప్పాలి? ఆయన గీసిన మోనాలిసా పెయింటింగ్‌లోని ఆ ఒక్క భావప్రకటన చాలు... మనకు ఎన్నో కబుర్లు చెబుతుంది. పంచభూతాల గురించి విశ్లేషణ... పంచభూతాలంటే భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు. వీటిని ఎవరు సృష్టించారో మనకు తెలీదు. వాటంతట అవే పుట్టాయని అనుకోవడం కంటే, వీటి పుట్టుకకు ఎవరో కారణం ఉన్నారని భావించి, ఆ కారకుడికి ‘దేవుడ’ని పేరు పెట్టుకోవడంలో తప్పేమీ లేదనుకుంటా! (నాస్తికవాదులు కూడా దీన్ని సమర్థిస్తారనుకుంటా. ఈ మధ్యనే విశ్వమంతటికీ మూలమైనది దైవకణమని కనిపెట్టారు కదండీ). కేజీ బంగారం కావాలా? ఐదు నిమిషాల గాలి కావాలా? అంటే - బంగారమే కావాలంటాం. ఏదైనా మంచి పదవి కావాలా? బిందెడు నీళ్లు కావాలా ? అంటే - పదవే కావాలంటాం! షడ్రసోపేతమైన భోజనం కావాలా? ఒక నిప్పుకణిక కావాలా? అంటే - భోజనమే కావాలంటాం! ప్రపంచాధికారం కావాలా? పదెకరాల భూమి కావాలా? అనడిగితే - అధికారమే ఆశిస్తాం! అద్భుతమైన ఆకాశహర్మ్యం కావాలా? ఆకాశంలో పక్షిలా ఎగరాలా? అని కోరితే - ఆకాశహర్మ్యాన్నే కోరుకుంటాం! ఇందుకు కారణం - అయాచితంగా మనకు లభించిన పంచభూతాలు. కానీ, కంటిన్యూస్‌గా ఒక నిమిషం గాలి పీల్చకపోతే చచ్చిపోతాం. యావత్తు జీవకోటినీ తన అధీనంలో ఉంచుకుని, నియమోల్లంఘన చేసేవారిని శిక్షించి, మరణం ప్రసాదించే అతి శక్తిమంతమైన ఈశ్వరుని ఆయుధం - గాలి! ఈ గాలి లేకపోతే, ఎన్ని టన్నుల బంగారం ఉండి ఏం లాభం చెప్పండి! శాస్త్రజ్ఞులు గ్రహాంతరయానం చేస్తూ, నీటి జాడల కోసం అన్వేషిస్తుంటారు. ఎందుకంటే - యావత్ ప్రాణికోటికీ అత్యంత ఆవశ్యకమైనది - నీరు. అది అందకపోతే, శరీరం శవంలా మారిపోతుంది. ఆ నీళ్ల ముందు పదవులేపాటి? ఇక - అగ్ని విషయానికొద్దాం. సర్వజగత్తుకీ కర్మసాక్షి సూర్యభగవానుడు. ఆయన కిరణాలు ప్రసరించనిదే నిద్రాణమైన సృష్టి మేల్కొనదు. మనిషి శరీరంలో వేడి నిర్ణీతంగా ఫలానా డిగ్రీలు ఉండాలి. లేకపోతే శవంతో సమానం. అగ్ని విలువ తెలుసుకోలేక, చిన్నపాటి రుచులకే దాసోహమంటున్నాం. దయాగుణంతో ఆ భగవంతుడు ప్రసాదించిన అగ్ని విలువ తెలుసుకోలేకపోతే మనం ఎందుకూ పనిచేయం! ఆకాశాన్ని తాకే హర్మ్యాల్లో నివసించాలనుకుంటాం గానీ, వీటన్నిటికీ ఛత్రమైన ఆకాశం విలువ మనకు తెలియదు. అసలు అన్నిటికీ పునాది అయిన భూమి విలువ కూడా మనకు వేరే కోణంలో తెలుసు తప్ప, అసలు కోణం గ్రహించడం లేదు. అసలు కోణం తెలిస్తే ఈ పంచ భూతాలు పంచ మహాద్భు తాలలా అనిపిస్తాయి. ఇష్టమైన ఆరుగురు ఫిలాసఫర్స్... 1. వ్యాసుడు: వ్యాసుడు తాను రాసిన మహాభారతంలోనే శ్రీకృష్ణునితో అర్జునునికి ఉపదేశించిన గీతా సారాంశాన్ని మించిన అత్యుత్తమమైన ఫిలాసఫీ ఇంకేముంటుంది? మానవుని మనుగడకు కావలసిన ధర్మ సూత్రాన్నీ, ధర్మ సూక్ష్మాలనూ నిబిడీకృతం చేసి, మానవాళికి అందించిన వేదాంతి ఆయన. 2. గౌతమ బుద్ధుడు: భగవంతునికీ, మానవునికీ మధ్య ఎటువంటి అంతరం లేకుండా ప్రత్యక్షంగా భగవంతునితో మాట్లాడుకునే అవకాశాన్ని తన అష్టాంగమార్గం ద్వారా తెలియపరిచిన తాత్వికుడు. 3. బమ్మెర పోతన: తెలుగు సాహిత్య చరిత్రలో బమ్మెర పోతన లాంటి తాత్వికుడైన కవి మరొకరు లేరు. ‘‘కలడందురు దీనుల యెడ - కలడందురు పరమయోగి గణముల పాలన్ - కలడందురు అన్ని దిశలను - కలడు కలండనెడివాడు కలడో లేడో’’ అనే ఆయన భాగవత పద్యం చూడండి. దేవుడు ఉన్నాడో లేడో అన్న మీమాంసకు ఆ కాలంలోనే తెర తీశాడు. మళ్లీ ఆయనే ‘‘ఇందుగల డందు లేడని సందేహము వలదు..’’ అంటూ, సర్వేశ్వరుడు ఎక్కడైనా ఉంటాడని చెప్పాడు. తన కవిత్వంతో విశ్వానికి కాంతిపథం చూపించాడు. 4. రామకృష్ణ పరమహంస: ఈ మహాత్ముడు చెప్పిన మాటను ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. సృష్టిలోని అణువణువులో భగవత్ స్వరూపాన్ని దర్శించుకున్న మహాత్ముడు. సాక్షాత్తూ ధర్మపత్నిలోనే అమ్మను దర్శించిన అద్భుత జ్ఞానయోగి. 5. స్వామి వివేకానంద: భారతీయ ధార్మికతను భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా విస్తరింపజేసిన రామకృష్ణ పరమహంస శిష్యుల్లో అగ్రగణ్యుడు - ‘నరేంద్రుడు’... వివేకానందుడు. ఈయన ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్తో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు అక్కర్లేదు. చికాగోలో జరిగిన ‘సర్వమత సభ’లో ఉపన్యసించినప్పుడు సభికులను ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అని సంబోధించడంలోనే ఆయన భారతీయత, తాత్విక విజ్ఞత ప్రస్ఫుటమవుతుంది. 6. రమణ మహర్షి: శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యం లేకుండా, మనసుకి ప్రాధాన్యమిస్తూ భగవంతుణ్ణి మనసులో పూజిస్తేచాలు. భగవంతుణ్ణి తనలో ప్రతిష్ఠింప జేసుకుని యావత్ ప్రాణికోటిలో దైవత్వాన్ని చూసిన తాత్వికుడాయన. ఆయన తత్వమంతా ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవాలనే! ఏ మానవుడైనా ‘నేను’, ‘నాది’ అన్న భావన వదిలిపెడితే, ‘ఇదంతా భగవంతుడిదే’ అనుకోగలిగితే అంతకంటే జ్ఞానం మరొకటి లేదు. ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా సంపాదించుకుని, మౌనమే భాషగా ఎంతోమందికి ఆధ్యాత్మిక భావనను అందజేసిన మహనీయుడు. కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగితే... నేను కలవాలనుకునే ఏడుగురు మహానుభావులు... 1. ఆది శంకరాచార్యులు - ఉపనిషత్తులు, వేదవేదాంగాలు ఆపోశన పట్టి ధార్మిక విశ్వరూపం చూపించిన మహానుభావుడు. 2. బమ్మెర పోతనామాత్యులు - శ్రీమదాంధ్ర మహాభాగవతం చదివి చూడండి. ‘సత్కవుల్ హాలికులైన నేమి’ లాంటి ఆయన పద్యపాదాలను అవగాహన చేసుకోండి. ఆయనను మించిన కమ్యూనిస్టు, ధార్మికవేత్త, తార్కికుడు, మహాకవి, శాస్త్రవేత్త, ఫిలాసఫర్ ఇంకెవరున్నారని మీరే అంగీకరిస్తారు. 3. వేమన - సమాజంలో ఉన్న రుగ్మతల్ని అతి సహజమైన శైలిలో, అందరికీ అర్థమయ్యే భాషలో ఎత్తిచూపి ఆత్మప్రబోధం చేసిన మహనీయుడు. 4. అల్లూరి సీతారామరాజు - పీడిత ప్రజల కోసం పోరు బాట పట్టి, జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ధైర్యశాలి. 5. సర్ ఆర్థర్ కాటన్ - ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు నీటి విలువ చెప్పి, కోట్ల ఎకరాల భూమిని పచ్చని మాగాణులను చేసి, తెలుగు నేలను సుభిక్షం చేసి, సుసంపన్నం కావించిన తెల్ల జాతీయుడు... కానీ మనవాడే! 6. మదర్ థెరిసా - దయాగుణాన్ని మించిన సౌందర్యం లేదని చాటిచెప్పిన విశ్వమాత. 7. చలం - కాలానికన్నా ముందుండి, స్త్రీ స్వేచ్ఛ కోసం రచనలు చేసిన - రచయిత. నేను మెచ్చిన ఎనిమిది పాటలు... మనసున మనసై, బతుకున బతుకై... (చిత్రం - ‘డాక్టర్ చక్రవర్తి’) మనసున మల్లెల మాలలూగెనే... (చిత్రం - ‘మల్లీశ్వరి’) అన్నానా భామిని... (చిత్రం - ‘సారంగధర’) హాయిహాయిగా ఆమని సాగే... (చిత్రం - ‘సువర్ణ సుందరి’) ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా... (చిత్రం - ‘రోజులు మారాయి’) కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్... (చిత్రం - ‘దేవదాసు’) లాహిరి లాహిరి లాహిరిలో... (చిత్రం - ‘మాయాబజార్’) సడి సేయకో గాలి... (చిత్రం - ‘రాజమకుటం’) నాకు నచ్చిన తొమ్మిది రచనలు... ధూర్జటి మహాకవి రచించిన ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’ విశ్వనాథ సత్యనారాయణ విరచిత ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ అన్నమయ్య సంకీర్తనా సాహిత్యం గుర్రం జాషువా రచించిన ‘ఫిరదౌసి’, ‘గబ్బిలం’ కావ్యాలు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ సి. నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన ‘విశ్వంభర’ కావ్యం. రావూరి భరద్వాజ ‘పాకుడు రాళ్లు’ నవల రావిశాస్త్రి ‘రాజు-మహిషి’ నవల. కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ నవల. -
నువ్వు స్కూటర్‌లాంటోడివి!
హాస్యం కొడుకు చేసే తిక్కపనులను తట్టుకోలేని తండ్రి ఆగ్రహంతో చెంపలు వాయించాడు. కానీ ఆ తరువాత బాధ పడి కొడుకుకు ‘సారీ’ చెప్పాడు. కొడుకు (కోపంగా): ఒక పేపర్‌ను ఎలా పడితే అలా చించండి. ఆ తరువాత ‘సారీ... నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు. మళ్లీ అతుక్కోండి... యధావిదిగా ఉండండి’ అని పేపర్‌కు చెబితే అతుక్కుంటుందా? నేను కూడా అంతే. మీ ‘సారీ’ నాకు అక్కర్లేదు. తండ్రి: నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. అయితే నేను చెప్పింది కూడా విను. సపోజ్...నా డొక్కు స్కూటర్‌ను ‘స్టార్ట్ కావాలి’ అని చెబితే వింటుందా? 3-4 కిక్కులు ఇస్తేగానీ స్టార్ట్ కాదు. కాబట్టి...నువ్వు పేపర్లాంటోటివి కాదు...స్కూటర్‌లాంటోడివి! ఒక్కరే... పెళ్లికాని కొడుకు: నాన్న నాకు పెళ్లి చేయవద్దు. అమ్మాయిలంటే నాకు తెగ భయం! నాన్న: చేసుకో నాయినా. అప్పుడు నీకు ఒక్కరు తప్ప అందరూ మంచివాళ్లలాగే అనిపిస్తారు. -
పేరడీ కామెడీలో సునామీ
హిట్టయిన పాత్రలు, నిజజీవిత మనుషులను వెండితెరపై అనుకరించడంలో అగ్రశ్రేణి నటుడు - ఎమ్మెస్. ఆ సినిమాలు ఇవాళ్టికీ టీవీ చానళ్ళలో వాటి ఒరిజినల్ హీరోలనూ, గెటప్లనూ గుర్తు చేస్తూ కామెడీ పండిస్తున్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా’లో ఫ్యాక్షన్ చిత్రాల హీరోలకు పేరడీగా రెడ్డినాయుడు (రెనా) పాత్రలో నవ్వించారు. ‘బాద్షా’లో హార్రర్ చిత్రాల రివెంజ్ నాగేశ్వరరావుగా ఒక ప్రముఖ దర్శకుణ్ణి గుర్తుకు తెస్తూ, పదే పదే ట్వీట్లు చేసే పాత్రను పండించారు. ‘దుబాయ్ శీను’లో నటుడు ఫైర్‌స్టార్ సాల్మన్రాజుగా నిన్నటి తరం అగ్రహీరో ఒకరిని అనుకరిస్తూ ఆయన చేసిన గోడ మీద పిడకల స్టెప్పు, డైలాగ్ మాడ్యులేషన్ తెగ నవ్వించాయి. ‘దూకుడు’లో పోషించిన బొక్కా వెంకటరత్నం పాత్ర రిపీట్ ఆడియన్స్‌ను రప్పించింది. దాంతో ఎమ్మెస్ పేరడీ కామెడీలో స్టార్ హీరో అయ్యారు. -
అలా జరిగిందన్నమాట!
హాస్యం భర్త రమేష్: ప్రియా, రేపటి నుంచి యోగా క్లాసులకు వెళ్లాలనుకుంటున్నాను. నువ్వూ వస్తావా? భార్య ప్రియ: అంటే మీ ఉద్దేశం...నేను లావై పోయాననే కదా! అంటే మీరేదో సన్నగా ఉన్నట్లు... నేనేదో లావుగా ఉన్నట్లు... భర్త: ఈ మాత్రం దానికే కోపం తెచ్చుకుంటే ఎలా? వస్తే వచ్చేయ్ లేకుంటే లేదు. భార్య: అంటే... రావడం రాకపోవడం అనేదాంట్లో నా ప్రమేయం ఏమీ లేదన్నమాట. మీరు రమ్మంటే వచ్చేయాలి. లేదంటే ఇంట్లో కూర్చోవాలా? భర్త: ప్రతిదానికీ అపార్థం చేసుకుంటే ఎలా? భార్య: అంటే నేనేదో అపార్థం చేసుకోవడానికే పుట్టినట్లు, మీరేదో యోగా చేయడానికి పుట్టినట్లు... భర్త: బుద్ధి తక్కువై యోగాకు వెళ్లాలనుకున్నాను. ఇక ఈ జన్మలో వెళ్లను. భార్య: అంటే నేనేదో మిమ్మల్ని హింసించి.... భర్త... పరుగో పరుగు! -
నా పేరుకు పాతికేళ్లు పూర్తయ్యాయి..!
సంభాషణం ‘శివ’ సినిమాతో పాటు ఇటీవలే పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొన్న నటుడు చిన్నా. మంచి టైమింగ్ ఉన్న కామెడీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన చిన్నా ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా కూడా ఒక ప్రయత్నం చేసి మరికొన్ని ప్రయత్నాలకు సన్నద్ధం అవుతున్న చిన్నాతో చిన్న సంభాషణం... ఎ.జితేంద్ర రెడ్డి. ఇదీ నా అసలు పేరు. ‘శివ’ సినిమాలో నా పాత్ర పేరు ‘చిన్నా’, ఆ సినిమా సూపర్‌హిట్ కావడం, అందులో నా పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించడంతో తెరపై ‘చిన్నా’ గానే గుర్తింపు పొందాను. ఇటీవలే శివ సినిమాకు 25యేళ్లు పూర్తయ్యాయి. ఆ విధంగా నా పేరుకు కూడా పాతికేళ్లు! సినిమాలవైపు ఎలా వచ్చారు? అవకాశాలు ఎలా లభించాయి? మాది నెల్లూరు జిల్లా వాకాడు. మా అమ్మ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి గారి సోదరి. అక్కడ మాకు సొంతంగా థియేటర్ ఉంది. దాని పుణ్యమా అని చిన్న వయసులోనే సినిమాల మీద ఆసక్తి మొదలైంది. నటుడిని కావాలనే తపన కలిగింది. దీంతో చెన్నై వెళ్లిపోయాను. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘శివ’ సినిమా కోసం న్యూటాలెంట్‌కు అవకాశం అంటూ ఇచ్చిన పేపర్ యాడ్‌ను పట్టుకొని వాళ్ల ఆఫీస్‌కు వెళ్లాను. నచ్చడంతో ‘చిన్నా’ పాత్రకు సెలెక్ట్ చేసుకొన్నారు. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ‘మనీ’తో మంచి గుర్తింపు దక్కింది. దాంతో చాలా సినిమాల్లో సెకెండ్‌హీరో అయ్యాను. ఫామ్‌లో ఉన్నప్పుడు సోలో హీరోగా ట్రై చేయాలనిపించలేదా? కొంతమంది నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే నేను సోలో హీరోగా చేస్తే సినిమాకు మార్కెట్ ఉంటుందనే నమ్మకం కలగలేదు. అందుకే వెనక్కు తగ్గాను. ఇద్దరూ, ముగ్గురు నటులు హీరోలుగా కనిపించే సినిమాలనే ఎంచుకొన్నాను. తగినంత గుర్తింపు రాలేదని అనుకొంటున్నారా..? లేదండీ, నాతో పాటుగా కెరీర్ ప్రారంభించిన వారిలో కొందరు హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకొన్నారు. అయితే వాళ్లతో పోల్చుకొని ఆ స్థాయికి చేరలేదని బాధపడే రకం కాదు నేను. నాకు వచ్చిన గుర్తింపు, లభించిన అవకాశాలతో సంతృప్తిగా ఉన్నాను. పాతికేళ్ల నటప్రస్థానంలో సినిమా విషయంలో గమనించిన మార్పులేమిటి? నటులుగా అవకాశం, గుర్తింపు విషయంలో మా తరం వారిది నార్మల్ డెలివరీ అయితే, ఈ తరం వారు సిజేరియన్ డెలివరీ తరహాలో నటులుగా జన్మను పొందుతున్నారు. మేము సహజంగా ప్రసవ వేదనతో గుర్తింపు తెచ్చుకొన్నాం. చాలా సినిమాల్లో చేస్తే తప్ప ఒక మేగజైన్లో ఫోటో పడేది కాదు. ఇప్పుడు ఒక్క సినిమాలో కూడా చేయని వారే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమాల గురించి చెప్పాలంటే.. నేను నటించిన సినిమాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో నాకే తెలియడం లేదు. రెండు మూడు రోజుల డేట్స్ తీసుకొని షూటింగ్ చేస్తారు, ఐదారు నెలల తర్వాత ఫోన్ చేసి డబ్బింగ్ చెప్పాల్సి ఉంది రమ్మంటారు! ఇలాంటివన్నీ చూస్తుంటే నాటి వారితో పోలిస్తే వృత్తిపట్ల అంకితభావం బాగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. నేను సోలో హీరోగా చేస్తే సినిమాకు మార్కెట్ ఉంటుందనే నమ్మకం కలగలేదు. అందుకే వెనక్కు తగ్గాను. మీ అసలు పేరేమిటి? ‘చిన్నా’గా ఎలా ఫేమసయ్యారు?! దర్శకుడిగా కూడా ఒక ప్రయత్నం చేశారుగా... భవిష్యత్తుల్లో మళ్లీ మెగాఫోన్ చేతపడతారా? ప్రస్తుతం నేను సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. మళ్లీ సినిమాకు డెరైక్షన్ చేసే ఆసక్తి ఉంది. నూతన సంవత్సరంలో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. సినిమా, సీరియల్... తేడా ఏమనిపించింది? ఈ మధ్య కొన్ని సినిమాల కన్నా సీరియళ్ల నాణ్యతే బాగుంటోంది. సీరియళ్ల చిత్రీకరణకే మంచి కెమెరాలు వాడుతున్నారు. నా వరకూ అయితే నటన అనే ప్రొఫెషన్ మీద ఆసక్తి, గౌరవం ఉంది కాబట్టి రెండూ ఒకటే. కమర్షియల్‌గా ఆలోచిస్తే తేడా ఉంటుందేమో. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అంటున్నారు.. మరి మీరూ రాజకీయాలవైపు వస్తారా? స్వతహాగా నేను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి అభిమానిని. వాకాడులో మా కుటుంబం వైఎస్సార్సీపీ తరపున పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంది. నాకు కూడా ఆసక్తి ఉంది కానీ, నా మనస్తత్వంతో రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టమనిపిస్తుంది. అందుకే ప్రస్తుతానికి దూరంగానే ఉంటున్నా. భవిష్యత్తులో యాక్టివ్ పొలిటీషియన్‌గా మారినా ఆశ్చర్యపోవద్దు! - బీదాల జీవన్ రెడ్డి -
జోకింగ్ 26th Dec 2014
-
మిత్రహాస్యం
ఒకరిది నిజామాబాద్.. ఇంకొకరిది కరీంనగర్.. మరొక రిది తాడేపల్లిగూడెం.. వేరొకరిది విశాఖపట్నం.. ఇలా వాడవాడల నుంచి హైదరాబాద్ చేరుకున్న వీరిని మంచి మిత్రులను చేసింది మాత్రం హాస్యమే. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా.. కష్టనష్టాలున్నా.. వీరికి తెలిసింది నవ్వించడం ఒకటే. అందుకే ఈ స్నేహితులు కామెడీ ట్రాక్ ఎక్కిన ప్రతిసారీ నవ్వుల మతాబులు వెలుగుతూనే ఉంటాయి. వెండితెర, బుల్లితెర.. ఇలా వేదికేదైనా తమ పంచ్‌లతో దుమ్మురేపుతున్న పటాకాలను ‘సిటీప్లస్’ పలకరించింది. - శిరీష చల్లపల్లి జీవితంలో భాగం.. నేను 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. వైజాగ్ ఆంధ్ర రేడియో స్టేషన్లో అనౌన్స్మెంట్ చేసేవాణ్ని. మిమిక్రీ కూడా చేసేవాణ్ని. తర్వాతి కాలంలో దూరదర్శన్‌లో చిన్న చిన్న నాటికలు, స్కిట్స్ రాయడం, యాంకరింగ్ చేయడంతో గుర్తింపు వచ్చింది. దాని ద్వారా సినిమాల్లో అవకాశాలొచ్చాయి. 150 సినిమాల వరకూ చేశాను. మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను. నాకు గుర్తింపు తెచ్చిన కామెడీని ఎప్పుడూ విడిచిపెట్టను. ఈ ట్రాక్‌లోకి రాకపోయి ఉంటే.. టీచర్‌గా ఉండేవాడినేమో. ధన్‌రాజ్, వేణు వీళ్లంతా ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. హైదరాబాద్, సినీఫీల్డ్ నా జీవితంలో భాగమైపోయాయి. - రాఘవ బ్రహ్మాండంగా చేయాలని.. నేను బేసిక్‌గా మిమిక్రీ ఆర్టిస్ట్‌ని. నాకు అన్నయ్య, అమ్మ.. వీళ్లే నా లోకం. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నా మిమిక్రీని చూసిన పక్క అపార్ట్మెంట్లో ఉన్న డెరైక్టర్ వి.ఎన్.ఆదిత్య గారు నన్ను మెచ్చుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు సాయం చేయలేదు. జీవితాన్నే ఇచ్చారు. ఆయన మేలు నేనెన్నటికీ మరువను. నాకు బ్రహ్మానందం గారే ఇన్స్పిరేషన్. నా జీవిత లక్ష్యం కూడా అదే. ఆయనంత స్థాయికి ఎదగాలని. అందుకే యే స్కీట్లు, యే షూట్లు చేసినా రియలిస్టిక్‌గా చేస్తుంటాను. అందుకు నిదర్శనం.. నా వంటి మీద ఉన్న గాయాలే. నాకు ధన్‌రాజ్ అంటే అమ్మలాగా, అన్న లాగా.. ఆయన పక్కనుంటే నాకెంతో ధైర్యం. - రాకేశ్ అమితాబ్‌తో చేశా.. సినిమాల్లో కనిపించడానికి 1999లో కరీంనగర్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాను. మా అమ్మానాన్నలకు తొమ్మిది మంది సంతానం. నేనే చిన్నవాడ్ని. అందరూ గారాబంగా చూసేవాళ్లు. వాళ్లు తిన్నా తినకపోయినా.. నాకు మాత్రం మూడు పూటలా తిండి పెట్టేవారు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయింది. ఇంట్లో ముప్పొద్దులా తినే అలవాటాయె.. ఇక్కడ అష్టకష్టాలు పడ్డాను. అన్నపూర్ణ స్టూడియో బయట గేటు దగ్గర ఎన్నో రోజులు, వచ్చిపోయే వాళ్లను చూస్తూ ఉండేవాణ్ని. సెట్లు వేసి తీసే పని, చెత్త తీసే పని ఒక్కటని కాదు ఎన్నెన్నో చేశాను. సెట్బాయ్గా, అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. అలా పనిచేస్తూ.. ‘జై’ సినిమాలో మొదటిసారి కనిపించాను. తెలుగు సినిమాలే కాదు, 3 తమిళ సినిమాల్లో నటించాను. ఒక హిందీ సినిమాలో అమితాబ్‌తో ఒక షాట్ చేశాను. నేను, ధన్‌రాజ్, చంద్ర కలిసి పలు సినిమాల ఆడియో ఫంక్షన్స్‌లో కామెడీ స్కిట్స్ చేశాం. నన్ను చేరదీసి, తిండిపెట్టి.. ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి ‘కత్తపల్లి శేషు’ అండ్ ‘చిత్రం శ్రీను’. వీరిద్దరినీ మరిచిపోలేను. నేను మొదట్లో చిత్రం శ్రీనుకి మేకప్ వేసేవాడిని. ఆయనే నాకు ఇన్స్పిరేషన్, ప్రాణ మిత్రుడు అన్నీ..! - వేణు వీళ్లే ఆ నలుగురు.. మాది నిజామాబాద్. 10వ తరగతి దగ్గరే నా చదువుకు ఫుల్స్టాప్ పడింది. చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగే గొడవలను చూసేవాణ్ని. తర్వాత అద్దంలో చూసుకుంటూ వాటినే ఇమిటేట్ చేసేవాడిని. ఆడోళ్లను బాగా ఇమిటేట్ చేసేవాణ్ని కదా.. అందుకే ఇప్పుడు చీరకట్టుతో అదరగొడుతున్నాను. ఇప్పటి వరకు 35 సినిమాలు చేశాను. వీటిలో కొన్ని రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. నేను, వేణు, తాగుబోతు రమేష్, శ్రీను, రామ్‌ప్రసాద్ మంచి స్నేహితులం. కష్టనష్టాలు పంచుకోవడానికి నలుగురు ఉంటే బాగుండునని అందరూ అనుకుంటారు. ఆ నలుగురు నాకు వీళ్లే. ఫైట్స్ లేని విలన్‌గా.. మాది తాడేపల్లిగూడెం. మా ఇంటి గోడలకు మొత్తం సినిమా పోస్టర్లు అతికించి ఉండేవి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ.. తింటున్నా.. కూర్చున్నా.. ఏం చేసినా.. వాటిని చూడటమే నా పని. వన్ ఫైన్ డే చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమా పోస్టర్ చూసి యాక్టర్ అవ్వాలని ఫిక్సయిపోయాను. టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా.. బస్సెక్కి హైదరాబాద్ వచ్చేశాను. 12 ఏళ్ల కిందటి ముచ్చట. జై సినిమాలో మొదటిసారి కనిపించా. తర్వాత 70 సినిమాల దాకా చేశాను. హీరోగా కూడా ఒక సినిమా చేశాను. విలన్ క్యారెక్టర్ నా డ్రీమ్ రోల్. ఫైటింగ్‌లు లేనివేనండోయ్. రఘువరన్‌లా అదరగొట్టాలని ఉంది. అలాగని నాకు తిండి పెట్టిన కామెడీని మాత్రం వదలను. హైదరాబాద్ పుష్పక విమానం లాంటింది. ఎందరొచ్చినా.. ఇంకొకరికి కచ్చితంగా ప్లేస్ ఉంటుంది. - ధన్‌రాజ్ జర్నలిస్ట్ అయ్యేవాణ్ని.. నేను 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. మొదట్లో మా టీవీ, టీవీ 9, టీవీ 1, లోకల్ చానల్స్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా, డెరైక్టర్‌గా పనిచేశాను. కామెడీ సైడ్ రాకపోయుంటే.. జర్నలిస్ట్‌గా స్థిరపడేవాణ్ని. ఇప్పుడిప్పుడే సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయి. ఎప్పటికైనా ప్రకాశ్‌రాజ్‌లా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని కోరుకుంటున్నాను. టాలెంట్, పట్టుదల ఉంటే చిత్ర పరిశ్రమ ఆదరిస్తుందని గట్టిగా నమ్ముతాను. నాతో కష్టసుఖాలు పంచుకునే సుధీర్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. - శ్రీను -
మేముసైతంలో కడుపుబ్బ నవ్వించిన బ్రహ్మీ
-
లవ్లీ ఎఫెక్షన్
హావభావాలు... గిలిగింతలు పెడతాయి. డైలాగులు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నవ్వుల రారాజు... ఢిల్లీ రాజు... ఎవరికి తోచినట్టు వారు ప్రేమగా పిలుచుకొంటారతడిని.రంగస్థలంసై ఉన్నా... వెండి తెరపై మెరిసినా... బుల్లి తెరపై ఇంట కనిపించినా... హాస్యపు జల్లులు కురుస్తాయి. సుతిమెత్తని కామెడీతో... మదిమదినీ మురిపిస్తున్న హాస్యనటుడు రాకేష్బేడీ. సినిమాలు, టీవీ నటుడిగా బిజీగా ఉన్నా...తనను నిలబెట్టిన రంగస్థలాన్ని మాత్రం ఆయన ఇప్పటికీ వదల్లేదు. నాటకాల్లో నటిస్తూ... అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన రాకేష్ ఇటీవల ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్లో భాగంగానగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో ఆయన ‘చిట్‌చాట్’... రుచికరమైన ఆహారం... మాట్లాడే భాష... ప్రజల స్నేహపూర్వక స్వభావం... హైదరాబాద్ నగరంలో నాకు బాగా నచ్చే అంశాలివి. ఇక్కడి వారు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడే తీరు బాగుంటుంది. వారి మాటల్లో లవ్లీ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈ సిటీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినా వదులుకోను. సిటీజనులు నన్నో గొప్ప నటుడిలా చూస్తున్నారు. వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రేక్షక దేవుళ్లకు కోటి దండాలు. తొలి సారి... తొలిసారి హైదరాబాద్‌కు ‘ఏక్ దూజే కేలియే’ హిందీ చిత్రం షూటింగ్ కోసం వచ్చా. ఇక అక్కడి నుంచి వస్తూనే ఉన్నా. 1979తో సహాయనటుడుగా సినీ కేరీర్ ప్రారంభించా. ఎన్నో టీవీ సీరియల్స్ చేశా. 150పై బడి సినిమాల్లో నటించాను. రంగస్థలం మీద ప్రదర్శనలైతే లేక్కే లేదు. యువత నటన వైపు... నేటి తరంలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. చూస్తే చాలు... ఏదైనా చేసేసే టైపు. శ్రమను నమ్ముకుని పట్టుదలగా ముందుకు సాగితే అవకాశాలు వాతంటవే మన తలుపు తడతాయి. ఇప్పుడు ఒక విషయం గురించిన సమాచారం కావాలంటే... నెట్లో కావల్సినంత సమాచారం చిటికెలో దొరుకుతుంది. టాలెంట్‌ను ప్రదర్శించుకోవడానికి బోలెడన్ని ప్రసార మాధ్యమాలు. నటుడిగా రాణించాలంటే సెల్ఫ్ డిసిప్ల్లిన్, నిరంతర అధ్యయనం ఉండాలి. -
బైబై...కామిక్ కాన్
చిత్ర విచిత్రాలకు వేదికగా, నవ్వింతల కవ్వింతల మాలికగా అలరించి... సిటీలో జరిగిన మూడు రోజుల కామిక్ కాన్ ఫస్ట్ ఎడిషన్ సూపర్ హిట్టయింది. బాహుబలి సినిమా క్యారెక్టర్ల ప్రదర్శన, సిల్వర్ సర్ఫర్, గ్రీన్ లాంత్రెన్ బుక్స్‌తో పాపులరైన అమెరికన్ కామిక్ బుక్ రైటర్ రాన్ మార్జ్, న్యూయార్క్ బెస్ట్ సెల్లింగ్, అవార్డ్ విన్నింగ్ ఆథర్ వివేక్ తివారీ వంటి సెలబ్రిటీ రైటర్ల సెషన్స్‌తో అటు వినోదం ఇటు విజ్ఞానాల మిక్స్డ్ ఈవెంట్‌గా అలరించింది. చిన్నారుల అభిమాన కామిక్ , సూపర్‌హీరో, గేమింగ్ క్యారెక్టర్లు అక్కడ ప్రత్యక్షమై సందడి చేశారు. సూపర్ లూజర్స్ కామెడీ ప్లే ఆకట్టుకుంది. సైనగిరి స్టూడియోస్ ది రోబోస్ ధర్మ, రాహుల్ ఫిలిప్ అందించిన లైవ్కాన్సెప్ట్ ఆర్ట్, సిద్సూద్ నిర్వహించిన ఫ్రీ స్టైల్ ర్యాపింగ్లు అలరించాయి. ఈవెంట్లో భాగంగా కాంటెస్ట్‌లలో లక్కీ విన్నర్లకు బహుమతులు అందించారు. గరుడ, ఐటమ్ ధమాకా, సెవెన్బీట్స్, డ్రాగన్ కింగ్, సర్వసంగ్రామ్ బుక్ లాంచ్‌లు సందడిగా సాగాయి. ఫంకీ డిజైన్స్, కలెక్టిబుల్ టాయ్స్ వంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్‌తో ఏర్పాటు చేసిన ‘పాప్ కల్చర్ విలేజ్’ విజిటర్స్ అటెన్షన్ అందుకుంది. ఈ ఏడాది వచ్చిన స్పందన అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చిందని.. వచ్చే ఏడాది మరింత భారీగా సిటీలో నిర్వహిస్తామని కామిక్‌కాన్ ఇండియా ఫౌండర్ జతిన్ వర్మ చెప్పారు. -
శీనుగాడి కామిడీ