అలా జరిగిందన్నమాట! | sakshi fun | Sakshi
Sakshi News home page

అలా జరిగిందన్నమాట!

Published Tue, Jan 20 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

అలా జరిగిందన్నమాట!

అలా జరిగిందన్నమాట!

 హాస్యం
 
భర్త రమేష్: ప్రియా, రేపటి నుంచి యోగా క్లాసులకు వెళ్లాలనుకుంటున్నాను. నువ్వూ వస్తావా?
భార్య ప్రియ: అంటే మీ ఉద్దేశం...నేను లావై పోయాననే కదా! అంటే మీరేదో సన్నగా ఉన్నట్లు... నేనేదో లావుగా ఉన్నట్లు...
భర్త: ఈ మాత్రం దానికే కోపం తెచ్చుకుంటే ఎలా? వస్తే వచ్చేయ్ లేకుంటే లేదు.
భార్య: అంటే... రావడం రాకపోవడం అనేదాంట్లో నా ప్రమేయం ఏమీ లేదన్నమాట. మీరు రమ్మంటే వచ్చేయాలి. లేదంటే ఇంట్లో కూర్చోవాలా?
భర్త: ప్రతిదానికీ అపార్థం చేసుకుంటే ఎలా?
భార్య: అంటే నేనేదో అపార్థం చేసుకోవడానికే పుట్టినట్లు, మీరేదో యోగా చేయడానికి పుట్టినట్లు...
భర్త: బుద్ధి తక్కువై యోగాకు వెళ్లాలనుకున్నాను. ఇక ఈ జన్మలో వెళ్లను.
భార్య: అంటే నేనేదో మిమ్మల్ని హింసించి....
భర్త... పరుగో పరుగు!
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement