సిటీలో స్థిరపడిన స్టాండప్ కామెడీ కల్చర్
నగరవ్యాప్తంగా తరచూ ఏర్పాటవుతున్న షోస్
కామెడీ ఈవెంట్స్ నిర్వహణకు ప్రత్యేక సంస్థలు
స్టాండప్ కామెడీని కెరీర్‌గా చేపడుతున్న యూత్
‘ఈ రోజు వర్క్ ఫుల్ స్ట్రెస్ అనిపించింది బ్రో.. ఏదైనా మంచి స్టాండప్ కామెడీ షో ఉంటే చూడు పోదాం’ ఫ్రెండ్స్ ముచ్చట్లలో ఇలాంటివి సర్వసాధారణంగా మారాయి. ఇటీవల సిటీలో అత్యధికులకు స్టాండ్–అప్ కామెడీ చేరువైన పరిస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి వేదికపై నుంచి జోకులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే స్టాండ్–అప్ కామెడీ. దాదాపుగా ఓ 15ఏళ్ల క్రితం నగరవాసులు ఎవరూ ఈ పదం విని ఉండరు.. గతేడాది అలా దూసుకువచ్చి సూపర్‌హిట్ కొట్టిన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా స్టాండప్ కామెడీ అంటే ఏంటో నగరవాసులకు మరింత పరిచయం చేసింది.
ప్రస్తుతం నగరవ్యాప్తంగా అనేక మంది స్టాండ్ అప్ కామెడీ అంటే ఇష్టపడుతున్నారు. సాంకేతిక విప్లవంతో సోషల్ మీడియా పుణ్యమాని హాస్యం అందించే విభిన్న ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా హాస్యం పండించేవారు లక్షలాది మందికి చేరువ కావడానికి అవకాశాలు పెరిగాయి. యూట్యూబ్ ద్వారా రస్సెల్ పీటర్స్ వంటి హాస్య సమర్పకులు గణనీయమైన ఫాలోయింగ్‌ను సాధించారు. దాంతో చాలా మంది ఆ బాటను అనుసరించారు. ఇది స్టాండ్–అప్ కామెడీ కెరీర్‌గా వృద్ధి చెందేందుకు దారితీసింది.
కామెడీకి స్వర్ణయుగం..
ఓ రకంగా 2010 సంవత్సరం నుంచి రెండేళ్ల కాలాన్ని కామెడీకి స్వర్ణయుగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది నేటి మేటి హాస్య సమర్పకులు అనేక మంది తమ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన సమయం. జాకీర్ ఖాన్, సపన్ వర్మ, కరుణేష్ తల్వార్ తదితరులు మన నగరంతో సహా పలుచోట్ల ఇచ్చిన ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. అమిత్ టాండన్, నీతి పల్టా అభిõÙక్ ఉప్మన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, ఆకాష్‌గుప్తా, సమయ్ రైనా, హర్ష గుజారాల్ వంటివారు ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. పాపులారిటీ కారణంగా కొందరు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అదేవిధంగా కొందరు వివాదాస్పద హాస్యంతో వివాదాలకు చిరునామాగా మారడం, అలాంటి కమెడియన్ల షోలకు నగరంలో అనుమతి నిరాకరిస్తుండటం కూడా మనకు తెలిసిందే.
సెలబ్రిటీలు సైతం..
ఓ వైపు స్టాండప్ కామెడీ అనేక మంది సాధారణ వ్యక్తుల్ని సెలబ్రిటీలుగా మారుస్తుంటే.. కొందరు సెలబ్రిటీలు తామే స్టాండప్ కామెడీకి జై కొడుతున్నారు. ‘నా దగ్గర చెప్పడానికి కొన్ని కథలు ఉన్నాయి, అవి తమాషాగా ఉండి స్టాండ్–అప్ కామెడీకి నప్పుతాయి. అందుకే 59 సంవత్సరాల వయస్సు గల స్టాండ్–అప్ కామిక్‌ని అనుకుంటున్నాను’ అని చెప్పారు సినీనటుడు అశిష్ విద్యారి్థ. ఇటీవలే స్టాండప్ కామెడీలోకి ప్రవేశించిన ఈయన నగరంలో తన కామెడీ ప్రదర్శన కూడా ఇచ్చారు. చిన్న చిన్న సమూహాల కోసం కేఫ్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, ఆఖరికి కార్పొరేట్ కంపెనీల్లో సైతం తరచూ వీరి షోస్ నిర్వహించడం పరిపాటిగా మారింది. ప్రత్యేకంగా గచి్చ»ౌలిలోని కామెడీ థియేటర్ తరహాలో పలు క్లబ్స్ కూడా ఏర్పాటయ్యాయి.
ప్లేస్.. పబ్లిక్‌ని బట్టి..
క్లబ్స్‌లో ఒకలా, లాంజ్ బార్లయితే మరోలా, కేఫ్స్‌లో ఇంకోలా.. ఇలా ప్రదర్శించే చోటును బట్టి హాజరయ్యే ప్రేక్షకులను బట్టి స్టాండప్ కామెడీ స్క్రిప్ట్ మెటీరియల్ మారుతుంటుంది. అలాగే ఈ కమెడియన్స్‌లో కూడా రాజకీయాలకు కొందరు రిలేషన్‌షిప్స్, శృంగారభరిత హాస్యానికి కొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పెషలైజ్డ్ అవుతున్నారు. నగరంలో పేరొందిన స్టాండప్ కమెడియన్స్ దాదాపుగా 25 మంది దాకా ఉంటారు. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా షోకి రూ.10 వేలు నుంచి మొదలవుతూ.. భారీగానే ఉంటోంది. రోజువారీ పని ఒత్తిడిలో పడి నవ్వలేకపోవడం అనే రోగానికి గురైన వారికి చికిత్స చేసి నవ్వడం అనే భోగాన్నిస్తూ నవ్వించే యోగులుగా మారారు స్టాండప్ కమెడియన్స్. ‘పని సంబంధిత ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ ఆధునిక యుగంలో హాస్యం ఒక గొప్ప మార్గం’ అని చెన్నైకి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయిన ఎవామ్ డైరెక్టర్ సునీల్ విష్ణు.కె అంటున్నారు. జీవితం అత్యంత సంక్లిష్టమైంది దాన్ని వీలైనంత సరదాగా ఆహ్లాదకరంగా మనం మార్చాలి, హాస్యం లేకుండా జీవితం భరించలేనంత బోరింగ్‌గా అనిపిస్తుందని నమ్ముతున్నా అని ప్రస్తుతం దక్షిణాదిలోని అగ్రగామి కామెడీ షోస్ నిర్వాహక సంస్థ ఎవామ్ డైరెక్టర్ చెబుతున్నారు.
కొలీగ్స్‌ని నవ్వించడమే.. కెరీర్‌గా మారింది
అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్స్‌తో జోక్స్ వేసి సరదాగా నవ్వించడమే అలాగే ఓ సారి కంపెనీ పెట్టిన కాంటెస్ట్‌లో పాల్గొని కామెడీ షో చేస్తే అది హిట్ అవడం.. ఫైనల్‌గా నేను స్టాండప్ కమెడియన్‌గా మారడం.. జరిగింది. ప్రస్తుతం నగరంలోని పలు వెన్యూస్‌లో తరచూ కామెడీ షోస్ సమరి్పస్తున్నాను. విభిన్న రకాల అంశాలను మేళవించి నవ్వించడం నా శైలి. ఇతర మెట్రో నగరాల్లో బాగా వేళ్లూనుకున్న ఈ ప్రొఫెషన్ నగరంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. నా షోస్ ఎక్కువగా నగరంలోని అరోమలి కేఫ్, పక్కా లోకల్, కామెడీ థియేటర్.. తదితర చోట్ల ఉంటాయి.
– సందేశ్ జానీ, స్టాండప్ కమెడియన్
Comments
Please login to add a commentAdd a comment