stand up show
-
Stand-Up Comedy Show: నిలబడి.. నవ్వుల జడి..
‘ఈ రోజు వర్క్ ఫుల్ స్ట్రెస్ అనిపించింది బ్రో.. ఏదైనా మంచి స్టాండప్ కామెడీ షో ఉంటే చూడు పోదాం’ ఫ్రెండ్స్ ముచ్చట్లలో ఇలాంటివి సర్వసాధారణంగా మారాయి. ఇటీవల సిటీలో అత్యధికులకు స్టాండ్–అప్ కామెడీ చేరువైన పరిస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి వేదికపై నుంచి జోకులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే స్టాండ్–అప్ కామెడీ. దాదాపుగా ఓ 15ఏళ్ల క్రితం నగరవాసులు ఎవరూ ఈ పదం విని ఉండరు.. గతేడాది అలా దూసుకువచ్చి సూపర్‌హిట్ కొట్టిన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా స్టాండప్ కామెడీ అంటే ఏంటో నగరవాసులకు మరింత పరిచయం చేసింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా అనేక మంది స్టాండ్ అప్ కామెడీ అంటే ఇష్టపడుతున్నారు. సాంకేతిక విప్లవంతో సోషల్ మీడియా పుణ్యమాని హాస్యం అందించే విభిన్న ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా హాస్యం పండించేవారు లక్షలాది మందికి చేరువ కావడానికి అవకాశాలు పెరిగాయి. యూట్యూబ్ ద్వారా రస్సెల్ పీటర్స్ వంటి హాస్య సమర్పకులు గణనీయమైన ఫాలోయింగ్‌ను సాధించారు. దాంతో చాలా మంది ఆ బాటను అనుసరించారు. ఇది స్టాండ్–అప్ కామెడీ కెరీర్‌గా వృద్ధి చెందేందుకు దారితీసింది. కామెడీకి స్వర్ణయుగం.. ఓ రకంగా 2010 సంవత్సరం నుంచి రెండేళ్ల కాలాన్ని కామెడీకి స్వర్ణయుగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది నేటి మేటి హాస్య సమర్పకులు అనేక మంది తమ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన సమయం. జాకీర్ ఖాన్, సపన్ వర్మ, కరుణేష్ తల్వార్ తదితరులు మన నగరంతో సహా పలుచోట్ల ఇచ్చిన ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. అమిత్ టాండన్, నీతి పల్టా అభిõÙక్ ఉప్మన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, ఆకాష్గుప్తా, సమయ్ రైనా, హర్ష గుజారాల్ వంటివారు ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. పాపులారిటీ కారణంగా కొందరు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అదేవిధంగా కొందరు వివాదాస్పద హాస్యంతో వివాదాలకు చిరునామాగా మారడం, అలాంటి కమెడియన్ల షోలకు నగరంలో అనుమతి నిరాకరిస్తుండటం కూడా మనకు తెలిసిందే. సెలబ్రిటీలు సైతం.. ఓ వైపు స్టాండప్ కామెడీ అనేక మంది సాధారణ వ్యక్తుల్ని సెలబ్రిటీలుగా మారుస్తుంటే.. కొందరు సెలబ్రిటీలు తామే స్టాండప్ కామెడీకి జై కొడుతున్నారు. ‘నా దగ్గర చెప్పడానికి కొన్ని కథలు ఉన్నాయి, అవి తమాషాగా ఉండి స్టాండ్–అప్ కామెడీకి నప్పుతాయి. అందుకే 59 సంవత్సరాల వయస్సు గల స్టాండ్–అప్ కామిక్ని అనుకుంటున్నాను’ అని చెప్పారు సినీనటుడు అశిష్ విద్యారి్థ. ఇటీవలే స్టాండప్ కామెడీలోకి ప్రవేశించిన ఈయన నగరంలో తన కామెడీ ప్రదర్శన కూడా ఇచ్చారు. చిన్న చిన్న సమూహాల కోసం కేఫ్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, ఆఖరికి కార్పొరేట్ కంపెనీల్లో సైతం తరచూ వీరి షోస్ నిర్వహించడం పరిపాటిగా మారింది. ప్రత్యేకంగా గచి్చ»ౌలిలోని కామెడీ థియేటర్ తరహాలో పలు క్లబ్స్ కూడా ఏర్పాటయ్యాయి. ప్లేస్.. పబ్లిక్ని బట్టి.. క్లబ్స్‌లో ఒకలా, లాంజ్ బార్లయితే మరోలా, కేఫ్స్‌లో ఇంకోలా.. ఇలా ప్రదర్శించే చోటును బట్టి హాజరయ్యే ప్రేక్షకులను బట్టి స్టాండప్ కామెడీ స్క్రిప్ట్ మెటీరియల్ మారుతుంటుంది. అలాగే ఈ కమెడియన్స్‌లో కూడా రాజకీయాలకు కొందరు రిలేషన్షిప్స్, శృంగారభరిత హాస్యానికి కొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పెషలైజ్డ్ అవుతున్నారు. నగరంలో పేరొందిన స్టాండప్ కమెడియన్స్ దాదాపుగా 25 మంది దాకా ఉంటారు. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా షోకి రూ.10 వేలు నుంచి మొదలవుతూ.. భారీగానే ఉంటోంది. రోజువారీ పని ఒత్తిడిలో పడి నవ్వలేకపోవడం అనే రోగానికి గురైన వారికి చికిత్స చేసి నవ్వడం అనే భోగాన్నిస్తూ నవ్వించే యోగులుగా మారారు స్టాండప్ కమెడియన్స్. ‘పని సంబంధిత ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ ఆధునిక యుగంలో హాస్యం ఒక గొప్ప మార్గం’ అని చెన్నైకి చెందిన ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయిన ఎవామ్ డైరెక్టర్ సునీల్ విష్ణు.కె అంటున్నారు. జీవితం అత్యంత సంక్లిష్టమైంది దాన్ని వీలైనంత సరదాగా ఆహ్లాదకరంగా మనం మార్చాలి, హాస్యం లేకుండా జీవితం భరించలేనంత బోరింగ్‌గా అనిపిస్తుందని నమ్ముతున్నా అని ప్రస్తుతం దక్షిణాదిలోని అగ్రగామి కామెడీ షోస్ నిర్వాహక సంస్థ ఎవామ్ డైరెక్టర్ చెబుతున్నారు.కొలీగ్స్‌ని నవ్వించడమే.. కెరీర్‌గా మారిందిఅమెజాన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్స్‌తో జోక్స్ వేసి సరదాగా నవ్వించడమే అలాగే ఓ సారి కంపెనీ పెట్టిన కాంటెస్ట్‌లో పాల్గొని కామెడీ షో చేస్తే అది హిట్ అవడం.. ఫైనల్‌గా నేను స్టాండప్ కమెడియన్‌గా మారడం.. జరిగింది. ప్రస్తుతం నగరంలోని పలు వెన్యూస్లో తరచూ కామెడీ షోస్ సమరి్పస్తున్నాను. విభిన్న రకాల అంశాలను మేళవించి నవ్వించడం నా శైలి. ఇతర మెట్రో నగరాల్లో బాగా వేళ్లూనుకున్న ఈ ప్రొఫెషన్ నగరంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. నా షోస్ ఎక్కువగా నగరంలోని అరోమలి కేఫ్, పక్కా లోకల్, కామెడీ థియేటర్.. తదితర చోట్ల ఉంటాయి. – సందేశ్ జానీ, స్టాండప్ కమెడియన్ -
ఆకట్టుకున్న ఆర్ట్ & స్టాండప్ కామెడీ షో
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని కడరి ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం సాయంత్రం స్టాండప్ కామెడీ– చిత్ర కళాప్రదర్శన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రముఖ ఆర్టిస్ట్‌లు గుర్మీత్ మార్వా, మణాల్ రాజేశ్వర్‌రావు, నటరాజ్‌లు తమ సజనాత్మకతను జోడించి అందమైన కళాప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. ఇక ప్రముఖ స్టాండప్ కమేడియన్ అవినాష్ అగర్వాల్ తన మాటలు, పాటలతో అందర్లో నవ్వులు పూయించారు. హ్యూమర్ ఆన్ క్యాన్వాస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కళను, కామెడీని ఒకే వేదికపైకి తీసుకు వచ్చినట్లు కడరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు సుప్రజా రావు తెలిపారు.ఆర్ట్ అండ్ స్టాండప్ కామెడీ షోలో అవినాష్ -
వీర్‌దాస్ అన్బిలీవబులిష్!
వీర్‌దాస్ రచించి, పెర్ఫామ్ చేసే స్టాండప్ షో ఇది. ప్రతి స్టోరీ ఎండింగ్ మరో స్టోరీలోకి లీడ్ చేస్తుంది. తన అనుభవాల నుంచి అల్లిన కథలివని వీర్‌దాస్ చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలియదు గానీ... జీవితంలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో చెబుతూ ఈ లైవ్ షో ముగిస్తాడు వీర్‌దాస్. మండుటెండల్లో కాస్తంత రిలీఫ్‌నిచ్చే ఓ ఆహ్లాదకర షో మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ నెల 16 రాత్రి 8 గంటలకు. ఎంట్రీ ఒకరికి రూ.500 నుంచి రూ.2,500. -
పెళ్లాం చెబితే వినాలి
విన్నట్టే ఉంటారు.. వినరు. చెప్పేది అర్థం చేసుకున్నట్టే కనిపిస్తారు. కానీ, తమకు అనుకూలంగా దాన్ని అన్వయించుకుంటారు. అంతా విని.. చివరిలో ఏం చెప్పావ్? అంటూ మొదటికొస్తారు. అమెరికా టు జింబాబ్వే.. ఈ భూమ్మీద ఇదీ మగవాళ్ల వరుస అంటున్నారు మహిళలు. ఈ ఇష్యూనే కాన్సెప్ట్‌గా తీసుకుని స్టాండప్ కామెడీ షో రూపొందించింది లైవ్ లాఫ్టర్ క్లబ్. ‘ఉమెన్స్ డే’ పురస్కరించుకుని ‘వై మెన్ డోంట్ లిజన్’ పేరుతో ప్రదర్శించనున్న ఈ స్టాండప్ కామెడీ షో గురించి దాని రూపకర్తలు ఏమంటున్నారంటే.. - ఓ మధు ‘‘డార్లింగ్.. సిక్స్‌కి డాగీని వాక్‌కి తీసుకెళ్లి, గ్రాసరీ తీసుకువచ్చి, డిన్నర్ చేసి, టీవి షో చూద్దాం..’’ ఓ భార్య తన భర్తతో చెప్పిన మాటలివి. కానీ, ఈ మాటలు భర్త చెవులకు ‘డార్లింగ్.. బ్లా బ్లా బ్లా.... బ్లా..’ అని వినిపించాయి. ఆ మాటలు అతనికి ఇంకోలా కూడా అనిపించాయి. ఇలా మగవారు ఏం వినాలనుకుంటున్నారో, ఎలాంటి మాటలు వినాలనుకుంటారో అది మాత్రమే వింటారు. ఒకవేళ భార్యలు చెప్పింది విన్నా దానిని వాళ్లకు అనుకూలంగానే అర్థం చేసుకుంటారు కానీ భార్య చెప్పిన కోణంలో బుర్రకెక్కించుకోరు. ఇలాంటి సందర్భాలు ఇండియన్ కపుల్ మధ్యే కాదు వరల్డ్ వైడ్ కపుల్స్ మధ్యా చాలా కామన్. ఈ సబ్జెక్ట్‌నే ప్రధానాంశంగా తీసుకుని స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తోంది లైవ్ లాఫ్టర్ క్లబ్. మీరెందుకు వినరు? ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వాట్విమెన్వాంట్’ అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అని ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లు వాదిస్తుంటారు. దాన్నే ప్రచారం చేస్తుంటారు. అసలు విషయానికొస్తే- ‘నిజానికి తమకేం కావాలో స్త్రీలకు చాలా క్లారిటీ ఉంటుంది. కానీ, మగవాళ్లే.. స్త్రీలు చెప్పేది సరిగా వినిపించుకోరు. సమస్యంతా మగవాళ్లు వినిపించుకోకపోవడంలోనే ఉంది. అంతేతప్ప స్త్రీలకు స్పష్టత లేదనేది వాస్తవం కాదు’ అంటారు ఈ షో రూపకర్తలు. అందుకే ‘వై మెన్ డోంట్ లిజన్’ అనేదే నిజమైన మిలియన్ డాలర్ ప్రశ్న అంటున్నారు వీరు. వినండి ప్లీజ్.. ‘మా ఆయన నా మాట వింటున్నట్టే ఉంటారు. కానీ వినిపించుకోరు. పద్నాలుగేళ్లుగా ఇదే వరస. మా వారే కాదు, మా నాన్నా వినిపించుకోరు మా అమ్మ మాటను. అత్తయ్య, ఆడపడుచు, తోటికోడలు ఇలా యూనివర్సల్‌గా ఆడవాళ్ల ప్రాబ్లమ్ ఇది’ అని చెప్పారు లైవ్ లాఫ్టర్ క్లబ్ ఫౌండర్ రాధా కృష్ణవేణి. ‘నేను హనీమూన్‌కి వెళుతున్నప్పుడు నా భర్త ఫ్రెండ్ ‘వై మెన్ డోంట్ లిజన్- విమెన్ కాంట్ రీడ్ మ్యాప్’ బుక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు సమాధానం లేని ఈ ప్రశ్ననే స్టోరీలైన్‌గా తీసుకుని స్టాండప్ కామెడీగా తీసుకువస్తున్నాం’ అన్నారామె. ‘ఓ స్త్రీగా, మహిళా పారిశ్రామికవేత్తగా మహిళా దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు.. భార్యల మాట భర్తలు వినకపోవటం ఎంతటి సమస్యో గుర్తొచ్చింది. 99.9 శాతం స్త్రీలు దీన్ని తమ జీవితాలతో రిలేట్ చేసుకోగలుగుతారు. అందుకే ఈ కాన్సెప్ట్ బెటర్ అనిపించింది’ అని వివరించారు ఆమె. షో హైలైట్స్ ఆడవాళ్లు మాట్లాడుతున్నప్పుడు మగవాళ్లు వినిపించుకోకుండా ఉన్న చాలా ఫొటోలు, వీడియోలు, కార్టూన్లు సేకరించి ‘ఏవీ’లుగా ప్రదర్శిస్తున్నాం. ఈ కాన్సెప్ట్‌ను రాధ రూపొందించినా స్క్రిప్ట్‌ని మాత్రం ఆమెతో సహా మరో ఇద్దరు మహిళలు కలిసి తయారు చేశారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ షోలో అప్పటికప్పుడు ఆడియన్స్ కూడా పాల్గొనవచ్చు. తమ మాట వినని భర్తల గురించి, అటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్‌ని ఓపెన్ మైక్ ద్వారా అందరితో పంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారని సందర్భానుసారం షో ప్రెజెంటర్స్ ప్రశ్నలు సంధిస్తారు కూడా. ఎంటీవీ- కలర్స్ ఫేమ్, బిట్స్ పిలానీ స్టూడెంట్ గర్వ్ మాలిక్ సోలోగా ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు. ‘అంతా గంట పాటు హాయిగా నవ్వుకునేలా ఈ షోని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు లైవ్ లాఫ్టర్ క్లబ్ భాగస్వామి మల్లికా రాజ్‌కుమార్. ఫన్నీగా.. డిఫరెంట్‌గా.. ‘మగవాళ్లు చేసే కొన్ని పనులు, అలవాట్లు ఆడవాళ్లను చికాకు పెడుతుంటాయి. అలాంటి పనులు వాళ్లెందుకు చేస్తారో తప్పకుండా తెలుసుకోవాలి. ఈ షో చేస్తున్నప్పుడు అబ్బాయిల వెర్షన్ నుంచి కాక అన్ని వైపుల నుంచీ ఇందులోని అంశాలను అర్థం చేసుకున్నాను. వీటిని ఫన్నీగా ఆడియన్స్ ముందుంచుతున్నాం. ఫైనల్లీ ఆడవాళ్లకి నచ్చని గుణాన్ని మగవాళ్లు మార్చుకోగలరా, లేదా అని ఆలోచిస్తే.. దేవుడు బయోలాజికల్‌గా మనని తయారు చేసిన విధానమే దీనికి కారణం అనిపిస్తుంది. కామెడీ కోసమే నేనీ షో చేస్తున్నా.. కొంత రీసెర్చ్ వర్కూ చేశాం. కొన్ని పరిస్థితుల్లో మగవాళ్ల మెదడు, ఆడవాళ్ల మెదడు పనిచేసే తీరులో వ్యత్యాసం ఉంటుంది. ఇది బయోలాజికల్ కెమికల్స్ వల్ల జరిగే పరిణామమని చాలా మెడికల్ రీసెర్చెస్లో చదివాను. ఈ వైవిధ్యం నుంచి పుట్టే కామెడీని ఈ షోలో చూడవచ్చు’ అంటారు గర్వ్ మాలిక్. వై మెన్ డోంట్ లిజన్ (ఉమెన్స్ డే కామెడీ స్పెషల్) తేదీ: మార్చి 8, సమయం: రాత్రి 8 గంటలకు సమర్పణ: లైవ్ లాఫ్టర్ క్లబ్, వెన్యూ: లెమన్‌ట్రీ, హైటెక్ సిటీ