
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని కడరి ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం సాయంత్రం స్టాండప్ కామెడీ– చిత్ర కళాప్రదర్శన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రముఖ ఆర్టిస్ట్‌లు గుర్మీత్ మార్వా, మణాల్ రాజేశ్వర్‌రావు, నటరాజ్‌లు తమ సజనాత్మకతను జోడించి అందమైన కళాప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు.
ఇక ప్రముఖ స్టాండప్ కమేడియన్ అవినాష్ అగర్వాల్ తన మాటలు, పాటలతో అందర్లో నవ్వులు పూయించారు. హ్యూమర్ ఆన్ క్యాన్వాస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కళను, కామెడీని ఒకే వేదికపైకి తీసుకు వచ్చినట్లు కడరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు సుప్రజా రావు తెలిపారు.

ఆర్ట్ అండ్ స్టాండప్ కామెడీ షోలో అవినాష్