ఓటీటీకి సర్వైవల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Comedy Entertainer GRRR Movie Streaming In OTT From This Date | Sakshi
Sakshi News home page

Grrr Movie: 'అనుకోకుండా సింహం డెన్‌లో అడుగుపెడితే'.. గర్‌ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్!

Published Tue, Aug 13 2024 7:04 PM | Last Updated on Tue, Aug 13 2024 7:16 PM

Comedy Entertainer GRRR Movie Streaming In OTT From This Date

కుంచకో బోబన్‌, సూరజ్‌ వెంజరమూడు, శృతిరామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్‌ కామెడీ చిత్రం గర్‌. ఈ సినిమాను జయ్‌ కె డైరెక్షన్‌లో తెరకెక్కించారు. జూన్‌ 14న థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓ జూలో సింహాం ఉన్న డెన్‌లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎలా బయటపడ్డారనే కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజేశ్ మాధవన్, మంజుపిళ్లై, శోభితిలకన్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement