
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, సిరీసులు నేరుగా వీటిల్లో రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఈ జానర్ లో తీసిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేయండంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)
నవదీప్, దీక్షిత్ శెట్టి ('దసరా' ఫేమ్) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. స్కూల్ చదివే ఓ కుర్రాడి.. శవాన్ని ముట్టుకుని ఎవరు హత్య చేశారో చెప్పే అద్బుతమైన శక్తి ఉంటుంది. మరోవైపు పోలీస్ పాత్ర పోషించిన నవదీప్ మాత్రం ఈ కుర్రాడిపై కాస్త సందేహంగానే ఉంటాడు. మరి హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.
హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన సిరీస్ లు పెద్దగా క్లిక్ కాలేదని చెప్పొచ్చు. మరి 'టచ్ మీ నాట్' ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
Comments
Please login to add a commentAdd a comment