![Kobali Web Series Trending in Hotstar, Makers Confirms Part 2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/kobaliseries.jpg.webp?itok=l-3ulIsZ)
ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కోబలి వెబ్ సిరీస్‌కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేవంత్ లేవాక దర్శకత్వం వహించారు. 'నింబస్ ఫిలిమ్స్', 'యు1 ప్రొడక్షన్స్', 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు.
ఫిబ్రవరి 4న హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు కోబలి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళయింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపనతో 'కోబలి' మొదలుపెట్టాను. ఒక కాఫీ షాప్లో ఈ కథ విన్నాను. నచ్చింది. కానీ ఇది ముందుకు వెళ్తుందనే నమ్మకం కలగలేదు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/kobali.jpg)
ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్‌లో అమ్ముడు పోయే ముఖం ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరించారు. నిజాయితీగా పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు" అంటూ చెప్పుకొచ్చారు. రాకీ సింగ్ మాట్లాడుతూ.. "చిన్న పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చిన వెంకట్ గారికి థాంక్స్. కానీ సీజన్ 2 లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇది జస్ట్ ట్రైలరే" అన్నారు.
సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. "నిజంగానే ఇందులో అంతా కొత్తవాళ్లే. కానీ హాట్ స్టార్ సంస్థ మమ్మల్ని నమ్మింది. ప్రేక్షకులు బాగా ఆదరించారు. 7 భాషల్లోనూ కోబలి మంచి విజయాన్ని అందుకుంది. రేవంత్, నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ గురించి పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త, పాత తేడా లేదని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు" అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment