
ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ (Sukumar) రెండు దశాబ్దాల కాలంలో పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఆర్య 2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలా దేనికవే భిన్నమైన కథలు రాసుకుంటూ ప్రేక్షకుల్ని అలరించాడు. బాక్సాఫీస్ హిట్లు అందుకున్నాడు. పుష్ప (Pushpa Movie) చిత్రంతో పాన్ ఇండియా ప్రజల్ని ఆకట్టుకున్నాడు. మూడేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2: ద రూల్ అంతకుమించి ఘన విజయాన్ని సాధించింది.
ఈ భారీ సక్సెస్ తర్వాత సుకుమార్ భార్య తబిత (Thabitha Bandreddi)తో కలిసి ఇంట్లో వ్రతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తబిత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె పట్టు చీర కట్టి, నిండుగా ఆభరణాలు ధరించి, నుదుటన సింధూరం పెట్టి, ముక్కుకు ముక్కెర పెట్టి అందంగా ముస్తాబైంది. సుకుమార్ పంచెకట్టులో కనిపించాడు. ఈ జంటను చూసిన అభిమానులు వీరిని పుష్ప, శ్రీవల్లి అని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్.. రామ్‌చరణ్‌తో సినిమా(#RC17) చేస్తున్నాడు.
చదవండి: రెండుసార్లు ప్రేమ.. చుక్కలు చూశా.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్
Comments
Please login to add a commentAdd a comment