![Aishwarya Rajesh About Relationships and Telugu Film Offers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/aishwariya.jpg.webp?itok=eImZsfjZ)
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie)తో ఈ ఏడాదికి శుభారంభం పలికింది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు. ఎన్నో విమర్శలను దాటుకుని ఈ సక్సెస్‌ను అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంది. ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. మా నాన్న రాజేశ్ చిన్నప్పుడే చనిపోయారు. అప్పుడు నాకు ఎనిమిదేళ్లనుకుంటాను.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/aishwarya_0.jpg)
ఖరీదైన బహుమతి
ముగ్గురు అన్నల తర్వాత నేను పుట్టాను. మా నలుగుర్ని మా అమ్మ ఒక్కరే కష్టపడి పెంచింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా భూములమ్మేది. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసింది. ఇంటింటికీ వెళ్లి చీరలమ్మేది. మమ్మల్ని చదివించడం కోసం చాలా కష్టపడింది. తనను ఎంతో అపురూపంగా చూసుకుంటాను. తనకు ఎప్పుడూ ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటాను. ఇటీవలే అమ్మ చేసిన రుచికరమైన చేపల పులుసుకుగానూ రూ.18 లక్షల విలువైన గాజులు బహుమతిగా ఇచ్చాను.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/aish.jpg)
సినిమా..
తెలుగులో సినిమా చేస్తే మంచి కథతో, మంచి హీరోతో చేయాలనుకున్నాను. అలా వరల్డ్ ఫేమస్ లవర్ చేశాను. సినిమా అంతగా ఆడకపోయినా నేను పోషించిన సువర్ణ పాత్ర చాలామందికి నచ్చింది. నేను నేచురల్‌గా ఉండేందుకే ఇష్టపడతాను. సౌకర్యంగా అనిపించని దుస్తుల్ని ధరించను. అలాగే నాకు సెట్టవని పాత్రలు కూడా చేయను. అలా ఓసారి దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు నాకంటే మరో హీరోయిన్‌కే బాగా సెట్టవుతుందని చెప్పి ఆ అవకాశాన్ని వదిలేసుకున్నాను. నేను సూచించిన హీరోయిన్ ఆ సినిమాలో బాగా సెట్టయింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/aishwrya.jpg)
రెండుసార్లు బ్రేకప్..
నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ను. గతంలో రిలేషన్‌షిప్‌లో చాలా బాధల్ని అనుభవించాను. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వేధింపులకు గురి చేశాడు. అతడితో బ్రేకప్ అయ్యాక మళ్లీ అదే నరకంలో అడుగుపెట్టాను. రెండోసారి ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను వేధించాడు. ఆ వేధింపులు ఎంతలా ఉండేవంటే.. చేతులెత్తి నన్ను కొట్టేవారు. నేనెంతగానో ప్రేమిస్తే ఇలా జరుగుతుందేంటని బాధపడ్డాను. రెండు రిలేషన్‌షిప్స్‌లో వేధింపులు అనుభవించడంతో మళ్లీ ప్రేమలో పడాలంటేనే భయమేస్తోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/aish1.jpg)
అవకాశాలు రావట్లేదు
ఎందుకంటే ఒకరికి కనెక్ట్ అయ్యాక.. వారి నుంచి దూరం కావడానికి నాకు కనీసం ఏడాదైనా పడుతుంది. అందుకే ఇంకొకరిని లవ్ చేయాలంటేనే భయంగా ఉంది. ఇకపోతే పెళ్లెప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని నా అండాల్ని నేను భద్రంగా దాచిపెట్టాను. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత నాకు ఇంతవరకు అవకాశాలు రాలేదు. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలన్నది నా కోరిక. రాజమౌళి, శేఖర్ కమ్ములతో పని చేయాలనుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
చదవండి: ‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్‌లాల్ ఎంత తీసుకున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment