hotstar
-
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్‌గా 'హరి కథ'.. స్ట్రీమింగ్కు రెడీ
టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.మిస్టరీ థ్రిల్లర్ జానర్‌గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్‌ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్‌తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్‌బాస్‌తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. డిసెంబర్ నెల ఫస్ట్ వీక్‌లోనే రిలీజవుతోన్న పుష్ప-2 కోసమే అంతా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. పుష్ప-2 రిలీజ్ అవుతున్నందున బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు విడుదల కావడం లేదు.అయితే ఓటీటీల్లో ఈ వారంలో సందడి చేసేందుకు చిత్రాలు సిద్ధమయ్యాయి. దీపావళికి రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన అమరన్ ఓటీటీకి రానుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ మట్కా సైతం ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ అమరన్(తమిళ మూవీ)- డిసెంబర్ 05 చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04 దట్ క్రిస్మస్ (యానిమేషన్ చిత్రం)- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04 ది అల్టిమేటమ్ (వెబ్‌సిరీస్)- డిసెంబరు 04 బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 05 విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06 ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 జిగ్రా (హిందీ సినిమా)- డిసెంబరు 06 మేరీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06అమెజాన్ ప్రైమ్ మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05 జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 03 పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్‌సిరీస్) -డిసెంబరు 04 అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06 ది స్టిక్కీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06 జియో సినిమా క్రియేట్ కమాండోస్ (యానిమేషన్ మూవీ)- డిసెంబరు 06 లాంగింగ్ (హాలీవుడ్)- డిసెంబరు 07డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) -డిసెంబరు 03 లైట్ షాప్ (కొరియన్)- డిసెంబరు 04జీ5 మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06సోనీలివ్ తానవ్2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06 బుక్ మై షో స్మైల్-2 (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 04 -
ఎమ్మీ అవార్డ్స్‌లో 'ది నైట్ మేనేజర్'కు నిరాశ
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.భారత్ నుంచి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్‌తో పోటీ పడి అవార్డ్ కోల్పోయింది. ‘ది నైట్ మేనేజర్’ చిత్రంలో అనిల్ కపూర్ , ఆదిత్యరాయ్ కపూర్ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ నటించారు. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన ‘ది నైట్ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.ఉత్తమ డ్రామా సిరీస్- లెస్ గౌట్స్ డి డైయుఉత్తమ నటుడు- తిమోతి స్పాల్ఉత్తమ కామెడీ సిరీస్- డివిజన్ పలెర్మోఉత్తమ యానిమేషన్- టాబీ మెక్‌టాట్ ఉత్తమ కిడ్స్ లైవ్ యాక్షన్ సిరీస్- ఎన్ అఫ్ డ్రెంగెన్ఉత్తమ షార్ట్ ఫామ్ సిరీస్- పాయింట్ ఆఫ్ నో రిటర్న్ -
OTT: యానిమేటడ్ ఫాంటసీ మూవీ ‘విష్’ రివ్యూ
మనకందరికీ విషెస్ ఉంటాయి. మన విష్ తీరాలని మనం ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాం. ఒకవేళ మన విష్ తీర్చే విజార్డ్ మనకు దొరికితే సూపర్ గా వుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ఈ విష్. వాల్ట్ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన ఈ యానిమేటడ్ ఫాంటసీ మూవీ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో స్ట్రీం అవుతోంది. క్రిస్బక్, ఫాం అనే ఇద్దరు డైరెక్టర్స్ ఈ మూవీని కలిసి తీశారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెడిటేరియన్ సీ లోని ఓ ఐలాండ్ లో కింగ్ డమ్ ఆఫ్ రోజాస్ అనే రాజ్యం వుంటుంది. ఆ రాజ్యానికి రాజు మాగ్నిఫికో, రాణి అమాయ. మాగ్నిఫికో రాజు తన మంత్రశక్తితో నెలకోసారి తన ప్రజలకు సంబంధించి ఒక్క విష్ ను తీరుస్తూవుంటాడు. అది కూడా ఓ పెద్ద ఉత్సవం లా చేసి ఎవరికైతే విష్ కావాలో వాళ్ళని మాగ్నిఫికో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటాడో వారి విష్ ను మాత్రం తీరుస్తాడు. అలాంటి టైంలో ఈ సినిమా హీరోయిన్ ఆషా తన తాత సబినో100th బర్త్ డే కి తాత విష్ కింగ్ గ్రాంట్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతుంది. అయితే రాజు మాగ్నిఫికోకి తన తాత విష్ ను గ్రాంట్ చేయమని కోరుతుంది. దానికి మాగ్నిఫికో ఒప్పుకోడు. ఆషా ఈ విషయంలో బాగా బాధ పడి ఆకాశం లో వున్న స్టార్ ను తన విష్ ను గ్రాంట్ చేయమని ప్రే చేస్తుంది. అనుకోకుండా ఆషా కోసం స్టార్ ఒక బాల్ రూపంలో వచ్చి మాజిక్ చూపిస్తుంది. ఇంక మిగతా స్టోరీ అంతా స్టార్ మాజిక్ తో కింగ్ మాగ్నిఫికో ని ఆషా ఎలా ఎదుర్కుంటుందనేదే ఈ విష్ మూవీ. స్టన్నింగ్ మాజిక్ ఎఫెక్ట్స్ తో సూపర్ గ్రాండ్ విజువల్స్ తో విష్ మూవీ మీకు ఈ వీక్ సూపర్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచిట్. - ఇంటూరు హరికృష్ణ -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్‌బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమా స్ట్రీమింగ్
మలయాళ నటుడు టొవినో థామస్- కృతిశెట్టి జోడీగా నటించిన కొత్త సినిమా 'ఏఆర్ఎం' (అజయంతే రంధం మోషణమ్) (ARM). సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్, రోహిణి వంటి వారు నటించారు. మిన్నల్ మురళి, 2018 వంటి డబ్బింగ్ చిత్రాలతో టొవినో థామస్‌కు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది.టొవినో థామస్‌కు 50వ చిత్రంగా విడుదలైన 'ఏఆర్ఎం' భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రం నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది. డైరెక్టర్ జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్రమైనప్పటికీ తెరకెక్కించిన తీరు చాలా బాగుంటుంది. నిధి అన్వేషణతో కూడిన ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాడు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఇదే కావడం విశేషం. 90ల కాలం నాటి అమ్మాయిగా కృతిశెట్టి పాత్ర ఆకట్టుకుంటుంది. -
ఓటీటీకి భారీ యాక్షన్ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఎక్కడైనా సరే ఫ్యాన్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమానే ఇండియన్ ఫ్యాన్స్‌కు అందుబాటులోకి రానుంది. గత జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్, వుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇండియాలో ఇంగ్లష్తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన వీడియోను షేర్ చేస్తూ వెల్లడించింది. ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్‌స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రభాస్ సలార్ మూవీ.. ఏకంగా 250 రోజులుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'సలార్ సీజ్ ఫైర్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ హక్కులు మాత్రం మరో ఓటీటీ దక్కించుకుంది. సలార్ హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో క్రేజీ రికార్డ్ సృష్టించింది. ఏకంగా 250 రోజులుగా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన సినిమాగా అవతరించింది. ఈ విషయాన్ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓటీటీ సంస్థ రివీల్ చేసింది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ చిత్రాలను కాదని.. ప్రభాస్ చిత్రం రికార్డ్ క్రియేట్ చేయడం చూస్తుంటే నార్త్‌లో కూడా రెబల్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. -
బ్లాక్‌బస్టర్ గల్లీ క్రికెట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిత్రం 'లబ్బర్ పందు'. సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్ గోట్ మూవీతో పోటీ పడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. పెద్దగా ఫేమ్ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్‌తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు.హరీష్ కళ్యాణ్- దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లబ్బర్ పందు' సినిమాను తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.లబ్బర్ పందు చిత్రాన్ని కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కించారు. అయితే, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 18వ రోజు కలెక్షన్స్ విషయంలో విజయ్ గోట్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 4 కోట్లు కలెక్షన్స్ వస్తే.. లబ్బర్ పందు ఒక్క తమిళనాడులోనే రూ.2.75 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇద్దరు గ్రామీణ క్రీడాకారుల మధ్య మొదలైన గొడవకు లవ్ స్టోరీని కలుపుతూ ఈ మూవీని తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. -
హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం!
రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 'జియో హాట్‌స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+ హాట్‌స్టార్‌కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్లో 120 టీవీ ఛానెల్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి మొదట హాట్‌స్టార్‌నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్లోడ్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది. -
Vaazhai Movie Review: ఈ అరటిపండు చాలా చేదు!!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా ఉంటుందో, అది మన నోటి దాకా రావడానికి ఎన్ని జీవితాలను చేదు చేస్తుందో చెప్పిన చిత్రం ‘వాళై’. ఈ సినిమా మాతృక తమిళమైనా తెలుగులో డబ్ అయి హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. 1999 ఫిబ్రవరి 22న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి అందించిన సమాచార రూపమే ఈ ‘వాళై’ సినిమా. ఈ విషయాన్ని సవివరంగా దర్శకుడు సినిమా ఆఖర్లో చెప్పారు. ఈ సినిమాకి మారీ సెల్వరాజ్ దర్శకుడు. ప్రముఖ వర్ధమాన తమిళ నటులు కలైరాసన్, నిఖిలా విమల్ ఈ సినిమా ముఖ్య తారాగణం. ఇక కథాంశానికొస్తే... శివానందన్, శేఖర్ మంచి స్నేహితులు. బాగా పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలు. ఇద్దరూ ప్రభుత్వ బడిలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు. వారమంతా బడికి వెళ్ళి వారాంతంలో ఓ రూపాయి సంపాదించడం కోసం అరటి గెలలు కోసే పనికి ఊరితో పాటు వెళుతూ ఉంటారు. శివానందన్ చదువులో మంచి తెలివిగలవాడు, ఈ అరటిపండ్లు కోసే పని అస్సలు నచ్చదు తనకు. క్లాసులో సైన్సు పాఠాలు చెప్పే పూంగొడి టీచర్ అంటే శివానందన్‌కు చాలా ఇష్టం. ఇక అరటిపండ్లు కోయడానికి ఆ ఊరి తరఫున ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు. అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్‌గా ముత్తురాజ్ వ్యవహరిస్తుంటాడు. ముత్తురాజ్‌కు, ఖనికి కూలీ డబ్బుల మధ్య వైరం ఏర్పడి ఖని మీద ముత్తురాజ్ ద్వేషం పెంచుకుంటాడు. ఓ రోజు శివానందన్ అరటి గెలల పని నుండి తప్పించుకొని ఆకలితో ఓ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండ్లు తినబోతాడు. అంతే... ఆ తోట యజమాని శివానందన్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టగా స్పృహ తప్పి ఓ కొలనులో పడిపోతాడు. తను లేచి కళ్ళు తెరిచేసరికి ఊరంతా ఏడుస్తుంటుంది. శివానందన్ తల్లితో పాటు అక్క, తోటి స్నేహితుడు శేఖర్, ఖనితోపాటు దాదాపు 19మంది ఊరువాళ్ళు చనిపోయి పడి ఉంటారు. అసలు వీళ్ళంతా ఎలా చనిపోయారు? ఆ తరువాత శివానందన్ పరిస్థితి ఏంటి అన్నది ‘వాళై’ సినిమాలోనే చూడాలి. రోజు వారీ కూలీ చేసుకుని బతికే జీవితాలు ఎలా ఉంటాయన్న స్థితిగతులను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాని మనం తెర మీద చూస్తున్నట్టుండదు... జీవితాలను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సినిమాలో కొంచెం ల్యాగ్ ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. తినే పండు మనకు తియ్యగా ఉన్నా ఆ పండు మన దాకా రావడానికి ఎంతమంది జీవితాలను చేదు చేసిందో అని చెప్పేదే ఈ ‘వాళై’ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
రతన్ టాటాపై డాక్యుమెంటరీ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి పేరు గడించారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. ఆపై యువకులు స్థాపించే పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అందుకే ఆయన్ను దేశ ప్రజలందరూ అభిమానిస్తారు.ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లడంతో రతన్ టాటా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆయన అభిమానులు అందరూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆయనకు సంబంధించిన బయోపిక్, డాక్యుమెంటరీలు ఏమైనా ఉన్నాయా..? అంటూ పోస్టులు పెడుతున్నారు.ఆయన గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక ఎపిసోడ్‌ను చేసింది. 'మెగా ఐకాన్స్' పేరుతో ఆ ఓటీటీ సంస్థ గతంలోనే పంచుకుంది. సీజన్2 నుంచి ఎపిసోడ్2లో రతన్ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అందులో అరుదైన ఫోటోలతో పాటు.. ఆయన గురించి పూర్తి విషయాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. డాక్యుమెంటరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ వేదికపై ఉత్తమ డాక్యుమెంటరీగా టైటిల్‌ను అందుకుంది. అయితే, రతన్ టాటా బయోపిక్‌ను ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తీయనున్నట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్‌లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్‌కు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ–హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్‌లతో పాప్‌కార్న్ నుంచి ఐస్‌క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్‌కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్‌తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్‌క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్‌తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్‌క్యాట్ ప్యాక్‌లను విడుదల చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్‌క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్‌ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్‌ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్‌లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్‌ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్‌స్టార్‌తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా లింక్‌లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘కంటెంట్‌ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్‌ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్‌్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్‌తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్ సినిమా 'సర్ఫిరా'
అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్‌గా సర్ఫిరా బాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇందులో రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటించారు. బాక్సాఫీస్ వద్ద 'సర్ఫిరా' చిత్రానికి నిరాశే మిగిలింది. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల అవుతుంది.సర్ఫిరా చిత్రాన్ని ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు 'సర్ఫిరా' సినిమా వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి 'సర్ఫిరా' స్ట్రీమింగ్ అవుతుందని అక్షయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని సర్ఫిరా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, ఇదే సినిమాకు మాతృక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మాత్రం ఓటీటీలో భారీ విజయం సాధించింది.Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw— Akshay Kumar (@akshaykumar) September 26, 2024 -
తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమా
బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'కిల్' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు ప్రేక్షకులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. లక్ష్ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. మోస్ట్ వయోలెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా తెలుగు, తమిళ్ వర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.'కిల్' చిత్రంలో ఎక్కువగా హింస ఉందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. సెప్టెంబర్ 6 నుంచి హిందీలో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నేటి నుంచి (సెప్టెంబర్ 24) తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో 'కిల్' సినిమా అభిమానులు సంతోషిస్తున్నారు.కథేంటి..?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ. -
పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్
భయపెట్టే సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. మరీ ముఖ్యంగా దెయ్యం కథలతో మూవీ తీయాలే గానీ ఏ మాత్రం బాగున్నా సరే హిట్ చేసేస్తారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న హిందీ సినిమా 'ముంజ్య'. పెద్దగా పేరున్న యాక్టర్స్ లేనప్పటికీ విజయం సాధించింది. రూ.25 కోట్లు పెడితే రూ.140 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ తెలుగులో)ఈ సినిమా ఆగస్టు 25న ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హాట్‌స్టార్‌లో ఇది అందుబాటులో ఉంది.'ముంజ్య' విషయానికొస్తే.. 1952లో గోట్యా పిల్లాడు అనుకోకుండా చనిపోతాడు. ముంజ్య అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. కట్ చేస్తే ప్రస్తుతం పుణెలో బిట్టు అనే కుర్రాడు తల్లి, నానమ్మతో కలిసి జీవిస్తుంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. ముంజ్య ఉండే చోటుకు వెళ్తాడు. అనుకోకుండా ఈ దెయ్యం బయటకొచ్చేలా చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో పిల్ల దెయ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ దెయ్యం బిట్టు వెనక పడటానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ) -
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న అవార్డ్ విన్నింగ్ సినిమా
రజత్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'సర్వైవర్'. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులను అందుకుని చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'సర్వైవర్' కావడం విశేషం. ఈ చిత్రం కూడా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ట్రైలర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్ కూడా రజత్ రజనీకాంత్ కావడం విశేషం.ఈ చిత్రం కోసం రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద ఉన్న మక్కువతో విభిన్నమైన చిత్రాలను మాత్రమే ఆయన నిర్మిస్తున్నారు. 2018 నుంచి మూడు సినిమాలు మాత్రమే ఆయన చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు రజత్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో ఓటీటీలలో ట్రెండ్ అవుతున్న 'సర్వైవర్' చిత్రాన్ని మీరూ చూసేయండి. -
GRRR Movie Review: మృగరాజుతో మత్తురాజు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘GRRR’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నిద్రతో వచ్చే మత్తు నిమిషాల్లో వదులుతుంది. కానీ నిషాతో వచ్చే మత్తు నీళ్ళలో నానితేగాని వదలదు. ఇదే పాయింట్‌తో ఇటీవల ఓ కామెడీ సినిమా రిలీజైంది. సినిమా పేరు కూడా గమ్మత్తుగా వుంటుంది. అదే ‘GRRR’.. ఈ సినిమా టైటిల్ ఇది. సింహం గురక భావనగా దర్శకుడు సృజనాత్మకతతో పెట్టిన పేరు. సినిమా పేరులో ఎంత గురక ఉందో సినిమాలో కామెడీ సరుకు అంత కన్నా ఎక్కువే ఉంది. వాస్తవ అంశాలను చక్కటి కథనంతో అల్లుకుని సున్నితమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు దర్శకుడు జేకే. కథాపరంగా రెజీమోన్ నాడార్ అనే వ్యక్తి మద్యం మత్తులో అనుకోకుండా జూలో ఉన్న సింహం గుహ దగ్గరకు చేరుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న జూ సూపర్వైజర్ హరిదాస్ నాయర్ కూడా అతని దగ్గరకు చేరుకుని అతన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక అక్కడ నుండి కథ మొదలు. జూ అధికారి అతన్ని సింహం నుండి కాపాడి తను కూడా బయటపడతాడా? లేదా అన్నది మాత్రం హాట్ స్టార్ వేదికగా ఓటీటీలోనే చూడాలి. ఇక్కడ నావెల్టీ పాయింట్ ఏంటంటే మత్తులో ఉన్న వ్యక్తి ఏమాత్రం భయపడకుండా సింహాన్ని తొడగొట్టి ఆహ్వానించడం... ఇంకా ఇలాంటివి ఎన్నో రసవత్తర సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా మొత్తం తెలుగులో డబ్ అయి ఉంది. అలాగే ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు లేవు కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూసేయొచ్చు. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'కిల్' సినిమా ఓటీటీలోకి రానుంది. లక్ష్ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. ఆ సమయంలో కల్కి 2898 ఏడీ సినిమాతో గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. అయితే, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచేస్తున్న ప్రేక్షకులకు హాట్‌స్టార్ గుడ్‌న్యూస్ చెప్పింది.ధర్మా ప్రొడక్షన్స్‌పై నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించిన కిల్ గతేడాదిలో నిర్వహించిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. యూకే, అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా డిస్నీ+హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 6న భారత్‌లో విడుదల కానున్నట్లు ప్రకటన వెలువడింది. ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుందని తెలిపారు. తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎప్పుడు విడుదలకానుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అంతలా ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి.కథేంటి..?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ. -
సడెన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' హరర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా 'ముంజ్యా' సడెన్‌గా ఓటీటీలో విడుదల అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్ర మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ముంజ్యా సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి డిస్నీ+ హాట్‌స్టార్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (ఆగష్టు 25) ఓటీటీలో విడుదలైంది. అయితే, కేవలం హిందీ వర్షన్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర ముంజ్యా సత్తా చాటింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. ఈ యూనివర్స్‌లో వచ్చిన స్త్రీ 2 ఐదో సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. -
ఓటీటీకి సర్వైవల్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు, శృతిరామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్ కామెడీ చిత్రం గర్. ఈ సినిమాను జయ్ కె డైరెక్షన్లో తెరకెక్కించారు. జూన్ 14న థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓ జూలో సింహాం ఉన్న డెన్లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎలా బయటపడ్డారనే కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజేశ్ మాధవన్, మంజుపిళ్లై, శోభితిలకన్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. -
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
ఆగస్టులో భారీ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకింకా వారం ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అటు ఓటీటీలోనూ కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే మూవీస్..🎬 కమిటీ కుర్రోళ్లు - ఆగస్టు 9🎬 సింబా - ఆగస్టు 9🎬 భవనమ్ - ఆగస్టు 9🎬 తుఫాన్ - ఆగస్టు 9ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 - ఆగస్టు 8భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమామేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) - ఆగస్టు 6గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) ఆగస్టు 5అమర్ సంగి (సీరియల్) - ఆగస్టు 5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9హాట్స్టార్ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) - ఆగస్టు 8లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో) ఆగస్టు 7ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు 8సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9 చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట! -
ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా ముంజ్యా ఓటీటీ విడుదల కంటే బుల్లితెరపైకి రానుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్‌లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది.నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ముంజ్యా సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. స్టార్ గోల్డ్ ఛానల్ మంజ్యా సినిమా టెలికాస్ట్ గురించి ప్రకటించింది. ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటలకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది.అయితే, ఇప్పటికే ముంజ్యా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి ప్రేక్షకులను తమపైపు తిప్పుకుంది. దీంతో హాట్‌స్టార్ కూడా అలెర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 9న ముంజ్యా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం.