ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Payal Kapadia film All We Imagine As Light Streaming on This OTT | Sakshi
Sakshi News home page

All We Imagine As Light: ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Dec 27 2024 4:40 PM | Updated on Dec 27 2024 4:54 PM

Payal Kapadia film All We Imagine As Light Streaming on This OTT

పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్‌ హీరో– నిర్మాత రానా స్పిరిట్‌ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది.  ప్రతిష్టాత్మక  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్‌ విభాగాల్లో  నామినేషన్స్‌ సాధించింది.

తాజాగా ఈ అవార్డ్ విన్నింగ్ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ స్ట్రీమింగ్ కానుంది.  చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement