Payal Kapadia
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఇండియన్ సినిమాకు నిరాశ
ప్రపంచవ్యాప్తంగా సినీ నటీనటులు ప్రతిష్టాత్మకంగా భావించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. అయితే, అవార్డ్ కోసం భారత్ నుంచి బరిలో ఉన్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమాకు నిరాశే మిగిలింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో పోటీలో నిలిచిన ఈ చిత్రానికి రెండు విభాగాల్లోనూ నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ చిత్రం 'ఎమిలియా పెరెజ్' చిత్రం బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఇండియన్ సినిమా అవార్డ్ కోల్పోయినప్పటికీ హాలీవుడ్ మూవీలతో పోటీ పడి ఆర్హత సాధించింది. దీంతో ఈ చిత్రంపై అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్. ఎఫ్. పి. ఎ) వారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు. ప్రస్తుతం హెచ్. ఎఫ్. పి. ఎ టీమ్‌లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్ గ్లోబ్స్ ఖరారు చేస్తారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం.‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్‌ను ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకుగాను అవార్డు వరించింది. టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ కావడం విశేషం. 2009లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అలా ఇప్పటి వరకు వారిద్దరు మాత్రమే ఈ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ పుస్కారం సాధిస్తే 'ఆస్కార్' అవార్డ్ వచ్చినట్టే అని చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు.గోల్డెన్ గ్లోబ్ విజేతలుఉత్తమ చిత్రం - ఎమిలియా పెరెజ్ (ఫ్రెంచ్)ఉత్తమ దర్శకుడు - అమెరికాకు చెందిన బ్రాడీ కార్బెట్ ( ది బ్రూటలిస్ట్)ఉత్తమ నటుడు - రొమానియా నటుడు సెబాస్టియన్ స్టాన్ ( ఎడిఫరెంట్ మ్యాన్)ఉత్తమ నటి - మెక్సికోకు చెందిన డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ఫ్లో (ఫ్రెంచ్) -
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చిత్రాలకు ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జనవరి 6న జరగనుంది. ఈ 82 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2025 కార్యక్రమానికి హోస్ట్‌గా నటి, కమెడియన్ నిక్కీ గ్లేజర్ వ్యవహరించనున్నారు. గోల్డెన్ గ్లోబ్స్ వేడుకకు హోస్ట్ చేసిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్లో ప్రజెంటర్స్‌గా పలువురు హాలీవుడ్ తారలు పాల్గొననున్నారు.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ వేడుక ఇండియాలో లయన్స్‌గేట్ ప్లే అనే ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 6న ఉదయం 05:30 గంటలకు లైవ్ అందుబాటులోకి రానుంది.ఇండియా నుంచి ఓకే చిత్రం..ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు ఇండియా నుంచి ఒక్క సినిమానే ఎంపికైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ రెండు విభాగాల్లో నామినేట్ అయింది. రెండు నామినేషన్లు సాధించిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్) విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. మరి ఈ సినిమాను అవార్డ్ వరిస్తుందో లేదో తెలియాలంటే ఆరో తేదీ వరకు ఆగాల్సిందే. View this post on Instagram A post shared by Golden Globes (@goldenglobes) -
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.తాజాగా ఈ అవార్డ్ విన్నింగ్ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
చరిత్ర ఈమెదే.. గోల్డెన్ గ్లోబ్స్‌కు పాయల్ కపాడియా.. ఇంట్రెస్టింగ్ జర్నీ..! (ఫొటోలు)
-
పుష్పా సరే పాయల్ని చూడండి
మన తెలుగు పుష్పా– 2 రికార్డు బద్దలు కొడుతోంటే అదే సమయంలో మన భారతీయ మహిళా డైరెక్టర్ 80 ఏళ్ల చరిత్ర గల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్స్ సాధించి రికార్డు స్థాపించింది. బెస్ట్ డైరెక్టర్ (మోషన్ పిక్చర్) బెస్ట్ మోషన్ పిక్చర్ (నాన్ ఇంగ్లిష్) కేటగిరీల్లో ఆమె దర్శకత్వం సినిమా ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ నామినేషన్ పొందింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత సాధించిన మన దేశపు మహిళ మరొకరు లే రు.‘సినిమా తీయాలంటే అందరికీ ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు. కాని నాకు ఉపయోగపడింది’ అంటారు పాయల్ కపాడియా. ముంబైలో, ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీలో బాల్యం, కౌమారం గడిచిన పాయల్ పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చదివి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకురాలు అయారు. 2014 నుంచి సినిమాలు తీస్తున్నా 2021లో తీసిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ఆమె ప్రతిభ లోకానికి పరిచయం కాసాగింది.ఎవరికీ లేని ఘనతఆస్కార్ అకాడెమీ అవార్డ్స్‌తో సమానమైన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం పోటీ పడే భారతీయ సినిమాలు చాలా తక్కువ. 1994 లో చివరిసారిగా ఒక భారతీయ సినిమా నామినేషన్ పొందింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అదీ ఒక మహిళా దర్శకురాలిగా పాయల్ కపాడియా తాను తీసిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’తో 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగం కింద రెండు నామినేషన్స్ పొందారు. ఇప్పటికే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండవ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డైరెక్టర్ అవార్డును (గ్రాండ్ ప్రి) పొందిన డింపుల్ కపాడియా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సాధిస్తే ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది.సినిమాలు చూస్తూ...పాయల్ కపాడియా బాల్యంలో రిషి వ్యాలీలోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ‘మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పుడు ప్రగతికాముక సినిమాలు చూపించేవారు. రష్యన్, ఫ్రెంచ్ సినిమాలు... ఆనంద్ పట్వర్థన్ తీసిన డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత పూణెలో డైరెక్షన్ కోర్సులో చేరాక వేరు వేరు ప్రాంతాల, నేపథ్యాల నుంచి వచ్చిన బ్యాచ్‌మేట్స్ సినిమాల గురించి ఎన్నో చర్చలు సాగించేవారు. రోజూ స్క్రిప్ట్‌లు వినడమే సరిపోయేది.అదంతా చిన్న ఎక్స్పోజర్ కాదు. అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాక్టికల్స్ ఉండేవి. అవి చేసే ముందు కష్టంగా ఉన్నా చేశాక ఏదో తెలుసుకున్నాం అనే సంతృప్తి ఉండేది. ఉదాహరణకు అందరూ తప్పనిసరిగా 4 నిమిషాల లాంగ్‌షాట్ తీయాలి మా ప్రాక్టికల్ ఫిల్మ్స్‌లో. ఎవరు ఎలా తీస్తారనేది ఒక అనుభవం. మా ్ర΄పొఫెసర్లు కూడా ఎంతో బాగా పాఠాలు చెప్పారు. అవన్నీ నేను దర్శకురాలు కావడానికి సాయం చేశాయి’ అంటారామె.ముగ్గురు స్త్రీలు, ఒక నగరంమూడు నాలుగేళ్లుగా రాసుకున్న స్క్రిప్ట్ ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ను తీయడానికి కావలసిన బడ్జెట్ కోసం ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్, ఇండియా, నెదర్లాండ్స్‌లోని ్ర΄పొడక్షన్ సంస్థలను ఆశ్రయించి వారి సహ భాగస్వామ్యంతో పూర్తి చేశారు పాయల్. కేరళ నుంచి ముంబైకి భుక్తి కోసం వచ్చిన ఇద్దరు నర్సుల కథ ఇది. వీరు పనిచేసే ఆస్పత్రిలోనే వంటమనిషిగా చేస్తున్న మహారాష్ట్ర మహిళ వీరితో కలుస్తుంది.ఆ నర్సుల్లో ఒకామె భర్త ఆమెను విడిచిపెట్టి జర్మనీ వెళ్లిపోయి ఉంటాడు. మరో నర్సు అవివాహితగా ఉంటూనే ఒక యువకునితో రిలేషన్లో ఉంటుంది. ఇక వంటామె ఇరవై ఏళ్లుగా తాను ఏ చాల్ (చిన్న కొట్టం)లో అయితే నివసిస్తోందో ఆ చాల్ను బిల్డర్ కూల్చడానికి వస్తే దానిని సొంతం అని చెప్పుకోవడానికి ఏ పత్రమూ లేక కలిగే నిస్పృహ... ఈ ముగ్గురి జీవితం ఎక్కడకు చేరుతుంది... ఏ వెలుతురికీ ప్రస్థానం అని చూపేదే కథ.లోతైన కథనంపాయల్ కపాడియా ఈ కథలో ఎన్నో ΄పొరలు ఉంచి కథకు బహుముఖ పార్శా్వలు ఇవ్వడమే ప్రపంచ విమర్శకులను ఆకర్షించి అవార్డుల పంట పండేలా చేస్తోంది. ఈ కథలో మూడు పాత్రలతో పాటు ముంబై నగరం కూడా ఒక పాత్రగా ఉండటం విశేషం. ఒక నగరం పెరిగే కొద్దీ పేదవాళ్లను దూరంగా నెట్టేస్తూ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ఒకప్పటి మామూలు ఏరియా ఖరీదైన భవంతులతో నిండిపోతే అప్పటివరకూ అక్కడ ఉన్నవారు ఎక్కడకు వెళ్లి వుంటారు? ఎవరూ ఆలోచించరు.‘ఈ నగరం కలల నగరం అని కొందరు అనుకుంటారు. ఇది భ్రాంతుల నగరం. కలా నిజమా... తెలుసుకునే లోపే జీవితం గడిచిపోతుంది’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ‘నువ్వు జీవితాన్ని తప్పించుకోలేవు’ అనే డైలాగ్ కూడా ఉంది. తప్పించుకోలేని జీవితంలో తగిన ఆనందాలు వెతుక్కోవడం ఎలాగో ప్రతి జీవికీ తెలుస్తుంది. ఈ కథలోని ముగ్గురు స్త్రీలు ఆ ఆనందాలను వెతుక్కుని వెలుతురు పొందుతారు. జనవరి 5న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ ఉంది. చూద్దాం మన అదృష్టం. -
భారతీయ చిత్రం అరుదైన ఘనత.. రెండు విభాగాల్లో నామినేట్!
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎంపికైంది. తాజాగా ఈ ఏడాది అందించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. గతనెల నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుడా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 6న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అందజేయనున్నారు. తాజాాగ 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ నామినేషన్ జాబితాను జ్యూరీ ప్రకటించింది. భారత్ నుంచి కేవలం ఈ మూవీ మాత్రమే రెండు విభాగాల్లో నామినేట్ అయింది.Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Non-English Language Motion Picture:✨ ALL WE IMAGINE AS LIGHT | USA / FRANCE / INDIA✨ EMILIA PÉREZ | FRANCE✨ THE GIRL WITH THE NEEDLE | POLAND / SWEDEN / DENMARK✨ I’M STILL HERE | BRAZIL✨ THE SEED OF THE… pic.twitter.com/xzfsib2iov— Golden Globes (@goldenglobes) December 9, 2024Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Director Motion Picture:✨ JACQUES AUDIARD | EMILIA PÉREZ✨ SEAN BAKER | ANORA✨ EDWARD BERGER | CONCLAVE✨ BRADY CORBET | THE BRUTALIST✨ CORALIE FARGEAT | THE SUBSTANCE✨ PAYAL KAPADIA | ALL WE IMAGINE AS LIGHT pic.twitter.com/gTtCCMUCTp— Golden Globes (@goldenglobes) December 9, 2024 -
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్‌లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ఇండియన్ స్క్రీన్స్‌కి ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’
‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఇండియాలో విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. కనికా కస్రుతి, దివ్య ప్రభ లీడ్ రోల్స్‌లో, ఛాయా కందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాల నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రం ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై, గ్రాండ్ ప్రీ అవార్డును గెలుచుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన సినిమాల జాబితాలోనూ ఈ చిత్రానికి చోటు దక్కింది. తాజాగా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. నవంబరు 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రానా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నదే ఈ చిత్రకథ.