ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే? | Golden Globe Awards 2025 streaming details and all you need to know | Sakshi
Sakshi News home page

Golden Globe Awards 2025: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌.. ఆ ఓటీటీలోనే లైవ్ స్ట్రీమింగ్

Published Fri, Jan 3 2025 7:52 PM | Last Updated on Fri, Jan 3 2025 8:25 PM

Golden Globe Awards 2025 streaming details and all you need to know

ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చిత్రాలకు ఇచ్చే గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల వేడుక జనవరి 6న జరగనుంది. ఈ 82 వ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్స్-2025 కార్యక్రమానికి హోస్ట్‌గా నటి, కమెడియన్‌ నిక్కీ గ్లేజర్ వ్యవహరించనున్నారు. గోల్డెన్ గ్లోబ్స్ వేడుకకు హోస్ట్ చేసిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో ప్రజెంటర్స్‌గా పలువురు హాలీవుడ్ తారలు పాల్గొననున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ వేడుక ఇండియాలో లయన్స్‌గేట్ ప్లే అనే ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 6న ఉదయం 05:30 గంటలకు లైవ్ అందుబాటులోకి రానుంది.

ఇండియా నుంచి ఓకే చిత్రం..

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్స్‌కు ఇండియా నుంచి ఒ‍క్క సినిమానే ఎంపికైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ రెండు విభాగాల్లో నామినేట్ అయింది. రెండు నామినేషన్లు సాధించిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది.  ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్) విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. మరి ఈ సినిమాను అవార్డ్‌ వరిస్తుందో లేదో తెలియాలంటే ఆరో తేదీ వరకు ఆగాల్సిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement