
కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 2019లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో ధనుశ్ హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రం కోలీవుడ్ హీరో మెజీషియన్ పాత్రలో కనిపించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు కేవలం యాపిల్ టీవీ ప్లస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
తాజాగా ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ మూవీని మరో ఓటీటీలో సందడి చేయనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఎప్పటి నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఈ సినిమాకు కెన్ స్కాట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో ధనుష్ నటనకు హాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ధనుష్ అజాత శత్రు అనే మెజీషియన్ పాత్రలో నటించారు. రొమైన్ ప్యుర్తోలస్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment