
కరోనా తర్వాత ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్‌సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలతో ఓటీటీలు ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది ఆహా ప్లాట్‌ఫామ్. ఎప్పటిలాగే ఈ నెల కూడా కొత్త సరుకుతో రెడీ అయింది. మండే ఎండల్లో బయటకు వెళ్లి సినిమాలు చూడటం అంతంతమాత్రమే అనుకునేవారికోసం గుడ్‌న్యూస్ మోసుకొచ్చింది. 30కి పైగా బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ చిత్రాలను అందించనున్నట్లు ప్రకటించింది.
'అనకొండ', 'బ్యాడ్ బాయ్స్ 2', 'చార్లీస్ ఏంజెల్స్', 'మెన్ ఇన్ బ్లాక్', 'స్పైడర్ మ్యాన్', 'టెర్మినేటర్', 'రెసిడెంట్ ఈవిల్', 'బ్లాక్ హాస్ డౌన్' సహా పలు చిత్రాలు ఆహాలో అందుబాటులోకి రానున్నాయి. మే 6న మలయాళ సూపర్ హిట్ చిత్రం 'దొంగాట' స్ట్రీమింగ్ కానుంది. ఇవే కాకుండా తెలుగు ఇండియన్ ఐడల్ షో ప్రతి శుక్ర, శనివారాల్లో ప్రసారం కానుంది. అలాగే ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా రిలీజ్ చేస్తామని, ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు తెలిపింది.
It's going to be sooooper may machi! Ee nela, miss avakandi 40+ releases, mee aha lo 👊🏽 pic.twitter.com/IRAHVl3IyV
— ahavideoin (@ahavideoIN) May 3, 2022
చదవండి: ఓటీటీల్లోకి బీస్ట్, అప్పటి నుంచే స్ట్రీమింగ్
మహేశ్‌బాబు డ్యాన్స్‌కు ఎన్ని మార్కులు వేస్తానంటే?: శేఖర్ మాస్టర్
Comments
Please login to add a commentAdd a comment