
సుమారు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. 2000 ఏడాదిలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ 'మలేనా' ఓటీటీ ప్రియుల కోసం రానుంది. లూసియానో విన్సెంజోని కథ నుండి గియుసేప్ టోర్నాటోర్ రచించి దర్శకత్వం వహించిన ఈ శృంగార నాటక చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. 73వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తా చాటిన మలేనా.. బాక్సాఫీస్ వద్ద ఆరోజుల్లోనే రూ. 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది.

'మలేనా' చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 99 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 29 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. టైటిల్ పాత్రలో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి (Monica Bellucci) కనిపిస్తుంది. ఆమె ఒక ఆర్మీ ఆధికారి భార్యగా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. 12 ఏళ్ల బాలుడి రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో (Giuseppe Sulfaro) మెప్పించాడు. సినిమా మొత్తం వీరిద్దరి మధ్య జరిగే ఆర్షణ, ప్రేమ చుట్టూ ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా జీవిస్తుంటే ఈ సమాజం ఏ విధంగా చిత్రీకరిస్తుంది అనేది ప్రధాన కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.

కథేంటి..?
ఆ నగరంలో అత్యంత అందమైన యువతిగా మలేనా ఉంటుంది. ఆమె భర్త దేశ సరిహద్దుల్లో ఉద్యోగ రిత్యా ఉండటంతో ఆమెకు దగ్గర కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. కానీ, తను మాత్రం వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడు రెనాటో కూడా ఆమెను ఇష్టపడుతాడు. అయితే, ఆమెను షాడోగా మాత్రమే వెంబడిస్తూ ఆమె విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. మెలేనాకు దగ్గర కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇంతలో ఆమె భర్త మరణించారని వార్త రావడంతో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.. వాటిని అధిగమించేందుకు ఆమె ఒక వేశ్యగా మారుతుంది.
దీంతో నగరంలోని చాలామంది మహిళలు ఆమెను దూషించడం జరుగుతుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ఆమె ముందుకు ఒకరోజు సడెన్‌గా తన భర్త ప్రత్యక్షమౌతాడు. తాను మరణించలేదని, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్తాడు. అయితే, ఒక వేశ్యగా మారిన ఆమెతో అతను కలిసి జీవిస్తాడా..? ఆమె ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చింది..? ఆమెకు 12 ఏళ్ల రెనాటో చేసిన సాయం ఏంటి..? వంటి అంశాలతో పాటు సమాజంలో ఒంటరి మహిళ పట్ల ఉన్న అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఇందులో చక్కడ చూపారు. ఈ కథ అంతా 1940 నాటి కాన్సెప్ట్‌తో చిత్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment