
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం జీ 20 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సినిమా దర్శకుని ఊహ అనేది ప్రేక్షకుల ఊహకందకపోతే అప్పుడు ఆ సినిమా పండుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ దర్శకుల ఆలోచనలే వేరు. ఏది అసాధ్యమో, ఏదైతే జరగదు అని ప్రేక్షకులు అనుకుంటారో దాన్నే సినిమాలో చూపిస్తుంటారు హాలీవుడ్ డైరెక్టర్స్. హాలీవుడ్ దర్శకుడు పాట్రిసియా రీగెన్ తీసిన ‘జీ 20’ సినిమా ఆ కోవలోకి చెందినదే.
ఒక్కసారి ఊహించండి... ప్రపంచంలోనే ఉత్తమోత్తమ సురక్షితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అనే విషయం మనకు తెలుసు. మరి... ఆ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని తన కుటుంబంతో పాటు బందీలుగా తీసుకుని ప్రపంచాన్ని శాసిద్దా మనకున్న విలన్‌ను అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఎదుర్కొన్నారో ఈ ‘జీ 20’లో చూడవచ్చు. అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్‌ను, అతని కుటుంబాన్ని బందీలుగా చేసుకోవడం కూడా చిన్న వేదిక మీదైతే కాదు, దాదాపు అరడజను దేశాధినేతలతో పాటు జీ 20 శిఖరాగ్ర సమావేశంలో హై సెక్యూరిటీ నడుమ ఉండగా అమెరికన్ ప్రెసిడెంట్‌తో పాటు అక్కడున్న మిగతా దేశాధినేతలందరినీ బందీలుగా చేసుకుంటాడు విలన్.
ఇక్కడ ఈ సినిమా దర్శకుడు ఇంకా వినూత్నంగా ఆలోచించాడు. బందీలుగా ఉన్న తన కుటుంబాన్ని, ఇతర దేశాధినేతలను కూడా విలన్‌తో పోరాడి విడిపించే బాధ్యత ప్రెసిడెంట్ మీదే పెట్టాడు సదరు సినిమా డైరెక్టర్. ‘జీ 20’ సినిమా మంచి ఉత్కంఠతతో ప్రారంభమై, ఆద్యంతం ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది.
ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అమెరికన్ ప్రెసిడెంట్ కుంగ్ ఫూ ఫైటర్, గన్ షూటర్, అలాగే హెలికాప్టర్ రైడర్ కూడా. ఇక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సదరు అమెరికన్ ప్రెసిడెంట్ ఈ సినిమాలో ఓ లేడీ.
ఈ పాత్రలో డేనియల్ సట్టన్ సూపర్‌గా నటించారు. పైన చెప్పుకున్నట్టు ఓ లేడీ అమెరికన్ ప్రెసిడెంట్ తన కుటుంబంతో పాటు ఇతర దేశాధినేతలను సూపర్ ఫైటింగ్ స్కిల్స్‌తో సేవ్ చేయడమనేది మామూలు కాన్సె΄్టా... ఆలోచించండి. దటీజ్ ‘జీ 20’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. అయితే మీ పిల్లలను ఈ సినిమాకి దూరంగా ఉంచి మీరు మాత్రం వాచ్ ఇట్ ఫర్ వీకెండ్.
– హరికృష్ణ ఇంటూరు