Hollywood film
-
OTT: హాలీవుడ్ మూవీ ‘కిడ్నాప్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కిడ్నాప్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా పోరాడే తత్వం తల్లిది అన్న విషయాన్ని సూటిగా చూపించిన ఆంగ్ల చిత్రం ‘కిడ్నాప్’. 2017లో లూయి ప్రీటో దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. హాలీవుడ్ ప్రముఖ కథానాయిక హేలీ బెర్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లిష్), లయన్స్ గేట్ (తెలుగు వెర్షన్) ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. తల్లిగా ఆమె నటన ఈ సినిమా మొత్తానికే హైలైట్. కథాంశానికొస్తే... కార్లా డైసన్ ఓ సింగిల్ మదర్. తన ఆరేళ్ల కొడుకు ఫ్రాంకీని కార్నివాల్‌కు తీసుకువెళ్ళడంతో ‘కిడ్నాప్’ సినిమా మొదలవుతుంది. కార్నివాల్లో అనుకోకుండా పార్కింగ్ లాట్ నుండి తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లడం చూస్తుంది కార్లా. ఇక అక్కడి నుండి ఆ కిడ్నాపర్ల వెంటపడి తన కొడుకును ఎలా కాపాడుకుంటుంది అన్నదే మిగతా కథ. ఈ సినిమా స్క్రీన్‌ప్లే దాదాపు రోడ్డు మార్గానే నడుస్తుంది. అమెరికా రోడ్లలో పరిమితికి మించి వేగంగా కొంతమంది కార్లు నడుపుతూ ఉంటారు. అంతకు మించి వేగంగా ఈ కథ స్క్రీన్‌ప్లే ఉంటుంది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు ఈ సినిమా మొదలయ్యాక శుభం కార్డు పడే వరకు లేవరు. సినిమాను అంత ఆసక్తికరంగా దర్శకుడు లూయీ రూపొందించారనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ప్రఖ్యాత సంస్థ అయిన ఎఫ్‌బీఐ ఇచ్చిన అంచనాల మేరకు అమెరికాలో ఏటా 8 లక్షలకు పైబడి ప్రతి 40 సెకన్లకు ఓ బిడ్డ కనిపించకుండాపోతున్న పరిస్థితి ఉంది. మనందరినీ మనకి తెలిసీ తెలియకుండా నిరంతరం కాపాడే అమ్మ ఆ విజయదుర్గ. ఆ తల్లి తత్వంతో తీసిన ఈ సినిమా నిజంగా అద్భుతం. విజయదశమి పండగ సమయంలో థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్లకి ఇదో మంచి చాయిస్.– ఇంటూరు హరికృష్ణ -
చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో తొలిచిత్రంగా రికార్డ్
హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 ఇండియాలో రికార్డులు సృష్టిస్తోంది. అవతార్‌లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చిన ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2) ప్రస్తుతం అన్ని రికార్డులను తిరగరాసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు జేమ్స్ కామెరూన్. అవతార్-2 ఇండియాలో రూ.368.20 కోట్లు వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాని నిలిచింది. అంతకుముందు 'ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్' రూ.367 కోట్లు వసూళ్లు సాధించగా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. అవతార్-2 కేవలం 14 రోజుల్లోనే బాక్సాఫీస్ 1 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కును దాటింది. 2022లో విడుదలైన 'టాప్ గన్: మావెరిక్','జురాసిక్ వరల్డ్ డొమినియన్' సరసన నిలిచింది అవతార్-2. దీంతో 2022లో విడుదలైన ఇతర సినిమాల కంటే జేమ్స్ కామెరూన్ చిత్రం ఈ మైలురాయిని వేగంగా అధిగమించి రికార్డు సృష్టించింది. #Avatar2 creates HISTORY… Emerges the HIGHEST GROSSING #Hollywood film in #India by surpassing *lifetime biz* of #AvengersEndgame. ⭐️ #Avatar2: ₹ 368.20 cr NBOC ⭐️ #AvengersEndgame: ₹ 367 cr NBOC#India biz. #Avatar #AvatarTheWayOfWater pic.twitter.com/eS8EIZ5xu4 — taran adarsh (@taran_adarsh) January 21, 2023 -
ఆ హామీ ఇస్తే ఇప్పుడే అందరూ చస్తారు: ఆర్జీవీ ట్వీట్ వైరల్
అవతార్-2: ది వే ఆఫ్ వాటర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం. సముద్రంలో ఆయన సృష్టించిన ప్రపంచం చూస్తే అశ్చర్యపోకుండా ఉండలేరు. అంటూ అవతార్-2 పై ప్రశంసల వర్షం కురిపించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్. సినిమాలోని ప్రతి సీన్ కట్టిపడేసేలా చేసిందని ఆయన అన్నారు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తే.. కామెరూన్ ‘పండోరా’ అనే అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించాడని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవతార్-2 చిత్రంలో జేమ్స్ కామెరూన్ అందమైన నీటి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే ప్రదర్శన, ఊపిరి బిగబెట్టేలా యాక్షన్ సీన్లతో థియేటర్లను ఊపేశారు. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేశాడని రామ్ గోపాల్ వర్మ ప్రశంసలతో ముంచెత్తారు. ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ..'ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. కానీ అవతార్-2 చూశాక స్వర్గం అంటే పండోరా ప్రపంచంలా ఉంటుందని ఎవరైనా హామీ ఇస్తే.. మనుషులందరూ ఇప్పుడే చచ్చిపోతారు' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 2009లో విడుదలైన అవతార్ సీక్వెల్‌గా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదొక విజువల్ వండర్ అని పలువురు ప్రశంసించారు. After seeing AVATAR 2 , if somebody can assure that heaven will look anywhere like PANDORA the entire human species will DIE immediately — Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2022 -
హాలీవుడ్ సినిమాకు సమంత పేరు రిఫర్ చేసిన హీరో ఎవరో తెలుసా?
Tollywood Top Actor Behind Samantha Hollywood Movie Entry: స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. ‘డోంటన్ అబ్బే’ఫేమ్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే బాలీవుడ్ బడా హీరోయిన్స్‌ని కూడా పక్కనపెట్టి సమంతకు ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటూ సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. సమంతతో ఓ బేబీ చిత్రాన్ని నిర్మిఇంచిన సునీతా తాటి హోం బ్యానర్ గురు ఫిలిమ్స్ ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ కోసం వెతుకుతున్న సమయంలో ఆ పాత్రకు సమంత అయితే బాగుంటుందని రానా రెఫర్ చేశాడటని సమాచారం. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సమంత అయితే ఈ పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందని రానా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. చదవండి: మహేశ్‌బాబుతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ పెళ్లిని వాయిదా వేసుకున్న ఆలియా-రణ్‌బీర్ -
ప్రేమను బతికించుకోగలిగితే..?
హాలీవుడ్ సినిమా / ఇఫ్ ఓన్లీ గడచిన క్షణం తిరిగి రాదు. జీవితంలో రివైండ్లు, రీటేకులు ఉండవు. ప్రతి మూమెంట్‌ని వీలైనంత ఆస్వాదించగలగాలి. ఉమర్ ఖయ్యూమ్ తన రుబాయితుల్లో గోలపెట్టి చెప్పింది - అదే. ఎంత ప్రేమించి, పెళ్లి చేసుకున్నవాళ్లు అయినా - పని ఒత్తిళ్లలో పడి, తమ భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కోరుకోకుండానే ప్రేమ రాహిత్యానికి లోనవుతుంటారు. కాని చేసిన తప్పులు సరిదిద్దుకోగలిగితే..? ఇయాన్ ఓ బిజినెస్‌మ్యాన్. అతని గర్ల్‌ఫ్రెండ్ సమంతా ఆండ్రూస్ మ్యూజిషియన్. సమంతాతో సహజీవనం గడుపుతుంటాడు ఇయాన్. వారి ఒకరోజు జీవితమే 2004లో వచ్చిన ‘ఇఫ్ ఓన్లీ’ సినిమా. ఒకరోజు ఇయాన్ లేవగానే - వంటగదిలో సమంతాకి చేయి కాలుతుంది. చేతిలోని కోక్ టిన్ పగిలిపోతుంది. ఆఫీస్‌లో ఓ ముఖ్యమైన సమావేశంలో ఉండగా - సమంతా వచ్చి ఇయాన్ని డిస్ట్రబ్ చేస్తుంది. తనని పట్టించుకోవడం లేదని నిందిస్తుంటుంది. ఇదివరకటిలాగే తనని ప్రేమించమని అడుగుతుంది. ఆవేశంలో మాటా మాటా పెరిగి సమంతా ట్యాక్సీలో బయల్దేరుతుంది. ఆ ట్యాక్సీ డ్రైవర్ వృద్ధుడు చాలా విలక్షణంగా కనబడుతుంటాడు. ట్యాక్సీలో డిజిటల్ క్లాక్ ఓ టైమ్ చూపిస్తుంటుంది. అదే సమయంలో ఘోర ప్రమాదం జరిగి, సమంతా చనిపోతుంది. ఆ బాధతో ఇంటికొచ్చిన ఇయాన్‌కి సమంతా రాసుకున్న మ్యూజికల్ నోట్స్ కనబడుతుంది. తన సంగీత కచేరీ చేయడానికి రాసుకున్న నోట్స్ అది. తన ప్రియురాలి చిన్న చిన్న కోరికలు తీర్చలేకపోయినందుకు, ఆమెని శాశ్వతంగా దూరం చేసుకున్నందుకు బాధతో విలవిలలాడుతుంటాడు. ఇయాన్ నిద్రలోకి జారుకుంటాడు. మెలకువ వచ్చేటప్పటికి సమంతా బతికే ఉంటుంది. మొదట భయపడ్డా, అంతకుముందు జరిగినదంతా కల అని ఓ నిర్ణయానికొస్తాడు. ఆ కలలో లాగానే - సమంతా చేయి కాలిపోతుంది - కోక్ టిన్ పగిలిపోతుంది. ఇయాన్లో టెన్షన్ ప్రారంభమవుతుంది. కలలో లాగే సమంత చనిపోతుందా అనే భయం. అందుకే ప్రతిక్షణం అపురూపం అతనికి. ఇయాన్ సమంతాని లండన్ సమీపంలోని తన పల్లెటూరికి తీసుకెళ్తాడు. ప్రకృతి అందాల మధ్య తమ ప్రేమని తల్చుకుంటారు. తిరిగి లండన్ తీసుకొచ్చాక ‘లండన్ ఐ (అతి పెద్ద జెయింట్ వీల్)’ ఎక్కేస్తాడు ఇయాన్. ఆ తర్వాత సమంతా సంగీత కచేరికి హాజరవుతాడు. ఇయాన్‌తో పాటు సభికులంతా సమంతా ప్రావీణ్యాన్ని అభినందిస్తారు. ఆ రోజంతా చాలా ఆనందంగా, ప్రతి క్షణమూ ప్రేమభరితంగా గడిచిపోయింది. ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు ఇయాన్, శామ్. అద్భుతమైన బ్రాస్లెట్ కానుకగా ఇచ్చాడు. ♦ తెలుగులో ‘ఇఫ్ ఓన్లీ’ స్ఫూర్తితో ఆ మధ్యకాలంలో రెండు సినిమాలు వచ్చాయి. సుమంత్ ‘పౌరుడు’ సినిమా డెరైక్ట్ చేసిన రాజ్ ఆదిత్య 2009లో ‘మళ్లీ మళ్లీ’ అనే సినిమా తీశాడు. ♦ ఉదయ్‌కిరణ్, శ్వేతాబసుప్రసాద్జంటగా ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ అనే సినిమా 2012లో వచ్చింది. ♦ అయితే ‘మళ్లీ మళ్లీ’ చిత్ర దర్శకుడు రాజ్ ఆదిత్య (2009), ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ హీరో ఉదయ్‌కిరణ్ (2014) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గొప్ప విషాదం. ♦ హిందీలో 2008లో వచ్చిన ‘రుబారు’ కూడా ‘ఇఫ్ ఓన్లీ’ కాపీయే! బయటికొచ్చారు. కలలో వాళ్లు వచ్చిన రెస్టారెంట్ కూడా అదే. ట్యాక్సీ వచ్చింది. కలలో కనబడ్డ ట్యాక్సీ అదే. ట్యాక్సీ డ్రైవర్ కూడా అచ్చం అతనే. ఇయాన్లో టెన్షన్ ఎక్కువైంది. ఇద్దరూ ట్యాక్సీలో కూర్చున్నారు. ట్యాక్సీలో డిజిటల్ క్లాక్. కలలో ఏ టైమ్ చూపిస్తుందో - అదే సమయం చూపిస్తుంది. రాత్రి 11 గంటలు - ట్యాక్సీకి భయంకరమైన యాక్సిడెంట్. హాస్పిటల్లో శామ్ ఫ్రెండ్ పరుగెత్తుకుంటూ వచ్చేసరికి, శామ్ ఏడుస్తూ కనబడింది. యాక్సిడెంట్లో ఇయాన్ చచ్చిపోయాడు. అత్యంత విషాద భరితమైన ముగింపుతో సాగిన ఈ సున్నితమైన ప్రేమకథలో హీరో హీరోయిన్లూ - పాల్ నికోలస్, జెన్నిఫర్ హెవిట్ నటించారు. దర్శకుడు గిల్ జంగర్. క్రిస్టీనా వెల్ష్ రచయిత. ఒకటే జీవితం - ఏ క్షణాన జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదు. బతికినన్ని క్షణాలు మనల్ని ప్రేమించేవాళ్లని ఆనందపరుస్తూ, బాధ్యతలు నిర్వహించగలిగితే చాలు అని చెప్పిన గొప్ప కథ ‘ఇఫ్ ఓన్లీ’. ముఖ్యంగా ఒక రోజులో జరిగే సంఘటనలని - రెండు వెర్షన్లలో చెప్పడమనేది అద్భుతమైన స్క్రీన్‌ప్లే టెక్నిక్. ‘స్లైడింగ్ డోర్స్’, ‘రన్ లోలా రన్’ లాంటి సినిమాలు - ఈ స్క్రీన్‌ప్లే స్టయిల్లో చెప్పినవే. - తోట ప్రసాద్ -
వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్!
మన సినిమాలు తొలి వారంలో ఇక్కడ పదుల కోట్లు వసూలు చేయడం కొత్త కాదు. అదే గనక ఒక హాలీవుడ్ చిత్రం ఇక్కడకు వచ్చి, బాక్సాఫీస్ దుమ్ము దులిపితే? తాజా హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ ఆ రకంగా వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 2న వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులకే మన దేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 49 కోట్ల మేర నికర వసూళ్ళు సాధించింది. విన్ డీసెల్, డ్వానే జాన్సన్, కీర్తిశేషులు పాల్ వాకర్ నటించిన ఈ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లోని 7వ సినిమా ఆ రకంగా ఇప్పుడు చరిత్రకెక్కుతోంది. భారతదేశంలో రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించిన అతికొద్ది హాలీవుడ్ సినిమాల్లో ఒకటి అవుతోంది. ఇదే ఊపు గనక కొనసాగి, రాగల కొద్దివారాల్లో ఈ సినిమా గనక మరొక్క రూ. 30 కోట్లు వసూలు చేస్తే, మన దేశంలో ఇప్పటి దాకా అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి దాకా జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలోని ‘అవతార్’ చిత్రం రూ. 78 కోట్ల వసూళ్ళతో భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమా అన్న ఘనత సాధించింది. కాగా, మన దేశంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ చిత్రం ఇటు ఇంగ్లీషులోనూ, అటు డబ్బింగ్ వెర్షన్లోనూ కలిపి దాదాపు 1800 నుంచి 2000 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, క్రేజీ ఫైట్లు, పంచ్ డైలాగులతో ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 2013లో అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూసిన పాల్ వాకర్ నటించిన ఆఖరు చిత్రం కావడం కూడా ఈ సినిమాకు క్రేజు పెంచింది. సినిమాలోని కథ, కథనాలతో పాటు మార్కెటింగ్ కూడా తోడవడంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ప్రస్తుతం భారత్‌లోనే కాక, ప్రపంచమంతటా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. -
హాలీవుడ్ చిత్రంలో...
‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ప్రస్తుతం ‘లయన్’లో నటిస్తున్నారు. మరోవైపు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న రాధికా ఆప్టేని ఓ హాలీవుడ్ ఆఫర్ వరించింది. ఎంటీవీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పలు లఘు చిత్రాల సమాహారంతో సాగుతుంది. ఈ లఘు చిత్రాలకు అంతర్జాతీయంగా పేరు, ప్రఖ్యాతులు సాధించిన ఏడుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తారు. వారిలో హిందీ రంగానికి చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉండటం విశేషం. -
బాక్సాఫీస్ ‘రన్నర్’!
హాలీవుడ్ చిత్రం ‘ది మేజ్ రన్నర్’ బాక్సాఫీస్ రేస్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 32.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్‌లో నిలిచింది. యూనివర్సల్ ‘ఏ వాక్ ఎమాంగ్ ది టాంబ్స్టోన్స్’ (13.1 మిలియన్ డాలర్లు), వార్నర్ బ్రదర్స్ ‘దిస్ ఈజ్ వేర్ ఐ లీవ్ యూ’ (11.9 మిలియన్ డాలర్లు) వంటి మెగా చిత్రాలను వెనక్కు నెట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మేజర్ సిటీస్‌లో తమ చిత్రానికి ఆదరణ బాగుందని... మిగిలిన ప్రాంతాల్లో అంతగా ఎక్కలేదని వార్నర్ బ్రదర్స్ డొమెస్టిక్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ డాన్ ఫెల్మ్యాన్ వెల్లడించాడు. -
హాలీవుడ్‌లోనూ పాటలు పెడుతున్నా!
భారతీయ సినిమాల్లో పాటలు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు పెద్ద కొరతగా భావిస్తారు. హలీవుడ్ చిత్రాలు ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పాటలుండే సినిమాలు అరుదు. కానీ, హాలీవుడ్ చిత్రాల్లోనూ పాటలుంటే బాగుంటుందని సంగీత సంచలనం ఎ.ఆర్. రెహమాన్ అంటున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రం కోసం జంట ఆస్కార్ అవార్డులు అందుకుని, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకున్న రెహమాన్ ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలకూ సంగీతదర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లో పాటలకు ఉండే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ చిత్రాలకు కూడా పాటలు స్వరపరుస్తున్నారు రెహమాన్. దీని గురించి ఆయన చెబుతూ -‘‘పాటలు లేకుండా సినిమా తీయాలనుకుంటారు కొంతమంది. కానీ, సినిమాల్లో ప్రేక్షకులకు హాయినిచ్చే అంశాల్లో ఆటాపాటా ఒకటి. కేవలం వాటి కోసమే మళ్లీ మళ్లీ సినిమాలు చూసేవాళ్లున్నారు. అందుకే, నేను హాలీవుడ్ చిత్రాల్లో కూడా పాటలు పెడుతున్నా. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాల్లో ‘మిలియన్ డాలర్ ఆర్మ్’ అనే సినిమా ఒకటి. క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ కథ అటు అమెరికాలోనూ ఇటు ఇండియాలోనూ సాగుతుంది. ఎక్కువ శాతం షూటింగ్ ఇండియాలో చేశారు. రెండు దేశాల నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, దీన్ని నేను సవాల్‌గా తీసుకుని చేశాను ఈ సినిమాలో పాటలున్నాయి. తమిళంలో నేను పాటలు స్వరపరచిన ‘తిరక్కద కాట్టుకుళ్లే’ అనే సినిమాలోని ఓ పాటను ఈ హాలీవుడ్ చిత్రంలో వాడాను. అలా వాడటం నాకిష్టం లేకపోయినా చిత్రదర్శక, నిర్మాతలకు ఆ ట్యూన్ బాగా నచ్చింది. వాళ్ల కోరిక మేరకు ఈ ట్యూన్ తీసుకున్నా’’ అని చెప్పారు. -
వివరం : అందాకా వెళ్లడమే పురస్కారం
ఆస్కార్ రావడం గొప్ప అనుకునేవాళ్లు, ఆస్కార్ రావడం గొప్పా అనేవాళ్లు... హాలీవుడ్లో పక్కపక్క ఇళ్లల్లో ఉంటారని అంటారు. ఆస్కార్ గొప్పతనమదే! ఆస్కార్ వచ్చినా, రాకున్నా గొప్పే. అసూయను సైతం సుగుణంగా మార్చింది ఆస్కార్. సినిమాను గౌరవించినట్లే, వ్యక్తిగత అభిప్రాయాలను, ఆగ్రహాలను గౌరవించింది ఆస్కార్. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధమైన సూచనలనూ స్వీకరించింది. 1936లో హాల్మర్కు ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డు అలా వచ్చిందే. నామినేషన్లలో ఆయన పేరు లేదు. కానీ, ‘మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్’ చిత్రంలో సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉందని అకాడెమీ సభ్యులు బ్యాలెట్లో హాల్మర్ పేరు రాసి మరీ ఓటేశారు. వారి తీర్పునకు సమ్మతి లభించింది! ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు. ఎవరెంత పట్టి ఉంచినా, పట్టనట్లు ఉండిపోయినా... ఏదో ఒకరోజు తిన్నగా అది వేదిక మీదికి వచ్చేస్తుంది. ఆ వేదిక ఆస్కార్ అయితే ఇక చెప్పాల్సిందేముందీ! అందుకే ఆస్కార్‌తో ముడివడిన కొందరు హాలీవుడ్ తారల భావోద్వేగాలను ఈవారం మీకు అందిస్తున్నాం. మేమ్... నిద్ర లేచారా? బ్రిటన్ నటి హెలెన్ మిరెన్కు ఉదయాన్నే 5.30 కి తన ఏజెంటు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘గుడ్మాణింగ్ మేమ్. ఉత్తమ సహాయ నటిగా మీరు ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు’’.ఇటువైపు ఉలుకు లేదు. పలుకు లేదు. 1994లో ‘ద మ్యాడ్నెస్ ఆఫ్ కింగ్ జార్జి’ చిత్రంలో హెలెన్ నటించిన క్వీన్ చార్లెట్ పాత్ర అది. ‘‘మేమ్... నిద్ర లేచారా?’’ మళ్లీ అడిగాడు ఏజెంట్. ‘‘లేచానయ్యా. విన్నాలే. ఆస్కార్ వస్తే మంచిదే. జనానికి ఒకట్రెండ్రోజులు గుర్తుంటాం. కానీ ఈ గిన్నెల బాధ ఎప్పటికీ తప్పదు కదా. లేవాలి, తోమాలి’’. ఇదీ హెలెన్ సమాధానం! సీసాలు పగలగొట్టాడు! దర్శకుడు స్పైక్ లీ తీవ్రమైన అసహనంతో ఉన్నాడు. 1990లో ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ 9 ఆస్కార్లకు నామినేట్ అయింది. తన సొంత చిత్రం ‘డు ద రైట్ థింగ్’ మాత్రం ఒక్క కేటగిరీలోనూ నామినేట్ అవలేదు. పైగా అది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో షికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు పొందిన చిత్రం. లీ కి బాగా కోపం వచ్చింది. 24 గంటల తర్వాత గానీ మామూలు మనిషి కాలేకపోయాడు. ‘‘మీ కోపం ఎలా తగ్గిపోయింది?’’ విలేఖరి ప్రశ్న. ‘‘రోజంతా పెద్దగా బండ బూతులు తిట్టుకున్నా. సీసాలు పగలగొట్టా. అప్పుడుగానీ మనసు శాంతించలేదు’’. అది నేను కాదు బ్రో... ‘టైటానిక్’ (1997) కి 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అయితే ఆ చిత్ర కథానాయకుడు లియోనార్డో డి కాప్రియో ఆస్కార్ వేడుకలను ఎగ్గొట్టి వేరే ఎక్కడో తాగి తూలుతున్నాడు. విషయం తెలుసుకోడానికి చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ అతడికి ఫోన్ చేస్తే అటువైపు నుంచి వచ్చిన సమాధానం : ‘‘మీరు వెదుకుతున్న వ్యక్తిని నేను కాదు బ్రో’’. రేపు ఉదయం మనకు ఆస్కార్ వేడుకలకు ముహూర్తం దగ్గరపడింది. ఇవాళ సాయంత్రం (మనకు రేపు ఉదయం) హాలివుడ్లోని డాల్బీ థియేటర్ నుంచి విజేతల ప్రకటన వెలువడుతుంది. గత ఏడాది జనవరి 1 నుంచి, డిసెంబర్ 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చలన చిత్రాలలో 24 కేటగిరీల నుంచి స్వీకరించిన నామినేషన్లలో అత్యుత్తమమైనవిగా ఎంపికైన వాటికి ఆస్కార్ అవార్డును ప్రకటిస్తారు. ఈసారి ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘గ్రావిటీ’ , ‘12 ఇయర్స్ ఎ స్లేవ్’ గట్టి పోటీ ఇస్తున్నాయి. అకాడెమీ ఉత్సవాలు (ఆస్కార్ ఉత్సవాలు) తొలిసారి 1929 మే 16న గురువారం హాలివుడ్లోని రూజ్వెల్ట్ హోటల్లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి 86వ ఆస్కార్ వేడుకలు. ఈ వేడుకలను ప్రఖ్యాత కమెడియన్, టెలివిజన్ హోస్ట్ ఎలెన్ డిజెనెరస్ నిర్వహించనున్నారు. అండ్ ద విన్నర్ ఈజ్.... ‘మర్డర్ ఇంక్ (1960) చిత్రంతో ఆస్కార్‌కు నామినేట్ అయిన పీటర్ ఫాక్, తనకా విషయం తెలిసే సమయానికి గ్రీన్విచ్ గ్రామంలో వారానికి 10-15 డాలర్ల వేతనం వచ్చే ఉద్యోగం ఏదో చేస్తూ ఉన్నాడు. అవార్డులు ప్రకటించే రోజు ఓ పాత ఫోక్స్‌వేగన్ కారులో వేదిక దగ్గరకు చేరుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో ఆయన మాటల్లోనే వినాలి. ‘‘ఒక్కో కేటగిరీలో విజేతలెవరో ప్రకటిస్తున్నారు. కొంతసేపటి నా కేటగిరీ వచ్చింది. ఊపిరి బిగబట్టి వింటున్నాను. ‘అండ్ ద విన్నర్ ఈజ్... పీటర్...’’ అనగానే ఒక్క గెంతుతో పైకి లేస్తుండగా... ‘ఉస్తినోవ్’ అని వినిపించి కూలబడిపోయాను. నా పక్కన కూర్చుని ఉన్న నా ప్రచార కార్యదర్శిపై విరుచుకుపడ్డాను. రోజంతా ఆకాశం వైపు చూస్తూ... 1993లో ‘హోవార్డ్స్ ఎండ్’ చిత్రంతో ఎమ్మా థాంప్సన్ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్నారు. అవార్డు అందుకున్న రెండో రోజు ఎమ్మా ఏం చేశారో తెలుసా? తన ఆనందాన్ని తల్లితో పంచుకున్నారు. ఎలాగంటే, తల్లీకూతుళ్లిద్దరూ పూల మధ్యలో రోజంతా వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తుండిపోయారు. ఆ రోజును తలుచుకుంటూ ‘‘ఇద్దరం పక్కపక్కనే గుండెల మీద క్రాస్‌గా చేతులు వేసుకుని చనిపోయినట్లుగా పడుకున్నాం’’ అని నవ్వుతూ చెబుతుంటారు ఎమ్మా. అతడితో కలిసి నిద్రిస్తున్నాను షిర్లీ మెక్లైన్కు మనసు విప్పి బాహాటంగా మాట్లాడ్డం అలవాటు. 1984లో ఓ సాయంత్రం బ్రాడ్వే థియేటర్ వేదిక మీద మాట్లాడుతూ ‘‘నా జీవితంలోకి కొత్తగా ప్రవేశంచిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 35 ఏళ్లుగా నేను అతడిని గుట్టుగా ఆరాధిస్తున్నాను. అతడు అన్నిటా అధికుడు. నీతిలో, నిజాయితీలో, సృజనాత్మకతలో! ముఖ్యంగా ఇప్పుడు నేను రోజూ అతడితో నిద్రిస్తున్నాను’’ అని చెప్పారు షిర్లీ. ఆ వెంటనే పియానో వెనుక దాచి ఉంచిన ఆస్కార్ ప్రతిమను చేతిలోకి తీసుకుని గాలిలో ఊపుతూ అతనే ఇతను అని ప్రేక్షకులకు చూపించారు. అంతకు ముందే న్యూయార్క్‌లోని తన అపార్ట్మెంట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘ఆస్కార్ ప్రతిమను మీరు ఎక్కడ భద్రపరిచారు?’’ అన్న ప్రశ్నకు ‘‘అది నా పడక గదిలో ఉంటుంది’’ అని షిర్లీ చెప్పిన దానిని బట్టి రోజూ ఆవిడ ఆస్కార్‌తో పవళిస్తానని చెప్పిన సంగతి నిజమేననుకోవాలి. ఆస్కార్ ఖర్చులు ఆస్కార్‌కు ఒక సినిమా నామినేట్ అవడానికి చిత్ర రచయిత లేదా చిత్ర దర్శకుడికి అయ్యే ఖర్చు 2,00,000 డాలర్లు. ఆస్కార్‌ను గెలిచేందుకు ఒక ఏడాదిలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెట్టే మొత్తం ఖర్చు 150 మిలియన్ డాలర్లు. ఆస్కార్ వేడుకల వ్యాఖ్యాతకు ఇచ్చే పారితోషికం 15,000 నుంచి 25,000 డాలర్లు. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యే నటీమణుల ముస్తాబుకు అయ్యే ఖర్చు 5,000 నుంచి 11,000 డాలర్లు. ఒక ఆస్కార్ గౌను కుట్టడానికి అయ్యే ఖర్చు 4,000 నుంచి 6,000 డాలర్లు. (ఈ ఖర్చును ఆస్కార్ స్డుడియోవారే భరిస్తారు). ఆస్కార్ వేడుకలలో గాయనీమణులకు ఇచ్చే పారితోషికం 14,000 డాలర్లకు పైగానే. ఆస్కార్ వేదిక వరకు పరిచే రెడ్ కార్పెట్ తయారీ ఖర్చు 25,000 డాలర్లు (చదరపు అడుగుకు 1.50 డాలర్లు) ఆస్కార్ అకాడమీ సభ్యులకు సినిమాలు వేసి చూపించడానికి అయ్యే ఖర్చు 2,50,000 డాలర్లకు పైగానే. ఆస్కార్‌కు నామినేట్ అయినవారి భోజనాల ఖర్చు 2,50,000 డాలర్లు. ఆస్కార్ ట్రోఫీ తయారీకి అయ్యే ఖర్చు ఒక్కింటికి 400 డాలర్లు. ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను లాస్ఏంజిల్స్, న్యూయార్క్, లండన్లలో ప్రదర్శిస్తారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన వారికి ‘ఆస్కార్ నామినీ’ అని రాసి ఉన్న స్వెటర్‌ను అందిస్తారు. మరికొన్ని ఆస్కార్ విశేషాలు ఆస్కార్లు మొదలైన తొలి ఏడాది (1929) బెస్ట్ ఆర్టిస్టిక్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్, బెస్ట్ టైటిల్ రైటింగ్ (మూకీ సినిమాలకు), బెస్ట్ కామెడీ డెరైక్షన్ విభాగాలకు కూడా అవార్డు ప్రదానం చేశారు. తర్వాతి ఏడాది నుంచి ఈ విభాగాలను తొలగించారు. అతి చిన్న వయసు ఆస్కార్ విజేత టాటమ్ ఓ నీల్. పదేళ్ల వయసులో ఈ అమ్మాయి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది. చిత్రం : పేపర్ మూన్ (1973). అతి చిన్న వయసులో ఆస్కార్ నామినేషన్ పొందింది మాత్రం జస్టిన్ హెన్రీ. 1979 నాటి ఓట్చఝ్ఛట గట ఓట్చఝ్ఛట చిత్రంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఇతడు నామినేట్ అయ్యాడు. అప్పటికి అతడి వయసు 8 ఏళ్లు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందిన సినిమాల నిడివి సుదీర్ఘంగా ఉంటుంది. వాటిల్లో మరీ మూడున్నర గంటల పాటు సాగే సినిమాలు: Gone with the wind, Law-rence of Arabia, BenHur. తొలి ఆస్కార్ ఉత్తమ నటుడు ఎమిల్ జేనింగ్స్ ఆస్కార్ వేడుకలకు (1927-28 అవార్డులు) హాజరు కాకుండానే ట్రోఫీని అందుకున్నారు! అత్యవసరంగా ఆయన తన జన్మస్థలం జర్మనీకి వెళ్లవలసిరావడంతో అవార్డు ప్రదానోత్సవానికి ముందే నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. మరణానంతరం కూడా కొంతమంది సినీ కళాకారులు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. అలా ఆస్కార్ చరిత్రలో తొలిసారిగా నామినేట్ అయ్యి, అవార్డు పొందిన వ్యక్తి సిడ్నీ హోవార్డ్. ‘గాన్ విత్ ద విండ్’ (1939) స్క్రీన్ రైటర్ ఆయన. ఆస్కార్ అవార్డును తిరస్కరించిన తొలి వ్యక్తి డూడ్లీ నికోల్స్. ‘ది ఇన్ఫార్మర్’ (1935) చిత్రంలో ఆయన స్క్రీన్‌ప్లేకు అవార్డు వచ్చింది. అకాడెమీకి, రైటర్స్ గిల్డ్‌కు మధ్య ఉన్న వివాదాల కారణంగా అవార్డు తీసుకోడానికి నిరాకరించారు నికోల్స్. మేరీ పిక్‌ఫోర్డ్... ఆస్కార్ అవార్డుల వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె మొదటి భర్త డగ్లాస్ ఫెయిర్‌బ్యాంక్స్ ఆ అకాడమీకి తొలి అధ్యక్షుడు. అయినప్పటికీ 1960 ఆస్కార్ ఓటింగులో మేరీ పాల్గొనలేదు! ‘‘ఓటింగుకు నేను అర్హురాలిని కాదు. ఎందుకంటే నేను సినిమాలను చూడ్డం ఎప్పుడో మానేశాను’’ అని అన్నారావిడ! మేరీ ఎలిజబెత్ మేస్ట్రాంటినో అనే ఆవిడకు ఆస్కార్ అవార్డు రాలేదు కానీ, ఆస్కార్‌కు సంబంధించిన రికార్డును తనకు తెలియకుండానే ఆమె సాధించారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన వందలాది నటులు, నటీమణులలో అందరికన్నా పొడవైన పేరు తనదేనని మేస్ట్రాంటినోకు ఆ తర్వాత ఎవరో చెప్పి సంతోషపరిచారు. బటర్ ఫ్లైయ్స్ ఆర్ ఫ్రీ చిత్రంలో మిస్ట్రెస్ బేకర్ పాత్రను పోషించిన ఎలీన్ హెకార్ట్కి 1972లో ఆస్కార్ అవార్డు వచ్చింది. మర్నాడు ఆమె ఎప్పటిలా తనకు రావలసిన చెక్కు కోసం స్థానిక నిరుద్యోగ కార్యాలయానికి వెళ్లారు. ఇక చూడండి. ఆఫీస్ ఆఫీసంతా లేచి నిలబడి చప్పట్లతో ఎలీన్కు స్వాగతం పలికారు! 1942లో ఆస్కార్ భోజనశాల ఆహ్వానితులలో చైనా రాయబారి డాక్టర్ హు ష్యీ కూడా ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సిసెల్ డిమిలే డాక్టర్ హు ష్యీని ఉద్దేశించి మాట్లాడుతూ పొరపాటున ‘‘గౌరవనీయులైన జపాన్ రాయబారి’’ అని, వెంటనే నాలుక కరుచుకున్నారు. అప్పటికే హాలంతా గంభీరమైన నిశ్శబ్ధం అలుముకుంది. జపాన్ దురాక్రమణదారులతో చైనా పోరాడుతున్న రోజులవి! ‘షేక్స్పియర్ ఇన్ లవ్’ చిత్రానికి 1999లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకుంటూ గ్వినెత్ పాల్ట్రో ఆనందభరితమై ఉద్వేగంతో కంటతడి ప్రసంగం చేశారు. ఆ రోజును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ‘‘అలా ఎందుకయిందో తెలియదు. ఆ క్షణంలో నన్ను చూస్తూ కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే కుదురుగా నిలబడలేకపోయాను. జ్వరం వచ్చినట్లయింది’’ అన్నారు. ఆస్కార్ నటి సుసాన్ సారాండాన్ ఆమె సహజీవన ప్రియుడు టిమ్ రాబిన్స్, వారి పిల్లలు ఈవా (13), జాక్ (9), మైల్స్ (6) మిలీనియం వేడుకలను ఎక్కడ జరుపుకున్నారనుకున్నారో తెలుసా? వారి బాత్రూమ్లో. అక్కడ ఉన్న షోకేస్‌లో ఆస్కార్ సహా వారికి వచ్చిన అవార్డులన్నీ కొలువుతీరి ఉంటాయి. 1943లో గ్రీర్ గార్సన్కు మిస్ట్రెస్ మినివర్ చిత్రం ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అవార్డు అందుకున్నాక స్వీకార ప్రసంగం (యాక్సెప్టెన్స్ స్పీచ్) చెయ్యాలి కదా. అర్ధరాత్రి మొదలైన గార్సన్ ప్రసంగం ఏకధాటిగా ఐదున్నర గంటల పాటు కొనసాగింది! ఆస్కార్ చరిత్రలో అంత సుదీర్ఘమైన ప్రసంగం ఇప్పటి వరకు లేదు. హాలీవుడ్ మెలోడ్రామా ‘ద బ్యాడ్ అండ్ ద బ్యూటిఫుల్’ చిత్రంలో అనేక సంబంధాలు కలిగి ఉన్న మహిళగా తను వేసిన పాత్రకు 1953లో ఉత్తమ సహాయక నటిగా ఆస్కార్ అవార్డు పొందిన గ్లోరియా గ్రాహమ్ ఒకే ఒక మాటలో తన స్వీకార ప్రసంగాన్ని ముగించారు. ఆ మాట: ‘థ్యాంక్యూ’. ఆస్కార్ చరిత్రలో ఇంతకన్నా చిన్న ప్రసంగం లేదు.