వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్! | 'Fast and Furious 7' box office collection | Sakshi
Sakshi News home page

వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్!

Published Tue, Apr 7 2015 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్!

వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్!

మన సినిమాలు తొలి వారంలో ఇక్కడ పదుల కోట్లు వసూలు చేయడం కొత్త కాదు. అదే గనక ఒక హాలీవుడ్ చిత్రం ఇక్కడకు వచ్చి, బాక్సాఫీస్ దుమ్ము దులిపితే? తాజా హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ ఆ రకంగా వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 2న వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులకే మన దేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 49 కోట్ల మేర నికర వసూళ్ళు సాధించింది. విన్ డీసెల్, డ్వానే జాన్సన్, కీర్తిశేషులు పాల్ వాకర్ నటించిన ఈ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లోని 7వ సినిమా ఆ రకంగా ఇప్పుడు చరిత్రకెక్కుతోంది. భారతదేశంలో రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించిన అతికొద్ది హాలీవుడ్ సినిమాల్లో ఒకటి అవుతోంది.
 
 ఇదే ఊపు గనక కొనసాగి, రాగల కొద్దివారాల్లో ఈ సినిమా గనక మరొక్క రూ. 30 కోట్లు వసూలు చేస్తే, మన దేశంలో ఇప్పటి దాకా అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి దాకా జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలోని ‘అవతార్’ చిత్రం రూ. 78 కోట్ల వసూళ్ళతో భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమా అన్న ఘనత సాధించింది. కాగా, మన దేశంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ చిత్రం ఇటు ఇంగ్లీషులోనూ, అటు డబ్బింగ్ వెర్షన్‌లోనూ కలిపి దాదాపు 1800 నుంచి 2000 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
 
  యాక్షన్, క్రేజీ ఫైట్లు, పంచ్ డైలాగులతో ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 2013లో అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూసిన పాల్ వాకర్ నటించిన ఆఖరు చిత్రం కావడం కూడా ఈ సినిమాకు క్రేజు పెంచింది. సినిమాలోని కథ, కథనాలతో పాటు మార్కెటింగ్ కూడా తోడవడంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ప్రస్తుతం భారత్‌లోనే కాక, ప్రపంచమంతటా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement