
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 257కు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఎల్2 ఎంపురాన్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా మలయాళంలో ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా 2018 మూవీ రికార్డ్‌ను మాత్రం అధికగమించలేకపోయింది. అయితే 2023లో విడుదలైన 2018 సినిమా కేరళ వ్యాప్తంగా రూ.88.7 కోట్లు రాబట్టగా.. ఎంపురాన్ ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ విషయంలో 2018 మూవీని ఎల్2 ఎంపురాన్ దాటలేకపోయింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.