box office
-
బాక్సాఫీస్ విన్నర్ ఎవరు?
-
మలయాళ చిత్రాలకు కలెక్షన్స్.. అదే ప్రధాన కారణం: సలార్ నటుడు
సలార్ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఎల్2 ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే తాజాగా మలయాళ చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న ఒత్తిడిపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అన్నారు. అందువల్లే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు దోహద పడుతోందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మలయాళ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద పోటీ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'మాకు కూడా బాక్సాఫీస్ చాలా ముఖ్యం. సినిమాలు ఆర్థికంగా లాభాలు ఉండేలా చూసుకోవడానికి మాపై కూడా చాలా ఒత్తిడి ఉంది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే బాగాలేని సినిమాలకు కలెక్షన్స్ రావని వారంతా క్లారిటీగా చెప్పారు. ఇటీవల కాలంలో నటుడు ఎవరో, దర్శకత్వం ఎవరనే అనే దానితో సంబంధం లేకుండానే కొన్ని మంచి సినిమాలు వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకుల ఆదరణ దక్కాలంటే మనం కథ పట్ల నిజాయితీగా ఉండటం చాలా అవసరం. చిత్ర నిర్మాతలు, నటులు మనం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే కథను ఎంచుకుంటే.. ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మాకు తెలుసు' అని అన్నారు. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఎల్2: ఎంపురాన్ మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
అభిషేక్ బచ్చన్ మూవీతో ఏం చేయాలో దిక్కుతోచలేదు: డైరెక్టర్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గతేడాది ఐ వ్యాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు సుజిత్ సిర్కార్ ఈ మూవీ పరాజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా ఫలితం తనకు దిక్కుతోచని పరిస్థితి తీసుకెళ్లిందని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ థియేటర్లలో విఫలం కావడం తనను బాధించిందని సుజిత్ సిర్కార్ తెలిపారు.డైరెక్టర్ సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. "నా నిబంధనల ప్రకారం.. నాకు ఉన్న దృష్టితో నేను సినిమాలు తీయగలిగినంత కాలం తీస్తూనే ఉంటా. ఇలాంటి పరాజయాలు కొన్నిసార్లు మమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయం తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. ఈ సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు నా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలో చాలామంది ఆడియన్స్ స్పందించడం సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి చిత్రమనే నేను అనుకుంటున్నా.' అని అన్నారు.కాగా.. సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ఓ ఎన్నారై పాత్రలో కనిపించారు. జీవితాన్ని మార్చే ఓ సర్జరీ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం ఏకంగా బరువు కూడా పెరిగాడు. విభిన్నమైన పొట్టతో అభిషేక్ బచ్చన్ ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ, జానీ లీవర్, పెర్లే డే, క్రిస్టిన్ గొడ్దార్డ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఐ వాంట్ టూ టాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.డాకు మహారాజ్ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. యూఎస్‌లో అరుదైన రికార్డ్..బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. 'సింహం నక్కల మీద కొస్తే వార్ అవ్వదు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. #DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్!
కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం. ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సూర్య కంగువాకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.రామ్ పోతినేని- డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.మహేశ్ బాబు- గుంటూరు కారంఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది.మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై, మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం
తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్’ బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ‘కల్కి2898 ఏడీ’ సత్తా చాటింది. యువ హీరోలు తేజ సజ్జా ‘హను–మాన్’, కిరణ్ అబ్బరం ‘క’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలూ ఆకట్టుకున్నాయి. ఇక 2024 రౌండప్లోకి వెళదాం...ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. తమిళ చిత్రాలు రజనీకాంత్ ‘వేట్టయాన్: ది హంటర్’, విజయ్ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్ ‘అమరన్’ కార్తీ–అరవింద్ స్వామిల ‘సత్యం–సుందరం’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, తమన్నా–సుందర్ .సి ‘బాకు’ (అరణ్మణై 4) చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది. ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’, మమ్ముట్టి ‘భ్రమయుగం’, నస్లెన్ ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’, టొవినో థామస్ ‘ఏఆర్ఎమ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కన్నడ చిత్రాలు ఉపేంద్ర ‘యూఐ’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’లకు అలరించాయి.తెలుగు సినిమా అసలు సిసలైన పండగ సంక్రాంతితో ఆరంభం అవుతుంది. ఈ పండగకి వచ్చే పెద్దా చిన్నా సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. అలా 2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో థియేటర్లు పండగ చేసుకున్నాయి. సినీ లవర్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హను–మాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ వరుసగా విడుదల అయ్యాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ ఫిల్మ్ ‘హను–మాన్’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోలతో పాటు యువ హీరో తేజ విజయం అందుకోవడం విశేషం. ఇక వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన ‘సైంధవ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి పండగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ ‘నా సామి రంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘సర్కారు నౌకరి’, హన్సిక ‘105 మినిట్స్’ నిరాశపరిచాయి. జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చినా ఆకట్టుకున్నవి తక్కువే. ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి. కులవివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కి కొద్దిపాటి ప్రేక్షకాదరణ దక్కింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. సీక్వెల్ కూడా మహి దర్శకత్వంలోనే రూపొందింది. ఈ నెలలో రవితేజ ‘ఈగిల్’ సినిమా ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఈ మాస్ ఫిల్మ్‌కి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇంకా సందీప్ కిషన్ హారర్ ఫిల్మ్ ‘ఊరి పేరు భైరవకోన’ ఫర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రానికి వీఐ దర్శకుడు. అలాగే ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే, అలరించినవి మాత్రం ఐదారు సినిమాలే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’కి ఆశించిన ఫలితం దక్కలేదు.శివ కందుకూరి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ‘గామి, అనన్య నాగళ్ల హారర్ మూవీ ‘తంత్ర’, హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘రజాకార్’ చిత్రాలు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ–అనుపమా పరమేశ్వరన్ల ‘డీజే టిల్లు స్క్వేర్’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందగా, ‘ఓం భీమ్ బుష్’కి హర్ష కొనుగొంటి దర్శకుడు. ఇదే నెల ఆరంభంలో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘వ్యూహం’ చర్చనీయాంశమైంది.ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రాలు ఇరవైలోపే. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఓ మోస్తరుగా అలరించింది. ఇదే నెలలో నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చిన అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నవ్వించింది. ఇక మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, మోహన్ భగత్ ‘ఆరంభం’ ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి.‘భజే వాయు వేగం’తో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయం కాగా, ‘ఆరంభం’తో అజయ్ నాగ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ‘అల్లరి’ నరేశ్ ‘ఆ... ఒక్కటి అడక్కు..!’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు. జూన్‌లో దాదాపు పాతిక సినిమాలు రాగా, అందరి దృష్టి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పైనే నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే నెలలో వచ్చిన సుధీర్‌బాబు ‘హరోంహర’, శర్వానంద్ ‘మనమే’ వంటివి అంచనాలను అందుకోలేకపోయాయి. అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మెప్పించింది. జూలైలో మీడియమ్ చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి. వీటిలో నవదీప్ ‘లవ్‌మౌళి’, ప్రియదర్శి–నభా నటేశ్ల ‘డార్లింగ్‘, రక్షిత్ శెట్టి ‘ఆపరేషన్ రావణ్‘, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏ చిత్రం కూడా హిట్ కాలేకపోయింది. ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్‌గా నిలవగా, అల్లు శిరీష్ ‘బడ్డీ’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు నిరాశపరిచాయి. అయితే చిన్న చిత్రాలుగా రిలీజైన దర్శకుడు అంజి మణిపుత్ర– హీరో నార్నే నితిన్ ‘ఆయ్’, యదు వంశీ దర్శకుడిగా పరిచయమై, నూతన నటీనటులు చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్‌గా నిలిచాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేశ్ లీడ్ రోల్లో నటించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రం మెప్పించింది. ఎన్టీఆర్ ‘దేవర’ మేనియాతో సెప్టెంబరులో పెద్దగా సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్టు 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్ పేర్కొంది. ఇదే నెలలో వచ్చిన నివేదా థామస్ ‘35: చిన్న కథ కాదు’, శ్రీ సింహా–హాస్యనటుడు సత్య–ఫరియా అబ్దుల్లా చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రాలు అలరించాయి.ఈ ఏడాదికి అక్టోబరు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ముందుగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమా రిలీజైంది. శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దసరాకి వచ్చిన సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, సుహాస్ ‘జనక అయితే గనక’ చిత్రాలకు ఓ మోస్తరు ప్రేక్షకాదరణ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ దసరా హిట్ సినిమాల్లో ముందు నిలిచింది. దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన రూరల్ డ్రామా ‘పొట్టేల్’ ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయగలిగింది. అక్టోబరులో దీపావళి సందర్భంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్‘, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే దర్శక ద్వయం సుజిత్–సందీప్ పరిచయం అయిన ‘క’ సూపర్ హిట్ అయింది. నవంబరులో భారీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిలో కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘మెకానిక్ రాఖీ’, సత్యదేవ్–ధనంజయల ‘జీబ్రా’, కొత్త దర్శకుడు విక్రమ్ రెడ్డి తీసిన ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాలు అలరించాయి. వరుణ్ తేజ్ ‘మట్కా’, నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నిరుత్సాహపరచాయి. ఇక డిసెంబరు తొలి వారంలోనే హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా యూనిట్ ప్రకటించింది. హిందీలో ‘పుష్ప 2’కు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఈ విధంగా ఇప్పటికే ‘పుష్ప 2’ పలు రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. నెలాఖరులో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’, ‘వెన్నెల’ కిశోర్–అనన్య నాగళ్ల నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’, ధర్మ ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాలు వచ్చాయి. విజయాల శాతం తక్కువ, అపజయాల శాతం ఎక్కువ అన్నట్లుగా 2024 సాగింది. స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలతో కలిపి దాదాపు 250 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్దా... చిన్నా... అనువాద చిత్రాలు సాధించిన విజయాలు పది శాతం లోపే. 2025లో సక్సెస్ రేట్ పెరగాలని కోరుకుందాం.మిస్సింగ్: ఈ ఏడాది వెండితెరను మిస్ అయిన సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, యువ హీరోల్లో నాగచైతన్య, రానా (సోలో హీరోగా..), అఖిల్, నితిన్, మంచు విష్ణు, నందమూరి కల్యాణ్‌రామ్, నాగశౌర్య, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, నవీన్ పొలిశెట్టి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు. -
బాలీవుడ్లో కనిపించని ఖాన్ త్రయం.. టాప్ లేపిన 'పుష్ప' రాజ్
ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో మీడియమ్ స్టార్స్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా సాగిందో తెలుసుకుందాం.హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్ సెంట్రిక్ హారర్ ఫిల్మ్ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ లీడ్ రోల్స్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.హిందీ ఆడియన్స్ ‘స్త్రీ 2’ హారర్ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్ హిందీ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఇతర రోల్స్ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.వికాస్ బాల్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్ రోల్లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్ మూవీ ‘ముంజ్య’.యువ తారలు అభయ్ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ హారర్ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్ ఆడియన్స్‌లో హారర్ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్ మూవీగా నిలిచింది. కథానాయికల జోరు హారర్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్ తర్వాత కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్’ సినిమాను, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.ఆదిత్యా సుహాస్ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్ నటించిన ఉమెన్ మల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్ ఏ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. హిట్ యాక్షన్ బాలీవుడ్లో బడా మల్టీస్టారర్ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్ ఎగైన్’. దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్ ఎగైన్’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ‘సింగమ్ ఎగైన్’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సింగమ్ ఎగైన్’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్ కపూర్ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్ కామెడీ డ్రామా ‘బ్యాడ్ న్యూజ్’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్ స్టేటస్ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులుటాప్ లేపిన పుష్ప రాజ్ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్’ సినిమా హిందీ వెర్షన్ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్ వెల్లడించారు.‘పుష్ప: ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌తో హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.కనిపించని ఖాన్ త్రయం‘సింగమ్ ఎగైన్, బేబీ జాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ (సింగమ్ ఎగైన్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్ అని చెప్పాలి. -
పుష్ప-2 వసూళ్ల సునామీ.. తొలి విదేశీ చిత్రంగా రికార్డ్!
బన్నీ- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.నేపాల్‌లో విడుదలైన 20 రోజుల్లోనే రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఘనతను సొంతం చేసుకుంది. నేపాల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.కాగా.. ఈనెల 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 రిలీజైంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజే రూ.294 కోట్లతో మొదలైన ప్రభంజనం కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్కును చేరుకుంది. తాజాగా విడుదలైన కలెక్షన్స్ చూస్తే 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇదో జోరు కొనసాగితే త్వరలోనే రూ.2000 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2TheRule is now the HIGHEST GROSSING FOREIGN FILM EVER IN NEPAL with a gross of 24.75 CRORES in 20 days 💥💥It is one of the biggest blockbusters at the Nepal Box Office and is among the TOP 3 GROSSERS OF ALL TIME ❤️🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/c6DD3mlPSm— Pushpa (@PushpaMovie) December 26, 2024 -
బాక్సాఫీస్ క్వీన్ గా మారిన రష్మిక
-
పుష్ప రాజ్ రూలింగ్ స్టార్..
-
బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలన్న హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ పెళ్లి తర్వాత తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది చిన్నాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్ యూ. ఈ మూవీలో నాసామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైంది. ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మిస్ యూ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ మీట్లో బాక్సాఫీస్ వద్ద పోటీపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ సినిమా విడుదల తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా? మీరేందుకు డేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. సిద్ధార్థ్ నటించిన మిస్ యు నవంబర్ 29న విడుదల కానుండగా.. అల్లు అర్జున్ పుష్ప -2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. మిస్ యూ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. -
సూర్య కంగువా.. తగ్గించినా లాభం లేదు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్లోనే ది బెస్ట్ వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో రిలీజైన ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది.మొదటి రోజు రూ. 24 కోట్లు రాబట్టిన కంగువా ఆ తర్వాత వీకెండ్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నవంబర్ 19న కేవలం రూ.3.15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో వారంలోనైనా పుంజుకుంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.12 నిమిషాల తగ్గింపుకంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్న ఈ మూవీ నిడివిని తగ్గించారు. దాదాపు 12 నిమిషాల సీన్స్ కట్ చేసినట్లు ప్రకటించారు. ట్రిమ్ చేసిన కంగువ వర్షన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడైనా ఫ్యాన్స్ నుంచి కంగువాకు ఆదరణ దక్కుతుందేమో వేచి చూడాల్సింది. కాగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్లో రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ లెక్కన చూస్తే బిగ్ డిజాస్టర్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. -
పుష్ప 2 మరో రికార్డ్.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో పుష్ప మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది.తాజాగా ఈ మూవీ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీమియర్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్నా మరోసారి అలరించనుంది. 𝐓𝐡𝐞 𝐅𝐀𝐒𝐓𝐄𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 𝐭𝐨 𝐡𝐢𝐭 $𝟏𝐌+ 𝐏𝐫𝐞-𝐒𝐚𝐥𝐞𝐬 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐔𝐒 𝐁𝐨𝐱 𝐎𝐟𝐟𝐢𝐜𝐞 💥💥PUSHPA RAJ’s dominance is redefining the BOX OFFICE with a NEW DIMENSION 💥🪓 #Pushpa2TheRule pic.twitter.com/lzGvlwTeqr— Pushpa (@PushpaMovie) November 19, 2024 -
బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల ఓపెనర్స్ (భారత హీరోలు) ఎంతమందో తెలుసా..?
-
బాక్సాఫిస్ వద్ద దేవర దూకుడు..
-
కార్తి ఇంత రిస్క్ అవసరమా... దేవర ముందు నిలుస్తాడా
-
రజినీకాంత్ దెబ్బకు వెనక్కి తగ్గిన సూర్య..
-
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
మాలీవుడ్ లా మారిపోతున్న టాలీవుడ్ పరిశ్రమ..
-
విజయ్ ది గోట్ మూవీ.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో గోట్ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇండియన్-2 సినిమాను అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది.అంచనాలకు తగ్గట్టుగానే తొలిరోజు కలెక్షన్ల గోట్ దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన గోట్ చిత్రానికి ఇండియాలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్టు కలెక్ట్ చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్సీస్ కలెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్నిరికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్‌ను గోట్ అధిగమించలేకపోయింది. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. -
పాన్ ఇండియాని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్
-
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న మూవీ.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందించారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.426 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఐదొందల మార్కును దాటేసింది.ఈ చిత్రం సక్సెస్ కావడం డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీ 2 కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డామని తెలిపారు. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని తెలిపారు. షూటింగ్ మొదటి రోజు నుంచే స్త్రీ 2 కథతో పూర్తిగా నిమగ్నమై తెరకెక్కించామని అన్నారు. కాగా.. అన్యాయానికి గురైన ఓ స్త్రీ.. దెయ్యంగా మారి ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదేవిధంగా వసూళ్లు కొనసాగితే త్వరలోనే ఈ మూవీ మరిన్ని పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న స్త్రీ-2.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 15న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రక్షాబంధన్ రోజు సోమవారం సైతం రూ.45 కోట్ల కలెక్షన్స్‌తో హవా కొనసాగించింది.ఇండియా విషయానికొస్తే ఐదో రోజు సైతం రూ. 38.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ఇండియావ్యాప్తంగా రూ. 242.4 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే ఈ వారాంతంలో పెద్ద సినిమాల రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలతో స్త్రీ-2 పోటీ పడుతోంది. ఆ రెండు సినిమాల కలెక్షన్లను బీట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అపర్ శక్తి, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే. -
గత పదిహేనేళ్లలో ఇలాంటి కలెక్షన్లు ఎవ్వరూ చూసుండరు..
-
కల్కి కలెక్షన్ల సునామి..
-
ప్రేమలు మూవీ పై మహేష్ ప్రశంసలు
-
సూపర్ హీరోస్ మెప్పిస్తున్న కథానాయకులు
-
సీఎం జగన్ త్వరలో సినిమా చూస్తారు - మహి
-
ఒకే కథతో రెండు సినిమాలు..!
-
బాక్సాఫీస్ పై దండయాత్రకు టాప్ స్టార్స్ రెడ్డి
-
అరుదైన సంఘటన.. బాక్సాఫీస్ బరిలో స్టార్ కపుల్..!
ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్, నటి కీర్తి పాండియన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట ప్రస్తుతం పా రంజిత్ నిర్మిస్తున్న 'బ్లూ స్టార్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే.. ఇదిలా ఉండగా కోలీవుడ్‌లో భార్య, భర్తలే బాక్సాఫీస్ పోటీకి రెడీ అయ్యారు. అశోక్, కీర్తి నటించిన రెండు చిత్రాలు డిసెంబరు 15న బాక్సాఫీస్ వద్ద ఢీకొంటున్నాయి. అశోక్ సెల్వన్ నటించిన 'సబానాయగన్', కీర్తి పాండ్యన్ ప్రధానపాత్రలో వస్తోన్న కన్నగి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. నిజ జీవితంలో భార్యాభర్తలై వీరిద్దరి సినిమాలు ఓకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం కోలీవుడ్‌లో అరుదైన సంఘటన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ కార్తికేయ దర్శకత్వం వహించిన చిత్రం 'సబా నాయగన్'. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్, మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మరోవైపు షాలిన్ జోయా దర్శకత్వం వహించిన 'కన్నగి'లో కీర్తి పాండియన్ గర్భిణీ స్త్రీ పాత్రలో నటించింది. యశ్వంత్ కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో వెట్రి, అధేశ్వర్, అమ్ము అభిరామి, విద్యా ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. Husband vs Wife at the box office on December 15.@AshokSelvan's jolly entertainer #SabaNayagan and @iKeerthiPandian's intense drama #Kannagi to release on the same date. A unique juncture for the newlyweds 😀 pic.twitter.com/GCxI6IbKqh — Siddarth Srinivas (@sidhuwrites) November 26, 2023 View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్‌లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
టైగర్ 3 కలెక్షన్స్ సునామి 2 రోజుల్లో 100 కోట్లు..!
-
ఆ హీరోయిన్ ఉందంటే బాక్సాఫీస్ బద్దలే.. ఆమెకు దరిదాపుల్లో కూడా లేరు!
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా రావాలంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అంతా ఈజీ కాదు. ఒక్క సూపర్ హిట్ పడినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాంటే అదృష్టం కూడా ఉండాలి. అలా బాలీవుడ్లో స్టార్స్ హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. అంతే కాకుండా బాలీవుడ్లో అగ్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ అందుకున్న వారు చాలా తక్కువమందే ఉంటారు. కానీ ఇలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న నటీమణుల్లో మొదట వినిపించే పేరు ఆమెదే. హిందీ చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోయిన్ కరీనా కపూర్. ఆమె సాధించిన ఘనతలపై ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: డైరెక్టర్ ముద్దుపై తొలిసారి రియాక్ట్ అయిన మన్నారా చోప్రా) ఆమె చిత్రాలే టాప్ బాలీవుడ్లో కరీనా కపూర్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ చరిత్రలో మరే ఇతర హీరోయిన్ల సినిమాలు ఆమెను అధిగమింలేకపోయాయి. అంతలా ఆమె చిత్రాలు సక్సెస్ సాధించాయి. కరీనా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.4 వేల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయంటే ఆ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. ఆమె నటించిన 23 సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ స్టార్స్ కరిష్మా, కత్రినా, రాణి ముఖర్జీ, కాజోల్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే సైతం దారిదాపుల్లో కూడా లేరు. అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్గా... కరీనా నటించిన 23 చిత్రాల్లో బజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. బజరంగీ భాయిజాన్ ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా రూ.918 కోట్లు వసూలు చేసింది. అలాగే కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, జబ్ వి మెట్, బాడీగార్డ్, గుడ్ న్యూజ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సూపర్ హిట్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.4000 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయి. దక్షిణాదిలో హీరోయిన్లతో పోలిస్తే సమంత, నయనతార, అనుష్క శెట్టి సినిమాలకు సైతం ఈ రేంజ్లో కలెక్షన్స్ రాలేదు. (ఇది చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) ఆ లిస్ట్‌లోని హీరోయిన్స్ వీళ్లే అయితే కరీనా తర్వాత రూ. 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోయిన్లలో దీపికా పదుకొణె, అనుష్క శర్మ ఉన్నారు. దక్షిణాదిలో అయితే అనుష్క శెట్టి, తమన్నా భాటియా బాహుబలి చిత్రంతో ఈ జాబితాలోకి వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత రూ.2000 కోట్లకు పైగా లిస్ట్‌లో ఐశ్వర్య రాయ్, అలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, నయనతార నిలిచారు. అంతే కాకుండా ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా కూ.2024 కోట్ల రూపాయలు వసూలు చేసిన దంగల్ చిత్రం ద్వారా ఈ జాబితాలోకి వచ్చారు. -
రెండో రోజు కూడా 'ఖుషి'.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'ఖుషి'. ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. రిలీజ్ రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.30.1 కోట్లు వసూళ్లు చేసింది. లైగర్ తర్వాత వచ్చిన మూవీకి హిట్ టాక్ రావడంతో విజయ్ సైతం ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? ) విజయ్, సమంతల రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అయితే మొదటి రోజు రూ.15.25 నెట్ వసూళ్లు సాధించగా.. రెండో రోజు రూ.9 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లోనే ఓవరాల్‌గా రూ.24.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కాగా... ఈ చిత్రంలో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. (ఇది చదవండి: 'సలార్' రిలీజ్ వాయిదా పడిందా? నిజమేంటి?) -
ప్రభాస్ దెబ్బకు చెల్లా చెదురైనా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు
-
ఆదిపురుష్ జోరు ....తొలిరోజే 100 కోట్లు
-
జపాన్ లో కేజీయఫ్ సిరీస్ రిలీజ్
-
1000 కోట్లు లోడింగ్..బాక్సాఫీస్‌కు కలెక్షన్ల సునామీ
-
జనవరి టు మార్చి టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్
-
ఆ రోజు బాక్సాఫీస్ రికార్డ్ బద్దలే ఫ్యాన్స్ కి పూనకాలే పూనకాలు
-
సమంతతో బాక్సాఫీస్ ఫైట్‌కు దిగిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఏప్రిల్14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ కనిపించనుంది. -
దసరా బరిలో స్టార్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్
-
విజయ్ , అజిత్ పదోసారి బాక్సాఫీస్ వార్.. ఎవరిది పైచేయి ..?
-
2023 లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్న సినిమాలివే..
-
Akshay Kumar: పక్కా ప్లాన్.. రూ.1000 కోట్లు టార్గెట్!
అక్షయ్ కుమార్.. బాలీవుడ్ మోస్ట్ బిజియెస్ట్ హీరోలో ఒక్కరు. ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు విడుదల చేస్తూ దూసుకెళ్తున్నాడు.అలాగని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి మార్కెట్ దెబ్బ తీసుకోడు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం, వెరైటీ గెటప్ కచ్చితంగా ఉంటుంది. అక్షయ్ సినిమా ప్లాప్ అయినా.. రూ. వంద కోట్ల వసూళ్లు ఎక్కడిపోవు. ఇక పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. రెండు, మూడు వందల కోట్లు కొల్లగొట్టినట్టే. అందుకే నిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అక్షయ్ కూడా షెడ్యూల్ ప్రకారం సినిమాలు కంప్లీట్ చేస్తుంటాడు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా అక్షయ్ షెడ్యూల్ తారుమారు అయింది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఎక్కువ రోజులు వెయిట్ చేయలేక లక్ష్మీ బాంబ్ లాంటి సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్యవంశీతో పాటు మరో మూడు సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ నాలుగు సినిమాలు వేర్వేరు దశల్లో ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ దశలోనే ఆగిపోగా.. మరికొన్ని సినిమాలు విడుదల వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ క్రమంలో నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూర్యవంశీ 2020 మార్చ్ లోనే రావాల్సింది. కానీ ఇప్పటికీ రాలేదు. ఇక గత రెండేళ్లు ఎలాగో పోయాయి.. నెక్ట్ ఇయర్ అయినా బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నాడట అక్షయ్. అగిపోయిన వాటితో కలిపి మొత్తం 5 సినిమాలను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు కనీసం 200 కోట్ల వసూళ్లు సాధించినా.. 1000 కోట్ల వసూళ్లు ఈజీగా సాధిస్తారని లెక్కలు వేస్తున్నారు సినీ పండితులు. మరి ఈ టార్గెట్‌ను అక్కీ రీచ్ అవుతాడో లేదో చూడాలి. చదవండి: సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం -
తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్’
ముంబై: అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్’ అంచనాలకు అనుగుణంగా కలెక్షన్లు రాబడుతోంది. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు రూ.17.56 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ కలెక్షన్లు డబుల్ ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వినోదం ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. సమకాలిన సమస్యకు హాస్యం జోడించి చెప్పడంలో దర్శకుడు రాజ్ మెహతా సఫలమయ్యారు. ఈ సినిమా గురించి రివ్యూలు కూడా సానుకూలంగా రావడంతో మున్ముందు వసూళ్లు బాగానే ఉండే అవకాశముంది. గతవారం విడుదలైన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలకావడం ‘గుడ్‌న్యూస్’కు కలిసిరావొచ్చు. కేసరి, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4 తర్వాత ఈ ఏడాది విడుదలైన అక్షయ్ కుమార్ నాలుగో సినిమా ఇది. ‘గుడ్‌న్యూస్’లో డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా క్లీన్ ఎంటర్టైన్గా తెరకెక్కించడంతో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. ఈ సినిమాలో దిల్జిత్ దొసాంజ్, కరీనా కపూర్, కియారా అద్వానీ, ఆదిల్ హుస్సేన్, గుల్షన్ గ్రోవర్ ముఖ్యపాత్రలు పోషించారు. (చదవండి: ఎట్టకేలకు వంద కోట్లు దాటింది) -
3 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత?
ముంబై: ఈ దీపావళికి బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’, తాప్సి ‘శాండ్ కీ ఆంఖ్’, రాజ్‌కుమార్ రావు ‘మేడిన్ చైనా’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్ 4’, అంచనాలకు తగినట్టుగానే ఆరంభ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా రూ.19.08 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ప్రముఖ మహిళా షూటర్లు ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా ‘శాండ్ కీ ఆంఖ్’ బాక్సాఫీస్ వద్ద కాస్త నిదానంగా వసూళ్లు రాబడుతోంది. తాప్సి పొన్ను, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 4.5 కోట్లు కలెక్షన్లు తెచ్చుకుంది. విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్ చైనా’ తొలి రోజు సుమారు రూ. 3 కోట్లు రాబట్టింది. సీనియర్ నటులు పరాశ్ రావల్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విభిన్న కథలతో తెరకెక్కిన ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు వేటిని ఆదరిస్తారో చూడాలి. -
బాక్సాఫీస్‌పై ‘వార్’ దండయాత్ర..
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.. ఊహించినట్టుగానే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్‌గా, బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రమోటైన ‘వార్’కు పాజిటివ్ రివ్యూలతోపాటు ఆడియెన్స్ టాక్ కూడా బలంగా ఉండటంతో తొలిరోజు రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన వార్ సినిమా తొలి రోజు రూ. 53.35 కోట్లు రాబట్టింది. హిందీలో ఈ సినిమా 51.60 కోట్లు రాబట్టగా.. తమిళం, తెలుగు భాషల్లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. తొలిరోజే ఏకంగా 53 కోట్లు వసూలు చేసిన ‘వార్’ పలు రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్ నిలిచింది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీస్టారర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. ఆ రికార్డును వార్ చెరిపేసింది. ఈ రెండు సినిమాలు యష్‌రాజ్ ఫిల్మిమ్స్ తీసినవే కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజు వసూళ్లు సాధించిన సినిమాగా వార్ మొదటిస్థానంలో ఉండగా.. భారత్ (42.30 కోట్లు), మిషన్ మంగళ్ ( 29.16 కోట్లు), సాహో (24.40కోట్లు), కళంక్ (21.60కోట్లు) వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రభావం వార్‌పై ఉంటుందని భావించారు. కానీ, అంతగా ఆ ప్రభావం లేదని వసూళ్లు చాటుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ సినిమాలో హృతిక్ కబీర్‌గా, టైగర్ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులుగా ఎందుకు మారారు అన్నదే వార్ కథ. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. -
కంటెంట్ కింగ్.. ఆడియన్స్ కింగ్మేకర్స్!
ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా, ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. అందులోఉన్న చిన్న లాజిక్, జనాలు మెచ్చే కంటెంట్ లేకపోతే అది డిజాస్టర్‌గా మిగిలిపోవాల్సిందే. సినిమాను నిలబెట్టేది స్టార్లు కాదు.. స్టోరీ. కథ, కథనాలు లేని సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ లాంటి భారీ తారాగణంతో ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని ఆశపడిన బాలీవుడ్ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలింది. రికార్డుల మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల మార్కును మాత్రమే దాటింది. అయితే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. కలెక్షన్లకు గండికొట్టింది. ఎంత ఆమిర్, అమితాబ్‌లు ఉన్నా.. సినిమాలో అసలు విషయం లేకపోయే సరికి వసూళ్లపై ప్రభావం గట్టిగా చూపింది. అయితే ఇదే సమయంలో కుటుంబ కథానేపథ్యంలో లేటు వయసులో ప్రేమ, బిడ్డను కనడం, కుటుంబ ఘర్షణలు, ప్రేమానురాగాలతో కూడిన ‘బధాయీ హో’ విమర్శకుల ప్రశంసలనే కాదు, ప్రేక్షకుల మన్నలను కూడా దక్కించుకుంది. అయితే దివాళి కానుకగా అన్ని థియేటర్లలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ను ప్రదర్శించారు. దాని ఫలితం తేలిపోయేసరికి వీకెండ్లో ఎలాగోలా గట్టెక్కించారు. అయితే ఈ వీకెండ్లో ‘బదాయిహో’కు షోలు తగ్గించేశారు. కానీ ఈ సోమవారం నుంచి మళ్లీ బధాయీ హోకు షోలు పెరిగాయి. ఎప్పటికైనా కథే కింగ్, అని ఆడియెన్సే కింగ్ మేకర్స్ అంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. Boxoffice can be most unpredictable, but that’s the beauty of this business... #BadhaaiHo was down to 2/3 shows at several plexes during #Diwali weekend, but, today [Mon] onwards, the film is back in 4/5/6 shows... Content is King and the audiences are King Makers! — taran adarsh (@taran_adarsh) November 12, 2018 చదవండి : ‘బధాయీ హో’పై సమీక్ష -
జూలైలో బాక్సాఫీస్ వెలవెల
సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు వేడెక్కాయి. రంగస్థలం, భరత్ నేను, మహానటి లాంటి సినిమాలతో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆ తరువాత సమ్మోహనం సినిమా ఆ ఊపును కంటిన్యూ చేసింది. సమ్మర్లో థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. ప్రథమార్దం టాలీవుడ్‌కు మరిచిపోలేని హిట్లు వచ్చాయి. ప్రథమార్దంలో క్రియేట్ అయిన బాక్సాఫీస్ రికార్డులు ఇప్పట్లో చెరిగిపోయేలా లేవు. ద్వితీయార్దాన్ని ఎంతో ఆశగా మొదలుపెట్టినా.. జూలై మాసం మాత్రం టాలీవుడ్‌కు అంతగా కలిసిరాలేదు. మొదటి వారం రిలీజైన పంతం, తేజ్ ఐ లవ్ యూ చతికిలబడ్డాయి. ఇక రెండోవారం విజేత, ఆర్ఎక్స్ 100, చినబాబు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కాస్త డిఫరెంట్‌గా, బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఆర్ఎక్స్ 100ను మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా భారీ ఓపెనింగ్స్‌తో మొదలై.. మంచి కలెక్షన్లను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన మురళీ శర్మకు ప్రశంసలు దక్కాయి కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. కార్తీ హీరోగా వచ్చిన ‘చినబాబు’ సినిమా ఎప్పటిలాగే తమిళ నేటివిటీ ఎక్కువయ్యే సరికి తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. మూడోవారంలో వచ్చిన ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్, లవర్, పరిచయం సినిమాల్లో ... మంచు లక్ష్మి ప్రధాన ప్రాతలో వచ్చిన ‘వైఫ్ ఆఫ్ రామ్’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఆ నలుగురు ఫేమ్ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ‘ఆటగదరా శివ’కు మంచి టాక్ దక్కినా... కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఇక ఎప్పటిలాగానే రాజ్‌తరుణ్ ‘లవర్’ సినిమాతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ప్రమోషన్స్‌లో చెప్పినంత విషయం సినిమాలో లేకపోయే సరికి ‘పరిచయం’ ఆకట్టుకోలేకపోయింది. జూలై చివరి వారంలో సాక్ష్యం, హ్యాపి వెడ్డింగ్, పెదవి దాటని మాటొకటుంది, మోహిని సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సాక్ష్యం, హ్యాపి వెడ్డింగ్‌కు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేశారు. పంచ భూతాల కాన్సెప్ట్‌తో వచ్చిన ‘సాక్ష్యం’.. రొటీన్ కథా, కథనాలతో వచ్చినా.. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సాక్ష్యం నిలబడింది. మెగా డాటర్ నిహారిక ‘హ్యాపి వెడ్డింగ్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. ఇక త్రిష లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మోహిని’, పెదవి దాటని మాటకటుంది ప్రేక్షకులను థియేటర్స్ వైపు రప్పించలేకపోయాయి. ఇక ఆగస్ట్‌లో రిలీజయ్యే గూఢాచారి, శైలజా రెడ్డి అల్లుడు, గీతా గోవిందం, శ్రీనివాస కళ్యాణం, ఆటగాళ్లు, నర్తనశాల లాంటి సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దాహం తీరుతుందో లేదో చూడాలి. - బండ కళ్యాణ్ -
టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: హిట్టా.. ఫట్టా?
ఒక బ్లాక్ బస్టర్ హిట్. మరొక బంపర్ హిట్. చరిత్రలో నిలిచిపోయే ఒక క్లాసిక్ హిట్. మరికొన్ని సూపర్హిట్లు, ఇంకొన్ని యావరేజ్ మూవీలు, కొన్ని డిజాస్టర్లు.. ఈ ఏడాది ప్రథమార్థం టాలీవుడ్ ప్రస్థానం ఇలా సాగింది. లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా.. అన్నట్లు ఈ ఏడాది సమర్లో, ప్రథమార్ధం చివర్లో వచ్చిన సినిమాలు ఇచ్చిన కిక్‌ను ఎప్పటికీ మరిచిపోలేరు సినీ అభిమానులు. ఈ ప్రథమార్దంలో టాలీవుడ్ పరిస్థితి ఏంటో ఓ సారి లుక్కేద్దాం. మరిచిపోలేని దెబ్బ... ఈ ఏడాది ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమా కేవలం అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కు మరిచిపోలేని దెబ్బ. ఈ సినిమా పేరేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే రికార్డులకు చిరునామాగా ఉంటుందని ఆశిస్తారు అభిమానులు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసి అతి పెద్ద డిజాస్టర్‌గా రికార్డుకెక్కింది. అజ్ఞాతవాసి చిత్రంతో తివిక్రమ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. పవన్ కూడా సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు వచ్చేశారు. ఈ దెబ్బను కొంతవరకు మరిపించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. ‘జై సింహా’తో వచ్చి పర్వాలేదనిపించారు. మూస ధోరణి కథతో వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అజ్ఞాతవాసి దారుణంగా బెడిసికొట్టడం.. పండుగ సీజన్ కావడం.. ఈ సినిమాకు కలిసొచ్చింది. అయితే టాలీవుడ్‌కు సంక్రాంతి సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ సంక్రాంతి మాత్రం ప్రేక్షకుల దాహాన్ని తీర్చలేకపోయింది. సరైన బ్లాక్‌బస్టర్ లేక సినీ అభిమానులు నిరాశ చెందారు. రంగుల రాట్నం, ఇగో చిత్రాలు వచ్చినట్టు కూడా తెలియలేదు. విజయానికి బాట వేసిన అనుష్క... రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ‘భాగమతి’ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు నడిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి విజయాలు సాధిస్తున్న అనుష్క ఖాతాలో సూపర్‌హిట్‌గా నిలిచింది భాగమతి. హారర్, మెసెజ్ ఓరియెంటెడ్, అనుష్క అభినయం.. ఇలా సినిమాన హిట్ బాట పట్టించాయి. పిల్ల జమీందార్ సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ అశోక్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. రికార్డుస్థాయి కలెక్షన్లు కాకపోయినా... హౌస్‌ఫుల్‌తో థియేటర్లు కలకలలాడాయి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్... చిన్న సినిమానే అయినా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపి ‘ఛలో’ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరవడమే ఈ సినిమా మొదటి సక్సెస్. నాగశౌర్య తన సొంత బ్యానర్‌పై చేసిన మొదటి ప్రయత్నమే భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. కామెడీకి పెద్ద పీట వేస్తూ.. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ ఏడాదిలో బెస్ట్ సాంగ్స్ లిస్ట్‌ను తీయాల్సి వస్తే.. అందులో కచ్చితంగా ఈ సినిమాలోని చూసి చూడంగానే.. అనే పాట ఉండాల్సిందే. ఎందుకంటే అంతలా ఈ పాట యూత్‌కు దగ్గరైంది. మొదటి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా వెంకీ కుడుముల తన ప్రతిభను చాటుకున్నారు. ఇక ఇదే నెలలో వచ్చిన రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఆయన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రాహుల్ రవీంద్రన్ హీరోగా వచ్చిన ‘హౌరాబ్రిడ్జ్’ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది. మోహన్‌బాబు మళ్లీ తమ కుటుంబ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాయత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది దారుణంగా దెబ్బకొట్టింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్, మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ కాంబోలో వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమా ఇద్దరి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా టాలీవుడ్‌కు ఫిబ్రవరిలో దెబ్బ మీద దెబ్బ పడుతుంటే.. మళ్లీ మెగా హీరో రూపంలోనే టాలీవుడ్ పైకి లేచింది. వరుణ్‌తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమా హిట్‌గా నిలిచింది. వెంకీ అట్లూరి సినిమాను మలిచిన విధానం అందరికీ నచ్చింది. ఈ సినిమా క్లాస్ హిట్‌గా వరుణ్ కెరీర్లో స్థిరపడిపోయింది. ఇక తరువాతి వరుసలో ఉన్న సినిమా.. నాని నిర్మాతగా వ్యవహరించి తీసిన ‘అ!’. ఈ సినిమా అందరికీ ఎక్కకపోవడంతో యావరేజ్ టాక్‌తో ఓ మోస్తరుగా నడిచింది. ఈ సినిమా ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చింది. చాలా కాలం తరువాత మళ్లీ తరుణ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’.. కానీ తన లవ్ స్టోరీ ఎవ్వరికీ నచ్చలేదు. తరుణ్ చేసిన ఈ ప్రయత్నం వృథాగా పోయింది. ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తుర్ జంటగా నటించిన ‘మనుసుకు నచ్చింది’ సినిమా ప్రేక్షకులకు నచ్చకుండాపోయింది. ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రచయిత’ సినిమా బాగానే ఉన్నా.. ఇలాంటి చిన్న సినిమాలకు ఆదరణ అంతగా ఉండదు. సోడా గోలిసోడా, చల్తే చల్తే, హైద్రాబాద్ లవ్‌స్టోరీ, జువ్వా, రా..రా.., ఏ మంత్రం వేశావే, ఐతే 2.0, దండుపాళ్యం 3, అనగానగా ఒక ఊళ్లో.. ఇలా హీరోలు ఎవరో కూడా తెలియని సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. దీంట్లోనే ఒక ఆశాకిరణంలా.. నిఖిల్ ‘కిరాక్‌పార్టీ’ సినిమా వచ్చినా పార్టీ చేసుకుని ఆనందించేంతగా సినిమా మెప్పించలేకపోయింది. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ‘ఎమ్మెల్యే’ సినిమా కాస్త పర్వాలేదనిపించినా.. రొటిన్ ఫార్మూలాతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా చేరుకోలేకపోయింది. కన్నడ రీమేక్‌గా రానా వాయిస్ ఓవర్‌తో సినిమాకు హైప్ తీసుకొచ్చినా.. ‘రాజారథం’ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘నీదీ నాదీ ఒకే కథ’ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎంతైనా చిన్న సినిమా కాబట్టి దాని పరిధిలో విజయం సాధించింది. హీరోగా శ్రీవిష్ణు తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ సినిమా వచ్చిన సమయం మాత్రం కరెక్ట్ కాదేమో. అదే ఈ సినిమా ఇంకొంచెం ముందుగా వస్తే కలెక్షన్లు కూడా బాగానే వచ్చేవి. ఎందుకుంటే మార్చి చివరి నుంచి బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ మొదలైంది. మార్చి చివర నుంచి టాలీవుడ్ అలుపెరుగకుండా రికార్డులను మార్చుకుంటూ ఉంది. మార్చి చివరి తేదీన వచ్చి ఏప్రిల్ మొత్తం కలెక్షన్ల తుఫాను తెచ్చింది రంగస్థలం. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పింది. థియేటర్స్‌కు రిపిటెడ్ ఆడియెన్స్‌ను రప్పించడం కష్టమవుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఇదంతా సుకుమార్ మాయ. రామ్‌చరణ్, సమంతల అద్భుతమైన నటన, దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం, 1980నాటి గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన రత్నవేలు.. ప్రతీ పాత్రకు జీవం పోసిన ఆయా నటీనటులు వెరసి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. ఈ ప్రవాహంలో వచ్చి కొట్టుకుపోయిన సినిమా ‘ఛల్ మోహనరంగా’. నితిన్ హీరోగా.. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ఎంటర్టైనింగ్గా పర్వాలేదనిపించినా.. రిలీజ్ చేసిన టైమ్ కరెక్ట్ కాకపోయే సరికి.. ప్రేక్షకులకు ఎక్కలేదు. ఎందుకంటే అప్పటికే రంగస్థలం ఫీవర్‌తో టాలీవుడ్ ఊగిపోతూ ఉంది. రంగస్థలంతో చెర్రీ కొత్తగా ట్రై చేశాడని అందరూ చెప్పుకుంటూ ఉన్న ఆ తరుణంలో.. న్యాచురల్స్టార్గా.. చేసే ప్రతీ సినిమాలో కొత్త దనం ఉండేలా చూసుకుంటాడని పేరున్న నాని ‘కృష్ణార్జున యుద్దం’ లాంటి మూస ధోరణి సినిమాను చేసి దెబ్బతిన్నాడు. మొదటిసారిగా నానిపై విమర్శలు మొదలయ్యాయి. ఈ విధంగా రంగస్థలం ఎఫెక్ట్ నానిపై కూడా పడింది. ఇలా రంగస్థలం హవా కొనసాగుతూ ఉంటే.. దానికి అడ్డుకట్ట వేసే పనిని మహేష్ బాబు తీసుకునే ప్రయత్నం చేశాడు. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా వచ్చి మళ్లీ టాలీవుడ్ రికార్డులకు పని చెప్పింది. కేవలం తెలుగులోనే కాక ఓవర్సిస్లో కూడా రికార్డులు పరిగెత్తేలా చేశాయి రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు. ఇవి రెండూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. దానికి తగ్గట్లే నిర్మాతలు కలెక్షన్లను ప్రకటించేవారు. ఇక సోషల్ మీడియాలో అభిమానుల హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ.. ఇరు వర్గాల అభిమానులు దాడికి దిగడం జరిగింది. అయితే లాంగ్ రన్లో రంగస్థలం నెలకొల్పిన రికార్డులకు అతి చేరువలో భరత్ అనే నేను నిలవడం గమనార్హం. విచిత్రమేమిటంటే.. అమెజాన్ ప్రైమ్‌లో రంగస్థలం సినిమాను విడుదల చేసినా.. ఇంకా కొన్ని థియేటర్లరో విజయవంతంగా నడుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ పనిపడుతుండగా.. ఆచారి అమెరికా యాత్ర, కణం, ఎందరో మహానుభావులు లాంటి సినిమాలు నిలవలేకపోయాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వచ్చిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. పెద్దగా ప్రభవాన్ని చూపలేకపోయింది. వరుస విజయాలతో ఊపుమీదున్న అల్లు అర్జున్ కెరీర్లో యావరేజ్‌గా మిగిలిపోయింది. టాలీవుడ్లో క్లాసిక్ హిట్.. రంగస్థలం, భరత్ అనే నేను రెండు సినిమాల వైపే జనం వెళ్తుండగా.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సావిత్రి జీవిత గాథ ‘మహానటి’ సినిమాతో అందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ ఏడాదిలోనే కాక.. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మహానటి అందరి మనుసుల్లో నిలిచిపోయింది. కీర్తి సురేశ్ మహానటి సావిత్రిగా అభినయించిన తీరుకు ప్రేక్షక లోకమే కాకుండా సెలబ్రెటీ ప్రపంచం కూడా స్తంభించిపోయి.. ప్రశంసల జల్లును కురిపించింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరపై ఆవిష్కరించిన తీరుకు సినీలోకం ఆశ్చర్యపోయింది. ఇక బయోపిక్ చిత్రాలను తెరకెక్కించాలంటే మహానటి సినిమా ఓ నిఘంటువుగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని వివాదాలు చుట్టిముట్టినా...అవేవీ సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. నేటికీ ఈ సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతోంది. మూడు సినిమాల ప్రభంజనంలో... రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లలో పాగా వేసి కూర్చున్నాయి. అయితే వీటి తరువాత వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాయి. వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోయాయి. చాలా గ్యాప్ తరువాత పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా మెహబూబా. ఇది మళ్లీ తనకు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని పూరీ అభిప్రాయపడ్డారు కానీ.. ఈ సినిమా కూడా పూరికి ఏమాత్రం కలిసిరాలేదు. ఆర్ నారాయణ మూర్తి నటించిన అన్నదాత సుఖీభవ, రవితేజ నేల టిక్కెట్టు ఏ మాత్రం ప్రేక్షకులను థియేటర్ల వైపు వచ్చేలా చేయలేకపోయాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో సినిమా అంటే అప్పుడెప్పుడో వచ్చి ట్రెండ్‌సెట్ చేసిన శివ సినిమా రేంజ్లో ఊహించుకుంటారు అభిమానులు. కానీ ఈ ఏడాది వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా చూస్తే.. మళ్లీ వర్మ సినిమా అంటే ప్రేక్షకులు భయపడేలా చేశాడు. నాగార్జున కెరీర్‌నే దెబ్బకొట్టేంతగా బెడిసికొట్టింది ఈ సినిమా. కనీసం వారం తిరక్కముందే థియేటర్స్ నుంచి తీసేసే పరిస్థితి వచ్చింది. నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ ఓకే అనిపించగా, రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ మళ్లీ బోర్ కొట్టించాడు. కళ్యాణ్ రామ్ కాస్త విభిన్నంగా ట్రై చేసిన ‘నా నువ్వే’ ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయింది. సమ్మోహితుల్ని చేస్తోన్న సినిమా... ఇంద్రగంటి మోహన్‌కృష్ణ సినిమాలకు ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్మెన్, అమీ తుమీ ఇలా ప్రతి సినిమాను ఓ ప్రత్యేకమైన శైలిలో తెరకెక్కించారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’.. నిజంగానే సినిమా చూసిన ప్రతిఒక్కరినీ సమ్మోహితుల్ని చేస్తోంది. సినిమాను తెరకెక్కించిన విధానం, హీరో హీరోయిన్ల నటన, సీనియర్ నటుడు నరేష్ పండించిన హాస్యం ఈ సినిమా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా మాత్రమే ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. కమెడియన్ కమ్ హీరో అయిన శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన చిత్రం జంబలకిడిపంబ.. అప్పటి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా జూన్ చివరి వారంలో దాదాపు పదకొండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో చెప్పుకోదగ్గవి ఓ రెండు మూడు సినిమాలే. పెళ్లి చూపులు సినిమా తరువాత తరుణ్ భాస్కర్ నుంచి మళ్లీ ఇంకో సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంది. అయితే పెళ్లి చూపులు నాటి మ్యాజిక్ రిపీట్ కాలేదంటూ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఇంకో రెండు వారాలు గడిస్తే కానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటో చెప్పలేం. షకలక శంకర్ కమెడియన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో హీరోగా మారి చేసిన చిత్రం ‘శంభో శంకర’. కానీ ఈ సినిమా శంకర్‌ను హీరోగా నిలబెట్టడంలో ఏమాత్రం సహాయపడలేదు. ఈ ప్రథమార్దంలో వచ్చిన డబ్బింగ్ చిత్రాల్లో అంతగా జోరు చూపించినవి రెండు సినిమాలే. అందులో ఒకటి సూపర్‌స్టార్ సినిమా ‘కాలా’, విశాల్ ‘అభిమన్యుడు’. కాలా సినిమా అంచనాలు అందుకోలేక చతికిలపడిపోయింది. కబాలి రేంజ్ కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఇక విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు విశాల్ సినీ కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించి, రికార్డు కలెక్షన్లు సాధించింది. డబ్బింగ్ సినిమా అయినా.. ఒరిజినల్ తెలుగు సినిమా రేంజ్లో కలెక్షన్లను సాధించింది. ఇలా ఈ ప్రథమార్దం.. టాలీవుడ్ ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. ఎంత పాతాళానికి తోసేసే సినిమాలు వచ్చినా.. ఆకాశంలో తారగా ఎప్పటికీ నిలిచిపోయే.. ఎప్పటికీ తలెత్తుకునేలా చేసే సినిమాలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈసారి కొందరు హీరోలకు, హీరోయిన్లకు బాగానే కలిసివచ్చింది. మరికొందరికి నిరాశే మిగిలింది. ప్రథమార్దానికి వీడ్కోలు చెబుతూ.. ద్వితీయార్దానికి స్వాగతం చెబుతాం. కాకపోతే... ఈ ద్వితీయార్దంలో ఎలాంటి ఆసక్తి ఉండకపోవచ్చు. పెద్ద హీరోలు సినిమాలేవీ రిలీజ్ కాకపోవచ్చు. దసరాకు కేవలం ఎన్టీఆర్ అరవిందసమేతగా రానున్నాడు. ఇది మినహా ఇంతవరకు ఏ పెద్ద సినిమా కూడా దసరాకు రాబోతున్నట్లు ప్రకటించలేదు. టాలీవుడ్‌కు సెకండాఫ్ కూడా కలిసిరావాలని ఆశిద్దాం. - బండ కళ్యాణ్ టాలీవుడ్లో ఈ ఏడాది ప్రథమార్థం వచ్చిన సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమిటి? మీ అభిప్రాయం పంచుకోండి -
పాక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రేస్ 3. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తొలి షో నుంచే డివైడ్ టాక్ రావటంలో కలెక్షన్ల పరంగా కూడా రేస్ 3 వెనకపడింది. సల్మాన్ స్టామినా కారణంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా.. భారీ రికార్డ్‌లు నమోదయ్యే అవకాశం మాత్రం కనిపించటంలేదు. ఇండియన్ ఆడియన్స్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాను పాకిస్తాన్ ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇండియాలో రిలీజ్ అయిన 8 రోజుల తరువాత పాకిస్తాన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడి లోకల్ సినిమాల కంటే ఎక్కువగా రేస్ 3కే కలెక్షన్లు వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాక్ కూడా బాగుండటంతో ముందు ముందు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు కీలక పాత్రల్లో నటించారు. -
చైనాలో సత్తా చాటుతున్న ఇండియన్ మూవీ
ఇండియన్ మార్కెట్లో చైనా వస్తువులు డామినేట్ చేస్తుంటే... చైనాలో ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. చైనాలో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, భజరంగీ భాయిజాన్ సినిమాలు రికార్డు కలెక్షన్లు సాధించాయి. తాజాగా... ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ విజయవంతంగా దూసుకెళ్తోంది. హిందీ మీడియం సినిమా చైనాలో రూ. 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టబోతోంది. ఇప్పటికే రూ. 184 కోట్లను రాబట్టిందని అతి త్వరలోనే రెండు వందల కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇండియన్ సినిమాలు చైనా మార్కెట్‌ను బాగానే ఆకర్షిస్తున్నాయి. అమెరికా తరువాత చైనాలో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. బీ టౌన్ ప్రస్తుతం చైనా మార్కెట్ వైపు చూస్తోంది. వాస్తవికత, సహజతత్వానికి దగ్గరకు ఉన్న కథలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. #HindiMedium biz more than doubles on second Sat in CHINA... Is nearing ₹ 200 cr mark... [Week 2] Fri $ 0.62 mn Sat $ 1.41 mn Total: $ 28.20 million [₹ 184.06 cr] — taran adarsh (@taran_adarsh) 15 April 2018 -
బాగీ 2 వసూళ్ల సునామీ
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ 2018లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగీ 2..శనివారం రెండవ రోజు రూ 20.40 కోట్లను రాబట్టి నిలకడగా దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో భారత్‌లో మొత్తం రూ 45.50 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ 2 వసూళ్లు పద్మావత్, పాడ్‌మన్, రైడ్, సోను కి టిటు కి స్వీటీ చిత్రాల ఓపెనింగ్స్‌ను అధిగమించాయి. పద్మావత్ తొలిరోజు రూ 19 కోట్లు రాబట్టగా రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగి 2 భారీ మార్జిన్‌తో భన్సాలీ మూవీని క్రాస్ చేసింది. మూవీలో టైగర్ ష్రాఫ్ నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ట్వీట్ చేశారు. -
‘రాణిం’చని హిచ్కి
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ ‘బ్లాక్’ బ్యూటీ రాణీముఖర్జీ కాస్త విరామం తర్వాత నటించిన చిత్రం ‘హిచ్కి’. క్రిటిక్స్‌ను సైతం మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను మాత్రం మెప్పించలేకపోయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.20.10 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా హిచ్కి.. 961 థియేటర్లలో విడుదలైంది. శనివారం రూ. 5.35 కోట్ల వసూళ్లు సాధించగా ఆదివారం రూ. 6.70 కోట్ కలెక్షన్లు రాబట్టింది. వారాంతాల్లో తప్ప మిగతా రోజుల్లో సినిమా వసూళ్లు సుమారుగా రూ. 3.30 కోట్లు మాత్రమే. బ్రాడ్ కోహెన్ పుస్తకం ‘ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్’ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ పి.మల్హోత్ర తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాణీ నైనా మథుర్ అనే పాత్రలో నటించింది. నరాలకు సంబంధించిన వ్యాధి టౌరోట్ సిండ్రోమ్‌తో బాధపడే మహిత పాత్రలో ఆమె కనిపించింది. మాట్లాడేటప్పుడు మధ్యలో అవరోధాలు ఏర్పడటం.. విచిత్రమైన శబ్ధాలు చేయటం ఈ వ్యాధి లక్షణం. సమాజంలో ఉన్న అసమానతలు మన నిత్య జీవితంలో ఎలా భాగమయ్యాయనే అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించారు. బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమీర్‌ఖాన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు హిచ్కిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు కూడా. ‘మర్దాని’ (2014) చిత్రం తర్వాత రాణీ ‘హిచ్కి’తో రీఎంట్రీ ఇచ్చారు. -
నేటితో 'బ్లాక్' బ్యూటీకి 40
బాలీవుడ్ 'బ్లాక్' బ్యూటీ రాణీ ముఖర్జీ జన్మదినం నేడు. నేటితో ఈ భామకు 40ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఒక లేఖను విడుదల చేశారు రాణీ. '40ఏళ్లు.. అని తలుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. ఈ 40ఏళ్లలో, 22ఏళ్లు బాలీవుడ్లోనే గడిచిపోయాయి. ఇక్కడ ప్రతిరోజు నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లు నాతో పనిచేసిన చిత్ర నిర్మాతలకు, నన్ను నమ్మి సమాజ నియమాలను సవాలు చేసే పాత్రలను నాకు ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానలకు ధన్యవాదాలు. నటీనటులకు సమాజం, మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపే కథలు చాలా అరుదుగా దొరుకుతాయి. అదృష్టవశాత్తు అలాంటి అవకాశాలు నాకు ఎన్నో వచ్చాయి. ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదం వల్లే. నేను పుట్టిందే నటించడం కోసం అనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అయినా నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోగలిగాననే భావిస్తున్నాను. ఒక విషయమైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించడం చాలా కష్టమైన అంశం. ఆడవారికైతే మరీ కష్టం. ఎందుకంటే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది.ఇక పెళ్లయిన హీరోయిన్ల సంగతి చెప్పనవసరం లేదు. తల్లిగా మారాక స్త్రీలు తమ ఆశలను, కలలను, కోరికలను చంపుకోవాల్సిందే. ఇక్కడ స్త్రీ ప్రధానంగా వచ్చే చిత్రాలు విజయవంతమవ్వడం చాలా కష్టం. ఈ వివక్షలను దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మేము ప్రతీరోజూ పోరాడుతూనే ఉంటాము. పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మా రూపాన్ని, గాత్రాన్ని, నటనను, నాట్యాన్ని, ఎత్తును బట్టి మమ్మల్ని ప్రతిరోజు నిర్ణయిస్తారు. వీటన్నిటిని దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకుంటాము. నేను నా స్నేహితుల నుంచి అనేక విషయాలను నేర్చుకుంటాను' అంటూ ముగించారు. లాంగ్ గ్యాప్ తరువాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హిచ్కీ’ ఈ శుక్రవారం రిలీజ్ అవుతుండగా.. షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జీరో సినిమాలోనూ రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. -
వసూళ్లు ‘అ!’దుర్స్
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మించిన ‘అ!’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లోనే రూ. 9 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఓవర్సీస్లోనూ అంచనాలకు మించి వసూళ్లు వస్తున్నాయి. అమెరికాలో ఐదు రోజుల్లో రూ.4.13 కోట్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి ముఖ్యపాత్రలు పోషించారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. -
‘తొలిప్రేమ’కు భారీ కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘తొలిప్రేమ’ భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొమ్మిది రోజుల్లో రూ. 38 కోట్ల గ్రాస్, రూ. 20.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికాలో ఇప్పటివరకు రూ. 6.09 కోట్లు రాబట్టింది. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి.. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
తొలిప్రేమ షాకింగ్ కలెక్షన్లు
సాక్షి, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ప్రేమకథా చిత్రం కావడంతో అన్నీ వర్గాల ప్రేక్షకుల మనసులను దోచింది. ముఖ్యంగా ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరికి యువతలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25.8 కోట్ల గ్రాస్, రూ.14.6 కోట్ల షేర్ ను రాట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 10.77 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మంచారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. -
‘భాగమతి’కి భారీ వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: అనుష్క తాజాచిత్రం ‘భాగమతి’ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటిరోజు మొత్తం రూ. 12 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. దక్షిణాదిలో మహిళ ప్రాధాన్యమున్న చిత్రాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పాజిటివ్ టాక్, రివ్యూలు రావడంతో మార్నింగ్ షోల తర్వాత ప్రేక్షకాదరణ మరింత పెరిగింది. దీంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. తమ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ‘భాగమతి’ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. అనుష్కకు జోడిగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించాడు. తమన్ సంగీతం అందించాడు. -
బంపర్ హిట్: బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 450 కోట్లు!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’కు అనూహ్య విజయాన్ని అందించిన చైనా ఆడియన్స్ తాజాగా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. వారం రోజుల్లోనే రూ. 264.61 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ‘దంగల్’ సినిమాను మించి ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. తొలిరోజే ఈ సినిమా భారీస్థాయిలో 6.79 మిలియన్ డాలర్లు (రూ. 43.35 కోట్లు) రాబట్టింది. భారత్‌లో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రానికి చైనాలో భారీ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘దంగల్’ తో చైనాలో ఆమిర్‌ఖాన్ ఇమేజ్ శిఖరస్థాయికి చేరింది. ఆయనకు ఉన్న పాపులారిటీ కారణంగానే ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. మున్ముందు వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 450 కోట్లు రాబట్టినట్టుగా అంచనా. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బంఫర్ వసూళ్లు సాధిస్తుండటంతో బయ్యర్ల పంట పండింది. జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. #SecretSuperstar continues to work wonders in China... Week 1 should close at $ 45 million+, which is SPLENDID... Fri $ 6.90 mn Sat $ 10.55 mn Sun $ 9.90 mn Mon $ 5.02 mn Tue $ 4.88 mn Wed $ 4.41 mn Total: $ 41.66 million [₹ 264.61 cr] — taran adarsh (@taran_adarsh) 25 January 2018 -
దుమ్మురేపుతున్న టైగర్.. భారీగా వసూళ్లు!
ముంబై: ఈ ఏడాది పెద్ద సూపర్హిట్లు లేక డీలాపడిన బాలీవుడ్‌కు సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' సంవత్సరాంతంలో కొత్త ఊపిరినిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5700 థియేటర్లలో విడుదలైన 'టైగర్ జిందా హై' సినిమా మొదటిరోజు రూ. 33 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినీ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. బాహుబలి-2 తర్వాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'టైగర్ జిందా హై' రికార్డు సాధించింది. ఇటు ఇండియాలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా 'టైగర్' బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోందని, యూఏఈలో రూ. 6 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ. 1.01 కోట్లు, న్యూజిల్యాండ్‌లో రూ. 38.54 లక్షలు వసూలు చేసిందని, అయితే, కువైట్‌లో ఈ సినిమా విడుదలను నిషేధించడంతో రెండు కోట్ల వరకు నష్టపోయిందని తరణ్ ఆదర్శ్ వివరించారు. ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూలుచేసిన టాప్-5 సినిమాలు ఇవే 1. బాహుబలి 2 - రూ. 41 కోట్లు 2. టైగర్ జిందా హై - రూ.33.75 కోట్లు 3. గోల్మాల్ అగైన్ - రూ.30.14 కోట్లు 4. ట్యుబ్లైట్ - రూ.21.15 కోట్లు 5. రాయిస్ - రూ.20.42 కోట్లు -
నాని సినిమాకు భారీ కలెక్షన్లు
హైదరాబాద్: యంగ్ హీరో నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ. 20 కోట్ల మార్క్‌ను దాటింది. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజున రూ.10.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రెండో శనివారం రూ. 9.60 కోట్లు గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. మొత్తం రెండు రోజుల్లో మొత్తం రూ. 20.20 కోట్లు గ్రాస్ సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు. అమెరికాలో 'నిన్ను కోరి' సినిమా వసూళ్లు సూపర్‌గా ఉన్నాయని బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.4.24 కోట్లు కలెక్షన్లు సాధించిందని ఆయన వెల్లడించారు. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా చేశారు. మొదటి వారంతంలోనే రూ. 30 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 18 కోట్ల పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో లాభాలు గడించడం విశేషం. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ ప్రధానపాత్రల్లో నటించారు. -
బాహుబలి దెబ్బకు రికార్డు బద్దలు!
ముంబై: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా బాక్సాఫీస్ అన్ని రికార్డులను తిరగరాస్తుందా? భారత సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. బాహుబలి దెబ్బకు రికార్డులు బద్దలు కావడం ఖాయమని ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్, విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ పేజీలో పెట్టిన ఒపీయన్ పోల్ లో 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. అప్పుడే వసూళ్ల గురించి మాట్లాడుకోవడం సరికాదని 30 శాతం మంది పేర్కొన్నారు. ‘వాతావరణం వేడిగా, తేమగా ఉంది. కానీ బాక్సాఫీస్ మాత్రం చాలా చల్లగా ఉంది. సినిమా వ్యాపారాన్ని మళ్లీ పుంజుకునేలా చేసేందుకు బాహుబలి 2 వస్తోంది. బాక్సాఫీస్ వద్ద తుఫాను రాబోతోంద’ని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల రోజున ఒక్క బెంగళూరులోనే 850పైగా షోలు వేయనున్నారు. పది రోజుల పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదల రోజునే బాహుబలి రికార్డులు సృష్టించడం ఖాయమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ సినిమా బాక్సాఫీస్‌కు బాంబు పెట్టింది!
ట్రాన్స్ఫార్మర్స్, ఇండియానా జోన్స్ వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ సినిమాలు తీసిన అగ్రహీరో షాయా లాబౌఫ్ తాజా సినిమా 'మ్యాన్ డౌన్' బ్రిటన్ బాక్సాఫీస్‌కు ఒకరకంగా బాంబు పెట్టింది. డైరెక్టర్ డిటో మాంటియల్ రూపొందించిన ఈ వార్ డ్రామా బ్రిటన్‌లో కేవలం ఏడుపౌండ్లు (రూ. 567) మాత్రమే వసూలు చేసింది. ఈ కలెక్షన్ కూడా ఒక్క టికెట్దే కావడం గమనార్హం. ఈ సినిమా కేవలం ఒక్క థియేటర్లోనే విడుదలైంది. ఆ థియేటర్లోనూ కేవలం ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. గతంలో పలు సూపర్‌హిట్ సినిమాలు తీసిన లాబౌఫ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొని అరెస్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అతను సినిమాలపై దృష్టి పెట్టాడు. పెద్దగా కలెక్షన్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమాను వెంటనే వీడియో ఆన్ డిమాండ్ పేరిట ఆన్లైన్లో పెట్టేశారు. లాబౌఫ్ సినిమానే కాదు గతంలో పలు హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే బాక్సాఫీస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. అమెరికాలో రెండువేలకుపైగా థియేటర్లలో విడుదలైన పిల్లల సినిమా ద వూజీలవ్స్ ఇన్ ద బిగ్ బెలూన్ అడ్వంచర్ (2012)..కేవలం 206 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అమెరికాలో ఒక్క టికెట్ ధర 10 డాలర్లు. ఇక హ్యాలీ బెర్రీ నటించిన డార్క్ టైడ్ (2012) సినిమా బ్రిటన్‌లో కేవలం 90 పౌండ్లు వసూలు చేసింది. ప్రస్తుతం డిస్నీ నిర్మించిన 'బ్యూటీ అండ్ బీస్ట్' సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎమ్మా వాట్సన్‌కు 2015లో ఇదేరకమైన అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకున్న హ్యారీపొటర్ సినిమాలతో తళుక్కుమన్న ఈ అమ్మడు నటించిన 'కలోనియా' చిత్రం బ్రిటన్‌లో కేవలం 47పౌండ్లు వసూలు చేసింది. -
వసూళ్లలో దుమ్మురేపుతున్న ’జాలీ’
అక్షయ్‌కుమార్ న్యాయవాదిగా తెరకెక్కిన ’జాలీ ఎల్ఎల్బీ-2’ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభారంభాన్ని ఇచ్చింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్‌టాక్ రావడంతో అక్షయ్ ఖాతాలో మరో హిట్టు ఖాయమని వినిపిస్తోంది. కోర్టుగది డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు రూ. 13.20 కోట్లు వసూలుచేసింది. మంచి ప్రారంభ వసూళ్లు సాధించిన ’జాలీ ఎల్ఎల్బీ-2’.. రానున్న శని, ఆదివారాల్లో మరింత మెరుగైన కలెక్షన్లు సాధించవచ్చునని సినీ పండితులు భావిస్తున్నారు. చక్కని ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ వస్తున్నదని, గుడ్ రిపోర్ట్స్ వస్తుండటంతో మున్ముందు భారీ వసూళ్లు సాధించే అవకాశముందని బాలీవుడ్ ట్రెడ్ కోమల్ నహతా ట్వీట్‌చేశారు. అక్షయ్‌కుమార్, అన్నుకపూర్, సౌరబ్ శుక్లా నటన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. 2013లో వచ్చిన ’జాలీ ఎల్ఎల్బీ’ కి ఇది సీక్వెల్. మొదటి సినిమాలో అర్షద్ వార్సీ, బొమన్ ఇరానీ పోషించిన పాత్రలను ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అన్ను కపూర్ పోషించారు. వారి పాత్రలకు మంచి స్పందన వస్తున్నది. సినీ విమర్శకులు, సినీ అభిమానులు కూడా ఈ సినిమాపై సానుకూల రివ్యూలు ఇస్తున్నారు. వాస్తవికతకు దగ్గరగా కోర్టుగది డ్రామాను, పోలీసు, న్యాయవ్యవస్థలోని అవినీతి అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ సినిమా.. అక్షయ్‌కుమార్ పంచ్ డైలాగులతో చక్కని ఎంటర్టైనింగ్గా ఉందని చెప్తున్నారు. -
ఏ సినిమాలకు సాధ్యంకాని రికార్డుకు చేరువలో..
ముంబై: దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించిన దంగల్ మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఆమిర్‌ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకూ 365.87 కోట్ల రూపాయలను వసూలు చేసింది. శనివారం 4.06 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ రోజు (ఆదివారం) సెలవు దినం కావడంతో ఇదే స్థాయిలో కలెక్షన్లు రావచ్చు. ఇదే జోరు కొనసాగితే దంగల్ 400 కోట్ల రూపాయల మార్క్ బిజినెస్‌ను దాటుతుంది. ఇదే కనుక జరిగితే 400 కోట్ల రూపాయల కలెక్షన్లు (దేశంలో) సాధించిన తొలి భారతీయ సినిమాగా దంగల్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంతకుముందు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా పీకే, భజరంగీ భాయిజాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆమిర్ నటించిన పీకే 340.8 కోట్లు, సల్మాన్ ఖాన్ సినిమా భజరంగీ భాయిజాన్ 320.34 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. తాజాగా దంగల్ ఈ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దేశంలో 300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమా పీకే కాగా, 400 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా దంగల్ నిలిచే అవకాశముంది. ఈ రెండు ఆమిర్ ఖాన్ నటించినవి కావడం విశేషం. ఇక ఓవర్సీస్లోనూ దంగల్ భారీ కలెక్షన్లు రాబడుతోంది. శనివారం నాటికి 190.94 కోట్ల రూపాయలు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పాడు. విదేశాల్లో ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్ల మార్క్ దాటే అవకాశముంది. -
ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొడుతుందా?
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను సాధిస్తోంది. గతేడాది విడుదలైన సినిమాలలో ఇదే అత్యధిక వసూళ్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 23న విడుదలైన దంగల్‌కు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 313.50 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తొలివారం 197.54 కోట్లు, రెండోవారం 115.96 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆమిర్ నటించిన పీకే సినిమా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించింది. దంగల్‌కు ఇలాగే నిలకడగా కలెక్షన్లు వస్తే పీకే రికార్డును బ్రేక్ చేసే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమీర్ తన రికార్డును తానే బద్దలు కొడతాడో లేదో చూడాలి. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
రూ. 400 కోట్లు మార్క్ దాటిన కలెక్షన్లు
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దేశ వ్యాప్తంగా 270 కోట్లు, ఓవర్సీస్లో 141 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మొత్తం 411 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. డిసెంబర్ 23న విడుదలైన దంగల్ తొలివారం దేశీయ మార్కెట్లో 197.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 2016లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. గతేడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసింది. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఏడాది చివర్లో దంగల్ రికార్డు కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా "దంగల్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ ఏడాది తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఈ నెల 23న విడుదలైన దంగల్ నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. ఈ రోజుకు (శుక్రవారం) 200 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా. ఈ వీకెండ్‌కు ఈ సినిమా 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించవచ్చని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దంగల్'
ముంబై: ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్‌కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే భారత్‌లో 100 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. నోట్ల రద్దుతో చిల్లర దొరక్క చాలా సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం వెనకబడ్డాయి. ఇలాంటి సమయంలో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే తొలి రోజు కలెక్షన్లలో మాత్రం సుల్తాన్ రికార్డులను తిరగరాయలేకపోయింది. సుల్తాన్ తొలి రోజు రూ.33.34 కోట్లు సాధించగా, దంగల్ మాత్రం 29.78 కోట్లు రాబట్టింది. దంగల్ పై వచ్చిన రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగా రావడంతో ఆ తర్వాత రోజు నుంచి వసూళ్ల వేగం మరింతగా పెరిగింది. శనివారం 34.25 కోట్లు, ఆదివారం రూ.42.35 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులను కలుపుకొని కేవలం భారత్‌లోనే రూ. 106.95 కోట్ల వసూళ్లును కొల్లగొట్టిందని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆమిర్ ఖాన్ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ హిట్ మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది. #Dangal Fri 29.78 cr, Sat 34.82 cr, Sun 42.35 cr. Total: ₹ 106.95 cr [incl Tamil and Telugu]. India biz. FANTABULOUS! — taran adarsh (@taran_adarsh) 26 December 2016 -
భారీ కలెక్షన్లతో 'సాహసం శ్వాసగా సాగిపో'
-
పండుగనాడు ఆ రెండు సినిమాలు తుస్..
ముంబై: మత్తెక్కించే రొమాంటిక్ సీన్లు, ప్రేమ, వైఫల్యాలు, గాఢమైన అనుబంధాలు కలబోసిన సినిమా ఒకటి. భారీ యాక్షన్ సీన్లు, హిమాలయాల్లో సాహసాలు, కూతురి సెంటిమెంట్ తో తెరకెక్కిన మరో సినిమా. దీపావళి సందర్భంగా విడుదలైన రెండు భారీ బాలీవుడ్ సినిమాలు 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్నాయి. పండుగను క్యాష్ చేసుకోవడంలో రెండు సినిమాలూ విఫలమయ్యాయని, దీంతో ఫ్యాన్సీ రేట్లకు సినిమాలు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలిందని సోమవారం బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 28న విడుదలైన 'ఏ దిల్ హై ముష్కిల్', 'శివాయ్'లు తొలిరోజు వరుసగా రూ.13.30 కోట్లు, రూ.8.26కోట్ల వసూళ్ల(గ్రాస్)ను రాబట్టాయి. రెండో రోజు, అంటే శనివారం 'ఏ దిల్'కు రూ.13.10కోట్లు, 'శివాయ్'కు 10.06కోట్లు వసూలయ్యాయి. కానీ కీలకమైన దీపావళి (ఆదివారం)పండుగ నాడు మాత్రం రెండు సినిమాల కలెక్షన్లు పడిపోయాయి. దీపావళినాడు 'ఏ దిల్' 9.20 కోట్లు, 'శివాయ్' రూ.8.26 కోట్లు మాత్రమే వసూలు చేశాశాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారు. ఇండియాలో 3000 స్క్రీన్లపై విడుదలైన 'ఏ దిల్'కు విదేశాల్లో మంచి స్పందన లభించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.40.05 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు 'ఏ దిల్'.. 2016 సంవత్సరంలో విదేశాల్లో భారీ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచిందని రూపకర్తలు ప్రకటించారు. 'ఏ దిల్..' అమెరికాలో 2.1 మిలియన్ డాలర్లు, బ్రిటన్, ఆస్త్రేలియాల్లో వరుసగా 752,000 డాలర్లు, 307,045 డాలర్లు వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు. అయితే సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ జోగిందర్ మహాజన్ అన్నారు. -
’కబాలి’ని టొరంటోలో డౌన్లోడ్ చేయబోతే..!
రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. రజనీకాంత్ తాజా సినిమా ‘కబాలి’ అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘కబాలి’ సినిమా తొలిరోజే రూ. 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉంటుందని చిత్రనిర్మాతలు ఓ ప్రకటనలో తెలుపడం సంచలనం రేపుతోంది. ‘కబాలి’ తొలిరోజు ఒక్క తమిళనాడులోనే వందకోట్లు వసూలుచేసిందని, తమిళనాడు బయట దేశమొత్తంగా రూ. 150 కోట్లు వసూలుచేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ వసూళ్ల ప్రకటన ఇలా వుంటే.. మరోవైపు‘కబాలి’ శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది. ఈ కథనాల్లో నిజానిజాలను పక్కనబెడితే.. ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో విడుదలైన ‘కబాలి’ సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘కబాలి’ కలెక్షన్లు లెజెండ్ రజనీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కితాబిచ్చారు. మరోవైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్, ఛలోక్తులు ఆన్లైన్లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్‌ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం.. ’కబాలి సినిమాను డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్ఇన్స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ మాయమైంది’ Tried downloading Kabali. µTorrent uninstalled itself. System got formated. Wi-Fi router crashed. Nearby Airtel tower vanished. — चार लोग (@WoCharLog) July 21, 2016 ’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్లో పడేస్తుంది’ ‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’. -
కథపైనే హీరోల దృష్టి
మారుతున్న కాలంతో మనమే కాదు సినిమాలు మారాలి, తప్పదు. లేకుంటే ఎంతటి పెద్ద హీరో చిత్రం అయినా, ఎంత బారీ బడ్జెట్ చిత్రం అయినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టే పరిస్థితి. టెక్నాలజీతో పాలు ప్రేక్షకుల నాలెడ్జ్ పెరగడంతో ఇప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని చిత్రాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. ఎప్పటికీ సినిమాకు కథే కింగ్. అందులో వైవిధ్యం ఉం టేనే ఏ పాత్రదారులైనా అందుకు తగ్గట్టు నటించి మెప్పించగలరు. అయితే కొందరు ఇది గ్రహించకుండా హీరోల పైనో, భారీ హంగామాలపైనో ఆధారపడి చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారన్నది విజ్ఞుల మాట. చిత్రాల విజయాల సంఖ్య వేళ్లల్లోనూ, అపజయాల సంఖ్య వందల్లోనూ ఉండడానికి ముఖ్య కారణం ఇదే. అదే సమయంలో చిన్న బడ్జెట్లో రూపొందిన మంచి కథా చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కథానాయకుల్లో చాలా అవగాహన పెరిగిందని చెప్పవచ్చు. వారు కథలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో హీరోలను తీసుకుంటే కథలలో వైవిధ్యం కోరుకుంటున్నారు. విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి టాప్ కథానాయకులు పది మంది దర్శకుల కథలు విని అందులో ఒక్కటి ఎంపిక చేసుకుని నటిస్తున్నారు.అలా ఏడాదికి ఒక్క చిత్రం చేసినా పర్వాలేదనుకుంటున్నారు. అంతే కాదు అం దులోని కథా పాత్రగా మారడానికి కావలసిన కసరత్తులన్నీ చేయడానికి శ్రమిస్తున్నారు. నటుడు విజయ్‌నే తీసుకుంటే 1992లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఆరంభ దశలో ఏడాదికి నాలుగైదు చిత్రా లు చేసేవారు. ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలనే చేస్తున్నారు.ఇక నటుడు అజిత్‌కుమార్ 1993లో హీరోగా పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో ఈయ న ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేశారు. ఇప్పుడు ఏడాదికి ఒక్క చిత్రం కూడా చేయడానికి ఆలోచిస్తున్నారు అనే కంటే కథాబలం ఉన్న పాత్రల కోసం వేచి చూస్తున్నారని అనవచ్చు.అదే విధంగా నటుడు విక్రమ్ చాలా పోరాటం తరువాత ఇప్పటి స్థాయికి చేరుకున్న నటుడు. ఈయన పాత్రకు జీవం పోయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేంతగా శ్రమిస్తారనడానికి ఒక ఐ చిత్ర మే ఉదాహరణ.విక్రమ్ కూడా చిత్ర కథల విషయంలో ఆచీతూచీ అడుగేస్తున్నారు. ఇక నటుడు సూర్య కష్టాన్ని తక్కువ అంచనా వేయలేమ్. వైవిధ్యం కోసం తపించే నటుల్లో ఆయన ఒకరు. వారణం ఆయిరం,7ఆమ్ అరివు, ఇటీవల నటించిన 24లో లాంటి పలు చిత్రాలు ఆయన ఉన్నత నటనకు మచ్చుతునకులు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇ లా హీరోలు కథే కింగ్‌గా భావిం చడం ఆహ్వానించదగ్గ పరిణామమే కదా. -
బాలీవుడ్ ను మళ్లీ చిత్తుచేసిన హాలీవుడ్!
అనురాగ్ కశ్యప్ తీసిన తాజా సినిమా ‘రమణ్ రాఘవ్ 2.0’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. అయినా కలెక్షన్ల విషయంలో ‘రమణ్ రాఘవ్’ను చిత్తుచేసింది ఓ హాలీవుడ్ సినిమా. తొలిరోజు ‘రమణ్ రాఘవ్’ కేవలం రూ. 1.10 కోట్ల వసూళ్లు రాబడితే.. జెఫ్ గోల్డ్‌బ్లమ్ డిజాస్టర్ మూవీ ‘ఇండింపెండెన్స్ డే: రిసర్జెన్స్’ ఏకంగా రూ. 4.5 కోట్లు సాధించి అబ్బురపరిచింది. ‘రమణ్ రాఘవ్’ కేవలం రూ. 3.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. చిన్న సినిమా అయినప్పటికీ, తక్కువ థియేటర్లలో విడుదలైనా దర్శకుడు అనురాగ్ కశ్యప్ కావడంతో ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తున్నాయి. అయినా ఈ సినిమా హాలీవుడ్ చిత్రం ‘ఇండింపెండెన్స్ డే: రిసర్జెన్స్’ కలెక్షన్ల దారిదాపులో కూడా లేకపోవడం గమనార్హం. గత కొన్నాళ్లుగా భారత్‌లోనూ హాలీవుడ్ సినిమాలు దీటుగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ‘జంగిల్‌బుక్’ లాంటి చిత్రాలు బాలీవుడ్ సినిమాలకు మించి భారత్‌లో వసూళ్ల కుంభవృష్టి సృష్టించాయి. అదేక్రమంలో దేశి సినిమా ‘రమణ్ రాఘవన్’ ఢీకొట్టి ‘ఇండింపెండెన్స్ డే: రిసర్జెన్స్’ కలెక్షన్లు రాబడుతుండటం గమనార్హం. మరోవైపు షాహిద్ కపూర్ తాజా సినిమా ‘ఉడ్తా పంజాబ్’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. -
'బాక్సాఫీసు కలెక్షన్లు వణుకు పుట్టిస్తాయి'
ముంబై: సినీ ఇండస్ట్రీ ఏదైనా సరే తమ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తే షూటింగ్ కోసం పడ్డ పాట్లను క్షణాల్లోనే మరిచిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీలు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం శుభపరిణామమే అయినా.. కొన్ని సందర్భాల్లో నటీనటులకు వణుకు పుడుదందని హీరో ఇమ్రాన్ హష్మీ అంటున్నాడు. మర్డర్, గ్యాంగ్‌స్టర్, 'వన్స్ ఆప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై' సినిమాలు భారీగా వ్యాపారాన్ని అందించినందుకు ఆ సమయాల్లో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. షాంగై, ఎక్ థి దాయన్ లాంటి చిన్న మూవీలు చేసినప్పుడు చాలా థ్రిల్ అవ్వాల్సి వస్తుందన్నాడు. కొన్నిసార్లు మాత్రమే సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తాయని, మరికొన్ని సందర్బాల్లో మూవీ విడుదలంటే చాలు వణుకు పుడుతుందని చెప్పుకొచ్చాడు. ఇమ్రాన్ హష్మీ నటించిన మూవీలు హమారి అధురి కహానీ, మిస్టర్ ఎక్స్, రాజా నట్వర్ లాల్ బాక్సాఫీసు వద్ద బోల్తా పడి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ప్రయోగాలకు సిద్దమైనప్పుడు ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తాయని అప్పుడు చాలా టెన్షన్ ఉంటుందన్నాడు. రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్లో మూవీలు చేసి కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావిస్తారని చెప్పాడు. ప్రయోగాలు చేయాలంటేనే హీరో, హీరోయిన్లు భయపడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. -
'సుల్తాన్'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్!
బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. అదే ఆ ఇద్దరు సూపర్స్టార్లు ఒకేసారి తమ సినిమాల్ని విడుదల చేస్తే.. ఆ పోటీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. అభిమానుల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. అలాంటి అతిపెద్ద పోరు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ఏడాది దీపావళి పండుగ సమయంలో షారుఖ్ 'రాయిస్', సల్మాన్ 'సుల్తాన్' ఒకేసారి వస్తాయని ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఖరారు చేశారు. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తుందని భావించిన ఓ పోటాపోటీ నుంచి షారుఖ్ అనూహ్యంగా తప్పుకున్నాడు. షారుఖ్ 'రాయిస్'ను వచ్చే ఏడాది విడుదల చేస్తామని తాజా చిత్ర దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఎందుకిలా.. కారణమేమిటి? భారీ అంచనాలు రేకెత్తిన బాక్సాఫీసు మహాపోరు నుంచి షారుఖ్ ఎందుకు తప్పుకున్నాడంటే.. అందుకే ఆయన తాజా చిత్రం 'ఫ్యాన్' ఘోర పరాభవమే కారణమని వినిపిస్తోంది. నిజానికి బాక్సాఫీసు పోరు నుంచి ఆయన గతంలో ఎప్పుడు తప్పుకొని పారిపోలేదు. 2009లో ఓం శాంతి ఓ వర్సెస్ సావరియా, 2012లో జబ్ తక్ హై జాన్ వర్సెస్ సన్ ఆఫ్ సర్దార్, 2015లో బాజీరావు మస్తానీ వర్సెస్ దిల్వాలే వంటి హోరాహోరీ పోరులోనూ షారుఖ్ విజేతగా నిలిచాడు. నిజానికి 2015 ఆగస్టులో ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయని తెలిసినప్పుడు షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పండుగ సందర్భంగా ఎవరి సినిమాలు వారు విడుదల చేస్తారని, ఇందులో భయపడాల్సిందేమీ లేదని, నిజానికి తమ సినిమా పండుగ సందర్భంలో విడుదల చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ తో పోటీకి భయపడే ప్రసక్తే లేదని పరోక్షంగా కుండబద్దలు కొట్టాడు. కానీ 'ఫ్యాన్' ఘోర పరాభవం 'రాయిస్' సినిమా విషయంలో షారుఖ్ బిగ్ యూటర్న్ తీసుకున్నాడు. భారీ అంచనాలతో విడుదలై, మంచి రివ్యూలు తెచ్చుకున్నా.. 'ఫ్యాన్' సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరలేకపోయింది. 'ఫ్యాన్' చేదు ఫలితం ప్రభావమే 'రాయిస్' చిత్ర తేదీని మార్చేలా షారుఖ్‌ను, చిత్ర నిర్మాతలను పూరికొల్పి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ సినిమాను పండుగ రేసు నుంచి తప్పించి 2017 జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించామని 'రాయిస్' నిర్మాతలు రితేశ్ సిద్వాని, ఫర్హాన్ అఖ్తర్, హీరో షారుఖ్ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. -
ఫ్యాన్, బజరంగీ కన్నా బాహుబలే మిన్న!
షారుక్‌ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్'.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చింది. సమీక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకులూ నచ్చిందన్నారు. కానీ కలెక్షన్లలో చూస్తే మాత్రం ఆ ఊపు కనిపించలేదు. తొలిరోజు కలెక్షన్లపై అటు బాలీవుడ్ అయినా ఇటు టాలీవుడ్ అయినా భారీ ఆశలే పెట్టుకుంటున్నది. భారీ ఎత్తున థియేటర్లలోకి దిగుమతి అయిన ఈ సినిమా తొలి రోజు వసూలు చేసింది రూ. 19.20 కోట్లే. మొత్తంగా మొదటి వీకెండ్లో ఈ సినిమా రాబట్టింది రూ. 54 కోట్లు మాత్రమే. ఈ ఏడాది కలెక్షన్ల పరంగా చూసుకుంటే తొలి వీకెండ్లో ఇదే రికార్డు వసూలు కావొచ్చు కూడా. కానీ, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల జాబితాపరంగా చూస్తే 'ఫ్యాన్' కలెక్షన్లు ఒకింత నిరాశపరిచాయనే చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాది వచ్చి కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్', 'ప్రేమరతన్ ధన్‌పాయో', 'దిల్వాలే'తో పోల్చుకుంటే 'ఫ్యాన్' వసూలు చాలా వెనుకబడిపోయింది. తొలి నాలుగు రోజుల్లో రూ. 217 కోట్లు వసూలు చేసి.. రాజమౌళి వండర్ 'బాహుబలి' రికార్డు సృష్టించింది. ఈ ఐదు చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర లిఖించింది. ఆ తర్వాతి స్థానంలో రూ. 129.77 కోట్లతో ప్రేమరతన్ ధన్‌పాయో (పీఆర్డీపీ), రూ. 129.65 కోట్లతో భజరంగీ భాయ్‌జాన్, రూ. 75.18 కోట్లతో దిల్వాలే సినిమాలు నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన షారుఖ్ తాజా వండర్ 'ఫ్యాన్' మాత్రం తొలి నాలుగు రోజుల్లో రూ. 50.40 కోట్లు వసూలు చేసింది.