సినిమాపై ట్యాక్స్ ఎత్తివేత: సీఎంకు థాంక్స్.. | Airlift becomes tax free in UP | Sakshi
Sakshi News home page

సినిమాపై ట్యాక్స్ ఎత్తివేత: సీఎంకు థాంక్స్..

Published Thu, Jan 28 2016 10:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

సినిమాపై ట్యాక్స్ ఎత్తివేత: సీఎంకు థాంక్స్..

సినిమాపై ట్యాక్స్ ఎత్తివేత: సీఎంకు థాంక్స్..

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్‌'. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్‌లో వినోదపన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్‌ ట్విట్టర్‌లో తెలిపారు. యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. 'ఎయిర్‌లిఫ్ట్‌'కు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే తెలియజేసింది. అఖిలేశ్ యాదవ్‌ నేతృత్వంలోని ప్రగతిశీల యువనాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు.

1990లో కువైట్‌పై ఇరాక్‌ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ లో అక్షయ్‌, నిమ్రత్‌ కౌర్ జంటగా నటించారు. ఈ సినిమాలో అక్షయ్‌ పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్రపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement