Airlift
-
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్‌తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్‌ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్‌కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
Ukraine: తెలంగాణ వాళ్లని క్షేమంగా వెనక్కి తీసుకురండి.. ఖర్చులు మేం భరిస్తాం
ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి తరలింపుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ రాష్ట్ర ప్రజల విషయంలో ఇప్పటికే కేంద్రానికి పలు రాష్ట్రాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరి కోసం హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్ హెల్ప్‌లైన్ నంబర్లకు వస్తున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏 We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest — KTR (@KTRTRS) February 25, 2022 చదవండి: ఉక్రెయిన్ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఈ చిక్కుముళ్లు వీడాలి -
వైరల్: హాలీవుడ్ యాక్షన్ సీన్లను తలదన్నే ‘ఆపరేషన్’
ఆమ్స్టర్డామ్: చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. కింద కారులో, సముద్రంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదంలో ఉంటే.. మన హీరో గారు హెలికాప్టర్లో వచ్చి.. తాడు నిచ్చెన సాయంతో కిందకు దిగి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడతాడు. సినిమాల్లో అంటే ఏం చూపించినా చెల్లుతుంది. పైగా ఇలాంటి రిస్కీ షాట్లలో పని చేసేది.. హీరోలు కాదు.. డూపులే అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ సైన్యంలో రెస్క్యూ టీంలలో ఇలాంటి రియల్ హీరోలు ఉంటారు. వారు ప్రాణాలకు తెగించి మరి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడతారు. తమకు ప్రమాదం అని తెలిసినా.. వారి జీవితాలను పణంగా పెట్టి.. మరి ఇతరులను ఆదుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సముద్రంలో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల కార్గో షిప్ భారీ ఆటుపోట్లకు గురవుతుంది. ఈ లోపే సహాయక సిబ్బంది అత్యంత చాకచక్యంగా షిప్లో ఉన్న 12 మందిని సురక్షితంగా కాపాడారు. ఆ వివరాలు.. జర్మనీలోని బ్రెమెర్‌హావెన్ నుంచి నార్వేలోని కొల్వరైడ్ వరకు పలు చిన్న నౌకలను తీసుకువెళుతున్న డచ్ కార్గో షిప్ "ఈమ్స్లిఫ్ట్ హెండ్రికా" సోమవారం సముద్రంలో ప్రయాణిస్తుండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆటుపోట్లకు గురవుతుంది. ప్రమాదం గురించి షిప్లో ఉన్న సిబ్బంది ముందే తమ యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు సహాయక సిబ్బందిని పంపిస్తారు. ఇక హెలికాప్టర్ ద్వారా రంగంలోకి దిగిన సిబ్బంది షిప్లో ఉన్న 12మందిని రెండు విడతల్లో కాపాడారు. ఆపరేషన్‌లో భాగంగా సహాయక సిబ్బంది తొలుత షిప్ డెక్ మీద ఉన్న వారిలో 8 మందిని గాల్లోకి లేపి హెలికాప్టర్లోకి చేరవేశారు. ఈలోపు షిప్ ప్రమాద తీవ్రత పెరగడంతో మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కూడా రక్షించారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగిన తీరు చూస్తే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డెక్ మీద ఉన్న వారిని కాపాడటం కోసం తొలత హెలికాప్టర్లో ఉన్న సహాయక సిబ్బంది ఒకరు ఇనుప తాడు సాయంతో షిప్ డెక్ మీదకు దిగుతాడు. ఆ తర్వాత అతడు ఒక్కొక్కరిని అదే తాడు ద్వారా హెలికాప్టర్లోకి పంపిస్తాడు. ఇలా 8 మందిని కాపాడిన తర్వాత షిప్ ఆటుపోట్లకు గురవుతూ ప్రమాదకర రీతిలో కదులుతుంది. దాంతో డెక్ మీద మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కాపాడారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: సూయెజ్ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు -
బీజేపీ ఎంపీకి మరోసారి తీవ్ర అస్వస్థత : ఎయిర్‌లిఫ్ట్
సాక్షి,భోపాల్: బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆమెను హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌లోని ఎంపీ కార్యాలయం అధికారులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ప్రజ్ఞా ఠాకూర్ కోవిడ్-19 ప్రేరిత లక్షణాలతో గత ఏడాది డిసెంబర్లో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు అనారోగ్య కారణాల రీత్యా జాతీయ దర్యాప్తు సంస్థ 2017లో బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది. -
గతుకుల రోడ్డుపై వెళ్లలేక.. చాపర్ తెప్పించారు!
రోడ్లన్నీ విపరీతంగా గోతులు పడిపోయాయి. ఒక్క కిలోమీటరు దూరం ప్రయాణించేసరికే నడుం పడిపోతోంది. మామూలుగా వయసులో ఉన్నవాళ్లే ఈ ఇబ్బందులు తప్పడం లేదంటే.. మరి 70 ఏళ్ల వయసులో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే.. ఆ గోతుల దారిలో వెళ్లలేక ఏకంగా హెలికాప్టర్ తెప్పించుకున్నారో ఎంపీ. ఆయనెవరో కాదు.. ఎప్పుడూ సొంత పార్టీ మీదే విమర్శలు కురిపిస్తూ ఉండే షాట్ గన్.. శత్రుఘ్న సిన్హా. జార్ఖండ్‌లో రాజధాని రాంచీ నుంచి జంషెడ్పూర్ వరకు కేవలం వంద కిలోమీటర్ల దూరమే ఉంటుంది. సరే కదా అని రోడ్డు మార్గంలో బయల్దేరిన శత్రుఘ్న సిన్హా.. కొంత దూరం వెళ్లేసరికే ఆ గతుకుల దారిలో ప్రయాణం ఏమాత్రం చేయలేక అక్కడికక్కడే ఆగిపోయారు. తమ పార్టీకే చెందిన జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌కు ఫోన్ చేశారు. తాను ఇలా వెళ్లలేనని ఆయనతో చెప్పగానే.. సదరు సీఎం వెంటనే ఒక హెలికాప్టర్ సిద్ధం చేశారు. తన మంత్రివర్గ సహచరుడు లూయిస్ మరాండీని ఇచ్చి మరీ పంపి, శత్రుఘ్న సిన్హాను రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌కు 'ఎయిర్‌లిఫ్ట్' చేశారు. రాంచీ - జంషెడ్పూర్ మధ్య ఉన్నది జాతీయ రహదారి కావడంతో ఈ దారిని బాగు చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించామని, కానీ ఫలితం లేదని మరో మంత్రి సరోయ్ రాయ్ అన్నారు. ఇప్పుడు తాము ఈ రోడ్లకు అలవాటు పడిపోయామని, కొత్తవాళ్లు మాత్రం ఈ గోతుల్లో ప్రయాణం చేయలేరని చెప్పారు. -
ఏడాదిలో ఎన్నో ఎదుర్కొన్నా: హీరోయిన్
గత ఏడాది 'ఎయిర్ లిఫ్ట్' సినిమాతో ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది నిమ్రత్ కౌర్. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా ఆమె కనబర్చిన అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అయినా, ఇప్పటివరకు నిమ్రత్ మరో బాలీవుడ్ చిత్రాన్ని ఒప్పుకోలేదు. ఈ ఏడాదికాలంలో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏమిటంటే.. ఈ ముద్దుగుమ్మ చాలా విషయాలే చెప్పింది. ప్రస్తుతం హాలీవుడ్ సీరియల్ 'వేవార్డ్ పైన్స్' షూటింగ్ కోసం కెనడాలోని వాంకోవర్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో ముచ్చటించింది. గడిచిన ఏడాదికాలంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తాను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందని, వాటన్నింటి వల్ల ఊపరి సలుపనంత బిజీగా ఉండిపోయానని చెప్పింది. త్వరలోనే మళ్లీ బాలీవుడ్ కు తిరిగి రాబోతున్నట్టు ప్రకటించింది. 'గడిచిన ఏడాదికాలంలో నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఎంతో ఉక్కిరిబిక్కిరిగా ఇది గడిచిపోయింది. జనవరిలో 'ఎయిర్ లిఫ్ట్' విడుదల అయింది. ఆ వెంటనే ఒకదాని వెంట ఒకటిగా చాలా విషయాలు జరిగిపోయాయి. ఇవన్నీ ఇలా ఉండగానే మా చెల్లి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి సందండి, సంబరంలో మునిగితేలుతుండగానే వాంకోవర్ నుంచి సీరియల్ ఆఫర్ వచ్చింది' అని నిమ్రత్ పేర్కొంది. 'లాంచ్ బాక్స్'లో నిమ్రత్ నటనను చూసి ముచ్చటపడ్డ అమెరికన్ టీవీ నిర్మాతలు ఆమెకు 'హోమ్ ల్యాండ్' సీరియల్ లో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ పాత్రను ఇచ్చారు. ఆ పాత్రలోనూ రాణించడంతో మనోజ్ నైట్ శ్యామలన్ రూపొందిస్తున్న టీవీ సిరీస్ 'వేవార్డ్ పైన్స్'లో అవకాశం వచ్చింది. ఇలా హాలీవుడ్ సీరియళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్న నిమ్రత్ త్వరలోనే బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తానని చెప్తోంది. -
'నా చివరి అంకం వరకు ఇలాగే నటిస్తా..'
ముంబయి: ఎయిర్ లిఫ్ట్.. సింగ్ ఈజ్ బ్లింగ్ ఈ రెండు కూడా భిన్నమైన చిత్రాలు. ఒకటి ఎంతో సీరియస్ కంటెంట్ ఉన్న కథ అయితే మరొకటీ పూర్తి హాస్యభరిత అంశంతో కూడిన అంశం. అలాగే, రుస్తుం.. హౌజ్ ఫుల్ 3.. ఇవి కూడా పూర్తిగా భిన్నమైన చిత్రాలే.. ఈ చిత్రాలన్నింటిలో కూడా నటించిన హీరో అక్షయ్ కుమార్. ఆయన ఇలా ఎందుకు సీరియస్, కామెడీ చిత్రాల్లో వరుసగా నటిస్తున్నారని ప్రశ్నిస్తే.. అలా చేయడం తనకు ఎంతో సరదాను ఇస్తుంటుందని చెప్తున్నారు. హౌజ్ పుల్ చిత్ర విశేషాల గురించి తెలిపారు. తాను ఈ చిత్రంలో స్ప్లిట్ పర్సనాలటీ క్యారెక్టర్ తో నటించానని, అలా అని స్ప్లిట్ పర్సనాలిటీ స్టోరీలను చదవలేదని చెప్పారు. ఇది కేవలం ఒక కామెడీ చిత్రమే అన్నారు. ఈ చిత్రంలో తాను ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నానని, డిస్ససోయేట్ ఐడెంటిటీ డిసార్డర్(డిడ్)తో బాధపడుతుంటానని తెలిపారు. కామెడీ చిత్రాలు, సీరియస్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో తాను చివరివరకు నటిస్తూనే ఉంటానని చెప్పారు. రితేశ్ దేశ్ ముఖ్ తో నటించడం కొత్తగా చెప్పడానికి ఏం లేదని, అయితే, ఈ చిత్రంలో కొత్తగా అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పారు. ఆయన ఒక జెంటిల్ మేన్ అని ఆయనతో నటించడం ఇష్టంగా భావిస్తానని తెలిపారు. -
ఎదురులేకుండా దూసుకుపోతున్న 'ఎయిర్‌లిఫ్ట్'
ముంబై: వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఎమోషనల్ డ్రామాలకు వెండితెరపై ఆదరణ తగ్గలేదని 'ఎయిర్‌లిఫ్ట్' మరోసారి రుజువుచేసింది. 1990లో కువైట్ పై ఇరాక్ యుద్ధం సందర్భంలో అక్కడి భారతీయులను సురక్షితంగా తరలించే కథతో తెరకెక్కిన 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ జంటగా ఈ నటించిన ఈ సినిమా కేవలం పదిరోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది. రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎయిర్‌లిఫ్ట్' జనవరి 22న ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలి వీకెండ్ లో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొట్టిన ఈ సినిమా రెండో వీకెండ్ లో రూ. 19.22 కోట్లు వసూలు చేసింది. దీంతో పదిరోజుల్లో ఈ సినిమా పదిరోజుల్లో 102.7 కోట్లు రాబట్టింది. 'ఎయిర్ లిఫ్ట్ సినిమా రూ. వందకోట్ల క్లబ్బులో చేరింది. మా అంచనాలకు తగ్గట్టు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్న ఈ సినిమా మున్ముందు మరింత మెరుగ్గా కలెక్షన్లు రాబడుతుందని ఆశిస్తున్నాం. ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇవ్వడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది' అని ఈ సినిమాను విడుదల చేసిన ప్రతీక్ ఎంటర్ టైన్మెంట్స్ చైర్మన్ ప్రశాంత తివారీ ఓ ప్రకటనలో తెలిపారు. 1990లో కువైట్‌పై ఇరాక్ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. అక్షయ్‌కుమార్ తన కెరీర్లో ఉత్తమ అభినయాన్ని ఈ సినిమాలో చూపించారని విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్ర అభిమానులను అలరిస్తోంది. -
సినిమాపై ట్యాక్స్ ఎత్తివేత: సీఎంకు థాంక్స్..
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్'. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్‌లో వినోదపన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ ట్విట్టర్లో తెలిపారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 'ఎయిర్‌లిఫ్ట్'కు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే తెలియజేసింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ప్రగతిశీల యువనాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు. 1990లో కువైట్‌పై ఇరాక్ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ లో అక్షయ్, నిమ్రత్ కౌర్ జంటగా నటించారు. ఈ సినిమాలో అక్షయ్ పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్రపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
భారీ కలెక్షన్ల దిశగా 'ఎయిర్‌లిఫ్ట్'
-
కలెక్షన్లతో దుమ్ములేపుతున్న 'ఎయిర్‌లిఫ్ట్'
ముంబై: బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్' భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్క్‌ను దాటింది. సినిమాలో బలమైన కంటెంట్ ఉండటం, ప్రక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బాక్సాఫీసు వద్ద భారీగా బిజినెస్ చేస్తున్న ఈ చిత్రం ఇదేనని సినీ పండితులు చెప్తున్నారు. శుక్రవారం (22న) విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 12.35 కోట్లు వసూలు చేయగా.. శని, ఆదివారాల్లో వరుసగా రూ. 14.60 కోట్లు, 17.35 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టింది. నాలుగోరోజు సోమవారం రూ. 10.40 కోట్లు వసూలు చేసింది. సోమవారం నాటికి కలెక్షన్లు కొద్దిగా తగ్గినప్పటికీ సినిమా దూకుడు మాత్రం తగ్గలేదని సినీ పండితులు చెప్తున్నారు. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ. 54.70 కోట్ల కలెక్షన్ రాబట్టింది. మున్ముందు కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశముందని అంటున్నారు. 1990లో కువైట్‌పై ఇరాక్ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ లో అక్షయ్, నిమ్రత్ కౌర్ జంటగా నటించారు. ఈ సినిమాలో అక్షయ్ పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్రపై అభిమానుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. -
'మీ ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి'
న్యూఢిల్లీ: తన తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్' సూపర్‌హిట్ కావడంతో యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 1990నాటి కువైట్ యుద్ధ నేపథ్యంలో దర్శకుడు రాజాకృష్ణ మీనన్ తెరకెక్కించిన 'ఎయిర్‌లిఫ్ట్' శుక్రవారం (22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజే రూ. 12 కోట్లు వసూలు చేసింది. సినిమా హిట్ టాక్ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'ఎయిర్‌లిఫ్ట్ పట్ల మీరు చూపుతున్న ఆదరణ, ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ స్పందనకు ఎంతో వినమ్రంగా స్వీకరిస్తున్నా' అని అక్షయ్‌కుమార్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. 'ఎయిర్‌లిఫ్ట్'లో అక్షయ్ పక్కన హీరోయిన్గా నటించిన నమ్రత్ కౌర్ కూడా అభిమానులకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. 'మీ ప్రేమకు ఎంతో కృతజ్ఞురాలిని. అద్భుతమైన ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా' అని ఈ భామ ట్విట్టర్లో పేర్కొంది. -
'ఎయిర్‌లిఫ్ట్' దుమ్ములేపుతోంది!
ముంబై: రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ 'ఎయిర్‌లిఫ్ట్' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అక్షయ్‌కుమార్, నిమ్రత్‌కౌర్ జంటగా నటించిన ఈ సినిమా తొలిరోజే సూపర్‌హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాకు తొలిరోజు అడల్ట్ కామెడీ 'క్యా కూల్ హై హమ్ 3' నుంచి గట్టిపోటీ ఎదుర్కొంది. దీంతో తొలిరోజు రూ. 11 కోట్లు వసూలు చేసిన 'ఎయిర్‌లిఫ్ట్' రెండో రోజు మాత్రం గణనీయంగా పుంజుకుంది. రెండోరోజూ ఈ సినిమా ఏకంగా రూ. 14 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో నెగిటివ్ టాక్ సంపాదించుకున్న 'క్యా కూల్ హై హమ్ 3' కలెక్షన్స్ రెండోరోజు గణనీయంగా పడిపోయాయి. మొత్తంగా భారీ కలెక్షన్లతో యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ 'ఎయిర్‌లిఫ్ట్' దూసుకుపోతున్నది. ఈ సినిమా తొలి రెండురోజుల్లో రూ. 25.5 కోట్లు వసూలు చేసింది. 1990లో కువైట్‌పై ఇరాక్ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. అక్షయ్‌కుమార్ తన కెరీర్లో ఉత్తమ అభినయాన్ని ఈ సినిమాలో చూపించారని విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్ర అభిమానులను అలరిస్తోంది. -
'అమ్మా.. నాన్న ఎక్కువ కష్టపడుతున్నాడు'
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎయిర్ లిఫ్ట్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఇలాంటి కథను ఎంచుకోవటంతో పాటు, తన నటనతో సినిమా స్థాయిని పెంచిన అక్షయ్ కుమార్‌కు ప్రత్యేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సినిమా చూసిన తరువాత ఆరవ్ అన్న మాటలను అక్షయ్ భార్య, ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ' అమ్మా.. నాన్న తీరుతో బాధనిపిస్తోంది. ఆయన చాలా ఎక్కువగా కష్టపడుతున్నాడు' అని ఎయిర్ లిఫ్ట్ సినిమా చూశాకా తన కొడుకు కామెంట్ చేశాడు, అంటూ ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ లో పేర్కొంది. అక్షయ్ కుమార్ సరసన నిమ్రత్ ఖౌర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రాజా కృష్ణ మీనన్ దర్శకుడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఎయిర్‌లిఫ్ట్‌కు ప్రేక్షకుల నుంచి, విశ్లేషకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
భారతీయుడిగా గర్వపడేలా ఉంటుంది
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎయిర్ లిఫ్ట్. 1990లో ఇరాక్ కువైట్ యుద్ధం సందర్భంగా భారీ ఎత్తున భారతీయులను తరలించిన సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కువైట్‌కు చెందిన బిజినెస్‌మేన్ రంజిత్ కట్యాల్ పాత్రలో నటిస్తున్నాడు. జనవరి 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఎయిర్ లిఫ్ట్ విశేషాలను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్లో మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఎయిర్ లిఫ్ట్ సినిమా భారతీయుడిగా గర్వించే విధంగా రూపొందిందని ట్వీట్ చేశాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
ఆ సినిమా చూసి ప్రతి భారతీయుడు గర్విస్తాడు!
ముంబై: యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్'. 1990లో కువైట్‌పై ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ దండయాత్ర జరిపినప్పుడు.. భారత్ విరోచితంగా వ్యవహరించి.. అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమందిని తరలించింది. ప్రపంచంలోనే శరణార్థుల అతిపెద్ద వైమానిక తరలింపు ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. ఆనాటి విరోచిత ఘట్టాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలని అక్షయ్‌కుమార్ కోరారు. ఆ ఘటనను వెలుగులోకి తీసుకురావడానికే 'ఎయిర్‌లిఫ్ట్' చిత్రంలో తాను నటించినట్టు ఆయన తెలిపారు. 'గిన్నిస్ బుక్‌ను తెచ్చుకొని అందులో అతిపెద్ద వైమానిక తరలింపు ఏదని చూస్తే భారతే కనిపిస్తుంది. దీనిని అందరి దృష్టికి తీసుకురావాలనే దృష్టితోనే ఈ కథను నేను ఎంచుకున్నాను' అని ఆయన చెప్పారు. ఎన్ఎంఐఎంఎస్ కాలేజీ వాయు ఫెస్టివల్లో ఆయన సోమవారం మాట్లాడారు. 'ఇది మన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన పెద్ద అధ్యాయం. కీలకమైన అధ్యాయం. దీనిని చేర్చాల్సిందిగా నేను ఇప్పటికే కోరాను. షాజహన్, అక్బర్ ఏం చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేశామో కూడా తెలుసుకోవాలి' అని ఆయన అన్నారు. '1990లో కువైట్‌పై సద్దాం హుస్సేన్ దాడి చేశాడు. దీంతో అక్కడున్న 1.70 లక్షలమంది భారతీయులు చిక్కుకుపోయారు. ఎక్కడికి పోవాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం జరిగిందన్నదే మేం ఈ కథలో చూపించబోతున్నాం. ఇలాంటి ఘటనలు మరుగన ఉంచడంలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి' అని ఆయన పేర్కొన్నారు. 1.70 లక్షలమంది శరణార్థులను 488 విమానాల్లో 59 రోజులపాటు ఎలా సురక్షితంగా తరలించారనే విషయాన్ని వారి సహాయకుడిగా అక్షయ్ వివరించడం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా ఉండే ప్రత్యేకమైన సినిమా అని, అందరూ దీనిని చూడాలని ఆయన కోరారు. -
ఫస్ట్ లుక్ వచ్చేసింది
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'ఎయిర్ లిఫ్ట్' ఫస్ట్ పోస్టర్ విడుదల అయింది. రాజ్ క్రిష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ ను సోషల్ మీడియాలో అక్షయ్ మంగళవారం రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పోస్టర్‌ను ఫేస్ బుక్ పేజ్ లో, ట్విట్టర్ లో అక్షయ్ షేర్ చేశారు. ఈ సందర్భంగా 'కువైట్‌లో ఘటనలో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు.. ఒక యథార్థ గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఇలాంటి సినిమాలో భాగం కావడం' తనకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్ చేశారు. కాగా కువైట్‌లో 1990లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఎయిర్ లిఫ్ట్'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లంచ్ బాక్స్ ఫేం హీరోయిన్ నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్ మీనన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే బుధవారం చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అక్షయ్ తెలిపారు. అక్షయ్‌తో పాటు ఈ చిత్ర సహ నిర్మాత నిఖిల్ అద్వానీ కూడా 1990 నాటి దుర్ఘటను మళ్లీ తలచుకోవడం విచారకరమని ట్విట్ చేశారు. ఏ యుద్ధంలోనైనా అమాయక ప్రజలే బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.