'నా చివరి అంకం వరకు ఇలాగే నటిస్తా..' | I enjoy doing both serious and comic roles: Akshay Kumar | Sakshi
Sakshi News home page

'నా చివరి అంకం వరకు ఇలాగే నటిస్తా..'

Published Mon, May 2 2016 2:35 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

'నా చివరి అంకం వరకు ఇలాగే నటిస్తా..'

'నా చివరి అంకం వరకు ఇలాగే నటిస్తా..'

ముంబయి: ఎయిర్ లిఫ్ట్.. సింగ్ ఈజ్ బ్లింగ్ ఈ రెండు కూడా భిన్నమైన చిత్రాలు. ఒకటి ఎంతో సీరియస్ కంటెంట్ ఉన్న కథ అయితే మరొకటీ పూర్తి హాస్యభరిత అంశంతో కూడిన అంశం. అలాగే, రుస్తుం.. హౌజ్ ఫుల్ 3.. ఇవి కూడా పూర్తిగా భిన్నమైన చిత్రాలే.. ఈ చిత్రాలన్నింటిలో కూడా నటించిన హీరో అక్షయ్ కుమార్. ఆయన ఇలా ఎందుకు సీరియస్, కామెడీ చిత్రాల్లో వరుసగా నటిస్తున్నారని ప్రశ్నిస్తే.. అలా చేయడం తనకు ఎంతో సరదాను ఇస్తుంటుందని చెప్తున్నారు.

హౌజ్ పుల్ చిత్ర విశేషాల గురించి తెలిపారు. తాను ఈ చిత్రంలో స్ప్లిట్ పర్సనాలటీ క్యారెక్టర్ తో నటించానని, అలా అని స్ప్లిట్ పర్సనాలిటీ స్టోరీలను చదవలేదని చెప్పారు. ఇది కేవలం ఒక కామెడీ చిత్రమే అన్నారు. ఈ చిత్రంలో తాను ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నానని, డిస్ససోయేట్ ఐడెంటిటీ డిసార్డర్(డిడ్)తో బాధపడుతుంటానని తెలిపారు. కామెడీ చిత్రాలు, సీరియస్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో తాను చివరివరకు నటిస్తూనే ఉంటానని చెప్పారు. రితేశ్ దేశ్ ముఖ్ తో నటించడం కొత్తగా చెప్పడానికి ఏం లేదని, అయితే, ఈ చిత్రంలో కొత్తగా అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పారు. ఆయన ఒక జెంటిల్ మేన్ అని ఆయనతో నటించడం ఇష్టంగా భావిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement