'మీ ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి' | Akshay Kumar humbled by 'Airlift' response | Sakshi
Sakshi News home page

'మీ ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి'

Published Sun, Jan 24 2016 7:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'మీ ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి' - Sakshi

'మీ ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి'

న్యూఢిల్లీ: తన తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్‌' సూపర్‌హిట్ కావడంతో యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 1990నాటి కువైట్‌ యుద్ధ నేపథ్యంలో దర్శకుడు రాజాకృష్ణ మీనన్ తెరకెక్కించిన 'ఎయిర్‌లిఫ్ట్‌' శుక్రవారం (22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజే రూ. 12 కోట్లు వసూలు చేసింది.

సినిమా హిట్ టాక్‌ నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'ఎయిర్‌లిఫ్ట్ పట్ల మీరు చూపుతున్న ఆదరణ, ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ స్పందనకు ఎంతో వినమ్రంగా స్వీకరిస్తున్నా' అని అక్షయ్‌కుమార్ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. 'ఎయిర్‌లిఫ్ట్‌'లో అక్షయ్‌ పక్కన హీరోయిన్‌గా నటించిన నమ్రత్‌ కౌర్‌ కూడా అభిమానులకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపింది. 'మీ ప్రేమకు ఎంతో కృతజ్ఞురాలిని. అద్భుతమైన ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా' అని ఈ భామ ట్విట్టర్‌లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement