ఏడాదిలో ఎన్నో ఎదుర్కొన్నా: హీరోయిన్ | I have been up to a lot in the last year, says Nimrat | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఎన్నో ఎదుర్కొన్నా: హీరోయిన్

Published Tue, Sep 13 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

ఏడాదిలో ఎన్నో ఎదుర్కొన్నా: హీరోయిన్

ఏడాదిలో ఎన్నో ఎదుర్కొన్నా: హీరోయిన్

గత ఏడాది 'ఎయిర్ లిఫ్ట్' సినిమాతో ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది నిమ్రత్ కౌర్. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా ఆమె కనబర్చిన అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అయినా, ఇప్పటివరకు నిమ్రత్ మరో బాలీవుడ్ చిత్రాన్ని ఒప్పుకోలేదు.  

ఈ ఏడాదికాలంలో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏమిటంటే.. ఈ ముద్దుగుమ్మ చాలా విషయాలే చెప్పింది. ప్రస్తుతం హాలీవుడ్ సీరియల్ 'వేవార్డ్ పైన్స్' షూటింగ్ కోసం కెనడాలోని వాంకోవర్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో ముచ్చటించింది. గడిచిన ఏడాదికాలంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తాను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందని, వాటన్నింటి వల్ల ఊపరి సలుపనంత బిజీగా ఉండిపోయానని చెప్పింది. త్వరలోనే మళ్లీ బాలీవుడ్ కు తిరిగి రాబోతున్నట్టు ప్రకటించింది.

'గడిచిన ఏడాదికాలంలో నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఎంతో ఉక్కిరిబిక్కిరిగా ఇది గడిచిపోయింది. జనవరిలో 'ఎయిర్ లిఫ్ట్' విడుదల అయింది. ఆ వెంటనే ఒకదాని వెంట ఒకటిగా చాలా విషయాలు జరిగిపోయాయి. ఇవన్నీ ఇలా ఉండగానే మా చెల్లి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి సందండి, సంబరంలో మునిగితేలుతుండగానే వాంకోవర్ నుంచి సీరియల్ ఆఫర్ వచ్చింది' అని నిమ్రత్ పేర్కొంది.

'లాంచ్ బాక్స్'లో నిమ్రత్ నటనను చూసి ముచ్చటపడ్డ అమెరికన్ టీవీ నిర్మాతలు ఆమెకు 'హోమ్ ల్యాండ్' సీరియల్ లో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ పాత్రను ఇచ్చారు. ఆ పాత్రలోనూ రాణించడంతో మనోజ్ నైట్ శ్యామలన్ రూపొందిస్తున్న టీవీ సిరీస్ 'వేవార్డ్ పైన్స్'లో అవకాశం వచ్చింది. ఇలా హాలీవుడ్ సీరియళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్న నిమ్రత్ త్వరలోనే బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తానని చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement