
కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి పర్వదినాన్ని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జరుపుకుంది. ఈ శుభ సందర్భంగా స్వయంగా ఇంట్లోనే కడ ప్రసాదం(హల్వా) తయారు చేసి గురుద్వారాలో ప్రార్థనలు, నివేదన అనంతరం పంచిపెట్టింది. కుటుంబంలో తరతరాలుగా కడ ప్రసాదం తయారు చేస్తున్న వైనాన్ని వివరించి, ఈ రెసిపీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గురుద్వారాలో పూజల తరువాత మీడియాకు ప్రసాదాన్ని పంచిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
గురునానక్ జయంతి సందర్భంగా ప్రసాదం హల్వాను ఎలా తయారు చేయాలో దశలవారీగా నిమ్రత్ కౌర్ వెల్లడించింది. ఈ ప్రసాదం తయారు చేయడం తన తల్లి దగ్గరనుంచి నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే తన తాతగారు చాలా ఏళ్లు గురుద్వారాలో హల్వా తయారు చేసేవారనీ, ఆయన్నుంచి అమ్మ , అమ్మనుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది.

కాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ అభిషేక్ బచ్చన్‌తో ఎఫైర్ ఉందనే పుకార్ల మధ్య గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్య సమస్యలకు నిమ్రత్ కౌర్‌తో ఎఫైర్ ఒక కారణమని ఊహాగానాలు జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఊహిస్తున్నాయి. ఈ వివాదాలను, ఆరోపణల ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా నిమ్రత్ కౌర్ తన పని తాను చేసుకుపోతోంది.
;
Comments
Please login to add a commentAdd a comment