Guru Nanak Jayanti
-
HYD: భక్తిశ్రద్ధలతో నగర్ కీర్తన ర్యాలీ (ఫొటోలు)
-
3 వ్యవసాయ చట్టాలు రద్దు
న్యూఢిల్లీ: రైతన్నల డిమాండ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్టు దిగొచ్చారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్ల డించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఒక వర్గం రైతులే వ్యతిరేకించారు ‘‘రైతులతోపాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చాం. దేశంలోని రైతులు.. ప్రధానంగా సన్నకారు రైతులు గరిష్టంగా లబ్ధి పొందుతారని ఆశించాం. కానీ, ఈ చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించలేకపోయాం. అనుమానాలను నివృత్తి చేసేందుకు పవిత్ర హృదయంలో మొదలుపెట్టిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొవ్వొత్తి కాంతి లాంటి స్పష్టమైన నిజాన్ని అర్థమయ్యేలా వివరించలేకపోయాం. సాగు చట్టాల వ్యవహారంలో దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. వాస్తవానికి ఎన్నెన్నో రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన దృక్పథం ఉన్న రైతులు కొత్త సాగు చట్టాలకు అండగా నిలిచారు. ఒక వర్గం రైతన్నలు మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదేపదే ప్రయత్నించాం. చట్టాల అమలును రెండేళ్లపాటు నిలిపివేస్తామని చెప్పాం. అభ్యంతరాలున్న అంశాల్లో సవరణలు చేస్తామని సూచించాం. సుప్రీంకోర్టు కూడా సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. మనమంతా కలిసి ముందుకు సాగుదాం నేడు గురు నానక్ జన్మించిన రోజు. ఒకరిపై నిందలు వేయడానికి ఇది సందర్భం కాదు. దేశ ప్రజలను నేను చెప్పేది ఏమిటంటే 3 సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. గురుపూరబ్ పర్వదినాన్ని పురస్కరించుకొని నా విన్నపాన్ని మన్నించి, రైతు సోదరులు ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలి. కుటుంబాలను కలుసుకోవాలి. జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలి. మనమంతా మళ్లీ కొత్తగా ముందుకు సాగుదాం. పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు దేశంలో రైతాంగం సాధికారతే లక్ష్యంగా వ్యవసా య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు చేపట్టబోతున్నాం. జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. ఈ తరహా వ్యవసాయంలో సహజ ఎరువులు, స్థానిక విత్తనాలే ఉపయోగిస్తారు. మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు తీసుకొస్తాం. కనీస మద్దతు ధర(ఎం ఎస్పీ)ను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ఎంఎస్పీతోపాటు జీరో బడ్జెట్ ఆధారిత సాగుపై నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారు. రికార్డు స్థాయిలో సేకరణ కేంద్రాలు ఐదు దశాబ్దాల నా ప్రజాజీవితంలో అన్నదాతల వెతలను దగ్గరగా గమనిస్తూనే ఉన్నాను. వారికి ఎదురవుతున్న సవాళ్లు, కష్టనష్టాలు నాకు తెలుసు. మూడు కొత్త సాగు చట్టాల లక్ష్యం ఏమిటంటే రైతులను బాగు చేయడమే. ప్రధానంగా సన్నకారు రైతులకు సాధికారత కల్పించాలని ఆశించాం. 2014లో ‘ప్రధాన సేవకుడి’గా ప్రజలకు సేవలు చేసుకునేందుకు దేశం నాకు అవకాశం ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అప్పటినుంచే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. సన్నకారు రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఏకంగా ఐదు రెట్లు పెంచేశాం. ప్రతిఏటా రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన ధర దక్కేలా చర్యలు తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయాలను బలోపేతం చేశాం. వెయ్యికి పైగా మండీలను (వ్యవసాయ మార్కెట్లు) ఈ–నామ్(ఎలక్ట్రానిక్–నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)తో అనుసంధానించాం. పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకోవడానికి రైతులకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలను మెరుగు పర్చడానికి కోట్లాది రూపాయలు వెచ్చించాం. పంటలకు కనీస మద్దతు ధరను పెంచడమే కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటల సేకరణ కేంద్రాల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచాం. దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని సేకరణ కేంద్రాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేవు. రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం తన కృషిని చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉంటుంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. -
భక్తి శ్రద్ధలతో ‘ప్రకాష్ ఉత్సవ్’
-
గురునానక్ జయంతి వేడుకల్లో సీఎం జగన్
-
గురునానక్ జయంతి వేడుకల్లో సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గురునానక్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో గురునానక్ 551వ జయంతి వేడుకలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ వేడుకల్లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని ఆవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ పాల్గొన్నారు. (చదవండి: చంద్రబాబు యాక్టర్ అయితే..: సీఎం జగన్) -
నేడు గురునానక్ జయంతి
నేడు గురుపూరబ్ సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు, ఇతరులు గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలో గురునానక్ జయంతిని పురస్కరించుకుంటారు. ఈరోజు గురుద్వారాలలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తారు. ఇది 48 గంటలపాటు నిరంతరంగా సాగుతుంది. దీనిని అఖండపఠనం అంటారు. జయంతి నాడు ఉదయాన్నే కీర్తనలతో, ప్రార్థనలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. చదవండి: (భారత రాజకీయాల్లో లైలా, మజ్నూ..) గురు గ్రంథసాహిబ్‌ను పల్కిలో చుట్టి, పూలతో అలంకరించి రథంలో తీసుకెళ్తారు. ఈ సంవత్సరం 551 వ గురునానక్ జయంతిని జరపుకుంటున్నారు. గురునానక్ దేవ్‌జీ కి సబంధించిన ఫోటోలు, సందేశాలు వాట్సాప్ , ఫేస్బుక్, ట్విట్టర్లలో పంచుకుంటున్నారు. ఈ సందర్బంగా మీరు, మీకుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
సీఎం జగన్‌తో కియా మోటర్స్ ప్రనిధులు భేటీ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కియా మోటర్స్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కలిసిన వారిలో కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హ్యూస్ షిమ్, కియా మోటార్స్ లీగల్ హెచ్‌వోడీ జుడేలి, ప్రిన్సిపల్ అడ్వైజర్ సోమశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్‌ను కలిసిన శ్రీగురుసింగ్ సహధర్మ ప్రచార కమిటీ ప్రతినిధులు సాక్షి,అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విజయవాడ శ్రీ గురు సింగ్ సహ ధర్మ ప్రచార కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ప్రచార కమిటీ ప్రతినిధులు.. గురునానక్ జయంతి సందర్భంగా ఈ నెల 30న నిర్వహించే గురుపూరవ్ ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇచార్జ్ దేవినేని అవినాష్, స్త్రీ సత్ సంగమ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిఖ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ హర్మహిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్ జిత్ సింగ్, పింకి హర్విందర్ సింగ్ తదితరులు ఉన్నారు. -
గురునానక్ జయంతి వేడుకల్లో కేటీఆర్, తలసాని
-
మార్కెట్లకు నేడు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు (మంగళవారం) సెలవు. గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. గురు నానక్ 550 జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇ) నవంబర్ 12 న మూసివేయబడతాయి. బులియన్‌తో సహా, ఫారెక్స్ , కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లలో కూడా వాణిజ్య కార్యకలాపాలు ఉండవు. బుధవారం తిరిగి యధాతథంగా పనిచేస్తాయి. కాగా నిన్న (నవంబర్ 11) సెన్సెక్స్ 21.47 పాయింట్ల స్వల్ప లాభంతో 40,345.08 వద్ద ముగియగా, నిఫ్టీ 5.30 పాయింట్లు పెరిగి 11,913.50 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
తీర్పుకిది సరైన సమయం కాదు: పాక్
ఇస్లామాబాద్: ఓ వైపు కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ చర్యతో తాను బాధకు గురయ్యానని చెప్పారు. సంతోషకరమైన సమయంలో ఇలాంటి సున్నిత అంశంపై తీర్పు సరి కాదని అన్నారు. సిక్కుల మత గురువైన గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరికొంత కాలం ఆగి తీర్పు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. భారతీయ ముస్లింలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, తాజా తీర్పుతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారని అన్నారు. పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఈ తీర్పును అన్యాయపు తీర్పుగా అభివర్ణించారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ అసిస్టెంట్ ఫిర్దౌస్ ఆషిఖ్ అవాన్ సుప్రీంకోర్టును కేంద్రం నడుపుతోందంటూ వ్యాఖ్యానిం చారు. ఓ వైపు పాక్ కర్తార్‌పూర్‌తో మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తుంటే, భారత్ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు. -
కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
డేరాబాబా నానక్ (గురుదాస్‌పూర్)/ కర్తార్‌పూర్ (పాకిస్తాన్): పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సతీసమేతంగా వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌తో ప్రధాని మోదీ ముచ్చటించారు. అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్‌ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు. ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం నాకు లభించిన వరం. ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈ ప్రాంతానికి రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా’అని తెలిపారు. నానక్ జీవితం సిక్కులకు మాత్రమే కాదు మానవాళికే స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కర్తార్‌పూర్‌లో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన సుమారు 12 వేల మంది సిక్కు యాత్రికుల సమక్షంలో కారిడార్ ప్రారంభించారు. భారత్ నుంచి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు కుశల ప్రశ్నలు అడిగారు. -
నేడే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కానుంది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పాక్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న డేరాబాబా నానక్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో యాత్రికులకు ఆధునిక వసతులు కల్పించారు. పూర్తి ఎయిర్ కండిషన్‌తో కూడిన ఈ భవనంలో రోజుకు 5వేల మంది యాత్రికులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు వీలుగా 50 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. గురునానక్ తన చివరి 14 ఏళ్లు గడిపిన గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలిపే 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా ప్రతి రోజు 5వేల మంది భారత్ యాత్రికులు సందర్శించేందుకు వీలుంటుంది. మొదటి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు పంజాబ్‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కాగా, కర్తార్‌పూర్ వెళ్లే సీనియర్ల సిటిజన్లకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. డేరాబాబా నానక్, సుల్తాన్పూర్ లోథి గురుద్వారాల వద్ద గురునానక్ జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పూలతోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు వసూలు చేస్తాం: పాక్ కారిడార్ ప్రారంభం కానున్న ఈనెల 9వ తేదీ, గురు నానక్ జయంతి రోజైన 12వ తేదీన తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఒక్కో యాత్రికుడి నుంచి సుమారు రూ.1,400 (20 డాలర్లు) వసూలు చేయనున్నట్లు పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది. -
గురునానక్ జయంతి..సిక్కుల విన్యాసాలు
-
భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన కపట బుద్ధిని ప్రదర్శించింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమతో చర్చలు జరిపేందుకు భారత్ సుముఖంగా లేనట్లైతే కర్తార్‌పూర్ కారిడార్ విషయాన్ని మర్చిపోవాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది... పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మాట్లాడుతూ.. ‘భారత్‌తో చర్చలకు సిద్ధమని మేము చెప్పాం. అయితే ఇంతవరకు వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. అంతేకాకుండా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవాలని భావించాం. కానీ ప్రస్తుతం చర్చల విషయమై భారత్ తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంది. ఒకవేళ వాళ్లకి మాతో చర్చలు జరపడం ఇష్టం లేకపోయినట్లైతే ఈ విషయాన్ని మర్చిపోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ సాహెబ్ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారాలో గడిపారు. 1539లో అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్(భారత్- పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది) గ్రామంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గురునానక్ 550వ జయంతి వేడుకల్లో భాగంగా కర్తార్‌పూర్ గురుద్వార మార్గాన్ని తెరవాలని భావిస్తున్నట్లు పాక్ అధికారుల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అదేవిధంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంతో భారత్‌లోని సిక్కులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ పాక్ విదేశాంగ అధికారుల పద్ధతి చూస్తుంటే వారి ఆనందం ఆవిరయ్యేట్టుగా కన్పిస్తోంది. -
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై: ఇండియన్ స్టాక్స్, బాండ్స్, కరెన్సీ మార్కెట్లు నేడు సెలవును పాటించనున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెలవు చేపట్టనున్నట్టు ప్రకటించాయి. తిరిగి మంగళవారం మార్కెట్లు యథాతథంగా ట్రేడింగ్ కార్యకాలాపాలు నిర్వహించనున్నాయి. కాగ, శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 2.69 శాతం పడిపోయి 8,290.30గా, సెన్సెక్స్ 2.54 శాతం కిందకి జారి 26,818.82గా నమోదయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా క్షీణించి, 67.25/26గా ముగిసింది. -
సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ♦ ప్రభుత్వ సెలవు దినంగా గురునానక్ జయంతి ప్రకటన హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. సిక్కుల గురువు గురునానక్‌దేవ్‌జీ మహారాజ్ 545(ప్రకాష్ ఉత్సవ్)వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అఫ్జల్‌గంజ్ అశోక్బజార్లోని గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విశాల్దివాన్(ఆధ్యాత్మిక సభ)లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,మూడు వందల ఏళ్లుగా నగరంతో అనుబంధం ఉన్న సిక్కులు సామూహిక ప్రార్థనలు నిర్వహిం చుకునేందుకు, సభలు, సమావేశాల ఏర్పాటుకు కమ్యూనిటీ భవనం, ప్రార్ధనామందిరం కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులను అందజేయనున్నట్లు వెల్లడిం చా రు. దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద గురుద్వారా నగరంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెలవు దినంగా నానక్ జయంతి గురునానక్ జయంతి రోజును ఇక నుంచి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.అపారమైన ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో, కష్టపడేతత్వం గల సిక్కుల జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం కేసిఆర్ తన కుటుంబం తరపున రూ.1.16 లక్షల చెక్కును గురుద్వారా నిర్మాణం నిమిత్తం నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు 30వేలమంది సిక్కులు కుటుంబాల సమేతంగా పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిక్కు మతగురువులు భక్తి, భజన కీర్తనలు ఆలపించడంతో పాటు గురునానక్ దేవ్‌జీ మహరాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలను, సందేశాలను బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ, అల్పాహారం, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గురుద్వారాల ఛైర్మన్ గురుచరణసింగ్బగ్గా, టీఆర్ఎస్ పార్టీ గోషామహల్, అంబర్పేట్ నియోజకవర్గాల ఇంచార్జిలు ప్రేమ్‌కుమార్‌ధూత్, ఎడ్ల సుధాకర్‌రెడ్డి, అశోక్‌బజార్ గురుద్వారా శ్రీ గురుసింగ్సభ అధ్యక్షుడు కుల్దీప్సింగ్బగ్గా, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు బల్దేవ్సింగ్ బగ్గా, కార్యదర్శులు ఇంద్రజిత్‌సింగ్ టుటేజా, అవతార్‌సింగ్ కనూజా, గురుద్వారాల ప్రబంధక్ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో సిక్కుసోదరులు పాల్గొన్నారు.