సీఎం జగన్‌తో కియా మోటర్స్‌ ప్రనిధులు భేటీ | Kia Motors Officials Meet With CM Jagan | Sakshi

సీఎం జగన్‌ను కలిసిన కియా మోటార్స్ ప్రతినిధులు

Nov 25 2020 9:22 PM | Updated on Nov 25 2020 9:38 PM

Kia Motors Officials Meet With CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కియా మోటర్స్‌ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కలిసిన వారిలో కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హ్యూస్ షిమ్‌, కియా మోటార్స్ లీగల్ హెచ్‌వోడీ జుడేలి, ప్రిన్సిపల్ అడ్వైజర్ సోమశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

సీఎం జగన్‌ను కలిసిన  శ్రీగురుసింగ్ సహధర్మ ప్రచార కమిటీ ప్రతినిధులు
సాక్షి,అమరావతి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విజయవాడ శ్రీ గురు సింగ్ సహ ధర్మ ప్రచార కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ప్రచార కమిటీ ప్రతినిధులు..  గురునానక్‌ జయంతి సందర్భంగా ఈ నెల 30న నిర్వహించే గురుపూరవ్‌ ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. విజయవాడ గురునానక్‌ కాలనీలోని గురుద్వార్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇచార్జ్‌ దేవినేని అవినాష్‌, స్త్రీ సత్ సంగమ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిఖ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ హర్మహిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్ జిత్ సింగ్‌, పింకి హర్విందర్ సింగ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement