సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి/పెనుకొండ: కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడంపై కియా ఇండియా మేనేజ్‌మెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్ తన బృందంతో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.
చదవండి: ఇవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగం: గౌతమ్‌రెడ్డి
ఏపీ ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న ఉత్పత్తి సామర్థ్యానికి మించి కార్లను తయారుచేసి, మార్కెటింగ్ చేయగలిగినట్లు కియా బృందం సీఎంకి వివరించింది. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం జగన్ చర్చించారు. కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్‌ని సీఎం జగన్ సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ, లీగల్, కార్పొరేట్ అఫైర్స్ హెచ్‌వోడీలు జూడ్ లీ, యాంగ్ గిల్ మా, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ టి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: AP: గ్రామ,వార్డు మహిళా పోలీసులకు వరం.. సీఐ వరకు పదోన్నతి..!
Comments
Please login to add a commentAdd a comment