Kia Motors
-
కియా రీకాల్.. వందలాది ఈవీ6 కార్లు వెనక్కి
ప్రముఖ వాహన తయారీ సంస్థ.. కియా మోటార్స్ (Kia Motors) తన 'ఈవీ6' (EV6) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన మొత్తం 1,380 యూనిట్లలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లలో.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో 12వీ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే లోపం కారణంగా రీకాల్ పరకటించింది. ఈ సమస్య కారణంగా.. 2024లో కూడా కంపెనీ 1138 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు రీకాల్ జారీచేసింది.ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లోని సాఫ్ట్వేర్ అప్డేట్ 12వీ బ్యాటరీ ఛార్జింగ్.. పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కారులోని లైట్స్, వైపర్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటికి శక్తిని ఇస్తుంది. కార్లలో ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. అయితే సంబంధిత వాహనాల యజమానులను నేరుగా సంప్రదించి వాటిని అప్డేట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?ప్రభావిత వాహనాల కస్టమర్లు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి.. సంబంధిత కియా డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు, లేదా ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చు. కియా రీకాల్ గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కు కూడా సమాచారం అందించింది. -
80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. యూఎస్ఏలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ముందు ప్రయాణీకుల సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల.. ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగానే కియా అమెరికా రీకాల్ ప్రకటించింది.సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కి దాఖలు చేసిన పత్రాలలో కియా అమెరికా స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి.. వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతే కాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యజమానులకు మార్చిలో ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది.ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోకి కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
11 నెలల్లో.. లక్షమంది కొన్న కొరియన్ బ్రాండ్ కారు ఇదే!
కియా మోటార్స్ (Kia Motors) 2024 జనవరిలో కొత్త 'సోనెట్' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన కేవలం 11 నెలల్లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నవంబర్ 2024 వరకు ఈ కారు అమ్మకాలు 1,03,353 యూనిట్లు.కియా సోనెట్ (Kia Sonet) మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ మోడల్స్ 76 శాతం కాగా.. 24 శాతం మంది డీజిల్ కార్లను కొనుగోలు చేసారు. మరో 34 శాతం మంది ఆటోమాటిక్ ఐఎంటీ వేరియంట్స్ కొనుగోలు చేశారు. కాగా సోనెట్ కారును కియా కంపెనీ మూడు ఇంజిన్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.సోనెట్ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటివి పొందుతుంది. వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెవెల్ 1 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 79 శాతం మంది సన్‌రూఫ్‌లతో కూడిన సోనెట్ వేరియంట్లను కొనుగోలు చేశారు.టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue), మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కియా సోనెట్ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.77 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!
మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, స్కోడా & నిస్సాన్ వంటి ప్రధాన వాహన తయారీదారులు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో స్కోడా కైలాక్, అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.స్కోడా కైలాక్స్కోడా కంపెనీ 2025 మార్చిలో కైలాక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది MQB A0 IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారువుతోంది. కాబట్టి కుషాక్లోని చాలా ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 1.0 లీ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూహ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ మోడల్ 2025 మధ్య నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది చూడటానికి సాధారణ వెన్యూ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే మెకానికల్ అప్డేట్స్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.కియా సిరోస్కియా కంపెనీ సిరోస్ కారును 2025 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటూ.. సోనెట్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్‌రూఫ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్ఇప్పటికే రెండు లక్షల అమ్మకాలను సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. 2025 మధ్య నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పొందనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనితీరు దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. -
ఏడాది తర్వాత మార్కెట్లో లాంచ్ అయిన కారు.. ధర ఎంతంటే?
ఇండియన్ మార్కెట్లో నాల్గవ తరం కియా కార్నివాల్ లాంచ్ అయింది. దీని ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది కేవలం డీజిల్ ఇంజన్‌తో 7 సీటర్‌గా మాత్రమే లభిస్తుంది. ఈ కారు ప్రస్తుతం సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశానికి దిగుమతి అవుతుంది.సరికొత్త కియా కార్నివాల్ భారతదేశంలో తయారైతే ధర కొంత తగ్గుతుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్కు ప్రత్యర్థిగా ఉన్న కార్నివాల్.. కోసం కంపెనీ రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు దాని మునుపటి మోడల్ కంటే చాలా హుందాగా ఉంటుంది.టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు 18 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్న ఈ కారు ఎల్ఈడీ టెయిల్-లైట్స్ పొందుతుంది. ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.2024 కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్లను పొందుతుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ఏడీఏఎస్ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవేకొత్త కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 441 Nm టార్క్, 193 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కంపెనీ ఈ కారుకు మూడు సంవత్సరాల ఫ్రీ మెయినెనెన్స్, వారంటీ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివి అందిస్తుంది. -
నాలుగేళ్లలో.. ఈ కారును 4.5 లక్షల మంది కొనేశారు
నాలుగు సంవత్సరాల క్రితం దేశీయ విఫణిలో విడుదలైన కియా ఇండియా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్' అమ్మకాలు ఏకంగా నాలుగు లక్షలు దాటింది. ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 3,57,743 లక్షల విక్రయాలు, ఎగుమతులు 92,069 యూనిట్లు నమోదైనట్లు తెలుస్తోంది.మొత్తం నాలుగేళ్లలో కియా సోనెట్ సేల్స్ 4,49,812 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో సోనెట్ విక్రయాలు 63,717 యూనిట్లు, కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో 44,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు, కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఎగుమతుల విషయానికి వస్తే.. కియా సోనెట్ విక్రయాలు 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగినట్లు (30,574 యూనిట్లు) తెలుస్తోంది. ప్రారంభంలో ఎగుమతులు నెమ్మదిగా సాగి ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఎస్యూవీను ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగటం వల్ల ఈ అమ్మకాలు సాధ్యమయ్యాయి. -
ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్
కియా మోటార్స్ (Kia Motors) దేశంలో తన కార్నివాల్ ఎంపీవీని నిలిపివేసిన సుమారు సంవత్సరం తరువాత మళ్ళీ సరికొత్త కారుగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.కియా కంపెనీ తన కొత్త తరం కార్నివాల్ కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 3న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.త్వరలో లాంచ్ కానున్న సరికొత్త కిస్ కార్నివాల్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ కొన్ని అప్డేట్స్ పొంది ఉండటం చూడవచ్చు. వర్టికల్ హెడ్‌లైట్స్, టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో లైట్‌బార్ ద్వారా కనెక్ట్ అయిన స్లిమ్ వర్టికల్ టెయిల్ల్యాంప్ ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయంకొత్త కియా కార్నివాల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు టచ్‌స్క్రీన్, డ్యూయల్ సన్‌రూఫ్, 12 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ పొందుతుంది. వెనుక సీటు ప్రయాణికులు పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్లు, లెగ్ రెస్ట్లు, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన మధ్య వరుస సీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. -
కొరియన్ బ్రాండ్ కీలక నిర్ణయం.. ఇండియాలో 1138 కార్లు వెనక్కి
భారతీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. తన ఈవీ6 కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? ఎన్ని కార్లపై ఈ ప్రభావం చూపుతుంది అనే విషయాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..కియా ఈవీ6 కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఏర్పడిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇది 1138 యూనిట్లపై ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి కంపెనీ స్వచ్చందంగానే రీకాల్ ప్రకటించింది. ఐసీసీయూ లోపం 12 వోల్ట్స్ బ్యాటరీ పనితీరు మీద ప్రభావం చూపుతుంది.2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన కియా ఈవీ6 కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోపాన్ని సరిచేయడానికి కంపెనీ కారులోని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. దీనికోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కంపెనీ త్వరలోనే కస్టమర్లకు ఈ సందేశాన్ని పంపిస్తుంది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్‌లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్‌కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. -
భారత్‌లో విడుదలైన లేటెస్ట్ కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్స్ విడుదలయ్యాయి. ఈ ఆధునిక ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా ఆల్ట్రోజ్.. దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మార్కెట్లో XM, XM(S) అనే రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 6.90 లక్షలు, రూ. 7.35 లక్షలు. ఆల్టోజ్ కొత్త వేరియంట్స్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్ మరియు వీల్ కవర్‌తో కూడిన 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున అదే పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సెల్టోస్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధరలు రూ. 10.90 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20 లక్షల (ధరలు ఎక్స్,షోరూమ్,ఢిల్లీ) వరకు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ అప్డేటెడ్ మోడల్ కోసం 13,424 బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. (ఇదీ చదవండి: భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హెడ్‌కౌంట్.. గడ్డు కాలంలో ఐటీ ఉద్యోగులు!) డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా ఇది చాలా ఆధునికంగా ఉంటుంది. కాగా ఇది కొత్త కలర్ ఆప్షన్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది పెట్రోల్, టర్బో డీజిల్ వంటి ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. కావున పనితీరు పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. -
అదరగొట్టిన కియా.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా దేశీయంగా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో 2019 ఆగస్ట్ నుంచి తయారీ ప్రారంభం అయింది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 3 లక్షల యూనిట్లు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) అనంత ప్లాంటు నుంచి తొలుత సెల్టోస్ మోడల్ కారు రోడ్డెక్కింది. ఇప్పటి వరకు 5.3 లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. కాగా, కియా ఇండియా కొత్త సెల్టోస్‌ను గురువారం ప్రవేశపెట్టింది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం. -
ఆధునిక హంగులతో కొత్త సెల్టోస్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్ సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లో బాడీ కలర్ ఇన్సర్ట్లు, గ్రిల్‌లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లతో రీడిజైన్ హెడ్లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్స్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) సేఫ్టీ ఫీచర్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్లిఫ్ట్లోఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) పవర్‌ట్రెయిన్ 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. -
త్వరలో విడుదలకానున్న కొత్త కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?) హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్‌లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు.. 116 హార్స్పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి. -
కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. డిజైన్ సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫీచర్స్ 2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & స్పెసిఫికేషన్స్ కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. -
రికార్డు స్థాయిలో కియా ఎగుమతులు - ఏకంగా..
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా 2 లక్షల ఎగుమతుల మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 95 దేశాలకు కార్లను ఎగుమతి చేసినట్లు సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్యం, మెక్సికో తదితర ప్రాంతాల నుంచి భారీ డిమాండ్ నెలకొందని తెలిపింది. ఎగుమతుల్లో సెల్టోస్ కార్లు అత్యధికంగా 1,35,885 యూనిట్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. 2023 మార్చి త్రైమాసికంలో ఎగుమతులు 22% పెరిగినట్లు వివరించింది. -
మార్కెట్లో కియా నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ ఇప్పుడు 'లగ్జరీ (ఓ)' వెర్షన్ రూపంలో విడుదలైంది. ఈ లేటెస్ట్ కారు చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ధరలు, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ధరలు రూ. 17 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు రియల్ డ్రైవ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది, కావున డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!) కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ మాన్యువల్ వెర్షన్ అమ్మకానికి లేదు, ఇది కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎంచుకున్న డ్రైవ్ మోడ్ వంటివి మారుతాయి. ఇప్పటికే ఉన్న లగ్జరీ ట్రిమ్ మాత్రమే 6 సీటర్‌గా లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్: కియా కారెన్స్ లగ్జరీ (ఓ) డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్స్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో లెదర్డ్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలలో కూల్డ్ కప్హోల్డర్లు, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు నాలుగు స్పీకర్లు, ఐదు USB C-టైప్ ఛార్జర్ వంటివి పొందుతుంది. అన్ని సీట్లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు కలిగి ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్: కొత్త కియా కారెన్స్ ఇతర అన్ని మోడల్స్ మాదిరిగానే డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి కావున వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రత లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ట్రిమ్ కేవలం ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఆప్షన్ లేదు. కావున ఇందులోని 1.5 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ DCTతో 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి 116 హెచ్‌పి పవర్ అందిస్తుంది. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా కారెన్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా కారెన్స్ ఎక్కువ అయినప్పటికీ ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్ లభిస్తాయి. -
2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి,ముంబై: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్. కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనం ఈవీ 6 2023 వెర్షన్ బుకింగ్‌లను షురూ చేస్తోంది. ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. 2023 ఈవీ6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీటీ లైన్ , జీటీ GT లైన్ AWD. వీటి ధరలు వరుసగా రూ. 60.95 లక్షలు, రూ. వరుసగా 65.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) గత ఏడాది తమ పాపులర్ కారును అందుకోలోలేకపోయిన వారి కోసం తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించామనీ, మార్కెట్లో అద్భుతమైన పనితీరుతో ఈవీ6 ప్రీమియం ఈవీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతుందనే విశ్వసాన్ని కియా ఇండియా సీఎండీ తే జిన్ పార్క్ ప్రకటించారు. 2022లో 432 యూనిట్ల విక్రయించిన కంపెనీ, 150 kW హై-స్పీడ్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం ఉన్న 15 డీలర్‌షిప్‌ల నుండి మొత్తం 60 అవుట్లెట్లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. (2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే) -
Kia Carnival facelift: కియా మోటార్స్ నుంచి కొత్త కారు.. భారత్‌కి వస్తుందా?
భారతదేశంలో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' త్వరలోనే మరిన్ని కొత్త హంగులతో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాల్గవ తరం కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. నాల్గవ తరం కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభం కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ & ఫీచర్స్: కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 మాదిరిగా ఉంటుంది. కావున వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్లో టెయిల్ లాంప్ కొత్తగా ఉంది. కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ వెల్లడి కాలేదు. నాల్గవ తరం కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది, కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు, రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్: కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ గురించి అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్, 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంది. (ఇదీ చదవండి: Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..) లాంచ్ టైమ్: కియా కార్నివాల్‌ను కంపెనీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది, అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు. అంచనా ధర: కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది విడుదలకానున్న కియా కేఏ4 ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవవుతాయి. -
2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' భారతీయ మార్కెట్లో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేటెడ్ కారెన్స్ విడుదల చేసింది. ఇది అప్డేటెడ్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: అప్డేటెడ్ కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే టర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలు దాని మునుపటి మోడల్ కంటే రూ. 50,000, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000 ఎక్కువ. ఇంజిన్ ఆప్సన్స్: కొత్త కియా కారెన్స్ E20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్డ్) కంప్లైంట్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ రాబోయే BS6 ఫేజ్ 2 & RDE ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. (ఇదీ చదవండి: మారుతి బ్రెజ్జా సిఎన్జి కావాలా.. ఇప్పుడే బుక్ చేసుకోండి!) డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్: 2023 కియా కారెన్స్ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 4.2 ఇంచెస్ కలర్ MIDతో 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్: ఆధునిక కాలంలో డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలను కొనుగోలుచేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆస్కతి చూపుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. 2023 కారెన్స్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: అప్డేటెడ్ కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ధరల పరంగా ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి రూ. 12.79 లక్షల మధ్య ఉంటుంది. ఎక్స్ఎల్6 ధరలు రూ. 11.41 లక్షల నుంచి రూ. 14.67 లక్షల వరకు ఉంది. కావున ఈ విభాగంలో కారెన్స్ ధర కొంత ఎక్కువగానే ఉంది, కానీ రానున్న కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది. -
కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..
భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ SUV విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కియా సెల్టోస్: కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కియా సోనెట్ సిఎన్జి: ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ సిఎన్జి రూపంలో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది. సిఎన్జి వాహనాల వినియోగం పెరుతున్న తరుణంలో సోనెట్ సిఎన్జి విడుదలకు సిద్ధమవుతోంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది, దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) కియా కారెన్స్ 5 సీటర్: సెవెన్ సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న కియా కారెన్స్ త్వరలో 5 సీటర్ రూపంలో విడుదలకానుంది. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌లో లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫైవ్ సీటర్ కేవలం బేస్ వేరియంట్లకు మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. న్యూ జనరేషన్ కార్నివాల్: 2023 కియా కార్నివాల్ 2023 ప్రారంభమలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చింది. ఈ MPV ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కార్నివాల్ కంటే 2023 మోడల్ కొంత పెద్దదిగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
Kia Niro: మగువల మనసు దోచిన కారు.. ఇదే!
2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 'కియా నిరో' (Kia Niro) సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 43 దేశాల నుండి 63 మంది మహిళా మోటరింగ్ జర్నలిస్టులు ఈ కారుకి ఓటు వేశారు. మొత్తం 59 వాహనాలను పరిశీలించిన తరువాత కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నాయి. కియా నిరో - బెస్ట్ అర్బన్ కారు జీప్ అవెంజర్ - బెస్ట్ ఫ్యామిలీ ఎస్యువి సిట్రోయెన్ సి5ఎక్స్ - బెస్ట్ లార్జ్ కారు నిస్సాన్ ఎక్స్ ట్రైల్ - బెస్ట్ లార్జ్ ఎస్యువి ఆడి ఆర్ఎస్3 - బెస్ట్ పర్ఫామెన్స్ కారు ఫోర్డ్ రేంజర్ - బెస్ట్ 4×4 ఫైనల్‌కు చేరుకున్న ఆరు కార్లలో కియా నిరో ఒక ప్రాక్టికల్ లిటిల్ సిటీ కారు అని, ఇది మీకు కావలసినన్ని సరసమైన ప్యాకేజీలో లభిస్తుందని ఆటోకార్ ఇండియాకు చెందిన రేణుకా కిరిపలాని అన్నారు. ఈ కారు 2021 సియోల్ మోటార్ షోలో గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇది టూ-టోన్ పెయింట్, బ్లాక్-అవుట్ వీల్ ఆర్చ్‌లు వంటి ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. (ఇదీ చదవండి: ఈవీల తయారీకి భారత్ చైనావైపు చూడాల్సిందేనా? జిటిఆర్ఐ రిపోర్ట్ ఏం చెబుతోందంటే!) కియా నీరో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో లభిస్తుంది. EV పవర్‌ట్రెయిన్‌తో ఇది ఒక ఛార్జ్‌తో 463 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది, అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ 65 కిమీ పరిధిని అందిస్తుంది. సేఫ్టీ, డ్రైవింగ్, కంపర్టబుల్, టెక్నాలజీ, కెపాసిటీ వంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని విజేతలుగా ప్రకటించడం జరిగింది. విజేతలుగా నిలిచిన అన్ని కార్లు 2022వ సంవత్సరంలో విడుదలయ్యాయి. ఓటింగ్‌ను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని దాని కార్యాలయం నుండి గ్రాంట్ థోర్న్టన్ ధృవీకరించారు. -
Kia EV9: ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్, లాంచ్ ఎప్పుడంటే?
సౌత్ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలో తన ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈవీ9'ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా సమాచారం కొన్ని టీజర్ వీడియోల ద్వారా వెల్లడైంది. నిజానికి ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ గతేడాది జరిగిన 2022 ఆటో ఎక్స్పో వేదిక మీద కనిపించింది. కంపెనీ ఈ కారుని అభివృద్ధి చేయడానికి 44 నెలల సమయం పట్టిందని వెల్లడించింది. మొదటి సారి 2021 లాస్ ఏంజెల్స్ మోటార్ షో కనిపించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉత్పత్తికి నోచుకోలేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా మోటార్స్, ఈ కొత్త మోడల్ విడుదలతో మరిన్ని అద్భుతమైన అమ్మకాలు పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటో ఎక్స్‌పోలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది. కియా ఈవీ9 మస్క్యులర్ క్లామ్‌షెల్ బానెట్, టైగర్ నోస్ గ్రిల్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, వైడ్ ఎయిర్ డ్యామ్, ఓఆర్వీఎమ్ స్థానంలో కెమెరాలు, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో వర్టికల్లీ స్టేక్డ్ టెయిల్‌ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి చూడవచ్చు. ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, యోక్ స్టైల్ స్టీరింగ్ వీల్, పనారోమిక్ సన్ రూఫ్, మల్టీ కలర్ యాంబియెంట్ లైటింగ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు పెద్ద స్క్రీన్స్ వంటివి ఇందులో అమర్చబడి ఉంటాయి. కియా ఈవీ9 ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 450కిమీ రేంజ్ అందిస్తుంది సమాచారం, అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలవుతుంది. భారతీయ మార్కెట్లో 2024-2025 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
కియా మోటార్స్ ఈ కార్లను నిలిపివేస్తుందా?
భారతదేశంలో రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. కియా మోటార్స్ కూడా దేశీయ మార్కెట్లో కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ తన డీజిల్ మాన్యువల్ వేరియంట్లను నిలివేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్లో డీజిల్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసి ఆ స్థానంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ మార్గంలోనే కియా మోటార్స్ కూడా పయనించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ఔత్సాహికులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సంతృప్తి చెందాలి, ఇది ఆటోమేటెడ్ క్లచ్ ఆపరేషన్‌తో కూడిన మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు సెల్టోస్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లతో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ iMT ఆప్సన్ అందిస్తోంది. అయితే సొనెట్, కారెన్స్ డీజిల్ వేరియంట్స్ స్టాండర్డ్ మ్యాన్యువల్ & ఆటోమాటిక్లో లభిస్తున్నాయి. డీజిల్ వేరియంట్స్‌లో ఐఎమ్టికి అనుకూలంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమాటిక్ మధ్య బ్యాలెన్స్‌ని స్ట్రైక్ చేయడం ద్వారా డ్రైవర్‌ను క్లచింగ్ అండ్ డీ-క్లచింగ్ను ఆటోమేటిక్‌గా చూసుకుంటూ షిఫ్టింగ్ పార్ట్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. గేర్ లివర్ ఉపయోగించి రెండు పెడల్ డ్రైవింగ్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో అనుకున్నంత సులభంగా ఉండదు. ఇటీవల చాలా మంది కస్టమర్లు క్లచ్‌లెస్ డ్రైవింగ్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికోసం కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం బిఎస్6 ఉద్గార ప్రమాణాలు మరింత కఠినతరం అవుతున్నాయి, ఈ సమయంలో డీజిల్ కార్ల ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ కార్ల డిస్కంటీన్యూ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు. -
టిక్‌టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!
వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్‌తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్‌టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్‌తో కారు ఇంజిన్‌ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు. దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్‌తో వస్తున్నాయి. -
కియా ఇండియా కీలక ప్రకటన.. ఇకపై సెల్టోస్ కార్లలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా అన్ని సెల్టోస్ కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రమాణికంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కంపెనీ ఇప్పటికే కరెన్స్ మోడల్లో అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేస్తోంది. భారత్‌లో సంస్థ మొత్తం అమ్మకాల్లో సెల్టోస్ వాటా ఏకంగా 60 శాతం దాకా ఉంది.ఎనమిది మంది కూర్చునే వీలున్న వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. -
వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. కియా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కియా ఈవీ6(Kia EV6) ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్లలో అరంగేట్రం చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. బుకింగ్స్ ప్రారంభం..! భారత మార్కెట్లలోకి కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కొద్ది రోజుల్లోనే లాంచ్ చేసేందుకు కియా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 బుకింగ్స్‌ను మే 26న మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాగా భారత్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6 కారును మే 2021లో కియా మోటార్స్ ఆవిష్కరించింది. సూపర్ ఫీచర్స్‌తో..! కియా ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్ఎల్స్తో వస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్ ఆధునిక, సొగసైన, ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. మొత్తంమీద ఈ కారు ఏరోడైనమిక్ స్టైలింగ్ అంశాలను రానుంది. Kia EV6 రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే..! అంతర్జాతీయ మార్కెట్లో కియా ఈవీ6 వాహనం 58kWh, 77.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటి సహాయంతో డ్రైవింగ్ పరిధి మెరుగవ్వనుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇక AWD వెర్షన్లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కియా ఈవీ6 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..! -
కియా ఇండియా షాకింగ్ నిర్ణయం..!
Kia Car Price Hike: భారత ఆటోమొబైల్ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా కియామోటార్స్ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఆనతి కాలంలో భారీగా ఆదరణను పొందింది కియా మోటార్స్. కాగా తాజాగా కొనుగోలు దారులకు షాక్ ఇస్తూ కార్ల ధరలను పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కియా ఇండియా కూడా పలు కార్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తోందని కియా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లలోకి సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కారెన్స్ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్, కియా సెల్టోస్, సోనెట్, కార్నివాల్ ధరలు భారీగా పెరగనున్నాయి. సవరించిన ధరలు ఇలా ఉన్నాయి..! భారత మార్కెట్లలోకి కియా కారెన్స్ ఎంపీవీ వాహనాన్ని కియా ఇండియా లాంచ్ చేసింది. కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది. వీటిపై రూ.70,000 వరకు ధరలను కియా ఇండియా పెంచింది. ఆయా ట్రిమ్స్ మోడల్స్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌తో కూడిన ప్రీమియం 7-సీటర్ కియా కారెన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌తో కూడిన లగ్జరీ+ 7-సీటర్ ధర వరుసగా రూ. 40,000, రూ. 70,000 వరకు పెరిగింది. కియా సెల్టోస్ ధరలు కూడా రూ. 10,000 నుంచి రూ. 36,000 వరకు పెరిగాయి. కియా సెల్టోస్ GTX+ 1.4 మాన్యువల్ ధర రూ. 10,000 పెరిగింది. సెల్టోస్ HTX+ 1.5 మాన్యువల్, iMT ట్రిమ్స్ ధరలు రూ. 36,000 మేర పెరిగాయి. కియా సెల్టోస్ డీజిల్ మోడల్స్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 34,000 వరకు పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కియా సోనెట్ పెట్రోల్, డీజిల్ మోడళ్ల ధరలలో రూ.10,000 నుంచి రూ.30,000 వరకు పెరిగాయి. పెట్రోల్ సోనెట్ హెచ్టిఎక్స్ 1.0 మోడల్ ధర గణనీయంగా రూ. 30,000 వరకు పెరిగింది. కియా సోనెట్ HTX 1.5 డీజిల్ వెర్షన్ ఇప్పుడు GTX 1.5 మాన్యువల్ వెర్షన్ కంటే రూ. 30,000 ఖరీదైనది. కియా కార్నివాల్ ధరలను రూ. 50,000 పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. 6 సీట్ల ప్రిస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.29.49 లక్షలుగా ఉండగా.... ఇప్పుడు ఈ కారు రూ.29.99 లక్షలకు లభించనుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..? -
భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!
భారత ఆటోమొబైల్ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా కియామోటార్స్ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు సవాల్‌ను విసురుతోంది. 2021గాను కియా మోటార్స్ అనూహ్యమైన అమ్మకాలను భారత్‌లో జరిపింది. అమ్మకాల్లో 29 శాతం వృద్ధి..! కియా మోటార్స్ 2021గాను మొత్తంగా 2,27,844 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయంగా 1,81,583 యూనిట్లను కియా సేల్ చేసింది. సరఫరా, చిప్స్ కొరత ఉన్నప్పటికీ 2020తో పోలిస్తే 2021 దేశీయ విక్రయాలలో 29శాతం వృద్ధిని కియా మోటార్స్ నమోదు చేసింది. 2021గాను భారత మార్కెట్లో 6 శాతం మార్కెట్ వాటాను కియా మోటార్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో భారత్‌లోని మొదటి ఐదు కార్ల సంస్థల్లో కియా నిలిచింది. డిసెంబర్లో అదరగొట్టిన సెల్టోస్..! 2021 డిసెంబర్లో కియా మోటార్స్‌లో సెల్టోస్ కార్లు అత్యధికంగా అమ్ముడైనాయి. గత నెలలో కియా మోటార్స్ 7,797 యూనిట్ల అమ్మకాలను జరిపింది.వీటిలో సెల్టోస్ 4,012 యూనిట్లతో అగ్ర భాగంలో నిలిచాయి. సోనెట్ మోడల్స్ 3,578 యూనిట్లు, కార్నివాల్ 207 యూనిట్లను కియా మోటార్స్ విక్రయించింది. ఎగుమతుల్లో కమాల్..! భారత్‌లో కియా మోటార్స్‌ను స్థాపించినప్పటి నుంచి సుమారు 96,242 యూనిట్లను ఇతర దేశాలకు కంపెనీ ఎగుమతి చేసింది. 2021గాను 46,261 యూనిట్లను ఇతరదేశాలకు పంపిణీ చేసింది. 2020తో పోలిస్తే 2021లో ఎగుమతుల్లో 23 శాతం వృద్ధిని కియా సాధించింది. భారత్ నుంచి సుమారు 90 దేశాలకు కార్లను ఎగుమతి చేసింది. సెల్టోస్ రెండు లక్షలు..,సెనోట్ ఒక లక్ష..! ఇప్పటివరకు కియా మోటార్స్ సుమారు 2 లక్షలకు పైగా సెల్టోస్ మోడళ్లను, ఒక లక్షకు పైగా సోనెట్ వాహనాలను కంపెనీ విక్రయించింది. చదవండి: హ్యుందాయ్‌కు గట్టి షాకిచ్చిన టాటా మోటార్స్..! -
AP: పెట్టుబడులకు పెట్టని కోట
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సింహద్వారంగా మారుతోంది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయనేందుకు ప్రముఖ కంపెనీల మనోగతమే నిదర్శనం. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావడమే ఆలస్యం అతి వేగంగా కీలకమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తుండటంతో పునాది సమయంలోనే కార్పొరేట్ సంస్థలు విస్తరణ ప్రణాళికలను సైతం ప్రకటిస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకుండానే విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. పాత బకాయిలు సైతం.. గత సర్కారు మాదిరిగా పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టకుండా సకాలంలో ఇవ్వడంతోపాటు పాత బకాయిలను సైతం పిలిచి మరీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది. ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ పరిశ్రమలకు మొదటి విడతలో రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం రెండో విడతలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్ రూ.684 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.2,248 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు.. ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా ప్రతిపాదనల దగ్గర నుంచి ఓ కంపెనీకి జీవిత కాలం అండగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండే విధంగా, కంపెనీలకు మెరుగైన ఆదాయం లభించేలా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేసి అందచేస్తోంది. దీంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం ఇలా.. ► జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతిపాదనను రూ.2,500 కోట్లకు పెంచింది. ► తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్న సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రతిపాదన అందిన రెండు నెలల్లోనే యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో సెంచరీ ఫ్లైవుడ్ తన పెట్టుబడులను రూ.600 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక స్వయంగా ప్రకటించారు. ► కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ స్థాపించే యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నామని, యూనిట్‌ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ► రూ.50 కోట్లతో బ్లూటూత్, పవర్ బ్యాంక్, రూటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల యూనిట్‌ను సెల్కాన్ రెజల్యూట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వై.గురు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వైఎస్ఆర్ ఈఎంసీలో ఆరు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. ► యాపిల్, రెడ్మీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ సెల్ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ జోష్ ఫల్గర్ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్ ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ► రాష్ట్రం నుంచి కియా మోటార్స్ చెన్నై తరలి వెళ్లిపోతోందంటూ ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ రూ.409 కోట్లతో విస్తరణ ప్రణాళికను సైతం కియా మోటార్స్ ప్రకటించింది. ఏపీలో సరికొత్త నినాదం.. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలను తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందచేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
వచ్చేసింది కియా నయా కార్..! కళ్లు చెదిరే లుక్స్‌తో, సూపర్ డూపర్ ఫీచర్స్‌తో..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ రాబోయే సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) 'కరెన్స్'ను గురువారం (డిసెంబర్ 16) ఆవిష్కరించింది. ఈ కారును రిక్రియేషనల్ వెహికిల్‌గా కియా పేర్కొంది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్ సప్లై కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే..! కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్‌గా కియా కరెన్స్ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో హై ఎండ్..! కియా కరెన్స్ ఇంటీరియర్స్ హై ఎండ్ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్ అందిస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. వీటికి గట్టిపోటీ..! కియా మోటార్స్ ఆవిష్కరించిన కియా కరెన్స్ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్ సెగ్మెంట్లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. బుకింగ్స్ ఎప్పుడంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ చేసుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు కల్పించింది. ఇప్పటికే బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 2022 మొదటి త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ కారు ధరలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. చదవండి: టీఎంసీ బంపర్ ఆఫర్..!, 2025 వరకు రాయితీ వర్తింపు -
గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా?
ప్రముఖ సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు సిద్దం అయ్యింది. తన కొత్త తరం ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6ను 2021 లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆటో షోలో విడుదల చేసింది. ఈ కారు 2022 క్యూ1లో యుఎస్ మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈవీ6ను మొత్తం 50 రాష్ట్రాలలో తీసుకొని రానున్నారు. అయితే, అరంగేట్రానికి ముందు కియా అధికారికంగా తన కాన్సెప్ట్ ఈవీ6 టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఎస్యువి కారు విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. ఈ కియా ఈవీ6 ఫస్ట్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ 77.4 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో 300 మైళ్లు(సుమారు 482.803 కిమీ) రేంజ్ వరకు ఇస్తుంది. దీని ధరను 58,500 డాలర్లు(సుమారు రూ.43 లక్షలు)గా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఎస్యువి 400వీ, 800వీ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారును ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 5 నిమిషాలు చార్జ్ చేస్తే ఈవీ6 112 కిలోమీటర్లు, 18 నిమిషాలు చార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు అని కియా పేర్కొంది. కియా కొత్త ఈవీ6 డిజైన్ చూస్తే సరికొత్తగా ఉంది. ఈవీ కారు ఫ్లాట్ రూఫ్ లైన్, పెద్ద వీల్ ఆర్చ్, స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెక్షన్, ప్రముఖ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది. ఛార్జింగ్ పరంగా చూస్తే ఈ కారు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కెనడాకు చెందిన కియా ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కెనడాలో ప్రత్యేకంగా ఈవీ6 కోసం కంపెనీ ఇప్పటికే సుమారు 2,000 ఆర్డర్లు అందుకున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా, ఐరోపాలో అమ్మకాలు ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. (చదవండి: 18 కోట్ల పంజాబ్ నేనల్ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్!) -
సీఎం జగన్‌కు కలిసిన కియా ఇండియా మేనేజ్మెంట్
-
ఏపీ ప్రభుత్వ సహకారం వల్లే అధిక కార్ల ఉత్పత్తి
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి/పెనుకొండ: కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడంపై కియా ఇండియా మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్ తన బృందంతో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. చదవండి: ఇవి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగం: గౌతమ్‌రెడ్డి ఏపీ ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న ఉత్పత్తి సామర్థ్యానికి మించి కార్లను తయారుచేసి, మార్కెటింగ్ చేయగలిగినట్లు కియా బృందం సీఎంకి వివరించింది. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం జగన్ చర్చించారు. కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్‌ని సీఎం జగన్ సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ, లీగల్, కార్పొరేట్ అఫైర్స్ హెచ్వోడీలు జూడ్ లీ, యాంగ్ గిల్ మా, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ టి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: AP: గ్రామ,వార్డు మహిళా పోలీసులకు వరం.. సీఐ వరకు పదోన్నతి..! -
ఇంధన ధరలతో సతమతమవుతున్నారా..! అయితే ..!
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సెంచరీ దాటేసి... తగ్గేదేలే అంటూ.. పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో కొంత మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. కొందరైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సంప్రాదాయి శిలాజ ఇంధన వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. మనలో చాలా మంది మైలేజీ ఎక్కువ ఇచ్చే వాహనాలపైనే మొగ్గుచూపుతాం. అంతేందుకు ఎవరైనా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే మొదట మనం వారిని అడిగే ప్రశ్న...మైలేజ్ ఎంత ఇస్తుందని..? ఇంధన ధరల మోత తగ్గనప్పటికీ...మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడంతో కాస్తనైనా ఉపశమనం కలిగే వీలు ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) స్టాండర్స్ ప్రకారం.. భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లపై ఓ లుక్కేయండి. మార్కెట్లలోని టాప్-10 మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే...! 1. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ డీజిల్ వేరియంట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉత్తమ మైలేజీని అందిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో డీజిల్ ఇంజిన్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతికొద్ది కార్లలో ఇది ఒకటి. ARAI రికార్డుల ప్రకారం... డీజిల్ వేరియంట్ 25 kmpl వరకు మైలేజీ, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్21 kmpl మైలేజీను అందిస్తోంది. 2. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23 kmpl కంటే కొంచెం ఎక్కువ, ఆటోమేటిక్ వెర్షన్ 23.76 kmpl రేంజ్‌ను ఇస్తోంది. 3. హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, హ్యుందాయ్ i20 అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారులో అద్భుతమైన ఫీచర్సే కాకుండా గొప్ప మైలేజ్ ఈ కారు సొంతం. ARAI ప్రకారం...హ్యుందాయ్ i20 డీజిల్ వేరియంట్ 25.2 kmpl, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 20.35 kmpl రేంజ్‌ను ఇస్తోంది. 4. మారుతి బాలెనో ఇటీవలి కాలంలో హ్యుందాయ్ ఐ 20 మైలేజీకు సమానంగా మారుతి బాలెనో అందిస్తోంది. ARAI ప్రకారం... బాలెనో పెట్రోల్ ఇంజన్‌తో 23. 87 kmpl రేంజ్ వస్తోంది. 5. హ్యుందాయ్ ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఆరా నిలుస్తోంది. ARAI డేటా ప్రకారం...ఆరా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 25 kmpl మైలేజీని అందిస్తుంది.సీఎన్జీ వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 6.మారుతి డిజైర్ మారుతి డిజైర్ కూడా సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇది కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23.26 kmpl మైలేజీ, ఆటోమేటిక్ వెర్షన్ 24.12 kmpl మైలేజీను అందిస్తోంది. 7. కియా సొనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేయబడిన మోడల్ కియా సోనెట్. ARAI సర్టిఫికేట్ ప్రకారం... సోనేట్ డీజిల్ వేరియంట్ 24 kmpl మైలేజీను, పెట్రోల్ వేరియంట్ 18 kmpl ను అందిస్తోంది. 8. హ్యుందాయ్ వెన్యూ హ్యూందాయ్ వెన్యూ సుమారు 23.4 kmpl మైలేజీను అందిస్తోంది. 9. హ్యుందాయ్ క్రెటా మిడ్ రేంజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు సాటి లేదు. క్రెటా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 21 kmpl అందిస్తోంది. 10. హ్యూందాయ్ వెర్నా ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా డిజీల్ వేరియంట్ 25 కెఎమ్పీఎల్, పెట్రోల్ వేరియంట్ 18.4 కెఎమ్పీఎల్ను అందిస్తోంది. -
కళ్లు చెదిరే లుక్స్‌తో కియా నుంచి కొత్త ఎస్యూవీ..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన వాహన శ్రేణిలో మరో కొత్త ఎస్యూవీను తీసుకురానుంది. అందుకు సంబంధించిన టీజర్‌ను కియా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎస్యూవీ పేరును కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కాగా కియా కార్లలోని స్పోర్టేజ్ ఎస్యూవీ మోడల్‌కు కొత్త జనరేషన్ కారుగా ఈ కారు నిలుస్తోందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. తొలుత అమెరికన్ మార్కెట్లలో ఈ కారును అక్టోబర్ 27 న లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లలోకి కియా న్యూ ఎస్యూవీ మోడల్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కియా నుంచి వస్తోన్న ఈ కారు ఫ్రంట్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌తో రానుంది. కారులో మల్టీపుల్ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, హై టెక్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. టీజర్లో భాగంగా ఈ కారులో టైగర్ నోస్ గ్రిల్ బోల్డ్ ఫ్రంట్ ఫేస్‌తో కారు ముందుభాగం ఉండనుంది. బూమ్‌ర్యాంగ్ ఆకారంలో ఫ్రంట్ ఎల్ఈడీ లైట్లను కల్గి ఉంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే..! ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్లో కారు ఇంజిన్ ముందు టైర్లకు శక్తినిస్తోంది. ఆల్ వీల్ డ్రైవ్ అంటే..! ఈ ఆప్షన్లో ఇంజిన్ కారు ముందు టైర్లకు, వెనుక టైర్లకు శక్తిని అందిస్తోంది ఇంజిన్ విషయానికి వస్తే..! కియా స్పోర్టేజ్ మోడల్ మాదిరిగానే 1.6 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. 177 బీహెచ్పీ సామర్థ్యంతో 265ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్, కియా గుడ్‌న్యూస్..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఇటీవలి కాలంలో మద్దతు ప్రజల బాగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే వాహన తయారీ కంపెనీలు కూడా విద్యుత్ వాహనాలకు(ఈవీలు) సంబందించి తమదైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే, వాతావరణ మార్పుల ప్రభావం కూడా విద్యుత్ వాహనాల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో వారానికి ఒక వాహనం బయటికి విడుదల అవుతుంది. తాజాగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి రాబోయే మూడు ఏళ్లలో భారతదేశంలో హ్యుందాయ్, కియా రెండూ ఒక్కొక్కటి మూడు ఈవీలను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎప్పుడైనా మార్కెట్లోకి హ్యుందాయ్ అయోనిక్ 5, కియా ఈవి6 కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్ 18 నిమిషాలలోపు 80 శాతం ఛార్జ్ చేసే అవకాశం ఉంది. అయోనిక్ 5లో కొన్ని వేరియెంట్లలో బ్యాటరీ చార్జ్ కోసం కారు పైకప్పుపై సోలార్ ప్యానెల్ తో కూడా రావచ్చు. ఒక నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ కోనా ఈవిలో మరో మోడల్ ను ఈ సంవత్సరం చివర్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు, కియా ఈ-నీరో రెండు కార్లు 39.2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 136 హెచ్‌పీ మోటార్ లేదా 64కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 204 హెచ్‌పీ మోటార్ తో వస్తాయని సమాచారం. ఈ-నీరో వరుసగా 289 కిలోమీటర్లు, 455 కిలోమీటర్ల పరిధితో వస్తే, కోనా 305 కిలోమీటర్లు, 484 కి.మీ పరిధితో వచ్చే అవకాశం ఉంది.(చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..!) -
మార్కెట్లోకి మరో ఎస్యువి లాంచ్ చేసిన కియా ఇండియా
ఆటోమొబైల్ మార్కెట్లో రోజుకొక కొత్త కారు విడుదల అవుతుంది. తాజాగా కియా ఇండియా దేశంలో మధ్య తరహా కియా సెల్టోస్ ఎస్యువి కారును విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.17.79 లక్షలుగా ఉంది. ఈ మోడల్ మ్యాట్ గ్రాఫైట్ కలర్, 18 అంగుళాల క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్, లెదర్ ఎట్ అప్ హోల్ స్ట్రీతో ఇతర ఫీచర్లతో వస్తుంది. సెల్టోస్ ఎక్స్ లైన్ ప్రత్యేకంగా జీ1.4 టీ-జీడీఐ 7 డీసీటీ, డీ1.5 6 ఎటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లతో అందుబాటులో ఉంటుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. పెట్రోల్ ఎక్స్ లైన్ 7 డీసీటీ ట్రిమ్ ధర రూ.17.79 లక్షలు కాగా, డీజిల్ ఎక్స్ లైన్ 6 ఏటీ వేరియంట్ ధర రూ.18.10 లక్షలుగా ఉంది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ 1.4-లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్ డీఐ విజీటీ డీజిల్ మోటార్ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో 2,00,000 యూనిట్ల అమ్మకాలు, 40 శాతానికి పైగా సెగ్మెంట్ వాటాను ఇది కలిగి ఉంది. సెల్టోస్ ప్రారంభించినప్పటి నుండి దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా ఉంది.(చదవండి: Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం) -
సరికొత్త రికార్డును సృష్టించిన కియా మోటార్స్..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ ఆటోమోటివ్ మార్కెట్లో 3 లక్షల కార్లను అమ్మినట్లు కియా ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల అమ్మకాల్లో అత్యంత వేగవంతమైన బ్రాండ్‌గా దక్షిణ కొరియా వాహన తయారీ కియా ఇండియా నిలిచింది. భారత మార్కెట్లోకి 2019 ఆగస్టులో కియా కార్ల అమ్మకాలను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా కియా 2020 జూలైలో మొదటి లక్ష కార్ల అమ్మకాలు జరుపుగా, తదుపరి లక్ష కార్ల అమ్మకాలు జనవరి 2021లో సాధించగా , 2021 ఆగస్టులో మొత్తంగా మూడు లక్షల కార్ల అమ్మకాలను కియా జరిపింది. కియా కార్ల అమ్మకాల్లో సెల్టోస్ 66 శాతం, తరువాతి స్థానంలో సోనెట్ 32 శాతం దేశీయ మార్కెట్లో స్థానాన్ని సంపాదించాయి. దేశవ్యాప్తంగా కియా కార్నివాల్ 7310 యూనిట్లను విక్రయించింది. కియా ఇండియా ఎమ్డీ, సీఈవో కూఖున్ షిమ్ మాట్లాడుతూ.. అమ్మకాల్లో కియా సాధించిన ఘనతపై ఆనందం వ్యక్తం చేశారు. కియా కార్లకు మంచి ఆదరణను అందించిన భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. కియా తన సర్వీస్ కేంద్రాల సంఖ్యను 300 నుంచి 360కిపైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. -
బంపర్ ఆఫర్: ఆ కారుపై రూ.3.75 లక్షలు సూపర్ క్యాష్ డిస్కౌంట్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్ మార్కెట్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ ప్రీమియం వేరియంట్ కియా కార్నివాల్ ఎంపీవీ కారుపై రూ.3.75 లక్షల వరకు లబ్ధి చేకూరేలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేసిన కష్టమర్లకు ఆఫర్ వర్తిస్తుందని కియో ప్రతినిధులు వెల్లడించారు. ఈ కారు అసలు ధర రూ.24.95 లక్షలు ఉండగా..షోరూమ్ లో దీని ధరపై రూ .2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు వార్షిక నిర్వహణ ఖర్చులు, పొడిగించిన వారంటీ ప్యాకేజీలతో పాటు ఇతర ఖర్చుల కింద రూ.1.25లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ కారును రూ .21.20లక్షలకే సొంతం చేసుకోవచ్చు. కాగా ,గతేడాది జరిగిన ఆటో ఎక్స్ పోలో 2020 కియా కార్నివాల్ ఎంపీవీ కారును ఇండియన్ మార్కెట్లో కియా విడుదల చేసింది. ఎస్‌యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఈ కారు నాలుగు వరుసలు, తొమ్మిది సీట్లతో ఏర్పాటైంది. కారు లోపలి భాగం నప్పా లెదర్ అప్హోల్స్టరీతో డిజైన్ చేయడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. 200హెచ్‌పీ పవర్ శక్తిని గరిష్టంగా 440 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, క్యాబిన్లో అత్యాధునిక కార్ల టెక్నాలజీకి సపోర్ట్ చేసే సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. -
కియా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ అదుర్స్!
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా తన తొలి ఎలక్ట్రిక్ కారును నేడు(ఆగస్టు 2న) ఆవిష్కరించింది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్ గా పేరున్న ఈ ఎలక్ట్రిక్ కారును కొరియాలో 40,800 డాలర్ల నుంచి 49,500 డాలర్లకు తీసుకొని వచ్చింది. దేశీయ మార్కెట్లో కియా ఈవీ6 కోసం 30,000కు పైగా ప్రీఆర్డర్లను, యూరప్ & అమెరికాలో కలిపి 8,800 ప్రీఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలోపు దక్షిణ కొరియాలో 3,000 యూనిట్లను, విదేశీ మార్కెట్లలో 17,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొనిరానున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి 34,761 డాలర్ల(రూ.25 లక్షల) కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది. ఈ ఈవీ6 మోడల్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. స్టాండర్డ్ 58 కిలోవాట్-అవర్(కెడబ్ల్యుహెచ్) బ్యాటరీ ప్యాక్ గల కారును ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 370 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ 77.4-కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల కారును ఒకసారి ఫుల్ రిచార్జ్ చేస్తే 475 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఏప్రిల్ లో కియాకు చెందిన అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఈ-జీఎంపీ ప్లాట్ ఫామ్ గల ఐఓఐక్యూ 5 ఆల్ ఎలక్ట్రిక్ మోడల్ ప్రారంభించింది. వచ్చే ఏడాది ఐఓఐక్యూ 6, 2024లో అయోనిక్ 7 బిగ్ ఎస్ యూవీని ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ యోచిస్తోంది. ఇది బిఎమ్ డబ్ల్యు వంటి ప్రత్యర్థుల ఆల్ఫాన్యూమరిక్ పేర్లను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఇది 3.5 సేకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీనిని 5 నిమిషాలు చార్జ్ చేస్తే 100 కి. మీ దూరం వరకు వెళ్లవచ్చు. -
Kia: కారు నచ్చకుంటే 30 రోజుల్లో వాపస్ చేయొచ్చు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ ప్రీమియం మల్టీపర్పస్ వెహికల్ (ఎంపీవీ) కార్నివాల్‌పై కొత్త స్కీమ్ ప్రకటించింది. కొనుగోలుదారులు కారు పనితీరుపై సంతృప్తి చెందని పక్షంలో కొన్న 30 రోజుల్లో వాపసు చేయొచ్చని తెలిపింది. కార్నివాల్ ఎంపీవీలోని అన్ని వేరియంట్స్‌కి ‘శాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ స్కీమ్’ వర్తిస్తుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ కింద వాపసు చేయాలంటే కొన్న తేదీ నుంచి ప్రయాణించిన దూరం 1,500 కి.మీ.లకు మించకూడదు. అలాగే ఎలాంటి డ్యామేజీలు, పెండింగ్ క్లెయిమ్‌లు మొదలైనవి ఉండకూడదు. హైపోథికేషన్ ఉండకూడదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. వాపసు చేస్తే ఎక్స్–షోరూం ధరలో దాదాపు 95% మొత్తంతో పాటు రిజిస్ట్రేషన్, ఫైనాన్స్ మొదలైన వాటికి అయిన ఇతర ఖర్చులకు కవరేజీ ఉంటుంది. ప్రస్తుత గడ్డుకాలంలో తమ కస్టమర్లకు మరింత భరోసా కల్పించేందుకు ఈ స్కీము దోహదపడగలదని కియా ఇండియా ఈడీ టే–జిన్ పార్క్ తెలిపారు. చదవండి: New York Mercantile Exchange: మళ్లీ పసిడి జిగేల్! -
ఏపీలో కరోనా కట్టడికి కియా మోటార్స్ విరాళం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 నియంత్రణలో భాగంగా సహాయ చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధకి (ఏపీఎస్డిఎంఏ) కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. విరాళానికి సంబంధించిన నిధులను ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు తదితర వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. నెఫ్ట్ ద్వారా బదిలీ చేసిన విరాళానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ, సీఈవో కుక్ హ్యున్ షిమ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీగల్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జ్యూడ్ లి, కియా ఇండియా ప్రిన్సిపల్ అడ్వైజర్ టి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
Kia India New Logo: సరికొత్తగా కియా ఇండియా బ్రాండ్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో కొత్త బ్రాండింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్తగా రూపొందించిన లోగో, బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా పర్యావరణ అనుకూలమైన అధునాతన వాహనాల సంస్థగా కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ఇది తోడ్పడగలదని కంపెనీ పేర్కొంది. కొత్త లోగో సెల్టోస్, సోనెట్ వాహనాలను మే తొలి వారంలో ఆవిష్కరించనున్నట్లు కియా ఇండియా ఎండీ కూక్యున్ షిమ్ తెలిపారు. ప్రధాన కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా వెలుపల తాము కొత్త బ్రాండింగ్‌కి మారిన తొలి దేశం భారత్ అని ఆయన వివరించారు. తాజా వ్యూహంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను 218 నగరాల్లో (తృతీయ, చతుర్థ శ్రేణి పట్టణాలతో పాటు) 360 టచ్ పాయింట్లకు విస్తరించుకోనున్నట్లు షిమ్ వివరించారు. కియాకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 3 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కార్ల ప్లాంటు ఉంది. Join in to experience the inspirational journey of Kia's bold transformation live #MovementThatInspires https://t.co/JrmNKyNfvP — Kia India (@KiaMotorsIN) April 27, 2021 చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! -
అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ కార్ టీజర్
న్యూఢిల్లీ: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. అందుకుగాను మొదటి ఎలక్ట్రిక్ కారు ఈవి-6 మోడల్ టీజర్‌ను మంగళవారం కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారును ప్రపంచవ్యాప్తంగా మార్చి 15న ఆవిష్కరించబోతుంది. వినియోగదారులకు దీర్ఘకాలిక పరిష్కారాలను అందించడంలో భాగంగా కియా మోటర్స్ ‘ప్లాన్-ఎస్’ ప్రణాళికను జనవరిలోనే తెలిపిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా 2027 లోపు ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ ఉత్పత్తి చేయనుంది. కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహన శ్రేణుల్లో ‘ఈవి’తో మొదలుకానున్నాయి. దాంతో పాటు కియా లోగో కూడా మారబోతుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్న భారీ ఆదరణ నేపథ్యంలో కియా ఈ కొత్త ఇ-వాహనాన్ని తీసుకు రానుండటం విశేషం. The Kia EV6. Bold, original and innovative. Get ready to be inspired. Focus. The full design of the Kia EV6 will be unveiled on 15 Mar.#Kia #EV6 #MovementThatInspires #KiaEV6 pic.twitter.com/evB4TDYAly — Kia Worldwide (@Kia_Worldwide) March 8, 2021 -
స్పీడు పెంచనున్న ఆటోరంగం
న్యూఢిల్లీ: గతేడాది కష్టకాలంగా గడిచినప్పటికీ కొత్త ఏడాదిపై ఆటోమొబైల్ కంపెనీలు కాస్త ఆశావహంగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థల సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ .. వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కియా మోటర్స్ ఉత్పత్తి పెంచుకోనుండగా.. టయోటా కొంగొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక హ్యుందాయ్ మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడంపై దృష్టి పెడుతోంది. ‘కొత్త ఏడాదిలో మా తయారీ ప్లాంటులో షిఫ్టులను మూడుకు పెంచుకోనున్నాం. అలాగే కొనుగోలుదారులకు సురక్షితమైన అనుభూతినిచ్చేందుకు ‘ఫిజిటల్’ (ఆఫ్‌లైన్ స్టోర్స్, డిజిటల్) నెట్వర్క్ విధానాన్ని మరింతగా పటిష్టం చేసుకోనున్నాం’ అని కియా మోటర్స్ ఎండీ ఖూఖ్యున్ షిమ్ తెలిపారు. కరోనా పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2020లో రెండు కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కియా మోటర్స్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది. విద్యుత్ వాహనాలపైనా కసరత్తు .. 2021లో పెరిగే డిమాండ్‌కు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా దశలవారీగా కొంగొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సర్వీస్ విభాగాలు) నవీన్ సోని తెలిపారు. అలాగే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇక వాహనాల లీజింగ్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సోని పేర్కొన్నారు. మరోవైపు, కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత నుంచి అమ్మకాల పరిమాణం క్రమంగా పెరిగిందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ తెలిపారు. విదేశాలకు ఐ20 ప్రీమియం కార్ల ఎగుమతులు: హ్యుందాయ్ ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి కట్టుబడి తమ సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. మొదటి దఫా ఎగుమతుల్లో భాగంగా 180 ఐ20 మోడళ్లను దక్షిణాఫ్రికా, చిలీ, పెరూ దేశాలకు తరలించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన ఐ20 మోడల్ ధర ఎక్స్ షోరూం వద్ద రూ.6.79 – రూ.11.17 లక్షల మధ్య ఉంది. -
గురుపూరబ్ ఉత్సవాలకు రండి
సాక్షి, అమరావతి: గురుసింగ్ సహ ధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈనెల 30న గురునానక్ జయంతి సందర్భంగా నిర్వహించే గురుపూరబ్ ఉత్సవాలకు హాజరు కావాలని వారు సీఎంను ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వానపత్రికను అందజేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరిగే ఉత్సవాలకు రావాలని వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు. ► స్త్రీ సత్ సంఘ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిక్కు కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ హర్మిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్జిత్ సింగ్, పింకి హర్విందర్ సింగ్ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ► విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను కలిసిన ‘కియా’ ప్రతినిధులు కియా మోటార్స్ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కియా మోటార్స్, ఇండియా ఎండీ కూక్ హ్యూన్ షిమ్, కియా మోటార్స్ లీగల్ హెచ్‌వోడీ జుడే లి, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు సీఎంను కలిశారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కియా మోటార్స్ ప్రతినిధులు -
సీఎం జగన్‌తో కియా మోటర్స్ ప్రనిధులు భేటీ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కియా మోటర్స్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కలిసిన వారిలో కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హ్యూస్ షిమ్, కియా మోటార్స్ లీగల్ హెచ్‌వోడీ జుడేలి, ప్రిన్సిపల్ అడ్వైజర్ సోమశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్‌ను కలిసిన శ్రీగురుసింగ్ సహధర్మ ప్రచార కమిటీ ప్రతినిధులు సాక్షి,అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విజయవాడ శ్రీ గురు సింగ్ సహ ధర్మ ప్రచార కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ప్రచార కమిటీ ప్రతినిధులు.. గురునానక్ జయంతి సందర్భంగా ఈ నెల 30న నిర్వహించే గురుపూరవ్ ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇచార్జ్ దేవినేని అవినాష్, స్త్రీ సత్ సంగమ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిఖ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ హర్మహిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్ జిత్ సింగ్, పింకి హర్విందర్ సింగ్ తదితరులు ఉన్నారు. -
కియా సోనెట్ ఆగయా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ‘సోనెట్’ కాంపాక్ట్ ఎస్‌యూవీని శుక్రవారం భారత్‌లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ 1.0 టి–జీడీఐ, స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ డబ్ల్యూజీటీ, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ వీజీటీ ఇంజన్ ఆప్షన్స్‌తో మొత్తం 17 వేరియంట్లలో ఈ కారును రూపొందించింది. అయిదు ట్రాన్స్మిషన్ రకాలు ఉన్నాయి. ధర వేరియంట్‌నుబట్టి ఎక్స్‌షోరూంలో రూ.6.71 లక్షలు మొదలుకుని రూ.11.99 లక్షల వరకు ఉంది. నాలుగు మీటర్ల లోపు ఉండే సోనెట్.. హ్యూందాయ్ వెన్యూ, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, టాటా మోటార్స్, నెక్సన్, హోండా డబ్ల్యూఆర్–వి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉన్న కియా అత్యాధునిక ప్లాంటులో సోనెట్ తయారు కావడం విశేషం. 70 దేశాలకు ఈ కారును ఎగుమతి చేయనున్నారు. ఇవీ సోనెట్ విశిష్టతలు.. ఫైవ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్స్, సెవెన్ స్పీడ్ డీసీటీ, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, సిక్స్ స్పీడ్ స్మార్ట్‌స్ట్రీమ్ ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకాల్లో ఇది లభిస్తుంది. తొలిసారిగా సెగ్మెంట్లో 30కి పైగా కొత్త ఫీచర్లను జోడించినట్టు కంపెనీ ప్రకటించింది. నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్తో 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్, వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణకు స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్, సబ్ వూఫర్స్‌తో బోస్ ప్రీమియం సెవెన్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, యువో కనెక్ట్, స్మార్ట్ కీతో రిమోట్ ఇంజన్ స్టార్ట్, ఆటోమేటిక్ మోడళ్లకు మల్టీ డ్రైవ్, ట్రాక్షన్ మోడ్స్, కూలింగ్ ఫంక్షన్‌తో వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జర్ ఏర్పాటు ఉంది. ఎనమిది మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ రంగుల్లో సోనెట్ లభిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్ వంటివి పొందుపరిచారు. సెగ్మెంట్లో తొలిసారిగా డీజిల్ సిక్స్–స్పీడ్ ఆటోమేటిక్, ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రవేశపెట్టారు. మైలేజీ వేరియంట్‌నుబట్టి 18.4 నుంచి 24.1 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. తొలి ఏడాది 1,50,000 యూనిట్లు.. కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ విభాగంలో సోనెట్ సంచలనం సృష్టిస్తుందని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ మార్కెట్ కోసం తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా కారు సోనెట్‌కు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని, 25,000 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని అన్నారు. తొలి రోజే 6,500 బుకింగ్స్ నమోదయ్యాయని, ప్రస్తుతం రోజుకు 1,000 వస్తున్నాయని గుర్తు చేశారు. సరఫరా సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని, ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో రెండవ షిప్ట్ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. కరోనా ఉన్నప్పటికీ ఈ కారు ప్రవేశపెట్టడం వెనుక ఉద్యోగుల కఠోర శ్రమ ఉందన్నారు. ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 3 లక్షల యూనిట్లు అని గుర్తుచేశారు. భారత్‌ను తయారీ హబ్‌గా చేసుకున్నామన్నారు. దేశీయం గా తొలి ఏడాది ఒక లక్ష యూనిట్ల సోనెట్ కార్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఈడీ టే జిన్ పార్క్ పేర్కొన్నారు. అలాగే 50,000 యూనిట్లు ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో కనెక్టెడ్ కార్స్ విభాగంలో 60,000 పైచిలుకు యూనిట్ల మైలురాయిని అధిగమించిన తొలి కంపెనీగా నిలిచినట్టు కియా తెలిపింది. -
కియా మెటార్స్ సోనెట్ : రికార్డు బుకింగ్స్
సాక్షి,అనంతపూర్: ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ప్లాంట్ లో ప్రత్యేకంగారూపొందించిన కియా మోటార్స్ ఎస్యూవీ సోనెట్ ను ఆవిష్కరించింది. రానున్న పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నెలలోనే దీన్ని లాంచ్ చేయనుంది. కియా సోనెట్ సంస్థ తాజా ‘మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి ఇది. కియా సెల్టోస్ మాదిరిగానే దేశీయ మార్కెట్ తో పాటు,వివిధ ప్రపంచ మార్కెట్లలో దీన్ని విక్రయించనుంది. పెద్ద ఎత్తున ఈ కారును ఉత్పత్తి చేస్తున్నామని,భారతదేశంలో వివిధ వాతావరణ పరిస్థితులలో, కొన్నికిష్టమైన ఏరియాల్లో 100,000 కిలోమీటర్లకు పైగా పరీక్షించిన తరువాత దీన్ని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. గత నెలలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించిన దీన్ని సెప్టెంబర్18న సోనెట్‌ను భారతదేశంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 70 మార్కెట్లలో దీన్ని అందుబాటులోకి తేనుంది. తమ తొలి కస్టమర్ కారు కియా సోనెట్ ను అధికారికంగా విడుదల చేయడం సంతోషంగా ఉందని కియా మోటార్స్ ఇండియా సీఎండీ కూఖ్యూన్ షిమ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల మధ్య సొనెట్‌ను తీసుకురాడం చాలా గర్వించదగిన విషయమనీ, ఇది తమకొక ముఖ్యమైన రోజని వ్యాఖ్యానించారు. అనంతపురంలోని అత్యాధునిక ప్లాంట్ ఉద్యోగుల అభిరుచి, అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. రికార్డ్ బుకింగ్‌లు బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజున ఈ కారు ఇప్పటికే 6,523 యూనిట్ల రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్‌లను సేకరించింది. కియా మోటార్స్ ఇండియా భారతీయ మార్కెట్లో ఇప్పటికే సెల్టోస్, కార్నివాల్ రెండు వాహనాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, టెక్నికల్, డైనమిక్ డిజైన్, 30కు పైగా అత్యుత్తమ ఫీచర్లు వాయిస్ అసిస్ట్ సహా 57 యువీఓ కనెక్ట్ ఫీచర్లు, డీఎన్ఏ బోల్డ్, విలక్షణమైన డిజైన్ లతో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కియా సోనెట్ ఆకర్షించనుంది. Even the wild have a pecking order. See how the #KiaSonet ends up right at the top of it while making their date wilder than your imagination. Pre-Book Now!#TheNextLevelOfWild #WildByDesign — Kia Motors India (@KiaMotorsIN) August 20, 2020 -
పండుగ సీజన్‌పైనే ఆశలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న వాహనాల మార్కెట్ పండుగ సీజన్ నాటికి పుంజుకోగలదని కియా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ విభాగం హెడ్ మనోహర్ భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికి మూడో కారు సోనెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. లాక్డౌన్ సమయంలోనూ 3,500 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని తెలిపారాయన. అనంతపురంలోని తయారీ ప్లాంటును మరింతగా విస్తరించేందుకు ఇటీవలే 54 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. వాహన విక్రయాలపై కరోనాపరమైన ప్రభావాలు ఎలా ఉన్నాయి? పరిశ్రమపై కరోనాపరమైన ప్రతికూల ప్రభావ తీవ్రతను గణాంకాలపరంగా ఇంతని ప్రస్తుతం చెప్పలేము. ఏప్రిల్‌లో అమ్మకాలు సున్నాకి పడిపోవడమనేది ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో పరిశ్రమ చిక్కుకున్నది తెలియజేస్తోంది. అయితే, మరికొద్ది నెలల్లోనే మార్కెట్ తిరిగి పుంజుకోగలదని ఆశావహంగా ఉన్నాం. సరఫరాలు, మార్కెట్ స్థిరపడటానికి కాస్త సమయం పడుతుంది. మా ఉత్పత్తులన్నీ మేడ్–ఇన్–ఇండియానే కావడం, స్థానికంగానే మెజారిటీ విడిభాగాలను కొనుగోలు చేస్తుండటం వల్ల మాపై ప్రతికూల ప్రభావం కాస్త తక్కువే. మేం మరింత వేగంగా పుంజుకోగలమని ధీమా ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలెంత స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడే ముందస్తుగా ఏమీ చెప్పలేము. ఇకపై అమ్మకాల ధోరణి ఎలా ఉండవచ్చు? అంతర్జాతీయంగా ధోరణులు చూస్తుంటే ప్రయాణాల కోసం ఇకపై ప్రజా రవాణా సాధనాల కంటే వ్యక్తిగత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కార్ల అమ్మకాలను పెంచుతుంది. కరోనా నియంత్రణలోకి వచ్చాక మార్కెట్ వేగం పుంజుకోవచ్చు. అయితే, దేశీయంగా ఇంకా పరిస్థితులు స్థిరపడాల్సి ఉంది. కాబట్టి విక్రయాలు ఎగిసేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. పండుగ సీజన్ .. అంటే ఈ ఏడాది మూడో క్వార్టర్లో అమ్మకాలు పుంజుకోవచ్చని ఆశిస్తున్నాం. ప్రస్తుతం కంపెనీ ఆర్డరు బుక్ ఎలా ఉంది? లాక్డౌన్లో కూడా 3,500 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయి. బుకింగ్స్ రద్దయిన సంఖ్య చాలా తక్కువే. ప్రస్తుతం సెల్టోస్, కార్నివాల్‌కు సంబంధించి బుక్ అయిన 25,000 పైగా వాహనాలు డెలివరీ కావాల్సి ఉంది. దశలవారీగా మా టచ్ పాయింట్స్‌లో 94 శాతం పాయింట్స్‌ను ప్రారంభించాం. మే నెలలో 1,600 యూనిట్లు విక్రయించాం. ఆన్లైన్ బుకింగ్ ధోరణుల విషయానికొస్తే.. వాహనాల కొనుగోళ్లను కస్టమర్లు ఆన్లైన్లోనే జరిపేలా చూడటం ఆటోమొబైల్ సంస్థలకు కాస్త సవాలుతో కూడుకున్నదే. ఎందుకంటే.. మిగతా ఉత్పత్తులతో పోలిస్తే కారు కొనుగోలు చాలా భిన్నమైనది. డిజిటల్‌గా కాకుండా కారును భౌతికంగా చూసి, నడిపి, సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడతారు. అయితే, డిజిటల్ షోరూమ్‌లు భవిష్యత్‌లో అమ్మకాలు పెంచుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడగలవు. ఈ నేపథ్యంలో ఇటు డిజిటల్, అటు ఫిజికల్ షోరూమ్‌ల మేళవింపుతో కంపెనీలు ముందుకెళ్లాల్సి ఉంటుంది. మా విషయానికొస్తే.. మేం ముందునుంచే అమ్మకాల ప్రక్రియను డిజిటైజ్ చేసేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేశాం. ప్రస్తుతం కొనుగోలు నుంచి హోమ్ డెలివరీ దాకా సేవలు అందిస్తున్నాం. మా మొత్తం వాహన విక్రయాల్లో 7–8 శాతం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. మరిన్ని కొత్త మోడల్స్ ప్రవేశపెట్టబోతున్నారా? మా మూడో ఉత్పత్తయిన కియా సోనెట్ (కంపాక్ట్ ఎస్యూవీ)ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పండుగ సీజన్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020 ఆటో ఎక్స్‌పోలో అంతర్జాతీయంగా సోనెట్‌ను ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. కరోనా పరిణామాలతో వ్యయ నియంత్రణ చర్యలేమైనా తీసుకున్నారా? ముందునుంచే మా భాగస్వాములు, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారులు అంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఈ కష్టకాలంలో కూడా అదే ధోరణి కొనసాగింది. కాబట్టి పెద్దగా వ్యయ నియంత్రణ చర్యలేమీ తీసుకోలేదు. కొత్త నియామకాల ప్రణాళికలేమైనా ఉన్నాయా? మా వెండార్ పార్ట్నర్లతో కలిపి కియా మోటార్స్ ఇండియా సిబ్బంది సంఖ్య మొత్తం 13,000 పైచిలుకు ఉంటుంది. మా సిబ్బందిలో చాలా మంది సమీప ప్రాంతాలు, రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. ప్రస్తుతానికి తగినంత స్థాయిలో సిబ్బంది ఉన్నారు. అనంతపురంలోని ప్లాంటును మరింత విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు ఇటీవలే 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనకు కూడా దీనితో ఊతం లభించగలదు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? దేశంలోనే తొలిసారిగా కార్లకు ఉచితంగా శానిటైజేషన్ కార్యక్రమాన్ని ఇటీవలే కియా కేర్ ప్రచార కార్యక్రమం కింద ప్రకటించాం. ముందుగా సంప్రతించినవారికి ఈ సర్వీసులు అందిస్తున్నాం. ఇక కియా కేర్ కింద వాహనాలకే కాకుండా, సర్వీస్ సెంటర్లు, డీలర్‌షిప్‌లలో కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి తగు భద్రతా చర్యలు అమలు చేస్తున్నాం. ఇక కస్టమర్లకు కియా లింక్ యాప్ ద్వారా వాహనాల పికప్, డ్రాప్, మొబైల్ వర్క్‌షాప్‌ల వంటి సేవలు అందిస్తున్నాం. -
టాప్ గేర్‌లో ఏపీ ఆటోమొబైల్
సాక్షి, అమరావతి: ఆటోమొబైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఆటోమొబైల్, ఆటో విడిభాగాల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో 100 కు పైగా విడిభాగాల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ ప్రస్తుతం ఒక షిఫ్టులో పనిచేస్తోంది. నిబంధనలను అనుసరించి కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కియా మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. శ్రీసిటీలో 20కిపైగా ఆటో మొబైల్ కంపెనీలున్నాయి. ఇందులో జపాన్‌కు చెందినవే అధికం. ఇసుజు మోటార్స్ ఇక్కడ ఎస్‌యూవీలను తయారు చేస్తోంది. ఇటీవలే ఈ కంపెనీ రూ. 400 కోట్ల పెట్టుబడితో అదనపు ఉత్పత్తి కేంద్రాన్ని, ప్రెస్ షాప్, ఇంజిన్ అసెంబ్లీ యూనిట్లతో ప్రారంభించింది. అనుబంధ పరిశ్రమలకు ఊతం.. ఇసుజు వాహనాలకు అవసరమైన వివిధ విడి భాగాలలో ప్రస్తుతం 70 శాతం మాత్రమే మన దేశంలో తయారవుతున్నాయి. రాబోయే రోజుల్లో, అన్ని విడి భాగాలను పూర్తిగా ఇక్కడే తయారుచేసేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పలు అనుబంధ పరిశ్రమలు త్వరలో శ్రీసిటీకి రానున్నాయి. శిక్షణ, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి తిరుపతి ఐటీఐ కళాశాలలో ఇసుజు మోటార్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. కొబెల్కో గ్రూçపు, పయోలాక్స్, యన్.యస్.ఇన్స్ట్రుమెంట్స్, యన్.హెచ్.కే స్ప్రింగ్స్, మెటల్ వన్, నిట్టాన్ వాల్వ్ తదితర కంపెనీలు, ఇతర విడిభాగాల తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఉత్పత్తికి సిద్ధంగా హీరో, అశోక్ లేలాండ్ చిత్తూరు జిల్లాలో ఉన్న అపోలో టైర్స్, అమరరాజా బ్యాటరీస్ లాక్డౌన్ తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ తమ ఉత్పత్తులను ట్రయిల్ రన్ చేస్తోంది. దేశంలో ఆటోమొబైల్ రంగం అమ్మకాలు పుంజుకున్న వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంది. అదేవిధంగా విజయవాడ సమీపంలోని అశోక్ లేలాండ్ కూడా ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా అవేరా ఈ బైక్స్ తమ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. అనంతపురంలో వీరా బస్సు తయారీ కేంద్రం రానుండగా, మరో ఆరు, ఏడు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయి. నమ్మకం పెరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో మే మొదటి వారంలోనే ఉత్పత్తి ప్రారంభించాం. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో మరో రూ. 400 కోట్ల వరకు అదనపు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో మరో కొత్త మోడల్ కారును విడుదల చేయనున్నాం. – కూక్ హ్యూన్ షిమ్, ఎండీ, కియా మోటార్స్ ఇండియా. రాయితీలు అందాయి.. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద ప్రకటించిన రాయితీలు పొందాం. అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ కింద మరో 20 శాతం అదనపు రుణానికి దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే విడుదల అయ్యింది. ప్రస్తుతం యూనిట్‌ను 50 శాతం మంది సిబ్బందితో నడుపుతున్నాం. మార్చి నెల ఆర్డర్లను పూర్తి చేసి త్వరలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మకాలు విస్తరించే యోచనలో ఉన్నాం. – డాక్టర్ రమణ, అవేరా ఈ స్కూటర్స్, ఫౌండర్ సీఈవో. -
కియా సంస్థ కీలక ప్రకటన
-
ఏపీలో పెట్టుబడులు.. కియా కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ కూకున్ షిమ్ వెల్లడించారు. కియా ఎస్యూవీ వెహికల్స్ తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన ఎన్నో అనుకూలతలు ఏపీలో ఉన్నాయని విదేశీ పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలమైన వనరులు ఉన్నాయని.. జావాబుదారీ తనంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. (చదవండి : ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది : సీఎం జగన్) -
'కియా పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది'
సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయ సేవలందించేందుకు 200 మందితో ఎల్జీ పాలిమర్స్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గ్యాస్ ప్రమాద బాధితులు గతంలో లాగానే సాధారణ జీవితం గడిపేందుకు అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాలతో విశాఖపట్నం ఎల్జీ పరిశ్రమ నుంచి దక్షిణ కొరియాకు స్టైరైన్ తరలింపు ప్రక్రియ ముగిసింది. గ్యాస్ లీక్ పరిసర ప్రాంతాల్లోని 5 గ్రామాల ప్రజలకు, ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని' మంత్రి పేర్కొన్నారు. చదవండి: గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం: సీఎం వైఎస్ జగన్ కియా కార్ల పరిశ్రమ పునఃప్రారంభం అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ పరిశ్రమ మంగళవారం నుంచి పునఃప్రారంభమైంది. త్వరలోనే ఉత్పాదక రంగంలో కియాకార్ల పరిశ్రమ తయారీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర చూపిస్తుంది. పరిశ్రమలో విధులు నిర్వర్తించే ఉద్యోగుల రక్షణతో పాటు, పనిచేసే కాలంలో పాటించవలసిన ప్రాధాన్యతలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలిచ్చినట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' -
కియాలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభం
సాక్షి, అనంతపురం : కియా ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. లాక్డౌన్ నిబంధనల సడలింపుతో అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని అంతర్జాతీయ కియా మోటర్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి మళ్లీ మొదలైంది. కియా రోజుకు 400 కార్ల తయారీని చేపట్టింది. పనిచేసేందుకు 500 మంది కార్మికులకు అనుమతి లభించింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్ల ఉత్పత్తి చేస్తామని కియా యాజమాన్యం తెలిపింది. ఇక, కంటైన్మేంట్ జోన్లలో నివసించే కార్మికుల సెలవులను పొడగించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముంద్తు జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. -
సీఎం సహాయ నిధికి కియా భారీ విరాళం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ గురువారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు. (భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం) రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన శ్రీ సీటీ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన శ్రీ సిటీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర.. విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఏపీ ఐఏఎస్‌లు.. కరోనా నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ విరాళాలకు సంబంధించిన వివరాలు అందించారు. రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన జీఎల్ మంధానీ గ్రూప్ కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఎంబీజీ కమొడిటీస్ తరఫున జీఎల్ మంధానీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని జీఎల్ మంధానీ గ్రూప్ ట్రస్టీ బిజయ్ మంధానీ ఆన్లైన్ ద్వారా సీఎం సహాయ నిధికి బదిలీ చేశారు. -
ప్లాంట్లు మూసేయండి – ఉత్పత్తి ఆపేయండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా వాహనాలు, విడిభాగాల తయారీ సంస్థలు కొంత కాలం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసే అంశాలను పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్యలు సూచించాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్), ఆటో కాంపోనెంట్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ).. కంపెనీలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. సిబ్బంది వైరస్ బారిన పడకుండా చూసేందుకు కొంతైనా తోడ్పడగలవని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. బాధ్యతాయుతంగా జాతి నిర్మాణంలో భాగం కావాలన్న సియామ్ నినాదానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్లాంట్ల మూసివేత బాటలో మరిన్ని సంస్థలు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్, టయోటా కిర్లోస్కర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మార్చి 23 నుంచే (సోమవారం) చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించగా, టయోటా కిర్లోస్కర్ .. కర్ణాటకలోని బిడది ప్లాంటులో తయారీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. టీవీఎస్ మోటార్ తమ ప్లాంట్లన్నింటిలోనూ మార్చి 23 నుంచి రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు బజాజ్ ఆటో కూడా తమ ఫ్యాక్టరీల్లో తయారీ కార్యకలాపాలు ఆపేసినట్లు సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్రలోని చకన్‌తో పాటు మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో కూడా ఉత్పత్తి నిలిపివేసినట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సర్వీసుల కోసం స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల విదేశీ ప్రయాణాలను, సమావేశాలను రద్దు చేశామని.. పలువురికి వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేస్తున్నామని శర్మ చెప్పారు. కాంట్రాక్టు ప్రాతిపదికన తమకు వాహనాలు తయారు చేసి అందించే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ) ఉత్పత్తి నిలిపివేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కార్ల తయారీ సంస్థలు కియా మోటార్స్, బీఎండబ్ల్యూ, రెనో కూడా ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ప్లాంటు, కంపెనీ కార్యాలయం కార్యకలాపాలు కొన్నాళ్లు ఆపివేస్తున్నట్లు కియా మోటార్స్ వెల్లడించింది. సిబ్బంది, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వారందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మార్చి నెలాఖరు దాకా తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) తెలిపింది. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ ప్లాంట్లలో మార్చి 23 నుంచి 31 దాకా, తమిళనాడు ప్లాంటులో మార్చి 24 నుంచి 31 దాకా తయారీ కార్యకలాపాలు ఉండవని వివరించింది. మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫియట్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్, సుజుకీ మోటార్‌సైకిల్ వంటి సంస్థలు తయారీని నిలిపివేస్తున్నట్లు ఆదివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సౌత్ కొరియా వాణిజ్య విభాగం స్పందన
-
కియా మోటార్స్ ఎక్కడికీ తరలిపోదు: కోట్రా
సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందన్న ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా- ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ(కోట్రా) ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని స్పష్టం చేసింది. కియా పరిశ్రమను తరలించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టింది. ఆసియా కమ్యూనిటీ న్యూస్ (ఏసీఎన్) నెట్వర్క్ కియా తరలిపోతుందన్న కథనం రాయగా.. కోట్రా దానిని ఖండించింది. దీంతో ఈ అంశంపై స్పష్టతనిస్తూ ఏసీఎన్ బుధవారం తాజాగా ఈ మేరకు మరో ప్రకటన విడుదల చేసింది.(చదవండి: బాబు ‘వలస’ బంధం ‘రాయిటర్స్’) కాగా కియా పరిశ్రమను ఏపీ నుంచి తరలిస్తున్నారంటూ రాయిటర్స్ పేర్కొన్న కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటుగా.. సంస్థ కూడా ఖండించిన విషయం తెలిసిందే. అసత్య కథనాలపై స్పందించిన కియా మోటర్స్ ఎండీ కుక్యున్ షిమ్... దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో కియా యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని... తప్పుడు వార్తలు రాసిన రాయిటర్స్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు గతంలో ఆయన లేఖ రాశారు.(కియాపై కీలక ప్రకటన..) -
బాబు ‘వలస’ బంధం ‘రాయిటర్స్’
‘అత్యధిక పాఠకలోకం ఆదరణ పొందడం అందుకు అనుగుణంగా పాఠకులకు అబద్ధాలతో కాకుండా వాస్తవాలతో కూడిన సరైన సమాచారం అందించడమే వార్తా సర్వీసుల (న్యూస్ సర్వీసెస్) లక్ష్యం. వార్తల్ని బట్వాడా చేసే సంస్థలు ఆ వార్తల్ని అందించడంలో తమ సొంత తీర్పుల్ని చొప్పించకూడదు. అది పాటిం చినప్పుడే ఆ వార్తలను అందించే సర్వీసులు తమపై పాఠకులలో అనుమానాలూ, అస్పష్టతా రేకెత్తకుండా జాగ్రత్త పడగలుగుతాయి. అలా అయితేనే వార్తలు అందించే న్యూస్ సర్వీసుల లక్ష్యానికి తాత్విక పునాది ఉంటుంది. లేదా అది పాఠకులకు స్థూలంగా ఆమోదయోగ్యమైన వార్తగానైనా ఉండాలి’.– ప్రపంచ వార్తా సర్వీసుల తాత్విక పునాది పట్ల సుప్రసిద్ధ పాత్రికేయ చరిత్రకారుడు జొనాధన్ ఫెన్బీ నిర్వచనం. ‘ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం’ అన్న దశలో పతనావస్థకు చేరుకున్న టీడీపీ నాయకుడు చంద్రబాబు, ప్రస్తుతం పాత వలసపాలన అవశేషాలకు చిహ్నాలుగా మిగిలి ఉన్న కొన్ని విదేశీ న్యూస్ సర్వీసులను ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి వాడుకునే స్థితికి దిగజారిపోయారు. వ్యక్తులు సమాజ సంపదను పోగేసుకోవడానికి స్వేచ్ఛను కాపాడుతున్నది 1935 నాటి బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యవాద ప్రభుత్వం రూపొందించిన చట్టం. దాని ఆధారంగా స్వతంత్ర భారత రాజ్యాంగంలో చేరిన 31వ అధికరణ చంద్రబాబు చేతిలో ఇప్పుడు బినామీ ఆస్తుల కేంద్రీకరణకు ఎలా యథేచ్ఛగా దోహదపడుతున్నదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ముసుగులో ‘అమరావతి’ బినామీ కథలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఈ బినామీ ఆస్తుల రక్షణలో తాడూ బొంగరంలేని అమరావతి రాజధానికి ముక్కూముఖం ఏర్పరిచే మిష పైన ప్రపంచ వార్తా సర్వీసుగా బ్రిటిష్ ఇండియా నుంచి నేటిదాకా ఉనికిలో ఉన్న రాయిటర్స్ వార్తా సంస్థ సేవలను తన అధికార దాహంకొద్దీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత కూడా చంద్రబాబు వాడుకోదలిచారు. స్థానికంగా తన ‘ఉంపుడు పత్రికలు’గా తయారైన రెండు తెలుగు దినపత్రికలను తన ప్రభుత్వ పతనం తర్వాత మరింతగా వినియోగించడంతో సంతృప్తిపడని బాబు మరికొన్ని అడ్డదారులు తొక్కడానికి సాహసించారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అశేష ప్రజాదరణతో, రాష్ట్ర చరిత్రలో అరుదైన అఖండ మెజారిటీతో పరిపాలనా పగ్గాలు అందుకున్న యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంస్కరణవాద సంక్షేమ పథకాల అమలు జరుగుతుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుతగలడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామం.. అనంతపురం జిల్లాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఒక రూపు తొడిగి భారీ పరిశ్రమగా దక్షిణ కొరియా ‘కియా’ మోటారుకార్ల యూనిట్ ఎదుగుతూ వేలసంఖ్యలో స్థానికుల ఉపాధి కల్పనకు శరవేగాన ముందడుగు వేస్తోంది. అమరావతి పేరిట రాజధాని నిర్మాణం లేకుండా పేద మధ్యతరగతి ప్రజల భూముల్ని ముందుగానే అన్యాక్రాంతం చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తి చేతులు చూపిన వ్యక్తి బాబు. ఇప్పుడు కియా మోటార్ కార్ల పరిశ్రమ యాజమాన్యానికి దిగులు కలిగించే సరికొత్త ప్రచారానికి బాబు గజ్జె కట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాల వల్ల అనంతపురం నుంచి కియా మోటార్ భారీ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందన్న నీలివార్తల్ని బాబు, అతని రెండు అనుకూల పత్రికలు వ్యాపింపచేశాయి. రాష్ట్ర ప్రజలు బాబు నీలివార్తల్ని ఎక్కడ నమ్మరోనని భావించి బాబు కొత్త ఎత్తుకు దిగారు. దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతప్రజలను, నాయకుల్ని వంచిస్తూ సామ్రాజ్యవాద పాలనకు అనుకూలంగా, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు గుప్పిస్తూ వచ్చినవి– రాయిటర్స్ (బ్రిటన్), ఎ.ఎఫ్.పి. (ఫ్రాన్స్), అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి. అమెరికా). భారతదేశంలోని పెట్టుబడిదారీ పత్రికలు కొన్ని మినహాయింపులతో వార్తల కోసం ఈ విదేశీ సంస్థలపై ఆది నుంచీ ఆధారపడుతూ మన దేశ పాఠకులకు వార్తలు అందిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పెక్కు పత్రికల, నాయకుల బానిస మనస్తత్వమూ, బుద్ధులూ పెద్దగా మారిందేమీ లేదు. పైగా చంద్రబాబులాంటి ‘తిమ్మిని బమ్మిని’ చేయగల అక్రమ సంపాదనాపరుల చేతుల్లో ‘రాయిటర్స్’ లాంటి పెద్ద సంస్థ కూడా ఇరుక్కుపోవడం విశేషం– ఎందుకంటే సర్వత్రా వ్యాపార ధోరణి కావటంవల్ల! అసలు రాయిటర్స్‌కు, బాబు పాత సర్కారుకు ‘లంకె’ ఎలా కుదిరింది? బాబు పాలనలో విశాఖ, హైదరాబాద్‌లలో ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమాల పథకాన్ని తలపెట్టి ఎన్నికలలో ప్రయోజనాలు పొందే టెక్నాలజీ మతలబుకు అంకురార్పణ జరిగింది. 2018–2019 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రతిపక్షాన్ని ఎన్నికలలో విజయం సాధించకుండా అడ్డుకోగల నానా అడ్డగోలు ప్రయత్నాలకు పాల్పడిన బాబు వర్గం డిజిటల్ యంత్రాల్ని వినియోగించి దొరికిపోయింది. అలా డిజిటల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఆధారంగా 2017లో రాయిటర్స్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ టీడీపీ నాయకత్వం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల సారాంశం– డిజిటల్ కంటెంట్స్ మార్పిడి పేరిట, టెండర్లు పిలవకుండానే (ఇతర ప్రపంచ సంస్థలేవీ పోటీకి రాకుండా) చంద్రబాబు హయాంలో ఒక్క రాయిటర్స్కే ప్రయోజనం కల్పిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇదీ– ఇప్పుడు ఇందుకు ముదరాగా రాయిటర్స్, నేటి వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని వికేంద్రీకరణ సహా ఆచరణలోకి తెస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు పన్నిన వలలో చిక్కుకుంది. అయితే బాబు రాయిటర్స్ సంస్థ ద్వారా కియా సంస్థ మేనేజ్‌మెంట్‌పైన, జగన్ ప్రభుత్వంపైన వ్యాపింపజేసిన తప్పుడు ప్రచారానికి తాళం పడిపోయింది. అటునుంచి తమిళనాడు ప్రభుత్వమూ ఖండన పరంపర ద్వారా బాబు, రాయిటర్స్ జమిలిగా తలపెట్టిన కుట్రను భగ్నం చేయవలసి వచ్చింది. విడిపోయిన నూతన ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని కోసం వెతుకులాటలో సుదీర్ఘ పర్యటనానంతరం ఉన్నతస్థాయి కేంద్ర విచారణ సంఘం (శ్రీరామకృష్ణన్ కమిటీ) అన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని, మూడు పంటలు పండే అమరావతి ఏరియా మాగాణి సుక్షేత్రాలను పొరపాటున కూడా రాజధాని పేరిట పాడుచేయవద్దని హెచ్చరించింది. అంతేగాదు, అమరావతి ప్రాంతంలో పర్యావరణ ప్రమాణాల దృష్ట్యా తక్కువ లోతునుంచే నీరు ఉబికివచ్చే ప్రమాదం ఉన్నందున, భారీ నిర్మాణాలకు అది అనువైనది కాదని కూడా నివేదికలో హెచ్చరించింది. అయినా ఆ నివేదికను అసెంబ్లీ ఛాయలకు కూడా రానివ్వకుండా, ప్రవేశపెట్టకుండా, చర్చించకుండానే విద్యా వ్యాపారవేత్త చేత రాజధానిగా అమరావతికి అనుకూలంగా నివేదికను గిలిగించి దాంతోనే భూములపైన స్పెక్యులేషన్ వ్యాపారం చేసింది బాబు ప్రభుత్వం. బినామీ భూముల కోసమే అమరావతిని బాబు బలి చేశాడు. అయిదేళ్లయినా అవసరమైన రాజధానిని నిర్మించడంలో విఫలమయ్యారు. ఈ తరుణంలో కేంద్ర పర్యావరణ సాధికార సంస్థ, నిర్ణయాధికార సంస్థ రాజధానిగా అమరావతి నిర్మాణం తగదని సూచనప్రాయంగానూ, లిఖితపూర్వకంగానూ స్పష్టంగా హెచ్చరించినా బాబు పెడచెవిన పెట్టడానికి కారణం– కేవలం బినామీ ఆస్తుల్ని పోగేసుకోవడానికేనని తరువాతి పరిణామాలు రుజువు చేశాయి. ఇదే సమయంలో మన కోస్తాలో మాదిరే తీర ప్రాంతాల పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని 2019 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశిస్తూ అందుకు 138 రోజుల వ్యవధినిస్తూ తీర్పు చెప్పవలసి వచ్చిందని మరచిపోరాదు. ఆ కారణంగానే కేరళలోని మరడు ప్రాంతంలో నిర్మించిన భవంతులను క్షణాలలో కూల్చివేయించిన ఘటననూ మనం మరవరాదు. ఈ సాధికారికమైన హెచ్చరికలను సహితం ఖాతరు చేయకుండా, ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికీ బాబు మొండిగా వ్యతిరేకించడమంటే నదిలో మునిగిపోతున్నవాడు ఆఖరి ప్రయత్నంగా ‘గడ్డిపోచ’ను పట్టుకుని బయటపడదామన్న వృథా తాపత్రయమే అవుతుంది. భారతదేశంలోని అరడజను రాష్ట్రాలు, ప్రపంచంలో పన్నెండు దేశాలు– పరిపాలనా విభాగాలుగా, శాసన వేదికలుగా, న్యాయస్థాన కేంద్రాలుగా రెండేసి, మూడేసి రాష్ట్రాలలో వేర్వేరుగా ఏర్పరచుకుని పాలనా సౌలభ్యాన్ని, ప్రాంతాల మధ్య అసమానతలను క్రమంగా తొలగిస్తూ అభివృద్ధినీ సాధించాయి. ఈ దేశీయ, అంతర్జాతీయ పాఠాల నుంచే జగన్ ప్రభుత్వం పాలనా, ప్రాంతీయ స్థాయి అభివృద్ధికి అనుగుణంగా వికేంద్రీకరణ పథకాన్ని తలపెట్టడం ఒక ప్రయోగంగా వినూత్నమేగాదు, అవశ్యం, అవసరం కూడా అని మరవరాదు. గత చరిత్రను తవ్విచూసుకున్నా– శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల దాకా కోటి లింగాల, బోధన్ల నుంచి అమరావతి వరకూ, రెండేసి, మూడేసి రాజధానులను పాలనా కేంద్రాలుగా మలచుకున్నవారే. అంతేగాదు, పల్లవులు, విష్ణుకుండినులు కూడా పాలనా సౌలభ్యం కోసం రెండేసి, మూడేసి ప్రాంతాలలో రాజధానులు నిర్వహించారు. ఆంధ్రుల చరిత్రలో విష్ణుకుండినుల పాలకులకు వేములవాడ, నాగార్జునకొండ రాజధానులుగా ఉండేవని కొందరు చారిత్రికుల భావన. నాడూ, నేడూ, ఏనాటికైనా పాలన ఎక్కడినుంచి సాగిం దని కాదు, ఎంత మంచిగా ప్రజానురంజకంగా ఎంతకాలం సాగిందన్నదే ప్రజల జ్ఞాపకంలో ఉండేదీ, లెక్కల్లో నిలిచేదీ!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘చంద్రబాబు రాజకీయ వ్యభిచారి’
సాక్షి, అనంతపురం : కియా మోటార్స్‌పై చంద్రబాబు నాయుడు కుట్ర చేసి రాయిటర్స్ ద్వారా తప్పుడు వార్తలు యించారని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుత పాలనను చూసి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కియాపై తప్పుడు ప్రచారం చేసినందుకుగాను చంద్రబాబు కియా పరిశ్రమ వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని, ప్రతి విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరమని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల మేలు కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ చేపట్టారని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. -
కియా మోటార్స్ : తప్పు సవరించుకున్న రాయిటర్స్
-
‘ఇంత జరుగుతున్నా నోరు మెదపరేం బాబూ..’
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో.. ‘మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు’అని పేర్కొన్నారు. (చదవండి : శ్రీనివాస్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు) కాగా, చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావు, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్ నివాసాల్లో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. శ్రీనివాస్‌కు చెందిన వాల్ లాకర్ నుంచి భూ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ నుంచి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ దంపతుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. (చదవండి : ఏపీలోనే కియా) -
నీకు బుర్ర కూడా లేదని అర్థమైంది: మిథున్‌రెడ్డి
సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా చేసిన ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అవాస్తవాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ రాష్ట్రంలోనే ఉంటుందని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేసిన విషయాన్ని ట్విటర్ వేదికగా జయదేవ్‌కు గుర్తుచేశారు. టీడీపీ లోక్‌సభా వేదికగా చేసిన దుష్ప్రచారానికి ఇదే సమాధానం అంటూ కియా ఎండీ చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తా కథనాన్ని జోడించారు. (కియాపై ఎండీ కీలక ప్రకటన.. ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లు) ఈ మేరకు... ‘‘నీ తలపై జుట్టు మాత్రమే లేదనుకున్నాను. కానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏపీలో ఉన్న పెట్టుబడిదారులను తరిమేయాలని ఎందుకంత తొందర మీకు? ఎవరు బాధ్యతరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా. కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోవడం లేదని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. ఒక ఎంపీగా ఉండి అసత్యాలు ప్రచారం చేస్తావా? అయినా నీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం’’ అని మిథున్‌రెడ్డి ట్వీట్ చేశారు. లోక్‌సభలో తన ప్రసంగాన్ని విమర్శిస్తూ జయదేవ్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా మిథున్‌రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. కాగా కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదంటూ మిథున్‌రెడ్డి గురువారం లోక్‌సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే పేరుతో ఓ డమ్మీ కంపెనీ సృష్టించి రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు.(దురుద్దేశంతోనే దుష్ప్రచారం) ఉదయమే కియా ఎండీతో మాట్లాడా: మిథున్‌రెడ్డి "You had asked for this. Here's the answer. KIA motors has clarified that they are not moving out of AP. Mr. @JayGalla why are you spreading fake news? Don't you know that an MP should be responsible? Or is it too much to expect from you?"https://t.co/OHckEoU0Kq — Mithunreddy (@MithunReddyYSRC) February 7, 2020 -
తప్పుడు ప్రచారం పై కియా స్పందన
-
దురుద్దేశంతోనే దుష్ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తరలిపోతున్నాయంటూ కొంతమంది దురుద్దేశంతో పనిగట్టుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 15వ ఆటో ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అలాగే గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ఆటోమోటార్ షో–2020ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కియా మోటార్స్ తమిళనాడుకు వెళుతోందనే వార్త అవాస్తవమని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కూడా చెప్పారన్నారు. అంతేకాకుండా తరలింపు వార్తను ఖండిస్తూ కియా మోటార్స్ ఎండీ కూడా ప్రకటన ఇచ్చారని గుర్తు చేశారు. కియా ఫ్యాక్టరీ రెండో మోడల్‌ను కూడా మార్కెట్లోకి తెస్తోందని, జూన్ లేదా జూలైలో మూడో మోడల్‌ను కూడా అందుబాటులోకి తేనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆ సంస్థ గట్టి నమ్మకంతో ఉందని తెలిపారు. అలాగే కొన్ని ఐటీ సంస్థలకు తాము నోటీసులు ఇచ్చినట్టు, దీంతో అవి వేరే నగరాలకు వెళ్లిపోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. కియా మోటార్స్ తరలిపోతోందని చంద్రబాబు అంటున్నారని, ఎందుకు వెళ్లిపోతోందో, ఎక్కడికి వెళ్లిపోతోందో ఆయన వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు వివిధ సంస్థల ఆసక్తి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఆటోమొబైల్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్పో–2020 సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు ఏపీని ఎంచుకుంటామని హామీ ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రెనాల్ట్ ఇండియా సీఈవో వెంకటరామ మామిలపల్లె తెలిపారు. ఫోర్స్ ఇండియా, గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థిక సహకారమందిస్తామని అమితాబ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్నారు. -
కియాపై కీలక ప్రకటన..
సాక్షి, అమరావతి: తమ అనంతపురం ప్లాంటు వేరే ప్రాంతానికి తరలి వెళుతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ కియా మోటర్స్ స్పష్టం చేసింది. తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని సూచించింది. సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. ఈ మేరకు కియా మోటర్స్ ఎండీ కుక్యున్ షిమ్ లేఖ రాశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్పోలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి కియా ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కియా ఎండీ కుక్యున్ షిమ్ రాసిన లేఖను కియా ప్రతినిధులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కియా జనరల్ మేనేజర్ సన్ ఊక్ వాంగ్ మాట్లాడుతూ.. కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదని, కలసిమెలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాయిటర్స్ రాసిన తప్పుడు కథనంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లదని, రానున్న కాలంలో మరిన్ని ఆటో మొబైల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వ సహకారంతోనే కియా మోటార్స్ రెండో మోడల్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. కియో మోటార్స్, తమిళనాడు ప్రభుత్వం కూడా అసత్య ప్రచారాన్ని ఖండించిందని, అయినా కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియాపై బాధ్యతరాహిత్యంతో ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత దుష్ప్రచారాలకు తెరతీయడం రాజకీయంగా దిగజారడమేనన్నారు. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం) -
జులై నెలలో మరో కియా ప్లాంట్ వస్తుంది
-
‘ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం.. అంటూ’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కియా మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందని చంద్రబాబు చేసిన అసత్య ప్రచారాలపై విజయసాయి రెడ్డి ఆసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికీ తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు.’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.(ఎగుమతుల సబ్సిడీలకు డబ్య్లూటీవో ఆటంకాలు) మరో ట్వీట్లో ‘బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు వస్తాయి త్వరలో. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!’ అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘ఇంకా ఏమేం ఉన్నాయో చెప్పండి విజనరీ’) -
‘కియా మోటార్స్ తరలింపు వార్తలు అవాస్తవం’
-
‘కియా మోటార్స్ తరలింపు అవాస్తవం’
సాక్షి, న్యూఢిల్లీ : కియా మోటార్స్ తరలిపోతుందన్న వార్తలు అవాస్తవమని ఆ సంస్థ స్పష్టం చేసింది. కియా మోటార్స్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని కియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) కూఖ్యూన్ షిమ్ తెలిపారు. పూర్తి నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుత తయారీ పరిశ్రమను తరలించే యోచన లేదని అన్నారు. అనంతపురం పరిశ్రమను ప్రపంచ శ్రేణిగా తయారు చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చంద్రబాబు నాయుడు దుష్పచారం చేస్తున్నారని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన కియా మోటార్స్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. (చదవండి : రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం) ‘మా ప్రభుత్వంపై నమ్మకంతో కియా మోటార్స్ మరొక పరిశ్రమను కూడా పెట్టబోతోంది. జూలై నెలలో మరో కియా ప్లాంట్ వస్తుంది. కియా మోటార్స్ తమిళనాడుకు వెళ్తోందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ, కియా మోటార్స్‌తో మాట్లాడలేదని తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు. ఒప్పందాలను గౌరవిస్తూ అమలు చేస్తున్నాం. శ్రీ సిటీ కంటే మెరుగైన దానిని తీసుకొచ్చేందుకు పాలసీ రూపొందిస్తున్నాం. చంద్రబాబు దిగజారి మాట్లాడడం బాధాకరం. మా ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. రాజధాని కేంద్రీకృతంగా మాత్రమే అభివృద్ధి జరగాలనేది మా లక్ష్యం కాదు. అన్ని ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి జరగాలి’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి : కియాపై మాయాజాలం) -
ఏపీ నష్టపోవాలన్నదే ఆయన ఆలోచన..!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం కంటే పెన్షన్లు అదనంగానే ఇచ్చామని..7 లక్షల పింఛన్లు తొలగించామని టీడీపీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆరు లక్షలకు పైగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేశామని.. అనర్హుల జాబితా మరోసారి పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తామని వివరించారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఆయన కుతంత్రాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు కియా పరిశ్రమ తరలిపోతుందనే టీడీపీ నేతల దుష్ప్రచారం పై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రోడ్డు మీద వెళ్లే వాళ్లకు సూటు,బూటు వేసి సమ్మిట్లు నిర్వహించారని.. రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆయన దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు అలా చెప్పటం దారుణం.. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అబద్ధాలు చెప్పటం దారుణమని.. మిలీనియం టవర్స్‌లో ఉన్న కంపెనీలను ఖాళీ చేయమని తాము నోటిసులు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీ లో పెట్టామో... అప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. తదుపరి కార్యక్రమాలన్నీ అడ్మినిస్ట్రేషన్ లో అంతర భాగాలేనని వివరించారు. రాజ్యాంగ పరంగానే జీవో లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులను గౌరవిస్తూనే కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఉద్యోగులకు సమస్యలు ఉంటే తమతో చర్చిస్తారని వెల్లడించారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు.. ‘ప్రజలందరూ రాజధాని త్వరగా తరలించాలని కోరుకుంటున్నారు. కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం ఇష్టం. గత ప్రభుత్వం నోటి మాట తో ముందుకు వెళ్ళింది. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలో ఉండాలని చట్టం లో ఉందా?.. పరిపాలన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కార్యాలయం తరలిస్తున్నామని’ బొత్స పేర్కొన్నారు. బలవంతపు భూ సేకరణ చేసిన భూములు వెనక్కి ఇవ్వమని రైతులు కోరారని.. రోడ్లు కింద పోయే భూములు వేరేచోట ఇవ్వమని రైతులు అడిగారని తెలిపారు. దీన్ని పరిశీలించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి బొత్స వెల్లడించారు. (చదవండి: కియాపై మాయాజాలం) -
రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం
సాక్షి, అమరావతి: కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో వింతేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటా ఒప్పందం..? థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమం కింద రాయిటర్స్‌తో నాడు రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విశాఖలోని గీతం వర్సిటీ అందుకు సంధానకర్తగా వ్యవహరించింది. లోకేశ్ అప్పట్లో ఐటీ మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధే ఉంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనో, నగర శివార్లలో ఉన్న ఐటీ సెజ్‌లోనో ఇన్నోవేషన్ యాప్ స్టూడియోను ప్రభుత్వం నెలకొల్పేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇ– ప్రగతి నిధులూ రాయిటర్స్‌కు ... ‘ఇ–ప్రగతి’ కార్యక్రమం కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం రాయిటర్స్ సంస్థకు చెందిన ఇ–బుక్ సాఫ్ట్వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు వినియోగించుకుంటాయి. అందుకు రాయిటర్స్‌కు ప్రభుత్వం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. (చదవండి: కియాపై మాయాజాలం) -
కియాపై మాయాజాలం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టింది మొదలు రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం బరి తెగించి హద్దులు దాటింది. ఈసారి ఏకంగా అంతర్జాతీయ మీడియా సంస్థనే తమ విష ప్రచారానికి వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరలిపోతోందంటూ బుధవారం అర్థరాత్రి ఒక అసత్య కథనం వెలువడింది. ఆ వెంటనే నిమిషాల వ్యవధిలోనే నాస్డాక్, మింట్ బ్రేకింగ్ న్యూస్ నడపడంతో పాటు పబ్లిష్ కూడా చేశాయి. ఎల్లో మీడియా దీన్ని అందుకొని కియా వెళ్లిపోతోందంటూ శోకాలు ప్రారంభించింది. ఇక ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ నుంచి గల్లీదాక ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టాయి. ఈ వార్త వెలువడిన వెంటనే కియా యాజమాన్యంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఖండిచినా సరే ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆపలేదు. తరలించే ఉద్దేశం లేదని చెప్పిందంటూనే.. ‘రాయిటర్స్’ రాసిన కథనంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తమ యూనిట్‌ను తరలించే ఉద్దేశం లేదని కియా చెప్పినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీలో నెలకొల్పిన యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేంత వరకు దేశంలో ఎలాంటి విస్తరణ కార్యక్రమం గురించి ఆలోచన లేదని చెప్పినట్లు కూడా రాశారు. వీటిని బట్టి చూస్తే రాయిటర్స్ రిపోర్టర్‌ను ఎవరో ప్రభావితం చేసి అవాస్తవ, అసత్య కథనాన్ని ప్రచురించేలా చేసినట్లు స్పష్టమవుతోంది. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం) వివరణ లేకుండా కథనం.. సాధారణంగా రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ లాంటి అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ సంస్థలు అధికారికంగా సమాచారం లేనిదే వార్తను ప్రచురించవు. కానీ దీనికి భిన్నంగా కియా కంపెనీ నుంచి కానీ, రెండు రాష్ట్రాల అధికారుల నుంచి కానీ ధ్రువీకరణ లేకుండా ‘సోర్సెస్’ అంటూ కథనాన్ని రాయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. మీడియా మేనేజ్మెంట్లో ఆరితేరిన వ్యక్తి పనే! రాష్ట్రంలో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న నిబంధన వల్లే కియా పరిశ్రమ తరలిపోతోందని ఆ కథనంలో పేర్కొన్నారు. కానీ కియాలో ఇప్పటికే 85 శాతం మంది స్థానిక యువత పని చేస్తున్నారు. అలాగే కియాకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇప్పటికే లభించాయి. పైగా రైల్వే అండర్ పాస్‌లు, రహదారులు దగ్గర నుంచి అన్నీ మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అవాస్తవాలతో కూడిన వార్తను అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ చేశారంటే దీని వెనుక మీడియా మేనేజ్మెంట్లో ఆరితేరిన వ్యక్తి ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఆ విలేకరికి రాజకీయ దురుద్దేశాలు? ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఈ వార్తను ముగ్గురు విలేకరులు ఆదిత్య కర్లా, సుదర్శన్ వర్థన్, అదితి షా రాసినట్లుగా రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ వార్త రాయడంలో ప్రధాన భూమిక పోషించిన ఆదిత్య కర్లా ట్వీట్ ఖాతాను పరిశీలిస్తే అసలు రంగు బయటపడింది. ఈ వార్తను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్ అతడి ఖాతాపై ఆంక్షలు విధించింది. ట్విటర్ ఖాతాను ఇలా దురుద్దేశపూర్వకంగా వాడుకుని తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారంటూ ఆదిత్య కర్లా ఖాతాను స్తంభింపజేసింది. ఆయన రాసే కథనాల్లో రాజకీయ దురుద్దేశాలు ఉండటంతో ట్విట్టర్ యాడ్ పాలసీ ప్రకారం ట్వీట్లను బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయి సామర్థ్యం ‘ఈ వార్తలో ఇసుమంత కూడా నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కియా సత్సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన కార్లకు అదనంగా కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసే పనిలో ఉంది. ఈ ఏడాది చివరికి యూనిట్‌ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంలోకి తెచ్చేలా కియా శరవేగంగా ముందుకెళుతోంది. ఇలాంటి అసత్య వార్తను ఎందుకు రాశారో రాయిటర్స్ సంస్థను వివరణ అడిగి తగిన చర్యలు తీసుకుంటాం’ – మేకపాటి గౌతమ్‌రెడ్డి (పరిశ్రమల శాఖ మంత్రి) తమిళనాడు ప్రభుత్వం ఖండించింది ‘తమిళనాడుతో రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉంది. పెట్టుబడులు పెట్టడం గురించి కియా మోటార్స్‌తో తాము ఎటువంటి చర్చలు జరపలేదని తమిళనాడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని, తరలింపు ఆలోచనే లేదని కియా కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కియా మోటార్స్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ప్రస్తుతం 2 లక్షల యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది చివరకు 3 లక్షల యూనిట్లకు చేరుకోనుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తి అవాస్తవాలతో రాయిటర్స్ రాసిన కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది’ – రజత్ భార్గవ (పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) -
ఆ ఘనత ప్రధాని మోదీదే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ తమిళనాడుకు తరలివెళ్లే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొట్టమొదటిసారి జోక్యం చేసుకొని.. దానిని ఏపీకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. కియా మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబునాయుడు కృషి ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. కియా మోటార్స్ కు చంద్రబాబు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతోందని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం తగదని, కియా మోటార్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో మరో ప్లాంట్ నిర్మాణానికి కియా మోటార్ ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు. కియా మోటార్స్‌పై పార్లమెంట్ లోపల, బయట టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. ఏపీ నుంచి కియా మోటార్స్ తన ప్లాంటును తరలిస్తోందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కియా సంస్థతో సత్సంబంధాలు కలిగి ఉందని, ఏపీలో ఆ సంస్థ భవిష్యత్తు ప్రణాళికలకు పూర్తి సహకారం అందిస్తామని విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పష్టం చేశారు. -
చంద్రబాబుది నాలికా... తాటి మట్టా?
సాక్షి, తాడేపల్లి : ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించారన్నారు. రైతుల పేరుతో టీడీపీ కార్యకర్తలు హడావిడి చేస్తున్నారని, రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఇదే రాజధాని అని నిర్ణయించేశారని మండిపడ్డారు. ఓ వర్గం మీడియా చంద్రబాబును మోస్తోందని ధ్వజమెత్తారు. (రాజధానితో చంద్రబాబు వ్యాపారం) లోకేష్‌ను తిరస్కరించారు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు కరుడుగట్టిన మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై లెక్కలేని తనంతో ఆయన వ్యవహార శైలి ఉంది. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు. కేసులకు భయపడి రాత్రికి రాత్రే హైదరాబాద్ విడిచి పారిపోయి వచ్చేశారు. చgద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పు ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం కల్పించుకుంటే ఆయనను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేకుండా పోయింది. రాజధాని ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు చెప్పే క్యాపిటల్ ప్రాంతంలోనే లోకేష్‌ను ప్రజలు తిరస్కరించారు. ఎకరం రూ.15 కోట్లకు ఎందుకు కొనాలి? రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం హక్కా...కాదా? ప్రభుత్వానికి హక్కు లేకపోతే చంద్రబాబు ఎలా నిర్ణయించారు? లక్షకోట్లు ఖర్చు చేస్తే తప్ప...మౌలిక వసతులు కల్పించలేం. వికేంద్రీకరణ ఎందుకు చేస్తున్నారో సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలనుకున్నారు. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని సీఎం చెప్పారు. న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధికి దోహదపడుతుంది. మూడు ప్రాంతాలకి సమన్యాయం చేయాలనే సీఎం ఆలోచన. వికేంద్రీకరణ వల్ల అమరావతి రైతులు నష్టపోకూడదనే కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారు. రైతు కూలీలకు కూడా రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచారు. బినామీల భూముల ధరలు పెంచేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఎకరం రూ.15 కోట్లకు ఎందుకు కొనాలో తెలియని పరిస్థితి.(‘కియా’పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు) ఏం చేస్తామని చెప్పామో... చేసి చూపిస్తాం చంద్రబాబుపై ఉద్యోగులకు నమ్మకం ఉంటే అమరావతిలో ఉద్యోగులు ఎందుకు నివాసం ఏర్పాటు చేసుకోలేదు. ఆయన కూడా అక్రమ కట్టడంలోనే నివాసం ఉంటున్నారు. చంద్రబాబుది నాలికా...తాటి మట్టా అర్థం కావడం లేదు. ఆయన మానసిక వైఫల్యంతో సీఎం జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబులాగా విజన్ పేరుతో కాలయాపన చేయడం లేదు. ఐదేళ్లలో మేం ఏం చేస్తామని చెప్పామో... చేసి చూపిస్తాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పుతో మా మీద బాధ్యత పెరిగింది. చంద్రబాబు రాజకీయం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రమంతటా ర్యాలీలు జరుగుతున్నాయి. ఎల్లో మీడియాకు మాత్రం కనిపించడం లేదు. భద్రత లేకుండా చంద్రబాబు వెళుతున్నారా? శాంతి భద్రతలను గౌరవించాలనే మేం పోటీ కార్యక్రమాలు చేయడం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికి తీసుకుపోవడం లేదు. ఒక రాజధాని అమరావతిలో మరొక రాజధాని విశాఖలో, మరొక రాజధాని కర్నూలులో ఉంటుంది. ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు బుద్ది రాలేదు. కళ్లు నెత్తికెక్కి టీడీపీ నాయకులు వ్యవహరించారు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు. చంద్రబాబుకు వయసు పెరిగిన బుద్ది పెరగలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర పరిధిలోనిది. రాజధాని అనేది మార్చలేదు... మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. రాజధానికి భూముల ఇచ్చిన వారిలో 14 వేల మంది రైతులు కాదు. చంద్రబాబు అప్పు తెచ్చిన మూడు లక్షల కోట్లలో ఒక లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.(కియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : బుగ్గన) పవన్ కల్యాణ్ లెటర్ హెడ్స్ కూడా టీడీపీ వద్దే ఉన్నట్లున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలుగానే పవన్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఒకరోజు సీఎస్ సెలవులో వెళ్లిపోయారని... ఇంకోరోజు కియా తరలి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సెలెక్ట్ కమిటీ లేదు.. దానికి మండలి ఆమోదం లేదు. సభలో తీర్మానం చేయకముందే విచక్షణాధికారాన్ని ఎలా ఉపయోగిస్తారు. కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు బతుకంతా మేనేజ్‌చేయడమే.. కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బతుకు అంతా మీడియా మేనేజ్మెంట్నే. కియా ఎందుకు పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళతాం. ఎన్నార్సీ అనేది రాష్ట్రానికి అవసరం లేదు. ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వం. ఎన్నార్సీకి మేం వ్యతిరేకం. ముస్లింల క్షేమం మా లక్ష్యం. ముస్లిం బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగనివ్వం’ అని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. -
చంద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పిచ్చారు: సజ్జల
-
బేషుగ్గా చెప్పిన బుగ్గన
-
కియా’పై పచ్చ ప్రచారం