
సాక్షి,పెనుకొండ/పుట్టపర్తి అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ‘కియా’ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 5న కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తెలిపారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నట్లు వివరించారు. మంత్రి వెంట కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, సబ్‌కలెక్టర్ టి.నిశాంతి, కియా ప్రతినిధులు ఉన్నారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రమాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అక్కడి సౌకర్యాలపై విమానాశ్రయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రన్‌వే భద్రతాపై చర్చించారు. వీరి వెంట ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, కదిరి ఆర్డీఓ రామసుబ్బయ్య, తహసీల్దార్ గోపాలక్రిష్ణ, సీఐలు వెంకటేష్‌నాయక్, బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు.
పుట్టపర్తి విమానాశ్రయంలో రన్‌వే పరిశీలనకు వెళ్తున్న అధికారులు
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న జిల్లాకు విచ్చేస్తున్నారు. ‘కియా’ మోటర్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం షెడ్యూల్‌ను అధికారులు మంగళవారం విడుదల చేశారు.
పెనుకొండ సమీపంలోని కియా కంపెనీలో ఏర్పాట్ల పరిశీలనకు వెళ్తున్న కలెక్టర్, ఎస్పీ..
సీఎం పర్యటన ఇలా..
►ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
►10.40 గంలలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.05 గంటలకు పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా మోటర్స్ కంపెనీకి వద్దకు చేరుకుంటారు.
►ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు ప్లాంట్ టూర్‌లో భాగంగా పరిపాలన విభాగం, ప్రెస్, బాడీ, పైయింట్, అసెంబ్లీంగ్, ఇంజన్ షాప్‌లను, టెస్ట్ డ్రైవర్‌ను సందర్శిస్తారు.
►మధ్యాహ్నం 12.35 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొని ప్రసంగిస్తారు.
►మధ్యాహ్నం 1.20 గంటలకు కియా కంపెనీ వద్ద నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
►మధ్యాహ్నం 1.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment