CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్ | AP CM YS Jagan Rapthadu Siddham Public Meeting Highlights In Telugu, Details Inside - Sakshi
Sakshi News home page

CM Jagan Rapthadu Meeting: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్

Published Sun, Feb 18 2024 6:54 PM | Last Updated on Mon, Feb 19 2024 1:19 PM

CM Jagan: Rapthadu Siddham Public Meeting Highlights - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్‌ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్‌ స్పీచ్‌కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టార్గెట్‌ 175 ఫిక్స్‌ చేసిన సీఎం జగన్‌.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్‌ క్యాంపెనర్లుగా  సీఎం జగన్‌ ప్రకటించారు.

లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్‌.. ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలని, సైకిల్‌ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్‌ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలంటూ జగన్‌ పొలిటికల్‌ పంచ్‌లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్‌
పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్‌ భరోసా
భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో జోష్‌
ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్
ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్

ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement