rapthadu
-
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో టీడీపీ నేతల దాష్టీకం
-
జోరుగా రాప్తాడులో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
బాధితుల వినతులు స్వీకరించిన సీఎం జగన్.. వెంటనే పరిష్కారం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో భాగంగా రాప్తాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఇద్దరు బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత 1. అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాచూరి ఝాన్సీకి లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్న డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి 2. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాచూరి ఝాన్సీ మాట్లాడుతూ తాను వికలాంగురాలినని, తనుకు ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్‌ను అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు రాచూరి ఝాన్సీకి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ సిద్ధం సభపై రాయలసీమ ప్రజల రియాక్షన్ అదుర్స్
-
KSR Comments: ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ
-
సైకిల్ ఇంటి బయటే ఉండాలి..
-
జగన్ వెంట జన సముద్రం
-
సీఎం జగన్ రాప్తాడు సిద్ధం సభ హైలైట్స్
-
CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్
సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్ స్పీచ్‌కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ►మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్ ►పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్ భరోసా ►భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్‌తో వైఎస్సార్సీపీ కేడర్‌లో జోష్ ►ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్ ►ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్ ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు -
Live: రాప్తాడు సిద్ధం బహిరంగ సభ
-
బాబు గుండెల్లో "సిద్ధం" ప్రకంపనలు
-
చరిత్రలో ఎన్నడూలేని విధంగా 10 లక్షల మంది తరలి వస్తున్నారు
-
సిద్ధం సభకు కుప్పం నుంచి భారీగా పోటెత్తుతున్న జనం
-
10 లక్షల మందితో సిద్ధం సభ..
-
రాప్తాడు సిద్ధం సభకు రోజా సైన్యం
-
బస్సుల్లో దండిగా తరలి వస్తున్న జనం
-
మీకు మూడింది..175/175...జగన్ ధీమా
-
YSRCP Siddam Sabha: జగన్ వెంట జన సముద్రం
Live Updates.. రాప్తాడు భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోంది. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకొనే ఎన్నికలుమాత్రమే కావు. ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ఈ పథకాలన్నీ కొనసాగాలని అడుగులు వేసే మనకు.. ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్గాపెట్టుకొని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? పేదలు ఒకవైపున ఉంటే, పెత్తందార్లు మరోవైపున ఉండి ఈ యుద్ధం జరగబోతోంది. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాటతప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందార్లకు మధ్యజరగబోతోంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతోంది. ఇలాంటి యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి తరఫున నిలబడటానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి, ఈ గడ్డమీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోంది. ఈ వేదికమీద నుంచి చంద్రబాబునాయుడు గారికి ఒక సవాల్ విసురుతున్నా. 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతున్నా. రెండు చేతులూ పైకెత్తి ఇలా ఇలా ఇలా.. అయ్యా చంద్రబాబూ.. మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్లే పిల్లలకైనా, కాలేజీలకు వెళ్లే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడు అన్న పరిస్థితి అయినా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని, మంచి పథకం తీసుకొచ్చాడని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమయినా ఉందా? బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా, ఆ గ్రామం మధ్యనిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ.. కనీసం ఒక్కటైనా కనిపిస్తుందా? ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్లయినా, హాస్పటల్స్ అయినా ఉన్నాయా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, మూడు సార్లు సీఎం అయ్యారు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా ఆ గ్రామంలో ఆగినా, ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబూ.. మీ మార్క్ ఎక్కడైనా ఉందా? అని అడుగుతున్నా. బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? ప్రతి సామాజికవర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగు రంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజికవర్గాలన్నింటినీ మోసం చేయడం.. ఇదే ఆయనవాయితీగా చంద్రబాబు పెట్టుకున్నారు. 1995లో చూసినా, 1999లో చూసినా, లేదా 2014లో చూసినా సీఎం అయిన ఈ పెద్దమనిషి చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టో ఇచ్చి.. ఏనాడైనా కనీసం 10 శాతం అయినా అమలు చేశారా? గతం ప్రజలకు గుర్తు ఉండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలు, మరకో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబిలోకి దింపి మనుషుల్ని తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తున్నాడు. రంగు రంగుల మేనిఫెస్టో అంటున్నాడు. ఆరు స్కీములంటాడు. ఇంకా ఆరు రావాల్సినవి ఉంటాయంటాడు. నిజంగా చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదంటే.. చేసేది ఎలాగూ మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు. చెప్పేది అబద్ధాలు. చేసేది మోసమే కాబట్టి, ఇక నోటికి కట్టి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకున్నది బాబు నైజం. నమ్మిన వాడు మునుగుతాడు. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది బాబు సిద్ధాంతం. మూడుసార్లు సీఎం అయ్యాడు. మూడు సార్లు మేనిఫెస్టోను పెట్టాడు. ప్రతి సందర్భంలోనూ తాను చేసింది మోసం, దగా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడూ అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికీ వెళ్లి ఇక్కడున్న ప్రతి కార్యకర్త వెళ్లి చెప్పాలి. చంద్రబాబును, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలూ మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుర్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతున్నా. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తున్నా. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమయినా గుర్తుకొస్తుందా? మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు చేయలేని పనులన్నీ దేవుడి దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరిస్తా. ఆ పథకాలన్నీ ఇకమీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మకు, విద్యార్థికీ, అవ్వాతాతకు, ప్రతి సామాజికవర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యత మనం తీసుకోవాలి. ఈ 57 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అన్నకూ, తమ్ముడికి, రైతన్నకు చెప్పాలి. పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని, ఆ అవసరాన్ని వైయస్సార్ సీపీలో ఉన్న ప్రతి కార్యకర్తా, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చేసినవి చెప్పాలి. వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్లి చెప్పాలి. నేను చెబుతున్న ప్రతి మాటా జాగ్రత్తగా ఆలోచన చేసి వినాలి. మనకు, మన వైయస్సార్సీపీకి, ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం. గ్రామాల్లో రైతన్నకు చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం. పగటిపూటే రైతన్నకు 9 గంటల ఉచిత విద్యుత్ తీసుకొచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. గతంలో ఏ రైతన్న చూడని విప్లవాత్మక మార్పులు ఇవీ. ఈ పథకాలన్నీ ప్రతి రైతన్నకూ కొనసాగాలన్నా, రైతుల్ని పీడించే బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు వచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం పెడతానని, బిర్యానీ పెడతానని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబు బేషరతుగా చేస్తానన్న 87612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తు చేయాల్సిన అవసరం మన ప్రతి కార్యకర్తకూ ఉంది. 2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కచెల్లెమ్మలకు కొనసాగాలంటే మహిళా సాధికారత కోసం ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై ఉంది. అవ్వాతాతల చిరునవ్వుల మధ్య వాళ్లందరికీ ఓ మాట చెప్పండి. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి. అక్కచెల్లెమ్మలకు మీరంతా ప్రతి ఒక్కరూ అర్థమయ్యేలా చెప్పండి. మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడులకు వెళ్లే పిల్లలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంగ్లీషు మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడుతున్న స్కూళ్లు, మొదటిసారి వారి పుస్తకాలకు బైజూస్ కంటెంట్ అనుసంధానం, టెక్స్ట్ బుక్కుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ట్యాబులు, క్లాసు రూముల్లో 6వ తరగతి పైబడిన క్లాసు రూముల్లో డిజిటల్ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌తో కనిపిస్తున్నాయి. మొదటిసారి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ సైతం బోధన చేయడం జరుగుతోంది. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం సాగుతోంది. పెద్ద చదువులు చదువుతున్న వారికి ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్ష్‌మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ల ఇంటికి వెళ్లిప్పుడు అడగండి. ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఎంతలా ఉందో గమనించాలని అడగండి. తల్లిదండ్రులు, పిల్లల్ని ఇవన్నీ కొనసాగాలంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడాలంటే, పెత్తందార్లతో పోటీ పడే పరిస్థితి జరగాలంటే అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు.. మరో 10-15 సంవత్సరాల్లో అంతర్జాతీయ చదువులతో, పెత్తందార్ల పిల్లలకన్నా మించిపోయి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ పేద పిల్లలకు వేరే దేశాల్లో గొప్ప ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి విప్లవాత్మక మార్పులు కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయడమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటేయడం, సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం రద్దుకు ఓటేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇవన్నీ కొనసాగాలంటే స్టార్ క్యాంపెయినర్లుగా మారి మరో వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పండి. జగన్ పేరు చెబితే, వైయస్సార్ సీపీ పేరు చెబితే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు మా జగన్, మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు, వెయ్యి నుంచి రూ.3 వేలు చేశాడు, వాలంటీర్ ద్వారా ఆదివారమైనా సెలవైనా ఒకటో తేదీ సూర్యోదయానికి కంటే ముందే చిక్కటి చిరునవ్వుతో మా చేతిలో పెడుతున్నాడు, ఇది కేవలం మీ జగన్ ఉంటేనే కొనసాగుతుందని చెప్పండి. పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే మళ్లీ పెన్షన్లు ఇచ్చే రోజులు రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా, ఇంటికొచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా వైయస్సార్సీపీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇంటింటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి అవ్వా, ప్రతి తాతా, వికలాంగ సోదరుడు, అక్కచెల్లెమ్మ బయటకొచ్చి వంద మందికి చెప్పి జరుగుతున్న మంచి కొనసాగాలంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జగన్, వైయస్సార్సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. 104, 108 వాహనాలు కొత్తగా కనిపిస్తాయి. ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్,ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షతో జల్లెడ పడుతూ ఎవరికి బాగోలేకపోయినా మందులు ఇంటికి ఇచ్చిపోయే గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది. కోవిడ్ కష్టకాలంలో కూడా అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలను అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిల్చుంటే ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న మన పిల్లలు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడునేడుతో రూపు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50-60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా వివక్ష చూపకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే.. అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగాయి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వివక్ష లేకుండా, లంచం లేకుండా మీ బిడ్డ, మీ అన్న అక్షరాలా 125 సార్లు బటన్ నొక్కాడు. ఏకంగా 2.55 లక్షల కోట్లు పంపిన మాట వాస్తవం కాదా అని ప్రతి అక్కను, చెల్లెమ్మను అడగండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో ఆగినా, ఏ సామాజికవర్గాన్ని చూసినా 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్, అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ, గ్రామంలోనూ కనిపించేది మీ జగన్ మార్క్, వైయస్సార్ సీపీ మార్క్ అభివృద్ధి. ప్రజలు మనకు ఫస్ట్ టైమ్ ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచిచేయగలిగాం. ఇక ప్రజలు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ప్రతి అడుగులోనూ ముఖ్యమంత్రిగా నేనుంటూ అణగారిన వర్గాల మీద నేను చూపిస్తున్న ప్రేమ.. ప్రతి మాటకూ ముందు నా.. నా.. నా.. అంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఏకంగా 2.55 లక్షల కోట్లు.. నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతున్నాయి. ఇందులో 75 శాతం నానానా అని పిలుచుకొని నా వర్గాలకే ఇచ్చాను అని చెప్పుకొనేదానికి సంతోషపడుతున్నా. నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పండి. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నేను నానానా అని పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకు వచ్చాయంటే అది జరిగింది, ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తున్నంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పండి. దాదాపు 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కకులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరంటే మీ జగన్. అందులో అత్యధికం పేద సామాజికవర్గాలకు చెందినవే అని తెలిసి వారికి మేలు చేసింది ఎవరంటే మీ జగన్. ఇచ్చింది ఎవరంటే మన వైయస్సార్సీపీ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రిమండలి వరకు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభ, శాసనసభాపతి వరకు, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. వచ్చింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఈ వర్గాలన్నీ కదిలి రావాలని, స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని, బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడం అని, డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అని ప్రతి ఒక్కరికీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలా మంది పాలన చూశారు. చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఎవరైనా మేనిఫెస్టోను మన మాదిరిగా, ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి 99 శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్. ఒక్క వైయస్సార్ సీపీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపిస్తోంది. ఫస్ట్ చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. అయ్యా బాబూ.. ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి?జగన్ మార్క్ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నప్పుడు ఎందుకు బాబుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నా. తన నడక కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబూ? తన సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? మీకు కూడా తెలుసు.. జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడు కాబట్టి, వైయస్సార్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికి ఉందని తెలుసు. ప్రతి గ్రామానికి, ప్రతి సామాజికవర్గానికి, ప్రతి పేదవాడూ జగన్‌ను, వైయస్సార్సీపీని గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 125సార్లు ఈ 57 నెలల్లో బటన్లు ప్రజల కోసం నేను నొక్కాను. ఏకంగా 2.55 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లింది. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో మనం సిద్ధం అంటుంటే, మరోవంక బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తానూ పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేమూ సిద్ధం అని వేయిస్తాడు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు? దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంత మంది.. ఇన్ని లక్షల గుండెలు, కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లో తోడుగా ఉండే గుండెలు. ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, వాలంటీర్‌కు, ఒక్క విషయం చెబుతున్నా. ఇది మీ అందరి పార్టీ. కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్ యార్డులు, దేవాదాయ బోర్డులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులివ్వడం కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం. గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అనే వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మన ప్రభుత్వం మనలో నుంచి చదువుకున్న మన పిల్లలతో తీసుకొచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా ప్రజల మన్ననలు పొందుతోంది. మనతోపాటు పని చేస్తోంది. మన వారికి చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ మీద ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో ఇదే పంథా న్యాయం చేశాం. జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మంచి పాలన అందించాం. భవిష్యత్‌లో మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికోసం నిలబడినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు. మంచి పాలనలో భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ పదవులిచ్చే పార్టీ మన వైయస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్తకూ, ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు అవకాశం కల్పించే బాధ్యత నాదీ. ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. గతంలో చంద్రబాబు పరిపాలన కూడా చూశారు. ఎలాంటి నాయకుడు మీకు కావాలి? చంద్రబాబు మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టోలు చూపి రైతన్నలను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలనే దిక్కుమాలిన ఆలోచన చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందర్నీ మోసం చేస్తున్న అలాంటి చంద్రబాబు మాదిరిగా ఉండాలా? నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అని రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టే, ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలు నెరవేర్చా కాబట్టే ప్రతి ఇంటికీ వెళ్లి అక్కా మీరే టిక్ పెట్టండి, ఎన్నెన్ని జరిగాయో, 99 శాతం మా అన్న నెరవేర్చాడని ప్రతి కార్యకర్త ప్రతి పేద వాడి ఇంటికి వెళ్లగలుగుతున్నాడు. ఇదీ నాయకుడు అంటే. నాయకుడంటే ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు మాటిచ్చాడు అంటే చేస్తాడంతే అనే పరిస్థితి ఉండాలి. ప్రతి కార్యకర్తకూ ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు మాకు అండగా తోడుగా ఉండాలి అనేలా ఉండాలి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ, ప్రతి పేద కుటుంబానికీ, ప్రతి పేదకు, వారి భవిష్యత్‌కు అండగా నిలబడగలిగాం. మాట ఇచ్చాం. నెరవేర్చాం. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లగలిగే పరిస్థితి మనకు, మన వైయస్సార్సీపీకి ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్... 175కు 175 అని అడుగుతున్నా. మన టార్గెట్ 25కు 25 ఎంపీలు అని అడుగుతున్నా. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలే లేదు. ఇదీ 350 వాగ్దానాలిచ్చి అందులో 10 శాతం కూడా అమలు చేయని చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు ప్రభుత్వం కాదు.. ఇదీ... ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసి మరీ ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు కోరుతున్న మన వైయస్సార్సీపీ పార్టీ. అటు టీడీపీ, ఇటు వైయస్సార్సీపీ, అటు పెత్తందార్లు, ఇటు పేదవాడు. పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా? వారి మీడియా, వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. దానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా? మీ అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. సెల్ టార్చర్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా.. సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకం, సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా? అని అడుగుతున్నా. ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు ఇప్పటికే 75. ఆయన వయసు 80కి పోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడు. కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంత మంది తోడేళ్లు ఏకం అవుతున్నారు. అందుకే ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒకడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, రైతన్న కూడా మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. పేదవాడి భవిష్యత్ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10-15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయేఎన్నికలు అత్యంత కీలకం. పేదవాడి ప్రతి గుండె ఏకం కావాలి. పెత్తందార్ల పార్టీలను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి రావాలి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాప్తాడు వైఎస్సార్సీపీ సభ సభా ప్రాంగణం ఖాళీ లేక జాతీయ రహదారులపై నిల్చున్న లక్షలాది జనం ఇంకా తరలివస్తున్న అభిమానులు రాప్తాడు చేరుకున్న సీఎం జగన్ రాప్తాడులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ వైఎస్సార్సీపీ కేడర్, అభిమానులతో కిక్కిరిసిన ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఇంకా లక్షలాదిగా తరలివస్తున్న జనం సిద్ధం సభ.. టీడీపీకి దడ పుడుతోంది: మంత్రి ఉషాశ్రీ చరణ్ సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మనది వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలవడమే లక్ష్యం ట్రెండింగ్‌లో ‘సిద్ధం’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ‘సిద్ధం’ కార్యక్రమం ట్విట్టర్లో దేశంలోనే మొదటిస్థానంలో ట్రెండ్ అవుతున్న ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్ సిద్ధం అప్డేట్స్ను భారీగా షేర్ చేస్తున్న వైఎస్సార్సీపీ అభిమానులు ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో నిండిపోయిన ఫేస్బుక్, ట్విట్టర్ ►తాడేపల్లి నుంచి రాప్తాడుకు బయలుదేరిన సీఎం జగన్ ►కాసేపట్లో సిద్ధం సభకు చేరుకోనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►కాసేపట్లో సిద్ధం సభ ప్రారంభం. ►వైఎస్సార్సీపీ సిద్ధం సభకు భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు. ►కర్నూలు జిల్లా ఆలూరు నుంచి 80 బస్సుల్లో సిద్ధం సభకు బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు. చంద్రబాబుకు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కౌంటర్ చంద్రబాబు మందు, బిర్యానీలు ఇచ్చినా సభలకు జనం రావటం లేదు అందుకే ప్రస్టేషన్‌తో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు సీఎం జగన్ నిర్వహించే సిద్ధం సభలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు సిద్ధం సభలకు ఒక లక్ష్యం ఉంది తాను మేనిఫెస్టోను అమలు చేశానని నమ్మితేనే తనకు ఓటెయ్యమని సీఎం జగన్ చెప్తున్నారు అలా ఓట్లు అడగటం హీరోయిజం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న యుద్దంలో భాగంగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు కిందిస్థాయి నుండి రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యాం. అలాంటి మమ్మల్ని జీరోలమంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు మాకు రాజకీయ జీవితాలను జగన్ ఇచ్చారు ఆయన ఏం చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఓసీలు పోటీ చేసే సీట్లలో బలహీన వర్గాలకు జగన్ ఇచ్చారు అలా సీట్లు ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? బీసీలు, ఎస్సీలను రాజ్యసభకు జగన్ పంపించారు చంద్రబాబు తన జీవితంలో ఇలా ఏనాడూ చేయలేదు జగన్ మళ్ళీ సీఎం అయితేనే పల్లెలు, పేదల బతుకులు మారతాయి నారా లోకేష్‌కి మైండ్ పోయింది అందుకే రుషికొండ మీదున్న ప్రభుత్వ భవనం ఎదుట సెల్ఫీ తీసుకున్నాడు రాజధానిలో పేదల ఉసురు కొట్టటం వలన చంద్రబాబు, లోకేష్ రోడ్డున పడ్డారు ►రాప్తాడు సిద్ధం సభకు సీమలోని పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు భార సంఖ్యలో తరలివస్తున్నారు. ►ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్ సిద్దమయ్యారు. నేడు రాప్తాడు వద్ద సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. ►రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇక, సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. -
సిద్ధం సభకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు
-
దూసుకుపోతున్న జగన్...రాప్తాడులో సిద్ధం సభ
-
కనీవినీ ఎరుగని రీతిలో రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ
-
రాప్తాడు సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటన
-
రాప్తాడులో రేపు సిద్ధం సభ
-
ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ
-
చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధం సభ ఉంటుంది: MLA వెంకట రామిరెడ్డి
-
బాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అనంతపురం: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని తెలిపారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందని విమర్శించారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామని అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుందన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అంటేనే నిజం అని.. ఖచ్చితంగా నిజం గెలుస్తుందన్నారు. టీడీపీ పతనావస్థకు చేరిందని, ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతోందని. .. పతనావస్థకు ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు. 18న రాప్తాడులో వైఎస్సార్సీపీ ' సిద్ధం' సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల: మంత్రి రోజా -
రాప్తాడు సిద్ధం సభ తేది మార్పు..పెద్దిరెడ్డి కీలక ప్రకటన
-
రాప్తాడులో సామాజిక సాధికార యాత్ర
-
పరిటాల సునీత, శ్రీరామ్‌లపై కేసు నమోదు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ చేసు నమోదైంది. కాగా కనగానపల్లి మండలంలో బుధవారం అనుమతి లేకుండా నిర్వహించిన ర్యాలీలో రాప్తాడు టీడీపీ ఇంచార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల సునీత, శ్రీరామ్ సహా 119 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరిటాల సునీత, ఆమె తనయుడిపై నిబంధనలకు విరుద్ధంగా వ్వహరించినందుకు కేసు ఫైల్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. అంతకముందు కూడా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు -
పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం
సాక్షి, అనంతపురం: వివాహమైన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో నవ వధువు పరారయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు, ప్రశాంత్‌కుమార్ సోదరులు. వీరికి తండ్రి లేడు. బతుకు తెరువు కోసం తల్లి అంజనమ్మ కువైట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో సోదరులిద్దరూ అనంతపురానికి వలసవచ్చి నగర శివారులోని కురుగుంట వైఎస్సార్ కాలనీ నివాసముంటున్నారు. తిమ్మరాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్‌కుమార్ డిగ్రీ పూర్తయి ఇంటివద్దనే ఉంటున్నాడు. గత నెల 9న ఓ యువతితో తిమ్మరాజుకు వివాహమైంది. ఈ పెళ్లి ఇష్టంలేని ఆమె పెళ్లైన మూడో రోజే అంతకు ముందు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. నవ వధువు కనిపించకపోయే సరికి కంగారుపడ్డ తిమ్మరాజు, బంధువులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తిమ్మరాజు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు ప్రశాంత్‌కుమార్ పలుచోట్ల వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే. -
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
25 ఏళ్లుగా పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాకు చేసిందేమి లేదు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
చెప్పులు నీ దగ్గరే కాదు మా వద్ద కూడా ఉన్నాయి : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ
రాప్తాడు (అనంతపురం): మండలంలోని రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. వివరాలు.. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు. కాగా, ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్లో జరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో బీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2018లో గ్రూప్–1 పరీక్ష రాశారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. చదవండి: (ఆర్బీకే ఓ అద్భుతం!) -
‘రాప్తాడు’లో పరువు హత్య
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని భార్య తరఫువారు గొంతుకోసి చంపేశారు. బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి ప్రాణాలు తీశారు. తన తల్లి ఈ హత్య చేయించిందని హతుడు చిట్రా మురళి (27) భార్య వీణ ఆరోపిస్తోంది. పోలీసులు, వీణ కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల ఏకైక కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్), యశోదమ్మల ఏకైక కుమారై వీణ పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. మురళి డిగ్రీ, వీణ బీటెక్ పూర్తిచేశారు. ప్రస్తుతం మురళి పెనుకొండ సమీపంలోని కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నారు. పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి కులాలు వేరుకావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి గతేడాది జూన్ 23న ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. 4 నెలలు అనంతపురంలో తలదాచుకున్నారు. తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అక్కడి నుంచే విధులకు వెళ్లసాగారు. కిడ్నాప్ చేసి హత్య మురళి ఉద్యోగానికి వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటినుంచి ద్విచక్ర వాహనం మీద బయలుదేరాడు. ఆ వాహనాన్ని రాప్తాడులోని 44వ నంబరు జాతీయ రహదారి పక్కనున్న పెట్రోలు బంకులో పార్కుచేసి, కంపెనీ బస్సు కోసం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వేచి ఉన్నాడు. అంతలోనే ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా ఎక్కించుకున్నారు. రాప్తాడు నుంచి లింగనపల్లి రోడ్డు మీదుగా బొమ్మేపర్తి పొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకొసి హత్యచేశారు. శుక్రవారం ఉదయం ఆ పొలాల్లోకి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకులు మృతదేహాన్ని చూసి 100కు డయల్ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, వీణ తల్లి యశోదమ్మను, పెదనాన్న, పెద్దమ్మ, ఇద్దరు బాబాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా అమ్మే చంపించింది మా పెళ్లికి మా అమ్మ యశోదమ్మ ఒప్పుకోలేదు. పెళ్లయిన తర్వాత కూడా మమ్మల్ని పలుమార్లు బెదిరించింది. ‘నాకు మొగుడు లేడు.. నీకూ లేకుండా చేస్తా’ అనేది. అన్నట్లుగానే నా భర్తను హత్య చేయించింది. – వీణ, హతుడి భార్య యశోదమ్మే హత్య చేయించింది నా కొడుకును యశోదమ్మే హత్య చేయించింది. నా బిడ్డను వదిలి పెట్టకపోతే నీ కొడుకును హత్య చేయిస్తానని పలుమార్లు మా ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించింది. ఇప్పుడు అనుకున్నట్టే చేసింది. ఒక్కగానొక్క కొడుకును పొట్టనబెట్టుకుంది. ఇక మేమెలా బతకాలి? – ముత్యాలమ్మ, హతుడి తల్లి -
అత్తను గెంటేసిన కోడళ్లు! అనాథగా మారిన అవ్వ
నా అనుకున్న వారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. రూ.లక్షలు విలువ చేసే ఆస్తిపాస్తులున్నాయి. ఒకరిపై ఆధారపడనవసరం లేదు. అయినా ఆ వృద్ధురాలు వీధిన పడింది. డబ్బు ముందు మానవ సంబంధాలు అడుగంటడంతో ఏడు పదుల వయసులో ఇతరుల దయాదాక్షిణ్యాలపై బతుకు బండి లాగిస్తోంది. రాప్తాడు/అనంతపురం కల్చరల్: రాప్తాడు మండలం గంగులకుంట గ్రామానికి చెందిన నారాయణమ్మకు 74 ఏళ్లు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్దన్నతో ఆమెకు వివాహమైంది. పెళ్లి అనంతరం గంగులకుంటలోనే వారు స్థిరపడ్డారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీనారాయణ సంతానం. కొడుకు మృతితో కష్టాలు మొదలు దాదాపు 20 ఏళ్ల క్రితం సిద్దన్న మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు కలిసే ఉంటున్నారు. తండ్రి బతికున్నప్పుడే కుమారుడు లక్ష్మీనారాయణ రాప్తాడుకు చెందిన ఓబుళమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కాకపోవడంతో రెండో పెళ్లికి లక్ష్మీనారాయణ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మేనమామ కుమార్తె లక్ష్మీదేవి అయితే తన తల్లిని బాగా చూసుకుంటుందని భావించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకున్నంత కాలం తల్లికి ఏ కష్టమూ రాలేదు. పదేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఆ తర్వాత నారాయణమ్మకు కష్టాలు మొదలయ్యాయి. జీమాను కట్టనే దిక్కు భర్త మరణించే నాటికి నారాయణమ్మ పేరుపై 12 సెంట్ల దొడ్డి, 6 ఎకరాల మెట్ట పొలం, రెండు ఇళ్లు, కొంత నగదు ఉండేది. స్థిరాస్తుల విలువ రూ. లక్షల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో కోడళ్లు చెరి సగం డబ్బు పంచుకుని నారాయణమ్మను పట్టించుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నా అనుకున్న తమ్ముడు సైతం కుమార్తె సుఖం కోసం అక్కను పట్టించుకోవడం మానేశాడు. ఆత్మాభిమానం.. అమాయకత్వమున్న నారాయణమ్మ ఎవరు చెప్పినా వినకుండా గ్రామం మధ్యలో జీమాను కట్టను ఆశ్రయించింది. మొండితనం... మంకుపట్టు జీమాను కట్టపై జీవనం సాగిస్తున్న నారాయణమ్మ తన ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కోడళ్ల ముఖం చూడనని భీష్మించుకుంది. దీంతో నారాయణమ్మకు ఏమైనా జరిగితే గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించిన గ్రామస్తులే ఏ పూటకా పూట తిండి పెట్టి బాగోగులు చూస్తున్నారు. అధికారులు స్పందించి నారాయణమ్మ విషయంలో జోక్యం చేసుకుని ఆమె శేష జీవితం ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. (చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి) -
ఏ జన్మలో చేసుకున్న పాపమో.. ఏడవని రోజంటూ లేదు
పుట్టుకతోనే వచ్చిన మాయదారి రోగం ఆ చిన్నారుల జీవితాల్లో అంధకారం నింపింది. 18 ఏళ్లుగా ఒకరు, 14 ఏళ్లుగా మరొకరు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు జీవచ్ఛవంలా మారడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఇల్లంతా కన్నీళ్లు పరచుకుని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ పేదింటి కథ ఇదీ.. రాప్తాడు: మండలంలోని మరూరు పంచాయతీ చాపట్ల గ్రామానికి చెందిన మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు ఇద్దరు కవలలు పుట్టారు. పెద్ద కుమారుడు కుళ్లాయప్ప ప్రస్తుతం అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండో కుమారుడు ఆంజనేయులుకు మాయదారి జబ్బు వచ్చింది. తర్వాత నాలుగేళ్లకు అమ్మాయి కీర్తన జన్మించగా, తను కూడా మతిస్థిమితం కోల్పోయింది. వీరికి బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఎముకల్లో సారం లేక పిల్లలు జబ్బు పడ్డారని, బెంగళూరు లేదా హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తే కొంత వరకు నయమవుతుందని వైద్యులు తెలిపారు. వైద్యానికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటికే రూ.30 లక్షల వరకూ ఖర్చు.. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న ఆంజనేయులు, 14 ఏళ్ల వయసున్న కీర్తనకు వైద్యం కోసం గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులు రూ.30 లక్షల వరకూ ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం కన్పించలేదు. మెరుగైన వైద్యం చేయించేందుకు డబ్బు లేక, పిల్లలను పోషించుకోలేక కన్నీటిని దిగమింగుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కుమారుణ్ని ఇంట్లోకి తీసుకెళుతున్న తల్లిదండ్రులు భారమైన పిల్లల పోషణ.. మతిస్థిమితం లేని, కాళ్లూ చేతులు చచ్చుబడి కదల్లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పోషణకు నెలకు రూ.10 వేలు ఖర్చవుతోంది. ఒక్కొక్కరికి రూ.3 వేల పింఛన్ వస్తున్నా.. ఆ డబ్బు మందులకే సరిపోతోంది. అమ్మ ఈశ్వరమ్మే వారికి రోజూ స్నానం చేయించాలి. అన్నం తినిపించాలి. నీళ్లు తాగించాలి. ఇతర పనులన్నీ చేయాలి. ఇద్దరినీ చూసుకునేందుకు అమ్మా నాన్న ఇద్దరూ తప్పనిసరిగా వాళ్ల దగ్గరే ఉండాలి. ఆపన్నహస్తం అందించరూ.. కుళ్లాయప్ప వంట చేసేందుకు వెళుతుంటాడు. అక్కడ వచ్చిన డబ్బుతో పిల్లలకు వైద్యం, కుటుంబ అవసరాలు చూసుకునేవాడు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి శుభకార్యాలు తగ్గిపోయాయి. దీంతో వంట పని పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాడు. కూలి డబ్బులతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. పైగా ఎక్కువ సమయం పిల్లల వద్దే ఉండాల్సి వస్తుండడంతో కూలి పనులకు కూడా రెగ్యులర్‌గా వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం ఆంజనేయులు 60 కిలోలు, కీర్తన 40 కిలోల బరువు ఉండడంతో వారిని ఒకరే పైకి ఎత్తలేని పరిస్థితి. వారిని పక్కకు తిప్పాలన్నా, మరో చోటకు మార్చాలన్నా ఇద్దరూ ఉండాల్సిందే. ఇలా ఐదారేళ్ల నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ వారి బాగోగులు చూసుకుంటూ ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నారు. పిల్లలు శారీరకంగా ఎదుగుతున్నా మానసికంగా ఎటువంటి మార్పూ లేదు. చనిపోవాలనుకున్నాం.. ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఈ జన్మలో నరకం అనుభవిస్తున్నాం. మేం ఏడవని రోజంటూ లేదు. ఈ కష్టం పగవాడికీ రాకూడదు. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. పెద్దాస్పత్రులకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు అప్పులు చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి తెస్తున్నారు. పిల్లల దయనీయస్థితి చూసి తట్టుకోలేకపోతున్నాం. ఒకానొక దశలో పురుగుల మందు తాగి చనిపోవాలనుకున్నాం. కానీ పిల్లలను చంపడం ఇష్టం లేక ఆ నిర్ణయం మానుకున్నాం. – మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ సాయం చేయదలిస్తే.. పేరు : టి.ఈశ్వరమ్మ బ్యాంకు : ఏపీజీబీ, మామిళ్లపల్లి, కనగానపల్లి మండలం ఖాతా నంబర్ : 9105172249 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ 0001085 సంప్రదించాల్సిన నంబర్: 97011 41349 -
నిద్రమత్తులో తూగిన డ్రైవర్: ట్రావెల్స్ బస్సు బోల్తా
రాప్తాడు (అనంతపురం జిల్లా): డ్రైవర్ నిద్ర మత్తులో తూగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన రాప్తాడు వద్ద జాతీయ రహదారి-44పై మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు (కేఏ51 ఏసీ 6440) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సోమవారం రాత్రి 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చేరింది. తపోవనంలో మరొక డ్రైవర్ షఫీవుల్లా డ్రైవింగ్ తీసుకున్నాడు. రాప్తాడు దగ్గరకు రాగానే నిద్రమత్తులో తూగాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దిగింది. దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ షఫీవుల్లాతో పాటు బెంగళూరుకు చెందిన సురేష్ గౌడ్, మహమ్మద్ షఫీవుల్లా, మహమ్మద్ షేక్ ఆరిఫ్, మహమ్మద్ షమీవుల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హైవే సిబ్బంది 108 వాహనంలో సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. -
‘వలంటీర్’ సేవ; ఆత్మ బంధువులే తోడుగా..
రాప్తాడు: అసలే చిరుద్యోగం... సంపాదన అంతంత మాత్రమే... అయినా ఆ కొద్ది పాటి ఆదాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు వినియోగిస్తున్నాడు వలంటీర్ దండు బీరప్ప. రాప్తాడు గ్రామ సచివాలయం–2లో విధులు నిర్వర్తిస్తున్న వలంటీర్ దండు బీరప్ప... కోవిడ్ కట్టడికి తన వంతు సాయంగా ముస్లిం మైనారిటీ కాలనీలోని 300 కుటుంబాలకు ఆదివారం మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఇందు కోసం ఎవరినీ ఆశించకుండా తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ సందర్భంగా వలంటీర్‌ను స్థానికులు అభినందించారు. ఆత్మబంధువులే తోడుగా... ఓడీ చెరువు: కరోనా వైరస్ వల్ల రక్త సంబంధాన్ని సైతం మర్చిపోయే మరో ఘటన ఆదివారం ఓడీ చెరువులో చోటు చేసుకుంది. ఇదే సమయంలో సాటి మనుషులుగా ఇతర మతానికి చెందిన వారు మానవత్వం చూపారు. వివరాలు... ఓడీ చెరువులోని బీసీ కాలనీకి చెందిన అశోక్(21)తో కరోనా చికిత్స పొందుతూ ఆదివారం కోవిడ్ ఆస్పత్రిలో మరణించాడు. ఇతని అంత్యక్రియలు నిర్వహించేందుకు సమీప బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ తలబా ఆర్గనైజేషన్ సభ్యులు ఆరీఫ్, ఆసీఫ్, ఫయాజ్, ఇర్ఫాన్, ఇమ్రాన్, ముస్తాక్, జాఫర్, ఇర్షాద్, షాను ముందుకు వచ్చారు. హిందూ సంప్రదాయ రీతిలో శ్మశానానికి మృతదేహాన్ని తరలించి, ఖననం చేశారు. కరోనాతో మృతి చెందిన యువకుడికి అంతి సంస్కారాలు చేస్తున్న ముస్లిం యువకులు చదవండి: Kurnool: ఆడుతూ పాడుతూ.. ఆరోగ్యంగా ఇంటికి -
పరిటాల సునీతకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం(రామగిరి): పంచాయతీ ఎన్నికల వేళ మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి టీడీపీ మండల కన్వీనర్‌గా ఉన్న సుబ్బరాయుడు ఆదివారం తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను ఏ మాత్రం పట్టించుకోలేదని, దీంతో కన్వీనర్‌గా తాను ఏమీ చేయలేకపోయానన్నారు. -
ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..
ఒకప్పుడు అది కారడవి.. ఎటు చూసినా పెద్ద పెద్ద గుట్టలు.. బండరాళ్లే దర్శనమిచ్చేవి. అటు వైపు ఎవరూ కన్నెత్తి చూసేవారు కూడా కాదు.. ఇదంతా గతం. గుట్టను తొలచారు.. గుడిగా మలచడంతో ఇప్పుడా ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. రాప్తాడు: రాప్తాడు మండలంలోని 44వ జాతీయ రహదారి సమీపంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రం (మౌనగిరి బ్రహ్మ పీఠం) నిరంతరం జై శ్రీరాం.. జై ఆంజనేయ నినాదాలతో మార్మోగుతోంది. 39 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం నేనున్నానంటూ భక్తులకు అభయమిచ్చేలా దర్శనమిస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విరిగిపోయిన విగ్రహం.. విశ్రాంత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యస్వామి, ఆయన సతీమణి ప్రధానోపాధ్యాయులురాలు వేదవతి వాళ్లకు వచ్చిన సంపాదనతో 1999 సంవత్సరంలో 14 ఎకరాల విస్తీర్ణంలో మౌనగిరి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎకరా విస్తీర్ణంలో అభయాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే 2008లో రూ.50 లక్షల వ్యయంతో 27 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహం తయారు చేయించారు. దీనిని మౌనగిరి క్షేత్రంలో ప్రతిష్టిస్తుండగా ప్రమాదవశాత్తూ విగ్రహం కిందపడి విరిగిపోయింది. ఫలితంగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది మౌనగిరి క్షేత్రం. ఆంజనేయస్వామి భారీ విగ్రహం ముక్కలు కాగానే కార్యక్రమ కార్యనిర్వాహకులు మౌనగిరి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్య స్వామితో పాటు విగ్రహ ప్రతిష్టకు వచ్చిన అశేష భక్త జనం ఆందోళన చెందారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 39 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల మందం, 12 అడుగుల వెడల్పు, 225 టన్నుల బరువు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని తయారు చేసేందుకు కర్ణాటకలోని కొయిరా గ్రామం నుంచి ప్రత్యేక రాయిని తెప్పించారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి విశేషానుభవం ఉన్న పలువురు శిల్పులు ఏడాది పాటు నిరంతరం శ్రమించి ఆంజనేయుని విగ్రహాన్ని మలిచారు. దాదాపుగా రూ. 9 కోట్లు వెచ్చించి 39 అడుగుల అభయాంజనేయస్వామి స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. అలాగే సీతారాములు, దక్షిణమూర్తి, వినాయకుడు, మహాలక్ష్మి, మృత్యుంజయుడు విగ్రహలతో పాటు ఆలయాలు నిర్మించారు. అలాగే ఆంజనేయస్వామి పాదాల కింద పీఠాన్ని కోలార్ జిల్లా శిలారుపట్నం నుంచి తెప్పించారు. గతంలో గుట్ట ఎక్కాలంటే భక్తులు సగం కొండ ఎక్కడానికే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం భక్తులు కొండ పైకి ఎక్కడానికి మెట్లు, వాహనాలు వెళ్లేందుకు మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. వంద మందికి ఆశ్రయం.. కొండపై విశాలమైన ప్రదేశంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచారు. దాదాపుగా 100 మంది అనాధ వృద్ధులను చేరదీసి వారికి కొండపైనే ఆశ్రయం కల్పిస్తున్నారు. అలాగే గోశాలను ఏర్పాటు చేసి మూగ ప్రాణులను సంరక్షిస్తున్నారు. మంగళ, శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అలాగే భక్తులకు వీరబ్రహ్మం బోధనలు, తత్వాన్ని, కాలజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్‌లో అభయాంజనేయస్వామి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. అతి పెద్ద ధ్వజ స్తంభాలు.. మౌనగిరి క్షేత్రంలో ఏ పని చేసినా భిన్నంగా ఉండాలనే ఈశ్వరయ్యస్వామి మూడు దివ్య జ్యోతులు ఎప్పుడూ వెలిగేలా ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూడు గుట్టలపై 33 అడుగులు ఎత్తున్న ధ్వజ స్తంభాల్లో రామకోటి, శివ, బ్రహ్మ శివ జ్యోతులను వెలిగించారు. జిల్లాలోనే ఏడున్నర అడుగుల అతిపెద్ద వినాయక విగ్రహం ఇక్కడే ఉండటం విశేషం. పర్యటక క్షేత్రంగా .. రాప్తాడు మండలంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ దివ్య క్షేత్రం, పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన 39 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం ఖ్యాతి గడించనుంది. 30 కిలో మీటర్ల వరకు అభయాంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సహకారంతో మరింత అభివృద్ధి ప్రజల్లో భక్తిభవాన్ని పెంపొందించేందుకే ఇక్కడ కొండపై 39 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మన రాష్ట్రంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులు, దాతల సహకారంతో మౌనగిరి క్షేత్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వసతి గృహాలు, ఆలయానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది. – ఈశ్వరయ్య స్వామి, మౌనగిరి క్షేత్రం వ్యవస్థాపకులు -
శ్రీరాం.. నీ బండారం బయటపెడతా!
సాక్షి, అనంతపురం : ‘‘టీడీపీ పాలనలో జిల్లాకు, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి జరిగిన ప్రయోజనమేమీ లేదు. మేము సాగునీరిచ్చామంటున్నావు.. ఏ నియోజకవర్గానికిచ్చావో చెప్పు. దోపిడీ తప్ప మీ కుటుంబం చేసిందేమీ లేదు. గతంలో మీకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్ని..? ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలవా? పరిటాల రవీంద్ర పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములను లాక్కున్న ఘనత మీది. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే మనస్తత్వం మాది. జిల్లాలో కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేర్లతో మీరు భూములు కొనుగోలు చేయలేదా?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరిటాల శ్రీరాంను ప్రశ్నించారు. వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలతో పరిటాల శ్రీరాం బండారం బయటపెడతానన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల కుటుంబం లాగా కక్షలతో దిగజారుడు రాజకీయాలను చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. చదవండి: విద్యార్ధినులపై వేధింపులు.. గురువుకు 49 ఏళ్ల జైలు శిక్ష జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించు టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న శ్రీరాం కుటుంబమే రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారని, నిజంగా వారు అభివృద్ధి చేసి ఉంటే.. ఒకసారి ప్రజలకూ చుపించగలరా? అని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. తాము ఏదో సాధించామని చెబుతున్న శ్రీరాం పేరూరు డ్యాంకు నీరు ఎందుకు తీసుకురాలేకపోయారో వివరించాలన్నారు. రూ.800 కోట్ల కాంట్రాక్టు పనులు మంజూరైతే వాటిలో పరిటాల కుటుంబం వాటా రూ.300 కోట్లు ఉందని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధే జరిగి ఉంటే.. రాప్తాడు నియోజకవర్గాన్ని ఎందుకని ‘అహుడా’ పరిధిలోకి చేర్చలేదో చెప్పాలన్నారు. రాప్తాడులో జరుగుతున్న అభివృద్ధితో ఇక్కడ తమకు దిక్కు లేదని తెలిసిన పరిటాల శ్రీరాం.. ఇప్పుడు ధర్మవరానికి చేరుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడన్నారు. ప్రజా శ్రేయస్సుపై దృష్టి సారించాం తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కాగా.. ప్రతి క్షణం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశామన్నారు. పరిటాల కుటుంబీకులు మాత్రం మండలానికో ఇన్చార్జ్ని నియమించుకొని దోచుకుతిన్నారన్నారు. పేదల ఇండ్ల కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేసిన ఘనత మీ మహేంద్రదనే విషయాన్ని శ్రీరాంకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. జాకీ పరిశ్రమతో కేవలం వెయ్యి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ తాము మాత్రం 15వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నామన్నారు. పాల డెయిరీ ద్వారా మహిళలకు అండగా నిలవాలని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
-
మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన
సాక్షి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. అదనంగా 3.3 టీఎంసీల కెపాసిటీ పెంచాం. హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాం కు నీరు తరలించేందుకు 803 కోట్లతో టీడీపీ అంచనాలు వేసింది. అదే డబ్బుతో మేము నాలుగు రిజర్వాయర్లు అదనంగా నిర్మించి పేరూరు డ్యాంకు నీరందిస్తున్నాం. 75,000 ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం. ప్రాజెక్టు కాస్ట్ పెంచకుండా ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ దోపిడీ చేసింది. టీడీపీ పాలనలో లంచాలు ఏస్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది. పేరూరు డ్యాం, ఇతర నాలుగు రిజర్వాయర్ల పరిధిలోని 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తాం. రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నాం' అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం) సీఎం జగన్‌కు రైతు ప్రయోజనాలే ముఖ్యం: తోపుదుర్తి రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా నుంచి పేరూరుకు నీరిస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. పేరూరు డ్యాం సహా నాలుగు రిజర్వాయర్లకు నీరివ్వటం వల్ల మా ప్రాంతంలో కరవు పోతుంది. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలి. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. సీఎం జగన్‌కు రైతు ప్రయోజనాలే ముఖ్యం. జగన్‌కు జిల్లా రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు' అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. చదవండి: (మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం) ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం
వర్గపోరు.. రక్తపుటేరులు.. ఆధిపత్యం కోసం సాగించిన మారణహోమంలో ఎంతో మంది బలయ్యారు. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. అంతా ఓ కుటుంబం కనుసన్నల్లోనే.. చెప్పినట్టు వినాలి.. కాదన్న వారి తలలు తెగిపడ్డాయి. ఇదంతా గతంలో రాప్తాడు నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్షన్ కు చరమగీతం పాడారు. అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు. కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లకు అహరహం కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ తనయుడు, సీఎం జగన్మోహన్రెడ్డి రక్తపుటేరులు పారిన ప్రాంతాల్లో కృష్ణా జలాలను పారించి కొత్త వెలుగులకు శ్రీకారం చుట్టారు. సీఎం అడుగుజాడల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘లక్ష ఎకరాలకు సాగునీరు’ యజ్ఞం చేపట్టారు. సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు 2009 వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేవి. రాజకీయ పెత్తనం, గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం ఈ మండలాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషించింది. పేదలు వ్యవసాయం చేసుకుంటే తమ పెత్తనానికి బ్రేక్ పడుతుందని కుట్ర చేసింది. గ్రామీణులు సాగువైపు వెళ్లకుండా ఆధిపత్య పోరుకు ఉసిగొలిపింది. తమ మాట కాదన్న వారిని వేటాడి అంతమొందిస్తూ వచ్చింది. ఫలితంగా కనగానపల్లి మండలంలో 8, రామగిరిలో ఐదు, చెన్నేకొత్తపల్లిలో ఆరు గ్రామాల్లో ఫ్యాక్షన్ తారస్థాయికి చేరింది. ఇందులో కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు, తగరకుంట, భానుకోట, రామగిరి మండలంలోని కుంటిమద్ది, గంతిమర్రి, నసనకోట, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, కనుముక్కల, నాగసముద్రం గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా మారిపోయాయి.. దౌర్జన్యం.. దుర్మార్గం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో కరుడుకట్టిన ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో నియంతృత్వ ధోరణి రాజ్యమేలింది. రక్తపుటేరులు ప్రవహించాయి. నక్సలైట్ల కదలికలు, పోలీసుల కూంబింగ్‌లు.. ఫ్యాక్షనిస్టుల దౌర్జన్యం.. దుర్మార్గాలతో జనం కంటి మీద కునుకు దూరమైంది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. 1994 నుంచి 2004 వరకూ సుమారు 120 మంది ఫ్యాక్షన్‌కు బలైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నా.. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపేనని స్థానికులు అంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్ హత్యలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చదవండి: (వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి) ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ఎంపీ మాధవ్ ఒక్కసారిగా మారిన పరిస్థితి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో చెరువులను నింపడమే కాక, పంటల సాగుకూ నీటిని వదలడంతో గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై దృష్టి పెట్టారు. నాటి ఫ్యాక్షన్ రాజకీయంతో విసిగిపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. వర్గ కక్షలకు దూరంగా.. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అందువల్లే 2019 తర్వాత ఫ్యాక్షన్ హత్యల ప్రస్తావనే లేకుండా పోయింది. ‘హంద్రీ–నీవా’ నీటితో సస్యశ్యామలం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా హంద్రీ–నీవా కాలువ గుండా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. కాలువ సరిహద్దు గ్రామాలైన కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని సుమారు 12 చెరువులు, 15 కుంటలను కృష్ణా జలాలతో నింపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతో కాలువ దిగువన వేల ఎకరాల్లో పంటల సాగుకు నీరు అందింది. కనగానపల్లి మండలంలోని తగరకుంట, తూంచర్ల, బద్దలాపురం, యలకుంట్ల, గుంతపల్లి గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చాయి. రామగిరి మండలంలోని కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రి గ్రామాల్లోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేపట్టారు. ఒక్క కుంటిమద్ది చెరువు కింద 500 ఎకరాల్లో వరిసాగులోకి రావడం గమనార్హం. మేడాపురం, కనుముక్కల, ఒంటికొండ తదితర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఫ్యాక్షన్ అనే పదం వినిపించకుండా పోయింది. వేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం ఆశలకు జీవం.. చెన్నేకొత్తపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సారునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయించారు. ఏర్పాట్ల పరిశీలన చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న మూడు రిజర్వాయర్ల భూమిపూజ పనులకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభాస్థలి, రిజర్వాయర్ల పైలాన్, వాహనాల పార్కింగ్, భోజన కౌంటర్లు, ఎల్ఈడీ స్క్రీన్స్ వంటి ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ నిశాంత్‌కుమార్, ఆర్డీఓ మధుసూదన్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. ‘ప్రజాసంకల్ప’ యాత్రలో నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే -
వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమోదం తెలిపార’ని అన్నారు. చదవండి: (ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు) ఈ నెల 9న ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులకు బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్‌కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు) కాగా, ‘బంగారం’లాంటి భూములు.. సిరులు పండే నేలలు.. అయితేనేం.. నీరులేక నోరెళ్లబెట్టాయి! పచ్చని పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఏడాదికి మూడు పంటలు పండించే సత్తా ఉన్న రైతులు ఉన్నా.. జల సిరి లేకపోవడంతో వ్యవసాయం నిర్వీర్యమవుతూ వచ్చింది. సీజన్ వస్తే ఆకాశం వైపు ఆశగా చూడడం తప్ప మరేమీ చేయలేని అసహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. ఇదంతా గతం. ‘నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తా’ అనే నినాదంతో ప్రజాభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అహర్నిశం శ్రమించారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు అందించారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం కూడా పొందారు. ఈ నెల 9న ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
మంచి మాటకు ముందే మరణ వార్త
సాక్షి, రాప్తాడు: చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి ఏర్పాటు చేయడంతో మనస్తాపానికి గురైన యువతి మంచిమాటకు ముందు రోజు బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కందుకూరు క్రాస్ సమీపంలోని ముస్లిం మైనార్టీ కాలనీలో షేక్ వహీదా, షేక్ మసూద్ మహబూబ్ బాషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె షేక్ మసూద్ షాహీన్ (20) అనంతపురంలో ఇంటర్ పూర్తి చేసింది. చదవండి: ఇది మదురై కాదా..! ఈ మధ్యనే మంచి సంబంధం కుదరడంతో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. బుధవారం మంచి మాట చేసుకోవాల్సి ఉంది. తాను చదువుకుంటానని, మూడేళ్ల తర్వాత అయితే పెళ్లి చేసుకుంటానని షాహీన్ తల్లిదండ్రులకు తెలిపింది. మంచి సంబంధం కుదిరిందని, పెళ్లి తర్వాత అయినా చదువుకోవచ్చని తల్లిదండ్రులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి షాహీన్ ఇంట్లోనే ఇనుపతీరుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న తల్లిదండ్రులు మంగళవారం ఉదయం తలుపులు తట్టగా ఎంతసేపటికీ తెరవలేదు. కిటికీలోంచి తొంగి చూడగా కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇరుగుపొరుగు వారిసాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికెళ్లి చూసే సరికే షాహీన్ ప్రాణాలు వదిలింది. తహసీల్దార్ రామాంజనేయరెడ్డి, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. చదవండి: 11 నెమళ్లకు విషం పెట్టి చంపేశారు -
హింసా రాజకీయాలకు శ్రీరామ్ కుట్రలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నాయుడు పరిటాల శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తండ్రి బాటలో హింసా రాజకీయ చేయాలని పరిటాల శ్రీరామ్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు నరుకుతామంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యాల వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. రామగిరిలో వైఎస్సార్ విగ్రహన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్ స్వయంగా అంగీకరించరన్నారు. మా జోలికొస్తే తలలు నరుకుతామని శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ‘చంద్రబాబుకు కరోనా వైరస్ సోకిందా..!) ఏపీలోకరోనా వైరస్ లేదని, ఎల్లో వైరస్ ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైరస్ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేష్ చౌదరి కూతురుకి చంద్రబాబు ఆర్థిక మండలి డైరెక్టర్ పదవి ఇచ్చారని, రమేష్ చౌదరి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ అరికట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ. 5000 కోట్లు రాకూడదనే బాబు కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని ప్రశ్నించారు.(‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’) పది చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం స్థానిక ఎన్నికలపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఆరోపించారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 10 చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.(ఫలించిన తోపుదుర్తి కృషి) బాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉందని పార్లమెంటు వాయిదా వేయలేదని, లక్షల మంది కలిసే జాతరలు వాయిదా వేయలేదని అన్నారు. అలాగే ‘కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5000 కోట్లు అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. గ్రామాలు, పట్టాణాలకు నిధులు రాకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. ఏపీ అభివృద్ధికి సహకరించాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలి. స్థానిక ఎన్నికలు వెంటే జరపాలి’ అని టీడీపీపై విమర్శలు సంధించారు. -
చంద్రబాబు ఆ పని చేసుంటే..
సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంలో టీడీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి ఉద్యయం చేయిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో టీడీపీ మీడియా అతిగా చూపిస్తోందని, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, తన బినామీలు కొన్న భూములకు రేట్లు పలకడం కోసం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నమ్మబలికారని దుయ్యబట్టారు. రాజధాని ప్రజలను బాబు రెచ్చగొడుతున్నారు చంద్రబాబు రాజధాని పూర్తి చేసి ఉంటే రాజధాని తరలించే పరిస్థితి వచ్చేది కాదని, ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని బాబు గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. రాజధాని ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రూ. లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం అయిదు వేల కోట్లు రాజధానికి చంద్రబాబు ఖర్చు చేశారని విమర్శించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని అంటేనే సీఎం జగన్ అమరావతికి మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చందాలు వసూళ్లు చేసి రాజధానిలో ఉద్యమాన్ని అమరావతిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా.. మూడు లక్షల కోట్ల అప్పుతో మరొక లక్ష కోట్లు అప్పు చేస్తే రాజధాని నిర్మిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, సీఎం జగన్ ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకులు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారని.. చిరంజీవి, జీవీఎల్, కేఈ, గంటా వంటి వారు జీఎస్ రావు కమిటీని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కేబినేట్ భేటీ తరువాత వస్తుందని పేర్కొన్నారు. -
ఎంత పనిచేశావ్ దేవుడా..!
మామిడితోట చూసేందుకు వెళ్లిన చిన్నారులు పక్కనే ఫారంపాండ్ (నీటికుంట) కనిపించడంతో దగ్గరకెళ్లారు. కాలుజారి ఓ బాలుడు నీటిలోకి పడిపోయాడు. అతడిని రక్షిద్దామని వెళ్లిన మరో బాలుడు కూడా పట్టుతప్పి నీటిలో పడ్డాడు. నీటమునుగుతున్న వారిని కాపాడేందుకు ఈత వచ్చిన పిన్నమ్మ (నవ వధువు) నీటికుంటలోకి దూకినా పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకోవడంతో ఆమెసైతం నీటమునిగిపోయింది. సమీపంలోని వారు వచ్చి బయటకు తీసేలోపు ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనతో పాలబావి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాప్తాడు: వర్షపునీటితో నిండిన ఫారంపాండ్ ముగ్గురిని మింగేసింది. రాప్తాడు మండలం ఎం.చెర్లోపల్లి పంచాయతీలోని పాలబావిలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.ఈ నెల తొమ్మిదో తేదీన హంపాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలబావికి చెందిన మాజీ స్టోర్ డీలర్ లక్ష్మినారాయణ తమ్ముడు రామకృష్ణ (45) మృతి చెందాడు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులైన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ రామచంద్ర, భాగ్యమ్మ దంపతులు కుమారుడు వర్షిత్ (7), కానిస్టేబుల్ శ్రీరాములు, యశోద దంపతులు చేతన్ వర్మ (17)తో కలిసి పదో తేదీన వచ్చారు. ఆదివారం వీరు తిరుగుపయనానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. తోటకెళ్లి తిరిగిరాని లోకాలకు.. మాజీ స్టోర్ డీలర్ లక్ష్మీనారాయణ మామిడి తోటను చూద్దామని పిల్లలు అడగడంతో కుటుంబ సభ్యులు శనివారం తోటకు తీసుకెళ్లారు. తోట సమీపంలోనే ఫారంపాండ్ (నీటి కుంట) ఉండటంతో ఆ గుంతలో నీటిని చూసేందుకు వర్షిత్, చేతన్ వర్మ అక్కడికి వెళ్లారు. వర్షిత్ కాలు జారి గుంతలోకి జారి పోయాడు. అతడిని కాపాడేందుకు చేతన్ వర్మ కూడా నీళ్లలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న వీరి పిన్నమ్మ మమతతో పాటు అనూష గమనించారు. ఈత వచ్చిన మమత వారిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. అయితే పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఈతకొట్టే అవకాశం లేక పిల్లలతో కలిసి ఆమె కూడా నీటమునిగింది. గట్టు మీద ఉన్న అనూష కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వారిని బయటకు తీసేలోపే ముగ్గురూ మృతి చెందారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ రామాంజనేయరెడ్డి, సీఐ భాస్కర్‌గౌడ్, ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించారు. ఎంత పనిచేశావ్ దేవుడా..! అయ్యో దేవుడా... మాపై నీకు దయ లేదా? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ముగ్గురు పిల్లల్నీ ఒకే సారి తీసుకెళ్లావా? ఒక్క రోజు గడిచి ఉంటే మేము హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లం. మా బంధువు మృతి చెందాడని ఆయన్ని కడసారి చూపులు చూసుకోవడానికి వస్తే మా బిడ్డలనే నీ దగ్గరకు తీసుకుపోతివా అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ► రామచంద్ర, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడే వర్షిత్. శ్రీరాములు, యశోదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మాజీ స్టోర్ డీలర్ లక్ష్మినారాయణకు రామ చంద్ర, శ్రీరాములు బావమరుదులు. ► మాజీ స్టోర్ డీలర్ లక్ష్మినారాయణ ఏకైక కూతరు మమతను గ్రామంలోనే ప్రసాద్ అనే యువకుడికి ఇచ్చి నాలుగు నెలల కిత్రం అంగరంగ వైభవంగా వివాహం జరిపిం చాడు. పిల్లలను కాపాడబోయి తనూ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, పార్వతమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. బాధితులకు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ ఫారంపాండ్‌లో నీటమునిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి పాలబావి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబలను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయకులు మామిళ్లపల్లి అమర్ నాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ ఫారంపాండ్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు, వివాహిత మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నీటికుంటలో పడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియగానే ఎంపీ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు నీటికుంటలు నిండిపోయాయని, పిల్లలు అటువైపు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సెలవు రోజుల్లో పిల్లలు సరదాగా ఆడుకునేందుకు వెళ్తూ అవగాహన లేక ప్రమాదం కొని తెచ్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’
సాక్షి, అనంతపురం : రాప్తాడులో టీడీపీ నేతలు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులను బెదిరించి భూ రికార్డులను తారుమారు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో కోటీశ్వరులకు కూడా ఇళ్లు మంజూరయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు ఉన్నాయి. కఠిన చట్టాలు అవసరం. భూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ భూములను కాపాడాలి’ అని సూచించారు. చదవండి : మొసలి కన్నీరొద్దు సునీతమ్మా.. -
పరిటాల కుటుంబంతో ప్రాణహాని
సాక్షి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గంలో ఓటమిని జీర్ణించుకోలేక పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. పరిటాల కుటుంబ అరాచకాలపై శనివారం వారు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రామగిరి మండలం నసనకోటలో ఈ నెల 4న వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వెంకటాపురం నుంచి పరిటాల శ్రీరామ్ అనుచరులు ట్రాక్టర్లు, వాహనాలలో 50 మందికి పైగా వచ్చి మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బోయ సూర్యం అనే వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర జరిగిందని, అయితే చనిపోయాడనుకోని అతడిని వదిలేసి వెళ్లారని వివరించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని, ప్రాణభయంతో ఇళ్లలోకి పరుగులు తీశామని తెలిపారు. ఉనికి కోసమే దాడులు రామగిరి మండలంలో ఉనికి కోల్పోతున్నామనే కారణంతోనే పరిటాల శ్రీరామ్ ఈ దాడులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో కూడా పేరూరు బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారని గుర్తు చేశారు. రామగిరి మండలం తమకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా చంపుతామని బెదిరిస్తున్నారని, అరాచకశక్తిలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నసనకోట గ్రామస్తులు ముత్యాలప్ప, కేశవనారాయణ, రామలింగారెడ్డి, బండారు లింగన్న, ముత్యాలు, మహిళలు రత్న, సావిత్రమ్మ, ముత్యాలమ్మ, రంగమ్మ, పి. ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి : పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు -
పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం
-
పరిటాల వర్గీయుల బరితెగింపు
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో పరిటాల వర్గీయులు బరితెగించారు. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నసనకోట గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పక్కనే వెంకటాపురం, గంగంపల్లి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే గొడవ నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పరిటాల వర్గీయులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో నసనకోట వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు బోయ సూర్యం తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చాకలి నాగభూషణ, నరసింహులు, సావిత్రమ్మ, ముత్యాలప్ప, నరేష్, ప్రతాప్, క్రిష్ణమ్మ గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. -
రైతులను దగా చేస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్
అనంతపురం: భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులను నష్టపరిహారం చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన రైతులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని ఖండించారు. ఇందులో భాగంగానే రైతులతో కలిసి ఆదివారం సాయంత్రం అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని కలిసి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత కొన్నేళ్లు వందల కోట్ల కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ రైతులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. అనంతపురం–బళ్లారి రహదారి వెడల్పు పనుల్లో కూడా రాచానపల్లి, సిండికేట్ నగర్ తదితర గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా సదరు కాంట్రాక్టు సంస్థ జారుకుందన్నారు. దీని వలన రైతులు వందల కోట్లు నష్టపోయారని తెలిపారు. తాజాగా అనంతపురం– కళ్యాణదుర్గం రోడ్డు వెడల్పు పనులు కూడా పూర్తి చేసి ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొట్టి వెళ్లిపోయేందుకు యత్నాలు చేస్తోందని మండిపడ్డారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని అడిగేందుకు ఆదివారం సాయంత్రం కొంతమంది రైతులు పంపనూరు సమీపంలో సదరు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగేందుకు వెళ్లారన్నారు. అయితే సంస్థ వారు మాత్రం ఏకంగా రైతులను దాడికి పాల్పడ్డారన్నారన్నారు. పైగా రైతులే దాడి చేసినట్లు అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఫిర్యాదు ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో తమ ఆఫీసుపై కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేసి, తమ సిబ్బందిని కొట్టారని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధి అవినాష్‌చౌదరి డీఎస్పీ వీరరాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, కేసు విచారిస్తున్నామన్నారు. -
పరిటాల వర్గీయులు ఫోన్లో బెదిరింపులు
-
ఆగని పరిటాల వర్గీయుల ఆగడాలు
సాక్షి, అనంతపురం : అధికారం కోల్పోయినా మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు ఆగడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో పరిటాల శ్రీరామ్ అనుచరులు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతాప్‌కు ఫోన్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాయలేని అసభ్య పదజాలంతో బాంబులు వేస్తామని, కొడవళ్లతో నరికి చంపేస్తామంటూ శ్రీరామ్ అనుచరుడు అమర్నాథ్, మరో ముగ్గురు బెదిరింపులకు దిగారు. ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో ఫైల్‌ను పోలీసులతో పాటు మీడియాకు కూడా అందజేశారు. పరిటాల వర్గీయులు ఫోన్లో బెదిరించిన ఆడియో -
ఓడిపోతే అంతుచూస్తా?
సాక్షి,రాప్తాడు: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం ఐదు గంటలకే ముగిసినా టీడీపీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో రాత్రి 11 గంటలైనా పోలీసుల సమక్షంలోనే రాప్తాడు మండలం పాలవాయి, పాలవాయి తండా, ఎం.చెర్లోపల్లి, మరూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ స్థానికులు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఎం.చెర్లోపల్లిలో శ్రీరామ్‌కు చుక్కెదరైంది. ఈ సమయంలో ప్రచారం ఏమిటంటూ స్థానికులు ఎదురు తిరగడంతో ఈ ఎన్నికల్లో ఓడిస్తే మీ అంతు చూస్తానని బెదిరించినట్లు సమాచారం. రానున్నది టీడీపీప్రభుత్వమేనంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తాడని, మంత్రి అయిన వెంటనే ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను గ్రామాల్లోంచి బయట గెంటివేస్తామని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, ప్రచారం ముగిసినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకొని, డ్రమ్స్ వాయిస్తూ బాణాసంచ పేలుస్తూ గ్రామాల్లో హంగామా సృష్టించారు. టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఉన్నా నోరు మెదపలేదు. వారికి ముడుపులు అందడంతోనే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసుల బెదిరింపులు గ్రామంలో రాత్రి పది గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నాడని ఆయన కాన్వాయ్‌లో ఉన్న ఇటుకలపల్లి సీఐ మధు, ఎస్ఐ గంగాధర్‌కు ఎం.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులను ప్రచారం చేయకుండా గ్రామం నుంచి బయటకు పంపాలి. పోలీసులు అలా చేయకుండా మీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహించుకోవచ్చని, మీరు ఇప్పుడు అడ్డు పడితే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అరెస్ట్ చేస్తే భయపడబోమని వైఎస్సార్సీపీ నాయ కులతో పాటు గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ‘ఎన్నికలు అయిపోగానే మీ కథ చూస్తామం’టూ గ్రామస్తుల ఫొటోలను సెల్ఫోన్లో తీసుకున్నారు. ఎట్టకేలకు అక్కడ భారీ జనాలు గూమికూడడంతో పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి మరూరుకు వెళ్లిపోయారు. మరూరులో కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డు తగలడంతో చేసేదేమీ లేక పరిటాల శ్రీరామ్ వెనుదిరిగిపోయారు. -
జనం మెచ్చని శ్రీరామ్
సాక్షి, రామగిరి: రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు మంగళవారం పేరూరులో చుక్కెదురైంది. ప్రచారంలో చివరి రోజున భారీ బహిరంగసభకు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించినంత జనం రాకపోవడంతో శ్రీరామ్ నిరాశకు గురయ్యారు. ఈ నెల ఏడో తేదీన రాత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరూరు బస్టాండ్ ప్రాంతంలో బహిరంగసభ నిర్వహిస్తే జనం తరలివచ్చి విజయవంతం చేశారు. అయితే పరిటాల కోటగా పిలిచే రామగిరి మండలం పేరూరులో మంగళవారం పరిటాల శ్రీరామ్ సభకు వందలాదిమందికూడా రాకపోవడం గమనార్హం. పాతికేళ్లుగా పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా, మంత్రులుగా అధికారంలో ఉండి కూడా కనీససౌకర్యాలు కల్పించడంలో విఫలమవడంతో జనం వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపారని పలువురు చర్చించుకొంటున్నారు. ఐదేళ్లుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని రామగిరి మండలంలోకి అడుగు పెట్టనీకుండా పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కానీ రెండు రోజుల క్రితం పేరూరుకు ప్రకాష్‌రెడ్డి రాగానే మండల వాసులు, ప్రజలు ఘనస్వాగతం పలకడం విశేషం. -
ఓటు వేయకపోతే చంపేస్తాం: పరిటాల వర్గీయుల బెదిరింపులు
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు
సాక్షి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినప్పటికీ అధికార పార్టీ అండతో టీడీపీ నేతలు బుధవారం కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్.. రామగిరి, చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కోడ్‌ను ఉల్లంగిస్తున్నారు. శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని ఆయన వర్గీయులు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి సహరించకపోతే అంతుచూస్తామని స్థానిక నేత ముత్యాలుపై పరిటాల అనుచరులు దాడికి దిగారు. పరిటాల దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సునీత వర్గీయులను చెర్లోపల్లి గ్రామస్తులు అడ్డుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చినా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. ఓటర్లకు బెదిరింపులు, పోలీసుల తీరును వైఎస్సార్సీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి సునీతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్లను బెదిరిస్తున్నా పరిటాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాడ్ చేశారు. -
పరిటాల శ్రీరామ్‌కు చేరవేస్తున్న నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పరిటాల సునీత కుమారుడు, అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు చేర వేసేందుకు సిద్ధం చేసిన రూ.24 లక్షలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడి ప్రధాన అనుచరుడు తన డ్రైవర్ ద్వారా నగదు పంపేందుకు ప్రయత్నించారు. నగదు చిక్కిన విషయం తెలియడంతో టీడీపీ కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ అధికారులు సైబరాబాద్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. రాప్తాడు మండల పరిషత్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఉన్న దగ్గుపాటి వెంకట ప్రసాద్ పటాన్చెరులో డీవీ పాలిమర్స్ పేరుతో ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు రూ.24 లక్షలు సమకూర్చడానికి సిద్ధమైన ప్రసాద్ ఈ మొత్తాన్ని పోలీసుల కంటపడకుండా తరలించడానికి పథకం వేశారు. వ్యక్తిగత వాహనాల్లో తీసుకువెళ్తే చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరిగితే పట్టుబడే ప్రమాదం ఉందని భావించి తన డ్రైవర్ సంతోష్‌రెడ్డికి డబ్బు అందించాడు. ఓ టావెల్స్ బస్సులో డబ్బు తరలిస్తున్న సంతోష్‌రెడ్డిని పోలీసులు సోమవారం ఆరామ్‌ఘర్ చౌరస్తా ప్రాంతంలో తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఈ డబ్బుకి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి రసీదులు, లెక్కలు లేకపోవడంతో పోలీసు స్టేషన్‌కు తరలించారు. తన యజమాని ప్రసాద్ సూచన మేరకే డబ్బులు తరలిస్తున్నట్లు సంతోష్‌రెడ్డి అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె అడ్డదారులు అనంతపురం : మరోవైపు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా తన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టపర్తిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. నియోజకవర్గంలోని యువతను ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా భారీగా క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాల పంపిణీకి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. -
ఫ్యాను గాలిలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం
-
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు
-
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించలేదు. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రామగిరి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రామగిరి మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సునీత తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రకాశ్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్‌రెడ్డికి మద్దుతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. స్థానికులు మాత్రమే ప్రకాశ్‌రెడ్డి వెంట ప్రచారం చేయాలని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల సునీత దౌర్జన్యాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పరిటాల సునీత మండలమైన రామగిరిలోకి వీసా తీసుకుని వెళ్లేలా పోలీసులు ఆంక్షలు విధించారని.. గత నాలుగున్నరేళ్లుగా తమను రామగిరిలోకి అనుమతించకపోవటం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. కొందరు పోలీసులు, అధికారులు పరిటాల సునీతకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రామగిరిలో సునీత ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయపెట్టి గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాప్తాడులో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
రాప్తాడులో మంత్రి సునీతకు ఎదురుగాలి
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ఎదురుగాలి వీస్తోంది. కుటుంబ పాలనతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండడంతో మంత్రికి షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా రాప్తాడు మండలం బుక్కచెర్లకు చెందిన ఐడీసీ మాజీ చైర్మన్ నల్లపరెడ్డి, ఆయన సోదరులు మాజీ ఎంపీపీ వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుబ్బారెడ్డి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వీరు మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. శుక్రవారం అనంతపురం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో నల్లపరెడ్డి సోదరులు ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సభ’కు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గంగుల భానుమతి, మహానందరెడ్డి, జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, సాకే ఉమా, రిలాక్స్ నాగరాజు, మైనార్టీ నాయకులు రిజ్వాన్, ఖాదర్‌బాషా, తొండమాల రవి, ఎద్దుల అమర్నాథ్రెడ్డి, గౌస్, ఇలియాజ్, భూలక్ష్మి, వన్నా హనుమంతరెడ్డి, కదిరప్ప హాజరయ్యారు. రాప్తాడులో కుటుంబ పాలన ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు నియోజవకర్గంలోని అన్ని మండలాలకు మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారినే ఇన్‌చార్జ్‌లుగా నియమించుకుని కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మొదలుకుని నియోజకవర్గం వరకు ఒకే కులానిదే పెత్తనం సాగుతోందని విమర్శించారు. ఆ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపించడం లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దోపిడీ చేస్తోందన్నారు.‘నీరు–చెట్టు’ కార్యక్రమంలో ప్రతిరూపాయి వారి కుటుంబమే దోచుకుందని ఆరోపించారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, దీంతో చాలా మంది పార్టీకి దూరమవుతున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో భయపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటామని చెప్పిన పరిటాల కుటుంబం ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో చిచ్చు పెడుతోందన్నారు. అనంతపురంలో ఎంపీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప మూడుముక్కలాట ఆడుతున్నారంటూ మండిపడ్డారు. త్వరలోనే వైఎస్ జగన్‌ను కలిసి వైఎస్సార్సీపీలో చేరుతామన్నారు. రాప్తాడు, అనంతపురంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు తమవంతు కృషి చేస్తామన్నారు. -
పరిటాల సునీతకు షాక్
సాక్షి, అనంతపురం/కడప: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. అధినాయకత్వం వ్యవహార శైలితో తెలుగు దేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీలో ఉండలేమంటూ బయటకు వెళ్లిపోతున్నారు. (కాంగ్రెస్ టీడీపీల మధ్య సీక్రెట్ బట్టబయలు..) నలపరెడ్డి రాజీనామా అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నియోజకవర్గం రాప్తాడుకు చెందిన నాయకుడు నలపరెడ్డి శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, సునీత తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా నలపరెడ్డి ఆరోపించారు. రాప్తాడులో పరిటాల సునీత అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. (‘కాల్వ’కు ఎదురుదెబ్బ!) టీడీపీకి బాలకొండయ్య గుడ్‌బై వైఎస్సార్ జిల్లా కడప టీడీపీలోనూ అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. జిల్లా టీడీపీ నాయకత్వ తీరు నచ్చక ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ ఓర్సు బాలకొండయ్య నేడు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో నాయకుల దగ్గర నీతితో కూడిన విలువలు లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. (అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ) -
రాప్తాడులో 'కట్ట'ల పాములు
అనంతపురం సెంట్రల్: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికారపార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులను ఓటర్లకు ఎరగా వేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డబ్బులను ఇప్పటి నుంచే సర్దుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు రాప్తాడు నియోజవకవర్గం చెన్నేకొత్తపల్లిలో పోలీసుల తనిఖీల్లో రూ.1.27 కోట్లు పట్టుబడడం అద్దం పడుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టడడం కలకలం సృష్టించింది. పరిటాల శ్రీరామ్ సన్నిహితులే.. శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేస్తుండగా తెలంగాణా రిజిస్ట్రేషన్‌తో వచ్చిన కారులో రూ. 1.27 కోట్లు పట్టుబడ్డాయి. అయితే ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళుతున్నారు. ఎందుకు తీసుకెళుతున్నారనే పోలీసుల ప్రశ్నలకు కారులో ఉండే వ్యక్తులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులు కారును, అందులోని వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అయితే ఆ కారులో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ మండలంలో పనిచేస్తున్న వీఆర్వో ఉండడం గమనార్హం. తెలంగాణ వాసులతో పాటు రాప్తాడుకు చెందిన ఐదారుగురు ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. వీరంతా మంత్రి పరిటాల నునీత కుమారుడు శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది. పోలీసులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత డబ్బు సర్దుబాటు వ్యవహారం కొత్త తలనొప్పులకు కారణమవుతుందని భావించిన అధికార టీడీపీ నాయకులు ఆ మేరకు ఇప్పటి నుంచే అక్రమాలకు తెరలేపారు. నగదు సర్దుబాటులో భాగంగానే రాప్తాడు నియోజకవర్గంలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రూ.1.27 కోట్లు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును అత్యంత గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంగా ఇప్పటికే సదరు పోలీసులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. పట్టుబడిన సొమ్మును రియల్‌వ్యాపారానికి ముడిపెట్టి కేసును మూతవేయించే దిశగా పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ కారులో లేవు. రామగిరి: చెన్నేకొత్తపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీలో పట్టుబడిన రూ.1.27 కోట్లను ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు రామగిరి సీఐ తేజోమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన చెన్నేకొత్తపల్లి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భూమి కొనుగోలు విషయమై బెంగుళూరుకి తరలిస్తున్న రూ.1.27 కోట్లు తమ తనిఖీలో పట్టు పడినట్లు పేర్కొన్నారు. అయితే ఇందుకు సరైన ఆధారాలు, పత్రాలు చూపకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రవివర్మ, అతని స్నేహితుడు రామకృష్ణరాజు, డ్రైవర్ భాస్కర్‌కుమార్, చెన్నేకొత్తపల్లి వీఆర్వో నజీర్ అహమ్మద్, రామగిరి మండలం కుంటిమద్ది నివాసి సానిపల్లి అక్కులప్పను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నగదు, సంబంధిత వ్యక్తులు ఉపయోగించిన వాహనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. -
నిరుపేదకు ఫేస్బుక్ మిత్రుల సాయం
అనంతపురం, రాప్తాడు: తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాప్తాడు మండల కేంద్రానికి చెందిన యువకులు వినూత్నంగా ఆలోచించారు. ఇందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా ఎంచుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికతో పాటు గ్రామంలో కూడు, గూడు, గుడ్డకు నోచుకోని వారికి తోచిన సాయమందించాలని భావించారు. వెంటనే ఫేస్బుక్లో ‘రాప్తాడు డెవలప్మెంట్ ఫోరం’ అనే పేరుతో ఓ గ్రూప్‌ను క్రియేటివ్ చేశారు. అందులో దాదాపు 300 మంది వరకు సభ్యులుగా చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఒక మిత్రుడు... గత ఏడాది రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన దళిత మహిళ శకుంతలమ్మ అనారోగ్యంతో బాధపడుతుందని... ఆమెకు సాయం చేద్దామని సూచించాడు. అప్పటికప్పుడే ఫోరంలోని సభ్యులంతా చర్చించుకొని తెలుగు పండుగ సంక్రాంతి రోజున ఆమెకు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం మిత్రులంతా కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతలమ్మ ఇంటికి వెళ్లి తమ వంతు బాధ్యతగా రూ.7,100 నగదు, బ్రెడ్లు అందజేశారు. మున్ముందు ఈ కుటుంబానికి మరింత అండగా ఉంటామన్నారు. ‘రాప్తాడు డెవలప్మెంట్ ఫారం’ పార్టీలకతీతంగా, కులాలకు అతీతంగా ముందుకు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు. -
విప్లవం పేరుతో దోపిడీ!
- మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం - అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని హామీ - రాప్తాడు వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతం అనంతపురం : ఒకవైపు గాంధేయ వాదులం, విప్లవ వీరుల కుటుంబం అంటూనే మరోవైపు దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మంత్రి పరిటాల సునీతపై మండిపడ్డారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలంలోని కళ్యాణదుర్గం రోడ్డు పిల్లిగుండ్లకాలనీ వద్ద రాప్తాడు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. అందులో ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం ప్రాంతంలో 26 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తే విప్లవవీరులు ఎందుకు నోరెత్తలేదని మంత్రి సునీతను ఉద్దేశించి అన్నారు. విప్లవాలను అమ్ముకున్నారని, ఆ ముసుగులో దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారని విమర్శించారు. గత రెండు ఎన్నికల్లోనూ తనను గెలిపించేందుకు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. తనను పిలిచి అక్కున చేర్చుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తూ చేరువ కావాలని సూచించారన్నారు. తాను ఆ ప్రకారమే నడుచుకుంటున్నానని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 14 వేల కుటుంబాలకు ఏదో ఒక రూపంలో సొంత సంపాదనతో సేవ చేసే అవకాశం దేవుడు కల్పించాడన్నారు. అందరి ఆశీస్సులతో 2014లో గెలుస్తామనే అనుకున్నామన్నారు. అయితే చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మారన్నారు. పట్టిసీమ వల్లే హంద్రీనీవాకు నీళ్లొస్తున్నాయని అంటున్నారని, హంద్రీ - నీవా ద్వారా 2012 నుంచి వచ్చింది కృష్ణా జలాలు కాదా? అని ప్రశ్నించారు. తామైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు ఇవ్వాలని, అక్కడి నుంచి ఎగువగా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నాలుగు లిఫ్ట్‌ల ద్వారా పంపింగ్ చేసి చూపించాలని సవాల్ విసిరారు. 26వ కిలోమీటరు వద్దనున్న తురకలాపట్నం వంకకు నీళ్లొదిలితే అవి నేరుగా పెన్నానదిలో పడి దిగువ భాగాన ఉన్న పేరూరు డ్యాంకు వస్తాయన్నారు. కానీ అలా చేయకుండా రూ.1,100 కోట్లతో పనుల అంచనాలను రూపొందించుకున్నారని, ఇదంతా మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో చేస్తున్న దోపిడీ అని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు 10 టీఎంసీలు నీరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు వైఎస్సార్సీపీ పక్షానే ఉన్నారు మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలంతా వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు సూచించారు. వలసల నివారణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులను కూడా టీడీపీ కార్యకర్తలు స్వాహా చేస్తున్నారన్నారు. ప్రసుత్తం అనంతపురం నుంచి 4 లక్షల మంది రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లారని చెప్పారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికైనా దీనిపై చంద్రబాబును అడిగే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం రాక్షక పాలన సాగిస్తోందని, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో నిందితులైన మంత్రి సునీత సోదరుడు, కుమారుడు, బంధువులతో కలిసి తిరుగుతుంటే ప్రభుత్వానికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నాయకులు గిర్రాజు నగేష్, పామిడి వీరాంజనేయులు, మీసాల రంగన్న, ఎల్ఎం మోహన్‌రెడ్డి, మాజీ మేయర్రాగే పరుశురాం, విద్యార్థి విభాగం సలాంబాబు, లింగారెడ్డి, పరుశురాం, నరేంద్రరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్‌రెడ్డి గెలుపు జగన్‌కు కానుక వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని గెలిపించి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దాం. అపద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కలుపుదాం. - వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్లీనరీ భారీ సక్సెస్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గ ప్లీనరీ భారీ సక్సెస్ అయింది. చంద్రబాబు పరిపాలన అవినీతిమయమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, అధికారులపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారు. కొందరు అధికారులు తొత్తులుగా మారారు. ముఖ్యమంత్రి నీచుడు, దరిద్రుడు. 60 ఏళ్లలో చూడని కరువు గతేడాది జిల్లాలో చూశాం. - శంకరనారాయణ, జిల్లా అధ్యక్షుడు . ప్రకాష్‌రెడ్డిని ఆశీర్వదించండి నియోజకవర్గానికి ప్రకాష్‌రెడ్డి ఆశాకిరణం లాంటివాడు. సొంత నిధులతో బోర్లు వేయించాడు. మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాడు. గొర్రెలు ఇప్పించాడు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబుగా మారారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. - నదీంఅహ్మద్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో అరాచక పాలన - మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించిన దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం కాగానే రాజధాని పేరుతో దోపిడీకి తెర తీశారని ధ్వజమెత్తారు. రౌడీయిజాన్ని అంతమొందిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుండగా, ఆయన అనుచరులు దౌర్జన్యాలతో జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. మరోవైపు పోలీసులు కూడా టీడీపీ నేతల్లా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళ్లముందే దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు ఖాకీ కాకుండా పచ్చ దుస్తులు వేసుకుంటే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఆయన టీం ఆలీబాబా 60 దొంగల్లా మారారని ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ పేరు చెబితే అనేక పథకాలు గుర్తుకొస్తాయని, అలా చెప్పుకోవడానికి చంద్రబాబు ఏ ఒక్క పథకమూ అమలు చేయలేదని అన్నారు. జేసీ సోదరులు కేవలం వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు కాలర్ పట్టుకోవాలని వారికి సూచించారు. -
కెనరాబ్యాంక్‌కు ముళ్లకంప!
- రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ - సీపీఎం, రైతు సంఘం నాయకుల ఆందోళన రాప్తాడు : రైతుల పంట రుణాలు రీషెడ్యూల్ చేసి, అసలు వడ్డీ లేకుండా రుణాలు రెన్యూవల్ చేసి, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలను ఇవ్వాలనే డిమాండ్‌తో సీపీఎం, ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారుల్లో స్పందన లేకపోవడంతో బుధవారం పలు గ్రామాల రైతులతో కలిసి కెనరా బ్యాంక్‌కు ముళ్ల కంప కొట్టి ధర్నా చేశారు. ఉదయం 9 గంటలకే బ్యాంకు ముందు ధర్నా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు వచ్చి చేసేదేం లేక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం రాప్తాడు డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ పదేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పంటలు పొలాల్లోనే ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం రైతుల దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని, కరువును దృష్టిలో ఉంచుకుని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి, అసలు, వడ్డీ లేకుండా రైతుల రుణాలను రెన్యూవల్ చేయలన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో వచ్చి సీపీఎం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం రాప్తాడు డివిజన్ కార్యదర్శి రామాంజినేయులు, కదిరప్ప, పోతులయ్య, బి.చంద్రశేఖర్‌రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఒకదశలో వారిని ఈడ్చుకుంటూ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డికి గాయమైంది. అనంతరం నాయకుల్ని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. దిగొచ్చిన అధికారులు : సీపీఎం, రైతు సంఘం నాయకులు చేసిన ధర్నాకు స్పందించిన కెనరాబ్యాంకు చీఫ్ మేనేజర్ తిరుపతయ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఎస్ఐ ధరణిబాబు, బ్యాంక్ సిబ్బంది, సీపీఎం, రైతు నాయకులతో సంప్రదించారు. రేపటి నుంచి బ్యాంక్‌లో రైతుల రుణాలను అసలు, వడ్డీ లేకుండా రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారు. -
ఉడికించి చూడ రబ్బరు గుడ్డు !
► అంగన్వాడీ కేంద్రాలకు నకిలీ గుడ్లు సరఫరా కనగానపల్లి (రాప్తాడు) : పౌష్టికాహారం పేరుతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో రబ్బరు అవశేషాలు బయటపడ్డాయి. స్వయానా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే ఈ తరహా కోడిగుడ్లు సరఫరా కావడం గమనార్హం. కుర్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో..: కనగానపల్లి మండలం కుర్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఈనకిలీ గుడ్ల ఉదంతం బయటపడింది. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా ఈ నెల మొదటి వారంలో 50 మంది పిల్లలకు, 15 మంది గర్భిణులకు కోడి గుడ్లు పంపిణీ చేశారు. వీటిలో సరస్వతమ్మ అనే మహిళ కూడా తన మనవడి కోసం ఎనిమిది గుడ్లను తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం వీటిని ఉడకబెట్టి పిల్లవాడికి తినిపిస్తుండగా, రబ్బరు అవశేషాలు బయటపడ్డాయి. దీంతో కంగుతిని ఈ విషయాన్ని స్థానిక అంగన్వాడీ వర్కర్ ప్రసన్నలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం మరో గుడ్డును ఉడికించి చూడగా మరోసారి ఇలాగే జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు విలేకరులకు తెలియజేశారు. నకిలీ గుడ్లను సరఫరా చేస్తూ చిన్నపిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు. ఉడికించిన గుడ్డులో ఎక్కువ శాతం పచ్చసొన ఉంటూ, తెల్లసొన పలుచటి పొర మాదిరిగా కనపడుతోందని వారు వివరిం చారు. అంతేకాక పచ్చసొన జిగురుగా ఉంటూ నమిలితే రబ్బరును కొరికినట్లుగా ఉంటోందని తెలిపారు. ఇలాంటివి పిల్లలు తిని అనారోగ్యం పాలయితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. -
మంత్రి ఇలాకానా.. మజాకా..!
- ప్రజా ప్రయోజనాల ముసుగులో టీడీపీ కార్యాలయ పునాదులు - తాము అనుమతులు ఇవ్వలేదన్న ఏపీఐఐసీ - లీజు గడువు దాటితే అడ్డుకుంటామంటున్న దేవాదాయశాఖ - గందరగోళంగా అనుమతుల ప్రక్రియ - ఆందోళనలో ఆటోనగర్ కార్మికులు రాప్తాడు / అనంతపురం కల్చరల్ : రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పార్టీ నాయకులు జిల్లాలో యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూనే ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఈసారి ఏకంగా దేవుని భూములకే ఎసరు పెట్టారు. రాప్తాడులో ఎంతో ప్రాచీనమైన పండమేటి రాయుడు ఆలయానికి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నిన్న మొన్నటి వరకు వందల ఎకరాలలో మాన్యం ఉండేది. ఈ భూముల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసుస్టేషన్, తహసీల్దారు కార్యాలయం వంటివి నిర్మించారు. - మాన్యం భూమి సర్వే నెంబర్ 476లోని 68 ఎకరాలను దేవాదాయశాఖ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండిస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ) ద్వారా ఆటోనగర్‌కు లీజుకిచ్చింది. మొబైల్ వర్క్‌షాపులన్నీ ఓ చోట ఉండాలనే భావనతో ఇలా చేశారు. ఇందుగ్గానూ ఆటోనగర్ అసోసియేషన్ ఏటా పదివేలు అద్దె చెల్లిస్తోంది. అయితే ఈ లీజు గడువు 20 ఏళ్లని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా, ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉందని ఏపీఐఐసీ అధికారులు తెలుపుతున్నారు. - టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో రెండకరాలలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, బస్టాపు వంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు తెచ్చుకున్నారు. పనిలోపనిగా ఎకరా పది సెంట్ల స్థలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని కూడా కట్టించేస్తున్నారు. లీజుకిచ్చిన వాటిల్లో పూర్తిస్థాయి కట్టడాలు చేపట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తుంగలో తొక్కి పునాదులు, పిల్లర్లు వేసేశారు. ఆటోనగర్‌వాసులు కానీ, ఏపీఐఐసీ, దేవాదాయశాఖ అధికారులుగానీ అభ్యంతరం చెప్పిన దాఖలాలే లేవు. - ఒక నెల కిందట ఇదే మాన్యంలో వ్యవసాయ శాఖ వారు గోడౌన్ నిర్మించడానికి సిద్ధపడితే ఆటోనగర్ అసోసియేషన్ తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకుంది. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు కట్టిస్తున్న భవనంపై కనీసం అభ్యంతరం చెప్పలేకుంది. ఇతర పార్టీల వారు మాత్రం అధికార పక్షానికి ఒక రూలు, ఇతరులకు మరో రూలా అంటూ అధికారులపై మండిపడుతున్నారు. అన్ని పార్టీలకూ ఇలాగే ఇస్తారా? అధికారంలో ఉన్నాం కదాని దేవుని భూములనే కాదు దేన్నైనా కబ్జా చేయడానికి అధికార పక్షం వారు ముందుంటున్నారు. ఆటోనగర్‌కు ఇచ్చిన ఈ స్థలంలో ప్రజాపయోగ నిర్మాణాలు సాగితే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఆలయ భూముల్లో పార్టీ కార్యాలయాల భవనాలు కట్టడమేంటి? మేము కూడా పార్టీ ఆఫీస్ కట్టుకుంటామని అడిగితే అధికారులు మాక్కూడా ఇలాగే అనుమతులిస్తారా? - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాప్తాడు నోటీసులు పంపించాము దేవుని మాన్యంలో 32 ఎకరాల వరకు ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు ద్వారా ఆటోనగర్‌కు లీజుకిచ్చాము. దీనికిగాను వారు ప్రతి ఏటా అద్దె చెల్లిస్తున్నారు. కార్మికులందరూ ఓ చోట ఉంటారనే భావనతో ప్రభుత్వ అనుమతితోనే ఇలా చేశాం. అయితే పరిశ్రమల శాఖ వారు పార్టీ కార్యాలయానికి అనుమతి ఎందుకిచ్చారో తెలీదు. ఇదే విషయమై నోటీసు కూడా ఇచ్చాము. అనుమతులన్నీ సక్రమంగా ఉన్నాయని సమాధానం వచ్చింది. లీజు గడువు దాటితే తప్పకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం. - నాగేంద్రరావు, పండమేటిరాయుడు దేవాలయం ఈఓ మేము అనుమతి ఇవ్వలేదు దేవాదాయశాఖ ద్వారా మేము లీజుకు తీసుకుని ఆటోనగర్‌కు సబ్లీజుకిచ్చాము. అయితే తొలుత ఐదేళ్ల వరకే లీజు ఉంటుంది. అది కూడా 2016 సెప్టెంబర్ 5వ తేదీతో ముగిసిపోయింది. కాబట్టి మాకూ, ఈ నిర్మాణాలకు సంబంధం లేదు. మా డిపార్టుమెంటు ఏ నిర్మాణాలకూ అనుమతులివ్వలేదు. లీజు పొడిగించాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. కాబట్టి ఇది దేవదాయశాఖ వారే చూసుకోవాలి. - సోనీ, మేనేజర్, ఏపీఐఐసీ, అనంతపురం అనుమతుల మేరకే నిర్మాణం పండమేటి ఆలయ భూములు వేల ఎకరాలలో ఉండేవి. ప్రస్తుతం చాలా ప్రభుత్వ కార్యాలయాలు అందులోనే ఉన్నాయి. అదేవిధంగా అన్ని అనుమతులు తీసుకుని మా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నాం. తొలుత ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ ద్వారా జాయింట్ కలెక్టర్‌ను అనుమతి కోరాము. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో ద్వారా పక్కా అనుమతులు తెచ్చుకునే నిర్మాణం చేపట్టాము. ఇందులో పార్టీ కార్యాలయమే కాదు, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, బస్టాప్ కూడా కడుతున్నారు. కాబట్టి అక్రమమనడానికి లేదు. - సాకే నారాయణస్వామి, టీడీపీ మండల కన్వీనర్ -
కరెన్సీ కహానీ
అనంతపురం సెంట్రల్ : కేంద్రం నూతనంగా విడుదల చేసిన రూ.2వేల కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీసుకుని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ అదుపులోకి తీసుకున్నారు. రాప్తాడు మండల కేంద్రానికి చెందిన రామలింగారెడ్డి శుక్రవారం రూ. 2వేల నోటును కలర్ జిరాక్స్ తీసి కొన్ని తన వద్ద ఉంచుకున్నాడు. నకిలీ నోట్లు వస్తే ఇలా ఉంటాయంటూ అందరికీ చూపిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ శ్రీరామ్ జాతీయ రహదారిలోని ఎస్వీ బార్లో ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని జిరాక్స్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివి తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
‘హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలి’
అనంతపురం : హంద్రీ–నీవా ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వాలంటే 7 వేల క్యూసెక్కులకు విస్తరింప చేయాలని , వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు హంద్రీ నీవాను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలు సాగులోకి తేవాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2005లో హంద్రీ–నీవా పథకం మొదలుపెట్టారన్నారు. ఈ పథకం మొదటి దశ పనులు దాదాపు 80 శాతం ఆయన ఉన్నట్లుగానే పూర్తయ్యాయన్నారు. తర్వాత కాంగ్రెస్ హయాంలో తక్కిన పనులు పూర్తయి 2012 నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు. 2014 వరకు 75 శాతం పూర్తయిన రెండో దశలో తక్కిన 25 శాతం పనులు పూర్తి చేసేందుకు రెండున్నరేళ్లుగా సాగుతున్నా నేటికీ కొలిక్కి వచ్చిన పరిస్థితులు కనిపించలేదన్నారు. అయినా అక్టోబర్‌లో కనీసం ఐదారు చెరువులకు నీళ్లివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పీఏబీఆర్ ఎగువనున్న ఆరు చెరువులకు నీళ్లిచ్చారని, దిగువనున్న 49 చెరువులకూ నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రికి ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉందని హంద్రీ–నీవాను రైతులకు ఉపయోగపడేలా చేయాలంటే చంద్రబాబునాయుడు మాదిరి కాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిలా ఆయకట్టు చివరిదాకా నీళ్లు అందించేలా ఆలోచిస్తే ఉపయోగముంటుం దన్నారు. ఇందుకు అవసరమైతే పార్టీలకతీతంగా సమావేశం ఏ ర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3.5 లక్షల ఆయకట్టుకు నీళ్లిచ్చే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే కుప్పంకు నీళ్లను పంపకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా సురేష్‌గౌడ్, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల కన్వీనర్లు తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, బోయ రామాంజనేయులు, ఎం పీటీసీలు ఆలుమూరు సుబ్బారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం. నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏడో రోజు ప్రారంభమైంది. మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు కలిశారు. జన్మభూమి కమిటీలు రద్దుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు ఆయనకు విన్నవించారు. రైతు భరోసాయాత్రలో భాగంగా తొలుత రాప్తాడు నియోజకవర్గంలో సీకేపల్లి మండలం వెంకటాంపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం బసంపల్లిలో రైతు సోమశేఖర్ కుటుంబాన్ని కలుసుకుని వారిని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. రెండు కుటుంబాలను పరామర్శించడంతో అనంతపురంలో వైఎస్ జగన్ చేపట్టిన నాలుగో విడత రైతు భరోసాయాత్ర ముగియనుంది. -
రెండింటిపై కన్ను!
విభేదాలకు ఆజ్యం పోస్తున్న పరిటాల శ్రీరామ్ అరంగేట్రం రాప్తాడు నుంచి బరిలోకి దించడానికి పరిటాల సునీత వ్యూహం పెనుకొండలో బీకే వ్యతిరేక వర్గీయులతో సునీత తరచూ సమావేశం తమ కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని బాబుపై సునీత ఒత్తిడి కలవరపడుతోన్న బీకే పార్థసారథి.. పయ్యావుల ద్వారా బాబుతో చర్చలు సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రం టీడీపీలో ముసలాన్ని పుట్టించింది. పెనుకొండ నుంచి తనకూ.. రాప్తాడు నుంచి తనయుడికి టికెట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇది బీకే పార్థసారథిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పయ్యావుల కేశవ్ సహకారంతో పరిటాల సునీత ఎత్తుగడను నీరుగార్చేందుకు బీకే పార్థసారథి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికలు ముం చుకొస్తోన్న వేళ టీడీపీలో టికెట్ల కొట్లాట ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో ఎలాగైనా తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను రాజ కీయ అరంగేట్రం చేయించాలని పరిటాల సునీత పట్టుదలతో ఉ న్నారు. ఇటీవల జరిగిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో రా ప్తాడు నియోజకవర్గంలో టీడీపీ వరుస పరాజయాలను చవిచూసింది. ఆ ఫలితాలతో రాప్తాడు నియోజకవర్గంలో తనకు ప్రతి కూల పరిస్థితి ఉందనే భావనకు వచ్చిన పరిటాల సునీత.. పెనుకొండపై కన్నేశారు. రాప్తాడు నుంచి తనయుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పరిటాల సునీత సూచనల మేరకు పరిటాల శ్రీరామ్ రా జకీయంగా క్రియాశీలకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పెనుకొండ నియోజకవర్గంపై పరిటాల సునీత ప్రత్యేక దృష్టి సారించారు. 2009 ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది నెలల్లోనే పరిటాల రవి వర్గీయులతో ఎమ్మెల్యే బీకే పార్థసారథి విభేదించారు. బీకే పార్థసారథి తమ మాటను ఖాతరు చేయడం లేదనే నెపంతో పరిటాల రవి వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. ఇటీవల ఆ వర్గంతో పరిటాల సునీత తరచూ సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానని అనుచరులతో ఆమె స్పష్టీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో పరిటాల సునీత భేటీ అయ్యారు. తనకు పెనుకొండ నుంచి.. తనయుడికి రాప్తాడు నుంచి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటూ పరిటాల సునీత డిమాండ్‌ను చంద్రబాబు సున్నితంగా తోసిపుచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కానీ.. పరిటాల సునీత తన డిమాండ్‌పై వెనక్కు తగ్గలేదు. తమ వ్యతిరేకులకు పార్టీలో స్థానం కల్పిస్తోన్న నేపథ్యంలో.. రాప్తాడుతోపాటూ పెనుకొండ స్థానాన్ని కూడా తమకే కేటాయించాలని చంద్రబాబును కో రినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆ ప్రతిపాదనకు అంగీకరించని పక్షంలో.. తమ వ్యతిరేక వర్గాలకు పార్టీ తీర్థం ఇ చ్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని చంద్రబాబు కోటరీ అయిన సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావులతో ప రిటాల సునీత తెగేసి చెప్పినట్లు సమాచారం. బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించాలని సు నీత సూచించారు. పెనుకొండపై కన్నేయడంతో బీకే పార్థసారథి తేరుకున్నారు. హిందూపురం లోక్‌సభ స్థానంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోండటం.. సిటింగ్ ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉండటంతో తనకు టికెట్ వచ్చే అవకాశాలు ఉండవని బీకే అంచనా వేస్తున్నారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశమై పెనుకొండ టికెట్‌ను తనకే కేటాయించాలని కోరగా,బాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం బీకేను కలవర పరిచింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ద్వారా పెనుకొండ టికెట్‌ను తనకే కేటాయించేలా చంద్రబాబుపై బీకే పార్థసారథి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.