మాస్కులు అందిస్తున్న వలంటీర్ దండు బీరప్ప
రాప్తాడు: అసలే చిరుద్యోగం... సంపాదన అంతంత మాత్రమే... అయినా ఆ కొద్ది పాటి ఆదాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు వినియోగిస్తున్నాడు వలంటీర్ దండు బీరప్ప. రాప్తాడు గ్రామ సచివాలయం–2లో విధులు నిర్వర్తిస్తున్న వలంటీర్ దండు బీరప్ప... కోవిడ్ కట్టడికి తన వంతు సాయంగా ముస్లిం మైనారిటీ కాలనీలోని 300 కుటుంబాలకు ఆదివారం మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఇందు కోసం ఎవరినీ ఆశించకుండా తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ సందర్భంగా వలంటీర్‌ను స్థానికులు అభినందించారు.
ఆత్మబంధువులే తోడుగా...
ఓడీ చెరువు: కరోనా వైరస్ వల్ల రక్త సంబంధాన్ని సైతం మర్చిపోయే మరో ఘటన ఆదివారం ఓడీ చెరువులో చోటు చేసుకుంది. ఇదే సమయంలో సాటి మనుషులుగా ఇతర మతానికి చెందిన వారు మానవత్వం చూపారు. వివరాలు... ఓడీ చెరువులోని బీసీ కాలనీకి చెందిన అశోక్(21)తో కరోనా చికిత్స పొందుతూ ఆదివారం కోవిడ్ ఆస్పత్రిలో మరణించాడు. ఇతని అంత్యక్రియలు నిర్వహించేందుకు సమీప బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ తలబా ఆర్గనైజేషన్ సభ్యులు ఆరీఫ్, ఆసీఫ్, ఫయాజ్, ఇర్ఫాన్, ఇమ్రాన్, ముస్తాక్, జాఫర్, ఇర్షాద్, షాను ముందుకు వచ్చారు. హిందూ సంప్రదాయ రీతిలో శ్మశానానికి మృతదేహాన్ని తరలించి, ఖననం చేశారు.
కరోనాతో మృతి చెందిన యువకుడికి అంతి సంస్కారాలు చేస్తున్న ముస్లిం యువకులు
చదవండి: Kurnool: ఆడుతూ పాడుతూ.. ఆరోగ్యంగా ఇంటికి
Comments
Please login to add a commentAdd a comment