
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ చేసు నమోదైంది. కాగా కనగానపల్లి మండలంలో బుధవారం అనుమతి లేకుండా నిర్వహించిన ర్యాలీలో రాప్తాడు టీడీపీ ఇంచార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల సునీత, శ్రీరామ్ సహా 119 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక పరిటాల సునీత, ఆమె తనయుడిపై నిబంధనలకు విరుద్ధంగా వ్వహరించినందుకు కేసు ఫైల్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. అంతకముందు కూడా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి.
చదవండి: దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు