paritala sunitha
-
మాకు అడ్డొస్తే చంపేస్తాం..
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మేము అధికారంలో ఉన్నాం.. మేం ఏం చెప్పినా జరుగుతుంది’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని రోజూ మండలంలోని ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు. మంగళవారం కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ, కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. అతని తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇతను గతంలోనూ పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం అలజడులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని తొమ్మిది పంచాయతీలకు గాను ఏడుచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దీన్ని జీరి్ణంచుకోలేని పరిటాల కుటుంబం సొంత మండలంలో ఆధిపత్యం కోసం గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తోంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కుంటిమద్దిలో అలజడి సృష్టించే క్రమంలోనే పరిటాల అనుచరుడు గంగాధర్ ఎంపీటీసీ భర్తను తుపాకీతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. -
Ananthapur: పరిటాల డర్టీ పాలిటిక్స్
♦ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఆత్మకూరుకు చెందిన ఓ వార్డు మెంబర్ వైఎస్సార్సీపీలో చేరాడు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం సదరు వ్యక్తి ఇంటి వద్దకు బాలాజీ వెళ్లాడు. ఏదో చెప్పి టీడీపీ కండువా వేసి వచ్చారు. కానీ ఆ వార్డు మెంబర్ మాత్రం టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్సార్సీపీ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరవుతున్నారు. ♦ ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్దకు ఈ నెల 15న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత సోదరుడు బాలాజీ వెళ్లాడు. ఏదో మాట్లాడుతూనే అతనికి బలవంతంగా టీడీపీ కండువా కప్పారు. వారు గడప దాటిన మరుక్షణమే సదరు వ్యక్తి టీడీపీ కండువా పక్కకు పడేశాడు. అతని కుమారుడు ఆ కండువాకు చెప్పు చూపించడమే కాకుండా నిప్పు పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ♦ కొన్ని రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన నాయీ బ్రాహ్మణులు, కురుబ కులస్తులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోని టీడీపీ నాయకులు అదే రోజు రాత్రి వారి ఇళ్ల వద్దకు వెళ్లారు.అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నమ్మబలికి టీడీపీ కండువాలు వేశారు. అనంతపురం: ఎమ్మెల్యే, మంత్రి పదవులను అనుభవించినా రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి పరిటాల కుటుంబీకులు చేసిన కృషి శూన్యం. పైగా, నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజల్నే వేధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అధికారం మాటున వందల కోట్లు వెనకేసుకున్నారు. వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా, బుద్ధి నేర్వని వారు మళ్లీ నేడు ఎన్నికలు వచ్చాయని ప్రజల్లోకి వెళ్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చు.. ప్రచారం పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్న పరిటాల కుటుంబీకులు ఆ మాటున యథేచ్ఛగా ప్రలోభాలకు దిగుతున్నారు. అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా రెడీ అంటూ హల్చల్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్ల దగ్గరకు వెళ్లి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఏ పని కావాలన్నా చేసి పెడతాం లేదా డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాం అంటూ ఎర వేస్తున్నారు. పైగా గ్రామీణులను కులాల పేరిట విడగొట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒక్కో రోజు ఒక్కో వర్గం వారిని కలుస్తూ ఏ కులంలో ఎంత మంది ఉన్నారంటూ తెలుసుకొని డబ్బు ముట్టజెబుతూ వల వేస్తున్నారు. ఓట్ల కోసం పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ బీజం వేస్తున్నారు. సొంత పార్టీ నాయకులకూ తాయిలాలు.. పరిటాల కుటుంబం సొంత పార్టీ కేడర్‌ను కూడా నమ్మడం లేదు. వారికి కూడా తాయిలాల ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం చేస్తే ఆ రోజంతా ప్రచారంలో పాల్గొనే వారికి మందు, ఖర్చులకు డబ్బుతో పాటు రవాణా ఖర్చులకు కూడా ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ వారిని, ఆ పార్టీ సానుభూతిపరులను టీడీపీలో చేర్పించి ఎంత కావాలన్నా తీసుకోండి అంటూ కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో టీడీపీకి చెందిన వారినే సునీత, శ్రీరాం దగ్గరకు తీసుకెళ్లి పార్టీ కండువాలు వేయిస్తూ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బయటకొచ్చాక పారవేస్తున్నారు.. భయపెట్టో, ప్రలోభ పెట్టో తమ వైపు జనాన్ని తిప్పుకోవాలన్న పరిటాల కుటుంబ పాచికలు ఏ మాత్రమూ పారడం లేదు. టీడీపీ కండువాలు కప్పుకున్న వారు బయటకు వచ్చాక వాటిని అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. తమ ఇంటికే వచ్చి పార్టీ కండువాలు వేసి వెళ్లాక వాటిని పారవేస్తున్నారు. కొంతమందైతే తగులబెడుతున్నారు. ఎన్ని రకాలుగా వల పన్నుతున్నా ప్రజలు లొంగకపోవడం చూసి పరిటాల సునీత డీలా పడినట్లు తెలుస్తోంది. ఓడిపోతామన్న భయంతోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయి. రూపాయి కూడా లంచం తీసుకోకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే ప్రజలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అందించింది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరూరు డ్యాంను నీటితో నింపారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. రూ. వేల కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ప్రజలు ఈ సారి కూడా వైఎస్సార్ సీపీకి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా గమనించి మళ్లీ ఓటమి తప్పదని గుర్తించిన పరిటాల సునీత ఎలాగైనా, ఏం చేసైనా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. బలవంతంగా టీడీపీ కండువాలు కప్పుతూ అపహాస్యం పాలవుతున్నారు. అంతా గమనిస్తున్న ప్రజలు లోలోనే నవ్వుకుంటున్నారు. -
ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్...తోపుదుర్తి కౌంటర్
-
చంద్రబాబు, లోకేశ్‌ల.. ఎమ్మెల్సీ మంత్రం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని టీడీపీలో ఇప్పుడు నియోజక వర్గానికో కొల్ల అప్పలనాయుడు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ గొంప కృష్ణ, ఓ కిమిడి నాగార్జున, ఓ బొబ్బిలి చిరంజీవులు, ఓ ఆర్పీ భంజ్‌దేవ్, ఓ మీసాల గీత, ఓ తెంటు లక్ష్మునాయుడు, ఓ కేఏ నాయుడు, ఓ కావలి గ్రీష్మ, ఓ కర్రోతు బంగార్రాజు.. ఇలా ఊహూ అన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ చేసేస్తామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హామీలిచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ ఉద్యోగాలిస్తామని హీరో రవితేజ బృందాన్ని బురిడీ కొట్టించిన సీన్ గుర్తొస్తుంది. ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్‌యార్డా, ఏసియాడా, జింకా, బంకా (హెచ్‌పీసీఎల్)... ఏ కంపెనీలో ఉద్యోగం కావాలి? జీఎం కావాల్న? ఏజీఎం కావాల్న?’ అని ఊరించి డబ్బులు నొక్కేసి కృష్ణభగవాన్ లాఘవంగా జెల్ల కొట్టేసిన హాస్యభరిత సన్నివేశం ఇప్పుడీ టీడీపీ నాయకుల సీట్ల వ్యవహారంలో కనిపిస్తోంది. మాట ఇస్తే ఆరునూరైనా అమలుచేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి మనస్థత్వం కాదు వారిది!. చంద్రబాబు, లోకేశ్ హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత ఎలా ముంచేస్తారో కొల్ల అప్పలనాయుడి అనుభవమే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మద్దతు కూడగట్టాలని ప్రతి నియోజకవర్గంలో రెబెల్స్‌కు ఎమ్మెల్సీ ఆశ చూపిస్తున్నారు. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ లేదంటే సముచిత స్థానం కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు. ఉన్నవెన్ని? వచ్చేవెన్ని? రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. రెండేళ్లకోసారి మూడింట ఒకటో వంతు మంది పదవీ విరమణ చేస్తుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బలం 43 కాగా టీడీపీకి ఉన్నవి ఎనిమిది మాత్రమే. మిగతావాటిలో పీడీఎఫ్ సభ్యులు ఇద్దరు, స్వతంత్ర సభ్యులు నలుగురు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిపోయినట్లుగానే భవిష్యత్తులో శాసనమండలి నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేట్లు ఉంది. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాల్లో భాగంగా సొమ్ములు దండిగా ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచేయి చూపిస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ‘ఎమ్మెల్సీ’ పదవులనే బిస్కెట్లు వేస్తున్నారు. మన రెండు జిల్లాల్లోనే పది మంది వరకూ ఇలాంటి ఆశాజీవులు ఉంటే... రాష్ట్రంలో ఇలా ఆశలపల్లకి ఎక్కిస్తున్నవారి సంఖ్య వందకు పైమాటే. చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులనూ బురిడీ కొట్టిస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి.. మరీ.. ఈయన పేరు కొల్ల అప్పలనాయుడు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండుసార్లు తన అనుచరులనే ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌ను చేస్తానని ఆశచూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండిచేయి చూపించారు. చౌదరి ధనలక్ష్మిని చంద్రబాబు ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి... ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తారని ఆశించిన కొల్లకు జెల్ల కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును అందలం ఎక్కించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొల్ల తాను రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇవి చదవండి: బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'! -
‘ఫ్యామిలీ’ డ్రామా!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయించడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై టీడీపీలో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే సీటు ఇస్తానని ఆయన పెట్టిన నిబంధనతో పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ కుటుంబాల్లో ఒకరికే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఈ సాకు చూపుతున్నా తాను కావాలనుకుంటే మాత్రం దానికి సడలింపు ఇచ్చేస్తున్నారు. దీనిపై సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు తన కుటుంబంలో కావాల్సిన వారందరికీ సీట్లు ఇచ్చుకుంటూ పార్టీలోని సీనియర్లకు మాత్రమే ఈ రూలు పెడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటికే తన కుటుంబంలో ముగ్గురికి సీట్లు ప్రకటించుకోగా, ఇంకో సీటు మలి జాబితాలో ప్రకటించనున్నారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేశ్‌కు మంగళగిరి, తన బావమరిది–వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం సీట్లను కేటాయించుకున్నారు. మరో సీటును లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కి ఎక్కడో ఒకచోట ఇవ్వడం ఖాయమైంది. ఇలా నాలుగు సీట్లు చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించుకున్నారు. సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకరికే సీటు ఇవ్వగలమని, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు. అదేమంటే పొత్తుల్లో సీట్లు తగ్గిపోయాయని వంకలు చెబుతున్నా సొంత కుటుంబానికి నాలుగు సీట్లు ఎలా ఇచ్చుకున్నారనే ప్రశ్నకు సమాధానంలేదు. అయ్యన్నకు సీటు..కొడుక్కి మొండిచేయి.. అనకాపల్లి జిల్లాలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం సీటును ప్రకటించగా ఆయన కుమారుడు విజయ్‌కి సీటు ఇవ్వలేదు. అయ్యన్న తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఒక దశలో తనకు కాకుండా తన కుమారుడికి సీటు ఇవ్వాలని అయ్యన్న గట్టిగా కోరినా ఆయన మాట పెడచెవిన పెట్టారు. దీంతో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి కాపుకాసిన తమకు ఈ పరిస్థితి ఏమిటని ఆవేదనతో ఆయన కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు నర్సీపట్నం సీటు ఇచ్చినా అయ్యన్న సంతృప్తిగా లేరు. తనకో నిబంధన, చంద్రబాబుకి మరో నిబంధనా అని అంటూ అంతర్గతంగా రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసీ బ్రదర్స్‌కి ఝలక్.. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులకు కూడా చంద్రబాబు ఇదే తరహా ఝలక్ ఇచ్చారు. జేసీ సోదరులు గత ఎన్నికల్లోనూ తాము పక్కకు తప్పుకుని తమ కుమారులను బరిలోకి దింపారు. అనంతపురం ఎంపీ స్థానంలో దివాకర్ కుమారుడు పవన్, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ని పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో అలాగే సీట్లు ఇవ్వాలని ఎంత లాబీయింగ్ చేసినా అస్మిత్ ఒక్కడికే సీటిచ్చి పవన్‌కి సీటు నిరాకరించారు. దీంతో జేసీ సోదరులు పైకి మామూలుగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం రగిలిపోతూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. పనబాక విషయంలోనూ గందరగోళమే.. మరోవైపు.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కుటుంబాన్నీ చంద్రబాబు గాల్లో పెట్టారు. పార్టీలో చేరే ముందు ఆమెతో పాటు ఆమె భర్త కృష్ణయ్యకు సీటిస్తామని చెప్పి తీసుకొచ్చినా ఇప్పుడు ఏ విషయం తేల్చడంలేదు. ఆమెకు మొదట తిరుపతి ఎంపీ సీటు ఇస్తామని చెప్పినా ప్రస్తుతం దానిపైన స్పష్టత ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు ఉంటే ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పనబాక కుటుంబం చంద్రబాబు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. దీన్నిబట్టి చంద్రబాబు ఒక కుటుంబానికి ఒక సీటనే రూలును తన రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగానే తనకు అవసరమైన చోట మాత్రమే ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిటాల కుటుంబానికి చెక్.. ఈ జిల్లాలోనే మరో సీనియర్ నేత పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు షాకిచ్చారు. సునీతకు రాప్తాడు సీటు ప్రకటించి ఆమె కుమారుడు శ్రీరామ్‌కి సీటు నిరాకరించారు. ధర్మవరం సీటు తన కుమారుడికివ్వాలని పట్టుబట్టినా ఒక కుటుంబానికి ఒకే సీటు పేరుతో అతన్ని పక్కనపెట్టారు. దీంతో పరిటాల కుటుంబం కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇలా సీనియర్ల కుటుంబాలను కట్టడి చేసిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం నిబంధనలేవీ వర్తించవనేలా వ్యవహరిస్తుండడం సీనియర్లకు మింగుడుపడడంలేదు. ఇక తన కుటుంబానికే కాకుండా కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలి సీటు ఇవ్వగా, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్నాయుడికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఖరారు చేశారు. -
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్‌లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
రాప్తాడు నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి
-
‘స్టాంప్ పేపర్‌పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
మహాతల్లి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా..? పరిటాల సునీతకి కౌంటర్
-
పరిటాల సునీత, శ్రీరామ్‌లపై కేసు నమోదు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ చేసు నమోదైంది. కాగా కనగానపల్లి మండలంలో బుధవారం అనుమతి లేకుండా నిర్వహించిన ర్యాలీలో రాప్తాడు టీడీపీ ఇంచార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల సునీత, శ్రీరామ్ సహా 119 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరిటాల సునీత, ఆమె తనయుడిపై నిబంధనలకు విరుద్ధంగా వ్వహరించినందుకు కేసు ఫైల్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. అంతకముందు కూడా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
అనంతపురంలో పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
-
దళిత మహిళ ఆదిలక్ష్మిపై పరిటాల సునిత వర్గీయుల దాడి
-
అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. -
పచ్చదళంలో మహిళా పోలీస్!
సాక్షి, అనంతపురం(ఆత్మకూరు): ఓ ప్రభుత్వ ఉద్యోగి గీత దాటారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఓ రాజకీయ పార్టీ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ హల్చల్ చేశారు. ఆమె వ్యవహార శైలి చూసి అక్కడున్న వారంతా ముక్కునవేలేసుకున్నారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మ మదిగుబ్బ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తోంది. గురువారం ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా సాగిన పరిటాల సునీత పాదయాత్రలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రామాంజినమ్మ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తగా పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఎంపీడీఓ కొండన్న, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులను వివరణ కోరగా.. విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
పరిటాల సునీతకు చేదు అనుభవం
-
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు
సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు. భాష తప్పే.. భావం కరెక్ట్ చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు. ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు.. పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
25 ఏళ్లుగా పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాకు చేసిందేమి లేదు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
అనంతపురంలో టీడీపీ నేత పరిటాల సునీత తీరు వివాదాస్పదం
-
రాప్తాడు ఎమ్మెల్యే తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిటాల సునీత అనుచరుడు అరెస్ట్
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిపై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద ఆమె తనయుడితో కలిసి హల్చల్ చేశారు. చదవండి: (షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..) -
‘కిరాయి హంతకుడి తరుఫున ధర్నా చేస్తారా?.. సిగ్గుచేటు’
సాక్షి, అనంతపురం: పరిటాల సునీత ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరుపై మండిపడ్డారు. కిరాయి హంతకుడు గంటాపురం జగ్గు తరుఫున ధర్నా చేస్తారా?.. మహిళలను కించపరిచిన వ్యక్తిని మీరెలా సమర్థిస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. గంటాపురం జగ్గుకు అండగా నిలవడం సిగ్గుచేటు అని మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లి పై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునే బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్నా చేపట్టారు. దీన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఖండించారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన గంటాపురం జగ్గుకు మద్దతుగా ఆందోళన చేయడం పరిటాల సునీతకు తగదన్నారు. చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! -
జాకీని అడ్డుకుంది అప్పటి పప్పు, తుప్పు మంత్రులే
అనంతపురం: జాకీ ఇంటర్నేషనల్ కంపెనీని అడ్డుకున్నది అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పప్పు, తుప్పు మంత్రులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన సంస్థతో తనకు ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఎక్కడ జాకీ, ఎవరి జాకీ, ఎక్కడుంది జాకీ? ఈ సంస్థకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటైనా నిర్మాణం జరిగిందా’ అని ప్రశ్నించారు. అదో దోపిడీ ఒప్పందం ‘జాకీ దుస్తులు ఉత్పత్తి చేసే పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.2.80 కోట్లకే ఇచ్చారు. 2017లో భూమి కేటాయించి 2018లో సేల్ డీడ్ చేశారు. మూడేళ్లు నడిపితే సేలబుల్ రైట్స్ ఇచ్చారు. వారు ఉద్యోగాలు కూడా దశలవారీగా ఇస్తామన్నారు. తొలుత వెయ్యి మందికి, మూడేళ్లకు రెండు వేల మందికి, ఆ తర్వాత దశలవారీగా 6 వేలమందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్‌లో చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి విద్యుత్తు సరఫరా, తాగు నీటి సదుపాయానికి కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా క్యాపిటల్ సబ్సిడీ దాదాపు రూ.15 కోట్లు ఇచ్చేలా, వడ్డీ సబ్సిడీ ఆరు శాతం ఏడేళ్ల పాటు.. అంటే రూ.42 కోట్లు, భూమికి రూ.130 కోట్లు, ఇవి కాకుండా వారు చెబుతున్న ప్రకారం 6 వేల మంది ఉద్యోగుల జీతాలపై సబ్సిడీ ఏడేళ్లకు రూ. 130 కోట్లు కలిపి మొత్తం రూ.300 కోట్లకు పైగా దోచిపెట్టేలా ఒప్పందం జరిగింది. తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్ విలువ కేవలం రూ.40 కోట్లే. దాని డీపీఆర్ పెంచుకుని రూ.300కోట్లు దోచుకోవాలని పన్నాగం పన్నారు. ఆ సంస్థ 2017లో సివిల్ పనులు ప్రారంభించి, 2018 ఆగస్టు నాటికి ఫ్యాక్టరీ, బిల్డింగ్లు పూర్తి చేసి, 2018 అక్టోబరులో ఉత్పత్తి చేస్తామన్నారు. ఇంత హడావుడిగా షెడ్యూలు ఇచ్చిన ఆ సంస్థ ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదు? బేరాలు కుదరలేదా?’ అని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ‘ఆరోజు పప్పు మంత్రి నారా లోకేష్, తుప్పు మంత్రి పరిటాల సునీత చీకటి ఒప్పందం చేసుకున్నారు. తుప్పు మంత్రి కొడుకు, తమ్ముడు పోటీ పడి జాకీ కంపెనీ కాంపౌండ్ వాల్ నిర్మించాలని అనుకున్నారు. వారిద్దరూ కలిసి 2018 జూన్‌లో వంద మీటర్ల పనులు ప్రారంభించారు. మధ్యలోనే ఆపేశారు. హిందూపురంలో పది ఎకరాల్లో టెక్సో్పర్ట్ వచ్చింది. వారికి ప్రైమ్ ల్యాండ్ ఇవ్వలేదే? ఇక్కడేమో జాకీకి ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారు. అయినా ఎందుకు రాలేదు? మీ చేతగానితనానికి మాపై విమర్శలు చేస్తారా’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పరిటాల పాపం.. రైతులకు శాపం
టీడీపీ హయాంలో తమ కాంట్రాక్ట్ పనులకు అవసరమైన మట్టి కోసం పరిటాల కుటుంబం జంగాలపల్లి చెరువుపై కన్నేసింది. చెరువు స్వరూపం దెబ్బతీసేలా అధునాతన యంత్రాలతో మట్టిని తవ్వేశారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చెరువు ఆయకట్టులో ఊట పడటానికి కారకులయ్యారు. పంటలు దెబ్బతినడంతో పాటు జమ్ము గడ్డి ఏపుగా పెరిగి ఇకపై సాగు చేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. పరిటాల కుటుంబానికి కాసులు.. ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిలాయి. రాప్తాడు రూరల్: అనంతపురం మండలం జంగాలపల్లి చెరువు (కందుకూరు చౌడు చెరువు) 33 ఏళ్ల తర్వాత నిండింది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఆయా గ్రామస్తులు పట్టుబట్టి ధర్మవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువుకు తెప్పించుకున్నారు. చెరువుకు నీళ్లు రాగానే భూగర్భజలాలు పెరిగి బోరుబావులు రీచార్జ్ అవుతాయని ఆయకట్టు రైతులు ఆశపడ్డారు. అయితే వారి అశలు అడియాసలయ్యాయి. గత టీడీపీ పాలకులు చేసిన పాపం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అప్పట్లో చెరువులో జరిపిన తవ్వకాల వల్ల కింది భాగం మట్టి లూజు అయ్యింది. ఫలితంగా ఊటలు ఏర్పడి సాగు చేసిన పంటల్లో నీరు ప్రవహిస్తోంది. తుడిచిపెట్టుకుపోయిన పంటలు ఈ చెరువు ఆయకట్టు దాదాపు 275 ఎకరాల దాకా ఉంది. నీటి ఊట కారణంగా 150 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, పరుశురాం, వెంకటరాముడు, చరణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితర రైతులు సాగు చేసిన చీనీ, అరటి, బొప్పాయి, స్వీట్ ఆరెంజ్, కాయగూరల పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. రైల్వే పనులకు చెరువు మట్టి గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల కుటుంబం కాంట్రాక్ట్ చేసిన రైల్వే పనులకు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన మట్టిని జంగాలపల్లి చెరువు నుంచే తరలించింది. దాదాపు 30 అడుగుల లోతు ఇష్టారాజ్యంగా హిటాచీల సాయంతో తవ్వేశారు. జీడిబంక మట్టి అంతాపోయింది. ఇసుక, గరుసు వచ్చేవరకు తవ్వకాలు జరిపారు. టిప్పర్లు కింది నుంచి పైకి వచ్చేందుకు ప్రత్యేకంగా రన్‌వే ఏర్పాటు చేశారంటే ఏ స్థాయితో తవ్వకాలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఉబికి వస్తున్న నీళ్లు చెరువు ఆయకట్టులో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఉన్న పంటలు నష్టపోవడంతో పాటు కొత్తగా పంటలు సాగు చేసేందుకు కూడా వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్లలో నుంచి నీరు బయటకు వస్తోంది. నీటి ప్రవాహంతో పెద్ద ఎత్తున జమ్ము పెరిగింది. చేపల చెరువులకు లీజుకు ఇచ్చిన రైతులు నీటి ఊటతో పంటలు సాగు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో తొలిసారి చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆయకట్టు కింద వెంకటరామిరెడ్డి, చరణ్‌కుమార్‌రెడ్డి వరి సాగు చేసేవారు. మంచి దిగుబడి వచ్చేది. ఈసారి నీటి ప్రవాహం కారణంగా పంట సాగు చేసేందుకు వీలు కాకపోవడంతో తమ భూమిని నెల్లూరు జిల్లా వాసులకు చేపల చెరువుల కోసం లీజుకు ఇచ్చారు. మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి.. టీడీపీ పాలనలో చెరువులో జరిపిన మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దుగుమర్రి గోవిందరెడ్డి, సర్పంచ్ ప్రశాంత్‌కుమార్, ఎంపీటీసీ సభ్యులు రాగే రేవతి, పెద్దప్ప, ఉపసర్పంచ్ ఓబులేసు, పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, నరసింహారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు తెలిపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎంతో కష్టపడి కృష్ణాజలాలతో చెరువును నింపించారన్నారు. చెరువు అడుగు భాగం బాగా దెబ్బతినడంతో ఊటలు ఏర్పడి ఆయకట్టు అంతా నీరుపారుతోందన్నారు. ఇప్పటికే 60 శాతం దాకా నీళ్లు బయటికిపోయాయని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయకట్టులో జమ్ము గడ్డి పెరిగిందన్నారు. దీంతో ఇకపై పంటలు పెట్టేందుకు వీలుకాదని తెలిపారు. వ్యవసాయ పంటలకు దెబ్బ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చెరువుకు 75 శాతం నీళ్లు వచ్చినా ఏరోజూ ఊట పడలేదు. ఆనందంగా వరి సాగు చేసి.. 450 ప్యాకెట్ల ధాన్యం తీసేవాళ్లం. ఇప్పుడు ఆయకట్టులో భారీగా నీళ్లు ఊరుతున్నాయి. నా జీవితంలో ఎప్పుడూ ఆయకట్టులో జమ్ము గడ్డి పెరగడం చూడలేదు. ఇప్పుడా పరిస్థితి రావడంతో వ్యవసాయ పంటలకు పెద్ద దెబ్బ పడింది. – చరణ్‌కుమార్‌రెడ్డి, రైతు, జంగాలపల్లి మోటార్లతో నీళ్లు తోడుతున్నాం ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో చీనీ పంట, మూడెకరాల్లో అరటి సాగు చేశాను. ఊట దిగడంతో అరటి పంట మొత్తం దెబ్బతింది. అరటిపంటలో మొత్తం జమ్ము పెరిగింది. నాలుగున్నరేళ్ల వయసున్న చీనీచెట్లను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నా. రోజూ మోటార్లతో నీళ్లు తోడిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. చెరువు అంతా పెద్ద పెద్ద గుంతలు తవ్వడం వల్లే నీటి ఊటలు ఏర్పడ్డాయి. – కృష్ణారెడ్డి, చెరువు ఆయకట్టు దారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊటలోనే 12 ఎకరాలు.. చెరువు ఆయకట్టు కింద 19 ఎకరాలు ఉంది. అరటి, బొప్పాయి, చీనీచెట్లు సాగు చేశాం. ఊట ఏర్పడి రెండెకరాలు మినహా తక్కిన పంటలన్నీ పూర్తిగా ఎత్తిపోయాయి. ఏడెనిమిది నెలలవుతున్నా 12 ఎకరాల భూమి నీళ్లలోనే ఉంది. 15 ఏళ్ల వయసున్న చీనీచెట్లు, కోతకు వచ్చిన అరటి, బొప్పాయి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు రూ. 20 లక్షల పైనే నష్టం వాటిల్లింది. గతంలో చెరువులో నీళ్లు ఉన్నా...ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. – సోమశేఖర్‌రెడ్డి, రైతు, కందుకూరు