
సాక్షి, అనంతపురం : ఎన్నికలు సమీపిస్తున్నవేళ మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్సార్ జిల్లాలో గురువారం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాప్తాడు వైస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. వేపకుంట రాజన్న చేరికతో నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా అందరిని కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment