
మీడియాతో మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత వర్గీయుల అరాచకాలు జిల్లాలో తీవ్ర స్థాయికి చేరాయని వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల భూములను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు మండలం వేపచర్లకు చెందిన రైతు కేశవనాయక్ ఆత్మహత్యకు మంత్రి పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కేశవనాయక్ అసైన్డ్ భూమిని పరిటాల వర్గీయులు రద్దు చేయించారని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు తొత్తుగా వ్యవహరించిన తహశీల్దార్ నాగరాజుపై బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించకపోవడం దారుణమన్నారు. బాధితుల పక్షాన నిలబడిన తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై హైకోర్టు, లోకాయుక్తలో కేసులు వేస్తామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు.