
సాక్షి, అనంతపురం : కరోనా విపత్కర సమయంలో ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేయటం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సహా ఇతర విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యతగా మాట్లాడాలని హితవుపలికారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు.
అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేయటం వల్లనే కోవిడ్ నియంత్రణ సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉచిత రేషన్, వెయ్యి నగదు ఇచ్చి పేదలను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌దే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు సీఎం జగన్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కరోనా వల్ల రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment