
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వర్గాలుగా విడగొట్టి ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు ప్రైవేటు సైన్యాలతో దాడులు చేయించారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని అంతమొదించడానికి కుట్రలు చేశారన్నారు.
చదవండి: చంద్రబాబు సభలో ‘పరిటాల’ అనుచరులు రచ్చరచ్చ..
చంద్రబాబు నైజం నిన్న బయటపడింది. రక్తం పారించే చరిత్ర మీదైతే.. నీరు పారించిన చరిత్ర మాది. ఎలాగైనా గెలవాలి.. పౌరుషంగా పోరాడండని రెచ్చగొడుతున్నారు. దశాబ్దాల పాటు రక్తం పారిన ప్రాంతంలో నీరు పారించాం. మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశామని తోపుదుర్తి అన్నారు. ‘‘రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్లిపోయావ్.. కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇది చాలదా నిన్ను ఆర్థిక ఉన్మాది అనడానికి అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment