‘కిరాయి హంతకుడి తరుఫున ధర్నా చేస్తారా?.. సిగ్గుచేటు’ | YSRCP MLA Thopudurthi Prakash Reddy Comments On Paritala Sunitha | Sakshi
Sakshi News home page

‘కిరాయి హంతకుడి తరుఫున ధర్నా చేస్తారా?.. సిగ్గుచేటు’

Published Sun, Nov 27 2022 11:29 AM | Last Updated on Sun, Nov 27 2022 1:39 PM

YSRCP MLA Thopudurthi Prakash Reddy Comments On Paritala Sunitha - Sakshi

సాక్షి, అనంతపురం: పరిటాల సునీత ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరుపై మండిపడ్డారు.

కిరాయి హంతకుడు గంటాపురం జగ్గు తరుఫున ధర్నా చేస్తారా?.. మహిళలను కించపరిచిన వ్యక్తిని మీరెలా సమర్థిస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. గంటాపురం జగ్గుకు అండగా నిలవడం సిగ్గుచేటు అని మాధవ్‌, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కాగా, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లి పై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునే బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు.

టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్నా చేపట్టారు. దీన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఖండించారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన గంటాపురం జగ్గుకు మద్దతుగా ఆందోళన చేయడం పరిటాల సునీతకు తగదన్నారు.
చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్‌.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement