అనంతపురం: తమ పార్టీ ఓట్లు తొలగింపుకు మంత్రి పరిటాల సునీత కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తనకు అనుకూలంగా ఉన్న రెవిన్యూ సిబ్బందితో సునీత కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పి.. ఉన్న ఒక్క ఓటునే తొలగిస్తున్నారని మండిపడ్డారు. ‘మంత్రి కొత్త ఎత్తుగడతో వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించడానికి యత్నిస్తున్నారు.
రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పి, ఒక చోట తొలగిస్తామని సంతకాలు చేయించుకుంటున్నారు. సంతకం చేశాక ఉన్న ఒక్క ఓటు తొలగిస్తున్నారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మంత్రి సునీతకు ఓటమి భయం పట్టుకుంది. దాంతోనే కుట్ర చేస్తున్నారు. ఆమెకు అనుకూలంగా ఉన్న అధికారుల ద్వారా వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించేందుకు పన్నాగం రచించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి’ అని తోపుదుర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment