Kuruva Gorantla Madhav
-
రాసిపెట్టుకో.. కూటమికి గోరంట్ల మాస్ వార్నింగ్
-
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు
సాక్షి,అనంతపురం : ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. నిన్న..రాజకీయాలకు స్వస్తి పలికిన నటుడు పోసాని కృష్ణ మురళీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసుల విచారణ చేపట్టేందుకు గోరంట్ల మాధవ్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు అందించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీసీ నేతలు ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు లోఫర్.. పవన్ కళ్యాణ్ జోకర్.. గోరంట్ల మాధవ్ సంచలనం వ్యాఖ్యలు
-
కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం..
-
కార్యకర్తలను కాపాడుకుంటాం
అనంతపురం కార్పొరేషన్: ప్రాణాలు అడ్డువేసైనా టీడీపీ దాడుల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 గంటల్లోనే రాప్తాడులో 27 అవాంఛనీయ ఘటనలు జరిగాయని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. కనగానపల్లి మండలంలోని 7 గ్రామాల్లో, రామగిరిలో 6 గ్రామాల్లో, చెన్నేకొత్తపల్లిలో 7 గ్రామాల్లో, ఆత్మకూరులో 5 ప్రాంతాల్లో, రాప్తాడులో రెండోచోట్ల వైఎస్సార్ïÜపీ శ్రేణులు, వారి ఆస్తులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు.చాలామందికి తీవ్ర గాయాలై ఆస్పత్రుల పాలయ్యారని చెప్పారు. గొరిదిండ్లలో వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చారన్నారు. ఎస్కేయూలోనూ వైఎస్సార్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని అన్నారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిపైనా తమ నాయకులు, కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడలేదని తెలిపారు. ఎవరెంతగా రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు చెప్పామని, అది వైఎస్సార్సీపీ నైజమన్నారు. పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆ పార్టీ పెద్దలు నోరుమెదపడం లేదన్నారు. పోలీసు వ్యవస్థను నమ్ముదామని, వారు స్పందించకుంటే కోర్టులను ఆశ్రయిద్దామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి, మంచి చేస్తే స్వాగతిద్దామన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారా? ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తారా? సీపీఎస్ రద్దు చేస్తారా? 20 లక్షల ఉద్యోగాలిస్తారా అని ప్రశ్నించారు. తాలిబన్ల తరహాలో దాడులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు తాలిబన్ల తరహాలో దాడులకు పాల్పడుతున్నారన్నారు. తమ ప్రాణాలను అడ్డు వేసైనా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. దాడులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిలో మనోధైర్యాన్ని నింపుతామని తెలిపారు. -
టీడీపీ బెట్టింగ్ లపై గోరంట్ల సెటైర్లు
-
టీడీపీపై ఎంపీ గోరంట్ల సెటైర్లు
-
బాబు, పవన్ పై అదిరిపోయే పంచులు..
-
చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ
-
చంద్రబాబు అరెస్ట్ పై ఎంపీ గోరంట్ల రియాక్షన్..
-
‘చంద్రబాబు అన్నమే తింటున్నారా?’ : ఎంపీ మాధవ్
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదని.. సదరు వ్యాఖ్యలపై చంద్రబాబును కలిసి నిలదీస్తానని ఎంపీ మాధవ్ చెప్పారు. చంద్రబాబు వైఎస్ విజయమ్మను కించపరిచారు. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా?. చంద్రబాబును మహిళా లోకం క్షమించదు. ముక్కు నేలకు రాసి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు గోరంట్ల. అలాగే.. అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు ను నిలదీస్తానని, అందుకోసం ఆయన శిబిరం వద్దకు వెళ్తానని ఎంపీ గోరంట్ల తెలిపారు. బుధవారం అనంత రాయదుర్గం బహిరంగ సభలో ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన చంద్రబాబు.. ‘‘జగన్.. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక..’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. -
‘కిరాయి హంతకుడి తరుఫున ధర్నా చేస్తారా?.. సిగ్గుచేటు’
సాక్షి, అనంతపురం: పరిటాల సునీత ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరుపై మండిపడ్డారు. కిరాయి హంతకుడు గంటాపురం జగ్గు తరుఫున ధర్నా చేస్తారా?.. మహిళలను కించపరిచిన వ్యక్తిని మీరెలా సమర్థిస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. గంటాపురం జగ్గుకు అండగా నిలవడం సిగ్గుచేటు అని మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లి పై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునే బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్నా చేపట్టారు. దీన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఖండించారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన గంటాపురం జగ్గుకు మద్దతుగా ఆందోళన చేయడం పరిటాల సునీతకు తగదన్నారు. చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! -
సీఎం జగన్‌ను కలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు గురువారం కలిశారు. ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి ఎమ్మార్వో పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసిన కురువ సంఘాల ప్రతినిధులు.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించారు. తమ కులస్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడంతో సీఎం సానుకూలంగా స్పందించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ప్రెస్‌అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని -
సీఐడీ కేసును కొట్టేయండి
సాక్షి, అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. నకిలీ అశ్లీల వీడియోను సృష్టించి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్‌లో వ్యాప్తి చేసి తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. వాస్తవానికి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఫోన్ నంబర్ సాయంతో ఆ వీడియోను ఐ టీడీపీ గ్రూప్‌లో అప్లోడ్ చేశారని, దాంతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసులో విజయ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్ధించారు. -
Vijayawada: ఐ-టీడీపీపై సీఐడీ కేసు
సాక్షి, విజయవాడ: ఐ-టీడీపీపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తన వీడియోని మార్ఫింగ్ చేసినట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టి ప్రాథమికంగా ఆ వీడియో మార్ఫింగ్ అని తేల్చారు. ఈ క్రమంలో ఐ-టీడీపీ సహా మరికొందరిపై పలు సెక్షన్లతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఐటీ (66t), IPC 465, 469, 471, 153(a), 505(2), 120(b) సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చదవండి: (సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ) -
గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ అడ్వకేట్ అరుణ్
సాక్షి, హైదరాబాద్: గోరంట్ల మాధవ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ స్పందించారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంపీ మాధవ్‌ను టార్గెట్ చేయడం బాధాకమరని అన్నారు. ఈ విషయంలో వారు హద్దులు దాటి ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు మాధవ్ ఫేక్ వీడియోని అమెరికాకు పంపడమే కాకుండా తప్పుడు రిపోర్ట్‌ని సర్క్యులేట్ చేశారని తెలిపారు. విదేశాలకు ఒక ఎంపీ వీడియోను పంపడమంటే దీనిని భారత పార్లమెంట్‌పై దాడిగా పరిగణించాలని అడ్వకేట్ అరుణ్‌కుమార్ అన్నారు. చదవండి: (Gorantla Madhav: చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్) -
ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో టీడీపీ మరోసారి దొరికిపోయింది: ఎంపీ గోరంట్ల మాధవ్
-
Gorantla Madhav: చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్
సాక్షి, అనంతపురం: ఫేక్ వీడియోపై తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ సర్క్యూలేట్ చేస్తున్న సర్టిఫికెట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థ ప్రకటించిందని వెల్లడించారు. ఈ మేరకు అనంతపురంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఓటుకు నోటు కేసుపై ఎల్లో మీడియాలో ఏనాడైనా చర్చలు పెట్టారా?. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చారు. చదవండి: (టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు) ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు?. లోకేష్ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు?. ఫేక్ వీడియో తీసుకొచ్చి బీసీ ఎంపీపై కక్ష సాధిస్తారా?. చంద్రబాబు, ఎల్లో మీడియాది కుల దురహంకారం కాదా?’ అంటూ ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ 'ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. పట్టుబడిన రూ.50 లక్షల లంచం తనది కాదని చెప్పగలరా అని నిలదీశారు.చంద్రబాబు మనసూస్పర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
ఫేక్ పార్టీ..ఫేక్ రిపోర్టులు
-
గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ నివేదిక నిజం కాదు : సీఐడీ చీఫ్ సునీల్
-
టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతలు ప్రతీరోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల, మతాల పేరుతో చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు తోడు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘‘గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియో ప్రచారం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ మరో కుట్ర చేశారు. గోరంట్ల వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫేక్ వీడియోతో పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ ప్రయత్నం చేస్తోందని’’ కొడాలి నాని మండిపడ్డారు. చదవండి: ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ‘‘వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఫేక్ డాక్యుమెంట్‌ను స్పష్టించి దుష్ప్రచారానికి తెరలేపారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారిపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీకి ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారు. ఓ జిల్లాకు బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే తప్పేముంది. పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా బుద్ధి రాలేదు. పవన్.. చంద్రబాబుకు భజన చేస్తున్నారు. టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని’’ కొడాలి నాని అన్నారు. -
టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు
-
ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
సాక్షి, విజయవాడ: టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారు. ఆ వీడియోను ఎవరో షూట్ చేశారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారు. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు. రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. చదవండి: (బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
బలంగా ‘బాదినా’ బుద్ధి రాలేదా?
రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకునే నీకు ధరల పట్ల కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. ‘పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు, చిత్రదుర్గం, బళ్లారికి నాతో కలిసి నీవు, నీ పచ్చ బ్యాచ్, మీడియాతో వస్తే అక్కడ మీరు చెప్పిన దుకాణాల్లో నిత్యావసర ధరలు విచారిద్దాం.. ఆ తర్వాత రాయదుర్గం, అనంతపురం వచ్చి ఇక్కడెలా ఉన్నాయో బేరీజు వేద్దాం. ధరల్లో వ్యత్యాసం కనిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అంటూ సవాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయాలని చూడొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే ‘చీపుర్లతో బాదుడు’ తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియా తోకలు కత్తిరిస్తాం.. ‘సొంత డబ్బుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న నాపై విమర్శలు చేసినా సహించా. దీన్ని అలుసుగా తీసుకుని నా కుటుంబంపై అక్కసు వెళ్లగక్కుతూ అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించేలా కుట్రలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబడ్దార్’ అంటూ కాలవకు విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘రెడ్‌క్రాస్ సంస్థకే వన్నె తెచ్చేలా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ఆపద సమయంలో ప్రజలకు రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే బాధ్యత సంస్థ చైర్‌పర్సన్‌గా కాపు భారతి తీసుకుంటే ప్రశంసించాల్సిందిపోయి.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిస్తావా..? ఇదా రాజకీయంలో నీవు నేర్చుకున్న నీతి’ అంటూ విరుచుకుపడ్డారు. అసభ్యకర పోస్టింగ్‌లపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాలవ శ్రీనివాసులు చీకటి బతుకు గురించి తెలిస్తే ప్రజలే ముఖాన ఉమ్మేస్తారని, పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచావని దుమ్మెత్తి పోశారు. కరోనా లాంటి కష్టకాలంలో రోడ్డు మీదకొచ్చి తాము ప్రజలకు సేవ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రశాంతంగా ఉండే రాయదుర్గాన్ని రావణకాష్టగా మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. మార్ఫింగ్ వీడియో పోస్టు చేయించి డ్రామాలా? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ ఆడిన డ్రామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయని విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ‘ఐ– టీడీపీ’ అనే ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా అర్ధరాత్రి మారి్ఫంగ్ వీడియో పోస్ట్ చేసి నీచమైన కుట్రకు ఒడిగట్టి.. ఏదో జరిగిపోయిదంటూ డ్రామాలు ఆడతారా అంటూ నిలదీశారు. వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ చెబుతున్నా.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరివి కానున్నాయన్నారు. ఇందుకు చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కనీ్వనర్ ముస్తాక్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహే‹Ù, మండల కనీ్వనర్ బోయ మంజునాథ, సీనియర్ నాయకుడు గొల్లపల్లి కాంతారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
చంద్రబాబు, లోకేష్ వీడియోలను ప్రసారం చేస్తారా?
కర్నూలు (అర్బన్), అనంతపురం సప్తగిరి సర్కిల్/ గుత్తి రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల ఫేక్, మార్ఫింగ్ వీడియోలను మీ చేతికిస్తే ప్రసారం చేస్తారా? అని ఎల్లో మీడియా యాజమాన్యాలను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా నిజానిజాలను తెలుసుకొని ప్రసారం చేయాలని సూచించారు. ఆదివారం ఆయన పంచలింగాల చెక్‌పోస్టు, ఊబిచెర్ల, అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన తనను అణగదొక్కేందుకు ఫేక్ వీడియోలు సృష్టించి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, నేరుగా ఎదుర్కోలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరే పోలీస్‌గా, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్‌గా, చివరికి జడ్జిగా మారి తనను దోషిగా నిర్ధారించేందుకు కంకణం కట్టుకున్నారని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. యూకే నుంచి ఐటీడీపీకి అప్లోడ్ చేసిన ఫేక్, మార్ఫింగ్ వీడియోను ఎల్లో మీడియా చానెళ్లు ప్రసారం చేశాయన్నారు. కమ్మ కులానికి చంద్రబాబు చేటు నీళ్లకు పాచి చేటని, అలాగే కమ్మ కులానికి చంద్రబాబు చేటని ఎంపీ మాధవ్ విమర్శించారు. ఏ కులమూ కమ్మ వారికి వ్యతిరేకం కాదని, కేవలం చంద్రబాబుకు మాత్రమే వ్యతిరేకమనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. కమ్మ కులస్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై చర్చలు పెట్టే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? అని ప్రశ్నించారు. -
ఇకనైనా ఎల్లోమీడియా ప్రజల కోసం పనిచేయాలి: ఎంపీ గోరంట్ల
-
వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ నేతలు కుట్రపూరితంగా తనపై ఫేక్ వీడియోలు సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్ వీడియోలను పంపారు. ఏబీఎన్ రాధాకృష్ణ, పచ్చ మీడియా కలిసి ఈ వీడియోలను ప్రసారం చేశారు. రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు.. చంద్రబాబుతో చేతులు కలిపారు. వీరంతా కలిసి బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారు. మంచి, చెడులు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని పచ్చ ఛానళ్లు చూస్తున్నాయి' అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ వీడియో ఒరిజినల్ కాదు) -
దమ్ముంటే ఆ వీడియో మాధవ్‌దని నిరూపించండి
సాక్షి, అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, దమ్ముంటే ఆ వీడియో నిజమైనదేనని నిరూపించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో మార్ఫింగ్ చేసినదేనని ఆయన చెప్పారు. దమ్ముంటే అది మాధవ్‌దే అని నిరూపించాలి తప్ప రోజూ అదే పనిగా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ వీడియోపై పూర్తిస్థాయి విచారణ చేసి దీన్ని సృష్టించిన ఐటీడీపీ వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీకి పెరుగుతున్న జనాదరణ చూసి టీడీపీ నాయకులకు దిక్కుతోచటంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీని తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావటంలేదని, ప్రజాక్షేత్రంలో వారు మరోసారి అభాసుపాలు కాక తప్పదని మంత్రి చెప్పారు. -
‘వారి ఆధ్వర్యంలోనే ఫేక్ వీడియో’
కృష్ణా: టీడీపీ నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ నేతలకు దమ్ముంటే మాధవ్‌కు సంబంధించిన అసలు వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. మహిళలను అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేస్తున్న చరిత్ర టీడీపీదని కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. పోలీసులు ఫేక్ వీడియో అని చెప్పినా రాద్దాంతం చేస్తున్నారని, ఐటీడీఏ, లోకేశ్, చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఫేక్ వీడియోను స్పష్టించారని కొడాలి నాని పేర్కొన్నారు.టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారు. -
గోరంట్ల మాధవ్ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టాలో అర్దంకాక తెలుగుదేశం పార్టీ అశ్లీల వీడియోలపై ఆధారపడుతన్నట్లుగా ఉంది. చివరిక ఆ పార్టీకి సంబంధించిన ఐ టీడీపీ గ్రూప్ వాట్సప్ లోనే ఈ వీడియో పోస్టు అయిందన్న సమాచారం వచ్చాక టీడీపీకి బూమ్ రాంగ్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. హిందుపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన అశ్లీల వీడియో అంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మీడియా చేసిన వికృత ప్రచారం చూశాక టీడీపీ రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయి. ఇంకెంత అధమస్తాయికి వెళతారో అని అనిపిస్తుంది. అసలు ఆ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడంతో టీడీపీకి పరువు నష్టం అయింది. ఇదంతా కుట్రగా సాగిందని అర్దం అవడం కష్టం కాదు. టీడీపీ ఈ విషయంలో కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా వ్యవహరించి తాము ఏమి చేస్తున్నానో, దానివల్ల పార్టీకి ఎంత నష్టమో అన్న స్పృహ కూడా లేకుండా నేతలు ప్రవర్తించారు. ఏదైనా ఒక అశ్లీల వీడియో బయటకు వస్తే ఏమి చేస్తాము? దానిని వెంటనే పోలీసులకు అప్పగించి తగు చర్య తీసుకోవాలని బాదితులు కోరతారు. గోరంట్ల మాధవ్ కేసులో బాదితులు ఎవరూ లేరు. పైగా ఆయన వీడియోని మార్పింగ్ చేశారని అనంతపురంలో ఒకరు సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ జరగడానికి ముందుగానే టీడీపీ మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీలో ఇదే ప్రధానమైన సమస్య అన్న చందంగా పోకస్ చేశాయి. నిజమే. ఎవరైనా ప్రజా ప్రతినిది అందరికి ఆదర్శంగా ఉండాలి. అదే సమయంలో ఆయనపై ఎవరైనా కుట్ర పన్ని అసభ్య వీడియోని ప్రచారంలోకి తెచ్చినా గట్టి చర్యలే తీసుకోవాలి. పోలీసుల దర్యాప్తులో ఆ వీడియో బ్రిటన్ నుంచి పోస్టు అయినట్లు, తొలుత ఐటీడీపీ వాట్సప్ లో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీవారే దీనిని సృష్టించి అల్లరి చేశారా? ఒక వేళ ఏదైనా మార్గంలో టీడీపీవారికి అలాంటి వీడియో అంది ఉంటే , దానిని యదాతదంగా పోలీసులకు ఇచ్చి దర్యాప్తు చేయాలని అడిగి ఉంటే అదో పద్దతిగా ఉండేది. కాని సామాజిక మాద్యమాల ద్వారా విస్తారంగా ప్రచారం చేసి మాధవ్‌కు, తద్వారా వైసీపీకి రాజకీయంగా నష్టం చేయడానికి ప్రయత్నించారు. కాని ఈ క్రమంలో ఇది తమకే ఎదురు దెబ్బ తగులుతుందని వారు ఊహించలేకపోయారు. తొలుత వైసీపీ ఈ విషయంలో కొంత ఇబ్బంది పడింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ, ఆ వీడియో మార్పింగ్ది కాదని తేలితే మాధవ్ పై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. అయినా టీడీపీ ఆగలేదు. మరింతగా రెచ్చిపోయి అర్జంట్ గా మాధవ్ ను సస్పెండ్ చేయాలని, ఇంకేదో చేయాలని డిమాండ్ చేస్తూ చర్చలు , కథనాలు నడిపాయి.ఈ నేపద్యంలో పోలీసులు వివిధ కోణాలలో పరిశోదించి ఈ వీడియో ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయింది కనుగొన్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని , పలు మార్పులు జరిగాయని, ఎవరో ఏదో వీడియో చూస్తుంటే, దాని నుంచి రికార్డు చేసినట్లుగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఒరిజినల్ వీడియో అయితేనే పోరెన్సిక్ లాబ్ కు పంపగలుగుతామని స్పష్టం చేశారు. దీంతో బిత్తరపోయిన టీడీపీ మీడియా దిక్కుతోచని విధంగా కారుకూతలు కూస్తూ చర్చలు జరిపింది. టీడీపీకి ఏ రకంగా నష్టం జరిగిందో చూద్దాం. తొలుత ఈ వీడియో ఐటీడీపీ నుంచే పోస్టు అయిందన్న విషయం అందరికి తెలియడంతో ఇది ఆ పార్టీ కుట్ర అన్న సంగతి ప్రజలకు బోధపడింది. ఒక రాజకీయ పార్టీ ఇంత నీచంగా అసభ్య వీడియోలను వాడుకోవచ్చా అన్న ప్రశ్నకు తావిచ్చారు. అంతేకాక రాజకీయ పార్టీలు కూడా హానీ ట్రాప్ వంటివాటికి పాల్పడతాయా? తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా వ్యవమరిస్తోందా అన్న విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఫలితంగా టీడీపీకి ఎదురు దెబ్బ తగిలి వారి ప్లాన్ బెడిసికొట్టి బూమ్ రాంగ్ అయిందని చెప్పాలి. మరో విషయం ఏమిటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో సుధీర్గ అనుభవం కలిగిన వ్యక్తి అయినా, ఈ వివాదంలో కూడా ఆయన తలదూర్చి అనవసర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు ఆయన బావమరిది బాలకృష్ణకు, కుమారుడు లోకేష్ కు, మరి కొన్ని ఘటనలలో టీడీపీ నేతలకే తగులుతాయని సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలను వైసిపి సోషల్ మీడియాలో వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆడవారు కనిపిస్తే అయితే ముద్దు పెట్టుకోవాలి, కడుపైనా చేయాలి అని బాలకృష్ణ నిండు సభలో అని అందరిని విస్తుపరిచారు.మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. వాటిని ప్రస్తావించడం కూడా అసభ్యంగానే ఉంటుంది. ఇంత చేసినా చంద్రబాబు నాయుడు ఆయనను ఖండించకపోగా మరోసారి హిందుపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక తన కుమారుడు లోకేష్ గతంలో పలువురు మహిళలతో విలాసాలు నడుపుతున్న పోటోలు మళ్లీ సర్కులేషన్ లోకి వచ్చాయి. ఆ పోటోలు కొన్నేళ్ల క్రితమే బయటకు వచ్చాయి. అయినా అప్పుడు చంద్రబాబు తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత మంత్రిని కూడా చేశారు. వనజాక్షి అనే తహాశీల్దార్ ను దెందులూరు ఎమ్ఎల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో ఆయన అనుచరులు దుర్మార్గంగా అవమానించి దౌర్జ్యం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు తహశీల్దార్ ను తప్పుపట్టి, ప్రభాకర్ కు విప్ గా ప్రమోషన్ కూడా ఇచ్చారు. కాల్ మనీ సెక్స్ ఘటనల కారణంగా టీడీపీ హయాంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటన్నిటిని మర్చిపోయి టీడీపీ నేతలు జనంలో మాదవ్ వడియోను ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించి భంగపడ్డారు. దీనికి కులం రంగు పులుముకోవడంతో అనంతపురం జిల్లాలో బలంగా ఉండే బసిలను ముఖ్యంగా కురుబ వర్గం వారిని మరింత దూరం చేసుకునే పరిస్తితి ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా బిసిలలో టీడీపీ శైలి మరింత అసంతృప్తి కలిగించింది. ఇంకో సంగతి కూడా చెప్పాలి. సాధారణంగా ఈ వీడియోలు చూడడానికి ఎవరం ఇష్టపడం. అలాంటి వీడియోలపై తెలుగుదేశం పార్టీ ఏకంగా మహిళా నేతలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించింది. వారిలో కొందరేమో తాము ఆ వీడియోలను చూడలేకచచ్చామని, ఇంకేదేదో మాట్లాడి ,అందరూ ముక్కున వేలేసుకునేలా చేశారు. ఒక రాజకీయ పార్టీ ఇలాంటి వికృత విన్యాసాలకు పాల్పడడం అవసరమా?ఇలాంటివాటివల్ల అధికారం లభిస్తుందా? విపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో తనదేనని ఇంతవరకు ధృవీకరించని విషయం, ఫోరెన్సిక్ నివేదిక ఏమైందో తెలియని అంశాన్ని కూడా అంతా గుర్తుకు చేసుకున్నారు. ప్రముఖ నటి దివ్యవాణి, మరో మహిళా నేత యామిని వంటివారు టీడీపీలో కొందరి గురించి ఎలా మాట్లాడారో అందరికి తెలుసు. ఈ మధ్యనే టీడీపీ చిన్న నేత ఒకరు టీడీపీ ఆఫీస్ లో మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. ఆమె ఏమి అన్నది రాయడానికే ఇబ్బందిగా ఉంటుంది. ఇవేకాదు. మరికొన్ని ఉదాహరణలు కూడా చూడవచ్చు. చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న మంత్రులలో కొందరు ఒకరిని మించి మహిళలను వివాహమాడడమో, లేక సహజీవనం చేయడమో జరుగుతుండేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ చాలా కధే అవుతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతిని టీడీపీ వారు ఎంత ఘోరంగా అవమానించింది పాతికేళ్ల క్రితం రాజకీయాలు చూసినవారందరికి తెలసు. ఎన్టీఆర్ ఇష్టపడ్డ వ్యక్తి అన్న కనీస గౌరవం కూడా లేకుండా ప్రవర్తించేవారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపడానికే ఈమెనే బూచిగా చూపించేవారు. టీడీపీని స్వాదీనం చేసుకునే క్రమంలో ఈ నేతలు కొందరు ఏమేమి చేసింది ఇప్పటికీ కదలు,కదలుగా చెప్పుకుంటారు. వైసిపిలో మహిళలకు గౌరవం లేదని టీడీపీ ఎమ్.పిలు ఆరోపించారు. మరి టీడీపీలో ఇలా అనేక ఘటనలు సంభవించాయి కనుక ఆ పార్టీ ఇంకా ఘోరమైన పార్టీ అని ఒప్పుకుంటారా? కొందరు వ్యక్తులు చేసే పనుల వల్ల ఆయా పార్టీలకు కొంత ఇబ్బంది వస్తుంది.దానిని కాదనలేం. కాని అంతమాత్రాన మొత్తం పార్టీకి పులమాలనుకునే ప్రయత్నమే టీడీపీకి బెడిసికొడుతుందన్న సంగతి తెలుసుకోవాలి. టీడీపీ వారు హానీ ట్రాప్ లు మరిన్ని చేశారని ప్రచారం జరుగుతోంది. ముందుగా బిసి ఎమ్.పిని సస్పెండ్ చేయించగలిగితే తమ రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టవచ్చనుకున్న వారి ఆలోచనకు ప్రభుత్వం సకాలంలో స్పందించి గండి కొట్టింది.రాజకీయాలలో అన్ని వేళలా ఇలాంటి చెత్త వ్యూహాలు పనిచేయవు. ప్రజా సమస్యలను వదలిపెట్టి ఇలాంటి చిల్లర విషయాలపైనే తెలుగుదేశం దృష్టి కేంద్రీకరిస్తే ఆ పార్టీకే అంతిమంగా నష్టం జరుగుతుంది. చివరిగా ఒక మాట. ఈ ఉదంతం అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు వంటిదని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
అరాచకాలకు కేరాఫ్ టీడీపీ.. లోకేశ్ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సామాజిక విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి ఓర్వలేక.. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నారన్న దుగ్ధతో.. దుష్ట చతుష్టయం గురివింద గింజల్లా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నాలుగు రోజులుగా వీడియోలంటూ గందరగోళం సృష్టిస్తున్న వారి నిజ స్వరూపం అనంతపురం ఎస్పీ ప్రకటనతో బట్టబయలు అయిందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయమే మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలకు కేంద్రంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అది ఫేక్ వీడియో అని తేలిపోయిందని, దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే టీడీపీ ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పారు. ఇది మార్ఫింగ్ వీడియో అని తొలి రోజే ఎంపీ మాధవ్ చెప్పారన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. విదేశాల నుంచి కుట్రలు ► ఎల్లో విష నాగులు ప్రపంచమంతా విస్తరించాయి. ఎంపీ మాధవ్ పేరుతో ఆ వీడియో యూకే నుంచి టీడీపీ సోషల్ మీడియా ద్వారా విడుదలైంది. దుష్టచతుష్టయం విదేశాల నుంచి కూడా కుట్రలు చేస్తోంది. బాబు బతుకంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు. ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. ఎస్సీలు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నారు. ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు చేలో మేస్తే.. ఆయన పుత్ర రత్నం, ఆ పార్టీ నాయకులు గట్టున మేస్తారా? ► అసలు లోకేశ్ గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది. అతను మహిళల పట్ల ప్రవర్తించే తీరేంటో చూడండి. (లోకేశ్ పలువురు మహిళలలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు చూపుతూ..) అశ్లీలతకు, మహిళలను కించ పరచటంలో తెలుగుదేశం పార్టీ పేటెంట్ పొందింది. ఓటుకు కోట్లు, కాల్‌మనీ సెక్స్ రాకెట్లు.. టీడీపీకి మాత్రమే సొంతమైన వ్యవహారాలు. ఇదే బాబు ఏడేళ్ల క్రితం ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ► సీఎం జగన్ ఈ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మహిళా పక్షపాతిగా, దళిత బహుజన బాంధవుడుగా పరిపాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ ప్రజాదరణ ఇలానే సాగితే.. తాము అధికారంలోకి రావడం కల్ల అన్న కలవరంతోనే టీడీపీ నేతలు గుడ్డ కాల్చి మా మొహాన వేస్తున్నారు. ► ఈ సంస్కృతి ఇలాగే కొనసాగిస్తే.. తస్మాత్ జాగ్రత్త. విష నాగులు ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తాం. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. -
ఆ వీడియో ఒరిజినల్ కాదు
అనంతపురం క్రైం: ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప స్పష్టం చేశారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులమంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఆ వీడియోను మొట్టమొదటగా ‘ఐ టీడీపీ అఫీషియల్’ అనే వాట్సాప్ గ్రూపులో +447443703968 నంబరు ద్వారా ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2.07 గంటలకు పోస్టు చేశారన్నారు. ఈ నంబర్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వొడాఫోన్‌కు సంబంధించినదిగా తేలిందని చెప్పారు. ఈ వీడియోను ఆ గ్రూపులో పోస్టు చేసే ముందు ఐదుగురు వ్యక్తులకు షేర్ చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. ఆ వీడియో పోస్ట్ చేసే కొన్ని క్షణాల ముందు మాత్రమే ‘ఐ టీడీపీ అఫీషియల్’ అనే వాట్సాప్ గ్రూపులో ఆ నంబర్ (+447443703968)ను యాడ్ చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తొలిసారిగా వీడియోను పోస్ట్ చేసింది ఇంటర్నేషనల్ నంబర్ నుంచి కావడంతో దానికి సంబంధించిన వ్యక్తి వివరాలు సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ వీడియోకు సంబంధించి ఎస్పీ ఇంకా ఏం చెప్పారంటే.. మార్ఫింగ్, ఎడిటింగ్‌పై అనుమానాలు ► ఈ వీడియోను చాలాసార్లు ఫార్వర్డ్, రీ పోస్టింగ్ చేశారు. దీని కారణంగా ఇది ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం. మార్ఫింగ్/ఎడిటింగ్ జరిగి ఉండొచ్చు. కొన్ని వీడియోల్లో ఒకవైపు ఎంపీ ఫొటో ఉంచి మరోవైపు సందేశాలు నమోదు చేశారు. మరో వీడియోలో ఎంపీ ఫొటో, మరో వీడియోను పార్లల్గా నమోదు చేశారు. ఇవన్నీ ఎడిటింగ్/మార్ఫింగ్ కిందకే వస్తాయి. స్క్రీన్ టెక్నాలజీ యాప్స్ ద్వారా వీడియో కాల్‌ను రికార్డు చేయొచ్చు. అసలు బాధితుల మంటూ ఎవరూ ముందుకు రాలేదు. బాధితులెవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైనా విచారిస్తాం. అందువల్ల ఎంపీ, బాధితుల స్టేట్మెంట్ను నమోదు చేయలేదు. ► ప్రస్తుతం సాంకేతిక దర్యాప్తు చేపట్టాం. తదుపరి దర్యాప్తులో భాగంగా వీడియో పోస్టు చేసిన వ్యక్తి వివరాల కోసం వొడాఫోన్ ప్రొవైడర్‌కు లేఖ రాశాం. ► గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగించారని ఈ నెల 4వ తేదీన ఎంపీ అభిమాని కొనతాలపల్లి వెంకటేశ్వర రావు అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 185/2022 సెక్షన్ 67 ఏ, 66 ఈ ఆఫ్ ఐటీ యాక్ట్, సెక్షన్ 292, 509 ఆఫ్ ఐపీసీ కింద అదే రోజు ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► ఒక వ్యక్తి రికార్డు చేసిన వీడియోను మరొకరికి పంపించారు. సదరు వ్యక్తి మొబైల్లో చూస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆ వీడియోను చిత్రీకరించారు. చుట్టుపక్కల ఎవరో మాట్లాడుతున్నట్లు, పశువుల చప్పుడు కూడా అందులో విన్పిస్తోంది. అందువల్ల ఇది ఒరిజినల్ వీడియో కాదని తెలుస్తోంది. -
వీడియో దుష్టచతుష్టయం సృష్టే: గోరంట్ల మాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్ర. కొంత మంది దుర్మార్గులు చేసి పని ఇది. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని ఆరోజే చెప్పాను. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏబీఎన్, టీవీ-5 కుట్ర చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఓ బ్రోకర్. నూటికి నూరు శాతం ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. మీ చరిత్ర హీనమైంది. చంద్రబాబు నీకు కళ్లు కనపడటం లేదా?. ఇకనైనా నీ నీచ రాజకీయాలు మానుకో. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదు. తెలుగుదేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తోంది. నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసు. ఫేక్ వీడియో సృష్టించి నన్ను అవమానించాలని చూశారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తాను. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యతిరేక పార్టీ. వెనుకబడిన వర్గాలు ఎదిగితే ఓర్వలేని పార్టీ అది. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు. నాకు మద్దతు తెలిపిన వారందరకీ కృతజ్ఞతలు. ఇక ఈ రాద్దాంతానికి ఫుల్స్టాప్ పెట్టాలి అంటూ కామెంట్స్ చేశారు. ఏదో జరిగిపోతోందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. అయ్యన్న పాత్రుడు విషం చిమ్మాలని చూశారు. వీడియో వెనుక ఉన్నవారెవరో పోలీసులు తేల్చాలి. ఏబీఎన్, టీవీ5 టీడీపీని ఎంతగా లేపాలని చూసినా ఆ పార్టీ లేవదు. టీడీపీ నేతలకు కనీసం నైతిక విలువలు కూడా లేవు. టీవీ5, ఏబీఎన్ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. అరగుండు అయ్యన్నపాత్రుడి కుమారుడు నాపై విషం చల్లారు అని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్.. మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చు.. -
ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్
-
ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్: అనంతపురం ఎస్పీ ప్రకటన
సాక్షి, అనంతపురం: ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్సీపీని, ఆ పార్టీ నేత.. హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ -
గోరంట్ల మాధవ్ ఇష్యూ.. ఎవరినీ వదిలేది లేదు: మంత్రి తానేటి వనిత
సాక్షి, రాజమండ్రి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి వనిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వీడియో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాము. తప్పు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటాము. ఇది రాజకీయ కుట్రలా ఉందనే అనుమానాలు ఉన్నాయి. కుట్రకు పాల్పడితే ఎవరినీ వదలేది లేదు. టీడీపీ హయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయి. కొందరు పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య -
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించిన మంత్రి రోజా
-
నా మీద నకిలీ వీడియో ప్రచారం చేస్తున్నారు : గోరంట్ల మాధవ్
-
నకిలీ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, ఢిల్లీ: తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. నకిలీ వీడియోపై స్పందించిన ఆయన.. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఓ వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఈనాడు వండివార్చిన వట్టి మాటల స్టోరీ! అసలు విషయం ఇదే.. కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. -
చంద్రబాబుకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు. గురువారం హోంశాఖపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి హాజరైన అనంతరం అమిత్‌షాకు మాధవ్ వినతిపత్రమిచ్చారు. ఎంపీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా ఇంకా అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై బోధించే పాఠశాలను కేంద్ర హోంశాఖ నెలకొల్పి దాంట్లో చంద్రబాబుకు విద్యాబోధన చేయాలని అమిత్‌షాను కోరానన్నారు. అసభ్య పదజాలంతో ధూషణలు చేయిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టాలని బాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్కూల్ ఆఫ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ ప్రమోషన్ ఈ పనిలోనే ఉందన్నారు. టీడీపీ నేత పట్టాభి ఉపయోగించిన భాష మైనర్లను ప్రభావితం చేసేలా ఉన్నందున పోక్సో చట్టం కింద విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
అమిత్ షాను కలిసిన ఎంపీ గోరంట్ల మాధవ్
-
అమిత్ షాను కలిసిన ఎంపీ గోరంట్ల మాధవ్
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని అమిత్ షాకు ఎంపీ గోరంట్ల విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఛీత్కరించినా చంద్రబాబు తీరు మారలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక గొడవ సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు,టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అమిత్‌షాను కోరామని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. -
కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర
పావగడ: పేరూరు డ్యామ్‌కు ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని కేటాయించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు చేపట్టిన 28 కి.మీ పాదయాత్రలో ఎంపీ మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తితో పాటు భారీ ఎత్తున రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చలువతోనే ‘పేరూరు’కు నీళ్లు ప్రభుత్వ నిర్ణయంతో అనంతపురం జిల్లా సరిహద్దులోని నాగలమడక ఉత్తర పినాకిని నది వద్ద కృష్ణా జలాలకు గురువారం మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. చంద్రబాబు హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలను నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు తరలించడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కృష్ణా నీటిని నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు చేర్చడానికి టీడీపీ అడ్డుపడిందని, అయినా ప్రకాశ్‌రెడ్డి కృత నిశ్చయంతో నీటిని తరలించారని కొనియాడారు. ఇదిలాఉండగా.. స్థానిక నాయకుల గంగపూజ కార్యక్రమం అనంతరం అధికారులు హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా తురకలాపట్నం మీదుగా నాగలమడక చెక్‌డ్యాం వరకు, అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. చదవండి: సిగ్గుంటే రాజీనామా చెయ్.. రోడ్ల మరమ్మతులకు రూ.2,205 కోట్లు మంజూరు -
నిరాశ, నిస్పృహలతోనే బాలకృష్ణ దాడి..
సాక్షి, అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిరాశ, నిస్పృహలతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపై కాదు.. హిందూపురం ప్రజలపై దాడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. పంచరైన సైకిల్‌ను చంద్రబాబు వయోభారంతో తొక్కుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా.. ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించిన సంగతి విధితమే ఇది ఇలా ఉండగా, గత గురువారం కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్ అయిన సంగతి తెలిసిందే.. చదవండి: మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య -
రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం
సాక్షి, అనంతపురం: టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. శనివారం అనంతపురంలోని 25వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాధవ్ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. చదవండి: (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) -
'పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు'
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పింది. అయితే ఆ రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదు. అది కోర్టు ధిక్కారం కాదా..? అని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ఒక కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా స్ట్రైయిన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత. ఎన్నికలు నిర్వహిస్తే... నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏంటి?. ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్‌కి సంబంధముందా..?) వ్యక్తిగత ఆసక్తి మీ స్థాయికి మంచిది కాదు: ఎంపీ మాధవ్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్న ఏకపక్షతీరుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. 'ప్రపంచమంతా ఒకవైపు అంటే నేను మాత్రం మరోవైపు అనేవిధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఆయన వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తి అనేది మీ స్థాయికి మంచిది కాదు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా టీకాను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిపితే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉన్నందున కరోనా టీకా పంపిణీకి అంతరాయం కలుగుతుంది. నిమ్మగడ్డ వ్యవహరిస్తోన్నతీరుతో ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముంది' అని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. చదవండి: (ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు: అమరనాథ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అనుబంధ సభ్యునిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. ఎన్నికల కమిషనర్లా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహిస్తూ.. చంద్రబాబు, సుజనా చౌదరితో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల భయాందోళనలను నిమ్మగడ్డ పట్టించుకోవడంలేదు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' అని గుడివాడ అమరనాథ్ సూచించారు. -
ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు
సాక్షి, అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృషితో కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ –06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్ కోయిల్–ఛత్రపతి టెర్మినల్ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది. -
పండ్ల తోటల రైతులు దీన్ని ఉపయోగించుకోవాలి
సాక్షి, అనంతపురం: కిసాన్ రైల్లో తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిసాన్ రైలుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం పెరిగిందన్నారు. పండ్ల తోటల రైతులు దీన్ని సమృద్ధిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: కిసాన్ రైలు రవాణాపై 50 శాతం చార్జీల తగ్గింపు) ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే అనంతపురానికి కృష్ణా జలాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ నీటితోనే రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. (చదవండి: ‘అనంత’ ఫలసాయం హస్తినకు..) -
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరాం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణం, ఫైబర్ నెట్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, అమరావతిపై సీబీఐ దర్యాప్తు, పోలవరం ప్రాజెక్టు నిధులు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దానికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని వెల్లడించారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం కాలిపోయిందనే పేరుతో రాష్ట్రాన్ని కాల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా మత కలహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైలు తగలబెట్టి కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి:(అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ ) అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ద్రోహి అని మండిపడ్డారు. నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. హద్దుమీరి మాట్లాడితే తన బండారం బయట పెడతానని హెచ్చరించారు. తమ నాయకుడిని విమర్శిస్తే ఊరుకోమని, కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే ఎందుకు అంత కడుపుమంట అని నిలదీశారు. మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కాఫీ తోటల పెంపకానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులను కలిసి నిధుల కోసం ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. చదవండి:(కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం జగన్ భేటీ) -
'కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్'
సాక్షి, అనంతపురం: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సంజీవిని బస్సులను శుక్రవారం ఉదయం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఏపీలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ మరింత పెరిగింది. కరోనా పరీక్షలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ రంగయ్య పేర్కొన్నారు. చదవండి: సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో..! హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలు అర్థరహితం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు' అని తెలిపారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అనేక విషయాల్లో మిగతా రాష్ట్రాలు సీఎం జగన్‌ను ఫాలో అవుతున్నాయి. సీఎం జగన్‌పై ప్రజలకు విశ్వాసం పెరిగింది అని అనంత వెంకటరామి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది.. -
కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి
సాక్షి, అనంతపురం/ కర్నూలు: అనంతపురం ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ (47) కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజశేఖర్ కుటుంబసభ్యులు కర్నూలులోని రామలింగేశ్వర నగర్ రోడ్‌నెంబర్ 5లో నివాసముంటున్నారు. ఆత్మకూరు మండలం కృష్ణాపురం స్వగ్రామం. తండ్రి శ్రీరాములు కో–ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి వీరు కర్నూలులోనే నివాసముంటున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ కుమారుడైన రాజశేఖర్ 1995లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలోనే విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తరువాత కొంతకాలం కర్నూలు సీసీఎస్‌లో కూడా విధులు నిర్వహించారు. ఈయనకు భార్య శిరీషతో పాటు బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. మొన్నటివరకు విధుల్లో పాల్గొంటూ అందరితో కలిసి ఉన్న సీఐ రాజశేఖర్ ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ మృతిపై కలెక్టర్ గంధం చంద్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. సమర్థవంతుడైన సీఐ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ గోరంట్ల రాజశేఖర్ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాజశేఖర్ మృతికి ఎమ్మెల్యే అనంత సంతాపం అనంతపురం సెంట్రల్: సీఐ రాజశేఖర్ మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా వివిధ హాదాల్లో సమర్థవంతంగా పనిచేశారన్నారు. కరోనా కష్టకాలంలోనూ మూడు నెలలుగా ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసిన అధికారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
జేసీకి ఈ గతి వస్తుందనుకోలేదు
అనంతపురం సెంట్రల్: ‘రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పేరు చెబితే ఒకప్పుడు ప్రజలందరూ భయపడేటోళ్లు. అలాంటి వ్యక్తికి నారా లోకేష్ వచ్చి ధైర్యం చెబుతుంటే జేసీ దివాకర్‌రెడ్డి ఎంత గతి వచ్చిందని అనుకుంటున్నారు’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. మంగళవారం నగరంలోని మాధవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కొడుకుగా, స్వర్గీయ ఎన్టీఆర్ మనవుడిగా, అభిమాన నటుడు బాలకృష్ణ సొంత అల్లుడి హోదాల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తే ప్రజలు చీత్కరించారన్నారు. ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేసినా ఓటెయ్యని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి వ్యక్తి వచ్చి సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి ధైర్యం చెబుతుండం చూస్తే నవ్వు వస్తోందన్నారు. లోకేష్ ఉపన్యాసాలు వింటూ చిన్న పిల్లలు జోక్‌గా నవ్వుకుంటారని... అలాంటి వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శలు చేయడం, అభ్యంతకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ. 50 కోట్లు ఎర చూపి అచ్చెన్నాయుడు వైఎస్సార్సీపీలోకి రావాల్సిందిగా ప్రలోభపెట్టారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల తరహాలో కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాల్సిన గత్యంతరం లేదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి తనకున్న ఆస్తులతో 20 సంవత్సరాలు జిల్లాను పోషించవచ్చని, అలాంటి వ్యక్తులు నేరాలకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. 6 వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించి 151 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌లు, నకిలీ పోలీసు క్లియరెన్స్‌లతో వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీడం లేదన్నారు. ఇక్కడ నేరం చేస్తే పట్టుబడతామని నాగలాండ్ రాష్ట్రానికి వెళ్ళారని, స్క్రాప్ కింద వాహనాలను అమ్మినట్లు అశోక్‌లైలాండ్ కంపెనీ రాతపూర్వకంగా తెలియజేసిందన్నారు. జేసీ సోదరులు చేసిన నేరాలు ఆధారాలతో సహా బయటపడటంతోనే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జేసీ సోదరుల చేతిలో మోసపోయి లారీలు కొనుగోలు చేసిన నాగరాజు, జయరంగారెడ్డి తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు. లోకేష్ రాజకీయాలకు పనికి రాడు గుత్తి: ‘మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు అసమర్థుడు , రాజకీయాలకు ఏ మాత్రం పనికి రాడు’ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. గుత్తి పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లాలో మంగళవారం ఆయన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ , బాలకృష్ణలపై విరుచుకుపడ్డారు. మామ అల్లుళ్లు నారా లోకేష్, బాలకృçష్ణ మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అరెస్టు చేస్తే చంద్రబాబు వెళ్లి పరామర్శించడం, నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బస్సులు, లారీలు కొని తిప్పినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపితే నారా లోకేష్ తాడిపత్రికి వచ్చి జేసీ కుటుంబాన్ని పరామర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పక్కా ఆధారాలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి, అచ్చెన్నాయుడులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే టీడీపీ నేతలు నానా యాగీ చేస్తుండటం సిగ్గు చేటన్నారు. నారా లోకేష్ తాడిపత్రిలో ప్రెస్‌మీట్ పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. అసలు లోకేష్ రాజకీయాలకు పనికి రాడనీ, హెరిటేజ్‌లో పాలు, కూరగాయలు అమ్ముకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. వరుస అరెస్టులతో టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుందని, జేసీ, అచ్చెన్నాయుడుతో అరెస్టులు ఆగవన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులు జైలుకు వెళుతూనే ఉంటారన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మరో 30 సంవత్సరాలు సీఎంగా వైఎస్ జగన్ కొనసాగుతారని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ జిల్లా నాయకులు శివయ్య, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, ప్రముఖ న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గురు ప్రసాద్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు భీమలింగ, శామ్యూల్, మైనార్టీ జిల్లా నాయకులు జీఎం బాషా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. -
‘జేసీ దివాకర్‌రెడ్డి ఆస్తులు అమ్మితే.. ’
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులు అమ్మితే అనంతపురం జిల్లా ప్రజలను 20 ఏళ్ల పాటు పోషించొచ్చనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఫోర్జరీ డాక్యూమెంట్ల కేసులో అరెస్టైన జేసీ కుటుంబాన్ని పరామర్శించడం ద్వారా నారా లోకేష్ అవినీతి పరులకు మద్దుతు ఇచ్చినట్టయిందని మండిపడ్డారు. 154 వాహనాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి అడ్డంగా దొరికిపోయిన జేసీ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించడం.. దానికి జేసీ దివాకర్ రెడ్డి ధైర్యం తెచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా ఏశారు. లోకేశ్ ఓ దద్దమ్మ అని ఎంపీ గోరంట్ల వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా, బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. -
జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట
సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అవినీతికి కేరాఫ్ అడ్రస్.. జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట అని హిందూపురం వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం నకిలీ ఇన్ వాయిస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకూడదా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండతోనే జేసీ అక్రమాలకు పాల్పడ్డారు. శత్రువులను క్షమించే గుణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. రాజకీయ కక్ష సాధింపులు సీఎం జగన్‌కు తెలియవు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ప్రభుత్వం క్షమించదు’’ అని అన్నారు. (ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!) చదవండి : ( చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్) -
చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్
సాక్షి, హిందూపురం: ‘మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్రవాహనాలను స్టేషన్లో ఎండ పెట్టకుండా వదిలేయండి’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐలు బాలమదిలేటి, మన్సూరుద్దీన్‌లతో అన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లలో ఉంచారు. అవి ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనిపై సాక్షిలో కథనం కూడా ప్రచురితమైంది. చదవండి: దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ.. ఈ క్రమంలో గురువారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాట్లాడారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా పోలీసులకు సూచించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' -
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్
-
కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం : హిందూపురం వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ శనివారం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీరు అనైతికమని, ప్రజలను అభద్రతా భావానికి గురిచేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా రెడ్జోన్లలో పర్యటిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు కూడా ప్రజలకు సేవ చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు. ( కరోనా: కొత్త అవతారం ఎత్తిన ఏసీ బస్సులు ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా వైరస్ పరీక్షల సామర్థ్యం పెంచారని, దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ కిట్లు తెప్పించారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 1000 రూపాయల నగదు ఇచ్చి ఆదుకున్నారని, మూడు సార్లు పేదలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేశారని చెప్పారు. -
హింసా రాజకీయాలకు శ్రీరామ్ కుట్రలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నాయుడు పరిటాల శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తండ్రి బాటలో హింసా రాజకీయ చేయాలని పరిటాల శ్రీరామ్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు నరుకుతామంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యాల వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. రామగిరిలో వైఎస్సార్ విగ్రహన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్ స్వయంగా అంగీకరించరన్నారు. మా జోలికొస్తే తలలు నరుకుతామని శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ‘చంద్రబాబుకు కరోనా వైరస్ సోకిందా..!) ఏపీలోకరోనా వైరస్ లేదని, ఎల్లో వైరస్ ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైరస్ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేష్ చౌదరి కూతురుకి చంద్రబాబు ఆర్థిక మండలి డైరెక్టర్ పదవి ఇచ్చారని, రమేష్ చౌదరి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ అరికట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ. 5000 కోట్లు రాకూడదనే బాబు కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని ప్రశ్నించారు.(‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’) పది చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం స్థానిక ఎన్నికలపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఆరోపించారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 10 చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.(ఫలించిన తోపుదుర్తి కృషి) బాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉందని పార్లమెంటు వాయిదా వేయలేదని, లక్షల మంది కలిసే జాతరలు వాయిదా వేయలేదని అన్నారు. అలాగే ‘కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5000 కోట్లు అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. గ్రామాలు, పట్టాణాలకు నిధులు రాకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. ఏపీ అభివృద్ధికి సహకరించాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలి. స్థానిక ఎన్నికలు వెంటే జరపాలి’ అని టీడీపీపై విమర్శలు సంధించారు. -
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి
-
‘చంద్రబాబు రాజకీయ వ్యభిచారి’
సాక్షి, అనంతపురం : కియా మోటార్స్‌పై చంద్రబాబు నాయుడు కుట్ర చేసి రాయిటర్స్ ద్వారా తప్పుడు వార్తలు యించారని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుత పాలనను చూసి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కియాపై తప్పుడు ప్రచారం చేసినందుకుగాను చంద్రబాబు కియా పరిశ్రమ వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని, ప్రతి విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరమని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల మేలు కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ చేపట్టారని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. -
‘కియా’పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు
-
ఉదయమే కియా ఎండీతో మాట్లాడా: మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదని.. తాను ఈరోజు ఉదయమే కియా ఎండీతో మాట్లాడానని గురువారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కియా మోటార్స్ తరలింపుపై టీడీపీ ఎంపీలు లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పేరుతో డమ్మీ కంపెనీ రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది. సేవ్ చంద్రబాబు, సేవ్ స్కామ్స్ అనే లక్ష్యంతో టీడీపీ మీడియాలో ప్రచారం నడుపుతోంది’’ అని మిథున్‌రెడ్డి విమర్శించారు.(రాయిటర్స్ కథనాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం) అదే విధంగా ఈ విషయం గురించి వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ‘‘కియా పరిశ్రమ తరలిపోవడం లేదు. టీడీపీ, ఎల్లో మీడియా దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయి. పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలలో లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు కుట్ర జరుగుతోంది’’ అని టీడీపీ తీరుపై మండిపడ్డారు. కాగా కియా పరిశ్రమ తరలిస్తున్నారని పేర్కొన్న రాయిటర్స్ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని.. కియా- ఏపీ ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. కియా మోటార్స్ కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించింది. భవిష్యత్తులో మరో కియా ప్లాంటు.. కియా మోటార్స్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ విషయంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని తమిళనాడుకి వెళ్లే తరుణంలో.. దానిని ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు. కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు నాయుడు కృషి ఏమాత్రం లేదని పేర్కొన్నారు. ఆయన హయాంలో సంస్థకు ఎలాంటి సహకారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడేమో కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని.. భవిష్యత్తులో మరో ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. కియా మోటార్స్ గురించి పార్లమెంట్ లోపలా, బయటా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించింది.. సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిభ్రమించిందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అందుకే కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తూ తన ఎల్లో మీడియా ద్వారా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్న చంద్రబాబు.. ఇప్పుడు కియా పరిశ్రమ తరలిపోతుందంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని.. 23 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని దుయ్యబట్టారు. -
ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం
సాక్షి, పామిడి: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే... మండలంలోని పొగరూరు కెనాల్ గ్రామ క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మ గారి వెంకటేశ్వర్‌రెడ్డి (36) గాయాలపాలైనట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అత్యవసర పనినిమిత్తం తన కారులో బయలుదేరారు. మరోవైపు పొగరూరు గ్రామ కెనాల్ క్రాస్ వద్ద ఉన్న తన పొలానికి నీరుగట్టేందుకు వెంకటేశ్వర్‌రెడ్డి వెళ్ళారు. పని ముగించుకొని తన ద్విచక్ర వాహనంలో వెంకటేశ్వర్‌రెడ్డి ఇంటిముఖం పట్టాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్లో వెళ్తూ అటుగా వస్తున్న ఎంపీ వాహనాన్ని గమనించకుండా ఢీ కొన్నాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా పామిడి ప్రభుత్వాస్పత్రికి తన వాహనంలో తరలించి వైద్యం చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చుంతా తానే భరిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పారు. పామిడి ఆస్పత్రిలో క్షతగాత్రునికి దగ్గరుండి వైద్యం చేయిస్తున్న ఎంపీ