
సాక్షి,అనంతపురం : ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. నిన్న..రాజకీయాలకు స్వస్తి పలికిన నటుడు పోసాని కృష్ణ మురళీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు.
వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసుల విచారణ చేపట్టేందుకు గోరంట్ల మాధవ్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు అందించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీసీ నేతలు ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment