
సాక్షి,అనంతపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు మహానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహానందరెడ్డిపై ఎలాంటి కేసులు లేకున్నా అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిడితో మహానందరెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మహానందరెడ్డి అరెస్ట్‌ను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు.
మహానందరెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది. మహానందరెడ్డిని చంపడానికి టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment