Andhra Pradesh Police
-
పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది : వల్లభనేని వంశీ
సాక్షి,విజయవాడ: పోలీసుల (Andhra Pradesh Police) నుంచి తనకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్ విషయంలో పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతీక్షణం అడ్డుకున్నారు. అరెస్ట్ నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు’అంటూ న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా, విజయవాడ (Vijayawada) జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు, వల్లభనేని వంశీ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదని వాపోయారు. గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్‌పై ఆయన సతీమణి పంకజశ్రీ స్పందించారు.‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు. -
మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు: నందిగం సురేష్ సతీమణి
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. సురేష్‌కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్ బెయిల్ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..? -
పార్శిల్లో మృతదేహం కేసులో పురోగతి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్‌కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు. -
రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 'వ్యూహం' ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టాడని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)ఇప్పుడు ఈ కేసు విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్‌కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్ జగన్ వార్నింగ్
గుంటూరు, సాక్షి: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీపై, కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న పోలీస్ అధికారులకు హితబోధ చేశారు.‘‘పోలీసులు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు. ఇల్లీగల్‌గా అరెస్టులు చేయడమేంటి?. రాజకీయ నాయకులు చెప్తున్నారని.. తప్పు చేస్తూ పోతే బాధితుల ఉసురు తగులుతుంది. పోలీసులు ఇప్పటికైనా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మీరు చేసే పనుల వల్ల పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోంది.పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్‌సైడెడ్‌గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తాం. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుకు న్యాయసహాయం అందిస్తుంది. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో... ట్రాన్స్ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్‌బుక్‌లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని జగన్ హెచ్చరించారు. -
ప్రశ్నించేవాళ్లను లేకుండా చేస్తున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైఎస్సార్సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.అఘాయిత్యాలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. కరెంట్ ఛార్జీలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. వరద సాయంపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ఉచిత ఇసుకపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని అన్నందుకు.. తప్పుడు కేసు. అసలు జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు?. ‘‘విద్య వద్దు.. మద్యం ముద్దు. నాన్నకు పుల్లు.. అమ్మకు నిల్లు’’ అని పోస్ట్ చేసినందుకు ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ‘‘జనసేన నేతలతో బలవంతంగా కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు’’ అనే కథనాన్ని ఫార్వర్డ్ చేసిందుకు ఓ వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టారు. అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కోసం ప్రజాధనం కాజేశారని పోస్ట్ చేసినందుకు ఓ యువకుడ్ని అరెస్ట్ చేశారు. తిరుమలలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో.. తలపై వస్త్రాలు పక్కకు వంగిపోయాయి. ఈ జరిగిన పరిణామాన్ని పోస్ట్ చేసి.. ‘‘తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్యపు ప్రచారం చేసినందుకు దేవుడికి కూడా చంద్రబాబు నచ్చడంలేదని ఓ యవకుడు షార్ట్ రీల్ చేశాడు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు.వీళ్లంతా సోషల్ మీడియా యాక్టివిస్టులు. పైగా యంగ్‌స్టర్స్. రాష్ట్రంలో జరుగుతున్నవే కదా పోస్ట్ చేస్తున్నది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి రెండు మూడు రోజులు ఉంచి చిత్రహింసలు పెడుతున్నారు. అవన్నీ వాస్తవాలే కదా. జరుగుతున్నవే కదా.ఏడేళ్లలోపు కేసుల్లో ప్రొసీజర్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే.. వారెంట్ ఇవ్వాలి. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదు అని జగన్ అన్నారు. -
నేను హోం మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని అన్నారాయాన. ‘‘పోలీసులు మరిచిపోకండి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం. పదే పదే ఈ విషయాన్ని మాతో చెప్పించుకోకూడదు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది?. ఏదైనా తెగే వరకు లాగకూడదు. బయటకు వస్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. డీజీపీ దీనికి బాధ్యత తీసుకోవాలి. .. ఆడపిల్లలను రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది?. అత్యాచార నిందితుల అరెస్టుకు కులం అడ్డొస్తుందా?. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది?. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. ఈ విషయాన్ని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో ఎందుకు రేప్‌లు జరగవు?. అక్కడ మాట్లాడాలంటే భయపడతారు. .. హోం మంత్రి అనిత జరుగుతున్న అఘాయిత్యాలపై రివ్యూ జరపాలి. మంత్రిగా బాధత్య తీసుకోవాలి. విమర్శలను పట్టించుకోకపోతే.. చేతకాకపోతే హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఒకవేళ.. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. పదవి ఇవాళ ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు ఐ డోంట్ కేర్.. అని పవన్ అన్నారు.ఇదీ చదవండి: ఇంతకీ ఆ జనసేన ఎమ్మెల్యే ఎక్కడ? -
సీఎం కుప్పం పర్యటన వేళ బది‘లీల’లు
చిత్తూరు, సాక్షి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. అయితే.. అంతకు ముందే అక్కడి అధికార యంత్రాంగాన్ని మార్చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేపు (మంగళవారం) సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ఒకరోజు ముందు.. నియోజకవర్గానికి సంబంధించి పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు.కుప్పం అర్బన్, రూరల్ సీఐలు రమణ, ఇశ్వర్‌రెడ్డిలను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మికాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబుదుగురు ఎస్ఐ సుమన్‌ను చిత్తూరు వీఆర్‌కు బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన టైంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీలు పోలీస్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పోలీస్ శాఖనే కాదు.. మరికొన్ని విభాగాల్లోనూ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నేరుగా సీఎంవో నుంచే సంబంధిత శాఖలకు ఈ ఆదేశాలు అందుతున్నాయని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. .. ఇలాంటి బదిలీలు ఊహించినవే. కానీ, ఇప్పటికే వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ బదిలీల ద్వారా రాబోయే రోజుల్లో మరింత పేట్రేగిపోయే అవకాశం లేకపోలేదని మేధావులు విశ్లేషిస్తున్నారు. -
International Yoga Day 2024: స్పెషల్ ఈవెంట్ ఫోటోలు
-
టార్గెట్ పిన్నెల్లి
గుంటూరు,సాక్షి: నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసే యత్నాలు చేస్తున్నారు. అంతేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైఎస్సార్సీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. వైఎస్సార్సీపీ సూటి ప్రశ్నలుమాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల(ఏప్రిల్) 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు టీడీపీకి లొంగిపోయాయేమో అనిపిస్తోంది. పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి :::వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏదైనా హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చలా కొందరు అధికారులు తయారు అయ్యారని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ కూటమికి కొమ్ము కాస్తున్న అధికారులు జూన్ 4 ఎన్నికల పలితాల మూల్యం చెల్లించుకోక తప్పదని సున్నితంగా హెచ్చరిస్తోంది కూడా. -
AP: ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన పేదింటి కుసుమాలు
అనంతపురం: ‘ప్రయత్నిస్తుండాగానీ ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చితీరుతుంది. గట్టిగా అనుకుంటే... లోలోపల ఆశయం రగులుకుంటే... వీధి దీపాల కింద చదువుకునైనా విశ్వవిజేత కావొచ్చు. పెద్దోళ్లకే అందలం అనే మాట వెనుకటిది. బీదాబిక్కీ సైతం ఊహించని ఎత్తుకు ఎదుగుతున్న కాలమిది. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం చేసిన ఉద్బోధతో ప్రభావితమైన ఉమ్మడి జిల్లాకు చెందిన యువత.. తమ సత్తా ఏమిటో చాటింది. ఇటీవల ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఊహించని విధంగా ర్యాంక్‌లు దక్కించుకున్న పలువురు ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. లైబ్రరీలో చదివి... కళ్యాణదుర్గం: స్థానిక పార్వతీనగర్‌కు చెందిన కవిత, దేవదాసు దంపతుల రెండో కుమారుడు గౌతమ్‌సాయి అనంతపురంలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్‌పై మక్కువతో యూపీఎస్సీ పరీక్ష రాశారు. అనంతరం గ్రూప్ 1 పరీక్షల్లో మెయిన్స్ వరకూ వెళ్లారు. అక్కడితో నిరుత్సాహపడకుండా అనంతపురంలోని పోలీస్ లైబ్రరీకెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ఎస్ఐ పోస్టును దక్కించుకున్నారు. విషయం తెలియగానే ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తన వద్ద పీఏగా పనిచేస్తున్న దేవదాసు కుమారుడు ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారన్న విషయం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీచరణ్ ప్రత్యేకంగా గౌతమ్‌సాయికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పేదింట ఆనందాల హరివిల్లు కంబదూరు: మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న ఎరికుల దురగప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు అరుణాచలం... ఆర్డీటీ సహకారంతో బీటెక్ పూర్తి చేశాడు. ఆపన్నులకు అండగా నిలవాలని భావించిన అరుణాచలం ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించాలని పరితపించాడు. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమై పరీక్ష రాశాడు. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. 222 మార్కులతో సివిల్ ఎస్ఐగా తాను కలలు కన్న ఉద్యోగానికి అర్హత సాధించాడు. పట్టుదలే తమ కుమారుడిని ఉన్నత స్థానానికి చేర్చిందంటూ ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యమే నడిపించింది బ్రహ్మసముద్రం : చదువులే జీవిత గమనాన్ని మారుస్తాయన్న తల్లిదండ్రులు మాటలు స్ఫూర్తినిచ్చాయి. దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఆమెను ఎస్ఐగా అర్హత సాధించేలా చేసింది. బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లికి చెందిన కురుబ భూలక్ష్మి, వన్నారెడ్డి దంపతులు చదువుసంధ్యలకు నోచుకోలేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరే పని తెలియదు. తమ కష్టం తమ కుమార్తె జ్యోతి పడకూడదని భావించిన వారు ఆమెను చదువుల వైపు దృష్టి సారించేలా చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం చిన్నాన్న మల్లేష్ చొరవతో పోటీ పరీక్షలకు హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే తండ్రి వన్నారెడ్డి అనారోగ్యం బారినపడ్డాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు చేసుకుంది. ‘కష్టాలు ఎన్ని ఉన్నా... లక్ష్యం వైపే గురి ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం’ అన్న ఆ మాటలే ఆమెను ఎస్ఐ పోటీ పరీక్షల్లో తలపడేలా చేసింది. ఎస్ఐ ఉద్యోగానికి జ్యోతి అర్హత సాధించడంతో నిరుపేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అనుకున్నదే సాధించి బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంటకు చెందిన దబ్బర వెంకటేశులు, కొండమ్మ దంపతుల కుమారుడు దబ్బర అనికుమార్ తిరుపతిలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయదుర్గం ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్నారు. అయితే ఎస్ఐగా కావాలనే తపన ఆయనను స్థిరంగా ఉండనివ్వలేదు. దీంతో పోటీ పరీక్షలు రాసి తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందించారు. గిరిజన ఆణిముత్యం బెళుగుప్ప: మండలంలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన వడిత్యా గోపాల్‌నాయక్, గీతాబాయి దంపతుల కుమారుడు వడిత్యా అశోక్‌కుమార్‌నాయక్ పోలీసు బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. కళ్యాణదుర్గంలోనే డిగ్రీ వరకూ చదువుకున్న ఆయన ఎస్ఐ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఇద్దరే తాడిపత్రి: ప్రస్తుతం తిరుపతిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన సుధీర్‌రెడ్డి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, సావిత్రమ్మ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన నరే‹Ùయాదవ్ 2020లో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈ ఏడాది తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 5వ ర్యాంక్ సాధించి ఎస్ఐగా శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు లక్ష్మీనారాయణమ్మ, శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు. అలాగే నార్పల మండలం నాయనపల్లికి చెందిన లావణ్య, నార్పలకు చెందిన జగదీశ్వరరెడ్డి కూడా ఎస్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి గుత్తి: ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనే కసి ఆమెలో పట్టుదలను పెంచింది. అదే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరువ చేసింది. గుత్తి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రావణిరెడ్డి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. పెద్ద పప్పూరు మండలం పెద్ద యక్కలూరు గ్రామానికి చెందిన శ్రావణిరెడ్డి... 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం గుత్తిలో పోస్టింగ్ పొందారు. ఎస్ఐ కావాలనే బలమైన ఆశయం ఆమెను పోటీ పరీక్షలకు సిద్ధపడేలా చేసింది. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసిన ఆమె గురువారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడంతో గుత్తి పోలీసుల్లో హర్షం వ్యక్తమైంది. సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్ఐ నబీరసూల్, ఏఎస్ఐ నాగమాణిక్యం, తదితరులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇది ఆరంభమే... రాప్తాడు: వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన బాలగొండ చిన్న బాబయ్య, శివమ్మ దంపతులు తమ కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలనూ సమానంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. రెండో కుమార్తె హరిత అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది. 8 నుంచి ఇంటర్ వరకు ధర్మవరం పంగల్ రోడ్డు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో, ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఐఎఫ్ఎస్ సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటుండగా ఆమెకు తెలియకుండా ఎస్ఐ పోటీ పరీక్షలకు నాన్న బాబయ్య దరఖాస్తు చేశాడు. ఈ విషయాన్ని తండ్రి ద్వారా తెలుసుకున్న ఆమె ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ తొలి ప్రయత్నంలోనే ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎలాగైనా ఐఎఫ్ఎస్ సాధించి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓపెన్ కేటగిరిలో మూడో స్థానం ముదిగుబ్బ: మండల కేంద్రానికి చెందిన చిగిచెర్ల గురుప్రసాద్, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె చిగిచెర్ల లహరి... ఎస్ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 225 మార్కులతో ఓపెన్ కేటగిరి మహిళల విభాగంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న ఆమెను గ్రామస్తులు, బంధువులు, తల్లిదండ్రులు అభినందించారు. సీమ జోన్లో 7వ ర్యాంక్ బత్తలపల్లి: మండలంలోని మాల్యవంతం పంచాయతీ ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట అఖిల్‌కుమార్ వివిధ ఉద్యోగాల్లో మౌనంగానే ఎదుగుతూ వచ్చారు. లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడైన అఖిల్‌కుమార్... టెక్ మహేంద్రలో సాప్‌్టవేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం అగళి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.. టెక్నాలజీపై పూర్తి పట్టు ఉండడంతో డిప్యూటేషన్‌పై పుట్టపర్తిలోని సైబర్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఐ పోటీ పరీక్షల్లో రాయలసీమ జోన్ పరిధిలో ఏడో ర్యాంక్‌ను దక్కించుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రైతు ఇంట ఆనందం బెళుగుప్ప: మండలంలోని రామినేపల్లికి చెందిన ఆంజనేయులు, సాలమ్మ దంపతుల కుమారుడు మంజునాథ్ చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడుగా ఉంటూ వచ్చేవాడు. ఈ క్రమంలో అగ్రీ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.అయితే తన చిరకాల వాంఛగా ఉన్న ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే తపన అతన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. అనుకున్నట్లుగానే లక్ష్యాన్ని చేరకోవడంతో నిరుపేద రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రమే‹Ù.. మంజునాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒకే ఊళ్లో ఇద్దరు కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన గజేంద్ర, కురబ శ్రీవాణి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. గ్రామానికి చెందిన మాలమ్మ, గంజన్నకు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చివరి వాడు గజేంద్ర. కూలి పనులతో జీవనం సాగిస్తునే ఎస్ఐ రాత పరీక్షల్లో సత్తా చాటారు. అలాగే శ్రీవాణి తల్లిదండ్రులు నాగలక్షి్మ, బాలాజీ... వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరూ ఎస్ఐలుగా ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మిత్రుల సహకారంతో... బెళుగుప్ప: మండలంలోని కాలువపల్లికి చెందిన వడ్డే వెంకటేశులు, భాగ్యమ్మ దంపతుల కుమారుడు అశోక్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. అనంతరం ఇంజనీరింగ్ పూర్తి చేసి తన పెద్దనాన్న, మాజీ సర్పంచ్ తిమ్మన్న సూచన మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మిత్రులు వెంకటేశ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అశోక్, సిద్దేశ్వర్, లలిత్, మంథేష్ అన్నింటా సహకరిస్తూ వచ్చారు. అయితే ఊహించని విధంగా పోలీస్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షల్లో విజయం సాధించి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. దీంతో కుటుంబసభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. -
ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఏ1గా ఏపీ పోలీస్ ఫోర్స్‌ను పేర్కొంటూ కేసు నమోదు చేశారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడి కాల్వ 5వ గేటు నుంచి ఏపీకి వదిలారని ఫిర్యాదులో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ పేర్కొంది. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: సాగర్‌పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి -
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు?: కోమటిరెడ్డి సాగర్ డ్యామ్‌పై పోలీసుల హడావుడి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. సాగర్ డ్యామ్‌పై పోలీసుల డ్రామా కేసీఆర్ పనేనన్నారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. చదవండి: ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ -
‘అమాయకులు బలికావొద్దనే సంయమనం పాటించాం’
సాక్షి, విజయవాడ: అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేశారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పోలీసులు అధికారుల సంఘం ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల దాడుల్లో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల విధ్వంసాన్ని పోలీసులు అరికట్టారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరులో అనుమతి లేకుండగా టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో పోలీసులు సంయమనం కోల్పోతే పుంగనూరులో పరిస్థితి మరోలా ఉండేది. ఇది పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే. ఈ దాడిలో అమాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే సంయమనం పాటించాం. పుంగనూరు ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేయమని డీజీపీని కోరాం. మాకు అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఒక్కటే అని స్పష్టం చేశారు. విచారణకు డీజీపీ ఆదేశం.. ఇదిలా ఉండగా.. పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదన్నారు. ఇక, పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి -
హ్యాట్సాఫ్.. ఏపీ పోలీసులు
సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్‌లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు. నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్? ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైనే దాడికి యత్నం చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటిన ఏపీ పోలీసులు
సాక్షి, అమరావతి: అఖిల భారత డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పోలీస్ డ్యూటీ మీట్ జరిపారు. పోలీస్ వృత్తి నైపుణ్యాలకు సంబంధించి మొత్తం 11 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 24 రాష్ట్రాల పోలీస్ విభాగాలు, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన మొత్తం రెండు వేల మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులు రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఓ కాంస్య పతకంతో మొత్తం ఆరు పతకాలు గెలుచుకుని దేశంలో మూడో స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర పోలీస్ అధికారులను డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం అభినందించారు. పోలీస్ శాఖ నుంచి స్వర్ణ పతక విజేతలకు రూ.3లక్షలు, రజత పతక విజేతలకు రూ.2లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు అందించారు. -
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!!
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!! -
‘కానిస్టేబుల్’ మెయిన్ పరీక్షకు 95,208 మందికి అర్హత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత నెల 22న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. 35 ప్రాంతాల్లోని 997 కేంద్రాల్లో నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన 3,63,432 మంది పురుషుల్లో 77,876 మంది క్వాలిఫైకాగా.. 95,750 మంది మహిళల్లో 17,332 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారి వివరాలు slprb. ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. ప్రిలిమినరీ రాతపరీక్ష జవాబు పత్రాల కీ గతనెల 22న సాయంత్రం విడుదల చేశారు. దానిపై వచ్చిన 2,261 అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్ట్ నిపుణులు.. ఆ కీలోని మూడు ప్రశ్నలకు జవాబులు మార్చి తుది కీ విడుదల చేశారు. స్కాన్చేసిన ఓఎంఆర్ షీట్లను మూడురోజలపాటు డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచారు. ఈ నెల 7వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటల వరకు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తదుపరి సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను తరచు పరిశీలించాలని సూచించారు. మెయిన్ పరీక్షకు దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబరు 9441450639కి కాల్ చేయవచ్చు. 9100203323 నంబరులో సంప్రదించవచ్చు. mail-slprb@ap.gov.inకి మెయిల్ చేయవచ్చు. కటాఫ్ మార్కుల వివరాలు 200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్ ఓసీలకు 40 శాతం (200కు 80 మార్కులు), బీసీలకు 35 శాతం (200కు 70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం (200కు 60 మార్కులు)గా నిర్ణయించారు. కులాలవారీగా పరీక్ష రాసిన, క్వాలిఫై అయిన పురుషులు, మహిళల సంఖ్య -
ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం
విజయవాడ : ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం. సమర్థత, నిజాయితీలో దేశంలోనే ఏపీకి మొదటిస్థానం వరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఏపీకి ప్రథమ స్థానం లభించడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్మోహన్రెడ్డిలు ప్రశంసించారు. -
లోకేశ్ పాదయాత్ర.. సాధారణ షరతులతో అనుమతి
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అతి సాధారణ షరతులతో అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని, మారణాయుధాలతో సంచరించరాదని దేశవ్యాప్తంగా పోలీసులు షరతులు విధిస్తున్నారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిబంధనలను అనుసరించే లోకేశ్ పాదయాత్ర, బహిరంగ సభలకు పోలీసులు మంగళవారం విడివిడిగా అనుమతులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని డీఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని పోలీసుశాఖ తెలిపింది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్న కుప్పం నియోజకవర్గం పలమనేరు డీఎస్పీ అనుమతి ఇచ్చారు. పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొనేవారి భద్రత కోసమే నిబంధనల మేరకు అనుమతి జారీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. అతి సాధారణ షరతుల్లో ముఖ్యమైనవి ఇవీ.. ►పాదయాత్రతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగించరాదు. ►ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రదేశాల్లో ముఖాముఖి నిర్వహించుకోవాలి. ►పురుషులు, మహిళా వలంటీర్లను తగినంత మందిని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక యూనిఫాం కేటాయించాలి. రోప్‌లు అందచేసి నియంత్రించేలా చూడాలి. ►పాదయాత్రలో డీజే సౌండ్ బాక్సులు, పెద్ద స్పీకర్లకు అనుమతి లేదు. ►పాదయాత్రలో పాల్గొనేవారు, సభలకు హాజరయ్యేవారు ఎలాంటి మారణాయుధాలు, రాళ్లు తదితరాలను తేకూడదు. ►మద్యం, మత్తు పదార్ధాలను సేవించరాదు. ►పాదయాత్రలో పాల్గొనేవారి వ్యక్తిగత భద్రత, ఆరోగ్య బాధ్యతలను నిర్వాహకులు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు, ఇతర దుర్ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తగినంత మంది వైద్య సిబ్బంది, అత్యవసర మందులతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలి. రాత్రి బస చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తగినంత లైటింగ్ సమకూర్చుకోవాలి. ►ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►బహిరంగ సభలను రోడ్లపై కాకుండా ఏదైనా మైదానంలోగానీ ప్రత్యేక ప్రదేశంలోగానీ ఏర్పాటు చేసుకోవాలి. అంచనా కంటే 20 శాతం మంది అధికంగా పట్టేందుకు వీలున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ►ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. -
AP Police Constable Exam : ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష .. (ఫొటోలు)
-
AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. 6,511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగార్థులకు తీపి కబురు చెప్పింది. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎస్ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. కానిస్టేబుల్ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వేర్వేరుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శరీరదారుఢ్య పరీక్షలు, ఫైనల్ రాతపరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తారు. హోంగార్డులకు తొలిసారిగా కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం విశేషం. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 8 శాతం నుంచి 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల్లో 10 శాతం నుంచి 25 శాతం హోంగార్డులకు రిజర్వేషన్ కల్పించారు. ► అభ్యర్థుల అర్హతలు, వయో పరిమితి మినహాయింపులు, దరఖాస్తు ఫీజు, రాతపరీక్షల విధానం, శరీరదారుఢ్య పరీక్షల ప్రమాణాలు, ఇతర వివరాల కోసం ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ https:// slprb.ap.gov.in చూడాలని బోర్డు సూచించింది. ► అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని తెలిపింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9441450639 పూర్తి పారదర్శకంగా పోలీసు నియామక ప్రక్రియ నిర్వహిస్తాం పోలీసు ఉద్యోగాల భర్తీప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తాం. 2023 జూన్ చివరినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో 2024 ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో పోస్టింగులు ఇవ్వొచ్చు. ఏటా ఇదేరీతిలో పోలీసు ఉద్యోగాలు భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. – కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా.. ఎస్ఐ ఉద్యోగాలు – మొత్తం పోస్టులు: 411 – ఎస్ఐ సివిల్: 315 – ఎస్ఐ ఏపీఎస్పీ: 96 – దరఖాస్తులు: 2022 డిసెంబర్ 14 నుంచి 2023 జనవరి 18 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. – హాల్‌టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. – ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. పేపర్–1: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పేపర్–2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. – శరీరదారుఢ్య పరీక్షలు: ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. – ఫైనల్ రాతపరీక్ష: శరీరదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫైనల్ రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్–1: ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్ విధానంలో) పేపర్–2: తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్ విధానంలో) పేపర్–3: అర్థమెటిక్ (ఆబ్జెక్టివ్ విధానంలో) పేపర్–4: జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ విధానంలో) ఎస్ఐ సివిల్ పోస్టులకు: పేపర్–1, పేపర్–2ల్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు పేపర్–3 (గరిష్టంగా 200 మార్కులు), పేపర్–4 (గరిష్టంగా 200 మార్కులు) మొత్తం 400 మార్కులకుగాను సాధించిన మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక నిర్వహించి పోస్టులు భర్తీచేస్తారు. ఎస్ఐ ఏపీఎస్పీ పోస్టులకు: పేపర్–1, పేపర్–2ల్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు పేపర్–3 (గరిష్టంగా 100 మార్కులు), పేపర్–4 (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (100 మార్కులు) కలిపి మొత్తం 300 మార్కులకుగాను సాధించిన మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక నిర్వహించి పోస్టులు భర్తీచేస్తారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ► మొత్తం పోస్టులు: 6,100 ► కానిస్టేబుల్ సివిల్: 3,580 (పురుషులు, మహిళలు) ► కానిస్టేబుల్ ఏపీఎస్పీ: 2,520 (పురుషులు) ► దరఖాస్తులు: 2022 నవంబరు 30 నుంచి 2022 డిసెంబర్ 28 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ► హాల్ టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 జనవరి 9వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 జనవరి 22న ఒక పేపర్ ఉంటుంది. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం, భారత జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ► శరీరదారుఢ్య పరీక్షలు: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ సివిల్ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల పరుగుగానీ లాంగ్‌జంప్‌లో గానీ పరీక్షిస్తారు. కానిస్టేబుల్ ఏపీఎస్పీ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ విభాగాల్లో పరీక్షిస్తారు. ► ఫైనల్ రాతపరీక్ష: శరీరదారుఢ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫైనల్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ► కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు ఫైనల్ రాతపరీక్ష (గరిష్టంగా 200 మార్కులు)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ► కానిస్టేబుల్ ఏపీఎస్పీ పోస్టులకు ఫైనల్ రాతపరీక్ష (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (గరిష్టంగా 100 మార్కులు)ల్లో సాధించిన మార్కులు కలిపి మొత్తం 200 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. -
లైసెన్స్ లేకపోయినా.. నో ఫైన్ !
సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్‌లేని వారు అక్కడికక్కడే ఎల్ఎల్ఆర్ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేసినట్లు చెప్పారు. హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. – రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా -
‘గంజాయి’ నిరోధంలో 'ఏపీ టాప్'
సాక్షి, అమరావతి: ‘గంజాయిలో టాప్’ అనటానికి... ‘గంజాయిని నిరోధించటంలో టాప్’ అనటానికి తేడా లేదా? ఈ తేడా ‘ఈనాడు’ పత్రికకో, దాని అధిపతి రామోజీరావుకో తెలియదా? తెలియకేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతున్నది తమ బాబు కాదు కాబట్టి... ఎంత వీలైతే అంత బురద జల్లాలి. నిజాలు చెప్పి బురద జల్లలేరు కాబట్టి... వీలైనంత తప్పుదోవ పట్టించాలి. గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. దేశవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, ఇక్కడే ఈ ఏడాది ఎక్కువ గంజాయిని పట్టుకున్నారని, ఎక్కువ కేసులు పెట్టారని, ఎక్కువ విస్తీర్ణంలో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారని జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక ఇచ్చింది. షరామామూలుగా ‘ఈనాడు’ తన పైత్యాన్ని జోడించి ‘గంజాయిలో ఏపీ టాప్’ అని శీర్షిక పెట్టేసింది. లోపల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదికలోని అంశాలనే పేర్కొంది. నిజానికి గంజాయి సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉన్నా... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే దీనిపై సమగ్ర కార్యాచరణ మొదలెట్టింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటంతో పాటు... గంజాయి సాగుకు అలవాటుపడ్డ గిరిజనుల్ని మార్చి, ఇతర పంటలు వేయిస్తూ ఆపరేషన్ ‘పరివర్తన్’ కూడా అమలు చేస్తోంది. ఎన్సీబీ నివేదికలోని వాస్తవాలివీ... గంజాయి దందాపై ఉక్కుపాదం మోపడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎన్సీబీ వెల్లడించింది. గంజాయి సాగు ధ్వంసం, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. దేశంలో 12 రాష్ట్రాల్లో గంజాయి సాగవుతోంది. దీని సాగును అడ్డుకోడానికి ఏపీ ఒక్క రాష్ట్రమే ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని వెల్లడించింది. అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను కూడా ఏపీ సమర్థంగా నిరోధిస్తోందని తెలిపింది. ఎన్సీబీ నివేదికలోని అంశాలు సంక్షిప్తంగా.. 40 శాతం పంట ధ్వంసం ఏపీలోనే.. గంజాయి పంటను ధ్వంసం చేయడంలో 2021లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, త్రిపుర రాష్ట్రాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 27,510 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారు. అందులో ఒక్క ఏపీలోనే అత్యధికంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. అంటే 40% గంజాయి పంటను ఏపీ పోలీసు శాఖే ధ్వంసం చేసింది. తరువాతి స్థానంలో ఒడిశా 3,500 ఎకరాలు, జమ్మూ–కశ్మీర్ 3 వేల ఎకరాలు, తెలంగాణ 2 వేల ఎకరాలు, మహారాష్ట్ర 1,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలుకలిపి 5,960 ఎకరాల్లో ఈ పంటను నాశనం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా భారీ స్థాయిలో గంజాయి పంటను పెకలించడంతోనే ఇది సాధ్యపడింది. గంజాయి సాగుకు వ్యతిరేకంగా అంత భారీ ఆపరేషన్ చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. అక్రమ రవాణాకు సమర్థంగా అడ్డుకట్ట గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ సమర్థవంతమైన పాత్ర నిర్వర్తించింది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తోంది. 2021లో దేశం మొత్తం మీద అక్రమంగా రవాణా అవుతున్న 7.49 లక్షల కిలోల గంజాయిని కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలు జప్తు చేశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సమర్థంగా వ్యవహరించి అత్యధికంగా 2.04 లక్షల కేజీల గంజాయిని జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ కింద సాగు చేçస్తున్న గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు వివిధ మార్గాల్లో సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను అడ్డుకుంది. స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తాన్ని అనకాపల్లి సమీపంలో ఒకేసారి కాల్చివేసింది. ఇంత భారీస్థాయిలో గంజాయిని పట్టుకోవడం, కాల్చివేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏపీ తరువాత స్థానంలో ఒడిశా 1.70 లక్షల కిలోల గంజాయిని జప్తు చేసింది. ద్రవ రూపంలో మార్చిన లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూడా ఏపీ ఇతర రాష్ట్రాలకంటే ముందుంది. 2021లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అత్యధికంగా 18.14 లీటర్ల హషీష్ ఆయిల్‌ను జప్తు చేసింది. -
అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే!
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ యాప్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రమాదం, సమస్య వచ్చినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే క్షణాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అద్బుతమైన అవకాశం ఇందులో ఉంది. అదే ‘ఏపీ పోలీస్ సేవ’యాప్. అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. పోలీస్‌స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. అందుకే మొబైల్లో ఈ యాప్ ఉంటే.. మన వెంట పోలీస్ ఉన్నట్టే! ఆరు విభాగాల్లో 87 రకాల పోలీస్ సేవలు పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందే సేవలను ఆరు విభాగాలుగా విభజించారు. శాంతిభద్రతలు. ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ సేవలు, రహదారి భద్రత, ప్రజా సమాచారం, పబ్లిక్ అవుట్ రీచ్ ఇలా ఆరు విభాగాల్లో పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. శాంతి భద్రతలు నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ స్థితిగతులు, దొంగతనాలపై ఫిర్యాదులు, రికవరీలు, తప్పిపోయిన కేసులు, దొరికిన వారు, గుర్తు తెలియని మృతదేహాలు, అరెస్ట్ వివరాలు, అపహరణకు గురైన వాహనాల వివరాలను పొందవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఇంటి పర్యవేక్షణ, ఈ–బీట్, ఈ–చలానా స్టేటస్‌లను తెలుసుకోవచ్చు. పబ్లిక్ సేవలు నేరాలపై ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన దరఖాస్తులు, ఎన్వోసీలు, వెరిఫికేషన్లు, లైసెన్స్‌లు, అనుమతులు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. రహదారి భద్రత బ్లాక్ స్పాట్లు, ప్రమాదాల మ్యాపింగ్, రోడ్డు భద్రతా గుర్తులు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆస్పత్రులు, మందుల దుకాణాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రజా సమాచారం పోలీస్ డిక్షనరీ, సమీప పోలీస్ స్టేషన్ల వివరాలు, టోల్ ఫ్రీ నంబర్లు, వెబ్సైట్ల వివరాలు, న్యాయ సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ అవుట్ రీచ్ సైబర్ భద్రత, సోషల్ మీడియా, కమ్యూనిటీ పోలీసింగ్, స్పందన వెబ్సైట్, ఫ్యాక్ట్ చెక్ సేవలు, తదితరవన్నీ పొందుపర్చారు. ఎక్కడ ఉన్నా.. ఫిర్యాదు చేసుకోవచ్చు.. పోలీస్ సేవ యాప్ ద్వారా ఉన్న చోట నుంచే వేధింపులు, నేరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పోలీస్ సేవల్లో లోపాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ నంబర్‌తో సహా ఫిర్యాదుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అలాగే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్ని కూడా మెసేజ్‌లో తెలియజేస్తారు. పిటిషన్ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసలుబాటును కలి్పంచారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు నుంచీ.. ఏదైనా కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి నిందితులను కోర్టులో హాజరుపరచడం విచారణ, సాక్షులు, కేసులో ట్రయల్స్, ఇలా మొత్తం 24 దశల్లో కేసు సమగ్ర సమాచారం మెసేజ్ రూపంలో తెలుస్తుంటాయి. ఎఫ్ఐఆర్ కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యాప్ ద్వారా సులభంగా ఎఫ్ఐఆర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ–చలానా వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న చలానాలను పరిశీలించి చెల్లించవచ్చు. మహిళ భద్రతకు ప్రాధాన్యం పోలీస్ సేవ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. సేఫ్టీ సేవ ద్వారా 12 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. దిశ, సైబర్ మిత్ర యాప్, వన్ స్టాప్ సెంటర్, ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్, ఉమెన్ ప్రొటెక్షన్ తదితర 12 మాడ్యూళ్లను అనుసంధానం చేశారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘పోలీస్ సేవ’యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులపై తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ‘పోలీస్ సేవ’ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దిశ యాప్‌ను తప్పకుండా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. తద్వారా క్షణాల్లో పోలీసు సాయం పొందుతారు. – సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ టాప్
సాక్షి, అమరావతి: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా గవర్నెన్స్ నౌ–2022 కింద ప్రకటించిన అవార్డుల్లో 14 అవార్డులను కైవసం చేసుకుంది. పోలీస్ ప్రధాన కార్యాలయం నాలుగు, విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా పోలీస్ విభాగాలు ఒక్కొక్కటి చొప్పున, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలు రెండు అవార్డుల చొప్పున దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని, స్వల్ప కాలంలోనే మొత్తంగా 189 జాతీయ అవార్డులను దక్కించుకోవడం తమ శాఖ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ఏ టెక్నాలజీని వినియోగించినా వాటి ఫలాలను క్షేత్రస్థాయిలో అందించి ప్రజలకు సత్వర న్యాయం చేసినప్పుడే అది అర్థవంతమవుతుందన్నారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీస్ శాఖను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అవార్డులు ఇలా.. శ్రీకాకుళం కమ్యూనిటీ పోలీసింగ్, విశాఖపట్నం సిటీ మహిళా భద్రత, కాకినాడ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్, ఎన్టీఆర్ ఈ–పోలీసింగ్ ఇనిషియేటివ్, రోడ్డు సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్రకాశం సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్, చిత్తూరు నేరాల గుర్తింపులో టెక్నాలజీ వినియోగం, తిరుపతి మహిళల భద్రత, పోలీసింగ్ ఇనిషియేటివ్ టెక్నాలజీ, కడప కమాండ్ అండ్ కంట్రోల్ విభాగంలోను అవార్డులను దక్కించుకోగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్‌లో రెండు, పోలీస్ ఆధునికీకరణలో రెండు మొత్తం నాలుగు అవార్డులు దక్కాయి. -
ఏపీలోని రహదారులపై 466 బ్లాక్ స్పాట్స్: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం 2016-2018 మధ్య రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 466 ప్రమాదకరమైన స్థలాలు (బ్లాక్ స్పాట్స్) గర్తించినట్లు రాజ్యసభలో బుధవారం రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను నిర్ధారించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఒక ప్రోటోకాల్‌ను రూపొందించిందని మంత్రి తెలిపారు. జాతీయ రహదారిపై 500 మీటర్ల భాగంలో మూడేళ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ఈ ప్రమాదాలలో 10 మంది మరణించినా ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించడానికి ముందుగానే వాటిని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత ఉన్నతాధికారులందరికీ తమ మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు తెలిపారు. జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ముందుగానే రోడ్డు సేఫ్టీపై ఆడిట్ నిర్వహించి ఆయా నివేదికలను జాతీయ రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలతో పంచుకోవడం జరుగుతుందని అన్నారు. కొత్తగా చేపట్టబోయే రోడ్డు ప్రాజెక్ట్‌లు ఏవైనా ముందుగా రోడ్డు సేఫ్టీ ఆడిట్ పూర్తయిన తర్వాతే నిర్మాణం ప్రారంభించాలని కూడా మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో దాదాపు 80 శాతం వరకు శాశ్వత ప్రాతిపదికన సరిదిద్దినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధి పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అనుమతించం న్యూఢిల్లీ: మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ కార్యకలాపాలను అనుమతించబోమని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాజ్యసభలో స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పాడేరు ప్రాంతంలో నిరుపేద గిరిజన రైతుల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కార్యక్రమం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు జీవనోపాధి భద్రత కల్పించాలన్నది ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదలకు వంద రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద తమ సొంత భూమిలో వ్యక్తిగత ఆస్తులు సృష్టించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అందులో భాగంగా భూమి అభివృద్ధి పనులు, సాగు చెరువుల తవ్వకం, వ్యవసాయ బావుల తవ్వకం, ఉద్యానవన పంటలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు, కోళ్లు, మేకల షెడ్లు వంటి పనులను చేపట్టవచ్చని మంత్రి తెలిపారు. -
ఏపీ పోలీస్‌కు 15 డిజిటల్ సభ అవార్డులు.. సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్.. ‘డిజిటల్ టెక్నాలజీ సభ–2022’ అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం 8 అవార్డులు, తిరుపతి అర్బన్ పోలీస్ యూనిట్ రెండు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ యూనిట్లు ఒక్కోటి చొప్పున గెలుచుకున్నాయి. బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఏపీ పోలీస్, జీఐఎస్ ఆధారిత జీపీఎస్ విధానం, దిశ కమాండ్ కంట్రోల్ రూమ్, రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, హాక్ వాహనాలు, వీడియోకాన్ఫరెన్స్ విధానం, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ విధానాలకు డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కాయి. చదవండి: (ఆకలితో బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ.. కనీసం తాగునీరు లేక..) సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్న పోలీసు శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల భద్రతకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మెరుగైన పోలీస్ వ్యవస్థ కోసం రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి కొనియాడారు. -
ఏపీ పోలీస్ భేష్.. చార్జిషీట్ల దాఖలులో నంబర్ వన్
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ మరింతగా బలోపేతమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానంగా దోషులకు శిక్షలు పడేలా సమర్థ దర్యాప్తు, మహిళా పోలీసుల ప్రాతినిధ్యం పెరగడం సానుకూల పరిణామమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్–2021’ నివేదిక జ్యుడిషియరీ–పబ్లిక్ సెక్యూరిటీ అనే అంశం కింద వివిధ రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ ఎలా ఉందనే విషయాలను విశ్లేషించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో మన రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరిచిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. దోషులకు సత్వరం శిక్షలు విధించడం, జనాభాను బట్టి పోలీసు అధికారులు– సిబ్బంది నిష్పత్తి, ప్రత్యేకంగా మహిళా పోలీసుల నిష్పత్తి, కేసుల పరిష్కార తీరు అనే నాలుగు ప్రామాణిక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించింది. – సాక్షి, అమరావతి సత్వర శిక్షల దిశగా ముందుకు.. వివిధ రకాల నేరాలకు పాల్పడిన దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్ సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. 2019–20లో 26.10 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించారు. కాగా 2020–21లో 38.40 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పోలీస్ అధికారులు నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్ల నమోదు, చార్జిషీట్లను దాఖలు చేయడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతోనే ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రత్యేకంగా పోక్సో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం ద్వారా కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంది. 2020–21లో శిక్షలు పడిన రేటు 12.30 శాతం పెరిగింది. జనాభాకు అనుగుణంగా నియామకాల్లోనూ పురోగతి జనాభా నిష్పత్తికి అనుగుణంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నియామకం విషయంలోనూ మన రాష్ట్రం పురోగతి సాధించింది. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 15 వేల మంది మహిళా పోలీసులను నియమించడం ఇందుకు బాగా దోహదపడింది. 2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసుల సంఖ్య 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగింది. పోలీసుల సంఖ్య పెరుగుదల 1.68 శాతం నమోదైంది. -
స్మార్ట్ పోలీసింగ్.. మనమే కింగ్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయస్థాయిలో మరోసారి తన ఘనతను చాటుకుంది. స్మార్ట్ పోలీసింగ్‌లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రజలపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిర్ధారించేందుకు ‘స్మార్ట్ పోలీసింగ్’ అనే అంశంపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం వెల్లడించింది. స్వయం ప్రతిపత్తిగల ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సంబంధించి తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఈ సర్వే నిర్వహించారు. వాటిలో ఆరు అంశాలు పోలీసుల సమర్థతకు సంబంధించినవి కాగా మూడు అంశాలు పోలీసు విలువలకు సంబంధించినవి. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత శైలి, చట్టబద్ధ–పారదర్శ పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం.. విభాగాల్లో మన రాష్ట్ర పోలీసు శాఖకు మొదటిస్థానం లభించింది. పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీసు వ్యవస్థ, పోలీసుల స్పందన, టెక్నాలజీ వినియోగం.. విభాగాల్లో రెండోస్థానంలో నిలిచింది. మొత్తం మీద తొమ్మిది అంశాల్లో కలిపి దేశంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన డీజీపీల సదస్సులో స్మార్ట్ పోలీసింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన సూచనలతో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఏటా ఈ సర్వే నిర్వహిస్తోంది. ఆ సంస్థ ఏడేళ్లుగా నిర్వహిస్తున్న సర్వేలో రాష్ట్ర పోలీసు శాఖ తొలిసారి మొదటి ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపున్న ఈ సర్వేలో రాష్ట్ర పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలవడం ద్వారా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించింది. సీఎం అభినందన ప్రజలకు ఉత్తమ పోలీసు సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటిస్థానం సాధించిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖను హోం మంత్రి సుచరిత కూడా అభినందించారు. -
శభాష్.. పోలీస్
సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో ఏపీ పోలీసుల సామర్థ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో చార్జిషీట్లు దాఖలు చేయడంలో మన రాష్ట్ర పోలీసులు అద్వితీయమైన పనితీరు కనబరిచారు. ఏకంగా 93.80 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసి ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషులను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్‌లతోపాటు వివిధ సంస్థల నుంచి రావల్సిన నివేదికలను సకాలంలో తెప్పించేందుకు అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. దర్యాప్తు అధికారిని ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు చార్జిషీట్ దాఖలు చేసేలా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తు ప్రగతిని వివిధ దశల్లో బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తోంది. పటిష్టంగా ఐసీజేఎస్ విధానం క్రిమినల్ జస్టిస్ విధానంలోని అన్ని ప్రధాన విభాగాలకు కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా సమన్వయపరిచేందుకు ‘ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్)ను పోలీసు శాఖ సమర్థంగా నిర్వహిస్తోంది. దాంతో దర్యాప్తును సకాలంలో పూర్తి చేసి ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం ద్వారా దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తోంది. ఐసీజేఎస్ విధానం ద్వారా పౌరులకు సేవలందించడంలో గతంలో రెండోస్థానంలో ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది. సీఎం, కేంద్ర హోం మంత్రి అభినందనలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సకాలంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర పోలీస్ శాఖను అభినందించారు. కాగా, సమగ్ర దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందిస్తున్న పోలీసు టెక్నికల్ సర్వీసెస్ విభాగాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. డీఐజీ ( పోలీస్ టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, ఇతర సాంకేతిక అధికారుల బృందాన్ని ఆయన ప్రశంసించారు. -
విజయవాడలో పోలీసు ఆయుధాల ప్రదర్శన
-
తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ
సాక్షి, అమరావతి: కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్లో ఏపీ అక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్ బలగాలను రీ లొకేట్ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్ ఆఫీసర్లు ఉన్నారు. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. చదవండి: (దుష్ప్రచారమే టీడీపీ అజెండా) తప్పుడు ఆరోపణలు చేయొద్దు: డీజీపీ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదు. ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మేం కూడా ఆ సంస్థలతో టచ్‌లో ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారు. రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం. ఎన్ఐఏ వాళ్లే కాకుండా ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు వచ్చి ఉంటాయి. ఏపీకి వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటీ..? అని ప్రశ్నించారు. చదవండి: (AP: బడితోనే అమ్మఒడి) -
నకిలీ చలానాల కేసులో అధికారుల దూకుడు
-
జాతీయ స్థాయి అవార్డులతో మరింత బాధ్యత పెరిగింది: డీజీపీ సవాంగ్
-
ఇది ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజు: డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అయిదు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ అయిదు అవార్డులు కూడా టెక్నాలజీ విభాగంలో వచ్చాయని వెల్లడించారు. ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని, దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు. పాస్‌పోర్ట్ సేవలోనూ దేశంలోనే ఏపీ అగ్రస్ధానంలో ఉందని డీజీపీ తెలిపారు. పాస్‌పార్ట్ వెరిఫికేషన్ టెక్నాలజీ సాయంతో చేస్తున్న విధానం జాతీయ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలబెట్టిందన్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 130 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకి దక్కాయయని, ఈ అవార్డులు పోలీస్ శాఖపై మరింత బాద్యత పెంచాయని పేర్కొన్నారు. అవార్డులు పెరుగుతున్న కొద్దీ శాఖ పనితీరుని మరింతగా మెరుగుపరుచుకుంటున్నామన్నారు. కోవిడ్ సమయంలోఘేపీ పోలీస్ పనితీరు ప్రశంసలు అందుకుందని చెప్పారు. ‘దిశ యాప్, మహిళల రక్షణపై ఏపీ పోలీసు శాఖకి ఇప్పటివరకు 17 అవార్డులు వచ్చాయి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందది. సీఎం వైఎస్ జగన్ దిశ యాప్ ప్రారంభించిన తర్వాత నుంచి రాష్ట్రంలో 46,66,841 మంది ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్ లోడ్ చేశారు. దిశ యాప్‌తో మహిళలకి దైర్యం వచ్చింది. దిశ యాప్‌తో అన్ని విధాల రక్షణ లబిస్తుందని మహిళలు భావిస్తున్నారు. రోజుకి 4 వేల వరకు కాల్స్ వస్తున్నాయి. దిశ యాప్ ఒక్కదానికే గతంలో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. పోలీస్ సేవా యాప్‌ను ఇప్పటి వరకు 7 లక్షల పైన డౌన్లోడ్ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్నాం. పోలీస్ శాఖలో పారదర్శకతకి ఈ పోలీస్ సేవా యాప్ ద్వారా పెద్ద పీట వేస్తున్నాం. ప్రతీ సోమవారం అన్నిజిల్లాల ఎస్పీ కార్యాలయాలలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి మహిళలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఏపీలో స్పందన కార్యక్రమం ద్వారా 38 వేల ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం’ అని వెల్లడించారు. చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్ -
లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం
-
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
సాక్షి, అమరావతి: డీజీపీ ఆదేశాల మేరకు డీఐజీలు, ఎస్పీలు ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుంచి స్వయంగా వివరాలను తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందేలా చేస్తున్న చర్యలను పరిశీలిస్తున్నారు. సచివాలయాల పరిధిలో నివసిస్తున్న మహిళల రక్షణకు, సైబర్ నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు అధికారులకు వివరించారు. మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు, కార్యాచరణ చేపడతామని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు తెలిపారు. -
అమ్మా.. మీ రక్షణకే ఈ ‘దిశ’ ( ఫోటోలు )
-
ఆ అకౌంట్లో తన ఎత్తు, బరువు, రేటు.. చదివి షాకైన నిత్య
‘‘నిత్యా, ఈ సెమిస్టర్లో కూడా నువ్వే ఫస్ట్, కంగ్రాట్స్!’ అంటూ వస్తూనే స్నేహితురాలిని అభినందించింది ఐషు. ‘థాంక్స్’ అంటూ నవ్వింది నిత్య. ఇద్దరూ క్లాసులోకి వెళ్లారు. క్లాస్మేట్స్ అందరూ నిత్యను అభినందనలతో ముంచెత్తారు. నిత్య, ఐషు (ఇద్దరి పేర్లు మార్చడమైంది) బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే నిత్య అంటే క్లాసులో అందరికీ అభిమానం. క్లాస్ అయిపోగానే నిత్య, ఐషులు తమ క్లాస్మేట్ రఘుతో కలిసి పార్టీకి బయటకెళ్లారు. మరుసటి రోజు కాలేజీకి వచ్చింది నిత్య. అందరూ తనను అదోలా చూస్తుండటం గమనించింది. ఎవరూ మునుపటిలా పలకరించట్లేదు. తను పలకరించినా ముభావంగానే ఉన్నారు. పక్కసీటులో ఉండే క్లాస్మేట్ ప్రవర్తన కొత్తగా అనిపించడంతో ‘ఏమైందంటూ’ దబాయించింది నిత్య. తన ఫోన్ చూపుతూ, అందులో వచ్చిన మెసేజ్‌లు చూపించింది క్లాస్మేట్. అవన్నీ నిత్యకు సంబంధించినవే. తన పేరుతో ఉన్న అకౌంట్లో తన ఎత్తు, బరువు, రేటు .. అంటూ ఏవేవో వివరాలు.. చదివిన నిత్య షాకైంది. అంతే కాదు ఫొటోలు కూడా అసభ్యంగా ఉన్నాయి. తన గురించి ఇంత చెత్తగా అదీ తన అకౌంట్ నుంచి ఎవరు పోస్ట్ చేశారో అర్ధం కాలేదు నిత్యకు. క్లాసులో చుట్టూ చూసిన నిత్యకు అవమానంతో అక్కడే భూమిలోకి వెళ్లిపోతే బాగుండనిపించింది. వెంటనే క్లాస్ నుంచి ఇంటికి వచ్చేసింది. విషయం తెలిసి వెంటనే నిత్యకు ఫోన్ చేసింది ఐషు. తనకేమీ తెలియదని చెబుతూనే, ఆ రోజుంతా ఏడుస్తూనే ఉంది నిత్య. కూతురి పరిస్థితి చూసిన తల్లితండ్రులు తల్లడిల్లిపోయారు. కూతురు భవిష్యత్తును దెబ్బతీయాలనుకున్న వారిపై చర్య తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసు ఫైల్ చేశారు. నిపుణుల సాయంతో ఆ ఫ్రాడ్ ఎవరో కనిపెట్టారు పోలీసులు. నిత్య పేరుతో చెత్త కామెంట్లు, ఫొటోలు అప్లోడ్ చేసింది ఎవరో కాదు నిత్య క్లాస్మేట్ రఘు అని తెలిసి ఆశ్చర్యపోయారు. రఘుని అరెస్ట్ చేశారు పోలీసులు. తనంటే ప్రత్యేక అభిమానం చూపే రఘు ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే నిత్యకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇదే విషయం పోలీసులకు చెప్పింది నిత్య. ఎప్పుడూ కలిసి ఉండే రఘు, నిత్య, ఐషులను విడివిడిగా ప్రశ్నించిన పోలీసులకు ఓ కొత్త విషయం అర్థమైంది. నిత్య మీద అసూయతో రగిలిపోయే ఐషు ఈ పని చేసిందని తెలుసుకున్నారు. రఘు ఫోన్‌ని వాడేది ఐషు. ఫ్రెండ్ కదా అని రఘు అడ్డు చెప్పేవాడు కాదు. రఘు తనను కాకుండా నిత్యను అభిమానిస్తున్నాడని, అన్నింటా తనే ముందుంటుందన్న అసూయ ఐషులో పెరిగిపోయింది. రఘు ఫోన్ నుంచి నిత్య పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, నిత్య గురించి చెడుగా కామెంట్ చేయడం మొదలుపెట్టింది. విషయం తెలిసి నిత్య–ఐషుల స్నేహం చెడిపోయింది. రఘు జీవితం ఇబ్బందుల్లో పడింది. టెక్నికల్‌గా ఐషు మీద యాక్షన్ తీసుకోలేమని, ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండమని పోలీసులు నిత్యకు హితవు చెప్పారు. అసూయను దరిచేర్చుకుంటే అది ద్వేషంగా మారి పతనం వైపుగా అడుగులు వేయిస్తుందనడానికి ఈ స్నేహితుల కథే ఉదాహరణ. ఫేక్ ప్రొఫైల్స్.. తస్మాత్ జాగ్రత్త స్నేహితులే కదా అని తమ ఫోన్ పాస్వర్డ్ వివరాలతో సహా చెప్పేసుకుని, అనుకోని పరిణామాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఇటీవల చూస్తున్నాం. ఆల్రెడీ మన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారి నుంచి మళ్లీ రిక్వెస్ట్ ఎందుకు వస్తుంది..? అనేది గుర్తించాలి. తమ ఫ్రెండ్స్‌ని అలెర్ట్ చేయాలి. తెలియని వారు పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు. చాలా మంది ఎంత మంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప అనుకుంటారు. వీటిల్లో హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫేక్ అని తెలియగానే ఆ సదరు అకౌంట్‌ని బ్లాక్ చేస్తే మంచిది. ఇటీవల ఫేక్ అకౌంట్స్ బారిన పడి మోసపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో డేటింగ్ సైట్స్ వాడే వారి సంఖ్య ఎక్కువ. ఈ సైట్లలో 50 శాతం ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ల స్నేహం మాయ గురించి మోసపోయాక కానీ తెలియదు. నిజానికి సోషల్‌మీడియాలో ఫేక్ ప్రొఫైల్ చూస్తేనే అర్థమైపోతుంది. అకౌంట్ ఇటీవల క్రియేట్ అయ్యి ఉండి, అందులో పూర్తి వివరాలు లేకుండా ఉంటే అనుమానించాలి. యూజర్‌నేమ్‌లో ఫస్ట్, లాస్ట్ నేమ్ అంటూ ఉండదు. ఆ అకౌంట్‌కి ఫాలోవర్లు ఉండరు. ఉన్నా.. వారే సృష్టించిన ఫేక్ ఐడీల జాబితాయే ఉంటుంది. వారి ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే వింత పేర్లు, స్టాక్ ఫొటోస్ పెట్టినవి ఉంటాయి. వాళ్ల కామెంట్స్ లిస్ట్‌లో సేమ్ కామెంట్స్ ఉంటాయి. ఫేక్ అకౌంట్స్‌కి ఒకే ఒక్క ఫొటో ఉంటుంది. ఆ ఫొటో కూడా ఎక్కడ నుంచి తీశారో గూగుల్ ఇమేజ్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని బట్టి అకౌంట్ ఫేక్ అని గుర్తించాలి. ఇలా గుర్తించినప్పుడు కంప్లైంట్ చేయాలి. మన ప్రొఫైల్ కూడా లాక్ చేసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలే సైబర్ నేరాలకు అడ్డుకట్ట. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఏపీలో ప్రారంభమైన రాత్రి కర్ఫ్యూ: రోడ్లన్నీ వెలవెల
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ శనివారం ప్రారంభమైంది. రాత్రి పది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమల్లోకి రావడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. వాహనదారులు, ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కర్ఫ్యూను పోలీసులు పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. పలుచోట్ల పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులు, ప్రజలను ప్రశ్నించారు. విశాఖపట్టణం, విజయవాడ, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురము, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు కర్ఫ్యూను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. విశాఖపట్టణంలో రద్దీగా ఉండే ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో 23 పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్... పెట్రోలింగ్ పార్టీలతో పాటు అదనపు బలగాలతో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్ని దుకాణాలు మూసివేసి సహకరించాల్సిందిగా చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు వ్యాపారులను విజ్ఞప్తి చేశారు. విజయవాడలో.. విజయవాడ: బందరు రోడ్ పీవీపీ మాల్ వద్ద నైట్ కర్వ్యూను విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు పర్యవేక్షించారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చినట్లు తెలిపారు. కర్ఫ్యూకు విజయవాడ నగర ప్రజలు సహకరించాలని కోరారు. 70 పికెట్స్, 62 బీట్స్ ద్వారా రాత్రి పూట కర్వ్యూను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మొదటి రెండు రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు శ్రీకాకుళం రోడ్డులో బోసిపోయిన ఓ కూడలి -
‘డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’
సాక్షి, విజయవాడ : గత నాలుగు రోజులుగా పోలీసులు పలు ఛాలెంజ్‌లు ఎదుర్కొంటున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందిగా పోలీసులకు వేక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం రావడంతో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనేదానిపై పోలీసు ఉద్యోగ సంఘాలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ సెకండ్ ఫేజ్‌లో సెంటర్లు, ఓటర్లు ఎక్కువ ఉంటారని, పొలీసులు గ్రామస్థాయిలో కచ్చితంగా పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ పోర్టల్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. బందోబస్తు పోలీసులు వ్యాక్సినేషన్‌కు వెళ్ళడానికి వారి ఎలక్షన్ బాధ్యతలు వదిలి వెళ్ళాల్సి వస్తుందని డీజీపీ తెలిపారు. చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి పోలీసులు పనిచేయాల్సి వస్తుందని గౌతమ్ సవాంత్ తెలిపారు. ఎలక్షన్ ఫేజ్‌లో పోలీసులు ఉండే ప్రాంతం మారిపోతుందున్నారు. రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహించడానికి తాము వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని త్యాగం చేస్తాం అని పోలీసు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసు ఉద్యోగులు తీసుకున్న నిర్ణయానికి తాను గౌరవిస్తున్నానన్నారు. ప్రజా సంక్షేమం ముందు, స్వ ప్రయోజనాలు తరువాత అని నిర్ణయించిన పోలీసు ఉద్యోగులకు డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు. ఏపీ పోలీస్ ఒక నిబద్ధతతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ పని చేస్తున్న కొంత మంది రాజకీయ నాయకులు అడుగడుగునా రాజకియం చేస్తున్నారని, టెక్కలిలో సీఐపై దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది సిస్‌లో ఉండకూడా.. వెనక ఉండి నడిపిస్తున్నారని తెలిపారు. విచారణ చేస్తున్నామని, ఎలాంటి వారైన వదిలే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. -
దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు
సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన దొంగను విజయవాడ వెస్ట్‌జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి తెరపడింది. గతేడాది సెప్టెంబరులో ప్రతిమలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఈ బృందాలు చివరకు ఇది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా (52) పనేనని నిర్ధారణకు వచ్చాక.. అందుకు సంబంధించిన పక్కా సాంకేతిక ఆధారాలను సేకరించాయి. వాటి ఆధారంగా జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. వాటిని తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. గోప్యంగా విచారణ చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్.. వెస్ట్‌జోన్ ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆలయంలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అలాగే, ఆ సమయంలో దేవాలయ అభివృద్ధి పనుల కోసం పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్తులను పోలీసులు విచారించారు. చోరీ జరిగిన సమయంలో పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలు, ఫోన్ కాల్‌డేటాతోపాటు టవర్ లోకేషన్ తదితర సాంకేతిక ఆధారాలను సేకరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా చోరీ జరిగిన సమయంలో దుర్గగుడి సమీపంలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ప్రత్యేక బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాకు పంపి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి గోప్యంగా విచారిస్తున్నారు. విచారణలో తానే అపహరించినట్లు సాయిబాబా అంగీకరించాడని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ వెండి ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించాడని, వాటిని సదరు వ్యాపారి కరిగించినట్లు తెలిసిందని, ఆ వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సాయిబాబాపై ఇప్పటివరకు 100కు పైగా కేసులున్నాయని.. వీటిలో అత్యధిక కేసులు ఆలయాలకు సంబంధించినవేనని వివరించారు. దొంగ దొరికింది ఇలా.. ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007, 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి, నరసాపురం, పాలకోడేరు, నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. సాయిబాబా వ్యవహారశైలి తెలిసిన ఈ ఎస్సై అతనిపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న సాయిబాబా భార్య ఇంటికి వెళ్లి.. ‘మీకు ఇళ్ల పట్టా వచ్చింది.. మీ భర్త వివరాలు తెలియజేయండి’.. అంటూ ఎస్ఐ నమ్మబలికారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్‌చేయగా సాయిబాబు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలికి నిందితుడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసు కొలిక్కి రావడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చోరీ తీరును తెలుసుకునే క్రమంలో నిందితుడు సాయిబాబాను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ చేయనున్నారు. కొండపైకి ఎప్పుడు చేరాడు? ఏ సమయంలో చోరీకి పాల్పడ్డాడు? తర్వాత వాటిని తీసుకుని ఏ మార్గంలో బయటపడ్డాడు? ఎక్కడ వాటిని దాచాడు? ఎవరికి విక్రయించాడు? ఇతరులు ఎవరైనా సహకరించారా? అనే అంశాలపై నిందితుడిని విచారణ చేయనున్నామని ఆ అధికారి వివరించారు. -
ఏపీ ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘అంత్రిక్ సురక్ష సేవ పతకం–2020’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను కేంద్రం ఈ మెడల్స్‌కు ఎంపిక చేసింది. వీటిని డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అందజేశారు. మెడల్స్ అందుకున్న వారిలో డీఐజీ పాలరాజు(ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్), అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా, పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబు, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఉన్నారు. -
అట్టహాసంగా ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్
ఆధ్యాత్మికపురి.. తిరునగరి 2020 డ్యూటీమీట్‌కు వేదికగా నిలిచింది. ఇందుకు రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం తరలివచ్చింది. విభిన్న రంగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించింది.. ప్రతిభ చూపింది.. మీట్లో భాగంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు కీర్తి దక్కగా.. మిగిలిన పోలీసు సిబ్బందిలో స్ఫూర్తి నిండింది. సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్/తిరుపతి క్రైం : తిరుపతిలో నాలుగు రోజులుగా నిర్వహించిన తొలి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ గురువారం అట్టహాసంగా ముగిసింది. ఇగ్నైట్ 2020 పేరుతో నిర్వహించిన ఈ డ్యూటీ మీట్ పోలీసుల్లో స్ఫూర్తి నింపింది. రాష్ట్ర విభజనానంతరం తిరుపతి వేదికగా తొలిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌కు 13 జిల్లాల నుంచి పోలీస్ శాఖలోని అన్ని విభాగాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. పోలీసుల్లోని సామర్థ్యాలు, ప్రతిభను వెలికి తీసేలా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసులకు రాత పరీక్షలు నిర్వహించి, బంగారు, వెండి, కాంస్య పతకాలతో సత్కరించారు. అదరహో.. పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా పోలీస్ శాఖలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఎస్డీఆర్ఎస్, ఇంటలిజెన్స్ విభాగాలు ప్రదర్శించిన ప్రత్యేక విన్యాసాలు సందర్శకులను కట్టి పడేశాయి. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. టీటీడీ సహకారం భేష్ పెద్ద ఎత్తున తిరుపతిలో తొలిసారిగా నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్ విజయవంతం కావడానికి టీటీడీ అందించిన సహకారం మరువలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పోలీస్ డ్యూటీ మీట్‌కు 1,560 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది వచ్చినట్లు పేర్కొన్నారు. వీరి వసతి కోసం టీటీడీ 138 గదులను కేటాయించడం అభినందనీయమన్నారు. 21 ఈవెంట్లలో పోటీలు డ్యూటీ మీట్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కి 21 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఇందులో 6 ఈవెంట్లు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో, మిగిలిన 15 ఈవెంట్లను పీటీసీలో నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 320 మంది పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీమీట్‌లో మెరిసిన చిత్తూరు చిత్తూరు అర్బన్: తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీమీట్‌లో చిత్తూరుకు చెందిన పోలీసులు ప్రతిభ కనబరచారు. చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్ఎం జహీర్‌బాషా యాక్సెట్ కంట్రోల్ విభాగంలో బంగారు పతకం సాధించారు. అలాగే ఏఆర్ విభాగంలోని మరో కానిస్టేబుల్ కార్తీక్ వాహనాల తనిఖీ విభాగంలో వెండి పతకం సాధించారు. వీరిద్దరూ కూడా రాష్ట్ర హోంమంత్రి సుచరిత, డీఐజీ క్రాంతిరాణాటాటా, ఎస్పీ సెంథిల్‌కుమార్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. దిశ.. ఆమెకు రక్ష ► పోలీసు స్టోరీతోనే హీరో అయ్యా.. ► ఇగ్నైట్‌లో పాల్గొనడం నా అదృష్టం ► ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సినీహీరో సాయికుమార్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం వారి పాలిట రక్షణ కవచమేనని సినీ హీరో సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ఏపీ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ ‘ఇగ్నైట్’ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన సందర్భంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థపై, పాలనాపరమైన అంశాలపై తన మనోభావాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కరోనా కాలం ఎలా గడిచింది ? సాయికుమార్: ఇదొక విపత్కర పరిస్థితి. సామాన్యుడి నుంచి ధనికుల వరకు ప్రతి వ్యక్తినీ కరోనా వైరస్ కష్టపెట్టింది. కళామతల్లి బిడ్డలు చాలామంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసు వ్యవస్థ, పంచాయతీ కార్మికులు, హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన సేవలు ప్రజలు మరువరు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారా? సాయి: శ్రీవారి ఆశీస్సులతో 1972 నుంచి బాల నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అంచెలంచెలుగా ఎదిగాను. పోలీస్ స్టోరీ సినిమాతో హీరోగా ప్రజలు ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ భగవంతుని దయతో ఏటా సినిమాలు, టీవీ ప్రోగ్రాంలతో జీవితం బీజీగా గడుస్తోంది. ప్రస్తుతం మళయాల సినిమా ‘చేక్తల్లీఖాన్ ఐపీఎస్’లో నటిస్తున్నాను. దిశ చట్టంపై మీ అభిప్రాయం? సాయి: సమాజంలో కొంత మంది చట్టాలను చుట్టాలుగా చేసుకుని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో వారి జీవితాలు సర్వ నాశనమవుతున్నాయి. అటువంటి సంఘటనలు జరగకుండా, ఒక వేళ జరిగినా వెంటనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషదాయకం. అసెంబ్లీలో చట్టం ఆమోదించడం చారిత్రాత్మకం. దిశ చట్టం అతివలకు రక్షణ కవచంగా నిలుస్తుంది. డ్యూటీ మీట్లో మీ అనుభూతి ఏమిటి? సాయి: పోలీసుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఏర్పాటు చేసిన ఇగ్నైట్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చాను. పోలీసు డ్యూటీ మీట్లో ఎంతోమంది అధికారులు, సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకుని ప్రదర్శనలను ఇచ్చారు. ప్రతి పోలీసు అధికారికీ ఈసందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను. ఏపీ పోలీసు వ్యవస్థపై మీ అభిప్రాయం? సాయి: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసు నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణం. దేశంలో ఏపీ పోలీసు 108 పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ స్పందన ? సాయి: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ ఫలాలు చిట్టచివరి లబ్ధిదారుని వరకు అవినీతి రహితంగా చేరినప్పుడే ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. సీఎం జగన్‌కి మరోసారి ప్రజలు బ్రహ్మరథం పడతారు. -
ఈ సెల్యూట్ అందరం గర్వపడే సెల్యూట్
డిఎస్పీగా ఉన్న కూతురికి సిఐగా ఉన్న తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూట్ అందరం గర్వపడే సెల్యూట్. ► ఇంట ఆడపిల్లకు గౌరవం పెరుగుతున్నందుకు ►చదువులో అమ్మాయిలు ముందంజ వేస్తున్నందుకు ►ఉద్యోగాల్లో సామర్థ్యాలు చూపుతున్నందుకు ►కుటుంబాల ఆలోచనాధోరణిలో మార్పు తెస్తున్నందుకు ►సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ఈ కాలపు కూతురికి ఈ కాలం తల వొంచి చేస్తున్న సెల్యూట్ ఇది.సెల్యూట్ చేసే ఎత్తుకు సమాజం ఎదుగుతోంది.సెల్యూట్ చేయించుకునే ఉన్నతికి కూతురు అడుగులేస్తోంది. నిజంగానే ఇది మనం కూడా నుదుటికి చేయి చేర్చవలసిన సెల్యూట్. కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి సెల్యూట్ చేస్తున్న తండ్రి సీఐ శ్యామ్‌సుందర్ మూడు రోజుల క్రితం తిరుపతిలో ఒక స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడ జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్‌కు గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీ వై.జెస్సి ప్రశాంతి హాజరయ్యారు. తిరుపతిలో కల్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సి.ఐ వై.శ్యామ్‌సుందర్ కూడా హాజరయ్యారు. పోలీసు విభాగంలో పై అధికారి కనిపిస్తే కింది అధికారి సెల్యూట్ చేయాలి. ఇక్కడ సి.ఐ శ్యామ్ సుందర్ తన పై అధికారి ప్రశాంతికి శాల్యూట్ చేశారు. అయితే ఆ పై అధికారి ఆయన కూతురు. ఈ కింది అధికారి ఆమె నాన్న. నాన్న చేత సెల్యూట్ చేయించుకునేలా ఆ నాన్న ఆ కూతురిని చదువులో ప్రోత్సహించాడు. నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కూతురు ఉన్నతోద్యోగం సాధించింది.ఈ దృశ్యం అందరినీ సంతోషపెట్టింది. కొత్త తరాలు పాత తరాలను మించిన విజయాలు సాధించాలని, ముఖ్యంగా పాతకాలపు అభిప్రాయాలను దాటి అమ్మాయిలను ప్రోత్సహిస్తే వారు విజయాలు అందుకుంటారని సందేశం ఇచ్చింది. న్యూస్‌లో ఉన్న ఈ తండ్రీ కూతుళ్లను ‘సాక్షి’ పలుకరించింది. ప్రశాంతితో చేసిన ఇంటర్వ్యూ విశేషాలివి. అమ్మా, నాన్న, తమ్ముడుతో డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నాన్నగారు సెల్యూట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ప్రశాంతి: పోలీస్ విభాగంలో పై అధికారికి సెల్యూట్ చేయడం సర్వసాధారణం. డ్యూటీ మీట్లో నాన్న నాకు ఎదురుపడినప్పుడు మా మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధం కంటే వృత్తిధర్మమే గుర్తుకొచ్చింది. సెల్యూట్ చేస్తానని నాన్న, స్వీకరిస్తానని నేను ఊహించలేదు. నాన్న నాకు సెల్యూట్ చేశాడన్న సంతోషం కన్నా సెల్యూట్ చేసేంతగా ఎదిగేందుకు ప్రోత్సహించాడని గుర్తుకొచ్చి ఆయనపై మరింత గౌరవం పెరిగింది. సెల్యూట్ దృశ్యాలు వైరల్‌తో వస్తున్న అభినందనలు జీవితంలో మరచిపోలేనివని. డిపార్ట్మెంట్లో కూడా చాలా మెచ్చుకుంటున్నారు. మీ కుటుంబ నేపథ్యం? ప్రశాంతి: మాది నెల్లూరు జిల్లా, టీపీ గూడూరు మండలం, పాపిరెడ్డిపాళెం అయినా పుట్టి పెరిగిందంతా తిరుపతిలోనే. వృత్తి రీత్యా నాన్న తిరుపతిలో స్థిరపడ్డారు. అమ్మ వై.సునీత గృహిణి. చెల్లెలు మెర్సీ స్రవంతి కడప డెంటల్ కశాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, తమ్ముడు డానియన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి సివిల్స్ శిక్షణ పొందుతున్నాడు. మా తాత పేరం వెంకయ్య ఐపీఎస్ అధికారిగా పని చేశారు. మీ చదువు? ప్రశాంతి: ఎస్వీయూలో గోల్డ్‌మెడల్‌తో ఎం.బి.ఏ చేశాను. పోలీస్ ఉద్యోగంలోకి రావడానికి మీ మీద ఎవరి ప్రభావం ఉంది? ప్రశాంతి: అమ్మలో క్రమశిక్షణ ఎక్కువ. ఆమెకు తక్కువ మాట్లాడటం అలవాటు. నాన్న డ్యూటీకి వెళితే మేము అల్లరి చేయకుండా ఉండటానికి కోపం చూపేది. అందువల్ల నాన్నతో చనువుగా ఉండేవాళ్లం. అందరు అమ్మా నాన్నల్లాగే మా అమ్మా నాన్నలు కూడా మా మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే తల్లిదండ్రుల గోల్స్ అన్నింటిని పిల్లలు సాధించలేరు. కాని వారి సూచనలను ఆదర్శంగా చేసుకొని మనకంటూ లక్ష్యం పెట్టుకొని ప్రయత్నిస్తే సక్సెస్ అవుతాం. ఐఏఎస్,ఐపీఎస్‌లు ప్రజలకు నేరుగా సేవ చేయగలరు. అందువల్ల ఐఏఎస్ అవుదామనుకున్నాను. కాని ఆ కల తొలి ప్రయత్నంలో చేజారింది. రెండవ ప్రయత్నంలో గ్రూప్స్‌లో అర్హత సాధించాను. వేరే శాఖలకు అవకాశం ఉన్నా పోలీస్ శాఖ తీసుకున్నాను. ఆ శాఖలో పని చేసిన నాన్న, తాతలను ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఈ క్రమంలో ఏదైనా వొత్తిడి ఎదుర్కొన్నారా? ప్రశాంతి: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగానే నా స్నేహితులు చాలామంది స్థిరపడ్డారు. నా మీద బంధువుల నుంచి చదువు ఆపేసి పెళ్లి చేసుకోమని ఒత్తడి వచ్చేది. అయితే అమ్మా నాన్నలు నా లక్ష్యం వైపు ఎంకరేజ్ చేశారు. పోలీస్ శాఖలో ఇప్పుడు స్త్రీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ప్రశాంతి: గతానికి, ఇప్పటికి పోలీస్‌శాఖలో అనేక మార్పులు వచ్చాయి. మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల మహిళలు ధైర్యంగా పోలీసుశాఖలోకి వస్తున్నారు. సి.ఎం గారు, డీజీపీ గారు పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఫ్రెండ్లీ, స్మైలీ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే రోజులు వచ్చాయి. పోలీసుల స్నేహ శైలి బాధితుల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకత చూపుతోంది. అందువల్ల అమ్మాయిలకు అవకాశం వస్తే పోలీస్ శాఖనే ఎంపిక చేసుకోవాలని సూచిస్తాను. దిశ చట్టంపై మీ అభిప్రాయం? ప్రశాంతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు నిర్దిష్ట లక్ష్యంతో తెచ్చిందే దిశాచట్టం. సీఎం, డీజీపీలు ప్రత్యేక శ్రద్ధతో మహిళల రక్షణ కోసం దిశాను రూపొందించారు. ఫిర్యాదు చేసిన 7 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేసి 21 రోజుల్లోనే విచారణ పూర్తి చే సి, బాధితులకు న్యాయం చేకూర్చే వేగవంతమైన చట్టం ఇది. అయితే ఈ చట్టంపై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సైబర్ రిలెటీవ్గా ఈ చట్టానికి అదనపు సెక్షన్లను యాడ్ చేశారు. దిశ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రేతర ప్రాంతాల్లో సైతం ఈ చట్టం అమలుకు ప్రయత్నాలు సాగిస్తుండడం చూస్తే దిశ ప్రాధాన్యత అర్థమవుతుంది. యువతరం అమ్మాయిలకు మీరిచ్చే సందేశం? ప్రశాంతి: ప్రతి అమ్మాయి విద్యావంతురాలిగా ఎదగాలి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి. – మోపూరి బాలకృష్ణారెడ్డి, చదువులే పిల్లల ఆస్తి పిల్లల చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం అందించాను. మన వద్ద ఆస్తిపాస్తులు లేవు. మన పెద్దలు ఆస్తులు కూడబెట్టింది లేదు. మీ చదువులే నాకు ఆస్తి అని నిత్యం చెప్పేవాడిని. చదువు ప్రాధాన్యతను తెలుసుకున్న పిల్లలు ఉన్నతంగా స్థిరపడుతున్నారు. పిల్లల్ని తమ కంటే ఉన్నత స్థాయిలో చూసినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా చెప్పలేనంత ఆనందంతో గుండె ఉప్పొంగుతుంది. నా కూతురు ప్రశాంతికి సెల్యూట్ చేసే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నా. – వై.శ్యామ్‌సుందర్, సీఐ, తిరుపతి, కల్యాణ్డ్యాం, పోలీస్ ట్రైనింగ్ సెంటర్. ఇంతకు మించిన ఆనందం ఉంటుందా... భర్త, కూతురు ఒకే రంగంలో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికీ ప్రశంసలు రావడం ఇంకా సంతోషంగా ఉంది. మా అమ్మాయి ప్రశాంతిని చూసి గర్వపడుతున్నా. – వై.సునీత, తల్లి. -సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫోటోలు: కేతారి మోహనకృష్ణ -
సంస్కరణ అడుగులు.. రక్షణ కవచాలు
సాక్షి, కర్నూలు: క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘా... సమర్థవంతంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరస్తుల కదలికలపై డేగ కన్ను.. కరడుగట్టిన నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగం.. తరచూ సమస్యాత్మక గ్రామాల్లో కార్డెన్ అండ్ సర్చ్ (నాకా బందీ).. వీటికి తోడు పోలీసు శాఖలో వినూత్న మార్పులు.. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నేరాల శాతం తగ్గుముఖం పట్టింది. అయితే సైబర్ మోసాలు, చిన్నారులపై అత్యాచారం (పొక్సో) తదితర నేరాలు పెరిగాయి. ఆస్తి తగాదాలు, చిన్న చిన్న ఘర్షణలు, మహిళా వేధింపులు మాత్రం తగ్గలేదు. చోరీల సంఖ్య తగ్గినప్పటికీ సొత్తుల రికవరీలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో కొత్తగా వస్తున్న సంస్కరణలతో కొంత కాలంగా అవగాహన పెరిగింది. పీడీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో హింసాత్మక ఘటనలు తగ్గాయి. దొంగతనాలు, దోపిడీలతో పోల్చితే సైబర్ నేరాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. 2020 సంవత్సరం జిల్లాలో చోటు చేసుకున్న నేరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాంకేతికత తోడుగా.. మారుతున్న పరిస్థితులను బట్టి పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసుల విచారణలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. కేసు నమోదు దగ్గరి నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిఘా, నియంత్రణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దాతలు, ప్రజల సహకారంతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం ఇటీవల పలు కేసులను చేధించారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు) మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,856 ఆలయాలు, 921 మసీదులు, 745 చర్చీలు మొత్తం 3,522 ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేయించారు. బహిరంగ ప్రదేశాలు, ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులపై కూడా ప్రజలు, ప్రైవేట్ వారి సహకారంతో గృహాలు, వ్యాపార దుకాణాలు, మద్యం షాపులు, డాబాల్లో సీసీటీవీ కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 15,662 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మ్యాట్రిక్స్, బృహస్పతి టెక్నాలజీకి సంబంధించిన కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడంలో నిఘానేత్రాలు కీలకంగా మారాయి. నిఘా నీడలో.. ఎవరూ ఊహించని విధంగా ఈ ఏడాది కరోనా వైరస్ జనజీవనాన్ని కట్టి పడేసింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 3వ వారం నుంచి లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో జిల్లాలో 4 నెలల పాటు పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ కాశారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దులను రెండు నెలల పాటు పూర్తిగా మూసేశారు. పట్టణాల్లో చెక్‌పోస్టులు, ప్రతివీధిలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గస్తీ పెంచడంతో దొంగతనాల సంఖ్య భారీగా తగ్గింది. లాక్డౌన్ సమయంలో పగటి పూట అందరూ ఇళ్లలోనే ఉండటంతో చోరీలకు అవకాశం లేకుండా పోయింది. లాక్డౌన్ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువ కావడంతో 80 శాతం ప్రమాదాలు తగ్గాయి. అలాగే శాంతి భద్రతలు, మతసామరస్య పరిరక్షణకు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు జిల్లాలో వినూత్నంగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాల వ్యవస్థ సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు, యువత స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ దళాలు తమ పనితీరుతో పోలీసు ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నాయి. జిల్లాలో 83 పోలీసుస్టేషన్లు, 19 సర్కిళ్లు ఉండగా వీటి పరిధిలో 1,450 గ్రామరక్షక దళాలు ఏర్పాటు చేశారు. కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ రిమాండు ఖైదీలను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సంఘటనల నేపథ్యంలో వీడియో లింకేజీ ద్వారా జైళ్ల నుంచే ఖైదీలను హాజరు పరిచే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,426 కేసుల్లో 2,318 మంది సబ్ జైలు రిమాండులో ఉన్న ముద్దాయిలను సంబంధిత జడ్జీల ద్వారా వీడియో లింకేజీల ద్వారా రిమాండ్ గడువు పొడిగించేటట్టు చర్యలు చేపట్టారు. నేర ప్రవృత్తి మార్చుకోని నూకల మనోహర్‌రావు, గంగదాసరి రవిచంద్రరెడ్డి, నకిలీ విత్తనాల వ్యాపారి మణిగొండ రత్నాకరరావు, నకిలీ మద్యం తయారీ ముఠా నాయకుడు వినోద్ ఖలాల్ తదితరులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపారు. సెబ్‌తో కిక్కుకు కళ్లెం అక్రమ మద్యం రవాణాకు సంబంధించి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు కాక ముందు 574 కేసులు నమోదు చేసి 622 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ప్రత్యేకంగా సెబ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జిల్లాలో 9,060 మద్యం కేసులు నమోదుచేసి 11,606 మందిని అరెస్ట్ చేసి 3,373 వాహనాలను సీజ్ చేశారు. 59,873 లీటర్ల నాటుసారా, 69,002 లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యం సీజ్ చేసి 11,363 మందిని అరెస్ట్ చేశారు. సెబ్ తీసుకుంటున్న చర్యలతో సరిహద్దు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు దాదాపు అడ్డుకట్ట పడింది. పోలీసు శాఖకు మచ్చ తెచ్చిన ఘటనలు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అందులో పనిచేస్తున్న కొంతమంది వ్యవహారం వల్ల మచ్చ తెచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు సెబ్ విస్తృత దాడులు చేస్తున్నా కాసులకు కక్కుర్తి పడి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ సుమారు 10 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఒక సీఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్ కావడం, ప్రేమ వ్యవహారంలో తుగ్గలి ఎస్ఐని విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట సెబ్ ఏర్పాటుతో ఇసుక అక్రమ రవాణాదారులకు కూడా కళ్లెం పడింది. అనుమతులులేని ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న వారిపై నిఘా ఉంచి 435 కేసులు నమోదు చేసి 833 మందిని అరెస్ట్ చేసి 505 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే 6,661 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలతో ముచ్చెమటలు ఈ ఏడాది తీవ్ర నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు 19 శాతం పెరిగాయి. కరోనా సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్‌నేరాలు పెరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది 136 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 163 కేసులు నమోద య్యాయి. ఈ కేసులు దర్యాప్తు చేపట్టి రూ.3.36 కోట్లు రికవరీ చేశారు. అధునాతున సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మరో 230 కేసులను చేధించారు. ఛేదించిన సంచలన కేసులు ► ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 9 రోజుల బాలిక కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం అందిన వెంటనే ఐదు స్పెషల్‌పార్టీ బృందాలు రంగంలోకి దిగి రెండు గంటల్లోనే కేసును చేధించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ► కర్నూలులో ప్రగతి మహిళా పరస్పర పొదుపు సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్న కేసులోని నిందితుల ఆస్తులను ప్రభుత్వానికి అటా^Œ చేసేలా దర్యాప్తు చేపట్టి బాధితులకు ఊరట కలిగించారు. ► ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన నకిలీ ఏసీబీ అధికారుల సంచలన కేసును సెప్టెంబర్ 2వ తేదీ అరెస్ట్ చేసి రూ.14.34 లక్షలు రికవరీ చేశారు. ► ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో కాలభైరవ విగ్రహంలోని ఓ భాగాన్ని తొలగించిన దుండగున్ని సెప్టెంబర్ 28న అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. ► జాతీయ రహదారుల సమీపంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఎరుకల నల్లబోతుల నాగప్పతో పాటు మరో ఇద్దరు మహిళలను అక్టోబర్ 17న అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. వీరు 20 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. ► ప్రభుత్వ పథకాల ద్వారా దొడ్డిదారిలో లబ్ధికి వీలుగా ఆధార్ కార్డులో డేటా మార్పి మోసాలకు పాల్పడిన 30 మందిని అక్టోబర్ 28న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ► ఇంటలిజెన్స్ డీఎస్పీనని మోసాలకు పాల్పడిన కుమార్ అనే వ్యక్తిని నవంబర్ 2న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ► ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ.4.35 కోట్లు విలువ చేసే 686.5 కిలోల వెండితో పాటు కారును డిసెంబర్ 11వ తేదీ అమకతాడు చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ► ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.9 కోట్లు నగదును డిసెంబర్ 13వ తేదీన కర్నూలు శివారులో పోలీసులు స్వాధీనం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. ► పి.రుద్రవరంలో ప్రత్యర్థులను అంతమొందించేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసి ఆరుగురు నిందితులను ముందుగానే అరెస్ట్ చేసి కటకటాలకు పంపడమేగాక గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ► నాదస్వరం కాయ మహిమల పేరిట మోసాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. శభాష్ పోలీసు.. శాంతి భద్రత పరిరక్షణలో పోలీసు శాఖ తీసుకున్న పటిష్టమైన చర్యలకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి పలు ప్రసంశలతో పాటు పలు అవార్డులు దక్కాయి. ఎన్నికల్లో ఈ–సీజర్, ఈ–నాకాబంది, ఎలక్షన్ ఏపీ పోలీసు డాట్‌కామ్ వెబ్ అప్లికేషన్లకు సంబంధించిన టెక్నాలజీలను వినియోగిస్తూ చెక్‌పోస్టులల్లో ఈ–టెక్నాలజీ ద్వారా రియల్ టైం బేసిస్‌లో వాహన తనిఖీల ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అడ్డుకట్ట వేశారు. ఇందు కోసం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు 2019, గవర్నెన్స్ నౌ–ఇండియా పోలీసు అవార్డు 2020, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహించినందుకు స్వచ్ఛ్ సుర్వేక్షణ్ 2021 అవార్డు మున్సిపల్ కార్యాలయాల నుంచి అందుకున్నారు. అలాగే ఫిబ్రవరి 14న టెక్నాలజీ సభ అవార్డు, కోర్టు మానిటరింగ్ సిస్టమ్, డీపీఓ సమాచార్ నిర్వహణకు సంబంధించి రెండు స్కోచ్ అవార్డులు దక్కాయి. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు కూడా వ్యక్తిగతంగా స్కోచ్ అవార్డు, ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డును గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. -
పోలీసులు ప్రాణాలొడ్డి పని చేశారు: డీజీపీ
సాక్షి, అమరావతి: 2020లో పోలీసులు ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాణాలొడ్డి పని చేశారని తెలిపారు. జాతీయ స్ధాయిలో ఏపీ పోలీస్ యాప్‌కు బంగారు పతకం వచ్చిందన్నారు. బుధవారం ఆయన పోలీసు శాఖ వార్షిక నివేదిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోవిడ్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితంగా స్పందించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. పోలీసులు కోవిడ్ ఫ్రంట్ లైన్లో ఉండి ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 వేల మంది ఏపీ పోలీసులు మహమ్మారి బారిన పడగా, 109 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. పోలీసు శాఖకు ఎన్నో అవార్డులు 'పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రధాన లక్ష్యం. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండేలా పోలీసింగ్ తీసుకొచ్చాం. పోలీసులు, ఏపీ ప్రభుత్వం నిబద్ధత కారణంగా మాకు అవార్డులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకతతో పని చేస్తాం. ఇసుక, మద్యం పాలసీల నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేశాం. గత ఏడు నెలల్లో మద్యం అక్రమ రవాణాపై ఎస్ఈబీ ద్వారా 69,688 కేసులు నమోదవగా మొత్తం 1.94 లక్షల కేసులు ఎస్ఈబీలో నమోదు చేశారు' అని డీజీపీ తెలిపారు. (చదవండి: ఏపీ పోలీస్.. దేశానికే ఆదర్శం) వారం రోజుల్లోనే 16 వేల మందిని రక్షించాం 'మహిళా భద్రతకు సంధించిన కార్యక్రమాలు కూడా చాలా చేపట్టాం. దిశ పోలీసు స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు దిశ పోలీసులకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మొబైల్స్ ఇచ్చాము. దిశకు అనుబంధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి లలో ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేశాము. దిశ చట్టం వస్తే ఈ విధానం మొత్తం అత్యంత బలోపేతం అవుతుంది. దిశ యాప్ ఉన్న ఫోన్లు మూడు సార్లు షేక్ చేస్తే సమాచారం పోలీసులకు వెళుతుంది. ఏడు రోజుల్లో కేసుల విచారణ పూర్తవ్వాలి అనేది దిశ ఉద్దేశం. మహిళా భద్రతలో భాగంగా మహిళా మిత్ర అనేది ప్రారంభించాం. 25,298 మంది చిన్నపిల్లలను ఆపరేషన్ ముస్కాన్ ద్వారా సంరక్షించాము. 16,257 మంది పిల్లలను ఒక వారం రోజుల్లోనే సంరక్షించాం. స్పందన ప్రోగ్రామ్‌లో 21,827 కేసులు FIR చేశాం. జిల్లా ఎస్పీ, కమిషనర్, డీజీపీ కార్యాలయం, సీఎం కార్యాలయం వరకూ స్పందన వివరాలు చేరతాయి' అని డీజీపీ పేర్కొన్నారు. స్పందన ద్వారా వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు '52% మహిళలు స్పందన ద్వారా ఫిర్యాదులు చేశారు. రూల్ ఆఫ్ లా అనేది స్పందన ద్వారా సాధ్యం అయింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా 87 పోలీసు సేవలు నేరుగా ప్రజలకు ఇంటి వద్దనే అందుతాయి. ఎఫ్ఐఆర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ కోసం లంచం అడిగిన 6 కేసుల్లో పోలీసులను ఎసీబీ ట్రాప్‌లో పట్టుకున్నాం. ఈ రోజు వరకు 114581 ఎఫ్ఐఆర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్‌ను సిటిజన్ సేవ యాప్‌గా కూడా చెప్పవచ్చు. 5234 మిస్సింగ్ కేసులు పోలీసు సేవా యాప్‌లో సెర్చ్ చేశారు. 4876 గుర్తెరుగని మృతదేహాల విషయంలో సెర్చ్ జరిగింది. 7654 అరెస్టుల సెర్చ్ జరిగింది. సెకండ్ హ్యండ్ వెహికల్ మీద ఉన్న కేసుల విషయంలో 28,252 సెర్చ్‌లు జరిగాయి' అని గౌతమ్ సవాంగ్ తెలిపారు. (చదవండి: హోంగార్డులు నిస్వార్థ సేవకులు) -
మరోసారి బయటపడ్డ చంద్రబాబు కుట్ర రాజకీయం
-
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్న బాబు వ్యవహారం బయటపడింది. టీడీపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమావేశమైన ఆయన కేసులు పెట్టి పోలీసులను భయపెట్టండంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై ఐదారు కేసులు పెడితే.. వాళ్లే కాళ్ల బేరానికి వస్తారని చంద్రబాబు చెప్తున్న ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టెక్నాలజీని వాడుకుని ఆన్లైన్ ద్వారా కేసులు పెట్టాలని... టీడీపీ కార్యకర్తలను బాబు రెచ్చగొట్టారు. (చదవండి: చంద్రబాబు వద్దకు జిల్లా టీడీపీ పంచాయితీ ) -
ఏపీ పోలీస్‌కి అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ జాతీయస్థాయిలో 18 అవార్డులు ప్రకటించగా.. వాటిలో ఏకంగా ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ దక్కించుకుంది. దీంతో కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 108 జాతీయ అవార్డులను దక్కించుకుని ఏపీ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అవార్డులు దక్కించుకున్న వాటిల్లో సైబర్ మిత్ర (మహిళా భద్రత)తో పాటు అందుబాటులో నేరస్తుల వివరాలు (అఫెండర్ సెర్చ్), మహిళల భద్రత (ఉమెన్‌సేఫ్టీ) కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా, ఫ్యాక్షన్ గ్రామాల్లో నిందితుల వివరాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిన ‘సువిధ’ కార్యక్రమం అమలులో అనంతపురం జిల్లా, టెక్నాలజీలో పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ‘ప్రాజెక్ట్ టాటా’ కార్యక్రమం అమలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం స్కోచ్ అవార్డులను దక్కించుకున్నాయని ఏపీ పోలీస్ టెక్నాలజీ చీఫ్ పాలరాజు తెలిపారు. ఈ అవార్డుల్లో సైబర్ మిత్ర, ప్రొజెక్ట్ టాటా కార్యక్రమాలు రజత పతకాలు సాధించాయి. సీఎం వైఎస్ జగన్ అభినందనలు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత అభినందించారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా పనిచేస్తోందని సీఎం, హోంమంత్రి ప్రశంసించారు. ఏపీ పోలీస్ సమర్థత మరోసారి రుజువైంది జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడంలో 11 నెలల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఏపీ పోలీస్ శాఖ సమర్థత జాతీయ స్థాయిలో మరోసారి రుజువైంది. ఇన్ని అవార్డులు సొంతం చేసుకోవడం గర్వకారణం. ఇప్పటి వరకు ఏపీ పోలీస్ శాఖ సాధించిన వాటిల్లో రెండు స్వర్ణ, 13 రజత పతకాలు ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. మహిళల భద్రతకు భరోసానిచ్చేలా సైబర్ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టి సైబర్ నేరాల బాధిత మహిళలు పోలీస్ స్టేషన్లకు రాకుండా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాం. వారికి ఏ సమస్య వచ్చినా వాట్సాప్ నంబర్ 91212 11100కు, డయల్ 112, 181, 100కు ఫోన్ చేసే చెప్పేలా పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. – డీజీపీ సవాంగ్ -
277 ఫోన్లు: వారి ముఖాల్లో చిరునవ్వులు
సాక్షి, చిత్తూరు : పోగొట్టుకున్న, దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లను కనుక్కోవటమే కాకుండా తిరిగి వాటిని యజమానులకు అందించి చిత్తూరు పోలీసులు వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. చిత్తూరు పోలీస్ టెక్నికల్ అనాలిసిస్ వింగ్ దాదాపు 277 ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకుంది. దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే ఆ ఫోన్లను సోమవారం యజమానులకు ఇచ్చేసింది. దీనిపై సెల్ఫోన్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు పోలీసుల కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తమ ట్విటర్ ఖాతా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. A thankful phone owner commends the work done by the police team in retrieving his mobile phone which his father bought for his studies during the pandemic.@NTVJustIn @htTweets @TimesNow @TheHansIndiaWeb @aajtak @PTI_News @newsmint18 @NewsX @MirrorNow @IndiaNews24x7 @BTVI @dna pic.twitter.com/UwtyqxZBa0 — Andhra Pradesh Police (@APPOLICE100) November 30, 2020 -
నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు
సాక్షి, అమరావతి: నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు కావాలనే లక్ష్యంతో మనమంతా కృషి చేయాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వీధి బాలలను కాపాడటానికి ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ ముగింపు సందర్భంగా బుధవారం వెబినార్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు.. 13 జిల్లాల పోలీస్ అధికారులు, వీధిబాలలతో నిర్వహించిన వెబినార్‌ను గుంటూరు నుంచి హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించే ముస్కాన్ గొప్ప కార్యక్రమమన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 16,457 మంది బాలలను కాపాడామని చెప్పారు. -
ఏపీ పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు లేవు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తమ పోలీస్ శాఖ వచ్చాయని హోం మంత్రి మేకతోటి సుచరిత సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఈ అవార్డులు వచ్చాయన్నారు. శుక్రవారం వేలంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, వాసుపల్లి గణేష్ కుమార్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు విళ్ళూరు రావు, కనకా రెడ్డి సనపల భరత్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలీసులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, స్వేచ్ఛగా వారి పని వారు చేసుకుంటున్నారని తెలిపారు. ( యమ డిమాండ్.. ఓ సారి టేస్ట్ చూడండి ) రాష్ట్ర పోలీస్ శాఖ సంస్కరణలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ అవార్డులు పోలీసుశాఖపై మరింత బాధ్యతను పెంచాయని అన్నారు. గత ప్రభుత్వం పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుందని, గత ప్రభుత్వ హయాంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవని అన్నారు. అమరావతి రైతుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, అందుకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి అన్ని అంశాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ క్యాబినెట్లోనే కాకుండా.. నామినేటెడ్ పదవుల్లో కూడా ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. గీతం యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు తెలిపారు. -
మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ
సాక్షి, విజయవాడ : ఏపీ పోలీస్ శాఖ 24 గంటల్లోనే మరోసారి జాతీయ స్థాయి అవార్డులలో సత్తా చాటింది. గవర్నెన్స్ నేషనల్ పోలీస్ ప్రకటించిన 28 జాతీయ అవార్డులకు గాను ఏపీ పోలీస్ శాఖ 18 అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ -18, మహారాష్ట్ర-2, మధ్య ప్రదేశ్-2, గుజరాత్-2, బీగార్-1, జార్ఖండ్-1, ఛత్తీస్‌గఢ్-1 తెలంగాణ -1 అవార్డులు లభించాయి. 18 అవార్డులలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ 7 కైవసం చేసుకోగా, ప్రకాశం 2, అనంతపురం 2, తూర్పుగోదావరి, విజయవాడ సిటీ, శ్రీకాకుళం, విజయనగరం, కడప, గుంటూరు రూరల్, కర్నూల్ జిల్లాలకు ఒక్కొక్క అవార్డు వరించింది. ఈ ఏడాదిలో మొత్తం 103 అవార్డులను దక్కించుకొని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. దిశ అప్లికేషన్, పోలీస్ సేవా అప్లికేషన్, డిజిటల్ హెల్త్ అప్లికేషన్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీంతో మరోసారి ఏపీ పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏపీ పోలీస్ శాఖకు వరిస్తోన్న అవార్డులు ఏపీ పోలీస్ పని తీరుకు ప్రామాణికంగా భావిస్తున్నానని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. 48 గంటల్లో 72 అవార్డ్ లు రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే ఏపీ పోలీస్ మెరుగైన సేవలు అందిస్తోందనడానికి అవార్డులే నిదర్శనం అని తెలిపారు. (48 స్కోచ్ గ్రూపు అవార్డులు దక్కించుకున్న ఏపీ ) పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. పోలీస్ వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏపీ పోలీస్ బ్యాండ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఛీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్‌కు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వాగతం పలికారు. పోలీస్ బ్రాస్ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను అలరించింది. పోలీస్ బ్యండ్లో పైస్ బ్యాండ్ అనేది కొత్త విధానమని డీజీపీ అన్నారు. పోలీసులకు రక్షణ మాత్రమే కాకుండా కల్చరల్ అంశాలు కూడా తెలుసునని, ఈరోజు చూపించిన ఏపీ బ్యాండ్ లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో తమ జీవితాలను అర్పించిన పోలీసులకు ఈ విధంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ ఆశించిన అంచనాలను చేరేలా బాధ్యతలను నిర్వహించాలని చెప్పారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ పోలీస్ అద్భుతంగా పనిచేశారని ఆయన కొనియాడారు. బాధ్యతలు నిర్వహించడంలో అసువులు బాసిన వారి కుటుంబాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నామని తెలిపారు. -
ఏపీ పోలీస్ నంబర్ వన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్’ అవార్డుల్లో సగానికిపైగా కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. దిశ, పోలీస్ సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా.. మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో భాగంగా బుధవారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ వివరాలను ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. స్కోచ్ గ్రూప్ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్ర పోలీస్ శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్(4), హిమాచల్‌ప్రదేశ్(3), మధ్యప్రదేశ్(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్(2) ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి. దిశ మొబైల్ అప్లికేషన్ కు వచ్చిన స్కోచ్ అవార్డు పోలీస్ శాఖకు సీఎం అభినందనలు.. ఏడాదిలోనే 85 జాతీయ స్థాయి అవార్డులను అందుకున్న ఏపీ పోలీస్ శాఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. అలాగే ఏపీ పోలీస్ టెక్నాలజీ విభాగాన్ని, అవార్డులు అందుకున్న పలు విభాగాల పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అవార్డులు అందుకుని, రెండోసారి కూడా జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన ఏకైక ప్రభుత్వ విభాగం ఏపీ పోలీస్ శాఖ కావడం గర్వంగా ఉంది. మరింత జవాబుదారీతనంతో ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నాం. – డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశ, పోలీస్ సేవా భేష్.. ఏపీ పోలీసులు తీసుకొచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్, పోలీస్ సేవా యాప్‌లకు బంగారు పతకాలు లభించాయి. మరో 11 విభాగాల్లో అందిస్తున్న సేవలకు రజత పతకాలు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ.. ఇప్పుడు వచ్చిన వాటితో కలిపి మొత్తం 85 అవార్డులతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. దిశ, దిశ సంబంధిత విభాగాల్లో అందిస్తున్న టెక్నాలజీ సేవలకు 5 అవార్డులు వచ్చాయి. కోవిడ్ సమయంలో అందించిన మెరుగైన సంక్షేమానికి 3 , ఏపీ పోలీస్ టెక్నికల్ విభాగానికి 13 అవార్డులు, సీఐడీకి 4, కమ్యూనికేషన్‌కు 3, విజయవాడకు 3, కర్నూలు జిల్లాకు 3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలకు రెండేసి చొప్పున అవార్డులు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణా జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కాయి. -
జాతీయ స్థాయిలో నం.1గా ఏపీ పోలీసు శాఖ
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగాలపై స్కొచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో భాగంగా జాతీయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 84 అవార్డులను ప్రకటించిగా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 48 అవార్డులను దక్కించికుంది. కేరళ-9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్-4, తెలంగాణ-1, తమిళనాడు-1 అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఏపీ పోలీసు శాఖ వరుసగా రెండవ సారి టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులు సాధించిన ఏపీ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులు కైవసం చేసుకోని మొత్తం 85 అవార్డుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అత్యధిక అవార్డులు దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను అభినందించారు. మహిళా రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన దిశ, దాని సంభందిత విభాగంలో అందిస్తున్న టెక్నాలజీ సేవలకుగాను 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల ప్రజల కోసం 87 సేవలతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్‌కు గాను అవార్డు లభించింది. ఇక కోవిడ్ సమయంలో అందించిన, అందిస్తున్న మెరుగైన సంక్షేమానికి గాను 3 అవార్డులు, టెక్నికల్ విభాగంలో -13 అవార్డులు, సీఐడీ- 4, కమ్యూనికేషన్-3, విజయవాడ, కర్నూల్ జిల్లాకు -3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాకు-2, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు,గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణ జిల్లాకు- 1 అవార్డులు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలో రికార్డ్ స్థాయిలో 85 అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగంగా ఏపీ పోలీసు శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో, త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, సీఎం జగన్ తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు. ఇక సీఎం పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
శభాష్.. పోలీస్
సాక్షి, అరావతి: శాంతి భద్రతల పరిరక్షణతోపాటు విపత్తు వేళ వరద ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవలు శభాష్ అనిపించుకుంటున్నాయి. నాలుగు రోజులుగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిర్విరామంగా సేవలందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. గురువారం వరద ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో.... వరద నీటిలో చిక్కుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులంకలో బిడ్డకు జన్మనిచ్చిన వాసిమల్ల ప్రసన్న అనే మహిళను పోలీసులు ప్రత్యేక రోప్ (బలమైన పెద్ద తాళ్లు) సాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందేలా సహకరించారు. వరద నుంచి తల్లీ బిడ్డను కాపాడిన ఎస్ఐ ఉమేష్, సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట విద్యానగర్‌లో వరదలో చిక్కుకున్న బాధితులను ఎస్ఐ చిన్నబాబు సిబ్బంది సహకారంతో కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలో కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై బండరాళ్లు పడటంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణం స్పందించి వీటిని తొలగించిన స్థానిక పోలీసులను ప్రజలు అభినందించారు. విశాఖ–అరకు రోడ్డులో దముకు, శివలింగాపురం ప్రాంతాల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఎస్ఐ అనంతగిరి, సిబ్బంది స్థానికుల సహకారంతో తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు ఎస్ఐ ఎన్ఆర్ఎల్ రావు తన సిబ్బందితో కలసి వరద ప్రాంతాల్లో బాధితులకు 200 వెజ్ బిర్యానీ, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోని రామవరంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని హైవే మొబైల్ టీమ్ డ్రైవర్(హోంగార్డు) అర్జున్ బుధవారం కాపాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. -
ఏపీ పోలీస్ సరికొత్త యాప్
-
పోలీసులంటే భయం వద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని.. వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ సరికొత్త సేవా యాప్‌ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులు బాగా తగ్గించగలిగామని, పోలీసులు అందించే సేవలను ఒకే ఫ్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఏ దశలో కేసు ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ యాప్ తగ్గిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్‌శాఖకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. -
దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్
సాక్షి, అమరావతి : పాలనలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్‌ను పరిచయం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన కొత్త యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతోపాటు ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. (సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు కళ్లెం) దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత,.. సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు ఎన్వోసీలు, లైసెన్సులు,పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను కూడా అందుబాటులో ఉంటాయి. మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో మహిళల కు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్త్ పాటు డీజీపీ గౌతవ్ సవాంగ్ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాప్ విశిష్టతను సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ’రాష్ట్రంలోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (ఎస్ఓఎస్) స్వల్ప వ్యవధి లోనే పదకొండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించగా 117 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వెహికల్స్ (రేస్) విధానం అందుబాటులో ఉంద’న్నారు. నిరంతర నిఘా కోసం డ్రోన్ల నుండి ప్రత్యక్ష ప్రసారం. అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు & స్మార్ట్ఫోన్లతో అనుసంధానం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు మరియు మ్యాన్‌ప్యాక్‌లు) ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్ సేవ యాప్ 87 రకాల సేవలు శాంతి భద్రతలు.. ♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు ♦ఎఫ్ఐఆర్ స్థితిగతులు, డౌన్లోడ్ ♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు ♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు ♦అరెస్టుల వివరాలు ♦వాహనాల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ సేవలు.. ♦ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్ సర్వీసు(ఎల్ఎంఎస్) , ఇ–బీట్) ♦ఈ–చలానా స్టేటస్ పబ్లిక్ సేవలు.. ♦నేరాలపై ఫిర్యాదులు ♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు ♦ఎన్వోసీ, వెరిఫికేషన్లు ♦లైసెన్సులు, అనుమతులు ♦పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ రహదారి భద్రత.. ♦బ్లాక్ స్పాట్లు ♦యాక్సిడెంట్ మ్యాపింగ్ ♦రహదారి భద్రత గుర్తులు ♦బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు ప్రజా సమాచారం.. ♦పోలీస్ డిక్షనరీ ♦సమీపంలోని పోలీస్‌స్టేషన్ ♦టోల్‌ఫ్రీ నంబర్లు ♦వెబ్సైట్ల వివరాలు ♦న్యాయ సమాచారం ♦ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు -
ఆరోపణలపై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ
సాక్షి, అమరావతి: గత కొద్ది రోజులుగా పోలీసు శాఖపై వస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ బుధవారం స్పందించింది. 14 నెలల్లో 24 జాతీయ స్థాయి అవార్డులు సాధించిన పోలీసు శాఖపై విమర్శలు భావ్యం కాదని పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికింది. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, చంద్రగిరిలో నమోదైన కేసులపై వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరిలో అరెస్ట్ అయిన రాజేష్ చౌదరిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని తెలిపింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉత్తమ పోలీస్ సేవలందిస్తున్నామని తెలిపింది. 14 నెలలుగా రాష్ట్ర ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నామని వ్యాఖ్యానించింది. (అందరికీ రుణపడి ఉంటాం: డీజీపీ) -
ఏపీ పోలీసుల తీరును అభినందించిన జాతీయ మహిళా కమిషన్
-
మరి మీరు ఎటువైపు?: నాని
సాక్షి, అమరావతి: నేడు (జూన్ 26న) అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో, వాటికి బానిస అయితే జీవితాలు ఎంత ప్రమాదకరంగా మారతాయో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రజల్లో అవగాహన కలిగించేలా వీడియోలను రూపొందించి విడుదల చేసింది. నేచురల్ స్టార్ నానితో కలిసి ఏపీ పోలీస్ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రజలకు ముఖ్యంగా యువతకు నాని ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. (మనసును కలిచివేస్తోంది: చిరంజీవి) ‘మీరు జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగితే చూడాలిన మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న సమాజం ఇలా చాలా మంది ఎదురుచూస్తుంటారు. అయితే మీరు ఎదగకుండా పాతాళానికి పడిపోతే చూడాలని ఒకడు ఎదురుచూస్తున్నాడు. అదే డ్రగ్స్. ఆ డ్రగ్స్ వైపు వేసే ఒకే ఒక తప్పటడుగు మీ చేతులోంచి మీ జీవితంపై మీకున్న మొత్తం కంట్రోల్‌ను లాగేసుకుంటుంది. ఆ కంట్రోల్ మొత్తం దాని చేతుల్లోకి వెళుతుంది. మిమ్మల్ని డ్రగ్స్‌కు బానిసల్ల మార్చి మీ నుంచే డబ్బులను సంపాదించాలనుకునే మాఫియాలు, బ్లాక్మార్కెట్లు చాలానే ఉన్నాయి. అవన్నీ ఒకవైపు.. వాటన్నింటి నుంచి మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతున్న వేలాది పోలీసులు ఒక వైపు.. మీరేవైపు? వాళ్లు చీకటితో చేస్తున్న యుద్దంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. వాళ్లకు కొంచెం సహాయం చేద్దాం. మీ దగ్గర లేదంటే మీ స్నేహితుల దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా.. లేదంటే మీకేమైనా తెలిస్తే అది పోలీసులతో షేర్ చేసుకోండి. మీ పేరు కూడా బయటకు రానివ్వరు. అందరం కలిసి ఈ చీకటిపై పోరాడుదాం.. జైహింద్’ అంటూ నాని పేర్కొన్నాడు. ఇక నానితో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్ తేజ్, ఇతర ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోలు రూపొందించి విడుదల చేశారు. (నాన్న అంటే ప్రేమ.. ధైర్యం) Which Side are you #DrugsMafia or #Police ? I’m With #Police says @NameisNani#LetsFightDarkness #SayNoToDrugs #APPolice#International_Day_Against_Drug_Abuse_and_Illicit_Trafficking pic.twitter.com/0D3Vjg8cv1 — AP Police (@APPOLICE100) June 26, 2020 Say no to drugs and yes to life. @IamSaiDharamTej joins hands with AP Police in this fight against drug menace. It’s your turn now, join us in in this fight, every information is important. #antidrugsday #APPolice #AndhraPradesh pic.twitter.com/kE0nkfiou9 — AP Police (@APPOLICE100) June 26, 2020 -
మాస్క్‌ల వినియోగంపై విస్తృత అవగాహన
నెల్లూరు(క్రైమ్): పోలీస్ శాఖలో కరోనా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారినపడి ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నతా«ధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించడంతో పాటు పోలీస్స్టేషన్లలో కరోనా సోకకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ద్రావణం పిచికారీ లాక్డౌన్ ప్రారంభం నుంచి పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వర్తించారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, పలువురికి కరోనా సోకడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్ భూషణ్ కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సోడియం హైపోక్లోరైట్‌తో పిచికారీ చేయిస్తున్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ విధులు కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. స్టేషన్లలో శానిటైజర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, ఇతరులు విధిగా చేతులను శుభ్రం చేసుకున్నాకే అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారి సమస్యలను వినడం, ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా వివిధ కేసుల్లో నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చిన వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. స్టేషన్ బయటే షామియానాలు, కుర్చీలు వేసి ఫిర్యాదుదారులను కూర్చోబెడుతున్నారు. అక్కడే వారి సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో తగు జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. మాస్క్‌ల వినియోగంపై విస్తృత అవగాహన కరోనా విస్తరించకుండా ప్రణాళికలు రూపొందిస్తూనే ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాస్కుల్లేకుండా రోడ్లపైకి వచ్చే పాదచారులు, వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు వారికి మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వేళ తగు జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము రక్షించుకోవడంతో పాటు ప్రజారక్షణలో పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
గ్యాస్ లీక్.. ఆ వదంతులు నమ్మొద్దు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్ లీక్ అయినట్టు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొట్టిపారేశారు. ఆ వదంతులు అన్ని అవాస్తవమని చెప్పారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విటర్ ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్‌చేశారు. పరిశ్రమలో మెయింటెనెన్స్ టీమ్ మరమ్మతులు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే కొంత ఆవిరిని బయటకు పంపించారని.. అక్కడ రెండో సారి ఎటువంటి గ్యాస్ లీక్ జరగలేదని స్పష్టం చేశారు. (చదవండి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) మరోవైపు ఎల్జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్ లీక్ అయిందని వదంతులను నమ్మవద్దని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించిన అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడారు.. కంపెనీలో గ్యాస్ లీక్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఆర్ఆర్ వెంకటాపు, బీసీ కాలనీల్లోని ప్రజలు సమీప శిబిరాల్లో క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో మినహాయిస్తే విశాఖలోని ఇతర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.(చదవండి : గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి..) -
అందరికీ రుణపడి ఉంటాం: డీజీపీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. డీజీపీ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై నిఘా కోసం అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినట్లు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షించినట్లు చెప్పారు. (సమన్వయంతో పోరాడుతున్నాం) 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశామని, జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 28 రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనని కొనియాడారు. కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటామన్నారు. (కోవిడ్ పరీక్షల్లో.. మరింత దూకుడు) -
గౌస్ మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్
సాక్షి, గుంటూరు : జిల్లాలోని సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ట్విటర్ వేదికగా స్పందించింది. పట్టణంలోని టింబర్ డిపో నిర్వాహకుడు షేక్ మహ్మద్ గౌస్(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్ పోస్టు వద్ద ఎస్ఐ రమేశ్ ఆపి సాధరాణ విధుల్లో భాగంగా తనిఖీ చేసారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్ పడిపోవడంతో తండ్రి షేక్ మహ్మద్ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందారు. దీనిపై మంగళవారం ట్విటర్ ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. (సత్తెనపల్లిలో యువకుడి మృతి) ‘గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. ఈ సంఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్ చేశాం. మరణించిన వ్యక్తి బాల్యం నుండి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపదుతున్నారు. ఆపరేషన్ చేసి స్టెంట్లు అమర్చారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పంచనామాలో గుర్తించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డీజీపీ డిపార్ట్మెంటల్ విచారణకు కూడా ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలు పాటిస్తున్నాము’ అని ట్విటర్లో వివరించారు. -
వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట!
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనాకు మందు లేకపోవడంతో భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే కీలకంగా మారింది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు పిలుపుచ్చాయి. అయితే, స్వీయ నియంత్రణతోనే కోవిడ్-19పై విజయం సాధిస్తామనేది జగమెరిగిన సత్యం. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలువురు కళాకారులు, సెలబ్రిటీలు తమదైన శైలిలో పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏఎస్పీ సరిత అలాంటి ప్రయత్నమే చేశారు. సీఐడీ ఎస్ఐ శ్రీహరి రచించిన పాటను ఆమె తన గళంతో అందర్ని ఆకట్టుకునేలా పాడారు. ‘వద్దురా అన్న... బయటకు రాకురోయన్న.. వద్దన్న నువ్వొస్తే.. కాటేస్తుందిరా కరోనా’ అంటూ సరిత పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కరోనాపై పోరాటంలో పోలీసులు ముందున్నారని, ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. (చదవండి: కరోనా పోరు: విజేత ఆ ఊరు) (చదవండి: కరోనా అలర్ట్ : హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు..) -
ఆకాశవీధిలో నిఘా నేత్రం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను రక్షించే క్రమంలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైనే రాత్రి పగలు గస్తీ కాస్తున్న పోలీసులు.. మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేయడానికి డ్రోన్లను రంగంలోకి దించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరిధిలోని టెక్ సర్వీసెస్ విభాగం పర్యవేక్షణలో ఇప్పుడు రాష్ట్రంలోని రెడ్ జోన్లలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలోని గుంటూరు, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురంలోని కంటైన్మెంట్ జోన్లలో పోలీసు అధికారులు ఆదివారం డ్రోన్లతో స్థానిక పరిస్థితిని పర్యవేక్షించారు. డ్రోన్లతో నిఘా వెనుక వ్యూహం ఏమిటంటే.. ► రాష్ట్రంలో రెడ్జోన్లు, ఆరెంజ్ జోన్లు వంటి ఇబ్బందికరమైన ప్రాంతాల్లోను పోలీసులు నిఘా మరింత పెంచారు. అయితే ప్రమాదకరమైన ప్రాంతాల్లో పోలీసులు స్వయంగా వెళ్లి నిత్యం పరిశీ లించడం ఇబ్బందికరంగా మారిన నేప థ్యంలో డ్రోన్లను రంగంలోకి దించారు. ► పోలీస్ శాఖలోని టెక్ సర్వీసెస్ విభాగం పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 52 డ్రోన్లను వినియోగిస్తున్నారు. రాష్ట్రం లోని పట్టణాలతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లోని రెడ్జోన్లలో డ్రోన్లతో నిఘా పెట్టారు. ► డ్రోన్ సమాచారంతో లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించే వారిపై సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ► కంటైన్మెంట్ ఏరియాల్లో రోజుకు మూడు పర్యాయాలు, మూడేసి కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఆకాశంలో తిరుగుతూ వీడియోను చిత్రీకరిస్తున్నాయి. ఎవరైనా బయట గుంపులుగా తిరుగుతున్నారా? డ్యూటీలో ఉన్న పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? లాక్డౌన్ ఎలా అమలు జరుగుతోంది? అనే విషయాలను తెలుసుకునేందుకు డ్రోన్లు దోహదపడుతున్నాయి. ► ఉదయం లాక్డౌన్ సడలింపు సమయంలోను, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అవి రెండు నుంచి ఐదు నిముషాల పాటు వీడియోలు చిత్రీకరిస్తున్నాయి. ► డ్రోన్ల వీడియోలను పోలీస్ ప్రధాన కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఆయా వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసు అధికారులు తదుపరి చర్యలకు ఆదేశాలిస్తున్నారు. -
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్: చిరు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. కరోనా నియంత్రణలో పోలీసుల కృషి అమోఘమని కొనియాడిన చిరంజీవి సామాన్య జనం వారికి సహకరించాలని కోరారు. ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చిరు తన అధికారిక ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతీ ఒక్కరికి వేడుకుంటున్నాను. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. ఈ కరోనాను తుదిముట్టించడంలో, ఆంతమొందించడంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలి సహకరించాలి. పోలీసు వారు చేస్తున్న అమోఘమైనటువంటి ఈ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నా.. జైహింద్’అంటూ చిరు ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతు చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోపై తెలంగాణ డీజీపీ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. #SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk — Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020 చదవండి: చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మొబైల్‌తో 'ఢిల్లీ' డేటా
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో రాష్ట్ర పోలీసులు మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి అంతా బాగా జరుగుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ ముప్పు పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అసలు ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎవరు? ఎంత మంది ఉన్నారు? వంటి ప్రాథమిక సమాచారం కూడా తెలియకపోవ డంతో తొలుత పోలీసులు డిజిటల్ డేటా విశ్లేషణతో కూపీలాగారు. దీంతో ఢిల్లీలో ప్రార్థనలకు దేశవ్యాప్తంగా 13,702 మంది వెళ్లా రని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అనంతరం ఏపీకి చెందిన వారి ఫోన్ల ఆధారంగా ఆరా తీసి మన రాష్ట్రానికి చెందిన వారు 1,085 మంది అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. టెక్నాలజీని ఎలా వాడుకున్నారంటే.. ► ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. ► అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి వెళ్లినవారి వివరాలను సేకరిం చాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. ► టవర్ డంప్ ఎనాలసిస్ టెక్నాలజీ ద్వారా సెల్ టవర్ పరిధిలో ఎన్ని మొబైల్ ఫోన్లు పనిచేశాయో వాటి సిగ్నల్స్‌ను బట్టి అంచనా వేశారు. ఎన్ని మొబైల్ ఫోన్లు ఉంటే అంత మందిగా ప్రాథమిక అంచనా కొస్తారు. ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని మార్చి 10 నుంచి 20 వరకు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? వంటి కీలక ఆధారాలు సేకరిం చారు. ఆ ప్రాంతంలో ఉన్న మొబైల్ నెట్వర్క్ టవర్ల పరిధిలో మొబైల్ ఫోన్ల సిగ్నల్స్‌ను విశ్లేషించారు. ► డిజిటల్ డేటా ఎనాలసిస్ ద్వారా గుర్తించిన వ్యక్తికి చెందిన మొబైల్ సిగ్నల్, కాల్ లిస్ట్‌ను బట్టి ఏ తేదీలో ఎక్కడ ఉన్నాడు? ఆయా తేదీల్లో టవర్ లొకేషన్, అదే టవర్ పరిధిలో ఎంత మంది మొబైల్ ఫోన్లు కలిగిన వారున్నారు అనేది ఎనాలసిస్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన గుంటూరుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే చీరాలలో మరో పాజిటివ్ కేసు రావడంతో పోలీసులు వారిద్దరి మొబైల్ నెంబర్ల ఆధారంగా డిజిటల్ డేటా విశ్లేషణ చేశారు. వారి కాల్ లిస్ట్ ఆధారంగా వారు ఏయే తేదీల్లో ఏ టవర్ పరిధిలో ఉన్నారు? వారికి సమీపంలో మొబైల్ ఫోన్లు కలిగిన వారు ఎంత మంది ఉన్నారు? వారు ఎంత మందితో మాట్లాడారు? వారి ఫోన్ లొకేషన్లో ఇంకా ఎన్ని మొబైల్స్ ఫోన్లు పనిచేశాయి? వంటి వివరాలు సేకరించారు. ఆయా మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా వారి వివరాలను డిజిటల్ డేటా పరిజ్ఞానంతో విశ్లేషించి వివరాలు తెలుసుకున్నారు. -
బయట తిరిగేవారికి యముడు విధించే శిక్ష?
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కరోనా విజంభిస్తున్న నేపథ్యంలో.. రోజులు బాలేవు, ఇంట్లో నుంచి బయటకు రాకండ్రా నాయనా అని ప్రభుత్వాలు చిలక్కు చెప్పినట్లు చెప్పాయి. ఆహా.. వింటే కదా.. దర్జాగా ఏదో షికారుకు వెళ్లినట్లు బయలు దేరుతున్నారు. ఉప్పులు, పప్పులంటూ రోడ్డెక్కుతున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వారి పప్పులుడకనిస్తారా? మంచిగా చెప్తే వినేరోజులు పోయాయనుకుని లాఠీ ఝుళిపిస్తున్నారు. దెబ్బకు కుయ్యో, మొర్రో అంటూ బయట తిరుగుతున్న నిర్లక్ష్య జనాలు ఇళ్లకు పరుగెత్తుతున్నారు. అయితే "తినగ తినగ వేప తియ్యునుండు" అన్న చందంగా కొందరు దెబ్బలు తినడానికైనా రెడీ కానీ అస్తమానం ఇంట్లో ఉండటం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. (కదిలిస్తే కన్నీళ్లే!) దీంతో అధికారులు ఇప్పుడు మరో ఉపాయాన్ని ఆలోచించి వెంటనే యముడిని రంగంలోకి దింపారు. గడప దాటకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో జనాలకు సూచనలిప్పిస్తున్నారు. యముడి వెంట చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. "మీ కర్మ ఉంటే బయటకు రండి.. సంతోషంగా ఉంటే ఇంట్లో ఉండండి. దయచేసి పోలీసుల మాటలను ఆచరించండి" అని కోరుతున్నాడు. ఇంతకీ ఈ అరుదైన దృశ్యం కర్నూలులోని డోన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఆ ప్రాంత సీఐ సుధాకర్ రెడ్డి ఈ వినూత్న ప్రచారానికి తెరదీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (అన్నం పంచే అబ్బాయి) ఇక మరో వీడియోలో రోడ్లపై సంచరిస్తున్న ఓ వ్యక్తిని యమధర్మరాజు అడ్డంగా పట్టేసుకున్నాడు. ఈ వ్యక్తి ఎన్నిసార్లు బయట తిరిగాడంటూ చిత్రగుప్తుడిని వివరాలు కోరగా అతడు అధికారుల మాట వినడం లేదని దొంగతనంగా బయటకు వస్తున్నాడని పేర్కొన్నాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన అతన్ని నూనెలో కాల్చి వేయించాల్సిందిగా గమ్మత్తైన శిక్షను విధించాడు. ఇదిలా ఉంటే గతంలోనూ పోలీసులు వినూత్న ప్రచారాలు చేపట్టారు. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ బయటకు రావద్దంటూ పాటలు పాడి విన్నవించుకున్నారు. వైరస్ హెల్మెట్లు ధరించి భయపెట్టారు. అయినప్పటికీ జనాలు వారి మాటను పెడచెవిన పెడుతూ బయట విచ్చలవిడిగా తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. (డ్యూటీ కోసం వందల కిమీ నడిచిన పోలీస్) -
పెళ్లయి నెల రోజులే అయినా..
సమాజమంతా కరోనాకు భయపడుతుంటే.. కొందరు మాత్రం యోధుల్లా పోరాడుతున్నారు. జనాలకు రక్షణ కవచాల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుటుంబాలను వదిలి, ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అందులో కొందరు వీరు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పగలు రాత్రి కర్తవ్య దీక్షలో.. జి.సిగడాం ఎస్ఐ కె.శిరీష మండలంలో 144 సెక్షన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రజలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో చర్యలు చేపట్టారు. లాక్డౌన్ ఎలా అమలవుతోందో పర్యవేక్షించేందుకు గస్తీ ఏర్పాటు చేశా రు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మండలమంతా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజా సేవ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కర్తవ్య దీక్షలో గడుపుతున్నారు. –జి.సిగడాం పెళ్లయి నెల రోజులే అయినా.. కొత్తూరు: పెళ్లయి నెల రోజులే అయ్యింది. అప్పుడే ప్రజలకు ఆపద దాపురించింది. ఈ ఆపత్కా లంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ముందుకువెళ్తున్నారు కొత్తూరు ఎస్ఐ బాలకృష్ణ. బాలకృష్ణకు పెళ్లి జరిగి నెల గడుస్తోంది. ఇంతలో లాక్డౌన్ ప్రకటించడం, దీన్ని సమర్థంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులపై పడడం జరిగింది. అప్పటి నుంచి బాలకృష్ణ నిరంతరం విధుల్లోనే ఉంటున్నారు. నిత్యం తన సిబ్బందితో రోడ్లపై తిరుగుతూ జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణంలో ప్రచారం ఎల్.ఎన్.పేట: ఈయన పేరు సనపల కిరణ్‌కుమార్. ఊరు ఎల్.ఎన్ పేట మండలం చింతలబడవంజ సెంటర్. ఇదే మండలం లక్ష్మీనర్సుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో మేల్ హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా(కోవిడ్–19) విజృంభిస్తుందని ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళుతూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. తన బైక్‌పై ‘కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలంటే దయచేసి ఇంట్లోనే ఉండండి’ అంటూ బోర్డు ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో ఎవరూ ఆకలితో ఉండకూడదు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా నిర్వహించిన లాక్డౌన్, 144 సెక్షన్ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారు, పేదలు, నిరాశ్రయులు అక్కడక్కడా ఉన్నారని, వారికి శ్రీకాకుళం, ఇతర మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలకు వారు వెళ్లి తాత్కాలిక పునరావాసం పొందవచ్చని, శ్రీకాకుళంలో ఉన్నవారికి రెడ్‌క్రాస్ వారు ఆహారం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. -
నల్లగొండ సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కార్లు, ద్విచక్రవాహనాల పై వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురువారం నల్లగొండ జిల్లాలో ఏపీతో సరిహద్దులు ఉన్న రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌వాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ఒకేసారి వేల సం ఖ్యలో ప్రజలు రావడంతో దామచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద ఏపీ పోలీసులు వారిని కొద్దిసేపు అడ్డుకుని అనంతరం షరతులతో రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామునుంచే ద్విచక్రవాహనాలు, కార్లల్లో ఏపీకి వెళ్లేందుకు జనం వచ్చారు. చెక్‌పోస్టు వద్ద నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) చూసిన అనంతరం తెలంగాణ పోలీసులు వారు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణానది ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వీరిని కొద్దిసేపు అడ్డుకున్నారు. సమస్య తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలసి వాడపల్లి చెక్ పోస్టును సందర్శించారు. పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడంతో ప్రజలు వచ్చేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారని, ఇకపై సరిహద్దును మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. క్వారంటైన్‌కు వెళతామంటేనే అనుమతి ఏపీకి సరిహద్దుగా ఉన్న నాగార్జునసాగర్‌పై వంతెన దాటగానే గుంటూరు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు, మెస్సులు మూతపడడంతో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తీసుకుని బుధవారం రాత్రే ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు చొప్పున బయలుదేరి తెల్లారే సరికల్లా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. మరికొంతమంది అద్దెకార్లు, టాటా సుమోల్లో ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వారి వాహనాలను మొదట నిలిపివేశారు. దీనిపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుంటూరు జిల్లా ఎస్పీ విజయారావు సరిహద్దుకు చేరుకుని 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళతామంటే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే, ఈ షరతు నచ్చని చాలామంది తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మరికొంత మంది దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు నుంచి ఏపీలోకి వెళ్లొచ్చని వాడపల్లికి వచ్చారు. -
ఏపీ పోలీస్.. సూపర్
సాక్షి, అమరావతి: మన ఆంధ్రప్రదేశ్ పోలీస్.. సూపర్. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. అనేక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ పోలీసులకు లభించిన అవార్డులను గమనిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం అమలవుతోందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల సేవలకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపును పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు గత ఎనిమిది నెలల్లోనే ఏకంగా 20 అవార్డులు దక్కాయని గుర్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ.. స్కోచ్, జీఫైల్స్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తదితర ప్రముఖ సంస్థలు ఈ అవార్డులు అందించాయని చెబుతున్నారు. శాంతిభద్రతల నిర్వహణలో రాజీ లేకుండా విధులు నిర్వర్తిస్తున్న తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పోలీసు అధికారుల సంఘం నేతలు అంటున్నారు. (ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు) ఏపీ పోలీసుల పనితీరుకు ఇవే కొలమానం ► 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డులు అందుకున్నారు. ► జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 9 స్కోచ్ అవార్డులు ఏపీ పోలీస్ శాఖకు లభించాయి. పరిపాలన, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులకు, ఆయా శాఖలకు స్కోచ్ సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ► బాధితులకు తక్షణ న్యాయం అందించేలా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమానికి జీఫైల్స్ గవర్నెన్స్ అవార్డు లభించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్లెస్ నుంచి రాష్ట్ర పోలీసులు రెండు అవార్డులు అందుకున్నారు. నూతన సాంకేతిక పద్ధతులతో శిక్షణ, ఉత్తమ వినూత్న కార్యక్రమాల విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి. ► డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సైబర్ ఫోరెన్సిక్ శిక్షణ విభాగంలో ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం అవార్డు అందుకుంది. అత్యుత్తమ సామర్థ్యం చూపుతున్నందుకు ఈ అవార్డు దక్కింది. ► ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన టెక్నాలజీ సభ అవార్డుల్లో ఏపీ పోలీసులకు ఐదు అవార్డులు లభించాయి. ఏపీ పోలీసులకు ప్రధాని అభినందన రాష్ట్రంలో అమలవుతున్న పోలీస్ వీక్లీ ఆఫ్, స్పందన వంటి కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఏపీ పోలీస్ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ స్పందన, వీక్లీ ఆఫ్ గురించి తెలుసుకొని అభినందించారు. బాబుకు పోలీసులు టెర్రరిస్టులుగా ఎందుకు కనిపిస్తున్నారు? చంద్రబాబు పాలనలో అద్భుతంగా పనిచేశామని పొగిడిన చంద్రబాబుకు ఇప్పుడు పోలీసులు టెర్రరిస్టులుగా ఎందుకు కనిపిస్తున్నారు? అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ శాంతిభద్రతల కోసమే పోలీసులు పనిచేస్తారు. ఈ విషయం 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా? – జనకుల శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పక్కా ప్లాన్‌తో మాచర్లలో బుద్దా,బొండా ఎంట్రీ
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి కింది స్థాయి క్యాడర్ కూడా వెనుకడుగు వేసింది. బరిలో నిలవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. దీంతో పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రశాంతగా వాతావరణాన్ని రణరంగంగా మర్చే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా వెల్దుర్తి మండలం బోదలవీడులో తమ పార్టీ కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు సాకుతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను చంద్రబాబు మాచర్లకు పంపారు. ఓ పథకం ప్రకారం టీడీపీ నాయకులు గత బుధవారం మాచర్లకు వెళ్లారు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు ఆగ్రహానికి గురై ఆవేశంలో టీడీపీ నాయకుల కారుపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నాయకులే వ్యూహం ప్రకారం వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు పథకం ప్రకారం తమపై దాడి చేశాయని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పోలీసుల వైఫల్యం ఉందని కలరింగ్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మాచర్ల ఘటనపై రూరల్ ఎస్పీ, మాచర్ల టౌన్ సీఐలపై చర్యలకు ఈసీ సిఫార్సు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఎన్నికల ప్రక్రియను భంగం కలిగించాలని టీడీపీ పన్నిన కుట్రలో పోలీసులు బలయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో.. పథకం ప్రకారం టీడీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ఏ చిన్న ఘటనలు చోటు చేసుకున్నా వీడియోలు ఫొటోలు చిత్రీకరించేలా వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల రెచ్చగొట్టే చర్యలకు ఆవేశంతో స్థానికులు దాడి చేయడానికి బుద్దా, బొండా ఉమాల కారును వెంబడిస్తుంటే వారి వెనుక కారులో ప్రయాణిస్తున్న వారు వీడియోలు చిత్రీకరించారే తప్ప పోలీసులకు ఫోన్ కూడా చేయలేదు. సాధారణంగా అపాయం, ప్రాణాపాయ సమయంలో ఎవరైనా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రక్షించాలని కోరతారు. అయితే మాచర్ల ఘటనలో టీడీపీ నాయకులు అలాంటి ఆలోచననే చేయలేదు. సున్నిత ప్రాంతం అని తెలిసి కూడా.. పల్నాడు ప్రాంతం అతిసున్నితమైనదని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయినా గుంటూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులను కాదని కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను మాచర్లకు పంపడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శలొస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఏదైనా నియోజకవర్గంలోకి వెళ్లే ముందు ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గ ఇన్చార్జిలకు సమాచారం ఇస్తారు. అయితే టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమ మాచర్లకు వస్తున్న విషయం తనకు తెలియదని ఆ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు పోలీసులకు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పల్నాడు ప్రాంతానికి వెళ్లి కుట్ర పూరితంగా వ్యవహరించిన టీడీపీ నాయకులు పోలీసుల వైఫల్యం వల్లే తమపై దాడి జరిగిందని విమర్శిస్తున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులే బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థపై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని పోలీస్ శాఖ సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. టీడీపీ పన్నిన కుట్రల్లో పోలీసులు బలవుతున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
మద్యం, డబ్బు పంపిణీపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: మద్యం, డబ్బు పంపిణీ ప్రసక్తే లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న ప్రభుత్వ ఆశయాన్ని సాధించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హులు అవుతారంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా వారం రోజులుగా తీసుకుంటున్న చర్యలను వినీత్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. - ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలు లేకుండా దాడులు ముమ్మరం చేశాం. ఏపీ పోలీస్ శాఖకు చెందిన 10 వేల మంది పోలీసులు, ఎక్సైజ్ శాఖకు చెందిన 4 వేల మంది సిబ్బంది ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన ‘ఆపరేషన్ సురా’లో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేశాం. - గత వారం రోజుల్లో 2,752 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాం. 5,005 లీటర్ల నాటుసారా, 2 లక్షల లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన ఊటను ధ్వంసం చేశాం. 3,072 కిలోల గంజాయి, 30,028 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం. 1,605 కేసులు నమోదు చేసి 1,562 మందిని అరెస్టు చేశాం. 145 వాహనాలు సీజ్ చేశాం. - ఎన్నికల కోసం తరలిస్తున్న నగదు రూ.1,84,84,800, బంగారం 2.551గ్రాములు(విలువ రూ.1,40,34,021), వెండి 50.558గ్రాములు(విలువ రూ.18,16,920), 87 చీరలు, 3 ల్యాప్‌టాప్‌లు, 140 సంచుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. - రాష్ట్రంలో 701 పోలీస్ మొబైల్ చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటితోపాటు 62 ప్రత్యేక మొబైల్ చెక్‌పోస్టులు, 18 బోర్డర్(రాష్ట్ర సరిహద్దు) చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. - మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాలపై టోల్ ఫ్రీ నంబర్ 14500, డయల్ 100, 112లతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో సమాచారం ఇవ్వొచ్చు. -
ఉరిమిన ఉత్తరాంధ్ర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ వద్దంటున్న ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఉత్తరాంధ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవరోధంగా మారుతున్నారంటూ మండిపడింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రానీయకుండా వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు అడ్డుకున్నారు. గురువారం వేల సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకున్న ప్రజలు చంద్రబాబు వాహనాన్ని ముందుకు కదలనీయకుండా నిలిపివేశారు. బాబు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో 8 గంటల పాటు హైడ్రామా నడిపిన చంద్రబాబు..అక్కడినుంచే హైదరాబాద్ విమానంలో వెనుదిరిగారు. మిన్నంటిన బాబు వ్యతిరేక నినాదాలు చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్న పోలీసులు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తొలిసారిగా గురువారం చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ నుంచి ఉదయం 11.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటన గురించి ముందే తెలుసుకున్న వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు తమ నిరసన తెలియజేయాలని తీర్మానించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే విమానాశ్రయ పరిసరాలకు నిరసనకారులు చేరుకున్నారు. 11.30 సమయంలో చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే.. విశాఖ కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ‘చంద్రబాబు గోబ్యాక్’ అనే నినాదాలు మారుమోగాయి. బాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ని పెద్దసంఖ్యలో మహిళలు సహా ఆందోళనకారులు చుట్టుముట్టారు. చంద్రబాబు బయటికి వచ్చి గంట సేపు గడిచినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీలతో నిరసనకారుల్ని చెదరగొట్టి నెమ్మదిగా కాన్వాయ్‌ని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం, వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వద్దన్నా కాన్వాయ్ దిగిన చంద్రబాబు ఈ దశలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి నడిచి వెళ్తానంటూ పోలీసులు వారిస్తున్నా వినకుండా వాహనం దిగిన చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. రెండడుగులు వెయ్యగానే దాదాపు అర కిలోమీటరు మేర నిలుచున్న ప్రజలంతా ఒక్కసారిగా కాన్వాయ్‌పైకి దూసుకొచ్చారు. ఆ సమయంలోనే కాన్వాయ్ వాహనంపై కొందరు చెప్పులు. కోడిగుడ్లు, టమోటాలు విసిరేశారు. చంద్రబాబుకు రక్షణ కవచంగా నిలిచిన పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు గాయపడ్డారు. వాహనంలోనే కూర్చోవాలనీ, నడిచివెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చంద్రబాబుని పోలీసులు హెచ్చరించారు. విశాఖకు జై కొడితేనే వెళ్లనిస్తామన్న ప్రజలు.. మరోవైపు ప్రజలు తమ నిరసన కొనసాగించారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు’, తదితర నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. విశాఖను కార్యానిర్వాహక రాజధానిగా వద్దన్న చంద్రబాబు.. విశాఖలో ఎలా పర్యటిస్తారంటూ నిలదీశారు. విశాఖకు జై కొడితేనే ముందుకు వెళ్లనిస్తామనీ ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. ప్రజాగ్రహం తీవ్రమవుతూ, పరిస్థితి చెయ్యి దాటిపోతున్న నేపథ్యంలో వెనక్కి వెళ్లిపోవాలంటూ చంద్రబాబుకు పోలీసులు సూచించారు. భారీ భద్రత నడుమ చంద్రబాబు తిరుగు ప్రయాణం పోలీసులపై చంద్రబాబు మండిపాటు తనను వెనక్కి వెళ్లాలన్న పోలీసులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కాన్వాయ్ దిగి రోడ్డుపై బైఠాయించి హడావిడి సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా చంద్రబాబుకి వ్యతిరేకంగా నినదించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాన్వాయ్‌లోకి ఎక్కాలని చంద్రబాబుకు చెప్పిన పోలీసులు.. పశ్చిమ జోన్ ఏసీపీ పేరుతో సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి.. భద్రతా కారణాల దృష్ట్యా ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కాన్వాయ్‌లోకి ఎక్కించి ఎయిర్‌పోర్టు ప్రవేశ ద్వారం గుండా వీఐపీ లాంజ్‌లోకి పంపించారు. అనంతరం రాత్రి 7.50 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కించారు. కాగా చంద్రబాబు ఎయిర్‌పోర్టులోకి వెళ్లే వరకూ ఉత్తరాంధ్ర ప్రజలు గో బ్యాక్ బాబూ.., బై బై బాబూ.. మళ్ళీ రాకు బాబు అనే నినాదాలు చేస్తూనే ఉన్నారు. మీ సంగతి తేలుస్తా.. పోలీసుల్ని దూషించిన చంద్రబాబు హై డ్రామా క్రమంలో చంద్రబాబు పోలీసులపై పలుమార్లు విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు కూడా ఇష్టం వచ్చినట్లు దూషించారు. తాను అనుమతి తీసుకొనే పర్యటనకు వచ్చాననీ, అయినా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ‘40 సంవత్సరాల అనుభవం ఉన్న నన్ను ఇబ్బంది పెడతారా.. మీ సంగతి తేలుస్తా.. నన్ను ముట్టుకునే అర్హత మీకు లేదు.. రేపు రానియ్యరు.. ఎల్లుండి వస్తా.. ఎల్లుండి రానియ్యరు.. నెక్స్ట్ వస్తా.. ఐయామ్ నాట్ గోయింగ్ టూ లీవ్ యూ.. ఎవ్వరినీ వదలను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బాబును వెనక్కిపంపాం: పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సురక్షితంగా హైదరాబాద్‌కు పంపామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చెప్పారు. నౌకాదళ పర్యవేక్షణలోని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబును వెనక్కి పంపాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు భద్రతే ప్రధానాంశంగా భావించామని, పార్టీలు, రాజకీయాలకతీతంగానే పోలీసులు వ్యవహరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా జరిగిన ఎయిర్పోర్ట్ ఎపిసోడ్లో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. నాపై చెప్పులు వేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా? ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపాటు రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న తనపై చెప్పులు, కోడి గుడ్లు, వాటర్‌బాటిల్స్‌తో దాడి చేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతోందని విమర్శించారు. గురువారం ఆయన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేస్తుంటే చూస్తూ ఉన్న వీరు పోలీసులేనా.. పోలీస్ డ్రెస్ వేసుకున్న వేరెవరైనా వచ్చారా.. అని మండిపడ్డారు. చట్టపరంగా అనుమతి ఉన్నా, పోలీసులు తనను అరెస్ట్ చేయడం పట్ల చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానన్నారు. ఏ చట్టాన్ని అనుసరించి పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. పోలీసులందరూ బాడీ కెమెరాలు పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా వీరు పాటించలేదన్నారు. పోలీసులు లిఖిత పూర్వకంగా రాసిస్తే.. వారు ఎక్కడికెళ్లమంటే అక్కడికి వెళతానన్నారు. పులివెందుల నుంచి రౌడీలను తెచ్చారు విశాఖ ప్రాంత ప్రజలు దాడులకు పాల్పడరని, ఇది చాలా ప్రశాంతమైన వాతావరణమని, ఇక్కడికి పులివెందుల నుంచి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేయించారని చంద్రబాబు ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పంచెలు కట్టుకుని కడప నుంచి రౌడీలు వస్తే వైఎస్ విజయలక్ష్మిని ఓడించారన్నారు. 40 ఏళ్లగా తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ చూడబోనన్నారు. ఓ ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాంటి వింతలు జరుగుతాయన్నారు. ఇంతమంది పోలీసులు ఏం చేశారు? జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న తన చుట్టూ 2 వేలకు పైగా పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రే వహించారు తప్ప వారు చేసిందేమీ లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆత్మకూర్‌లో కూడా ఇదే విధంగా తనను అడ్డుకున్నారని, అప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నారు. -
ఏపీ.. ట్రెండ్ సెట్టర్!
సాక్షి, అమరావతి: అనుసరించడం కాదు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాలను తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందని నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం తీసుకున్న అనేక సంచలన, సాహసోపేత నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతోపాటు వాటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధానంగా.. పాలనా వికేంద్రీకరణ, దిశ బిల్లు, పోలీస్ వీక్లీ ఆఫ్, స్పందన వంటి నిర్ణయాలను అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. దశ‘దిశ’లా.. మహిళలు, బాలికల రక్షణకు దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన దిశ బిల్లు తరహాలో చట్టం తెచ్చేందుకు పలు రాష్ట్రాలు సీరియస్‌గా పరిశీలిస్తున్నాయి. ఏపీ తరహాలో దిశ బిల్లు తెస్తామంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం కూడా అమరావతికి వచ్చి ఏపీ కీలక అధికారులు, మంత్రులతో దిశ బిల్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిశ బిల్లు అద్భుత నిర్ణయమని ప్రశంసించారు కూడా. పాలనా వికేంద్రీకరణపై.. మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపి పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటక కూడా తాజాగా ఇదే బాట పట్టడం గమనార్హం. ఇందులో భాగంగా అక్కడి యడియూరప్ప ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఆమోదించింది కూడా. అక్కడ బెంగళూరుతోపాటు బెళగాలిలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఉత్తర కర్ణాటకకు తరలించాలని ఆ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప నడుస్తున్నారంటూ విద్యావంతులు, మేధావులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని కూడా అనుసరిస్తూ కర్ణాటక సర్కారు కొద్ది రోజుల క్రితం తీర్మానం చేయడం విశేషం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఓ సంచలనం.. ఇక 24 గంటలు కష్టపడే పోలీసులకు వారంలో ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలనే ప్రతిపాదనను అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరో నిర్ణయాన్ని కూడా అనుసరించేందుకు పలు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగాదీనికి సంబంధించి వివరాలు కోరిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నివేదించారు. అపూర్వ ‘స్పందన’.. ప్రజల కష్టాలు తీర్చే ‘స్పందన’ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్పందన అమలుచేస్తున్న తీరుతెన్నులపై కూడా అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. కాగా.. ఇటీవల గుజరాత్‌లోని వదోదరాలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్లో ఏపీ పోలీస్ స్టాల్లో ‘స్పందన’ అమలుతీరును అడిగి తెలుసుకుని ప్రశంసించారు. అంతేకాక.. దీనిపై పూర్తిస్థాయి నివేదికను ప్రధాని కోరడం గమనార్హం.